![Kollywood Star Hero Suriya Hit Movie Re Release On February 14th](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/surya.jpg.webp?itok=RcTQ9d00)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ద్విపాత్రాభినయంలో వచ్చిన చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సిమ్రాన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళంలో వారనమ్ అయిరమ్ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేసి రిలీజ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటనతో మెప్పించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హరీస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది. పివీఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఈనెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు వర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాం. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం " అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment