'చీకటి కోన పులులన్నీ ఏకమై ఉరిమితే'.. కంగువా రిలీజ్‌ ట్రైలర్ చూశారా? | Kollywood Star Suriya Kanguva Release Trailer Out Now | Sakshi
Sakshi News home page

Kanguva Release Trailer: సూర్య 'కంగువా'.. రిలీజ్ ట్రైలర్‌ వచ్చేసింది!

Published Sun, Nov 10 2024 9:02 PM | Last Updated on Sun, Nov 10 2024 9:20 PM

Kollywood Star Suriya Kanguva Release Trailer Out Now

కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం 'కంగువా'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు మేకర్స్.

తాజాగా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుబాయ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈవెంట్‌లో సూర్యతో పాటు బాబీ డియోల్ సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌తో కంగువాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. ఈ మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. 

(ఇది చదవండి: సూర్య 'కంగువా' రిలీజ్‌.. మేకర్స్‌ బిగ్‌ ప్లాన్‌!)

కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement