సూర్య 'కంగువా' రిలీజ్‌.. మేకర్స్‌ బిగ్‌ ప్లాన్‌! | Kollywood Star Hero Suriya's Kanguva massive release on over 10000 screens | Sakshi
Sakshi News home page

Suriya Kanguva: సూర్య 'కంగువా' రిలీజ్‌.. మేకర్స్‌ బిగ్‌ ప్లాన్‌!

Published Tue, Nov 5 2024 4:35 PM | Last Updated on Tue, Nov 5 2024 5:00 PM

Kollywood Star Hero Suriya's Kanguva massive release on over 10000 screens

కోలీవుడ్ స్టార్ హీరో నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం కంగువా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. గ్రాండ్‌ రిలీజ్‌కు రెడీ అవుతోన్న కంగువా చిత్రంపై నిర్మాత ధనంజయన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కంగువా మూవీని భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ ప్రకటనతో సూర్య ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ధనంజయన్ మాట్లాడుతూ..' కంగువా విడుదల కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. తమిళనాడులో ఇప్పటికే 700లకు పైగా స్క్రీన్‌లు సిద్ధం చేశాం. ఒక్క సౌత్‌లోనే 2,500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు ప్లాన్ చేశాం. ఉత్తర భారతదేశంలో దాదాపు 3,000 నుంచి 3,500 వరకు థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఈ విషయం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న పదివేల కంటే ఎక్కువ స్క్రీన్‌లలో విడుదల కానుంది' అని అన్నారు.

కాగా.. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement