surya sonof Krishnan
-
'రామ్ చరణ్' రిజక్ట్ చేసిన 5 సినిమాలు ఏంటో మీకు తెలుసా..?
ప్రతి హీరో దగ్గర తమ కెరీర్లో తిరస్కరించిన ప్రాజెక్ట్‌ల జాబితా ఉంటుంది. అదే క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లిస్ట్‌లో కూడా కొన్ని రిజక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'చిరంజీవి కుమారుడి'గా అరంగేట్రం చేయడం నుంచి మెగా పవర్‌స్టార్‌గా భారీ అభిమానులను సంపాదించుకోవడం.. ఆపై ఇప్పుడు RRR తో గ్లోబల్ స్టార్‌గా తనను తాను స్థాపించుకోవడం వరకు, రామ్ చరణ్ నిజంగా తన సినిమా ప్రయాణంలో చాలా దూరం చేరుకున్నారు. అయితే రామ్ చరణ్ తన సినీ కెరీర్లో తిరస్కరించిన ఐదు సినిమాల గురించి తెలుసుకుందాం. గౌతమ్ తిన్ననూరి సినిమాను రిజక్ట్ చేసిన చరణ్ RRR సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయవలసి ఉంది. ఆర్ఆర్ఆర్ వంటి విజయం తర్వాత మాస్ అప్పీల్ ఉన్న కథ కోసం చరణ్ కోరుకున్నారట. దీంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌కు ఓకే చేయలేదని వార్తలు వచ్చాయి. తరువాత అదే కథను విజయ్ దేవరకొండకు ఆయన వివరించాడట. అది ఇప్పుడు VD12గా రూపొందనుందని నివేదికలు చెబుతున్నాయి. రామ్ చరణ్‌కి వివరించిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్ కోలీవుడ్‌లో 'వారణం ఆయిరం' చిత్రంలో సూర్య నటించారు. తెలుగులో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' పేరుతో 2008లో విడుదలైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తమిళ్ వర్షన్ కంటే టాలీవుడ్లోనే ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా విడుదలై దాదాపు 16 సంవత్సరాలు అయింది. రీసెంట్గా తెలుగులో రీ-రిలీజ్ చేసినా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ సినిమాను చూస్తున్నంత సేపు సూర్య తప్ప మరే ఇతర నటుడు గుర్తుకు రారని చెప్పవచ్చు. ఈ సినిమా ఆఫర్ మొదట చరణ్‌కు వచ్చింది. ఆ సమయంలో SS రాజమౌళితో మగధీర షూటింగ్ షెడ్యూల్ బిజీలో చరణ్ ఉన్నారు. అప్పటికే ఎక్కువ డేట్లు మగధీరకు కేటాయించడంతో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' సినిమాకు చరణ్ నో చెప్పారట. ఓకే బంగారం మలయాళం సినిమా ఓకే కన్మణి గుర్తుందా..? 2014లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. హిందీలో 'ఓకే జాను'గా రీమేక్ అయింది. టాలీవుడ్లో 'ఓకే బంగారం' పేరుతో విడుదలైంది. ఈ కథలో హీరో పాత్రకు రామ్ చరణ్ కరెక్ట్‌గా సెట్ అవుతాడని దర్శకుడు మణిరత్నం భావించారట. మొదట ఈ కథను చరణ్‌కే ఆయన చెప్పారట. ఆ సమయంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన నో చెప్పడంతో అది కాస్త దుల్కర్ సల్మాన్ బోర్డులోకి వచ్చి చేరిందట. ఇందులో నిత్యా మీనన్‌తో ఆయన జతకట్టిన విషయం తెలిసిందే. అఖిల్ 'ఏజెంట్' రామ్ చరణ్ ఇటీవల తిరస్కరించిన చిత్రాలలో ఒకటి ఏజెంట్. అఖిల్‌కు ఈ సినిమా భారీ డిజాస్టర్‌ను మిగిల్చింది. ఈ చిత్రం మొదట రామ్ చరణ్ వద్దకు చేరిందట. ఏజెంట్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అప్పటికే చరణ్‌తో ధృవ సినిమా తీసి ఉన్నాడు. దీంతో రెండో సినిమా ప్లాన్ చేయాలని ఈ కథతో చరణ్‌ను సురేందర్ రెడ్డి కలిశారట. కానీ పలు కారణాల వల్ల చరణ్ నో చెప్పారట. దీంతో ఫైనల్‌గా అఖిల్ వద్దకు ఆ ప్రాజెక్ట్ వెళ్లడం.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ డిజాస్టర్‌గా మిగిలిన విషయం తెలిసిందే. ఎటో వెళ్లిపోయింది మనసు 2008లో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' తిరష్కరించిన చరణ్‌తో ఎలాగైన ఒక సినిమా తీయాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనుకున్నారట. సుమారు నాలుగేళ్లు నిరీక్షించి 2012లో చరణ్‌ను ఆయన కలిశారట. ఆ సమయంలో 'ఏటో వెళ్లిపోయింది మనసు' కథను వినిపించారట.. రొమాంటిక్ కామెడీగా ఉన్న కథ కావడంతో చరణ్ నో చెప్పారట. అప్పటికే ఇలాంటి కాన్సెప్ట్‌తో 'ఆరెంజ్'ను తీసిన చరణ్ ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. ఆ తర్వాత అది కాస్త నాని వద్దకు ఆ ప్రాజెక్ట్ చేరిపోయింది. ఇందులో సమంత హీరోయిన్గా కనిపించింది. ఈ చిత్రం విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నప్పటికీ, అది వాణిజ్య పరంగా రాణించలేదు. -
వాలైంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్
ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్ హిట్‌గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. 1998లో బ్లాక్‌బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్‌కు ఈ చిత్రం స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్లలోకి రానుంది. అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. -
తగ్గాల్సిందే.. తప్పదు!
బరువు పెరగడం చాలా ఈజీ. తగ్గడం మాత్రం చాలా చాలా కష్టం. ఒకటీ రెండు కిలోలు తగ్గాలంటేనే నానా తంటాలూ పడాలి. ఇక.. పది కిలోలు తగ్గాలంటే పెద్ద విషయమే. ఇప్పుడు సూర్య ఈ పని మీదే ఉన్నారు. కొన్నేళ్ళ క్రితం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో టీనేజ్ బాయ్ క్యారెక్టర్ కోసం ఈ మాస్ హీరో బరువు తగ్గారు. ఆ తర్వాత మళ్లీ మామూలు బరువుకి చేరుకున్నారు. ప్రస్తుతం ‘తానా సేంద కూట్టమ్’ అనే తమిళ సినిమా కోసం సూర్య బరువు తగ్గక తప్పడం లేదు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సూర్య తన వయసు కన్నా పదేళ్లు తగ్గి కనిపించాలట. అంటే.. 30 ఏళ్ల యువకుడిలా కనిపించాల్సి ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉంది. ఈలోపు పది కిలోలు తగ్గడానికి ఏమేం చేయాలో సూర్య అన్నీ చేస్తున్నారు. కేవలం బరువు తగ్గి, కుర్రాడిలా కనిపించడం మాత్రమే కాదు. ఓ కొత్త రకం హెయిర్ స్టైల్లో కూడా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు.