శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీనటి మీనాక్షి చౌదరి, గోల్డ్‌మ్యాన్ కొండ విజయ్ శుక్రవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించిన మీనాక్షిచౌదరి శ్రీశైలం చేరుకుని మల్లన్నకు రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం రోప్‌వేలో పాతాళగంగకు చేరుకుని బోటింగ్‌లో షికారు చేశారు.
హీరోయిన్ మీనాక్షిచౌదరిని చూసిన పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌మ్యాన్ కొండ విజయ్ శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. సుమారు 5 కేజీల బంగారు అభరణాలు ధరించి కొండ విజయ్ స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చారు. గోల్డ్‌మ్యాన్‌ను చూసేందుకు పలువురు భక్తులు పోటీపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment