ఇడ్లీ కొట్టు మూవీ వాయిదా.. ఏకంగా ఆరు నెలలు తర్వాత! | Dhanush announces Idly Kadai release date with a special poster | Sakshi

Idly Kadai: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ధనుశ్.. ఆరు నెలల ముందుకు ఇడ్లీ కడై!

Apr 4 2025 3:20 PM | Updated on Apr 4 2025 4:26 PM

Dhanush announces Idly Kadai release date with a special poster

కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్‌ ప్రస్తుతం ఇడ్లీ కడై(తెలుగులో ఇడ్లీ కొట్టు) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది రాయన్‌ సినిమాతో సూపర్ హిట్‌ కొట్టిన స్టార్ కొత్త ఏడాదిలో స్వీయ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'తిరుచిత్రంబలం' ఈ జంట మరోసారి అభిమానులను మెప్పించనుంది. ఈ చిత్రాన్ని డాన్‌ పిక్చర్స్, వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై ధనుశ్, ఆకాశ్‌ భాస్కరన్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ముందుగా ప్రకటించినట్లుగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.  ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇడ్లీ కడై సినిమాను అక్టోబర్‌ 1వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  అయితే ఈ మూవీ వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

అయితే ఈ ఏప్రిల్ 10వ తేదీన అజిత్‌ కుమార్ హీరోగా నటించిన గుడ్‌ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అందువల్లే ఇడ్లీ కడై సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా ఆరు నెలల వరకు రిలీజ్‌ వాయిదా వేయడమే అభిమానులను షాకింగ్‌కు గురి చేస్తోంది.

కాగా.. ఇడ్లీ కడై మూవీని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్‌ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతమందిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement