postpone
-
ఆస్కార్ నామినేషన్స్ మరోసారి వాయిదా.. అదే కారణం!
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రకృతి ప్రకోపానికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనతో ఆస్కార్ నామినేషన్స్ ప్రక్రియ వాయిదా పడింది.ప్రతి ఏడాది నామినేషన్స్ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు జరుగుతుంది. కార్చిచ్చు వల్ల జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్స్‌ను వాయిదా వేశారు. ఈనెల 23న పూర్తి నామినేషన్స్ చిత్రాల జాబితా వెల్లడిస్తామని ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. మంటల వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ తెలిపారు.భారత్ నుంచి ఆరు చిత్రాలుకాగా.. ఈ ఏడాది భారత్ నుంచి ఆరు చిత్రాలు నామినేషన్ల బరిలో చోటు దక్కించుకున్నాయి. సూర్య హీరో నటించిన కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (మలయాళం), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), సంతోష్ (హిందీ), గర్ల్స్ విల్ బి గర్ల్స్( హిందీ, ఇంగ్లిష్) నామినేషన్స్ ప్రక్రియలో నిలిచాయి.బాక్సాఫీస్ వద్ద ఫెయిల్..సూర్య హీరోగా నటించిన కంగువాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీ 2025 ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది. సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.పాయల్ కపాడియా మూవీకి చోటు..పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్‌లోనూ పోటీలో నిలిచింది. త్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్..గతేడాది వచ్చిన హిట్ చిత్రాల్లో మలయాళ మూవీ ది గోట్ లైఫ్ కూడా ఒకటి. ఈమూవీ తెలుగులో ఆడుజీవితం పేరిట విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ డబ్బు సంపాదించేందుకు సౌదీ అరేబియాకు వలస వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. వీటన్నింటినీ బెన్యమిన్ అనే రచయిత గోట్ లైఫ్ అనే నవలలో రాసుకొచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆడు జీవితం మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో పోటీ పడుతోంది. -
ది రాజాసాబ్ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్ వైరలైంది.డే అండ్ నైట్ జరుగుతోంది..తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ షెడ్యూల్స్ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.గాయం కావడం వల్లే రూమర్స్..'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. #TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swingWe’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh— People Media Factory (@peoplemediafcy) December 18, 2024 -
రాబిన్ హుడ్ పై పుష్పరాజ్ ఎఫెక్ట్?
-
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో చూడాలని పేర్కొంది. అక్షరాస్యత కమిటీ ఏర్పాటుసాక్షి, అమరావతి: వయోజన విద్యకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర అక్షరాస్యత కేంద్రానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్‌గాను, ఏపీ లిటరసీ మిషన్ అథారిటీ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, స్కిల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, ఐటీ సెల్ డైరెక్టర్‌తో పాటు ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉంటారు.ట్రిపుల్ ఐటీలో 14న జాతీయ సదస్సునూజివీడు: జాతీయ మెటలర్జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఏలూరు జిల్లా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మంగళవారం తెలిపారు. జాతీయ సదస్సు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. లోహ పదార్థాలు, వాటి ప్రాసెసింగ్‌లపై పరిశోధన చేసి, దేశానికి వెన్నుదన్నుగా నిలిచే శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ మెటలర్జీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
రైతు భరోసా మళ్లీ హుళక్కేనా?
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసిన ప్రభుత్వం, ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. వానాకాలం సీజన్లో అదిగో ఇస్తాం, ఇదిగో చేస్తాం అంటూ ప్రభుత్వం కాలయాపన చేసిందని, యాసంగిలోనూ అలాగే చేసే అవకాశం ఉందని కొందరు వ్యవసాయ శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.సీజన్ మొదలై నెల రోజులు దాటిందని, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదని, పైగా ఈసారి కూడా భరోసా సాయం ఉండక పోవచ్చనే సంకేతాలు తమకు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీనే పూర్తి చేయలేదని, ఇంకా చాలామందికి మాఫీ నిధులు జమ చేయాల్సి ఉన్నందున, అప్పటివరకు రైతు భరోసా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. రుణమాఫీ అందక.. భరోసా రాక సీజన్‌కు ముందే రైతుకు సహాయం చేయాలనేది రైతు భరోసా (గతంలో రైతుబంధు) పథకం ఉద్దేశం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు వంటి వాటి కోసం పెట్టుబడిని అందించాలన్నది లక్ష్యం. 2018 నుంచి ప్రతి ఏడాదీ రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం గత వానాకాలంలో సీజన్లో మాత్రం ఆగిపోయింది. రైతుబంధు పథకంలో మార్పులు చేర్పులు చేసి కొత్త మార్గదర్శకాలతో రైతుభరోసా తీసుకురావాలని కొత్త ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఈ ఏడాది జులై 2వ తేదీన రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది.జిల్లాల్లో అభిప్రాయ సేకరణ చేసింది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతుభరోసాపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. జూలైలో సమావేశాలు జరిగినా రైతుభరోసా ఊసెత్తలేదు. ఇప్పటివరకు కూడా ఏమీ తేల్చలేదు. ఒకవైపు రుణమాఫీ అందరికీ సరిగ్గా జరగక, మరోవైపు భరోసా సాయం కూడా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చాక రూ.5 వేలే అందజేత గతేడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ. 72,815 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సీజన్‌కు ఎకరానికి రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచి్చంది. రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలు అందజేసింది. వానాకాలం సీజన్ నుంచి రూ.7,500 ఇస్తామని పేర్కొంది. రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తితో సందిగ్ధత ఈ క్రమంలోనే రైతులకు ఇచ్చిన హామీ మేర కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రూ.31 వేల కోట్లు ఇస్తామని చెప్పి చివరకు రూ.18 వేల కోట్లలోపే ఇచ్చారు. నిబంధనలు, కొర్రీలతో వేలాది మంది రైతులకు ఇవ్వకపోవడం, చాలామంది అర్హులైన రైతులకు కూడా అందకపోవడంతో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా పథకాన్ని తొలుత అనుకున్నట్టుగా అనేక మార్పులతో అమలు చేస్తే రైతుల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందోనన్న సందిగ్ధతలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలోనే రైతు భరోసాపై సాగతీత ధోరణిలో వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆర్నెల్లు ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి అప్పీళ్లలో ఎలాంటి మెరిట్స్ లేవని వ్యాఖ్యానించింది. అప్పిలెంట్ల (పిటిషన్ వేసిన అభ్యర్థులు) తీరును తప్పుబట్టింది. ‘ఫిబ్రవరిలో రీ నోటిఫికేషన్ ఇస్తే ఆగస్టులో సవాల్ చేస్తారా? ప్రిలిమ్స్ కూడా రాసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా?’ అని ప్రశ్నించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,383 మందిలో 90 శాతం పరీక్షల హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లలేం. అధికారులు కూడా సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో రెండురోజుల్లో పరీక్ష అనగా ఇప్పుడు వాయిదా వేయడం సరికాదు. సింగిల్ జడ్జి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారు. ఈ అప్పీళ్లను కొట్టివేస్తున్నాం..’ అని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు గ్రూప్–1 ప్రిలిమినరీ ‘కీ’లో తప్పులను, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును, రీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దామోదర్‌రెడ్డితో పాటు మరో ఏడుగురు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. టీఎస్పీఎస్సీ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. సాంకేతిక అంశాలను నిపుణుల కమిటీలకే వదిలేయాలని కోర్టుల జోక్యం కూడదని తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. రీ నోటిఫికేషన్‌తో అర్హులు పెరిగారు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శివ, సుధీర్ వాదనలు వినిపిస్తూ.. ‘రీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కమిషన్‌కు అధికారం లేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి 2024లో మళ్లీ ఇవ్వడంతో రెండేళ్లలో అర్హులు పెరిగారు. దరఖాస్తుల గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం అని చెప్పిన కమిషన్ రెండురోజులు పెంచింది. దీంతో దాదాపు 20 వేల దరఖాస్తులు పెరిగాయి. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారు. తొలి నోటిఫికేషన్ నాటికి ఈ రిజర్వేషన్లు 6 శాతమే. ఇది ఎస్టీలకు లబ్ధి చేకూర్చినా.. మిగతావారు పోస్టులు కోల్పోయే అవకాశం ఉంది. అప్పిలెంట్లు ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ లోని 15 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపారు. అయినా వాటిని నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 6 ప్రశ్నలు (41, 66, 79, 112, 114, 119) పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మెయిన్స్ వాయిదా వేయాలి. స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ‘కీ’ రూపొందించాలి..’ అని కోరారు. ఇలానే ప్రశ్నలు అడగాలని టీఎస్పీఎస్సీని కోరలేరు.. టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘పిటిషనర్లు 8 మందిలో ఇద్దరు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే ‘కీ’పై ఒక్కరు మాత్రమే అభ్యంతరం తెలిపారు. అతను కూడా సరైన సమాధానమే ఇచ్చారు. ప్రశ్నలు ఎలా అడగాలి అనేది నియామక సంస్థ పరిధిలోని అంశం. రాజ్యాంగ బద్ధమైన సంస్థను ఇలానే ప్రశ్నలు అడగాలని ఎవరూ కోరలేరు. ‘కీ’ ఇలానే ఉండాలని కూడా నిర్ణయించలేరు. 6,175 అభ్యంతరాలను స్వీకరించాం. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే 2 ప్రశ్నలు తొలగించాం. మెయిన్స్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 90 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో దరఖాస్తులకు 2 రోజులు సమయం ఇచ్చాం. అప్పీళ్లలో మెరిట్ లేదు కొట్టివేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఏ ప్రశ్న సరైందో న్యాయస్థానాలు తేల్చలేవు ‘8 మంది అప్పిలెంట్లలో ఇద్దరు మాత్రమే ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 15 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపగా, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించింది. ఇలా 6,147 అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది ‘కీ’ విడుదల చేసింది. ఏ ప్రశ్న సరైంది.. ఏది కాదో.. న్యాయస్థానాలు తేల్చలేవు. నిపుణుల కమిటీనే నిర్ణయం తీసుకోవాలి. నోటిఫికేషన్లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చెప్పింది. అక్టోబర్‌లో మెయిన్స్ అని తెలిసినా పిటిషనర్లు ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారు. రెండేళ్లలో రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దయ్యింది. ఇటీవల జరిగింది మూడోది. ఇప్పుడు మెయిన్స్ కూడా వాయిదా వేస్తే అభ్యర్థుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటుంది. గ్రూప్–1 ఒక ప్రహసనంలా మారుతుంది..’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. నిరుద్యోగుల్లో నైరాశ్యం ఏర్పడుతోంది మానవ తప్పిదం కారణంగా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. తొలిసారి గ్రూప్–1 ప్రిలిమ్స్ 5 లక్షల మంది రాశారు. రెండుసార్లు రద్దు తర్వాత 3 లక్షలే రాశారు. అభ్యర్థుల్లో నిరాసక్తత పెరిగిపోతోంది. నిరుద్యోగుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడుతోంది. కొందరు అత్యాహత్యాయత్నాలకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లక్షల మంది మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఆరుగురి కోసం వేలాది మందిని అసహనానికి గురి చేయడం సరికాదు. మెయిన్స్ వాయిదా వేయడం సాధ్యం కాదు. 2011లో మాదిరిగా ఆదేశాలిస్తే.. ఇక టీఎస్పీఎస్సీ ఈ గ్రూప్–1 పరీక్ష ఎప్పటికి పూర్తి చేస్తుందో తెలియదు. రీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తున్నప్పుడు ప్రిలిమ్స్ ఎలా రాశారు? పోస్టులను పెంచే, తగ్గించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. రీ నోటిఫికేషన్‌తో వచ్చిన నష్టం ఏంటి? రద్దు చేసి అదేరోజు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు కదా? – జస్టిస్ షావిలి -
దసరా రేసు నుంచి తప్పుకున్న భారీ బడ్జెట్ చిత్రం.. ప్రకటించిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ దసరాకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఊహించని విధంగా రేసులోకి వచ్చేశాడు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం వేట్టైయాన్ కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీంతో ఇద్దరు స్టార్ హీరోల మధ్య క్లాష్ ఏర్పడింది. ఒకే రోజు రెండు పెద్ద హీరోల సినిమాలే రావడంతో కంగువా నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. దీంతో ఈ మూవీ వాయిదా పడుతుందని వార్తలొచ్చాయి.అందరూ అనుకున్నట్లుగానే కంగువాను వాయిదా వేస్తున్నట్లు హీరో సూర్య ప్రకటించారు. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తన సోదరుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' మూవీ ఆడియో లాంచ్‌లో క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అభిమానులు తనకు అండగా నిలవాలని సూర్య అభ్యర్థించారు. రజనీకాంత్ తన కంటే సీనియర్ అని.. అందుకే వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. 'తమిళ చిత్రసీమలో ఓ ప్రత్యేక చిత్రాన్ని అందించడం కోసమే రెండున్నరేళ్లకు పైగా కష్టపడ్డాం. దాదాపు 1000 మందికి పైగా కంగువా కోసం రాత్రింబవళ్లు పనిచేశారు. రెండున్నరేళ్ల పాటు నటీనటులు, సిబ్బంది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. ఈ సినిమా కోసం మేము పడిన కష్టం వృథా కాదనేది నా గట్టి నమ్మకం. అక్టోబర్ 10న రజినీకాంత్ వెట్టైయాన్ కూడా వస్తోంది. ఆయన సినిమాకు మనం దారి ఇవ్వాలి. రజినీకాంత్ నాకంటే సీనియర్. 50 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు. ముందుగా సూపర్‌స్టార్ సినిమా వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయంలో మీరంతా నాతో ఉంటారని నమ్ముతున్నా. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
గేమ్ ఛేంజర్ వాయిదా.. దిల్ రాజు ఏమన్నారంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.అయితే గత కొద్ది రోజులుగా గేమ్ ఛేంజర్ వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు పలు వేదికలపై మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ ఛేంజర్ వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాజాగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ఈవెంట్‌కు హాజరైన దిల్‌రాజు మరోసారి రిలీజ్ డేట్‌పై స్పందించారు. ఈ సినిమాను వాయిదా వేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది క్రిస్మస్కే సినిమా విడుదలవుతుందని వెల్లడించారు.దిల్ రాజు మాట్లాడుతూ..' ఇప్పటికే గేమ్ ఛేంజర్ షూట్ కంప్లీట్ చేశాం. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమా శంకర్ సర్, రామ్‌చరణ్ ఇమేజ్ను మార్చేస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇది రాజకీయాలు, సామాజిక కథాంశంగా తెరకెక్కించాం. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. శంకర్ ఇంతకుముందు ఇలాంటి సినిమా చేశారు. కానీ రోబో తర్వాత తన కథా శైలిని మార్చారు. చాలా కాలం తర్వాత గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటాయి. సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.అయితే ఈ ఏడాది క్రిస్మస్కు అమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' కూడా విడుదల కానుంది. అంతేకాకుండా డిసెంబర్ 20న హాలీవుడ్ చిత్రం 'ముఫాసా: ది లయన్ కింగ్', వరుణ్ ధావన్ మూవీ 'బేబీ జాన్' వరుసలో ఉన్నాయి. -
దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అనుకున్నట్లుగానే జరుగుతుందన్న తరుణంలో కంగువా వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.అయితే అదే రోజు రజినీకాంత్ మూవీ వెట్టైయాన్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కంగువా మూవీ వాయిదా పడుతోందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇది కాస్తా సూర్య, తలైవా ఫ్యాన్స్ మధ్య వార్‌గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.కంగువా వాయిదా.. ట్విటర్లో ట్రెండింగ్?సూర్య నటిస్తోన్న కంగువా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 10 రజినీకాంత్‌తో పోటీపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 31కి వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కంగువా రిలీజ్ డేట్ ముందుగానే ప్రకటించినప్పటికీ పోటీలో రజినీకాంత్ రావడంతో వాయిదా పడినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'షేమ్ ఆన్ యూ స్టూడియోగ్రీన్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. కంగువా మేకర్స్ క్లారిటీ ఇస్తేనే ఫ్యాన్స్ మధ్య వార్‌కు చెక్ పడుతుంది. -
దుల్కర్ సల్మాన్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
సీతారామం మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.తాజాగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభిమానులకు మంచి క్వాలిటీతో సినిమాను అందించాలనే ఉద్దేశంతో పోస్ట్‌పోన్ చేస్తున్నామని వెల్లడించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్‌ను పంచుకున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ సందడి చేయనున్నట్లు పోస్ట్ చేశారు. కాగా.. 1980-90 కాలంలో ఓ బ్యాంక్ క్యాషియర్ అసాధారణస్థాయికి ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.అయితే అక్టోబర్ 31న మరో యంగ్ హీరో సినిమా రిలీజ్ కానుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న మెకానిక్ రాకీ అదే రోజు విడుదలవుతోంది. ఈ చిత్రంలోనూ హీరోయిన్ మీనాక్షి చౌదరి కావడం మరో విశేషం. దీంతో ఓకే రోజు రెండు సినిమాలతో అభిమానులను అలరించేందుకు గుంటూరు కారం భామ సిద్ధమైంది. Postponing releases can impact social media reputation, but it's essential for our film's quality! 😔#LuckyBaskhar is set to make your Diwali special in theaters worldwide. 🏦🎇Grand release on Oct 31st, 2024. #LuckyBaskharOnOct31st 💵@dulQuer #VenkyAtluri @Meenakshiioffl… pic.twitter.com/cJCbFdeFr2— Sithara Entertainments (@SitharaEnts) August 20, 2024 -
అనుకున్నదే జరిగింది.. పుష్ప-2 రిలీజ్ డేట్ ఇదే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం 'పుష్ప-2: ది రూల్'. ఈ సినిమాను సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్ పుష్ప-2 పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. తాజాగా కొత్త విడుదల తేదీని రివీల్ చేశారు.ఈ ఏడాది డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఇప్పటికే మూవీ వాయిదా పడుతుందంటూ చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని ప్రకటించాక రూమర్స్ మొదలయ్యాయి. అయితే కొంత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పెండింగ్ ఉన్నందున రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. We intend to give you the best 🔥The wait increases for a memorable experience on the big screens.#Pushpa2TheRule Grand release worldwide on 6th DECEMBER 2024 💥💥His rule will be phenomenal. His rule will be unprecedented ❤️🔥Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/3JYxXd2YgF— Pushpa (@PushpaMovie) June 17, 2024 -
బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. పుష్ప-2 మూవీ వాయిదా..?
ఐకాన్ స్టార్, సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ పుష్ప-2: ది రూల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ.. మరోసారి దాక్షాయణిగా మెప్పించనున్నారు. తాజాగా అనసూయ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.పుష్ప-2 వాయిదా?అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు డైరెక్టర్ సుకుమార్. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో పుష్ప-2 సందడి చేయనుందని వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందనే లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. పుష్ప-2 మూవీ ఎడిటర్ ఆంటోనీ రూబెన్ డేట్స్ విషయంలో సమస్యలు రావడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎడిటింగ్ పూర్తి చేయడానికి నవీన్ నూలిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.అదే రోజు రిలీజ్మరోవైపు అల్లు అర్జున్ ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడని చిత్రయూనిట్ పేర్కొంది. జూన్ నాటికి మిగిలిన షూటింగ్ పూర్తి అవుతుందని.. సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని అంటున్నారు. కాగా.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన తప్పకుండా రిలీజ్ చేస్తామని సుకుమార్ చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వారం ఆలస్యంగా...
సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదలను వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. వారం ఆలస్యంగా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కృష్ణమూర్తి. -
మున్సిపల్ సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుధ్య కార్మికుల సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసుకొనేందుకు అంగీకారం తెలిపాయి. మంగళవారం మంత్రుల బృందంతో చర్చల అనంతరం సీఐటీయూ మినహా మిగతా కార్మిక సంఘాలు బుధవారం నుంచి చేపట్టనున్న సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన కేటగిరీల వారీగా బేసిక్ పే నిర్ణయం, పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధికరించడం తదితర అంశాలపై చర్చించారు. అవుట్ సోర్సింగ్‌పై పనిచేసే పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరానికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఘన వ్యర్థాల తరలింపునకు కాంట్రాక్టు విధానంలో తీసుకున్న వాహనాల పనితీరును మెరగుపరచాలని, పారిశుద్ద్య కార్మికులు, ఇంజినీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు పనుల ఆధారంగా వారికి బేసిక్ పే పైనా సమావేశంలో చర్చించారు. కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రులు చెప్పారు. సంక్రాంతి ముందు లేదా తర్వాత ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు సమ్మెను వాయిదా వేయాలని మంత్రులు కోరారు. ప్రస్తుతం సీఐటీయూ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. మిగిలిన సంఘాలు బుధవారం నుంచి సమ్మెకు దిగాలని మొదట నిర్ణయించాయి. మంత్రుల విజ్ఞప్తి మేరకు సీఐటీయూ మినహా మిగిలిన సంఘాల నేతలు సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు. ఈ చర్చల్లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండీ వాసుదేవరావు తదితర అధికారులు, రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నేతలు ఆనందరావు, రమణ (వైఎస్సార్టీయూసీ), రంగనాయకులు, పి.సుబ్బారాయుడు (ఏఐటీయూసీ), అబ్రహం లింకన్ (ఐఎఫ్టీయూ), జి.ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు, శ్యామ్ (టీఎన్టీయూసీ), మధుబాబు, ఆంజనేయులు (ఏపీ ఎంఈడబ్లు్యయూ), వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ) పాల్గొన్నారు. చాలా సమస్యలు పరిష్కరించాం: మంత్రి సురేష్ అనంతరం మంత్రి సురేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లలో చాలా పరిష్కరించామని, మిగతా వాటిపైనా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు, పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు నెలకు రూ.6 వేలు చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మరికొన్ని డిమాండ్లపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్ల కేటగిరీల్లో కొన్ని తప్పులు జరిగాయని, వాటినీ పరిష్కరిస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లింపుపైనా సానుకూలనిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్‌ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
తగ్గేదేలే అంటూ విశ్వక్ సేన్ పోస్ట్.. మూవీ రిలీజ్ వాయిదా!
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. గతంలో విశ్వక్ సేన్ కూడా సినిమా రిలీజ్ తేదీ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ పోస్ట్ కూడా పెట్టారు. అది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే విశ్వక్ సేన్ అనుకున్నదొకటి.. అయిందొక్కటి అన్న చందంగా మారింది. వచ్చే నెల 8న ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిన 8న విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. దీంతో వచ్చే నెల మూవీ రిలీజవుతుందని భావించిన విశ్వక్ సేన్ అభిమానులకు నిరాశే ఎదురైంది. అదే కారణమా? అయితే డిసెంబర్ మొదటివారంలో నాని నటించిన హాయ్ నాన్న, నితిన్ మూవీ ఎక్స్ట్రా: ఆర్డినరీమ్యాన్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్లే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అదే సమయంలో విశ్వక్ సేన్ పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్పందించిన నిర్మాత నాగవంశీ విశ్వక్ సేన్ పోస్ట్‌పై నిర్మాత నాగవంశీ స్పందించారు. హీరో నాని, నితిన్‌తో మా బ్యానర్‌కు సత్సంబంధాలే ఉన్నాయని.. ఒకేసారి అన్ని విడుదలైతే పోటీ ఉంటుందని భావించి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని వాయిదా వేద్దామని నేను అంటానేమోనని విశ్వక్ సేన్ భావించారు. అందువల్లే విశ్వక్ సేన్ అలాంటి పోస్ట్ పెట్టి ఉంటారని అన్నారు. A tale of absolute grit and determination and the rise of a man from rags to riches! 💥💥#GangsofGodavari will arrive in theatres on 8th March, 2024! 🔥🌊 @VishwakSenActor @thisisysr @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri… pic.twitter.com/q5qoqyVi30 — Sithara Entertainments (@SitharaEnts) November 27, 2023 -
తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు..!
-
దళితబంధు అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన దళితులకు ఇచ్చే దళితబంధు పథకం కింద అర్హులను ఎలా ఎంపిక చేస్తున్నారో...ఆ వివరాలు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు, అధికారులే వీరిని ఎంపిక చేస్తున్నారా? లేదా ఇతర ప్రక్రియ ఏదైనా పాటిస్తున్నారా? చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1,100 మందిని దళితబంధుకు అర్హులుగా గుర్తించాలని జూన్ 24న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి గతంలోనే ఇచ్చి ఉండటంతో దానికి మినహాయింపు ఇచ్చారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి వీరిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఇలా అయితే నియోజకవర్గాల్లో అర్హులకు కాకుండా, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే రూ.10 లక్షలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కేతినీడి అఖిల్‌శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబర్ 8ని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా అర్హులకు లబ్ధి చేకూరదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఇదే పద్ధతిని దళితబంధుకు అనుసరించేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
జపాన్ చందమామ ల్యాండర్ ప్రయోగం వాయిదా
టోక్యో: చందమామపై తొలిసారిగా అడుగుపెట్టాలన్న జపాన్ లక్ష్యం చివరి నిమిషంలో సాకారం కాలేదు. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించి, పరిశోధనలు చేయడమే లక్ష్యంగా జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. జాక్సా టానేగíÙమా స్పేస్ సెంటర్లోని యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి సోమవారం ఉదయం 9.26 గంటలకు హెచ్2–ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. ప్రతికూల వాతావరణం కారణంగా లాంచింగ్‌కు 27 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘జాక్సా’ తెలియజేసింది. ప్రయోగ కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో బలమైన గాలులు వీచడం, ఉపరితల వాతావరణంలో అనిశి్చత పరిస్థితులు నెలకొనడం వల్లే వాయిదా పడినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. సెపె్టంబర్ 15వ తేదీ తర్వాత తదుపరి ప్రయోగం ఉండొచ్చని సమాచారం. చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో సాఫ్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) అనే లూనార్ ప్రోబ్‌ను జపాన్ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన ఐదో దేశంగా జపాన్ రికార్డు సృష్టిస్తుంది. అయితే ప్రయోగించిన 4 నెలల తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఇదిలా ఉండగా, హెచ్–2ఏ రాకెట్ ద్వారా ఇప్పటిదాకా 46 ప్రయోగాలు చేయగా, అందులో 45 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్‌పుట్స్‌గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో? -
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్ పరీక్ష వాయిదా వేయాలని 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. గురుకుల, ఇతర పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు కోరారు. కాగా టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. అభ్యర్థుల స్గోగన్స్‌తో TSPSC పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. Group 2 aspirants protested at TSPSC office, demanding to postpone the exam. INC leader Addanki Dayakar, TJS President Kodandaram extended support to unemployed#Telangana #Students #Unemployed #Group2 pic.twitter.com/NZi1vTiYha — Aapanna Hastham (@AapannaHastham) August 10, 2023 పై పరీక్షల అన్ని కూడా వేరు వేరు సిలబస్ ఉండడం వల్ల ప్రిపేర్ కావడం కష్టం అంటున్నారు అభ్యర్థులు. గ్రూప్-2 సిలబస్‌లో కొత్త అంశాలను చేర్చటం వల్లవాటి బుక్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ల లీకేజీలతో మానసికంగా కుంగిపోయామని, 7 సంవత్సారాలు ఆపారు.. మూడు నెలలు ఆపలేరా అంటూ గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ చెబుతోంది. అయితే వాయిదా వేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని అభ్యర్థులు తేల్చి చెబుతున్నారు. -
‘గ్రూప్-2’ ఆందోళన.. పలువురు అభ్యర్థులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. గ్రూప్-2 పరీక్షపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, అభ్యర్థులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, ఏడుగురు అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్-2 అభ్యర్ధుతలు, ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. వేలాదిగా తరలి వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు ఆఫీస్ ముందు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని విద్యార్థులు ఆందోళనను ఉద్రితం చేయగా, రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాని టీఎస్పీఎస్సీ చెబుతోంది. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్, కాంగ్రెస్ నేతలు నిరనసలో పాల్గొన్నారు. అభ్యర్థుల స్గోగన్స్‌తో టీఎఎస్పీఎస్సీ పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. -
Parliament Monsoon Session 2023: తొలి రోజే గరంగరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. మణిపూర్‌లో హింసాకాండ, ఇద్దరు గిరిజన మహిళలకు జరిగిన అవమానం సహా ఇతర అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఇతర సభా కార్యక్రమాలన్నీ రద్దుచేసి, మొదటి అంశంగా మణిపూర్ హింసపైనే చర్చించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్ పార్లమెంట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే.. ఇటీవల మరణించిన సభ్యులకు నివాళులరి్పంచిన కొద్ది నిమిషాలకే రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు, లోక్‌సభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. అంతకంటే ముందు మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ తరపున మాణిక్యం ఠాగూర్, ఆప్ నేత సంజయ్ సింగ్, బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, ఎంఐఎం నుంచి ఒవైసీ, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం వాయిదా తీర్మానిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర విపక్షాల సభ్యులు మణిపూర్ హింసపై చర్చించాలని కోరారు. చైర్మన్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగారు. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని ప్రాధాన్యతగా చర్చకు చేపట్టాలని, దీనిపై మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రియన్ సైతం ఆయనకు మద్దతు పలికారు. ఛైర్మన్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. సభ తిరిగి ఆరంభమైన తర్వాత కూడా ఖర్గే మరోసారి తమ నోటీసులపై చర్చించాలని కోరారు. ఆయన మైక్‌ను కట్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో సభాపతి జగదీప్ ధన్‌ఖడ్ సభను శుక్రవారానికి వాయిదావేశారు. ఇక లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమైన తర్వాత మణిపూర్ హింసపై విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. చర్చకు సిద్ధమే: పీయూష్ గోయల్ విపక్షాల ఆందోళనపై రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ స్పందించారు. ‘‘పార్లమెంట్ సక్రమంగా కొనసాగకూడదన్నదే ప్రతిపక్షాల ఉద్దేశంగా కనిపిస్తోంది. మణిపూర్ సంఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసినా.. నిబంధనల ప్రకారం చర్చ జరగనివ్వకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి’’ అని ఆక్షేపించారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు లోక్‌సభలో ప్రధాని మోదీ విపక్ష నేతలను పలకరించారు. వారి యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. -
విప్రో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: జీతాల పెంపు ఇప్పుడే కాదు..
Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్‌లో వేతన పెంపును అమలు చేసిన విప్రో కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది. వేరియబుల్ పే 80 శాతం ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్‌లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్‌ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్ పే అవుట్ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు. విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లందరినీ ఇంకా ఆన్‌బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ ఆన్‌బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్‌సీఎల్ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది. ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? -
అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి.. లేట్‌గా అయినా లేటెస్ట్గా
కొన్ని సినిమాలు లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంటాయి. రిలీజ్లు కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకపోవడమే ఈ వాయిదాలకు ఓ కారణం. మరో కారణం ఒకేసారి ఎక్కువ చిత్రాలు విడుదలైతే, థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడటం. కారణాలేమైనా అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి అన్నట్లుగా ఇటీవల పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. ఒకటికి మించి ఎక్కువసార్లు వాయిదా పడిన సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు, వాటి కొత్త విడుదల తేదీల గురించి తెలుసుకుందాం. ► వేసవికి రావాల్సిన ‘భోళా శంకర్’ ఆగస్టుకు షిఫ్ట్ అయ్యాడు. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమాను ముందు ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టు 11కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ► ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆదిపురుష్’ చిత్రం సిల్వర్ స్క్రీన్‌పైకి రావాల్సింది. కానీ మెరుగైన వీఎఫ్ఎక్స్ కోసం జూన్ 16కు వాయిదా వేశారు. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ దత్తా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి. సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ‘జై శ్రీరామ్..’ అనే తొలి పాటను విడుదల చేశారు. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ► మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు. ఫైనల్‌గా జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ‘ఖుషి’ సినిమాను సెప్టెంబరు1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వలో రాజశేఖర్ రెడ్డి, చరణ్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ 2023 సమ్మర్‌కు వాయిదా పడింది. అయితే ఈ వేసవికి ‘స్పై’ రాలేదు. ఫైనల్‌గా జూన్ 29న విడుదల కానుంది. ► బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ 2022 డిసెంబరులో రిలీజ్ కావాలి. కానీ రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ వీలుపడలేదు. తాజాగా జూన్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ఇది. ► దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్గా ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసినప్పటికీ మరోమారు వాయిదా పడి, జూన్ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. డేట్ ఫిక్స్ కాని చిత్రాలు ► వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ సందర్భంలో వెల్లడించింది. అయితే జూలైలో విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ► అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. కానీ రిలీజ్ కాలేదు. ► ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘డీజే టిల్లు స్క్వైర్’ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ అయ్యేందుకు రెడీ కానున్నట్లు టాక్. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ► శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ ఈ నెల 18న రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రెబా మౌనిక హీరోయిన్గా ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. ► తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను– మాన్’. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయాలను కున్నారు. కానీ వాయిదా పడింది. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. -
అంజనాద్రి కోసం సాహసాలు
అంజనాద్రి కోసం అహార్నిశలు కష్టపడ్డారు తేజ సజ్జా. అంజనాద్రి రక్షణకు ఈ యువ హీరో ఎలాంటి సాహసాలు చేశాడు అనేది ‘హను–మాన్’ సినిమాలో చూడాలి. తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ‘అంజనాద్రి’ అనే ఊహాత్మక ప్రదేశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం కథానాయకుడు ఎలా పోరాడాడనేది చిత్రకథాంశం. ‘‘హను–మాన్’ టీజర్‌పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ మా బాధ్యతను బాగా పెంచింది. గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్‌గా హను–మాన్ చిత్రం రిలీజ్ కానుంది. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, కెమెరా: శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి. -
రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటన..రెండోసారి వాయిదా
-
ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్‌కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి. మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్ నెలకొందని టీమ్‌లీజ్ డిజిటల్ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్‌ఫెనో జాబ్ రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ కష్టాలు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడా ఐటీ రంగంలో నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలకు సేవలు అందించే దేశీ ఐటీ కంపెనీల్లో హైరింగ్ మందగించింది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారనున్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో మాత్రం ఆ ప్రభావాలు అలాగే కొనసాగవచ్చని ఎక్స్‌ఫెనో సహవ్యవస్థాపకుడు అనిల్ ఎథనూర్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాలుగా హైరింగ్‌పై కాస్త సానుకూలంగా ఉన్నా, ఇంటర్వ్యూ చేసిన అభ్యర్ధులను తీసుకునే విషయంలో మాత్రం కంపెనీలు ముందుకు వెళ్లడం లేదని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కొటిల్ తెలిపారు. ఆయా సంస్థలు వేచి, చూసే ధోరణి పాటిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నియామకాల పరిస్థితి ఆశావహంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తొలి ఆరు నెలల్లో నికరంగా నియామకాలు 40% తగ్గొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా క్యూ4లో కంపెనీల ప్రణాళికలు మారిపోయాయని, హైరింగ్‌పై దాని ప్రభావం పడిందని కెరియర్‌నెట్ సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వాస్తవానికి అంతక్రితం త్రైమాసికంలో ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ప్రారంభించడంపై సానుకూల యోచనల్లోనే ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ సంక్షోభంతో పెద్దగా రిక్రూట్మెంట్ తలపెట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలలు హైరింగ్ అంత ఆశావహంగా కనిపించడం లేదన్నారు. పరిస్థితులపై ఇంకా స్పష్టత రానందున కంపెనీలు వేచి చూసే ధోరణే కొనసాగించవచ్చని.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా ఉండవచ్చని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2.5 లక్షలకు పరిమితం కావచ్చు.. దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా క్యూ1లో 59,704, క్యూ2లో 34,713 మందిని రిక్రూట్ చేసుకోగా క్యూ3లో ఇది ఏకంగా 4,904కి పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో సర్వీసుల విభాగంలో నికరంగా 4.80 లక్షల నియామకాలు జరగ్గా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.80 లక్షల స్థాయిలో ఉండొచ్చని హాన్ డిజిటల్ సీఈవో శరణ్ బాలసుందరమ్ తెలిపారు. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు సుమారు 2.5 లక్షల స్థాయిలో ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉండొచ్చని, మరికొన్ని వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని బాలసుందరమ్ చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ అంతగా జరగకపోవడం, కోవిడ్ పరిస్థితులపరమైన డిమాండు కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా జరిగాయని ఆయన చెప్పారు. ఆ ఒక్క సంవత్సరాన్ని పక్కన పెడితే ఐటీలో ఏటా 2–3 లక్షల మంది హైరింగ్ సాధారణంగానే ఉంటుందని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జులై 31 వరకు స్టేటస్ కో..
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటి వరకు దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఈమేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కాగా.. ఎమ్మెల్యేల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తు రద్దుచేస్తూ.. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన తెలిసిందే. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నాయని, కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే నీరు గారిపోతుందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో వాదించిన విషయం తెలిసిందే. చదవండి: నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది.. -
Taraka Ratna death: ఎన్టీఆర్ 30 వాయిదా
‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్– డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకి ఈ నెల 24న కొబ్బరికాయ కొట్టాల్సింది. అయితే హీరో తారకరత్న మృతితో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కారణంగా ఎన్టీఆర్– కొరటాల శివ తాజా చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీ. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. కాగా తాజాగా తారకరత్న మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్రబృందం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఇక ‘ఎన్టీఆర్ 30’తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. -
వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!
వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం! ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్ ఆథర్ ఆండ్రూ వొజోవిక్ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్ నేచర్‌లో పబ్లిషయ్యాయి. శక్తి కేంద్రం... మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉమ్మడి ఖమ్మంలో పోడు భూముల సర్వేకు బ్రేక్
-
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం (19న) తలపెట్టిన సమ్మెను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) వాయిదా వేసుకుంది. తమ డిమాండ్లలో ఎక్కువ శాతం పరిష్కారానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని తెలిపింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్టు, దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు వివరించింది. -
139 ఏళ్ల యాషెస్ చరిత్రకు తొలిసారి దెబ్బ పడనుందా!
క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చిరకాల ప్రత్యర్థులుగా అభివర్ణిస్తారు. ఇరుజట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాషెస్ అంటే టెస్టు సిరీస్ కావొచ్చు కాని.. సంప్రదాయ క్రికెట్లో ఉండే మజా ఎంత రుచిగా ఉంటుందో ఈ సిరీస్ తెలియజేస్తుంది.ట్రోపీలో ఉండే బూడిదను దక్కించుకోవడం కోసం ఇరుజట్లు కొదమసింహాల్లా తలపడుతుంటాయి. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. యాషెస్ సిరీస్ పట్ల అభిమానుల్లో అదే ఉత్సాహం కనిపించడం సహజం. ఇరుజట్ల మధ్య తొలిసారి 1882-83లో యాషెస్ సిరీస్ జరగ్గా.. అప్పటినుంచి 72 సిరీస్‌లు ఆడగా.. ఆస్ట్రేలియా 34 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు యాషెస్‌ను కైవసం చేసుకున్నాయి. మరో ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. మరి 139 ఏళ్ల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్ ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతుంది. 2023లో ఇంగ్లండ్ వేదికగా జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే అవకాశముంది. కానీ ఐసీసీ ఏర్పాటు చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)లో భాగంగా బిజీ షెడ్యూల్ ఉండడం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను తొలిసారి వాయిదా వేసేలా చేయనుంది. ఎఫ్టీపీతో పాటు హండ్రెండ్ టోర్నమెంట్లో ఇంగ్లండ్ జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు పాల్గొనాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో 139 ఏళ్ల చరిత్రలో యాషెస్ సిరీస్ వాయిదా పడడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. ఐసీసీ ప్లాన్ చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ప్రకారం అన్ని జట్లకు బిజీ షెడ్యూల్ ఉండడంతో పాటు.. ఆయా దేశాలు నిర్వహించే హండ్రెడ్ టోర్నమెంట్, ఐపీఎల్ లాంటి లీగ్‌లకు ఎఫ్టీపీ విండోలో సెపరేట్‌గా షెడ్యూల్ ఉంది. దీనికి అనుగుణంగానే ఎఫ్టీపీ షెడ్యూల్ డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో హండ్రెడ్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌ను ముందుకు జరిపే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈసారి జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌కు ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా జానీ బెయిర్ స్టో లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. ఆగస్టు 17 నుంచి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్, భారత్లతోనూ వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇక 2021/22 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0తో దక్కించుకుంది. ఇంగ్లండ్‌ను చీల్చి చెండాడుతూ సిరీస్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ యాషెస్‌ను దక్కించుకుంది. యాషెస్ ఓటమితో పాటు వెస్టిండీస్‌కు సిరీస్ కోల్పోవడంతో ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రూట్ అనంతరం కెప్టెన్‌గా వచ్చిన స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లండ్ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తోంది. అయితే స్టోక్స్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి యాషెస్ సిరీస్ కానుండడం.. ఈసారి సొంతగడ్డపై యాషెస్ జరగనుండడం ఇంగ్లండ్‌కు సానుకూలాంశమని చెప్పొచ్చు. చదవండి: Cricket Australia: 'లంక ప్రజల దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం -
తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాల కారణంగా గురువారం, శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి బుధవారం వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎంసెట్ మెడికల్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
NEET PG Exam 2022: నీట్ పీజీ వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టే సింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే వైద్యులు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించింది. ‘‘పరీక్ష వాయిదా 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఇలాంటప్పుడు పరీక్ష వాయిదా కుదరదు’’ అని పేర్కొంది. పరీక్ష ఈ నెల 21న జరగనుంది. అప్పుడే నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు వైద్యులు కోర్టుకెక్కారు. -
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
-
గేట్ పోస్ట్‌పోన్.. కుదరదు: సుప్రీం కోర్టు
గేట్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష నిలుపుదలకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. యధాతధంగా పరీక్ష నిర్వహణ ఉంటుందని గురువారం తీర్పు వెలువరించింది. పరీక్షకు 48 గంటల ముందు గేట్ ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు ప్రతీది తెరుచుకుంటోంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణం అవుతున్నాయి. ఇలాంటి టైంలో విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఇది అకడమిక్ పాలసీకి సంబంధించింది. పర్యవేక్షించాల్సింది వాళ్లు.. మేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించింది బెంచ్. కొవిడ్-19 థర్డ్‌వేవ్ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా గేట్‌ను వాయిదా వేయాలంటూ అభ్యర్థనల మేర పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పిటిషన్లు దాఖలు కాగా..అందులో ఒకటి అభ్యర్థుల తరపున దాఖలైంది. పిటిషనర్ల తరపున పల్లవ్ మోంగియా, సత్పల్ సింగ్ వాదనలు వినిపించారు. కాగా, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో యధాతధంగా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. -
రాధేశ్యామ్ విడుదల కూడా వాయిదా ! ఇదిగో క్లారిటీ..
UV Creations Confirm The Release Date Of Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. అయితే తాజాగా భారీ మల్టీస్టారర్ మూవీ రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్ఆర్ఆర్) చిత్రం వాయిదా పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాధేశ్యామ్ చిత్రం కూడా పోస్ట్‌పోన్ అవుతున్నట్లు పుకార్లు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ప్రభాస్ అభిమానులైతే తీవ్ర షాక్‌కు గురయ్యారు. అయితే ఈ పుకార్లపై రాధేశ్యామ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ స్పందించింది. ఈ ఊహగానాలను పటాపంచలు చేస్తూ కీలక ప్రకటన చేసింది. 'రాధేశ్యామ్ విడుదల కావడం లేదన్న ప్రచారాన్ని నమ్మకండి. ఈ నెల 14 తేదినే సినిమాను రిలీజ్ చేస్తున్నాం' అని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసింది యూవీ క్రియేషన్స్. This New Year Witness the Biggest war between Love & Destiny 💕🚢 from #RadheShyam #HappyNewYear2022#Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @radheshyamfilm pic.twitter.com/pfLSo2VkNM — UV Creations (@UV_Creations) January 1, 2022 -
ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా అంటూ వార్తలు, మండిపడుతున్న నెటిజన్లు
న్యూ ఇయర్లో అందరికి బిగ్ షాక్ ఇస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు న్యూ ఇయర్, సంక్రాంతికి పండగ కల తెచ్చేందుకు జనవరి 7న వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా అంటూ వార్తలు వినిపించడంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకవుతున్నారు. జులైలో మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఇక ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందని తీవ్ర నిరాశకు గురైన కొంతమంది నెటిజన్లు మండిపడుతూ ఆర్ఆర్ఆర్ వాయిదాపై మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. జూలైలో ఇంకో కరోనా వేరియంట్ వస్తే అప్పుడు కూడా మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. #RRRMovie Postpone Undo ledo Fast ga Cheppandi E Tension Tattukolemu 😭😭😭 Pls @RRRMovie We Want Official Confirmation pic.twitter.com/l59mGt8xbH — RCCult🔥 (@AlwayzDurgesh) January 1, 2022 ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యేలోపు నేను ముసలోడిని అయిపోతానేమో అంటూ ఒకరు పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ విడుదల అయ్యేలోపు చిరంజీవి 200వ సినిమా కూడా విడుదల అవుతుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. రాజమౌళితో పెట్టుకుంటే ఇంతేనని చురకలు అంటిస్తున్నారు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని, వెంటనే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై ఆ సినీ యూనిట్ అధికారిక ప్రకటన చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. #RRRMovie All @tarak9999 Fan's ASSEMBLE HERE....#NTR30 👈 Hastag ni TREND lo pettali.@RRRMovie రిలీజ్ అయ్యేటప్పుడికల్లా కొరటాల. శివ తో సినిమా Complete చేసి ముందే రిలీజ్ చేయొచ్చు. Bcoz, Budget High అవ్వడం వళ్ళ ఆగల్సి వస్తుంది. #RRR — Mr. Jay (@misterjay69) January 1, 2022 #RRRMovie @RRRMovie Clarity Ivvu mava. Fake ayithe Fake Ani lekapothe Release Date Taruvatha Announce chestam ani ayina cheppandi. 🙏 — Mr. Jay (@misterjay69) January 1, 2022 The decision by Danayya garu and Rajamouli garu to defer the release date of #RRRMovie is well appreciated. Wishing the #valimai team all the best — san 2 (@San208939224) January 1, 2022 -
'జెర్సీ' విడుదల ఇప్పట్లో లేనట్లే.. సినిమా మళ్లీ వాయిదా
Jersey Movie Again Postponed From December 31: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదిని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేశారు. అయితే తాజాగా డిసెంబర్ 31న కూడా జెర్సీ చిత్రం విడుదలకు నోచుకోనట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడినట్లు ప్రముఖ చిత్ర పరిశ్రమ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్లో తెలిపాడు. 'ఎక్స్‌క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ చిత్రం డిసెంబర్ 31 విడుదల కావట్లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వినిపిస్తున్న మాటల్లో నిజం లేదు.' అని ట్వీట్ చేశారు. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... #BreakingNews... #Jersey POSTPONED... WON'T RELEASE ON 31 DEC... New date will be announced shortly... Industry talk that #Jersey will be Direct-to-OTT release is FALSE. pic.twitter.com/1MBwsSdWCC — taran adarsh (@taran_adarsh) December 28, 2021 ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
ఒమిక్రాన్ అలజడి.. యూపీ ఎన్నికలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
లక్నో: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సూచించింది. ఈసీ సహా ప్రధాని మోదీని కూడా ఈ మేరకు కోరింది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. పైగా ఒమిక్రాన్ సెకండ్ వేవ్‌ను మించి ఉండొచ్చని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 300 దాటాయి. ఈ క్రమంలోనే సర్వత్రా ఆందోళన నెలకొందని అభిప్రాయపడింది. గతంలో యూపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కేసులు, మరణాలు విపరీతంగా పెరిగడం చూశాం. మనం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా.. వీలైతే రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరింది. ప్రజలు ప్రాణాలు ముఖ్యమని ఆ తర్వాతే ఎన్నికలైనా ఏవైనా అని ధర్మాసనం అభిప్రాయపడింది. వచ్చే ఏడాది యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రధాన మంత్రికి ఈ మేరకు సూచన చేసింది. చదవండి: ఆందోళనలో 50 లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం!.. ఆ చట్టానికి మోక్షం ఎప్పుడో? -
రూ.8 లక్షల వార్షికాదాయంపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: నీట్–పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కింద రిజర్వేషన్ పొందడానికి వార్షికాదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉండాలన్న నిబంధనను పునఃసమీక్షించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీని తేల్చే ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామన్నారు. కోర్టు అనుమతి మేరకు నీట్–పీజీ కౌన్సెలింగ్‌ను నాలుగు వారాలపాటు వాయిదా వేసినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) జూలై 29న జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్–పీజీ మెడికల్ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఎంసీసీ గతంలో తెలిపింది. కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15 శాతం సీట్లు, పీజీ కోర్సుల్లో 50 శాతం సీట్లు అఖిల భారత కోటాకు కిందకు వస్తాయి. పీజీ కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్ల భర్తీలో కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ‘జాతీయ జీవన వ్యయ సూచిక’ ఆధారంగా ఈ పరిమితి విధించినట్లు స్పష్టం చేసింది. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటా అమలును వాయిదా వేయడం సాధ్యం కాదని తుషార్ మెహతా అన్నారు. తుషార్ మెహతా వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరవ తేదీకి వాయిదావేసింది. -
కరోనా సెగ:అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్
సాక్షి,ముంబై: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, లాక్డౌన్ ముగిసిన అనంతరం షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న బాలీవుడ్ మూవీ ‘ఓ మైగాడ్-2’ కు కరోనా షాక్ తగిలింది. యూనిట్లో ఏకంగా ఏడుగురికి కరోనా సోకడంతో అర్థాంతరంగా షూటింగ్‌ను నిలిపివేశారు. వచ్చే రెండు వారాల పాటు షూటింగ్‌ను నిలిపివేసినట్టు నిర్మాత్ అశ్విన్ వర్దే ప్రకటించాడు. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటిస్తున్నారు. వీరిద్దరికి కోవిడ్-19 నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్లోపాల్గొనాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం సభ్యులలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ కాగా, అతడిని హోం క్వారంటైన్‌కి తరలించారు. అయితే ఇతర సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో తిరిగిషూట్ను ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో టీమ్ సభ్యులందరూ కోలుకునే వరకు రెండు వారాల పాటు షూట్‌ను నిలిపివేశారు. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై గాడ్’. దీనికి సీక్వల్గా పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్-2’ గా రానుంది. ఈ చిత్రంలో అక్షయ్ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. సుదీర్ఘ విరామం తరువాత కొత్త మార్గదర్శకాలతో ఇటీవల బాలీవుడ్ షూటింగ్ పనులు పుంజుకున్న సంగతి తెలిసిందే. -
NEET Exam: ఈనెల 12న షెడ్యూల్ ప్రకారం యథాతథం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంర్ 12న ఆదివారమే ఈ పరీక్షను నిర్వహించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని.. అలాగే సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని.. అందువల్ల నీట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా?!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇంతకు ముందే ఓసారి వాయిదా పడిన ఈ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఆలస్యం కావొచ్చని పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఓసారి వాయిదా రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు.. గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితల పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీనే ముగిసింది. వాస్తవానికి వారి పదవీకాలం ముగియ డానికి నెల ముందే ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కరోనా నేప థ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు మే 13న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తు తం వాటి నిర్వహణపై దృష్టిపెట్టిన ఈసీ.. రాష్ట్రంలో కరోనా స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలపాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి సమాధానంగా ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఆలస్యం? రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. గత నెల 12న ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేశారు. ఈ మేరకు హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిబంధ నల ప్రకారం.. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి 6 నెలల్లోగా ఉప ఎన్నిక జరగాలి. అంటే హుజూరా బాద్‌లో డిసెంబర్ 12 నాటికి ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి. ఇందుకోసం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరిస్థితులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై విముఖత వ్యక్తం చేయడంతో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. -
మాస్ టైటిల్.. మైండ్ బ్లోయింగ్ లుక్
రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ చిత్రంలో ఫలానా హీరోయిన్ నటించనున్నారని, కథలో మార్పులు చేస్తున్నారని, షూటింగ్ ఇప్పట్లో మొదలు కాదనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టేలా ఈ చిత్రదర్శకుడు శరత్ మండవ సోషల్‌మీడియాలో స్పందించారు. ‘‘ఈ సినిమా టైటిల్ ఫుల్ మాస్‌గా, ఫస్ట్ లుక్ మైండ్బ్లోయింగ్గా ఉంటాయి. ఇక ఈ మూవీ థీమ్ సాంగ్ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. వచ్చే నెలలో షూటింగ్ ఆరంభించే చాన్స్ ఉంది. ఆ తర్వాత మా సినిమా గురించి కొన్ని అప్డేట్స్ ఇస్తాం’’ అని పేర్కొన్నారు శరత్. -
వార్ వాయిదా!
నాగచైతన్య పాల్గొనాల్సిన వార్ వాయిదా పడింది. ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’(1994)కు ఇది హిందీ రీమేక్. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేయనున్నారు. చైతూకు బాలీవుడ్లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలాఖరున లఢక్, కార్గిల్ లొకేషన్స్‌లో జరపాలనుకున్నారు. ఈ షెడ్యూల్లో వార్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఆమిర్ ఖాన్, దర్శకుడు అద్వైత్ అక్కడి వెళ్లి తమ సినిమా షూటింగ్‌కు అనువైన లొకేషన్స్‌ను కూడా పరిశీలించారు. కానీ ఈ నెలలో జరగాల్సిన ఈ సినిమా చిత్రీకరణ వాయిదా çపడిందని బాలీవుడ్ టాక్. కరోనా సెకండ్ వేవ్, లఢక్, కార్గిల్ లొకేషన్స్‌కు సంబంధించిన అనుమతులు వంటి కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. -
Acharya Moive: ఇరవై రోజులే ఉంది!
జస్ట్ 20 రోజులు షూటింగ్ జరిగి ఉంటే ‘ఆచార్య’ చిత్రబృందం గుమ్మడికాయ కొట్టేసేవాళ్లు. కానీ కరోనా ‘ఆచార్య’ ప్లాన్‌ను కాస్త అటూ ఇటూ చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పూర్తయిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం 20 రోజుల షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా జరిపేలా ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే కనిపిస్తారు. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ‘ఆచార్య’ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. -
Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్!
కౌలాలంపూర్: మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో భాగమైన మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే. మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోరింది. -
దేశంలో ఉపఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కరోనా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలించేవరకు ఉప ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని ఈసీ నిర్ణయించింది. బెంగాల్ సహా ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వైరస్ సంక్రమణ ఎక్కువగా జరిగిందన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేశారు. దాద్రా – నగర్ హవేలి, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు, హరియాణాలోని కల్కా, ఎల్లెనాబాద్, రాజస్తాన్‌లోని వల్లభనగర్, కర్ణాటకలోని సింగ్డి, మేఘాలయలోని రాజబాలా, మావరింగ్‌కెంగ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. మరికొన్ని ఖాళీ స్థానాలకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఖిలాడి వాయిదా పడ్డాడు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో సినిమాల చిత్రీకరణలే కాదు.. రిలీజ్లు వాయిదా పడుతున్నాయి. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేశ్ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, హవీష్ ప్రొడక్ష¯Œ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ‘‘రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. కరోనా ఉధృతి తగ్గాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా
-
జేఈఈ మెయిన్స్ 2021 వాయిదా
న్యూఢిల్లీ: కోవిడ్ దృష్టా కేంద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. కోవిడ్ విజృంభణ వల్ల పరీక్ష వాయిదా వేస్తున్నామన్నారు. ఇప్పటికే నీట్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చదవండి: కటాఫ్ ఎక్కువే! -
ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నా.. విద్యాసంస్థల మూసివేత కారణంగా ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి మళ్లీ ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం నిలిపేసింది. ముంద స్తు షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యాసంస్థలను మూసేసినందున ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో 3 ప్రత్యామ్నాయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. అందులో యథావిధిగా ప్రాక్టికల్స్ నిర్వహణకు అనుమతించడం, లేదంటే ఏప్రిల్ 10 వర కు వాయిదా వేయడం, అదీ కుదరకపోతే మేలో ఇం టర్ పరీక్షలు, జేఈఈ మెయిన్ పరీక్షలు పూర్తయ్యా క ప్రాక్టికల్స్ నిర్వహించడం వంటి 3 ప్రత్యామ్నా యాలను పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాల్సిందేనని, ప్రాక్టికల్ పరీక్షలు లేకుండా మార్కులు వేయ డం సాధ్యం కాదన్న భావనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రాక్టికల్ పరీక్షల వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రాక్టికల్ ఏప్రిల్ 7 నుంచి నిర్వ హించినా, 10 నుంచి నిర్వహించినా పెద్ద తేడా ఏ మీ ఉండదు. అందుకే ప్రాక్టికల్స్‌ను మే నెలాఖరు కు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాక్టికల్స్‌కు బదులు మరేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఇంటర్నల్ అసైన్మెంట్స్ ఇచ్చి వాటినే ప్రాక్టికల్ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో యోచిస్తు్తన్నట్లు తెలిసింది. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై స్పష్టత రానుంది. ఆందోళనలో 2,62,169 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాల్సిన సైన్స్ కోర్సులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,62,169 మంది ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 48,026 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 40,287 మంది, జాగ్రఫీ విద్యార్థులు 557 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,58,814 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,73,523 మంది పరీక్ష ఫీజు చెల్లించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
వద్దంటే వద్దు నీరానా.. ససేమిరా
అమెరికా అధ్యక్షుడు ఎవర్ని ఏ అత్యున్నత స్థాయి పదవిలో నియమించినా ఆ నియామకాన్ని సెనెట్ ఆమోదించాలి. సెనెట్‌లో వంద మంది సభ్యులు ఉంటారు. వారిలో కనీసం 51 మంది అనుకూలంగా ఓటు వేస్తేనే వారు ఆ స్థానానికి అర్హత సాధిస్తారు. సాధారణంగా అధ్యక్షుడు నియమించిన వ్యక్తిపై వ్యతిరేకత ఉండదు కానీ.. ప్రస్తుతం నీరా టాండన్ విషయంలో సెనెట్ నియామక కమిటి ఇప్పటికి రెండుసార్లు ఓటింగ్‌ను వాయిదా వేసింది. అందుకు కారణం ప్రస్తుతం సెనెట్‌లో ఉన్న 50 మంది రిపబ్లికన్లతో పాటు, డెమోక్రాటిక్ పార్టీలోని ఒకరిద్దరు ఆమెను వ్యతిరేకిస్తుండటమే! గతంలో సోషల్ మీడియాలో ఆమె ప్రదర్శించిన నోటి దుడుకుతనమే ఇప్పుడు ఆమె నియామకాన్ని ఓకే చేసే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నాయి. నీరా టాండన్ డెమోక్రాటిక్ పార్టీ సభ్యురాలు అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆమె పూర్వపు ‘ప్రవర్తనను’ వ్యతిరేకిస్తున్న వారు డెమోక్రాటిక్ పార్టీలోనూ ఉండటతో ఆమె నియామక నిర్థారణ అవకాశాలు సన్నగిల్లాయి. నీరా ప్రస్తుతం వాషింగ్టన్‌లోని ‘సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్’కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్థిక, న్యాయ విషయాల్లో నిపుణురాలిగా గుర్తింపు పొందిన నీరాను బైడెన్ తన బడ్జెట్ చీఫ్‌గా నామినేట్ చేశారు. ఆ పదవిని చేపట్టడానికి అవసరమైన సామర్థ్యాలు ఆమెకు ఉన్నప్పటికీ కేవలం ఆమె ‘ప్రవర్తన’ కారణంగా ఆ నామినేషన్‌కు ఆమోదం లభించడం కష్టమవుతోంది. అభ్యంతరం చెబుతున్నది సొంత పార్టీలోని ఒకరిద్దరే కనుక బైడెన్ మాట మీద సర్దుకుని పోతే సమస్యే లేదు. అటు, ఇటు సమానంగా పోలయినా.. ఉపాధ్యక్షురాలి ‘టై బ్రేక్’ ఓటు ఉంటుంది కనుక పరిస్థితి నీరాకు అనుకూలంగా మారవచ్చు. రిపబ్లికన్లు, డెమోక్రాటిక్‌లు నీరా నియామకాన్ని వ్యతిరేకించడానికి కారణంగా ప్రచారంలోకి తెస్తున్న ఆమె సోషల్ మీడియా వ్యాఖ్యలు, ట్వీట్లు కేవలం రాజకీయ పరమైనవే. అలాగే పక్షపాతమైనవిగా చెబుతున్న ఆమె ట్వీట్లు నిజానికి పక్షపాతరహితమైనవనీ, తన మన పర భేదం లేకండా సొంత పార్టీ విధానాలను కూడా ఖండిస్తూ ఆమె ట్వీట్లు పెడతారనీ పేరు ఉంది. కొంతమంది సెనెట్ సభ్యులనైతే ‘వరెస్ట్’ అని, ‘ఫ్రాడ్’ అని తిట్టిపోసిన ట్వీట్లూ ఉన్నాయి. వాటి సంగతి వదిలేస్తే.. ‘‘ప్రస్తుతం అమెరికా ఉన్న ఆర్థిక పరిస్థితిలో నీరా వంటి ప్రతిభగల ఆర్థిక నిపుణురాలు’’ అని అమెరికన్లలో అధికశాతం మంది విశ్వసిస్తున్నారు. ఆ కారణంగా బైడెన్ ఆమెను నామినేట్ చేశారు. ∙∙ యాభై ఏళ్ల నీరా భారత సంతతి మహిళ. బైడెన్ నియామకం కనుక ఆమోదం పొందితే బడ్జెట్ చీఫ్ అయిన తొలి నాన్–అమెరికన్ అవుతారు. నీరా మాసచుసెట్స్లో జన్మించారు. ఆమె ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. తను తల్లి దగ్గరే పెరిగారు. రాజ్ అని ఒక సోదరుడు ఉన్నారు. భర్త, ఇద్దరు పిల్లలు. భర్త విజువల్ ఆర్టిస్టు. ఇంతవరకే ఆమె కుటుంబ వివరాలు. నీరా ‘లా’ చదివారు. డెమోక్రాటì క్ గవర్నర్, అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి పని చేశారు. క్లింటన్ విధేయులలో ఒకరు. హిల్లరీ క్లింటన్‌కి మంచి స్నేహితురాలు కూడా. ఒబామా తరఫున కూడా అధ్యక్ష ఎన్నికలకు ప్రచార బృంద సభ్యురాలిగా వ్యూహ రచన చేశారు. ‘సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్’ వ్యవస్థాపనలో కూడా కీలక పాత్రే వహించారు. నీరా తమను విమర్శించారని సెనెటర్లు బాధపడుతున్నారు కానీ ఆమె దేశాధ్యక్షులను కూడా వదల్లేదు. ఇజ్రాయెల్, లిబియా, సిరియా ప్రభుత్వ విధానాలను సైతం ఆమె ఘాటుగా విమర్శించారు. ఎవర్నీ లెక్క చేయని ఈ ముక్కుసూటి మనిషికి బడ్జెట్ బాధ్యతలనిచ్చి బైడెన్ మంచి నిర్ణయమే తీసుకున్నారని అంటున్నవారూ ఉన్నారు. -
‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వేసవికి వాయిదా
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ద్వారా వెబ్ సిరీస్‌ల ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత. ఫిబ్రవరి 12న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ రిలీజ్ కావాలి. అయితే దీన్ని వేసవికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దర్శక ద్వయం రాజ్, డీకే సృష్టించిన సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. సమంత విలన్ పాత్రలో టెర్రరిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ వాయిదా గురించి దర్శకులు మాట్లాడుతూ – ‘‘‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సూపర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని విడుదలను వేసవికి వాయిదా వేస్తున్నాం’’ అన్నారు. అయితే ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘మిర్జాపూర్’, ‘తాండవ్’ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’కి అలాంటివి ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ సిరీస్ రిలీజ్‌ను వాయిదా వేశారని టాక్. -
ఒక్క కరోనా కేసు.. ఆరు టోర్నీల మ్యాచ్‌లు వాయిదా
మెల్బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా మొదటి నుంచి ఇప్పటిదాకా కఠినమైన కరోనా వైరస్ ప్రొటోకాల్ పాటిస్తున్న దేశమేదైనా ఉందంటే అది ఆస్ట్రేలియానే! ఒక్క కరోనా కేసు నమోదైనా సరే పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. బుధవారం నమోదైన ఒక్క కరోనా కేసు ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సిద్ధమవుతున్న ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా మెల్బోర్న్లో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం ఆరు టోర్నీలు జరుగుతున్నాయి. మెల్బోర్న్లో ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్లో ఓ కార్మికుడికి కోవిడ్–19 సోకినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఆ హోటల్లో బస చేసిన ఆటగాళ్లు గురువారం ఈ టోర్నీలలో ఆడే మ్యాచ్‌లన్నీ వాయిదా వేశారు. అతనితో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించారు. మళ్లీ వారందరికీ పరీక్షలు చేసి నెగెటివ్ అని తేలాకే బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. -
ఈ ఒలింపిక్స్ అంతేనా!
టోక్యో: జపాన్ ఏ ముహూర్తాన 2020 ఒలింపిక్స్‌కు బిడ్ వేసిందో గానీ... తీరా నిర్వహించే సమయం వచ్చేసరికి అన్నీ ప్రతికూలతలే! గతేడాదే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వైరస్‌తో వాయిదా పడింది. ఇప్పుడు ఆ వైరస్ సెకండ్ వేవ్ కలకలంతో మళ్లీ విశ్వక్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఈ ఒలింపిక్స్‌ను వదిలేసి 2032 ఒలింపిక్స్‌ను పట్టుకుందామని జపాన్ ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఖండిస్తున్నట్లు అటు ప్రభుత్వం, ఇటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించాయి. జపాన్ ప్రధాని యొషిహిదే సుగా మెగా ఈవెంట్ నిర్వహించేందుకు పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘గేమ్స్ అనుబంధ వర్గాలు షెడ్యూల్ ప్రకారమే భద్రంగా, సురక్షితంగా విశ్వ క్రీడలను నిర్వహించాలని కృతనిశ్చ యంతో ఉన్నాయి’ అని కేబినెట్ డిప్యూటీ చీఫ్ సెక్రటరీ సకాయ్ తెలిపారు. అంతకుముందు ‘టైమ్స్’ పత్రిక ఈ ఏడాది క్రీడల సంగతి అటకెక్కినట్లేనని కథనం రాసింది. జపాన్ కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చించే ఈ నిర్ణయం తీసుకుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ వార్త కథనం జపాన్ ప్రభుత్వంలో కలకలం రేపింది. వెంటనే టోక్యో గవర్నర్ కొయికె స్పందిస్తూ నిరాధార వార్త రాసిన బ్రిటిష్ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. అసలు ప్రభుత్వం అలాంటి చర్చే జరపలేదని ఆమె చెప్పారు. ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ మాట్లాడుతూ 2020 మార్చి తరహాలో 2021 మార్చి ఉండబోదని, కరోనాకు వ్యాక్సిన్లు కూడా వచ్చాయని అన్నారు. -
వాట్సాప్ అప్డేట్.. మరో 3 నెలలు వాయిదా
ముంబై: నూతన ప్రైవసీ విధానంపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్డేట్ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. పది రోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్ మొబైల్ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ పని చేయదని ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్.. యూజర్ వ్యక్తిగత సమాచారం, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఇక వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను డిలీట్ చేసి.. టెలిగ్రాం, సిగ్నల్ యాప్స్‌కి మారారు. ఈ పరిస్థితులతో వాట్పాప్ మేలుకొన్నది. తన అప్డేట్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ తన బ్లాగ్‌లో ‘‘మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా మీ మధ్యే ఉంటుందనే ఐడియా మీద వాట్సాప్‌ని అభివృద్ధి చేశాం. మీ వ్యక్తిగత సంభాషణని ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ పద్దతిలో మేం రక్షిస్తాం. వాట్సాప్, ఫేస్బుక్ మీ సందేశాలను చదవదు.. మీరు పంపే లోకేషన్లని చూడదు.. మీరు ఎవరికి కాల్ చేశారు.. ఎవరితో మెసేజ్ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోం’’ అని తెలిపింది. (చదవండి: వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..? ) ఇక ‘‘ఈ నూతన అప్డేట్ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్ ఫీచర్స్‌ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్డేట్ని తీసుకొచ్చాం. మేము డేటాను ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము అనే దానిపై ఇది మరింత పారదర్శకతను అందిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ బిజినెస్‌తో షాపింగ్ చేయకపోయినా, భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని ఎంచుకుంటారని మేము భావిస్తున్నాము. ఈ సేవల గురించి ముఖ్యమైన వ్యక్తులకు తెలుసు. ఈ అప్డేట్ ఫేస్‌బుక్‌తో డాటాను పంచుకునే మా సామర్థ్యాన్ని పెంచదు’’ అని స్పష్టం చేసింది. ఇక ‘‘యూజర్లు కొత్త అప్డేట్ను అంగీకరించే తేదీని మేం వెనక్కి తీసుకుంటున్నాం. ఫిబ్రవరి 8 న ఎవరి అకౌంట్లను నిలిపివేయం.. తొలగించం. అలానే వాట్సాప్‌లో గోప్యత, భద్రత ఎలా పనిచేస్తుందనే దానిపై ఉన్న తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి మేము ఇంకా చాలా చేయబోతున్నాం. మే 15న కొత్త బిజినెస్ ఫీచర్ అందుబాటులోకి రాకముందే మేము పాలసీని సమీక్షించడానికి క్రమంగా ప్రజల వద్దకు వెళ్తాము’’ అన్నది. (చదవండి: వాట్సాప్ కి పోటీగా 'సిగ్నల్' యాప్) ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకురావడానికి వాట్సాప్ సహాయపడింది. ఈ భద్రతా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు, భవిష్యత్తులో రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. గందరగోళ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుకార్లను ఆపడానికి, వాస్తవాలను ప్రచారం చేయడానికి సహాయం చేసిన వారందరికి ధన్యవాదాలు. వ్యక్తిగత సంభాషణ చేయడానికి వాట్సాప్‌ను ఉత్తమమైన మార్గంగా నిలపడానికి మేం నిరంతరం కృషి చేస్తాం’’ అని తెలిపింది. -
గ్రామీ అవార్డ్స్ వాయిదా
హాలీవుడ్ ప్రఖ్యాత అవార్డు ఫంక్షన్ గ్రామీ అవార్డ్స్ పోస్ట్‌పోన్ అయ్యాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుక గ్రామీ. ఈ నెల 31న లాస్ ఏంజెల్స్‌లో జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేశారు. కోవిడ్ నేపథ్యంలో ఈ వేడుకను వాయిదా వేశారు. ‘‘ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ఓ ప్రకటన విడుదల చేశారు గ్రామీ అవార్డు నిర్వాహకులు. -
జోష్‌కి బ్రేక్
అనుకోని విధంగా ‘అన్నాత్తే’ టీమ్‌కి కరోనా కష్టం వచ్చింది. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరగా సినిమా పూర్తి చేయాలని 70 ఏళ్ల వయసులోనూ రజనీ ఎంతో జోష్‌గా రోజుకి దాదాపు 14 గంటలు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రం యూనిట్ సభ్యుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో షూటింగ్ జోష్‌కి బ్రేక్ పడింది. ‘‘యూనిట్ సభ్యులకు కోవిడ్ టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. రజనీకాంత్, మిగతా అందరికీ నెగటివ్ అని నిర్ధారణ అయింది. భద్రతను దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌ని వాయిదా వేశాం’’ అని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. -
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తొలి వన్డే వాయిదా
కేప్‌టౌన్: ‘బయో బబుల్’లో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ప్లేయర్ కరోనా వైరస్ బారిన పడటంతో... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డేను ఆదివారానికి వాయిదా వేశారు. రెండు జట్ల ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, రెండు క్రికెట్ సంఘాలు తొలి వన్డే వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తెలిపాయి. దక్షిణాఫ్రికా జట్టులో కరోనా సోకిన ప్లేయర్ పేరును వెల్లడించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు క్రికెటర్లు వైరస్ బారిన పడ్డారు. ‘బయో బబుల్’ ఏర్పాటు చేయకముందు ఒకరికి వైరస్ రాగా... మూడో టి20 మ్యాచ్‌కు ముందు మరొకరికి వైరస్ సోకింది. షెడ్యూల్లో మార్పు కారణంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల్లో రెండు వన్డేలు ఆడాల్సి ఉంటుంది. బుధవారం జరిగే మూడో వన్డేతో ఇంగ్లండ్ పర్యటన ముగుస్తుంది. -
ఓయూ పరీక్షలు వాయిదా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం: ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, ఇతర కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు, ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
వచ్చే ఏడాదికి వాయిదా!
కౌలాలంపూర్: ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా అగ్రశ్రేణి జట్లు తప్పుకోవడంతో టోర్నీ కళ తప్పుతోందంటూ స్పాన్సర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ ముగిశాక టోక్యోలో నిర్వహిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం వర్చువల్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సమావేశంలో ఎక్కువ మంది వాయిదాకే మొగ్గుచూపినట్లు తెలిసింది. -
వండర్ ఉమెన్ మళ్లీ వాయిదా
హాలీవుడ్ సూపర్ హీరోయిన్ మూవీ ‘వండర్ ఉమెన్ 1984’ మళ్లీ వాయిదా పడింది. గాళ్ గడోట్ ముఖ్య పాత్రలో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వండర్ ఉమెన్ 1984’. 2017లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘వండర్ ఉమెన్’ చిత్రానికి ఇది సీక్వెల్. పాటీ జెన్కిన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా వేశారు. థియేటర్స్ తెర్చుకుంటాయని అక్టోబర్ 2కు పోస్ట్‌పోన్ చేశారు. అయితే అప్పటికి థియేటర్ల తాళాలు తెరిచే పరిస్థితి కనిపించకపోవడంతో డిసెంబర్ 25కు విడుదలను వాయిదా చేశారు. మరి ‘వండర్ ఉమెన్’ డిసెంబర్లో అయినా థియేటర్స్‌లోకి వస్తుందా? రాదా? చూడాలి. -
నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్!
న్యూడిల్లీ: జేఈఈ, నీట్ పరీక్షలను యథాత«థంగా నిర్వహించాలన్న తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ వేశాయి. పరీక్షలు నిర్వహించాలన్న తీర్పు విద్యార్థుల జీవించే హక్కుకు విఘాతమని, అదేవిధంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో రవాణా ఇబ్బందులను ఆ తీర్పులో పరిగణించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు మోలాయ్ ఘటక్, రామేశ్వర్ ఓరాన్, రఘుశర్మ, అమర్జీత్ భగత్, బీఎస్ సిద్ధు, ఉదయ్ రవీంద్ర సావంత్ తరఫున న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షలు యథాత«థంగా నిర్వహించాలని, కరోనా కారణంగా జీవితాలు ఆగవని ఈ నెల 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం పరీక్షల నిర్వహణకు సిద్ధ్దమైంది. అప్పటినుంచి ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే ముందుకు సాగడంతో విపక్ష రాష్ట్రాల మంత్రులు సుప్రీంను ఆశ్రయించారు. సెప్టెంబర్ 1–6లో జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ సమాయత్తమయింది. ఇప్పటికే అడ్మిట్‌కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను ఆరంభించింది. అభ్యర్థులకే కాదు... కుటుంబాలకు కూడా రిస్కే పరీక్షలు జరపాలన్న నిర్ణయం అసంబద్ధమని, జిల్లాలో పరీక్షా కేంద్రాల సమీక్షకు కేంద్రానికి తగిన సమయం ఉన్నా పట్టించుకోలేదనే విషయాన్ని తీర్పులో ప్రశ్నించలేదని రివ్యూపిటిషన్‌లో పేర్కొన్నారు. లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడం వారంతా పరీక్షకు ప్రస్తుతం హాజరయ్యేందుకు సమ్మతించినట్లు కాదని తెలిపారు. ఆగస్టు 17న ఇచ్చిన ఆదేశం ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలను పట్టించుకోలేదన్నారు. ‘‘జీవితాలు ముందుకు సాగాలి, విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం నష్టపోకూడదు’’ అనే రెండు అంశాల ఆధారంగా తీర్పునిచ్చారని, అంతేకాని నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా చర్చించలేదని పిటి షన్లో వాదించారు. ఈ తీర్పును సమీక్షించకపోతే దేశ విద్యార్థి సమూహానికి తీవ్ర హాని జరగవచ్చని, కేవలం పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల ఆరోగ్యమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం చూపవచ్చని వివరించారు. ఇన్ని లక్షల మంది కరోనా సంక్షోభ సమయంలో అటుఇటు ప్రయాణాలు చేయడం తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమవుతుందన్నారు. ఈ ఒక్క కారణంతోనైనా గత తీర్పును రద్దు చేయవచ్చని కోరారు. కరోనా సమయంలలో కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని పిటిషనర్లు తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు నిర్వహించాలనుకోవడం సమంజసం కాదన్నారు. -
ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి భవన్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టులో పిటీషన్ పెండింగ్‌లో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. కాగా పీపీఈ కిట్లు ధరించి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం చెయ్యాల్సిన కరోనా టెస్టుల గురించి పట్టింపు లేని ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలపై కూడా పట్టింపు లేదని మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న కూడా ప్రభుత్వం తన నిరంకుశ మొండి వైఖరితో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టే రీతిలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ నేడు ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి నిర్వహించడం జరిగిందని వెంకట్ పేర్కొన్నారు. -
బీమా సంస్థల విలీనం వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. విలీన ప్రక్రియను నిలిపి వేసిన ప్రభుత్వం లాభదాయక వృద్ధి, నిధుల కేటాయింపు ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రణాళికను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయం ప్రకారం మూడు బీమా సంస్థలకోసం 12,450 కోట్ల రూపాయల నిధులను కేటాయించనుంది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెరో 5 వేల కోట్ల రూపాయలను నిధులు కేటాయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. బలహీనమైన ఆర్థిక స్థితికితోడు సంస్థలు వినియోగిస్తున్న వివిధ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు, తదితర కారణాల రీత్యా ప్రస్తుత ప్రరిస్థితుల్లో విలీనం ఒక సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. -
టి20 ప్రపంచకప్ వాయిదా?
మెల్బోర్న్: కరోనా తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడనుందనే ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సన్నద్ధమవ్వాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆదేశాలు వచ్చినట్లు స్థానిక మీడియా ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించినట్లయింది. ఆసీస్ మీడియా కథనాల ప్రకారం లాజిస్టిక్ సమస్యల కారణంగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ వాయిదా వేసేందుకు ఐసీసీ సిద్ధమైందని... వారంలోపు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్టోబర్–నవంబర్ సమయాన్ని ఐపీఎల్ కోసం కేటాయించే అవకాశముంది. ‘టి20 వరల్డ్‌కప్ వాయిదాపై ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. కానీ సిరీస్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ కోసం భారత్ చేరుకుంటారు’ అని మీడియాలో వార్తలు వచ్చాయి. -
వర్సిటీల్లో పరీక్షలు రద్దు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియెట్, టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం కేలండర్‌ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్సీ కుహాద్ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. కొత్త ఎకడమిక్ కేలండర్పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందని హెచ్ఆర్డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీకి కొత్త మార్గదర్శకాలు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1–5 క్లాస్‌ల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6–12తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణతరగతుల్ని డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలి. 6–12తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్‌ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్‌కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. -
జూన్ 30న దీపిక–అతాను పెళ్లి
ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి ఆర్చరీ జంట దీపికా కుమారి, అతాను దాస్‌ల వివాహానికి ముహూర్తం కుదిరింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే ఈ నెల 30న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినా... వేర్వేరు కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గత సంవత్సరమే పెళ్లి చేసుకోవాలనుకున్నా బిజీ షెడ్యూల్ కారణంగా కుదర్లేదు. దాంతో టోక్యో ఒలింపిక్స్ ముగియగానే ఒకటి కావాలని భావించారు. అయితే కోవిడ్–19 కారణంగా ఒలింపిక్స్ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కరోనాతో కఠిన నిబంధనల మధ్య తక్కువ మంది అతిథులతోనే చేసుకోవాల్సి వస్తున్నా... ఇక వాయిదా వేసే పరిస్థితి లేదని, పెళ్లికి ఇంతకంటే సరైన సమయం లభించదని దీపిక వెల్లడించింది. -
ఐపీఎల్ ఆడేందుకు సిద్ధం: స్మిత్
సిడ్నీ: ఒకవేళ టి20 ప్రపంచకప్ వాయిదా పడితే ఐపీఎల్ ఆడేందుకు తాను సిద్ధమేనని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న స్మిత్ ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తే భారత్‌కు ప్రయాణించేందుకు అభ్యంతరం లేదన్నాడు. ‘వన్డే, టి20 ప్రపంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే అత్యున్నత గౌరవం. నా మొదటి ప్రాధాన్యం దానికే. ఒకవేళ వరల్డ్‌కప్ వాయిదా పడి దాని స్థానంలో ఐపీఎల్ జరిగితే ఆడేందుకు నేను సిద్ధం. కానీ అది మన చేతుల్లో లేదు. ప్రస్తుతానికి వరల్డ్‌కప్ భవితవ్యం ప్రభుత్వం, నిపుణుల సలహాలు సూచనలపై ఆధారపడి ఉంది’ అని స్మిత్ పేర్కొన్నాడు. బంతిని మెరిపించేందుకు లాలాజలం వాడకం నిషేధిస్తే బౌలర్లు తేలిపోతారని స్మిత్ అభిప్రాయపడ్డాడు. పింక్ బంతితో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం తమకు భారత్‌తో మ్యాచ్‌లో ఉపయోగపడుతుందని అన్నాడు. ‘బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీ సమాన స్థాయిలో ఉండాలని కోరుకునే వాళ్లలో నేనొక్కడిని. లాలాజలానికి ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం కష్టమే. ఈ విషయంలో ఐసీసీ ఏం ఆలోచిస్తుందో మరి. టీమిండియా కన్నా పింక్ బంతితో ఎక్కువగా మేమే ఆడాం. వారితో మ్యాచ్‌లో ఈ అనుభవం మాకు పనికొస్తుంది. కానీ భారత జట్టులో పరిస్థితులకు అనుగుణంగా సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్ ఉన్నారు’ అని స్మిత్ పేర్కొన్నాడు. -
జీ–7 కూటమిని జీ–10 చేయాలి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ–7 కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారు. భారత్ సహా మరో మూడు దేశాలను చేర్చి జీ–10 లేదంటే జీ–11 దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు. శనివారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో వెళుతూ ట్రంప్ విలేకరులతో ముచ్చటించారు. జూన్‌లో నిర్వహించాల్సిన జీ–7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. కోవిడ్–19 విజృంభిస్తున్న ఈ తరుణంలో అమెరికాలో ఈ సదస్సును ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇదొక కాలం చెల్లిన కూటమి ప్రపంచంలో ఏడు అభివృద్ధి చెందిన దేశాలతో జీ–7 కూటమి ఏర్పడింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో ఏర్పాటైన ఈ కూటమి ప్రతీ ఏడాది సమావేశమై అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరుపుతుంది. అయితే ఈ కూటమిని విస్తరించి ఇందులోకి ఆస్ట్రేలియా, భారత్, దక్షిణ కొరియాలను ఆహ్వానించాలని, రష్యాని కూడా తిరిగి కూటమి గూటిలోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ‘‘ప్రపంచంలో ఏం జరుగుతోందో చర్చించడానికి ఇప్పుడు సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సరైనది కాదు. ఈ కూటమికి కాలం చెల్లిపోయింది. కొత్త దేశాలను కలుపుకొనిపోవాల్సిన అవసరం ఉంది’’ అని ట్రంప్ అన్నారు. మళ్లీ మోదీకి ఆహ్వానం జీ–7 దేశాల వార్షిక సమావేశానికి ఈసారి అమెరికా అ«ధ్యక్షత వహిస్తోంది. గత ఏడాది ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు అధ్యక్షుడు మేక్రాన్ మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ ఏడాది జరిగే సదస్సుకి ట్రంప్ మోదీని ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రాభవం పెరుగుతోందని అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. -
వాయిదా వైపే అడుగులు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ నిర్వహణపై అందరూ భయపడినట్లే జరిగేలా ఉంది. ఇప్పటికే ఈ టోర్నీపై అనేక ఊహాగానాలు ప్రచారంలోకి రాగా ఇప్పుడవే నిజమయ్యేలా ఉన్నాయి. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్–నవంబర్ లలో జరగాల్సిన పొట్టి ప్రపంచకప్... 2022కి వాయిదా పడే అవకాశమున్నట్లు ఐసీసీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు సమావేశంలో ఈ అంశంపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ‘టి20 ప్రపంచకప్ వాయిదాకు ఎక్కువ అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నీని నిర్వహించలేం. బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే దాన్ని ప్రకటిస్తారా? లేదా? అనేది తెలియదు’ అని ఐసీసీ బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. మరోవైపు 2021లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ యథావిధిగా జరుగనుంది. ఈ ఏడాది జరుగనున్న టోర్నీని మాత్రమే 2022కు వాయిదా వేయనున్నారు. టోర్నీ వాయిదాపై నిర్ణయం తీసుకున్నట్లు వస్తోన్న వార్తలు సరైనవి కావని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మాత్రమే పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ‘ఇది కేవలం ఐసీసీ సభ్య దేశాల సమస్య మాత్రమే కాదు. ఐసీసీ ఈవెంట్స్‌తో పాటు ఐపీఎల్, భారత క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారహక్కులు దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ గురించి కూడా ఆలోచించాలి’ అని ఆయన అన్నారు. మరోవైపు ప్రపంచకప్ స్థానంలో ఐపీఎల్ నిర్వహణ అనేది భారత్‌లో పరిస్థితులపై ఆధారపడనుంది. ప్రేక్షకులు, విదేశీ ఆటగాళ్లకు ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు ఇలా అనేక అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచకప్‌నకు సంబంధించి పన్ను మినహాయింపుపై కూడా ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చించనుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పుడే స్పందించలేమని బీసీసీఐ పేర్కొంది. -
వాయిదాకి ఆస్కారం
ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా పండగ ఆస్కార్ వచ్చే ఏడాది జరిగేలా లేదని టాక్ వినిపిస్తోంది. కరోనా ప్రభావం వల్లే ఈ వాయిదా అట. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో లేదా మార్చి మొదటివారంలో ఆస్కార్ అవార్డ్స్ జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని ఆల్రెడీ అవార్డు కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆస్కార్ అనుకున్న తేదీకి జరగకపోవచ్చని తెలుస్తోంది. ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సినిమా నామినేట్ అవ్వాలంటే ఆ సినిమా కచ్చితంగా థియేటర్లో రిలీజ్ అయ్యుండాలి. కనీసం వారం రోజుల థియేట్రికల్ రన్ ఉంటేనే ఆ సినిమాను ఆస్కార్ కమిటీ ఎంపికకు పరిగణిస్తారు. అయితే థియేటర్లో విడుదల కాకపోయినా ఆస్కార్‌కి ఆస్కారం ఉందని ఆ మధ్య కమిటీ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదట. కచ్చితంగా థియేటర్లో విడుదలైన సినిమాలనే పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం కరోనా వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇలాంటి సమయంలో ఆస్కార్‌కి చిత్రాలను ఎలా ఎంపిక ఎలా చేస్తారు? అనేది ప్రశ్న. దాంతో ఆస్కార్ అవార్డ్ వేడుక కొత్త తేదీకి మారడం ఖాయం అని హాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. -
వరల్డ్ కప్ వాయిదా పడితే...
మెల్బోర్న్: కరోనా కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ఐసీసీ టోర్నీ స్థానంలో భారత్‌లో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమవుతుందని ఆయన అన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టి20 వరల్డ్‌కప్‌పై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఐపీఎల్ జరిగితే భారత్‌కు వెళ్లే బాధ్యత సదరు క్రికెటర్‌పైనే ఉంటుందని అన్నాడు. ‘నాకు తెలిసి వరల్డ్‌కప్ టోర్నీ కోసం 15 జట్లు ఆసీస్ రావడం ప్రస్తుత తరుణంలో చాలా కష్టం. ఇంకా 14 రోజులు ఐసోలేషన్ నిబంధన ఈ టోర్నీ నిర్వహణకు మరింత ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి టోర్నీని వాయిదా వేయాలని ఐసీసీ భావిస్తే... ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐకి అవకాశాలు మెరుగవుతాయి. జట్టంతా ఒక దేశం వెళ్లడం కంటే.. ఒక ఆటగాడు లీగ్ కోసం భారత్‌కు వెళ్లడం సులభంగా ఉంటుంది’ అని 55 ఏళ్ల టేలర్ వివరించారు. -
జేఈఈ, నీట్ తేదీలు ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షా తేదీల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం పరీక్షా తేదీలను వెల్లడించారు. జులై 18-23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక జులై 26న నీట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా వివిధ పరీక్షా తేదీలు వాయిదాపడ్డాయి. అయితే పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించగా, 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇదే అంశానికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని రమేష్ పోఖ్రియాల్ అన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. -
సివిల్స్ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇప్పటికే అన్ని పరీక్షలను రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు వాయిదా వేశాయి. సీబీఎస్సీ కూడా పరీక్షలను రద్దు చేసింది. అయితే తాజాగా మే31న జరగవల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020ని కూడా వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈ వారంలో విడుదల చేయాల్సి ఉండగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. తదుపరి వివరాలను మే 20న తెలియజేస్తామని తెలిపింది. (యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా..) కరోనా మహమ్మారి కారణంగా యూపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయలని సివిల్ సర్వీసస్‌కి తయారవుతున్న విద్యార్ధులు కోరగా దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని, దీని గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే విద్యార్ధులు పరీక్షల కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది కనుక ఆ విషయం పై మరోసారి ఆలోచిస్తామన్నారు. అయితే గత 4-5 సంవత్సరాలతో పోలీస్తే ఈ ఏడాది సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్ షెడ్యూల్ ముందుగానే ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తోన్న అనేక పరీక్షలను ఇప్పటికే వాయిదా వేసిన విషయం తెలిసిందే. (ఉద్యోగ పరీక్షలపైనా కరోనా ప్రభావం) -
జేఈఈ, నీట్ పరీక్షలపై ప్రకటన రేపు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం శుభవార్త వినిపించింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడిన జేఈఈ–మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణపై మే 5వ తేదీన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటన చేస్తారని, అదేరోజు కొందరు విద్యార్థులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడుతారని పేర్కొంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసేందుకు 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నవారు దాన్ని మార్చుకోవచ్చు.