దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ తొలి వన్డే వాయిదా | England vs South Africa First ODI postponed after positive COVID test | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ తొలి వన్డే వాయిదా

Published Sat, Dec 5 2020 2:24 AM | Last Updated on Sat, Dec 5 2020 4:54 AM

England vs South Africa  First ODI postponed after positive COVID test - Sakshi

కేప్‌టౌన్‌: ‘బయో బబుల్‌’లో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ప్లేయర్‌ కరోనా వైరస్‌ బారిన పడటంతో... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డేను ఆదివారానికి వాయిదా వేశారు. రెండు జట్ల ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, రెండు క్రికెట్‌ సంఘాలు తొలి వన్డే వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులు తెలిపాయి. దక్షిణాఫ్రికా జట్టులో కరోనా సోకిన ప్లేయర్‌ పేరును వెల్లడించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు క్రికెటర్లు వైరస్‌ బారిన పడ్డారు. ‘బయో బబుల్‌’ ఏర్పాటు చేయకముందు ఒకరికి వైరస్‌ రాగా... మూడో టి20 మ్యాచ్‌కు ముందు మరొకరికి వైరస్‌ సోకింది. షెడ్యూల్‌లో మార్పు కారణంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల్లో రెండు వన్డేలు ఆడాల్సి ఉంటుంది. బుధవారం జరిగే మూడో వన్డేతో ఇంగ్లండ్‌ పర్యటన ముగుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement