first oneday
-
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తొలి వన్డే వాయిదా
కేప్‌టౌన్: ‘బయో బబుల్’లో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ప్లేయర్ కరోనా వైరస్ బారిన పడటంతో... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డేను ఆదివారానికి వాయిదా వేశారు. రెండు జట్ల ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, రెండు క్రికెట్ సంఘాలు తొలి వన్డే వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తెలిపాయి. దక్షిణాఫ్రికా జట్టులో కరోనా సోకిన ప్లేయర్ పేరును వెల్లడించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు క్రికెటర్లు వైరస్ బారిన పడ్డారు. ‘బయో బబుల్’ ఏర్పాటు చేయకముందు ఒకరికి వైరస్ రాగా... మూడో టి20 మ్యాచ్‌కు ముందు మరొకరికి వైరస్ సోకింది. షెడ్యూల్లో మార్పు కారణంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల్లో రెండు వన్డేలు ఆడాల్సి ఉంటుంది. బుధవారం జరిగే మూడో వన్డేతో ఇంగ్లండ్ పర్యటన ముగుస్తుంది. -
పోరాడి ఓడిన టీమిండియా
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వన్డేలో శుభారంభం చేసి ట్వంటీ 20 సిరీస్ లో ఘోర ఓటమికి ముగింపు పలకాలన్న ధోనిసేన ఆశలు నెరవేరలేదు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (150; 133 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేసినా అతని పోరాటం వృథాగానే మిగిలింది. రోహిత్ కు తోడు అజింక్యా రహానే(60; 82 బంతుల్లో 5 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. రెండో వికెట్ కు రహానే-రోహిత్ ల జోడి 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినా చివర్లో టీమిండియా పూర్తిగా చతికిలబడి ఓటమిని మూటగట్టుకుంది. రోహిత్ అవుటైన వెంటేనే సురేష్ రైనా(3) , మహేంద్ర సింగ్ ధోని(31 ), స్టువర్ట్ బిన్నీ(2) లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో భారత్ నిర్ణీత ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్, రబడాలకు చెరో రెండు వికెట్లు లభించగా, స్టెయిన్, బెహర్దియన్, మోర్నీ మోర్కెల్ కు తలోవికెట్ దక్కింది. మలుపు తిప్పిన తాహీర్ టీమిండియా 46 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 269 పరుగులతో విజయం దిశగా కొనసాగుతున్నట్లు కనిపించినా.. . 47 ఓవర్ లో రోహిత్, రైనాలను స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ బోల్తా కొట్టించి దక్షిణాఫ్రికా జట్టు విజయావకాశాలను మెరుగుపరిచాడు. అనంతరం రబడా వేసిన ఓవర్ లో తొమ్మిది పరుగులు రావడంతో టీమిండియా విజయంపై మళ్లీ ఆశలు చిగురించాయి. అప్పటికి టీమిండియాకు 22 పరుగులు అవసరం, కాగా ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో బంతిని అందుకున్న స్టెయిన్ 11 పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్ కు 11 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ ను వేసిన రబడా తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులివ్వడంతో టీమిండియాపై ఒత్తిడి పడింది. దీంతో మరుసటి బంతికి బ్యాట్ ఝుళిపించిన ధోని పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాతి బంతికి బిన్నీ అవుట్ అయ్యాడు. ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ ఒక పరుగు మాత్రమే రాబట్టడంతో దక్షిణాఫ్రికా గెలుపు అనివార్యమైంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడింది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. డివిలియర్స్ (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు నిర్ణీత ఓవరల్లో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేశారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15), డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు. 40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా 109 పరుగులు చేసింది. నిరాశపరిచిన టీమిండియా బౌలింగ్ ట్వంటీ 20 సిరీస్ తరహాలోనే టీమిండియా బౌలింగ్ మరోసారి నిరాశపరిచింది. పూర్తి కోటా వేసిన భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ లు ఆకట్టుకోలేదు. 71 పరుగులను సమర్పించుకున్నఉమేష్ రెండు వికెట్లు మాత్రమే తీయగా, భువనేశ్వర్ 67 పరుగులిచ్చి వికెట్ కూడా తీయలేదు. ఇక స్టువర్ట్ బిన్నీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బందుకు గురిచేయలేదు. ఎనిమిది ఓవర్ల వేసిన బిన్నీ 63 పరుగులిచ్చాడు. ఇక స్పిన్నర్లు కాస్తలో కాస్త మెరుగనిపించారు. రవిచంద్రన్ అశ్విన్ 4.4 ఓవర్లలో వికెట్ తీసి 14 పరుగులివ్వగా, అమిత్ మిశ్రా 10 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 47 పరుగులిచ్చాడు.పార్ట్ టైం బౌలర్ సురేష్ రైనా ఏడు ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. వన్డే జట్టులోకి హర్భజన్ టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి వన్డేలో గాయపడటంతో తుది జట్టులో మరో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు స్థానం కల్పించారు. అశ్విన్ తన ఐదో ఓవర్ ను వేస్తున్న సమయంలో గాయపడ్డాడు. దీంతో హర్భజన్ ను వన్డే జాబితాలో స్థానం కల్పించారు. -
విజయం దిశగా టీమిండియా
కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల విజయలక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా 42 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 235 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఇంకా ధోని సేన విజయానికి 69 పరుగులు అవసరం. క్రీజ్ లో రోహిత్ శర్మ(123; 116 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (3) ఉన్నారు. అంతకుముందు విరాట్ కోహ్లి(11) , రహానే(60), శిఖర్ ధవన్(23) లు పెవిలియన్ కు చేరారు. -
రోహిత్ శర్మ సెంచరీ
కాన్పూర్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(101 బ్యాటింగ్; 100 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ నమోదు చేశాడు. ఆదిలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ ఆ తరువాత దూకుడును పెంచి శతకాన్ని సాధించాడు. దీంతో వన్డేల్లో రోహిత్ ఎనిమిదో సెంచరీని నెలకొల్పాడు. అజింక్యా రహానే(60) కలిసి రెండో వికెట్ కు 149 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో రోహిత్ సహకరించాడు. క్రీజ్ లో రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి(5) ఉన్నాడు. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా దీటుగా బదులిస్తోంది. 37 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 203 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
దీటుగా జవాబిస్తున్న టీమిండియా
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా దీటుగా జవాబిస్తోంది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి 176 పరుగులతోఆటను కొనసాగిస్తోంది. క్రీజ్ లో రోహిత్ శర్మ(92), అజింక్యా రహానే(50) లు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, చెత్త బౌంతులను బౌండరీ దాటిస్తున్నారు. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలోదూకుడుగా ఆడాడు. డివిలియర్స్ (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు మూడొందల మార్కును దాటారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15), డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు.40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా 109 పరుగులు చేసింది. -
నిలకడగా టీమిండియా బ్యాటింగ్
కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో 304 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 116 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(60) హాఫ్ సెంచరీతో ,అజింక్యా రహానే(24) లు క్రీజ్ లో ఉన్నారు. తొలి వికెట్ గా శిఖర్ ధవన్(23) పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలోదూకుడుగా ఆడాడు. డివిలియర్స్ (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు నిర్ణీత ఓవరల్లో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేశారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15), డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు.40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా 109 పరుగులు చేసింది. -
10 ఓవర్లలో టీమిండియా స్కోరు 59/1
కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి బరిలోకి దిగిన టీమిండియా 42 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (23) ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. క్రీజ్ లో రోహిత్ శర్మ(25), అజింక్యా రహానే(7) ఉన్నారు. ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (104) అజేయ సెంచరీతో ఆకట్టుకుని జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. -
బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
కాన్పూర్:దక్షిణాఫ్రికాతో ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా 304 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అంతకుముందు జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. -
టీమిండియాకు భారీలక్ష్యం
కాన్పూర్:ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 304 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలోదూకుడుగా ఆడాడు. డివిలియర్స్ (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు నిర్ణీత ఓవరల్లో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేశారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15), డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు.40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా 109 పరుగులు చేసింది. నిరాశపరిచిన టీమిండియా బౌలింగ్ ట్వంటీ 20 సిరీస్ తరహాలోనే టీమిండియా బౌలింగ్ మరోసారి నిరాశపరిచింది. పూర్తి కోటా వేసిన భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ లు ఆకట్టుకోలేదు. 71 పరుగులను సమర్పించుకున్నఉమేష్ రెండు వికెట్లు మాత్రమే తీయగా, భువనేశ్వర్ 67 పరుగులిచ్చి వికెట్ కూడా తీయలేదు. ఇక స్టువర్ట్ బిన్నీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బందుకు గురిచేయలేదు. ఎనిమిది ఓవర్ల వేసిన బిన్నీ 63 పరుగులిచ్చాడు. ఇక స్పిన్నర్లు కాస్తలో కాస్త మెరుగనిపించారు. రవిచంద్రన్ అశ్విన్ 4.4 ఓవర్లలో వికెట్ తీసి 14 పరుగులివ్వగా, అమిత్ మిశ్రా 10 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 47 పరుగులిచ్చాడు.పార్ట్ టైం బౌలర్ సురేష్ రైనా ఏడు ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. -
భారీస్కోరు దిశగా దక్షిణాఫ్రికా
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా 194 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు ఆదిలో కాస్త దూకుడును కనబరిచినా ఆపై కీలక వికెట్లను చేజార్చుకోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగించారు. అనంతరం మధ్య ఓవర్లలో మరోసారి దూకుడును పెంచిన సఫారీలు టీమిండిచా బౌలింగ్ పై ఎదురుదాడికి దిగుతూ స్కోరును పెంచే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (45), డేవిడ్ మిల్లర్(13) క్రీజ్ లో ఉండటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరును నమోదు చేసే అవకాశం ఉంది. అంతకుముందు డు ప్లెసిస్(62; 77 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసి మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా (37) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, అశ్విన్ లకు తలో వికెట్ లభించింది. -
డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్నతొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 30 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56 పరుగులు (69 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ 12 పరుగుల(19 బంతులు,)తో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. రైనా బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన డు ప్లెసిస్ అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అంతకుముందు ఓపెనర్ హషీం ఆమ్లా 37 పరుగులు(59 బంతులు, 3 ఫోర్లు) చేసి జట్టు స్కోరు 102 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన డివిలియర్స్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ డుప్లెసిస్‌కు సహకారం అందిస్తున్నాడు. మూడో వికెట్‌కు ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో అశ్విన్, అమిత్ మిశ్రాలు చెరో వికెట్ తీశారు. -
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
కాన్పూర్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు ఒక్క వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ ఆమ్లా 33 పరుగులు (50 బంతులు, 3 ఫోర్లు) డుప్లెసిస్ 29 (37 బంతులు, 3 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ డికాక్(29) ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. రెండో వికెట్‌కు ప్రస్తుతం వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆమ్లా మాత్రం ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్క వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు అంతగా రాణించలేకపోతున్నారు. కెప్టెన్ ధోనీ బౌలర్లను మార్చుతున్నప్పటికీ ఫలితాన్నివ్వకపోవడంతో సఫారీలు నింపాదిగా ఆడుతున్నారు. -
ఆచితూచి ఆడుతున్న సఫారీలు
కాన్పూర్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు ఒక్క వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆదివారం జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు ఓపెనర్ ఆమ్లా 16పరుగులు (24 బంతులు, 2 ఫోర్లు), డుప్లెసిస్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 29 పరుగులు(33 బంతులు, 5 ఫోర్లు) చేసి జట్టు స్కోర్ 45 వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు. తొలి నాలుగు ఓవర్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో రెండు ఫోర్లు బాది డికాక్ ప్రమాద సంకేతాలు పంపించాడు. కానీ ఆమ్లా మాత్రం రన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాడు. ధోనీ నమ్ముకున్న స్పిన్ అటాక్ మంత్రం ఫలించింది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అశ్విన్ చేతికి కెప్టెన్ ధోని బంతిని అందించాడు. అదే ఓవర్లో ఫస్ట్ స్లిప్‌లో రైనా అందుకున్న చక్కని క్యాచ్‌తో జోరుమీదున్న డికాక్‌ను పెవిలియన్ బాటపట్టాడు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్క వికెట్ తీశాడు. భువీ 5 ఓవర్లు వేసి 21 పరుగులివ్వగా, ఉమేశ్ కూడా వికెట్లేమీ తీయకుండా 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చాడు. -
బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. సఫారీ టీమ్ ఓపెనర్లుగా హషీం ఆమ్లా, క్వింగన్ డికాక్ బ్యాటింగ్‌కు దిగారు. భారత కెప్టెన్ ధోనీ బౌలర్ భువనేశ్వర్‌కు బంతి అందించాడు. ఇప్పటివరకూ భారత్‌లో ఇరు జట్ల మధ్య 23 వన్డేలు జరగగా, 13 మ్యాచ్‌లలో విజయం సాధించి 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. గత రికార్డు మెరుగ్గా ఉన్నప్పటికీ ఆటగాళ్ల ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. -
బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై సఫారీలు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాటింగ్‌పైనే టీమిండియా ఎక్కువగా దృష్టిపెట్టింది. అయితే, వన్డే సిరీస్‌లో స్టెయిన్, మోర్కెల్‌లాంటి దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్లు బరిలోకి దిగుతుండటం టీమిండియాకు మరింత ప్రతికూలంగా మారనుంది.