కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో 304 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 116 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ(60) హాఫ్ సెంచరీతో ,అజింక్యా రహానే(24) లు క్రీజ్ లో ఉన్నారు. తొలి వికెట్ గా శిఖర్ ధవన్(23) పెవిలియన్ కు చేరాడు.
అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలోదూకుడుగా ఆడాడు. డివిలియర్స్ (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు నిర్ణీత ఓవరల్లో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేశారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15), డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు.40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా 109 పరుగులు చేసింది.