మొత్తానికి ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తనకొక రాజకీయ పార్టీ ఉందని.. దానికీ ఆవిర్భావ దినం ఉందని యాదొచ్చింది. ఎంత సేపూ పార్టీని ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కోలా వాడుకోవడం మినహా.. పార్టీ నిర్మాణం.. పధ్ధతి.. దానికొక విధివిధానాలు లేకుండా నడుపుతూ.. పీస్ రేట్.. అంటే చేసినపని డబ్బు తీసుకునే కూలీ లెక్క పార్టీని నడుపుతూ వచ్చిన పవన్ కు ఇన్నేళ్లకు తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్న స్ఫురణకు రావడం గొప్పేనని క్యాడర్ అంటోంది.
2014లో జస్ట్ ఎన్నికల ముంది మార్చి 14 న కేవలం చంద్రబాబుకు సాయం చేయడం కోసమే అన్నట్లుగా ప్రారంభమైన ఈ జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జస్ట్ చంద్రబాబు కు మద్దతు ఇచ్చింది. చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యం అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో మొత్తానికి బాబును సీఎం చేసారు. అందరినీ ఒడ్డుకు చేర్చి తనుమాత్రం ఒంటరిగా మిగిలిన నావమాదిరి ఉండిపోయిన పవన్ ఆ ఐదేళ్లు.. సినిమాలు చేస్తూ గడిపేశారు. అప్పుడప్పుడు రావడం సినిమా కబుర్లు. స్కిట్లు చేయడం .. అరుపులు కేకలతో గడిపేశారు తప్ప పార్టీని ఏనాడూ నిర్మించలేదు.. అసలు అది అవసరం అనికూడా అనుకోలేదు. ఆ తరువాత 2019లో సింగిల్ గా పోటీ చేసిన జనసేన(Jana Sena) పార్టీ ఘోరమైన దెబ్బతిన్నది. ఆఖరుకు పవన్ సైతం భీమవరం.. గాజువాకలో ఓడిపోయారు.
ఆ ఐదేళ్లు అప్పుడప్పుడూ బయటకు రావడం. వకీల్ సాబ్(Vakreel Saab) వంటి సినిమాలు.. ఇప్పటం గ్రామంలో కారుమీదెక్కి రోడ్డు షో.. ఇలాంటివి చేస్తూ టైంపాస్ చేసారు టాప్ పార్టీ రాష్ట్ర.. జిల్లా కమిటీలు ఏమీ వేయలేదు. ఒక్కో ఎలక్షన్ కు ఇలా పార్టీని చంద్రబాబుకు అప్పగిస్తూ వెళ్తే పోయేదానికి పార్టీ నిర్మాణం ఎందుకు అనుకున్నారో ఏమో ఎన్నడూ ఆ విషయాన్నీ ఆలోచించలేదు. అసలు ఆపార్టీలో పవన్, నాదెండ్ల మినహా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి..
కానీ మొన్నటి 2024 ఎన్నికల సమయంలో నాగబాబు(Nagababu) మాత్రం ప్రధానకార్యదర్శి పేరిట హడావుడి చేయడం.. క్యూ ఆర్ కోడ్ చూపించి చందాలు వసూలు చేసారు తప్ప ఎక్కడా పార్టీ గురించి చర్చలేదు. పార్టీకి ఒక పధ్ధతి.. విధానం లేకున్నా ఇన్నాళ్లు నడిపేసినా.. ఇప్పుడు ఎట్టకేలకు.. అధికారం వచ్చాక పార్టీ గుర్తొచ్చినట్లుంది. మార్చి 12, 13,14 తేదీల్లో పార్టీ ప్లీనరీ.. ఆవిర్భావదినం పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే పార్టీ పెట్టిన పదేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారా ? అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు.. పార్టీ గుర్తొచ్చిందా..? అనే సౌండ్ వినిపిస్తోంది.
పోనీ ఇప్పుడైనా పార్టీకి జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తారా.. ఎమ్మెల్యే టిక్కెట్లు రానివాళ్లు.. గత పదేళ్లుగా పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నవాళ్లకు గుర్తింపు ఉంటుందా .. కేవలం పవన్ భజనకు మాత్రమే ఈ ప్లీనరీ నిర్వహిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం పవన్ కు పార్టీ గుర్తొచ్చిందనే కామెంట్లు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి..
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment