Plenary
-
పవన్‌కు మొత్తానికి గుర్తుకొచ్చింది!
మొత్తానికి ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తనకొక రాజకీయ పార్టీ ఉందని.. దానికీ ఆవిర్భావ దినం ఉందని యాదొచ్చింది. ఎంత సేపూ పార్టీని ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కోలా వాడుకోవడం మినహా.. పార్టీ నిర్మాణం.. పధ్ధతి.. దానికొక విధివిధానాలు లేకుండా నడుపుతూ.. పీస్ రేట్.. అంటే చేసినపని డబ్బు తీసుకునే కూలీ లెక్క పార్టీని నడుపుతూ వచ్చిన పవన్ కు ఇన్నేళ్లకు తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్న స్ఫురణకు రావడం గొప్పేనని క్యాడర్ అంటోంది.2014లో జస్ట్ ఎన్నికల ముంది మార్చి 14 న కేవలం చంద్రబాబుకు సాయం చేయడం కోసమే అన్నట్లుగా ప్రారంభమైన ఈ జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జస్ట్ చంద్రబాబు కు మద్దతు ఇచ్చింది. చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యం అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో మొత్తానికి బాబును సీఎం చేసారు. అందరినీ ఒడ్డుకు చేర్చి తనుమాత్రం ఒంటరిగా మిగిలిన నావమాదిరి ఉండిపోయిన పవన్ ఆ ఐదేళ్లు.. సినిమాలు చేస్తూ గడిపేశారు. అప్పుడప్పుడు రావడం సినిమా కబుర్లు. స్కిట్లు చేయడం .. అరుపులు కేకలతో గడిపేశారు తప్ప పార్టీని ఏనాడూ నిర్మించలేదు.. అసలు అది అవసరం అనికూడా అనుకోలేదు. ఆ తరువాత 2019లో సింగిల్ గా పోటీ చేసిన జనసేన(Jana Sena) పార్టీ ఘోరమైన దెబ్బతిన్నది. ఆఖరుకు పవన్ సైతం భీమవరం.. గాజువాకలో ఓడిపోయారు.ఆ ఐదేళ్లు అప్పుడప్పుడూ బయటకు రావడం. వకీల్ సాబ్(Vakreel Saab) వంటి సినిమాలు.. ఇప్పటం గ్రామంలో కారుమీదెక్కి రోడ్డు షో.. ఇలాంటివి చేస్తూ టైంపాస్ చేసారు టాప్ పార్టీ రాష్ట్ర.. జిల్లా కమిటీలు ఏమీ వేయలేదు. ఒక్కో ఎలక్షన్ కు ఇలా పార్టీని చంద్రబాబుకు అప్పగిస్తూ వెళ్తే పోయేదానికి పార్టీ నిర్మాణం ఎందుకు అనుకున్నారో ఏమో ఎన్నడూ ఆ విషయాన్నీ ఆలోచించలేదు. అసలు ఆపార్టీలో పవన్, నాదెండ్ల మినహా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి.. కానీ మొన్నటి 2024 ఎన్నికల సమయంలో నాగబాబు(Nagababu) మాత్రం ప్రధానకార్యదర్శి పేరిట హడావుడి చేయడం.. క్యూ ఆర్ కోడ్ చూపించి చందాలు వసూలు చేసారు తప్ప ఎక్కడా పార్టీ గురించి చర్చలేదు. పార్టీకి ఒక పధ్ధతి.. విధానం లేకున్నా ఇన్నాళ్లు నడిపేసినా.. ఇప్పుడు ఎట్టకేలకు.. అధికారం వచ్చాక పార్టీ గుర్తొచ్చినట్లుంది. మార్చి 12, 13,14 తేదీల్లో పార్టీ ప్లీనరీ.. ఆవిర్భావదినం పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే పార్టీ పెట్టిన పదేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారా ? అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు.. పార్టీ గుర్తొచ్చిందా..? అనే సౌండ్ వినిపిస్తోంది.పోనీ ఇప్పుడైనా పార్టీకి జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తారా.. ఎమ్మెల్యే టిక్కెట్లు రానివాళ్లు.. గత పదేళ్లుగా పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నవాళ్లకు గుర్తింపు ఉంటుందా .. కేవలం పవన్ భజనకు మాత్రమే ఈ ప్లీనరీ నిర్వహిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం పవన్ కు పార్టీ గుర్తొచ్చిందనే కామెంట్లు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.. :::సిమ్మాదిరప్పన్న -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
హైదరాబాద్ వర్షలపై బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన
-
పండుగలా ప్లీనరీలు
సాక్షి, హైదరాబాద్: మినీ ప్లీనరీల పేరిట రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రెండు రోజుల ముందు జరిగిన ఈ సభలకు వేల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో నియోజకవర్గ కేంద్రాల్లో సందడి నెలకొంది. వీధులన్నీ గులాబీమయం అయ్యాయి. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నెల రోజులుగా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న భారత్ రాష్ట్ర సమితి.. మంగళవారం ప్రతినిధుల సభలు నిర్వహించింది. ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సభకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగిన సభలకు సుమారు నాలుగు లక్షల మంది పార్టీ క్రియాశీల నేతలు హాజరైనట్లు బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సందడే సందడి ప్రతినిధుల సభలు పురస్కరించుకుని సుమారు 19 వేల జనావాసాల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేసి బీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగ నిర్వహించాయి. చాలా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు డప్పు చప్పుళ్లతో ర్యాలీగా తరలివచ్చారు. ఆటపాటలతో సభలను హోరెత్తించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు, అమరులకు, అమరుల స్తూపాలకు నివాళి వంటి కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా భోజనాలు వడ్డించి పార్టీ కేడర్‌తో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు నృత్యాలతో సందడి చేశారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఘనపూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఇల్లందులో ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ, కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు ప్రతినిధుల సభా వేదికలపై చేసిన నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. హాజరైన ముఖ్య నేతలు..అసంతృప్తులు దూరం సిరిసిల్ల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పొల్గొనగా, సిద్దిపేటతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సభలకు మంత్రి టి.హరీశ్‌రావు హాజరయ్యారు. మిర్యాలగూడలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాన్సువాడలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో జరిగిన సభల సమాచారాన్ని పార్టీ వర్గాలు సేకరించాయి. తాండూరు, స్టేషన్ ఘనపూర్, రామగుండంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఆసంతృప్త నేతలు ప్రతినిధుల సభలకు దూరంగా ఉన్నారు. ఆహ్వానం అందలేదని కొందరు దూరంగా ఉండగా, ఆహ్వానం అందినా హాజరు కావడం ఇష్టం లేక మరికొందరు దూరంగా ఉన్నట్టు సమాచారం. కేంద్రం, బీజేపీ తీరుపై ఘాటు విమర్శలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రతినిధుల సభల్లో తీర్మానాలు చేశారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి ఆయన పేరు తదితర నిర్ణయాలను స్వాగతించారు. మరోవైపు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష, బీజేపీ విధానాలు, వైఫల్యాలను ఎత్తి చూపుతూ తీర్మానాలు ఆమోదించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న తీరు, ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా వేధించడం తదితరాలను ఖండిస్తూ తీర్మానాలు చేశారు. ప్రతినిధుల సభల్లో ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని కేటీఆర్ సూచించగా, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఒక్కోచోట 10 నుంచి 15 వరకు తీర్మానాలు జరిగాయి. బీఆర్ఎస్ నేతలు తమ ప్రసంగాల్లో కేంద్రం, బీజేపీ తీరును తీవ్ర పదజాలంతో ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభలను అద్భుతంగా నిర్వహించిన పార్టీ యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ సభలను ఆత్మీయ వాతావరణంలో, క్రమశిక్షణతో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, పార్టీ పరిశీలకులను ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ రాష్ట్ర ప్లీనరీ తరహాలో పకడ్బందీగా ఒకేరోజు 119 నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు లక్షల మంది కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే మైలు రాయి వంటిదని అన్నారు. ఈ సభల్లో చర్చించిన అంశాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
కేసీఆర్ ఆకుపచ్చ చరిత్రను రాశారు
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: చరిత్రను కొందరు సిరాతో, మరికొందరు రక్తంతో రాస్తే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతు నాగలితో ఆకుపచ్చ చరిత్ర రాశారని.. దీనికి ప్రధానం కాళేశ్వరమని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ సమీపంలో మంగళవారం నిర్వహించిన సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మూగ జీవాలకు కూడా గ్రాసంలేని దుస్థితి ఉండేదని.. నేడు పది రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారని చెప్పారు. మన రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్నిధి పేరుతో కేంద్రం అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా... రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఉదయం కేసు వేస్తే.. సాయంత్రం ఫైల్ వెనక్కి పంపుతారా? యూనివర్సిటీల్లో నియామకాల కోసం ఉద్దేశించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఫైల్ ఆమోదించకుండా ఏడు నెలలుగా తొక్కిపెట్టిన గవర్నర్.. సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారని తెలిసి సాయంత్రం బిల్లులు వెనక్కి పంపడంలో కుట్ర స్పష్టంగా బయటపడిందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్‌ను వెనక్కి పంపడానికి గవర్నర్‌కు ఏడు నెలలు కావాలా? అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఫారెస్ట్రీ యూనివర్సిటీ ఫైల్‌ను సైతం ఆమోదించకుండా తొక్కిపెట్టి ఏడు నెలల తర్వాత వెనక్కి పంపడం అభివృద్ధిని అడ్డుకోవడం కాదా? అని మంత్రి నిలదీశారు. -
త్వరలో మరో ‘జోడో’!
నవా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): అదానీ వ్యవహారంలో మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. అధికార బీజేపీ నేతలు నిస్సిగ్గుగా అదానీ గ్రూపుకు ఏకంగా పార్లమెంటులోనే కొమ్ముకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వ్యాపార మిషతో వచ్చి భారత్‌ను ఆక్రమించిన ఈస్టిండియా కంపెనీతో అదానీ గ్రూపును పోల్చారు! అక్రమ మార్గాల్లో భారీగా సంపద పోగేసి దేశానికి వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు. దీనిపై మోదీ స్పందనేమిటని పార్లమెంటులో విపక్షాలన్నీ నిలదీస్తే అది తప్ప అన్ని విషయాలపైనా మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. ‘‘దీనిపై నిజం వెలుగు చూసేదాకా అదానీ గ్రూపు వ్యాపార పద్ధతులు తదితరాలపై ప్రశ్నస్త్రాలు సంధిస్తూనే ఉంటాం. అవసరమైతే పార్లమెంటులో వెయ్యిసార్లైనా దీన్ని ప్రస్తావిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఆదివారం రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజు ముగింపు సమావేశాలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘అదానీకి ఒక్కటే చెప్పదలచా. ఆయన కంపెనీ దేశానికి నష్టం చేస్తోంది. దేశ మౌలిక వసతులన్నింటినీ చెరబడుతోంది’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘పోర్టులు తదితరాలతో పాటు దేశ సంపదను చెరబట్టిన కంపెనీకి వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మేం చేస్తున్న పోరాటమిది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘చరిత్ర పునరావృతమవుతోంది. అవసరమైతే మరోసారి మరో కంపెనీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది’’ అని ప్రకటించారు. కాశ్మీరీల్లో దేశభక్తిని రగిల్చాం... భారత్ జోడో యాత్ర ద్వారా జరిగిన ‘తపస్సు’ తాలూకు స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘అందుకు కావాల్సిన వ్యూహాలు రూపొందించండి. దేశమంతటితో పాటు నేను కూడా వాటిలో భాగస్వామిని అవుతా’’ అని సూచించారు. తద్వారా త్వరలో మరో దేశవ్యాప్త యాత్ర ఉంటుందని సంకేతాలిచ్చారు. ‘‘జోడో యాత్రలో ప్రజలు లక్షలాదిగా పాల్గొన్నారు. యాత్ర పొడవునా నేనెంతో నేర్చుకున్నా. కన్యాకుమారిలో మొదలై కశ్మీర్ చేరేసరికి ఎంతగానో మారాను. మిగతా ప్రజలంతా ఆనందంగా ఉంటే కశ్మీరీలు మాత్రమే ఎందుకు బాధల్లో ఉన్నారని ఒక బాలుడు అడిగాడు. నా యాత్ర కాశ్మీర్లో ప్రవేశించాక పోలీసు సిబ్బంది పత్తా లేకుండా పోయారు. కానీ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు అంతటా వేలాదిగా కశ్మీరీలు త్రివర్ణం చేబూని నాతో పాటు నడిచారు. తానూ లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేశానని మోదీ చెప్పుకున్నారు. నాతోపాటు వేలాది మంది కాశ్మీరీలు లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. త్రివర్ణంపై కశీ్మరీల్లో ప్రేమను మోదీ తన వేధింపు చర్యల ద్వారా దూరం చేస్తే మేం దాన్ని వారిలో తిరిగి పాదుగొల్పాం. ఈ తేడాను ఆయన అర్థం చేసుకోలేకపోయారు’’ అని కాంగ్రెస్ ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య చెప్పుకొచ్చారు. సమైక్యంగా శ్రమిద్దాం... ఎన్నికల పరీక్ష నెగ్గుదాం ‘‘కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా చాలా కీలకం. ఆ ఎన్నికల్లో విజయానికి సమైక్యంగా, క్రమశిక్షణతో కృషి చేయండి’’ అని పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయ్‌పూర్ ప్లీనరీ పిలుపునిచ్చింది. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలకు చక్కని వేదిక సిద్ధం చేసుకుందామని పేర్కొంది. ఈ మేరకు ఐదు సూత్రాలతో రాయ్‌పూర్ డిక్లరేషన్‌ను ప్లీనరీ ఆమోదించింది. భావ సారూప్యమున్న పార్టీలతో నిర్మాణాత్మక ఉమ్మడి ప్రణాళికతో కలిసి పని చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, అది ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ పేర్కొంది. ‘‘బీజేపీ, ఆరెస్సెస్‌లతో, వాటి మోసపూరిత రాజకీయాలతో ఎన్నడూ రాజీ పడని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ నియంతృత్వానికి, మతవాద, ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు వ్యతిరేకంగా దేశ రాజకీయ విలువ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సమాజంలో చీలిక తెచ్చే యత్నాలు, రాజకీయ నియంతృత్వాలపై రాజీలేని పోరాటం చేస్తాం. ఇందుకోసం భావ సారూప్య పార్టీలతో కలిసి పని చేస్తాం’’ అని డిక్లరేషన్‌లో పేర్కొంది. పాసీఘాట్ నుంచి పోరుబందర్ దాకా...! తూర్పున అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసీఘాట్ నుంచి పశ్చిమాన గుజరాత్‌లోని పోరుబందర్ దాకా మరో దేశవ్యాప్త పాదయాత్ర చేసే యోచన ఉన్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ‘‘భారత్ జోడో యాత్ర సక్సెస్‌తో పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మరో యాత్ర కోసం కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నారు. అది జోడో యాత్రకు భిన్నంగా ఉంటుంది. దారి పొడవునా నదులు, దుర్గమారణ్యాలున్నందున చాలావరకు కాలినడకన, అక్కడక్కడా ఇతరత్రా సాగొచ్చు. జూన్‌కు ముందు గానీ, నవంబర్ ముందు గానీ కొత్త యాత్ర మొదలు కావచ్చు. కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు. -
సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు!..
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించిన సంగతి తెలిసింది. ఆ ప్రసంగంలో ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందనడంతో.. ఒక్కసారిగా ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.అంతేగాదు ఆమె క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ వివిధ ఊహగానాలు హల్చల్ చేశాయి. ఐతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకోలేదని మార్గదర్శక శక్తిగా కొనసాగుతుందని పార్టీ నాయకుడు ఆల్కా లాంబా ఆదివారం చత్తీస్‌గఢ్‌లో మూడో రోజు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారే తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదన్నారు. కాగా, సోనియా ప్లీనరీలో..1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి నా ఇన్నింగ్స్ భారత్‌జోడో యాత్రతో ముగించడం సంతోషంగా ఉంది. ఈ యాత్ర ఒక గొప్ప మలుపు. మా పార్టీ ప్రజలతో సంప్రదింపులు, సంభాషణల ద్వారా గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించింది. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి పోరాడటానికి సిద్దంగా ఉందనేది తెలియజేసింది. ఈ యాత్ర కోసం పోరాడిన కార్యకర్తలందరికీ అభినందనలు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐతే ఆమె పార్లమెంటు సీటు కోసం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి బరిలీకి దిగుతారా లేదా తదుపరి లోక్ సభ ఎన్నికలకై కూతుర ప్రియాంక కోసం సీటు వదులుకుంటారా అనే ఊహగానాలు హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..) -
అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..: ప్రియాంక గాంధీ
లోక్ సభ ఎన్నికలకు ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని ఆయా పార్టీలోని నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎక్కువ అంచనాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85 ప్లీనరీ సెషన్లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు ప్రతిపక్షాలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మన పార్టీ సందేశాన్ని ప్రభుత్వా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పోరాడుతున్న పార్టీ కార్యకర్తలను ప్రియాంక ప్రశంసించారు. ఈమేరకు ఆమె కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ..మీకు బీజేపీతో పోరాడే ధైర్యం ఉందని తెలుసు. దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చేసింది. మండల స్ఘాయి నుంచే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ఆ పార్టీ తమ నేతలకు దిశా నిర్దేశం చేసి కార్యాచరణ రూపొందించనట్లు తెలుస్తోంది. (చదవండి: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం) -
ప్రధాని మోదీ, అదానీ ఒక్కటే.. కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ ఫైర్..
రాయ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల మూడో రోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అదానీకి, మోదీకి సంబంధమేంటని పార్లమెంటులో తాను ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు వత్తాసుపలికేలా మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. అదానీ గురించి పార్లమెంటులో ప్రశ్నించవద్దని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ వాస్తవం ప్రజలకు తెలిసే వరకు తానూ ఈ విషయంపై ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు. 'భారత్ జోడో యాత్రలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రజలు, రైతుల సమస్యలు దగ్గరుండి చూశా. కులం, మతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచి జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ప్రజలు నాతోపాటు నడిచారు. ఈ యాత్ర నాకు పాఠాలు నేర్పింది. నాలుగు నెలల పాటు ఓ తపస్సులా ఈ యాత్ర సాగింది. కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపాము. కానీ బీజేపీ దాన్ని తీసుకెళ్లింది.' అని రాహుల్ వ్యాఖ్యానించారు. జైశంకర్‌పై ఆగ్రహం.. ఆర్థికంగా చైనాను భారత్ అధిగమించలేదని విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఆయనకు ఉన్న దేశభక్తి అని ప్రశ్నించారు. చైనాతో ఫైట్ చేయలేమని ఎలా అంటారని నిలదీశారు. ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. పార్టీని మండల, బ్లాక్ స్థాయిలో బలోపేతం చేయాలని, ఇది కాగితాలకే పరిమితం కావొద్దని చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సామాన్యుల పార్టీ అని ప్రజలకు తెలియజేయాలన్నారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ కలిసి ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. కమలం పార్టీని గద్దె దించేందుకు ఎంత ధైర్యం కావాలో తమకు తెలుసన్నారు. దేశ ప్రజల కోసం దాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు. చదవండి: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏఐసీసీ పదవులపై చర్చ .. కోమటిరెడ్డికి అవకాశం దక్కేనా? -
Sonia Gandhi: క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై?
రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ(76) క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా?. తాజాగా ఆమె చేసిన ప్రసంగం ఆంతర్యం అదేనా?.. రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించే పరోక్షంగా ఆమె ప్రస్తావించారా?. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించడం.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది ఇప్పుడు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో.. రెండవ రోజైన శనివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 15,000 మంది కాంగగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసిన ఆమె.. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపుగా ఆమె అభివర్ణించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ‘‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది. ఈ యాత్రను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు. ప్రత్యేకించి.. రాహుల్ గాంధీకి అని తెలిపారామె. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారామె. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయని ఆరోపించారు సోనియా గాంధీ. బీజేపీ విదేష్వాగ్ని రాజేస్తోందని, మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుంటోందని చెప్పారామె. రాజ్యాంగ నిర్దేశిత విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
ప్లీనరీలో జిన్‌పింగ్ వర్క్ రిపోర్ట్
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదివారం అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీ నిర్వహించారు. తన పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్తు దార్శనికతపై ఒక వర్క్ రిపోర్ట్‌ను ఈ సందర్భంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. కొన్ని కీలక విధానాలు, డాక్యుమెంట్లపై చర్చించారు. ఈ నెల 16న జరగబోయే కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ సదస్సుకు సన్నాహకంగా ఈ ప్లీనరీని నిర్వహించినట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గత పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సును ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు. చైనా అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో ఉండడానికి వీల్లేదు. కానీ, 2018లో రాజ్యాంగాన్ని సవరించారు. పదేళ్ల పదవీ కాలం నిబంధనను తొలగించారు. జిన్‌పింగ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా పదవీలో ఉండడానికి వీలు కల్పించారు. -
ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి వేగవంతం
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలో అమిత్ పాల్గొని ప్రసంగించారు. అవసరమైన చోట నిధుల సద్వినియోగం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడితే అభివృద్ధి ఫలాలు త్వరగా చేతికొస్తాయన్నారు. కేంద్రనిధులతో పాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమన్నారు. ‘ఇతర రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈశాన్య రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలి’ అని ఎన్ఈసీ చైర్మన్ హోదాలో అమిత్ సూచించారు. అమిత్, కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, 8 రాష్ట్రాల సీఎంలు పాల్గొని ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్యకర పోటీ అవసరం : కిషన్‌రెడ్డి కేంద్రం ఇస్తున్న 10 శాతం నిధుల సద్వినియోగం విషయంలో ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీతోపాటు ప్రత్యేక దృష్టిసారిస్తే çపురోగతి సాధ్యమని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 4,700 గ్రామాల్లో టెలికమ్యూనికేషన్ అనుసంధానత కోసం 500 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. -
NEC Meet 2022: ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరగాలి
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలో టూరిజం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గువాహటిలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల 70వ ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్)ను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి అన్నారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడిదారులకు అనువైన విధానపర నిర్ణయాలు, భూ బ్యాంకు డిజిటలీకరణ( అందుబాటులో ఎక్కడ ఎంత భూమి ఉంది), పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో నిబంధనల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. 19 కొత్త రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సంపూర్ణం కాదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘ ఈ రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం, రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ హైలైట్స్
-
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీకి భారీగా తరలివస్తున్న కార్యకర్తలు
-
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
-
గుంటూరులో ప్లీనరీ పండుగ
-
జనం జెండా.. వైఎస్సార్సీపీ నియోజకవర్గంల ప్లీనరీ సమావేశాలు 2022
-
కొడాలి దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు
YSRCP Plenary Meeting 2022 సాక్షి, కృష్ణా జిల్లా: కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని.. మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్నినాని పేర్కొన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న పేర్నినాని.. ‘‘కొడాలి నాని దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. నేను సీఎంని అవుతా.. సీఎం జగన్‌ను దించేస్తా అనే స్థాయి నుంచి.. ఇవాళ నానిని ఓడిస్తా అనే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. కానీ, ఇప్పుడు గుడివాడకు కొడాలి నాని ఒక బ్రాండ్ అంబాసిడర్. కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి.. ముందు పోటీకి ఎవరైనా అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి. కొడాలి నానికి భయపడి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. బాబే కాదు.. ఎంత మంది దిగొచ్చినా కొడాలిని ఏం చేయలేరు. పేదలకు ఇచ్చిన ఇంటిని నారా లోకేష్ బాత్రూమ్తో పోలుస్తున్నాడు. అక్రమ సంపాదనతో పెద్ద బాత్రూం కట్టించుకున్నావ్ కాబట్టే అలా మాట్లాడుతున్నావ్. పేదల సొంతింటి కల నెరవేర్చిన.. గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని పేర్ని నాని ప్రసంగించారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని, దీన్ని ఎవరూ చెక్కు చెదర్చలేరని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిందని.. మరో పాతికేళ్ల పాటు సీఎంగా ఉంటారని చెప్పారాయన. చంద్రబాబు తన దుష్ట చతుష్టయంతో కలిసి వచ్చినా.. కొడాలి నానిని ఓడించలేరని పేర్కొన్నారు. -
అందుకే చంద్రబాబును ప్రజలు సాగనంపారు: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: మంత్రికాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం అట్టహాసంగా సాగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ప్లీనరీ పరిశీలకులు సుకుమార్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ప్లీనరీ సమావేశం సాగింది. వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. ప్లీనరీ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌కి రోజురోజుకూ జనాదరణ పెరుగుతోంది. ఇది ఓర్వలేని టీడీపీ.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోంది. కార్యకర్తలు సంఘటితమై టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే చంద్రబాబును ప్రజలు సాగనంపారు. ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి సీఎం జగన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టింది. ప్రజా సమస్యల పరిష్కారానికే పనిచేస్తోంది. పేద పిల్లల భవిష్యత్ కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి పైన పచ్చ మీడియా విషం చిమ్ముతోంది అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: (‘ఆ ఘటన వెనుక ఎవరున్నారు?.. వారిద్దరూ ఎందుకు ఖండించలేదు’) -
టీఆర్ఎస్ నేతలకు షాక్.. ఫ్లెక్సీలపై పెనాల్టీలు
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ► మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్‌మారేడ్‌పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి. ► హైటెక్‌సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు. ► టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్‌హమీద్‌కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది. తగ్గేదేలే.. ► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు. ► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారని పోస్ట్‌చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ కోసం 7 కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల (ప్లీనరీ) ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు పోలీసు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి 24 మందితో 7 కమిటీలను కేటీఆర్ ఏర్పాటు చేశారు. ఆహ్వానితులను మొత్తం 22 కేటగిరీలుగా విభజించి వారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతించాలన్నారు. ఆహ్వానాలు అందుకున్న ప్రతినిధులంతా 27న ఉదయం 10 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకొని 11 గంటల్లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్లీనరీ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులేవీ కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 27న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగరేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాలను నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సమన్వయం చేయాలని, జంట నగరాల అలంకరణ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు కాదు.. పార్టీయే సుప్రీం పార్టీ నేతలతో భేటీలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై మండిపడ్డారు. ప్లీనరీకి తమ అనుమతి లేకుండా ఇతరులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయకుండా నిరోధించాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి సూచించగా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘ఎమ్మెల్యేలు తామే సుప్రీం అనుకుంటే కుదరదు. పార్టీయే సుప్రీం అనే విషయం గుర్తించాలి. పార్టీ లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు లేరు. ఇది రాచరికం కాదు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి రాజులు కాదు. ఇతరులకు దీటుగా మీరు కూడా ఏర్పాట్లు చేయండి. మరొకరు ఏర్పాట్లు చేయొద్దని చెప్పడం సరికాదు. ఉద్యమకారులం అని చెప్పుకుంటూ క్రమశిక్షణ తప్పితే కుదరదు. పాత, కొత్త నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి’ అని హితవు పలికారు. కమిటీలు ఇవీ... 1. ఆహ్వాన కమిటీ: సబితా ఇంద్రారెడ్డి (మంత్రి), రంజిత్‌రెడ్డి (ఎంపీ), అరికెపూడి గాంధీ (ఎమ్మెల్యే), విజయలక్ష్మి గద్వాల్ (మేయర్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఎమ్మెల్యే) 2. సభావేదిక ప్రాంగణం అలంకరణ కమిటీ: గోపీనాథ్ (ఎమ్మెల్యే), గ్యాదరి బాలమల్లు (టీఎస్ఐఐసీ చైర్మన్), మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి (పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్) 3. ప్రతినిధుల నమోదు, వలంటీర్ల కమిటీ: శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ), రావుల శ్రీధర్‌రెడ్డి (టీఎస్‌ఈఐడీసీ చైర్మన్), మన్నె క్రిషాంక్ (టీఎస్ఎండీసీ చైర్మన్) 4. పార్కింగ్ కమిటీ: కేపీ వివేక్ (ఎమ్మెల్యే),బండి రమేశ్ (రాష్ట్ర కార్యదర్శి), బొంతు రామ్మోహన్ (మాజీ మేయర్) 5. ప్రతినిధుల భోజన కమిటీ:మాధవరం కృష్ణారావు (ఎమ్మెల్యే), నవీన్‌రావు (ఎమ్మెల్సీ), ఎం. సుధీర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) 6. తీర్మానాల కమిటీ: మధుసూదనాచారి(ఎమ్మెల్సీ), పర్యాద కృష్ణమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ) 7. మీడియా కమిటీ: బాల్క సుమన్ (ఎమ్మెల్యే), భానుప్రసాద్ (ఎమ్మెల్సీ), కర్నె ప్రభాకర్(మాజీ ఎమ్మెల్సీ), గువ్వల బాలరాజు (విప్) -
AIADMK: అన్నాడీఎంకేలో ఉత్కంఠ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సంస్థాగత ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. వాయిదా వేస్తూ వస్తున్న ఎన్నికలను డిసెంబర్ 31వ తేదీలోగా ముగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. పార్టీ అధినేత్రి జయలలిత 2014లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అది జరగలేదు. 2020లో కరోనా కారణంగా వాయిదా వేశారు. 2021లో కరోనా రెండోదశ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల వల్ల నిర్వహించలేదు. జయలలిత మరణం తర్వాత సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. సంస్థాగత ఎన్నికలను వెంటనే జరపాలని అన్నాడీఎంకే నాయకుడు ఒకరు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు డిసెంబర్ 31వ తేదీలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు పార్టీ అధిష్టానం సమాయత్తమవుతోంది. చదవండి: (పోలీసులకు వీక్లీ ఆఫ్.. ఉత్తర్వులు జారీ) ముల్లైపెరియార్ జలాల వ్యవహారంలో తమిళనాడు హక్కులను కాపాడడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నెల 9న తేని, దిండుగల్లు, మదురై, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో అన్నాడీఎంకే ఆందోళన చేపట్టనుంది. ఈ ఆందోళన ముగియగానే పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కోకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ ప్రధా న కార్యాలయానికి చేరుకుని సంస్థాగత ఎన్నికల తేదీని ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం ప్రధానమైన రెండు పదవులకు కూడా ఎన్నికలు జరపాల్సి ఉంది. మరోవైపు శశికళను పార్టీలోకి తీసుకోవడమా, లేదా అనే చర్చ జరుగుతోంది. పార్టీలో శశికళకు స్థానం లేదని ఎడపాడి, అందరి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం గందరగోళానికి దారితీసింది. అంతేగాక జోడు పదవులు వద్దని, ఏక నాయకత్వ మే ముద్దు అనే నినాదం కూడా ఎంతోకాలంగా సాగుతోంది. అలాగే పార్టీలో ప్రతి ఒక్క కీలక పదవికీ పోటీ నెలకొనే పరిస్థితి ఉత్పన్నమైంది. పోటీ విషయంలో ఎవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేందుకు వీలులేదని పార్టీ హుకుం జారీచేసింది. శశికళ పునః ప్రవేశంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరని పరిస్థితుల్లో సర్వసభ్య సమావేశం సవాలుగా మారింది. పార్టీ సర్వసభ్య, కార్యవర్గ సమావేశాలు జరపాలంటే సీనియర్ నేతలతో పన్నీర్ సెల్వం, ఎడపాడి ఒకేసారి సమావేశం నిర్వహించి ఒక అభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి ఉంది. చదవండి: (మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్) ఏడాదికి ఒకసారి జనరల్ బాడీ సమావేశం, రెండుసార్లు కార్యవర్గ సమావేశం జరపాలి. కరోనా కారణంగా గత ఏడాది జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా ఎన్నికల కమిషన్ నుంచి గడువు పొందారు. డిసెంబరు 31వ తేదీన జనరల్ బాడీ సమావేశం జరపాలంటే ఈలోగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సంస్థాగత ఎన్నికలపై ఈ నెల 10వ తేదీన కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. -
ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం
-
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధం
-
ఆహ్వానితులకే టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్లీనరీకి ఆహ్వానాలు ఉన్న నాయకులనే అనుమతించనున్నారు. ఈ మేరకు ముఖ్యనేతలకు అధిష్టానం స్పష్టంచేసింది. ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) ప్రాంగణంలో ప్లీనరీని నిర్వహించనున్న విషయం తెలిసిందే. అధికారులు, పోలీసులు, ముఖ్యమైన పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ చర్చించారు. సభ జరిగే చోట చేపట్టాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ముఖ్యమంత్రి వేదిక వద్దకు చేరుకునే మార్గం, ట్రాఫిక్, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే పార్టీ నేతలు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సమావేశం సజావుగా సాగేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి 14 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతున్నందున అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. గందరగోళానికి తావు లేకుండా ప్లీనరీ సమావేశానికి ఆహ్వానాలు అందుకున్న వారు మాత్రమే హాజరయ్యేలా చూడాలని జిల్లాల వారీగా మంత్రులు, ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, సమావేశాల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పతాకాలు, అలంకరణ బాధ్యతను జీహెచ్ఎంసీ పరిధిలోని శాసనసభ్యులకు అప్పగించారు. సభ నిర్వహణ ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు పార్టీ తరఫున పలు కమిటీలు వేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆహ్వానాలు, సభావేదిక అలంకరణ, ప్రతినిధుల నమోదు, పార్కింగ్, ప్రతినిధుల భోజన ఏర్పాట్లు, తీర్మానాలు, మీడియా బాధ్యతలు చూసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలకు కమిటీల్లో భాగస్వామ్యం కల్పించారు. దేశానికే ఆదర్శం తెలంగాణ: కేటీఆర్ ప్లీనరీ ఏర్పాట్లపై హెచ్ఐసీసీ ప్రాంగణంలో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విభిన్న పాలసీలతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని అనుకరిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రైతుబంధు స్ఫూర్తితో ‘పీఎం కిసాన్ నిధి’, మిషన్ భగీరథ తరహాలో ‘జలజీవన్ మిషన్’వంటి కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్.. తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త విధానం ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. గతంలో ‘నేడు బెంగాల్ చేసే పనిని.. రేపు దేశం అనుసరిస్తుంది’అని చెప్పుకునేవారని, కానీ ప్రస్తుతం ‘నేడు తెలంగాణ చేసేది.. రేపు భారత్ అనుసరిస్తుంది’అన్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్లీనరీ నిర్వహణ కమిటీలు ఇవే! ►ఆహ్వాన కమిటీ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ►సభాస్థలి అలంకరణ: ఎమ్మెల్యే గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ►ప్రతినిధుల నమోదు: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. ►పార్కింగ్: ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్. ►ప్రతినిధుల భోజనం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ►తీర్మానాల కమిటీ: పార్టీ నేతలు మధుసూదనాచారి, పర్యాద కృష్ణమూర్తి ►మీడియా కమిటీ: ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. -
ఉద్యమపార్టీ దినోత్సవానికి తలనొప్పిగా మారిన కరోనా?
హైదరాబాద్: ఉద్యమ పార్టీగా మొదలై రాష్ట్ర సాధన లక్ష్యాన్ని సాధించడంతో పాటు ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేసుకునేలా, ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకున్న వ్యవస్థాపక దినోత్సవంపై టీఆర్ఎస్ తర్జనభర్జనలు పడుతోంది. గులాబీ పార్టీ గత ఏడాది ఏప్రిల్ 27 నాటికి 20వ ఏట అడుగు పెట్టింది. అయితే కోవిడ్ పరిస్థితుల మూలంగా అప్పుడు 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించని టీఆర్ఎస్ ఈ ఏడాది ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులతో తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో.. భారీ హంగామాతో ప్లీనరీ నిర్వహిస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్–19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాష్టప్రభుత్వం కూడా ఈ మేరకు పలు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలు, ఉత్సవాలు, ఊరేగింపులు తదితర సామూహిక కార్యక్రమాలపై ఈ నెలాఖరు వరకు ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నెల 27న పార్టీ ‘ప్లీనరీ’నిర్వహించే విషయంలో టీఆర్ఎస్ తర్జనభర్జనలు పడుతోంది. ఈ నెల రెండో వారం నాటికి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. లక్ష్యం చేరని సభ్యత్వం గతంలో 60 లక్షల మందిని పార్టీ సభ్యులుగా నమోదు చేసిన టీఆర్ఎస్.. ఈసారి నియోజకవర్గానికి 50 వేల మంది చొప్పున కనీసం 80 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో కనీసం 35 శాతం మందిని క్రియాశీల సభ్యులుగా చేర్చేలా ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్.. ఫిబ్రవరి 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 లక్షల మందికి పైగా సభ్యత్వం తీసుకోగా, పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈ మేరకు రూ.17 కోట్ల రుసుము చేరింది. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, పాలకుర్తి, బాల్కొండ, దుబ్బాక వంటి సుమారు 20 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లక్ష్యానికి మించి సభ్యత్వం నమోదు కాగా, చాలా నియోజకవర్గాల్లో 40 వేల లోపే సభ్యత్వాలు జరిగాయి. ఫిబ్రవరి 16 నుంచి శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల సందడి ప్రారంభం కావడం, ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల స్థానాలు 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండటంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగకపోగా, క్రియాశీల సభ్యత్వం ఏడు లక్షల లోపే నమోదైంది. దీంతో ఫిబ్రవరితోనే ముగిసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు కొనసాగించే యోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తికాని సంస్థాగత కమిటీల నిర్మాణం ఫిబ్రవరి నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి, మార్చి నెలాఖరులోగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే సభ్యత్వ నమోదు పూర్తి కాకపోగా, మండలి ఎన్నికల కారణంగా మార్చి నెలాఖరుకు కూడా సంస్థాగత కమిటీల నిర్మాణం కూడా ఎక్కడా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉమ్మడి నల్లగొండతో పాటు ఇతర జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. దీంతో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం కోసం మరికొంత సమయం కావాలని సభ్యత్వ నమోదు ఇన్చార్జీలు కోరినట్లు తెలిసింది. ఈ నెల 27న ప్లీనరీ నిర్వహించే పక్షంలో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నిర్మాణం ఈ నెల మూడో వారంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో సమీక్ష నిర్వహిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ప్లీనరీ నిర్వహణపై కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. -
ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోనే పాక్!
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ప్లీనరీ అక్టోబర్ 21–23 తేదీల్లో జరగనుంది. ఈ వర్చువల్ సదస్సులోనూ పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని నిర్ణయించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీలపై చర్యలు తీసుకోవాలనే విషయం సహా ఆరు షరతులను పాక్ నెరవేర్చకపోవడంతో ఆంక్షల విధింపునకు అవకాశమున్న గ్రే లిస్ట్‌లోనే పాక్‌ను కొనసాగించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నగదు అక్రమ రవాణాను, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకునే విషయంలో ఆయా దేశాల పనితీరు ఆధారంగా ఎఫ్ఏటీఎఫ్ సూచీలను రూపొందిస్తుంది. అలాగే, దేశంలోని ఉగ్రవాదులకు సంబంధించిన అధికారిక జాబితా నుంచి పాక్ 4 వేల పేర్లను తొలగించడాన్ని కూడా ఎఫ్ఏటీఎఫ్ పరిగణనలోకి తీసుకోనుంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే విషయానికి సంబంధించి మొత్తం 27 బాధ్యతలను ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను అప్పగించగా.. వాటిలో 21 బాధ్యతలను ఆ దేశం నెరవేర్చింది. మిగతా ఆరులో.. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదులుగా నిర్ధారించిన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, లష్కరే సంస్థ కమాండర్ జకీవుర్ రెహమాన్ లఖ్విలపై చర్యలు తీసుకోకపోవడం ఒకటి. ఆంక్షల కారణంగా పాకిస్తాన్‌కు ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఎటువంటి ఆర్థిక సాయం లభించదు. -
సంక్షోభం నుంచి స్వావలంబన
కోల్‌కతా: కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సాహసోపేత నిర్ణయాలకు, సాహసోపేత పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) 95వ వార్షిక ప్లీనరీని ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఇప్పటివరకు దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసి ఎగుమతి సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ స్వయం సమృద్ధికి గత ఐదారేళ్లుగా తన ప్రభుత్వ విధానాల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అయితే, ఈ దిశగా చర్యలను ఎలా మరింత వేగవంతం చేయాలో మనకు ఈ కోవిడ్–19 సంక్షోభం నేర్పించిందన్నారు. భారత ఆర్థిక రంగాన్ని నియంత్రిత వ్యవస్థ నుంచి క్రియాశీల వ్యవస్థ దిశగా మార్చాలని, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఉత్పత్తిని భారత్ తయారు చేయగలదనే పేరు సాధించాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక వర్తకులు, వ్యాపారవేత్తలను ప్రధాని ప్రశంసించారు. వారి వద్ద స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనడమంటే వారి సేవలను గుర్తించడమేనన్నారు. ప్రజా కేంద్రక, పర్యావరణ హిత అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని ప్రధాని గుర్తు చేశారు. రైతులు దేశంలో ఎక్కడైన తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కల్పించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల తాము తీసుకున్న నిర్ణయాలతో దేశ రైతాంగం, వ్యవసాయ రంగం దశాబ్దాల బానిసత్వం నుంచి బయటపడిందన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాను, ప్రతీ గ్రామాన్ని స్వయం సమృద్ధం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. భారతీయులు దేశీయ అవసరాలు తీర్చడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. వైద్య పరికరాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, బొగ్గు, ఖనిజాలు, వంట నూనె మొదలైన వాటిలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎమ్ఎస్ఎమ్ఈల నిర్వచనంలో మార్పు, కంపెనీల చట్టంలో సవరణలు, దివాళా చట్టం, నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలు.. తదితర సంస్కరణలను ప్రధాని ప్రస్తావించారు. -
ప్లీనరీ ధూంధాం..
-
గులాబీ ఘుమఘుమలు
-
గులాబీ ప్రస్థానం..!
-
కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి
-
‘స్టీరింగ్’ తిప్పేదెవరు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి సమయం ఆసన్నమైంది. రెండేళ్ల కోసం గతేడాది సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసినా.. కమిటీల ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు జిల్లా కమిటీలు వేశాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదివరకటి పూర్వ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయంను కొనసాగిస్తోంది. సీపీఐ, సీపీఎం రెండు పర్యాయాలు కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలను వేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఈద శంకర్‌రెడ్డి వ్యవహరించగా, జిల్లాల విభజన తర్వాత 20 నెలల క్రితం కొత్త కమిటీల ఏర్పాటు పేరిట ఉన్న కమిటీలను రద్దు చేశారు. పాత పద్ధతిలోనే జిల్లా కమిటీలు వేస్తారన్న చర్చ ఒకవైపు జరిగితే.. ఎమ్మెల్యేలు కన్వీనర్లుగా నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలతో సరిపెడతారన్న ప్రచారం కూడా జరిగింది. రెండు పద్ధతుల్లో ఏదీ కూడా అమల్లోకి రాకపోగా, మొక్కుబడిగా గ్రామ, కమిటీలతో సరిపెట్టారన్న చర్చ ఉంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, కోరుట్ల తదితర మున్సిపాలిటీల్లో చాలా వరకు వార్డు కమిటీలకు కూడా మోక్షం కలగలేదు. కాగా.. ఈనెల 27న టీఆర్ఎస్ 17వ ప్లీనరీని హైదరాబాద్‌లో జరపబోతున్నారన్న సమాచారం కార్యకర్తలకు చేరింది. అయితే.. ప్లీనరీలోపే అన్ని స్థాయిల్లో కమిటీలు వేయాలన్న ఆదేశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అసలు కమిటీలు వేస్తారా? పాత పద్ధతిలోనే జిల్లా కమిటీలు వేస్తారా? మధ్యలో ప్రకటించిన విధంగా నియోజకవర్గం కమిటీలతో సరిపెడతారా? ఇవేమీ చేయకుండానే ప్లీనరీకి వెళ్తారా? అన్న అంశాలు పార్టీ కేడర్‌లో చర్చనీయాంశాలుగా మారాయి. కేసీఆర్ వరకు వెళ్లి.. నిలిచిపోయిన జిల్లా కమిటీల ప్రకటన.. జిల్లా కమిటీలపై అన్ని రకాలుగా కసరత్తు చేసి ప్రకటనే తరువాయిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి జిల్లాల వారీగా కమిటీలను రూపొందించారు. పార్టీ జిల్లా కమిటీలకు అధ్యక్షునితో కలిపి 25 మంది, అనుబంధ సంఘాలకు 15 మంది చొప్పున ఉండేలా పార్టీ మార్గదర్శకాలు, సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా కమిటీలను రూపొందించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అప్పగించారు. ఈ మేరకు మంత్రులు రాజేందర్, కేటీఆర్‌లు పలు దఫాలు ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సేకరించిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏడుగురి పేర్లు వినిపించినా.. సీనియర్ టీఆర్ఎస్ నేత, మానకొండూరుకు చెందిన జీవీ రామకష్ణారావు (ఇటీవలే ‘సుడా’ చైర్మన్‌గా నియమితులయ్యారు) పేరు ఖరారు చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన కోరుకంటి చందర్, రఘువీర్‌సింగ్, వెంకటరమణారెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు వినిపించినా.. వెంకటరమణారెడ్డి పేరు ఓకే చేశారని అప్పట్లో ప్రచారం. రాజన్న సిరిసిల్ల నుంచి కల్వకుంట్ల గోపాల్‌రావు, మోహన్‌రెడ్డి, ప్రవీణ్, ఆగయ్యల పేర్లు వినిపించినా.. మాజీ జెడ్పీటీసీ తోట ఆగయ్య పేరు ఫైనల్ అయినట్లు వెల్లడించారు కూడా. జగిత్యాల నుంచి డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్, జువ్వాడి నర్సింగరావు, రాజేశం గౌడ్, బాదినేని రాజేందర్ పేర్లు ప్రతిపాదనకు రాగా.. ధర్మపురి జెడ్పీటీసీ భర్త, మాజీ ఎంపీపీ బాదినేని రాజేందర్ పేరును అధినేతకు కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీలపై ఇక సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటనే తరువాయి అనుకున్న తరుణంలో వాయిదా పడటం.. అప్పటి నుంచి ఆ కమిటీల ఊసెత్తకపోవడం పార్టీ కేడర్‌లో సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడటం లేదు. ఇదే సమయంలో అటు జిల్లా కమిటీలు వేయకుండా, ఇటు నియోజకవర్గం కమిటీల ఊసులేక కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. ప్రయోజనం లేని ‘పరిశీలకుల’ ప్రక్రియ.. నియోజకవర్గాల్లో అడుగుపెట్టని వైనం..గతంలో ఒక్కో జిల్లా కమిటీలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు 60 నుంచి 80 మందికి ప్రాతినిధ్యం ఉండేది. అదేవిధంగా మండల కమిటీలలోనూ పార్టీ కేడర్‌కు సంస్థాగత పదవులు దక్కేవి. కొత్తగా ఈసారి పార్టీ అధినేత కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన నియోజకవర్గం కమిటీలను కూడా వేయనున్నట్లు ప్రకటించగా, అందులోనూ చాలా మందికి పదవులు దక్కుతాయని అందరూ భావించారు. అయితే.. ఇవేమీ చేయకుండా 2017 అక్టోబర్ 26న పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుని ఈ జిల్లాకు చెందిన వారిని పొరుగు జిల్లాకు, పొరుగు జిల్లా నేతలను ఈ జిల్లాకు నియమించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. అదేవిధంగా హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్లలు, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరిని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను సిద్దిపేట, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఒక్కరిని నియమించారు. కాగా.. జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించాక కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ‘వి–కన్వెన్షన్’లో ఓ సమావేశం ఏర్పాటు చేయడం మినహా ఇప్పటికీ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగిన సందర్భాలు లేవు. ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నియోజకవర్గాల పరిశీలకులుగా నియమితులైన నేతలు ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. -
రాహుల్ నేర్వాల్సిన పాఠం
గత సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న తర్వాత అస్తిత్వ సంక్షోభంలో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీ తన 84వ ప్లీనరీ సమావేశాలను న్యూఢిల్లీలో మూడు రోజులపాటు జరుపుకుంది. కాంగ్రెస్ ఇప్పుడున్నంత బలహీనంగా గతంలో ఎప్పుడూ లేదు. లోక్‌సభలో ఆ పార్టీ బలం పట్టుమని 50 కూడా లేదు. దేశంలో ఇప్పుడు కేవలం మూడంటే మూడుచోట్ల మాత్రమే అధికారంలో ఉంది. అందులో కర్ణాటక ఒక్కటే చెప్పుకోదగ్గ రాష్ట్రం. మిగిలిన రెండూ–పుదుచ్చేరి, మిజోరం చిన్న రాష్ట్రాలే. ఇటీవలి ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఊరట. ఈ నేపథ్యంలో ప్లీనరీ చివరిరోజైన ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ్యులనుద్దేశించి గంటకుపైగానే మాట్లాడారు. కొన్ని కీలక సందర్భాల్లో తన ప్రవర్తనాశైలితోనూ, తోచినట్టు మాట్లాడే తన వైఖరితోనూ గతంలో పార్టీని ఇబ్బం దులపాలు చేసిన రాహుల్‌గాంధీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చాక క్రమేపీ మారుతూ వచ్చారు. అంతక్రితం ఆయన్ను ‘పప్పు’ అని సంబోధించినవారి నోళ్లు మూతబడే స్థాయిలో ఈ మార్పు కనబడటం మొదలైంది. స్వయంగా నేర్చుకుం టున్న పాఠాలో, సలహాదారుల చలవో... ఆయన తీరుతో దిగాలుపడి ఉన్న కాంగ్రె స్కు ఎంతో కొంత ఉత్సాహం పుట్టుకురావడమైతే నిజం. ముగింపు ప్రసంగం కూడా ఈ కొత్త ఒరవడినే చూపింది. బీజేపీ, ఆరెస్సెస్‌లను కౌరవులుగా తమ పార్టీని పాండ వులుగా అభివర్ణించి, వచ్చే సార్వత్రిక ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. అది సత్యానికి, అసత్యానికి మధ్య జరిగే సంగ్రామమని అభివర్ణించారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో ప్రయోజనాలు, అనుకూలతలు ఉన్నట్టే ఇబ్బందులు కూడా అధికమే. కీలక బాధ్యతల్లో ఉన్నవారు నిరంతరం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎక్కడేం జరుగుతున్నదో గమనించుకుంటూ దిద్దు బాటు చర్యలు తీసుకుంటూ ఉంటే నష్టాలను పరిమిత స్థాయికి తగ్గించుకోవచ్చు. అందుకు భిన్నంగా ఉంటే ఎదురు దెబ్బలు తప్పవు. గత సార్వత్రిక ఎన్నికల నాటికి వరసగా పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ కన్నూ, మిన్నూ కానని స్థితికి చేరుకుంది. పార్టీ ఎదుగుదల కాంక్షించి పనిచేసినవారిని శత్రువులుగా పరిగణించడం, భజనపరులను ప్రోత్సహించడం, వారు చెప్పినట్టల్లా నిర్ణయాలు తీసుకోవడం పెరిగిపోయింది. కనీసం వార్డు సభ్యులుగా గెలవ లేనివారు సైతం సోనియా విధేయులమని చెప్పుకుని ఓ వెలుగు వెలిగారు. అదే సమయంలో తన నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణల జోరు పెరుగుతున్నా పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి, సమర్ధించుకోవడానికి అది అప్పుడప్పుడు ప్రయత్నించక పోలేదుగానీ... అవి ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సమస్యలు వేరు. గోరక్షణ పేరిట, దేశభక్తి పేరిట, సంస్కృతి పేరిట పలు రాష్ట్రాల్లో మూక దాడులు పెరిగిపోతున్నా వాటిని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అది విఫలమైంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని వాటికి వ్యతిరేకంగా ప్రకటనలిచ్చేవరకూ కింది స్థాయి నాయకులు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో సమర్థించారు. ఇక పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వగైరాల వల్ల పౌరులు పడిన యాతనల విషయంలోనూ సరైన స్పందన లేదు. నీరవ్‌మోదీ తదితరులు దేశం విడిచి వెళ్లి పోవడంలాంటి ఉదంతాలు అప్రదిష్ట కలిగించాయి. ఈ నేపథ్యంలో సహజం గానే రాహుల్‌గాంధీ విమర్శల పదును పెరిగింది. అధికారంలో కొస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, పేదలకు చేకూరే లబ్ధిని ఆధార్‌తో అడ్డుకోకుండా చూస్తామని ప్లీనరీ భరోసా ఇచ్చింది. విపక్షంలో ఉన్నందువల్ల వచ్చిన వెసులుబాటు వల్ల విమర్శలు కురిపించడం బాగానే ఉన్నా... ప్రస్ఫుటమైన రీతిలో ఆత్మ విమర్శ కూడా అవసరమని, అది నోటిమాటగా మాత్రమేకాక ఆచరణలోనూ కనబడాలని గుర్తించడంలో మాత్రం రాహుల్ విఫలమయ్యారు. తాము ప్రస్తావించిన కుంభకోణాలకైనా, నిరుపేద జనాన్ని ఇబ్బందులపాలు చేస్తున్న ఆధార్కైనా మూలాలు తమ పాలనలోనే ఉన్నా యని రాహుల్ గుర్తించినట్టు లేరు. ఆధార్ ప్రాజెక్టును ప్రారంభించిననాడు నాటి ప్రధాని మన్మోహన్సింగ్ అదొక గుర్తింపు కార్డు మాత్రమేనని చెప్పారు. తీరా దాన్ని తప్పనిసరి చేస్తూ పోయింది ఆనాటి యూపీఏ ప్రభుత్వమే. రైతుల రుణాలు తాము అధికారంలోకొస్తే మాఫీ చేస్తామని చెబుతున్నారుగానీ... సాగుబడి వ్యయానికి ఒక టిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిషన్ నివేదికను యూపీఏ పాలనలో చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే వేలాదిమంది రైతుల విలువైన ప్రాణాలు దక్కేవి. వ్యవసాయం ఇంత గడ్డు స్థితికి చేరుకునేది కాదు. మరోసారి రుణమాఫీ అవసరమే వచ్చేది కాదు. పార్టీలో యువ రక్తాన్ని నింపి సంస్థాగతంగా దాన్ని బలోపేతం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలూ కృషి చేసే యువతీయువకులకు ఇకపై అగ్ర ప్రాధాన్యమిస్తామని... వారికి వృద్ధతరం నేతలు మార్గదర్శకులుగా ఉంటారని కూడా చెప్పారు. రివాజుకు భిన్నంగా ప్లీనరీ వేదికపై తాను తప్ప ఎవరూ లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతను కులాలు, మతాలకు అతీతంగా ఇక్కడకు తీసుకొస్తానని చెప్పారు. తీరా 24 మందితో కూడిన పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు కాకుండా నామినేట్ చేసే సంస్కృతినే కొనసాగిస్తూ ప్లీనరీ తీర్మానించింది. కేవలం గంభీరమైన ఉపన్యాసా లిచ్చి, ప్రత్యర్థులపై పిడుగులు కురిపించి తిరిగి గత వైభవాన్ని సాధించవచ్చ నుకుంటే రాహుల్ పొరబడినట్టే. మాటలకు తగ్గ చేతలు, విమర్శతోపాటు ఆత్మ విమర్శ ఉన్నప్పుడే పార్టీ పట్ల జనంలో విశ్వాసం పెరుగుతుంది. అధికారం దక్కడం మాట అటుంచి ముందు సంస్థాగతంగా బలోపేతమవుతుంది. ఆ సంగతి రాహుల్ గ్రహించాలి. -
నినాదాలు కాదు, విధానాలు కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము పాండవులమని, బీజేపీ వారు కౌరవులని, జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమేనంటూ చేసిన వ్యాఖ్యలకు పార్టీ కార్యకర్తలు భారీగానే చప్పట్లు కొట్టి ఉండవచ్చు. ఇలాంటి మాటలు ‘శబ్బాష్’ అంటూ ఎవరి భుజాలు వారు చరచుకోవడం లాంటిది. మంత్రాలకు చింతకాయలు ఎలా రాలవో, రాజకీయ నినాదాలకు ఓట్లు రాలవు. కాకపోతే కాస్త ప్రచారాన్ని కల్పిస్థాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సంక్షిప్త నామ పద పంధాల’ ప్రయోగం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కల్పించలేదన్న విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ఓ ఉద్యమమని కూడా ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ గాంధీ చెప్పుకున్నారు. స్వాతంత్య్రానికి ముందే తప్ప స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ నడిచిందీ ఉద్యమంపై కానేకాదని విషయాన్ని మరచిపోవద్దు. పైగా దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినదీ కాంగ్రెస్ పార్టీయే కనుక దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు బాధ్యత వహించకా తప్పదు. ప్రస్తుత పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఏడాదిలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం ఎంత కష్టమో ముందుగా గుర్తించాలి. అది అందుకోవడానికి ఎంతగా కృషి చేయాలో, ఓ ఉద్యమంగా ఎలా ప్రజల్లోకి దూసుకుపోవాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ విడమర్చి వివరిస్తే బాగుండేది. వారికి నమ్మకాన్ని కుదిరిస్తే మరీ బాగుండేది. ఆక్సిజన్ గొట్టంతో ఊపిరి పీల్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు సమకూర్చేందుకు ఎలాంటి సమగ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో ఆలోచించాలి. అందుకు తగిన కార్యాచరణను కార్యకర్తల ముందుకు తీసుకరావాలి. వారిని కార్యోన్ముఖులను చేయాలి. పార్టీ ప్రస్తుతమున్న పరిస్థితి గురించి కార్యకర్తలకు వాస్తవం చెప్పడానికి ప్లీనరీకన్నా మంచి వేదిక ఉండదు. ఆకర్షణీయమైన నినాదాలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్లీనర్ సమయాన్ని వృధా చేస్తే ఆ తర్వాత పశ్చాత్తాపానికి అవకాశం కూడా ఉండదు. వచ్చే ఎన్నికల్లో భావ సారూప్యత గల పార్టీలతో కలిసి ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ప్రాతిపదిక పోరాడేందుకు ప్లీనరీలో తీర్మానం తీసుకరావాలి. ఈ దిశగా ఇటీవల సోనియా గాంధీ ఏర్పాటు చేసిన భావసారూప్య పార్టీల నేతల సమావేశానికి దాదాపు 20 పార్టీల నేతలు హాజరైనప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన మంత్రి పదవికి రాహుల్ అభ్యర్థిత్వం పట్ల అభ్యంతరం ఉండడమే అందుకు కారణం. ముందుగా వారిని ఒక తాటిపైకి తీసుకరావాలి. అవసరమైతే ప్రధాని అభ్యర్థిని ఎన్నికల అనంతరం ఎన్నుకునేందుకు సిద్ధపడాలి! అందుకు ప్రమాణాలను నిర్దేశించుకొని అందుకు కట్టుబడి పనిచేయాలి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉన్న నేటి పరిస్థితుల్లోనే బీజేపీని కొట్టగలగాలి. లేకపోతే చేతులు కాలక తప్పదు. -
మాది ధర్మ పోరాటం
న్యూఢిల్లీ: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి అడుగు వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, ప్రత్యర్థి పార్టీ బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆరెస్సెస్, ప్రధాన ప్రత్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.. లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో జరిగిన ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆదివారం పదునైన విమర్శలతో నిప్పులు చెరిగారు. మహాభారతాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ, ఆరెస్సెస్‌లు అధికార దాహంతో ఉన్న కౌరవులుగా, కాంగ్రెస్ పార్టీ వారు సత్యం కోసం ధర్మపోరాటం చేస్తున్న పాండవులుగా అభివర్ణించారు. బీజేపీ ఆరెస్సెస్ గొంతుక అయితే.. తమది ప్రజావాణి అని చురకలంటించారు. ఎన్డీయే ప్రభుత్వ పలు నిర్ణయాలనూ రాహుల్ తప్పుబట్టారు. దాదాపు గంటపాటు ఆయన ప్రసంగించారు. అనంతరం సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకునే సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కు కట్టబెడుతూ.. తీర్మానాన్ని ఆమోదించారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. మోదీ.. నిలువెల్లా అవినీతి! ‘ప్రధాని వాస్తవ సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టిస్తూ.. సన్నిహితులైన పెట్టుబడిదారులకు లాభం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ మోదీ పేరుతోనే ఇద్దరు (నీరవ్, లలిత్) తీవ్రమైన అవినీతి కేసుల్లో దోషులుగా ఉన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా రాఫెల్ ఒప్పందంలో మార్పులు చేశారు. కాంగ్రెస్ 126 రాఫెల్ యుద్ధ విమానాలకోసం చర్చలు జరిపితే.. బీజేపీ అదే మొత్తంతో కేవలం 36 యుద్ధ విమానాలను మాత్రమే కొనుగోలు చేస్తోంది. మేం ఒక్కో విమానానికి రూ. 570 కోట్లు పెడితే.. మోదీ అదే విమానానికి రూ.1670 కోట్లు పెడుతున్నారు. మోదీ అవినీతిపై పోరాడటం లేదు. అవినీతికి పాల్పడుతున్నారు’ కురుక్షేత్రను తలపించేలా..: ‘శతాబ్దాల క్రితం కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. కౌరవులు బలవంతులు, అహంకారులు. పాండవులు ధర్మం కోసం పోరాడారు. కౌరవుల్లాగే ఆరెస్సెస్, బీజేపీలది అధికార దాహం. పాండవుల్లాగా కాంగ్రెస్ పార్టీది సత్యం కోసం చేస్తున్న ధర్మపోరాటం’ ‘సుప్రీం’ తిరుగుబాటుపై..: ‘బీజేపీ భయాందోళనలు సృష్టిస్తోంది. మీడియా కూడా భయపడిపోతోంది. తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య చాలా తేడా ఉంది’ ఆ మోదీ, ఈ మోదీ కలిసి..: ‘నిజాయితీగా ఉన్న వ్యాపారుల నోళ్లను మూయించి.. వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని అధికారులతో లూటీ చేయిస్తున్నారు. వీరు బ్యాంకుల నుంచి రూ.33వేల కోట్లు దోపిడీ చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. భారత్‌లోని బడా వ్యాపారవేత్తలు, ప్రధాన మంత్రి పదవికి మధ్య లోపాయకారి ఒప్పందానికి మోదీ అనే పేరు ఓ గుర్తుగా మారిపోయింది. ఈ మోదీ.. మరో మోదీకి 30వేల కోట్ల ప్రజాధనాన్ని ఇస్తారు. ప్రతిగా ఆ మోదీ.. ఈ మోదీకి ఎన్నికల మార్కెటింగ్‌కు అవసరమైంది ఇస్తాడు’ రైతులు, మైనార్టీలు, గౌరీ లంకేశ్‌పై..: ‘గౌరీలంకేశ్, కల్బుర్గీలు ప్రశ్నించినందుకే చనిపోవాల్సి వచ్చింది. ఒకవైపు రైతులు సరైన గిట్టుబాటులేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పదండి యోగా చేద్దామని మోదీ పిలుపునివ్వటం సిగ్గుచేటు కాదా? పాకిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడక ఇక్కడే ఉండిపోయిన వారిని వెళ్లిపోండని బెదిరిస్తున్నారు. తమిళులను వారి భాషను మార్చుకోవాలని బెదిరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆహారం తమకు నచ్చదంటున్నారు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలో వీళ్లే నిర్ణయిస్తున్నారు’ యువత గురించి: ‘భారత్‌లోని ప్రతి యువతకూ మేం ఓ ఆయుధం. కాంగ్రెస్ పార్టీ మీది. మీ మేధస్సు, ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు మేం ద్వారాలు తెరుస్తాం. దేశానికి మీ (యువత) అవసరం చాలా ఉంది. ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అచ్ఛేదిన్, మీ అకౌంట్లలోకి రూ.15లక్షలు ఇవన్నీ బూటకమే’ యూపీఏ పాలనపై..: ‘ యూపీఏ–2 చివరి రోజుల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. మేం కూడా మనుషులమే. పొరపాట్లు చేస్తాం. బీజేపీతో పోలిస్తే మేం విభిన్నం. దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మాకే ఉంది. మోదీ తను దేవుని ప్రతిరూపం అని భావిస్తున్నారు’ కాంగ్రెస్ పునరుత్తేజంపై..: ‘మనం కాంగ్రెస్‌లో మార్పు తీసుకురావాలి. నాయకులు, కార్యకర్తల మధ్యనున్న అడ్డుగోడలను తొలగిస్తాను. ఇందుకోసం సీనియర్ల సలహాలతో ముందుకెళ్దాం. మన మధ్యనున్న విభేదాలు, గ్రూపు తగాదాలను పక్కనపెడదాం. 2019లో కాంగ్రెస్ ఆలోచనవిధానానిదే విజయం. అవసరమైతే రైతు రుణమాఫీ చేస్తాం’ నోట్ల రద్దు అతిపెద్ద వైఫల్యం మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందనీ, అసమర్థ ఆర్థిక నిర్వాహకుల చేతి నుంచి దేశాన్ని కాపాడినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత చిదంబరం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడమే మార్గమని ఇందులో పేర్కొన్నారు. ఆర్థికం.. సర్వనాశనం: మన్మోహన్ న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్లీనరీలో తీవ్రంగా విమర్శించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంటూ.. భ్రమలు కల్పించి మోసం చేసిందన్నారు. ‘ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా మోదీ సర్కారు నెరవేర్చలేకపోయింది. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి తప్పుడు నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఉత్పత్తి మందగించింది. ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఆరేళ్లలో రైతు రాబడి రెండింతలు కావాలంటే ఏడాదికి వృద్ధి రేటు కనీసం 12 శాతం ఉండాలి. ఇది ప్రస్తుతం అసాధ్యం’ అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యకు మోదీ ప్రభుత్వం అతితక్కువ ప్రాధాన్యం ఇస్తోందనీ, దాంతో ఈ అంశం ఎన్నడూ లేనంత జటిలంగా తయారైందని మండిపడ్డారు. సరిహద్దులు సురక్షితంగా లేవనీ, సీమాంతర, అంతర్గత ఉగ్రవాదం, కల్లోల పరిస్థితులపై ప్రతిపౌరుడూ ఆందోళన చెందుతున్నాడని అన్నారు. -
మోదీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
-
ఎర్రకోటలో రాహుల్ జాతీయ జెండావిష్కరణ!
న్యూఢిల్లీ : 2019 సంవత్సరంలో ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు రాహుల్‌గాంధీ సిద్ధం కావాలని, ఆయనను కార్యకర్తలు ప్రధానమంత్రిని చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఢిల్లీలో జరగుతున్న కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీలో సిద్దూ మాట్లాడారు. ప్రధానిగా ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేసేందుకు రాహుల్ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ‘ ప్రధానమంత్రి మాజీ కాగలడు. ఎంపీ మాజీ కాగలడు. ఎమ్మెల్యే మాజీ కాగలడు. కానీ ఒక కార్యకర్త ఎప్పుడూ మాజీ కాబోడు. కార్యకర్తలను రాహుల్ అక్కున చేర్చుకోవాలి. వారే ఎర్రకోటపై రాహుల్ జెండా ఎగురవేసేలా చేస్తారు’ అని అన్నారు. బీజేపీ ఎంత రచ్చ చేస్తున్నా.. కనీసం మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండి చేసినంత అభివృద్ధి కూడా చేయలేకపోతోందని చమత్కరించారు. దీంతో సోనియాగాంధీ, అశోక్ గెహ్లాట్ నవ్వుల్లో మునిగిపోయారు. -
అక్కడ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మండిపడ్డారు. ఎన్నికల్లో మోదీ ఇచ్చిన రెండుకోట్ల ఉద్యోగాల హామీ వట్టి అభూత కల్పనగా మారిందని విరుచుకుపడ్డారు. ‘మోదీజీ ఎన్నికల ప్రచారంలో ఎన్నో పెద్దపెద్ద హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటీ కూడా నెరవేర్చలేదు. ఆయన రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కనీసం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. వచ్చే ఆరేళ్లలో రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని మోదీ ఆనాడు చెప్పారు. కానీ అందుకు పూర్తి తలకిందులుగా పరిస్థితి ఇప్పుడు ఉంది’ అని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మన్మోహన్ మాట్లాడారు. గతంలో ఎన్నడూలేనివిధంగా జమ్మూకశ్మీర్ విషయంలో మోదీ అసమర్థ విధానాలను అవలంబిస్తోందని, మోదీ సర్కారు మిస్మేనేజ్మెంట్ వల్లే కశ్మీర్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని నిప్పులు చెరిగారు. ‘పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మన సరిహద్దులు అంత సురక్షితంగా లేవు. సీమాంతర ఉగ్రవాదం, లేదా అంతర్గత పరిస్థితులు ఇందుకు కారణం’ అని ఆయన అన్నారు. మోదీ సర్కారు చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని మన్మోహన్ తప్పుబట్టారు. పెద్దనోట్ల రద్దు తప్పుడు పరిగణన అని, జీఎస్టీని ఆదరాబాదరాగా అమలుచేశారని మండిపడ్డారు. -
నేడు ఢిల్లోలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు
-
మార్చి 16 నుంచి కాంగ్రెస్ జాతీయ ప్లీనరీ..
సాక్షి, న్యూఢిల్లీ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ తేదీలు ఖరారయ్యాయి. మార్చి 16 నుంచి 18 వరకు ఢిల్లీలో జాతీయ ప్లీనం జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు శనివారం ఒక ప్రకటన చేశాయి. జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు ఆమోదం తెలపడం, నూతన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏర్పాటు లాంటి తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ ఈ సమావేశాలను కీలకంగా భావిస్తున్నది. కాగా, ప్లీనరీ నిర్వహణ కోసం 34 మంది సభ్యులతో ఏర్పాటయిన స్టీరింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం దక్కకపోవడం గమనార్హం. -
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ముస్లిం పర్సనల్ లా బోర్డు జాతీయ అధ్యక్షుడు మౌలానా రాబె హసనీ నద్వీ విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై ముస్లిం సముదాయంలోని అన్ని వర్గాలు సంఘటితమై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని సాలారే మిల్లత్ ఆడిటోరియంలో జరుగుతున్న ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాల్లో శనివారం బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నద్వీ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ముస్లింల ధార్మిక, షరియత్ హక్కులను మార్చడానికి కేంద్రం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నాలను ముస్లిం సముదాయం తిప్పికొట్టాలన్నారు. కేంద్ర వైఖరిపై ముస్లిం సమాజం, ముస్లిం సంస్థలు, బోర్డులు మౌనం పాటించడం సరికాదన్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలు చేయడం అందరి బాధ్యత అన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాబ్రీ మసీదు శతాబ్దాలుగా ముస్లింల మసీదుగానే ఉందని, ప్రభుత్వాలు దీన్ని మార్చడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించడం సరికాదన్నారు. పెరుగుతోన్న మతతత్వం బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రహ్మెనీ మాట్లాడుతూ.. దేశంలో రోజు రోజుకూ మతతత్వం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా 4.40 కోట్ల దరఖాస్తులను కమిషన్‌కు అందించామన్నారు. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సూచనలపై సమీక్షించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ బిల్లు వల్ల కలిగే నష్టం గురించి రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి కూడా తెలిపామన్నారు. కార్యక్రమంలో బోర్డు ఉపాధ్యక్షుడు మౌలానా సయిద్ ఉమ్రీ, కార్యదర్శులు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మెనీ, మౌలానా సయ్యద్ ఆర్షద్ మదనీ, ప్లీనరీ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి 3 రోజుల పాటు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ముస్లిం పర్సనల్ లా అధికార ప్రతినిధి సజ్జాద్ నౌమానీ తెలిపారు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాల్లో పలు ముస్లిం ధార్మిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొంటారన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, బాబ్రీ మసీదు, షరియత్‌లో కేంద్రం జోక్యం అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. కాగా 16 ఏళ్ల అనంతరం ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలకు హైదరాబాద్ నగరం వేదిక అయిందన్నారు. గతంలో 2002లో నగరంలో సమావేశం జరిగిందన్నారు. సమావేశ వివరాలివీ...: కంచన్‌బాగ్ సాలార్ మిల్లెత్ ఆడిటోరియంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని నౌమానీ చెప్పారు. తొలిరోజు మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ సభ్యుల సమావేశం, సాయంత్రం పలు రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు. రెండోరోజు ప్రతినిధుల చర్చలు ఉంటాయన్నారు. అదేరోజు ప్లీనరీ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు. చివరి రోజు సాయంత్రం దారుస్సలాంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బోర్డు కార్యదర్శి మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మానీ, మజ్లిస్ అధినేత, సమావేశాల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. -
త్వరలో జనసేన ప్లీనరీ
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ త్వరలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ మీడియా విభాగం హెడ్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్లీనరీ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించా లన్న అంశంపై కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై అధినేత తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు రెండు రాష్ట్రాల్లో పవన్ పర్యటనపైనా సమావేశంలో చర్చించినట్టు పేర్కొన్నారు. -
పాము కంటే బాబు ప్రమాదం
♦ ప్లీనరీ విజయవంతంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ ♦ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా ? ♦ నవరత్నాల్లాంటి పథకాలతో వైఎస్ పాలన ♦ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు గుంటూరు (పట్నం బజార్): పాము కాటుకు మందుందేమోగానీ సీఎం చంద్రబాబు విషకౌగిలికి మందు లేదని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. కొందరు చంద్రబాబు ఎంగిలికూటికి కక్కుర్తిపడి వెళ్లిపోయినంత మాత్రాన ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించగలరా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో రూ.3 లక్షల 70 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిని మాయ చేసేందుకు వారికి సంబంధించిన కొన్ని పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో సైతం నీచ రాజకీయాలకు నాంది పలుకుతున్నారని ధ్వజమెత్తారు. మహానాడును విశాఖ కుంభకోణం డబ్బుతో నిర్వహించారా ? నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్లీనరీని టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. ఇంటిలిజెన్స్ వర్గాలే తొలి రోజు 40 నుంచి 50 వేల మంది వచ్చారని చెప్పాయన్నారు. ప్లీనరీని అవినీతి డబ్బుతో నిర్వహించారని వ్యాఖ్యలు చేస్తున్న అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మహానాడును విశాఖలో వచ్చిన భూ కుంభకోణం డబ్బుతోనే నిర్వహించారా అని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు ఖనిజ సంపదను దోపిడీ చేసిన విషయం వాస్తవమా ? కాదా ? అని ప్రశ్నించారు. ఒక్కొక్క మద్యం షాపు నుంచి రూ. 30 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. దివంగత ఎన్టీఆర్ తరువాత ఎంతో ధైర్యంతో మద్యపాన నిషేధం ప్రకటించిన నాయకుడు జననేత అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే మద్యపాన నిషేధంపై మాట్లాడగలరా ? అని సవాల్ విసిరారు. నవరత్నాల్లాంటి పథకాలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్లీనరీని చూసి టీడీపీ నేతలకు నెత్తిన బండపడ్డట్లు ఉందని ఎద్దేవా చేశారు. అసలు మంత్రులు ఏ మాట్లాడుతున్నారో వారికైనా అర్థమవుతందో లేదో తెలియని పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ ధైర్యం కలిగించేలా తొమ్మిది పథకాలు ఉన్నాయని ప్రజలే అంటున్నారని చెప్పారు. ఈ పథకాలను చూసి చంద్రబాబుకు ఫీజులు మాడిపోయాయన్నారు. త్వరలోనే వైఎస్ పాలన పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్లీనరీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో వైఎస్ పాలన రాబోతుందన్నారు. అవినీతి డబ్బుతో ప్లీనరీ నిర్వహించారని వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టీడీపీ నేతలను ఓటుతో కుళ్లబొడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడేలా జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ సామాన్యులు తినే తిండిని ప్లీనరీలో పెట్టామని, మహానాడులాగా కాకినాడ కాజాలు, బాపట్ల బాద్షాలు, చీరాల చీకులు పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, నేతలు తిమ్మరాజు, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. -
ఉందిలే..మంచి కాలం
♦ కిక్కిరిసిన ప్లీనరీ ప్రాంగణం ♦ స్వచ్ఛందంగా తరలివచ్చిన కార్యకర్తలు ♦ వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో భరోసా నింపిన వైఎస్ జగన్ ♦ ఆకట్టుకున్న షర్మిల, విజయమ్మ ప్రసంగాలు ♦ ఆనందంతో ఉప్పొంగిన గుంటూరు జిల్లా సాక్షి, అమరావతి బ్యూరో : జనం జనం.. ఎటు చూసినా జనమే.. జై జగన్ నినాదాల హోరు.. పార్టీ జెండాలతో రెపరెపలు.. ఉరకలెత్తే ఉత్సాహంతో.. ప్లీనరీ రెండు రోజులూ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తమ పార్టీ పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. మేము సైతమంటూ మహిళలు ముందుకు కదిలారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల ప్రాంగణంలో రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు రాబోవు ఎన్నికలకు నాంది పలికాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాలు భవిష్యత్తు మనదే అనే సంకేతాలను ప్లీనరీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఆదివారం రెండో రోజు సైతం ఊహించని దానికంటే రెట్టింపు స్థాయిలో ప్రజలు వచ్చారు. దీంతో ప్లీనరీ ప్రాంగణంలో, వెలుపలా పెద్ద ఎత్తున జనసందోహం కనిపించింది. తొమ్మిది కార్యక్రమాల పేరుతో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. అన్ని వర్గాలను స్పృశిస్తూ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ప్రత్యేక ఆకర్షణగా విజయమ్మ, షర్మిల రెండో రోజు ప్లీనరీ సమావేశంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, జగన్ సోదరి షర్మిల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వై.ఎస్.విజయమ్మ సభాస్థలికి చేరుకోగానే పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడి స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమ్మ వచ్చిందంటూ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వై.ఎస్.విజయమ్మ చేసిన ప్రసంగం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ప్రత్యేకంగా షర్మిల చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే నాన్న కోరిక అయితే, అది జగనన్న సంకల్పమంటూ ఆమె కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. విశ్వసనీయతకు వైఎస్సార్ సీపీ మారు పేరంటూ తన ప్రసంగం ద్వారా మరోసారి చాటి చెప్పారు. నేతల ప్రసంగాల మధ్య మధ్యలో జగన్ లేచి అభివాదం చేయటం జనాన్ని పులకింపజేసింది. వైఎస్సార్ సీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ప్లీనరీలో జగన్ పరిచయం చేశారు. భరోసా నింపిన జగన్ ప్రసంగం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.45 గంటల వరకు తొమ్మిది కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక 30 సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన చేయాలన్నదే తన ధ్యేయమంటూ జగన్ ప్రసంగిస్తూ.. ‘నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలన్నదే నా కోరిక’ అనడంతో ఈలలు, కేరింతలతో ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలిపారు. ఉద్యోగుల డీఏ, కాపులకు జరిగిన అన్యాయం, మాదిగలకు చంద్రబాబు వెన్నుపోటు గురించి ఆయన ప్రస్తావిస్తూ... అధికారంలోకొచ్చాక అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తానని భరోసా ఇవ్వటంపై సభికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అన్న మాట.. నవరత్నాల మూట అన్నొస్తున్నాడు.. మంచి రోజులు ముందున్నాయని ధైర్యంగా చెప్పండంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక చేపట్టే తొమ్మిది కార్యక్రమాలను జగన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరి మోములో ఆనందం ఉప్పెనలా పొంగింది. ఈలలు, కేకలతో ప్రాంగణమంతా దద్దరిల్లింది. అక్టోబరు 27 నుంచి పాదయాత్ర అక్టోబరు 27 నుంచి రాష్ట్రమంతటా ఆరు నెలల పాటు పాదయాత్ర చేస్తున్నట్లు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభించి తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లి అక్కడి నుంచి ఇచ్ఛాపురం వరకు మూడువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. తీర్మాన ప్రసంగాల్లో జిల్లా నేతలు ప్లీనరీలో పార్టీ జిల్లా తీర్మానాన్ని గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ప్రవేశపెట్టారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నాగార్జున కుడికాలువ కింద మూడేళ్లుగా పంటలు లేవని తెలిపారు. సాగర్ పరిరక్షణ పేరుతో కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మిర్చి, పత్తి అపరాల కంపెనీలకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. భూ పోరాటాలు, రాజధాని నిర్మాణంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజధాని భూములతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని, 30 వేల ఎకరాలను రాజధాని పేరుతో తీసుకుని 20 ఎకరాల్లో మాత్రమే తాత్కాలిక భవనాలు నిర్మించారన్నారు. ఇందులో కూడా రూ.1000 కోట్లు దోచుకున్నారని తెలిపారు. అన్ని వర్గాల రైతులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో కేవలం భూ దోపిడీదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. మానవ వనరుల తీర్మానాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బలపర్చారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వారిని మంత్రిగా చేసి లోకేష్‌బాబుకు మూడు మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకట్టుకున్న ఫొటో గ్యాలరీ దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రస్థానంతో కూడిన ఫొటోలతో ఏర్పాటు చేసిన గ్యాలరీ ప్రతినిధులను ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున ప్రతినిధులు ఫొటోలను ఆసక్తికరంగా తిలకించారు. రెండోరోజు కూడా వైఎస్సార్ సీపీ అభిమానులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. ప్లీనరీ ప్రారంభంలో వంగపండు ఉష బృందం ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్ మహమ్మద్ ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, ఆతుకూరి ఆంజనేయులు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, మేకతోటి సుచరిత, రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) లావు శ్రీకృష్ణదేవరాయలు, లక్కాకుల థామస్‌నాయుడు, కిలారి రోశయ్య, మందపాటి శేషగిరిరావు, ఈచంపాటి ఆచారి, మహ్మద్ నసీర్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, నియోజకవర్గ సమన్వయకర్తలు రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, కత్తెర హెనీ క్రిస్టీనా, జెడ్పీటీసీలు కొలకలూరి కోటేశ్వరరావు, రామిరెడ్డి, ఎన్ సునీత, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు అంగడి శ్రీనివాసరావు, కర్రా కోటేశ్వరరావు, పోలూరి వెంకటరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి, మామిడి రాము, కొత్తా చిన్నపరెడ్డి, డైమండ్‌బాబు, బండారు సాయిబాబు, కోవూరి సునీల్, పూర్ణచంద్రరావు, సయ్యద్‌మాబు, కంది సంజీవరెడ్డి, యేళ్ల జయలక్ష్మి, నూతలపాటి హనుమయ్య, పాణ్యం హనిమిరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, మాలె దేవరాజ్, సఫాయితుల్లా, శానంపూడి రఘురామిరెడ్డి, మండేపూడి పురుషోత్తం, ఉప్పుటూరి నర్శిరెడ్డి, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, ఉయ్యూరి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్లీనరీలో సింహపురి సందడి
► జిల్లా నుంచి భారీగా తరలి వెళ్లిన పార్టీ నేతలు ►స్థానిక సంస్థల అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన గోవర్ధన్‌రెడ్డి ►వెన్నుపోటే చంద్రబాబు వైఖరి అని ఎమ్మెల్యే అనిల్ విమర్శ ►అతి విశ్వాసం వద్దన్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి నెల్లూరు : గుంటూరులోని నాగార్జున యూని వర్సిటీ ఎదుట వైఎస్సార్ ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో నెల్లూరు జిల్లా నేతలు సందడి చేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లాయి. అక్కడ మన జిల్లా నేతలకు అధిక ప్రాధాన్యత లభించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు సభలో కీలకంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలు, రాజకీయ అంశాలపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. లోక్‌సభలో వైఎస్సార్ సీపీ పక్ష నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ పలు అంశాలపై ప్రసంగించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి జిల్లాలోని ప్రాధాన్యత అంశాలపై శనివారం తీర్మానాలు ప్రవేశపెట్టగా, ఆదివారం స్థానిక సంస్థల అంశంపై తీర్మానాన్ని ప్లీనరీ ముందు ఉంచారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ రాజకీయ అంశాలపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీరుపై ధ్వజమెత్తగా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాష్ట్రంలో కుంటుపడిన విద్య, వైద్య విధానాలపై ప్రసంగించారు. రాజ్యాంగేతర శక్తులుగా జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ స్థానిక సంస్థలు ఉనికి కోల్పోయేలా పనిచేస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సర్పంచ్‌లు, ఎంపీటీలు, జెడ్పీటీసీల వ్యవస్థను నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీల ద్వారానే పెన్షన్లు, ఇళ్లు, ఇతర పథకాల్ని కేటాయించడం అత్యంత దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్న ప్రతిచోట ఇలాగే వ్యవహరిస్తున్నారని, ఇది చెడు సంప్రదాయమని అన్నారు. దీనివల్ల స్థానిక సంస్థల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనతోపాటు అనేక మంది జెడ్పీ చైర్మన్లుగా పనిచేసి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేశారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలను గౌరవించడంతోపాటు, బలోపేతం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే రాజ్యాంగ వికేంద్రీకరణ జరగాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వెన్నుపోటే చంద్రబాబు నైజం వెన్నుపోటే చంద్రబాబు నైజమని, మోసమే శ్వాసగా బతుకుతున్న వ్యక్తి ఆయన అని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, ఇప్పుడు కరువు కోరల్లో అలమటిస్తోందని మండిపడ్డారు. రాజకీయాలన్నా, రాజకీ య నేతలన్నా చులకన భావన ఏర్పడిన రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి తన మొదటి సంతకంతోనే విశ్వసనీయతను పెంచారని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి కాగా.. వెన్నుపోటు, మోసమో ఊపిరిగా 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని నీచ రాజకీయ నేత చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. నోబుల్ ప్రైజ్ ఇస్తానని, మద్యం తాగమని రకరకాలుగా మాట్లాడుతున్న చంద్రబాబుకు పిచ్చిపట్టిందని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అతి విశ్వాసం వద్దు పార్టీ శ్రేణులు ఎవరూ అతివిశ్వాసానికి పోకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు. పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, దానిని నాయకులు చక్కగా వినియోగించుకోవాలని, అతి విశ్వాసానికి పోకుండా కష్టపడి పనిచేసి అధికారంలోకి రావాలని సూచించా రు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. గెలుపు సామర్థ్యం లేని నేతలకు టిక్కె ట్లు ఇవ్వడం వల్ల అభ్యర్థితోపాటు పార్టీ కూడా ఇబ్బం ది పడుతుందన్నారు. పర్యవసానంగా ఆ నియోజకవర్గంలోని ప్రజలు కూడా చాలా కష్టాలు పడతారని చెప్పారు. రాజన్న పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని, అందరూ ఇప్పటినుంచే కలిసి కట్టుగా శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబుకు చెంప పెట్టులా తీర్పు రావాలన్నారు. పోరాటానికి, పౌరుషానికి, త్యాగానికి, స్నేహానికి మారుపేరుగా ఉన్న రాయలసీమ గుండెచప్పుడుగా నంద్యాలకు పేరుందని గుర్తు చేశారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని కోటంరెడ్డి కోరారు. -
బడుగుల బాంధవుడు
♦ రాజశేఖర రెడ్డి పాలనలో పేదల ప్రభుత్వం: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ♦ టీడీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది ♦ రాబోయే యుద్ధానికి కార్యకర్తలంతా సన్నద్ధం కావాలి ♦ మీ అందరికీ అండగా నిలిచే జగన్‌ను ఆశీర్వదించండి ♦ పార్టీ ప్లీనరీలో విజయమ్మ విజ్ఞప్తి వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలించిన 2004–2009 మధ్య కాలంలో పేద ప్రజల ప్రభుత్వం ఉండేదని, ఆయన ప్రజాసంక్షేమానికి కాపలాదారుగా పనిచేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్ పాలన స్వర్ణయుగమేనని అన్నారు. నా బిడ్డను కొందరు ఇబ్బంది పెడుతుంటే ఒక్కోసారి ఈ రాజకీయం ఎందుకు అని బాధ కలిగేది.. కానీ వైఎస్ ప్రేమించిన మీరందరూ నా బిడ్డకు తోడుగా ఉన్నారు కదా అని ధైర్యం వచ్చేది అంటూ ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ మూడో జాతీయ ప్లీనరీలో రెండో రోజు ఆదివారం విజయమ్మ ప్రసంగించారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలగించే పరిస్థితి లేదన్నారు. ప్లీనరీలో విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే... ‘‘మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెంది 8 ఏళ్లు అవుతున్నా ఆయన ప్రజల జ్ఞాపకాల్లోంచి చెదిరిపోలేదు. ఆయన మంచితనం, ఆత్మీయత, ప్రేమ, మంచి మనస్సు ఎప్పటికీ మరిచిపోలేనివి. కాంగ్రెస్ పార్టీకి 35 ఏళ్లు వైఎస్ సేవ చేస్తే, వాళ్లు(కాంగ్రెస్ నాయకత్వం) చూపిన నిర్లక్ష్యం గుర్తుకొస్తే బాధనిపిస్తోంది. వైఎస్ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చారు. 2004, 2009లో రాజశేఖరరెడ్డి కృషితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త శకానికి ఆయన నాంది పలికారు. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు యాత్ర చేస్తానని పావురాల గుట్టలో జగన్‌బాబు మాట ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ ఓదార్పు యాత్ర వద్దని చెప్పింది. జగన్‌కు సహకరించవద్దంటూ ఎమ్మెల్యేలను కట్టడి చేసింది. జగన్ ఏనాడూ సీఎం కావాలని కోరుకోలేదు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వండి, 2014 ఎన్నికల్లో 41 మంది ఎంపీలను గెలిపించి ఇస్తామని సోనియాగాంధీకి చెప్పాం. ఆ రోజు 150 మంది ఎమ్మెల్యేలు జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. వైఎస్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ రాజశేఖరరెడ్డి ఆశయాలు, సిద్ధాంతాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖరరెడ్డి చాలా మంచివారు. జగన్ కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ మంచివాడే. కానీ, ఏ రోజైతే పార్టీ మారాడో ఆ రోజు నుంచే వేధింపులు మొదలుపెట్టారు. పార్టీ పెట్టిన వారం రోజులకే నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి అబద్ధపు కేసులు పెట్టారు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అవి మీతో గాక ఇంకెవరితో పంచుకోగలను? సాధారణంగా 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. కానీ, విచారణ పేరుతో జగన్‌బాబును 16 నెలలు జైల్లో పెట్టారు. నా బిడ్డను మీ చేతుల్లో పెట్టాను వైఎస్సార్సీపీ జరుపుకున్న మొదటి ప్లీనరీలోనే జగన్‌బాబును మీ చేతుల్లో పెడుతున్నా అని మీకు అప్పగించాను. మీ చేతికి అప్పగించిన నా బిడ్డ ఈ రోజుకు కూడా మీ ప్రతి సమస్యలోనూ, ప్రతి పోరాటంలోనూ మీకు తోడుగా ఉన్నాడు. మీ పోరాటంలో పాలుపంచుకుంటూనే ఉన్నాడు. అసెంబ్లీ లోపలా, బయటా మీ అందరి మద్దతుతో పోరాడుతూనే ఉన్నాడు. ఆ స్వర్ణయుగం మళ్లీ రావాలి రాబోయే యుద్ధంలో తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. అందరూ కష్టపడాలని కోరుతున్నా. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయించినా సమిష్టిగా కృషి చేసి గెలిపించాలి. ఏ ఒక్కరూ బాధపడాల్సిన పనిలేదు, జగన్‌బాబు ఎవరినీ పోగొట్టుకోరు. అధికారంలోకి వస్తే అందరికీ సముచిత స్థానం లభిస్తుంది. ఇచ్చిన మాట తప్పే కుటుంబం కాదు మాది. జగన్‌బాబు మీ అందరికీ అండగా ఉంటాడు. మీరంతా జగన్‌ను ఆశీర్వదించండి. ఈ రోజే ఎన్నికలు ఉన్నాయన్నట్టుగా మీరందరూ కష్టపడి పని చేయాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నాటి స్వర్ణయుగం మళ్లీ రావాలి. ఆ యుగంలో మనమంతా బాగుండాలి’’ అని వైఎస్ విజయమ్మ ఉద్ఘాటించారు. -
ఒక్కో బాణమై దూసుకెళ్దాం
♦ మాట తప్పడం మా రక్తంలోనే లేదు.. ♦ అబద్ధాలు చెప్పడం మాకు చేత కాదు ♦ ఇక చంద్రబాబు పప్పులుడకవు..వారింట్లో ఉన్న ఆ ఒక్క పప్పు తప్ప... ♦ వైఎస్సార్సీపీ ప్లీనరీలో షర్మిల వైఎస్సార్ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్కరూ ఒక్కో బాణమై దూసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీకి ఉన్న బలం మరే పార్టీకి లేదని, ప్రజలకు వైఎస్సార్ మీద ఉన్న అభిమానం.. జగనన్న మీద ఉన్న నమ్మకమే ఈ బలానికి కారణమన్నారు. ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలో లేదని, అబద్ధాలు చెప్పడం తమకు చేత కాదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ ప్లీనరీ రెండో రోజైన ఆదివారం ఆమె ప్రసంగించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, పేద విద్యార్థులు, టీడీపీని నమ్మి ఓట్లేసిన వారిని చంద్రబాబు నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. ‘మీ రాజన్న కూతురు.. మీ జగనన్న చెల్లెలు.. శిరస్సు వంచి, చేతులు జోడించి.. మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నా’నంటూ షర్మిల ప్రారంభించిన ప్రసంగం ఆమె మాటల్లోనే... ‘‘నిన్న (శనివారం) వైఎస్సార్ గారి 68వ జయంతి. నాన్న లేని లోటు మాటల్లో చెప్పలేనిది. రుణమాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్తు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద పీట వంటి కార్యక్రమాలు చేపట్టిన మహానేత వైఎస్సార్ తాను రైతు పక్షపాతినే అని గర్వంగా ఫీలయ్యారు. అద్భుత పాలన సాగించిన రాజశేఖరరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే జగనన్న సంకల్పం.. సిద్ధాంతం ప్రజలు సంతోషంగా ఉండాలనేది నాన్న కోరిక అయితే.. అది ఇవాళ జగనన్న సంకల్పం. ఇచ్చిన మాట మీద నిలబడటం నాన్న నైజం అయితే అది ఇవాళ జగనన్న సిద్ధాంతం. చంద్రబాబు గారి లాగా రుణమాఫీ చేస్తామని అబద్ధపు వాగ్దానం ఇచ్చి ఉంటే 2014లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఉండేది. కానీ ఇచ్చిన మాట తప్పడం కన్నా.. నాకు ప్రతిపక్షంలో కూర్చొవడమే ఇష్టం అని ఆ రోజు జగనన్న నాతో అన్న మాటలు నాకింకా గుర్తే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వచ్చిన ఓట్ల మెజార్టీ కేవలం ఐదు లక్షలే. అదీ మోదీ మీద సవారీ చేస్తే.. రుణ మాఫీ చేస్తానని తప్పుడు వాగ్ధానం ఇవ్వడం వల్ల వచ్చింది. ఇక చంద్రబాబు గారి పప్పులు ఉడకవు.. ఆయన ఇంట్లో ఉన్న ఆ ఒక్క పప్పు తప్ప. ఆ తల్లి వేదన ఎవరికి చెప్పుకోగలదు? ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలి. అది చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు. చంద్రబాబు గారికి తెలిసిందల్లా వెన్నుపోటు పొడవడమే. ఆయన భార్య భువనేశ్వరి గారికి దండం పెట్టాలి. జన్మ ఇచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచినా, సొంత తండ్రిని అవమానించి ఆయన మరణానికి కారణమైనా.. ఆ మాంగల్యాన్ని చూసుకుని బతికేస్తోంది. ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారి.. ఎన్టీఆర్ గారి కళ్లలోకి చూసుకుంటున్న ప్రతిసారి.. ఆ తల్లి మనసులో పడే వేదన ఎవరికి చెప్పుకోగలదు? చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు.. చంద్రబాబు గారివి ఎప్పుడూ వెన్నుపోటు, మోసపూరిత, దిగజారిన రాజకీయాలే. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి.. వైఎస్సార్ ఫొటో పెట్టుకుని, జగనన్న పేరు చెప్పుకొని గెలిచిన వారికి ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఇప్పటికి కూడా వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి టీడీపీ తరఫున గెలిపించుకునే దమ్ము ఈ పిరికి చంద్రబాబుకు లేదు. టేపుల్లో బ్రీఫ్డ్ మీ అని తన గొంతుతో అడ్డంగా దొరికిపోయినా ఈ రోజు వరకు విచారణ జరగకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలాంటి చంద్రబాబు నిప్పా? తుప్పా? కచ్చితంగా తుప్పే. వైఎస్సార్ సీపీ రైతుల పక్షం. దళితుల పక్షం. గిరిజనుల పక్షం. మైనార్టీల పక్షం. పేదల పక్షం. ప్రత్యేక హోదా పక్షం. వైఎస్సార్ సీపీ బలం... ప్రజలకు వైఎస్సార్ మీద ఉన్న అభిమానం. ప్రజలకు జగనన్న మీద ఉన్న నమ్మకం. ఈ బలం ఇంకా ఏ పార్టీకీ లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఒక్కో బాణమై దూసుకెళ్దాం. విజయం నిశ్చయం. మీ ద్వారా రాబోతున్నది రాజన్న రాజ్యం. తేబోతున్నది జగనన్న. దీన్ని సాధ్యం చేయబోతున్నది దేవుని దీవెన. ఇది తథ్యం.సెలవు’’. -
ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన జగన్
♦ మన పార్టీ కోసం సహాయసహకారాలు అందిస్తారు ♦ నరేంద్ర మోదీ గెలుపులో ఆయనదే క్రియాశీలకపాత్ర ♦ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా: జగన్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ఆదివారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. దేశ రాజకీయాల్లో అవగాహన ఉన్న వారందరికీ ఆయన తెలిసే ఉంటారని చెప్పారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. అదేవిధంగా బిహార్‌లో నితీశ్ కుమార్‌ను గెలిపించారని చెప్పారు. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ గెలుస్తుందని అందరూ అంచనాలు వేస్తున్న సమయంలో తన వ్యూహాల ద్వారా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారన్నారు. అయితే ఒక్క ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం కాస్త దెబ్బతగిలిందని, అందుకు కారణాలు అందరికీ తెలిసినవేనని వైఎస్ జగన్ అన్నారు. రానున్న ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటారని, సహాయసహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు ఇక్కడ ఏకమై రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చిస్తున్నామని, చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే దిశగా అడుగులు వేసేందుకు దశదిశా నిర్దేశించుకుంటున్నామని చెప్పారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ తనను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
విశాఖను దోచుకుంటున్నారు..
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు గడిచిన మూడేళ్లుగా విశాఖ జిల్లాను దోచుకుతింటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ వేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా శనివారం ప్రారంమైన వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో విశాఖ జిల్లా తీర్మానాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ప్రవేశపెట్టారు. విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు సాగిస్తున్న దందాలపై ప్లీనరీలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతో సుందరమైన విశాఖను నేడు భూ కబ్జాలు, భూ దందాలు, సెటిల్మెంట్స్ కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడమే కాకుండా ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసి కాజేస్తున్నారన్నారు. ఈ కుంభకోణంపై వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. ఎంపీ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం ముదుపాక భూములను పరిశీలించి భూ బాధితులకు అండగా నిలిచిందన్నారు. సేవ్ విశాఖ అంటూ విశాఖలో నిర్వహించిన మహాధర్నాలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని భూ బాధితులకు భరోసా కల్పించారన్నారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నందున సిట్ విచారణను తక్షణమే నిలిపివేసి సీబీఐ దర్యాప్తు చేయించా లని ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు అమర్నాథ్ ప్రకటించారు. రైల్వేజోన్‌పై ప్రకటనేది? విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక రైల్వేజోన్‌పై మూడేళ్లయినా ప్రకటన రాలేదన్నారు. విశాఖలో ఏర్పాటు చేయకుండా వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, రైల్వే జోన్‌ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. దేశంలో మరెక్క డా దొరకని స్థాయిలో గంజాయి, మాదక ద్రవ్యాలు రవా ణాకు విశాఖ కేంద్రంగా మారిందని, ఎక్కడ గంజాయి పట్టుకున్న దాని మూలాలు విశాఖలోనే ఉంటున్నాయన్నారు. ప్లీనరీలో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్సీలు డీఎస్ఎన్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ,, పార్టీ కో ఆర్డినేటర్లు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజు, పెట్ల ఉమాశంకర గణేష్, అక్కరమాని విజయనిర్మల, బొడ్డేడ ప్రసాద్, వీసం రామకృష్ణ, శెట్టి ఫల్గుణ, జర్శింగి సూర్యనారాయణ, అరుణకుమారి, పోయా రాజారావు, పార్టీ రాష్ట్ర రాష్ట్ర జిల్లా నేతలు కొయ్యా ప్రసాదరెడ్డి, జాన్‌వెస్లీ, కంపాహనోక్, దామా సుబ్బారావు, రవిరెడ్డి, పక్కి దివాకర్, సత్తి రామకృష్ణారెడ్డి, ఐహెచ్ ఫరుఖీ, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, శ్రీకాం™Œ రాజు, పీలా వెంకట లక్ష్మి, పసుపులేటి ఉషాకిరణ్, గరికిన గౌరి మహ్మద్ షరీఫ్, బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు. గుడి బడి తేడా లేకుండా మద్యం దుకాణాలు విశాఖ జిల్లాలో గుడి..బడి..అనే తేడా లేకుండా జనా వాసాల మధ్య ఇష్టమొచ్చినట్టుగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమాలు చేస్తున్నారని ప్లీనరీ దృష్టికి తీసుకొచ్చారు. వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్రపై విభజన హామీలు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపుతున్నారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని, మహానేత వైఎస్సార్ కలల ప్రాజెక్టయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిను వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన చేపట్టాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఆంత్రాక్స్, విషజ్వరాలతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని గుడివాడ ప్లీనరీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
జాతీయ ప్లీనరీలో జిల్లాకు పెద్దపీట
– మూడో తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు – జిల్లా సమస్యల ప్రస్తావనకు వేదికైన వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీ - జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ – చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీలో తూర్పు గోదావరి జిల్లాకు సముచిత స్థానం దక్కింది. జిల్లాలోని ప్రధాన సమస్యలు ప్రస్తావించేందుకు పార్టీ అవకాశం ఇవ్వడంతో ప్లీనరీలో మూడో తీర్మానాన్ని ప్రవేశ పెట్టే ఛాన్స్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు లభించింది. జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలు చర్చించేందుకు జాతీయ ప్లీనరీ కూడా వేదికైంది. జ్వరాల జిల్లాను ఆదుకోండి... గుంటూరు వేదికగా జరుగుతున్న వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీలో శనివారం మధ్యాహ్నం 1.05 గంటల సమయంలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మూడో తీర్మానం ప్రవేశపెట్టారు. పౌష్టికాహారం లోపంతో చాపరాయి వంటి గిరిజన గ్రామాలకు చెందిన వారంతా మృత్యువాత పడుతున్నారని, కనీస సౌకర్యాల్లేక సతమతమవుతున్నారని, గిరిజనులను ఆదుకోవాలని కోరారు. విష జ్వరాలు, మలేరియా జ్వరాలు, ఇతరత్రా వ్యాధులతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణాలు సంభవిస్తున్న ప్రతిసారీ ఏజెన్సీలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏజెన్సీలో పర్యటించి, గిరిజనులకు సహాయం చేసి భరోసా ఇచ్చారే తప్ప ప్రభుత్వం సాయం అందించలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి డెల్లా ఆధునికీకరణ దారుణంగా తయారైందని, వైఎస్సార్ హయాంలో గొప్పగా చేపట్టిన కార్యక్రమాన్ని చంద్రబాబు పాలనలో అధ్వానంగా మార్చారని, ఆధునికీకరణ జరిగేలా చూడాలని కోరారు. ఇంటి పన్నులు భారీగా పెంచేశారని, ఇందిరమ్మ ఇళ్లకు రూ.100గా ఉన్న పన్నును రూ.1000 వరకూ చేశారని, పెంచిన పన్నును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపురం ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని, కాసుల కోసం అన్నట్టుగా పనులు చేపడుతున్నారని, కాంట్రాక్టులు, ముడుపుల కోసం కాకుండా నిర్వాసితుల కోసం ఆలోచించాలని కోరుతూ తీర్మానం ప్రవేశం పెట్టారు. కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్తు అందించాలని, లంక గ్రామాల్లో కోతలను అరికట్టేందుకు గ్రోయిన్లు నిర్మించాలని, కాటవరం, చాగల్నాడు. కలవచర్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని, ర్యాలీ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, జగ్గంపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని, కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ, మండపేట ఇళ్ల నిర్మాణాల్లో జరిగే అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించాలని, టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతుల్లో చేపడుతున్న పనులు రద్దు చేయాలని, బీసీల అభివృద్ధిపైన టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే సానుకూలంగా స్పందించాలంటూ తదితర డిమాండ్లు చేశారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. వీటికి జాతీయ ప్లీనరీలో ఆమోదం తెలపాలని నాయకులను కోరారు. అవినీతి చక్రవర్తిపై జిల్లాలో చర్చ... వైఎస్సార్సీపీ జాతీయ ప్లీనరీ వేదికపై ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పేరుతో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన పుస్తకంపై జిల్లాలో విస్తృత చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో బినామీలను రంగంలోకి దించి పెద్ద అవినీతికి పాల్పడగా, ఇప్పుడు రాజధాని, విశాఖలో భూకుంభకోణాలకు పాల్పడి లక్షల కోట్లు ఆర్జించినట్టుగా ఆధారాలతో సహా పుస్తకాల ప్రచురించడం ప్రాధాన్యతకు సంతరించుకుంది. 66 కుంభకోణాలకు పాల్పడి రూ.3.75 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడారని తెలియగానే ప్లీనరీ జరిగిన గుంటూరు వేదిక ప్రాంగణంలోనే కాదు జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడీ అవినీతి చక్రవర్తి పుస్తకం హాట్ టాపిక్‌గా మారింది. వేలాదిగా తరలి వెళ్లిన నేతలు... జాతీయ ప్లీనరీ జరుగుతున్న గుంటూరుకు శనివారం ఉదయం జిల్లా నేతలు భారీగా తరలివెళ్లారు. వైఎస్సార్ జయంతి వేడుకలు ముగించుకొని నేతలంతా అక్కడికి పయనమయ్యారు. నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నేతలు భారీగా తరలి వెళ్లడంతో గుంటూరు ప్రాంగణంలో జిల్లా మార్క్ స్పష్టంగా కనిపించింది. -
ప్లీనరీలో సిక్కోలు గళం
టీడీపీ మూడేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాలో అన్ని వర్గాలవారు తీవ్ర అగచాట్లు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట శనివారం ప్రారంభమైన వైఎస్సార్సీపీ రెండ్రోజుల జాతీయ ప్లీనరీలో ఆమె జిల్లా సమస్యలపై గళం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలనుసారం జిల్లా సమస్యలపై ఆరు తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టుల పనులు, అప్పుల సహా రైతుల కష్టాలు, కిడ్నీ రోగుల ఆవేదన, మత్స్యకారుల సమస్యలు, గిరిజనులకు దూరమైన సంక్షేమం, చేనేతకారుల ఇబ్బందులను ఈ తీర్మానాల ద్వారా ప్రస్తావించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ పాలకులను పారదోలి రాజన్న సంక్షేమ పథకాల కోసం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారని రెడ్డి శాంతి ప్లీనరీలో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ అక్రమ విధానాలు, దోపిడీ కార్యక్రమాలతో జిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీల్లో తీర్మానాలు ఆమోదించినట్లు చెప్పారు. వాటిలో అత్యంత ప్రధానమైన సమస్యలపై ఆరు తీర్మానాలను జాతీయ ప్లీనరీలో ఆమోదానికి ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పది లక్షల మందికి వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలే ఆధారమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తలపెట్టిన వంశధార ఫేజ్–2 ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులతో పాటు మడ్డువలస, నారాయణపురం ఆనకట్టల ఆధునికీకరణ పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జిల్లాలో మూడు లక్షల మంది మత్స్యకారుల పరిస్థితి నడిసంద్రంలో నావలా మారిందన్నారు. వారికి మరపడవలు, వలలు ఇస్తామని, కోల్డ్ స్టోరేజ్‌లు, జెట్టీలు నిర్మిస్తామని, 50 సంవత్సరాలకే పింఛను ఇస్తామని చంద్రబాబు పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాదు వారి సమస్యలపై చట్టసభలో వినిపించేందుకు వీలుగా ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలో 1.50 లక్షల మంది కారణం తెలియని కిడ్నీ రోగం బారిన పడ్డారని, వారిని ఆదుకునేందుకు శాశ్వత చర్యలు గాకుండా కంటితుడుపు చర్యలకే పరిమితమైందన్నారు. జిల్లాలో రెండు లక్షల మంది గిరిజనులకు సంక్షేమానికి వినియోగించాల్సిన సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని చెప్పారు. దాదాపు 300 గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదన్నారు. రక్షిత తాగునీరు, సకాలంలో వైద్యం అందట్లేదన్నారు. ఇప్పటికీ చలమల్లో బురదనీరే గతి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మరో 50 వేల చేనేత కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయని చెప్పారు. సిక్కోలు బ్రాండ్ పొందూరు ఖద్దరు ప్రపంచ ప్రసిద్ధి పొందినా ఆ పరిశ్రమపై ఆధారపడిన వారి సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్‌ను తామంతా భగవంతుడు పంపిన దూతగా భావిస్తున్నామని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజశేఖరరెడ్డి మాదిరిగా జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తారని రెడ్డి శాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పేరు ప్రతిపాదన... వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో సీఈసీ సభ్యులు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పార్టీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు పాల్గొన్నారు. ప్లీనరీలో నాయకుల ప్రసంగాలతో శ్రేణులతో జోష్ కనిపించింది. జిల్లా నుంచి ప్రధాన నాయకులతో పాటు దాదాపు రెండు వేల మంది వివిధ క్యాడర్ నాయకులు ప్లీనరీలో పాల్గొన్నారు. -
ఇంకా వెనుకబడే ఉన్నాం...
♦ జిల్లాలో గిరిజన యూనివర్శిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి ♦తోటపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల సమస్య తీర్చాలి ♦వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో బెల్లాన చంద్రశేఖర్ విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఇంకా మా జిల్లా వెనుకబడే ఉంది. 1979లో జిల్లా ఏర్పాటు అయినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సమస్యలన్నీ తీర్చాలి’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న పార్టీ జాతీయ ప్లీనరీ వేదికపై జిల్లాకు సంబంధించి పలు అంశాలను శనివారం ఆయన ప్రస్తావించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలకు సంబంధించి ఆరు అంశాలపై తీర్మానం చేశారు. జిల్లా ప్లీనరీలో చేసి న తీర్మానాలను జాతీయ ప్లీనరీలో ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి తొలుత ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వర్శిటీకి తొలి ప్రాధాన్యం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని బెల్లాన కోరారు. జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంత వరకూ లేదనీ... 2004–2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వర్షాధారం మీద, చెరువుల మీద ఆధారపడ్డ రైతాంగానికి తోటపల్లి కాలువ, రామతీర్థసాగర్లకు నిధులు కేటాయించారని తోటపల్లి పనులు 90శాతం పూర్తి చేశారని కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లయినా మిగతా 10 శాతం పనులూ పూర్తికాలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చేయాలని కోరారు. జిల్లాలో 8 మండలాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని, వారికి వైద్యం అందుబాటులో లేదన్నారు. వీరికి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా వైద్య కళాశాలను జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. హోదాతోనే భవిత ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందనీ... ప్రత్యేక హోదా వల్ల విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, మూతపడిన పరిశ్రమలు తెరిపించే అవకాశం ఉంటుందని ప్లీనరీ దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు పరుస్తామనే హామీని అమలులోకి తీసుకు రావాలని కోరారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జిల్లాకు రావాల్సిన నిధులు తీసుకురావాలని తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పీడికరాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సీనియర్ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్లీనరీలో పాల్గొన్నారు. -
దండు కదిలింది
► వైఎస్సార్ సీపీ ప్లీనరీకి తరలిన నేతలు ► భూ కుంభకోణాలు, ఉత్తరాంధ్ర వెనుకబాటుపై చర్చ ► జిల్లాకు చెందిన పలు అంశాలపై తీర్మానాలు చేసే అవకాశం సాక్షి, విశాఖపట్నం: దండు కదిలింది.. అమరావతి వైపు అడుగులు వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ ప్లీనరీలో భాగస్వామం అయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు శుక్రవారం బయలుదేరారు. ప్లీనరీకి ఆహ్వానితులుగా పాసులందుకున్న 2,600 మంది ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. మరో పక్క ప్లీనరీలో పాల్గొనాలన్న ఉత్సుకతతో పాస్‌లు లేనప్పటికీ.. వేలాది మంది పయనమయ్యారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వద్ద శని, ఆదివారం జరగనున్న జాతీయ ప్లీనరీకి జిల్లా పార్టీ నాయకత్వం తరలివెళ్లింది. ఏర్పాట్లకు సంబంధించిన కమిటీల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో పాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడులను నియమించడంతో వారు శుక్రవారం ఉదయమే బయలుదేరి వెళ్లారు. సాయంత్రం సమన్వయకర్తల ఆధ్వర్యంలో నియోజకవర్గల వారీగా పార్టీ బాధ్యులంతా తరలివెళ్లారు. సింహాచలంలో పార్టీ భీమిలి పట్టణ అ«ధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు పూజలు చేసి కార్యకర్తలతో ప్లీనరీకి పయన మయ్యారు. రాష్ట్ర రాజధానిలో తొలిసారిగా జరుగుతున్న జాతీయ ప్లీనరీలో ఈసారి ప్రధానంగా విశాఖ, ఉత్తరాంధ్ర సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విశాఖ భూ కుంభకోణంపై పార్టీ చేస్తున్న పోరాటం.. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్లీనరీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై తీర్మానం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నందున సిట్ విచారణను తక్షణమే నిలిపివేసి సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్లీనరీ ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. ఇటీవల జరిగిన జిల్లా ప్లీనరీలో చేసిన తీర్మానాలపై కూడా జాతీయ ప్లీనరీలో ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం పార్టీ మలిదశ ఉద్యమంపై తీర్మానం చేయనున్నట్టు చెప్పారు. విభజన హామీలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపుతున్న వైనంపై చర్చించనున్నారు. జీవీఎంసీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని, మహానేత వైఎస్సార్ కలల ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలని, సింహాచలం, గాజువాక భూ సమస్యలను పరిష్కరించాలని, ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, బాక్సైట్ మైనింగ్ తవ్వకాల కోసం ఇచ్చిన జీవో నం.97ను తక్షణమే రద్దు చేసే అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు గుడివాడ తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి తరలిన నాయకులు
కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): గుంటూరులో శని, ఆదివారాల్లో జరిగే వైఎస్ఆర్సీపీ మూడో జాతీయ ప్లీనరీకి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు భారీ స్థాయిలో తరలి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 12 గంటల వరకు వెళ్లారు. ప్రతి నియోజవకర్గం నుంచి ప్రత్యేక బస్సులు, కార్లు, జీపులు, ఇతర వాహనాలను నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసుకొని శనివారం ఉదయం ప్లీనరీ ప్రాంగణంలో ఉండేవిధంగా ప్రణాళికలు తయారు చేసుకొని వెళ్లిపోయారు. కర్నూలు నుంచి గంటూరుకు దాదాపు 8 గంటల ప్రయాణ సమయం. పత్తికొండ నియోజవకర్గ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో 20 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వీరు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలోనే కదిలివెళ్లారు. బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో 25 వాహనాల భారీ కాన్వాయ్‌లో తరలి వెళ్లారు. కర్నూలు నియోజవకర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో ఒక బస్సు, 20 వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు వెళ్లారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలోని నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంత్యుత్సవంలో పాల్గొని వెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నుంచి వెళ్లారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఒక్కో మండలం నుంచి మూడు వాహనాల్లో గుంతకల్ నుంచి బయలు దేరారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆత్మకూరు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు జగన్మోహన్రెడ్డి, మురళీకృష్ణ, బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ గుంటూరుకు బయలు దేరింది. నంద్యాలలో ఇన్చార్జ్ శిల్పా మోహన్‌రెడ్డి, సీఈసీ మెంబర్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 100 వాహనాల్లో అమరావతికి ప్రయాణమయ్యారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో 50 వాహనాల శ్రేణి బయలు దేరింది. డోన్ నుంచి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో, పాణ్యంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ప్లీనరీకి తరలివెళ్లారు. -
ప్లీనరీలో రెండు అంశాలపై తీర్మానం
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరిగే ప్లీనరీలో తెలంగాణ తరుఫున రెండు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండు తీర్మానాల్లో ఒకటి.. సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానమని, ఇందులో తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. రెండోది.. టీఆర్ఎస్ మేనిఫెస్టో – ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం అని, ఇందులోనూ తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. ప్లీనరీకి రాష్ట్రంలోని పార్టీ శ్రేణులంతా నిర్ణీత సమయానికంటే ముందే చేరుకోవాలని సూచించారు. -
ప్లీనరీకి సకాలంలో చేరుకోవాలి: గట్టు
సిటీబ్యూరో: ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనున్న వైఎస్సార్ సీపీ 3 వ జాతీయ ప్లీనరీ సమావేశాలకు తెలంగాణలోని పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఎనమిదవ తేదీ ఉదయానికి నిర్ణీత సమయానికన్నా ముందే పార్టీ ప్రతినిధులు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. 8 వ తేదీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అని కూడా ఆయన గుర్తు చేశారు. ప్లీనరీ తెలంగాణ తరపు నుంచి రెండు ముఖ్య తీర్మానాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఒకటి సామాజిక , రాజకీయ ఆర్థిక తీర్మానం కాగా ఇందులో తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో - ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం. ఇందులో కూడా తొమ్మిది ఉప అంశాలు ఉంటాయన్నారు. ఉప అంశాలను వేదికపైనే నేరుగా తెలియజేస్తామన్నారు. -
ముమ్మరంగా ప్లీనరీ ఏర్పాట్లు
► పూర్తయిన హాల్ పనులు ► ఏర్పాట్లను పరిశీలించిన పలువురు నాయకులు ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీకి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్లీనరీ సమావేశాల కోసం రెండు హాల్స్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఒక హాల్ పనులు పూర్తయ్యాయి. హాల్స్‌లో పార్టీ నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు కూర్చొనేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భోజనాలకు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించారు. ప్లీనరీ ప్రాంగణంలో కేటగిరీల వారీగా బారిగేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం విడిగా స్థలాన్ని గుర్తించారు. ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వర్షాల వల్ల ప్లీనరీకి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు ప్లీనరీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివా రం పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రారావు, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు, విజయనగరం జిల్లా నాయకుడు చిన్న శ్రీను, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బూదాల శ్రీను, మదిర ప్రభాకర్, తోకల శ్యామ్‌కుమార్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ లాతర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తనుబుద్ధి చంద్రశేఖర రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ సోమవారం ప్రాంగణాన్ని సందర్శిస్తారని రఘురాం తెలిపారు. -
సమరోత్సాహం
► ప్లీనరీ విజయవంతంతో పార్టీలో ఫుల్ జోష్ ► ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ప్లీనరీ ► జగన్, వైఎస్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా హర్షధ్వానాలు ► భవిష్యత్ మనదేనంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన నేతలు ► బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం కావాలని దిశానిర్దేశం సాక్షి, విశాఖపట్నం: ఆరేళ్లుగా అలుపెరగని సైనికుల్లా పోరాడుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భవిష్యత్‌పై భరోసా నింపేలా సాగిన ప్లీనరీ సమరోత్సాహం నింపింది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కదనరంగంలోకి సైనికుల్లా దూకాలంటూ నేతల దిశానిర్దేశం పార్టీలో ఉత్తేజాన్ని నింపింది. పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీకి అనూహ్య స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా పార్టీ శ్రేణులు తరలిరావడంతో పార్టీలో ఫుల్ జోష్ కనిపించింది. ప్లీనరీ ఇన్చార్జిగా మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలుసు పార్ధసారథి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, కో ఆర్డినేటర్లు, వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఆడిటోరియంతోపాటు పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఆడిటోరియం బయట రెట్టింపు సంఖ్యలో పార్టీ శ్రేణులుబయట వేచి ఉండాల్సి వచ్చింది. తొలుత పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఎన్రోల్మెంట్ చేయించుకొని సభా ప్రాంగణంలోకి రాగా సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలు రాధ నేతృత్వంలోని సాంస్కృతిక బృందం పాడిన గీతాలు శ్రేణులను ఉత్తేజపరిచాయి. జ్యోతి ప్రజ్వలన తర్వాత మహానేత దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలంతా నివాళులర్పించారు. ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత కో ఆర్డినేటర్లంతా మాట్లాడారు. చివరగా ఎమ్మెల్యేలు, ప్లీనరీ ఇన్చార్జి పార్ధసారథి, బొత్స సత్యనారాయణ ప్రసంగించారు. నేతలు తమ ప్రసంగాల్లో మహానేత దివంగత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లు ప్రస్తావించిన ప్రతి సారి ఆడిటోరియం పరిసరాలన్నీ హర్షధ్వానాలతో మార్మోగాయి. ‘‘భవిష్యత్ మనదే.. 2019లో రాజన్న రాజ్యం రాబోతుంది.. కొంచెం ఓపిక పట్టండి.. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు తలెత్తుకునేలా జగనన్న పాలన ఉండబోతుందంటూ పార్టీ నేతలు చేసిన ప్రసంగాలు శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపాయి. నేతల ప్రసంగాలు సాగుతున్నంత సేపు అడుగడుగునా ‘జై జగన్ జై జగన్.. వైఎస్సార్ సీపీ వర్ధాల్లాలి’’ అంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. విశాఖలో జరుగుతున్న భూ దోపిడీ వెనుక చంద్రబాబు, లోకేష్, గంటా హస్తం ఉందని అందుకే సీబీఐ విచారణకు వెనుకాడు తున్నారంటూ పార్ధసారథి ఆరోపించారు. కనీసం సిట్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా జరిగిన భూదందాలన్నీ చేర్చకుండా కేవలం 270 ఎకరాల్లో జరిగిన ట్యాంపరింగ్‌కు మాత్రమే పరిమితం చేశారంటూ ధ్వజమెత్తడంతో పార్టీ శ్రేణులు సేవ్ విశాఖ అంటూ నినదించారు. ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే ఈశ్వరి చంద్రబాబు మాయ మాటలకు నమ్మి మైదాన ప్రాంతాల్లోని ప్రజలు ఆయనకు ఓటేశారే తప్ప నిరక్ష్యరాస్యులైన గిరిజనులు మాత్రం నమ్మలేదని.. తమ గుండెల్లో ఉన్న వైఎస్సార్ సీపీకి పట్టంగట్టారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నేటి వరకు కొండలు గుట్టలు తిరుగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో గిరిజనులు వైఎస్సార్ సీపీ వెంటే ఉంటారని జగన్‌ను సీఎంగా చూడాలన్నదే వారి ఆకాంక్షని చెప్పుకొచ్చారు. మరో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సైతం తనదైన శైలిలో ప్రసంగిస్తూ పార్టీకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని. .పార్టీకి పట్టంగట్టేందుకు వారు సిద్దంగా ఉన్నారని, అయితే వారిని బూత్‌కు తీసుకెళ్లి ఓట్లు వేయించగలిగే స్థాయిలో మనం బలోపేతం కావాలన్నారు. 2019లో టీడీపీకి రాజకీయ శరణం లేదని.. మరణమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ చెప్పడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఇలా నేతలంతా తమ ప్రసంగాల్లో అధికార టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. భవిష్యత్‌పై పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించారు. చివరగా 12 అంశాలపై గుడివాడ ప్రవేశపెట్టిన తీర్మానాలను పార్టీ శ్రేణులు హర్షధ్వానాలతో ఆమోదించారు. -
వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ రేపే
► పోర్టు కళావాణి ఆడిటోరియం వేదిక ► భూకుంభకోణాల కేసు నీరుగార్చేందుకే సిట్ ► పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ డాబాగార్డెన్స్( విశాఖ దక్షిణ) : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు జరిగాయని, ఈ నెల 2న జిల్లా ప్లీనరీ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలో జరిగిన భారీ భూకుంభకోణంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ‘సేవ్ విశాఖ’ పేరిట ఉద్యమం చేపడుతున్నట్టు తెలిపారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు. ఏయూ కాన్వోకేషన్ హాల్లో ఈ ప్లీనరీ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించామని, అందుకు సంబంధించి రిజిస్ట్రార్‌కు లేఖ కూడా రాశామన్నారు. రిజిస్ట్రార్ స్పందిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి చెబుతామని చెప్పడం చూస్తుంటే అధికార పార్టీకో న్యాయం, ప్రతిపక్ష పార్టీకో న్యాయంగా ఉందని అర్థమవుతోందన్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా టీడీపీ మహానాడు నిర్వహిస్తే రిజిస్ట్రార్ వారికి అనుమతించారన్నారు. అదే ప్రతిపక్ష పార్టీ ప్లీనరీ నిర్వహించడానికి ఒక్కరోజు.. అది కూడా ఆదివారం అనుమతి ఇవ్వమని కోరితే మంత్రిని అడిగి చెబుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయంలో రిజిస్ట్రార్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వండని అడిగితే రిజిస్ట్రార్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చూడడం రిజిస్ట్రార్‌కు తగదన్నారు. ఈ నేపథ్యంలో పోర్టు కళావాణి ఆడిటోరియంలో జూలై 2న ప్లీనరీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, వంగవీటి రాధా, పార్థసారధి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు ప్రముఖులు, 15 నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు పాల్గొంటున్నట్టు తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, పార్టీ ప్రచార కమిటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మహిళ విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సురేష్‌కుమార్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, నగర అధికార ప్రతినిధి మేరుగుమాల శ్రీదేవి, మహిళ విభాగం నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్ ఆలీ, నగర నిర్వహక కార్యదర్శి కొల్లి నూకిరెడ్డి, నగర మహిళ నాయకులు మళ్ల ధనలత, రాధా తదితరులు పాల్గొన్నారు. సిట్ వల్ల ఉపయోగం లేదని ఆనాడే చెప్పాం జిల్లా వ్యాప్తంగా జరిగిన భూకుంభకోణంపై సీబీఐచే విచారణ చేపట్టాలని వైఎస్సార్ సీపీ ప్రారంభం నుంచి డిమాండ్ చేస్తూనే ఉందని అమర్నాథ్ అన్నారు. దొరికిపోతామన్న భయంతో ముఖ్యమంత్రి, భూకుంభకోణ సూత్రధారుడు చంద్రబాబు వెనుకడుగు వేసి ‘సిట్’ వేశారన్నారు. సిట్ వల్ల న్యాయం జరగదని వైఎస్సార్సీపీ ముందుగానే తెలిపిందన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న డీజీపీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలతో సిట్ వేసి, కేసును నీర్చుగార్చేప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదువేల ఎకరాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్వయంగా కలెక్టరే తెలిపిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ నుంచి ఫోన్లు రావడంతో ఆ కలెక్టరే కేవలం 250 ఎకరాల్లోనే ట్యాంపరింగ్ జరిగిందని, అదీ కూడా మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లోనేనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సిట్ దర్యాప్తులో డీజీపీయే విశాఖలో గజం కూడా ఆక్రమణకు గురికాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి వ్యక్తులతో దర్యాప్తు చేపడితే విశాఖ ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు సంబంధించి ఆరోపణలు వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సచీలత నిరూపించుకున్నారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలని సూచించారు. విశాఖపట్నం ఇమేజ్ను చంద్రబాబు ప్రభుత్వమే డేమేజ్ చేసిందని, పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. గాజువాకలో ఐదెకరాల అసైన్డ్ భూమి(ఎల్పీ నంబరు 32/2016)లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి అత్యంత సాన్నిహితంగా ఉంటున్న కరణంరెడ్డి నరసింగరావు తన భార్య కరణంరెడ్డి జ్యోతి పేరిట లేఅవుట్ వేసి గజం 15 వేలు చొప్పున రూ.18 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. కలెక్టర్‌పై నమ్మకం లేనప్పటికీ ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భూ కుంభకోణానికి సంబంధించి అధికార పార్టీకి చెందిన వారు దోషులుగా నిలబడే సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే భూకుంభకోణంపై సీబీఐచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ మన్యంలో త్వరలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి∙పర్యటించున్నారని అమర్నాథ్ తెలిపారు. -
వైఎస్సార్సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
♦ 8, 9 తేదీల్లో గుంటూరు నాగార్జున వర్సిటీ ఎదురుగా సమావేశాలు ♦ ప్లీనరీ తొలిరోజున అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్.. 10న ఫలితాలు ♦ నిర్వహణకు 18 కమిటీల నియామకం ♦ నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు విజయవంతం: ఉమ్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలను జూలై 8, 9వతేదీల్లో భారీ ఎత్తున నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపా రు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్లీనరీలు విజయవంతమయ్యాయని చెప్పారు. శుక్రవా రం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యా లయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. గుంటూరు, విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్లీనరీ నిర్వహ ణకు 18 కమిటీలు వేసినట్లు తెలిపారు. మొత్తం 18 తీర్మానాలు ఆమోదించనున్నట్లు చెప్పారు. జిల్లాల్లో ఆమోదించిన తీర్మానాలను క్రోడీకరించినట్లు తెలిపారు. పాస్‌ల కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడిని సంప్రదించాలి ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌక ర్యం లేకుండా పార్కింగ్ నుంచి భోజన వసతి వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాత్రి బస చేయడానికి కూడా ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ నియమావళి ప్రకారం అధ్యక్షుడి ఎన్నికకు 8వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 9న నామినేషన్ స్క్రూటినీ చేపట్టి 10న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. అంబేడ్కర్, అబ్దుల్ కలాం, అల్లూరి సీతా రామరాజు, తాండ్రపాపారాయుడు తదితర ప్రముఖుల పేర్లతో ఆహ్వాన ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరు కార్పొ రేషన్‌లో అలంకరణకు అనుమతి కోసం స్థాని కంగా దరఖాస్తు చేయనున్నామని తెలిపారు. ప్లీనరీ పాస్‌లు జిల్లా అధ్యక్షులకు పంపా మన్నారు. నియోజకవర్గ నాయకులు పాస్‌ల కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడిని సంప్రదిం చవచ్చని తెలిపారు. ప్లీనరీ ప్రాంతంలో ప్రతి జిల్లాకు ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. జాతీయ ప్లీనరీలో రాజకీయ కార్యదర్శులు, పీఏసీ, సీజీసీ, సీఈసీ సభ్యులు మొదలు గ్రామ స్థాయి నుంచి ప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. ఆహ్వానితులు వీరే... సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిలో జూలై 8, 9 తేదీల్లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ప్రకటించిన అన్ని విభాగాల వారూ తప్పక హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆహ్వానితులు... పార్టీ రాజకీయ కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు , కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు, కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యులు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా, నగర పార్టీ పరిశీలకులు, అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ– డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు, రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ సభ్యులు, జిల్లా–నగర పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసినవారు, జెడ్పీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసినవారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసినవారు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసినవారు, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు, మండల–మున్సిపల్ – టౌన్ – నగర డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, డీసీసీబీ – డీసీఎంఎస్ డైరెక్టర్లు– సింగిల్ విండో అధ్యక్షులు, దేవాలయ మాజీ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, సర్పంచ్‌గా పోటీ చేసినవారు, గ్రామ ముఖ్యులు (గ్రామం నుంచి ఈ నాలుగు హోదాలలో ఎవరో ఒకరు ఆహ్వానితులుగా ఉంటారు). -
వైఎస్సార్ సీపీ ప్లీనరీ ఆహ్వానితులు వీరే..
సాక్షి, హైదరాబాద్ బ్యూరో: వచ్చే నెల 8,9 తేదీల్లో అమరావతిలో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలకు క్రింద పార్టీ ప్రకటించిన అన్ని విభాగాల వారు తప్పక హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాజకీయ కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు(పీఏసీ మెంబర్స్), కేంద్ర పాలక మండలి సభ్యులు(సీజీసీ మెంబర్స్), కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు(సీఈసీ మెంబర్స్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు, జిల్లా, నగర పార్టీ పరిశీలకులు, జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర అదనపు కార్యదర్శులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు, రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ సభ్యులు, జిల్లా నగర పార్టీ కమిటీ సభ్యులు, జిల్లా నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసినవారు, జెడ్పీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసినవారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసినవారు, మున్సిపల్ ఛైర్మన్లు కౌన్సిలర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసినవారు, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు, మండల మున్సిపల్ టౌన్ నగర డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు సింగిల్ విండో అధ్యక్షులు, దేవాలయ మాజీ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్, గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసినవారు, గ్రామ ముఖ్యులు(గ్రామం నుండి ఈ నాలుగు హోదాలలో ఎవరో ఒకరు ఆహ్వానితులుగా ఉంటారు). -
అబద్ధాల బాబుకు బుద్ధి చెబుదాం!
పదేళ్ల పాటు దూరమైన అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఆడని అబద్ధాలు, ఇవ్వని హామీలు లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుదామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ మోసాలు, అక్రమాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీని మట్టికరిపించి జగన్ నాయకత్వంలో మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకునేవరకూ నిద్రపోకూడదని దిశానిర్దేశం చేశారు. బుధవారం శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీ విజయవంతమైంది. ఉద్వేగంగా సాగిన నాయకుల ప్రసంగాలు శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్:గడిచిన మూడేళ్లలో చోటుచేసుకున్న రాజకీయ పరి ణా మాలను విశ్లేషించి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై శ్రే ణులకు దిశానిర్దేశం చేయడానికే ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం ప్రజాస్వామ్యంలో సంప్రదాయమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వివరించారు. ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... ప్లీనరీలో చర్చించిన అంశాలను, ఆమోదించిన తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులందరిపై ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద జరిగే పార్టీ జాతీయ స్థాయి ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి మూడేళ్ల హానీమూన్ ముగిసిపోయిందన్నారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు ముఖం చూపించలేక తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని నిలదీసి ప్రజల తరఫున గళం వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం వైఎస్సార్సీపీ శ్రేణులపై ఉందన్నారు. అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీ బాధ్యత బాధ్యతాయుతమైనదీ, గౌరవనీయమైనదీ అని వివరించారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓడిపోయిందనే నిరాశ తగదన్నారు. ఒక సీటు నుంచి పదిహారుకు, అక్కడి నుంచి 67 స్థానాలకు పార్టీ దినదిన ప్రవర్థమానం చెందిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్య 127కి పెరుగుతుందని, 147కి చేరినా చేరవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రాజధాని అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించేస్తూ కాలం గడిపేసిన చంద్రబాబే ఇప్పుడు వాటిని పూర్తి చేయాలంటే వచ్చే ఎన్నికలలోనూ తనను గెలిపించాలని ప్రజల ముందుకు వెళ్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంపై రుణభారం రూ.96 వేల కోట్లు ఉందని, ఈ మూడేళ్లలో మరో రూ.1.16 లక్షల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి చంద్రబాబు నెట్టేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అప్పుల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారని ప్రశ్నిస్తే టీడీపీ నాయకుల దగ్గర సమాధానం లేదన్నారు. జిల్లా అభివృద్ధి అంటే మంత్రి అచ్చెన్న ఇంట్లోనో, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఇంట్లోనో జరిగింది కాదన్నారు. పేద ప్రజల కడుపు నింపడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పచ్చచొక్కాల జేబులు నింపడానికి మళ్లిస్తోందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి పనులకు బదులు సిమెంట్ రోడ్లను వేసేసి 40శాతం నిధులు నొక్కేస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీల దోపిడీ చంద్రబాబుకు తెలియనిది కాదని, ఎన్నికలకు ముందు మాత్రం ‘అయ్యో అంత దోపిడీ చేశాయా? వాటిని రద్దు చేస్తున్నా’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారని చెప్పారు. ఈ మూడేళ్ల పరిపాలనలో 1100 అంటే సగటున రోజుకొకటి చొప్పున రహస్య జీవోలిచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఇప్పటివరకూ మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి దొంగ పాలన చూడలేదన్నారు. ఈ ప్రభుత్వ అక్రమాలను, అన్యాయాలను శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నిలదీస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని ప్రస్తావించారు. మిగతా శ్రేణులు కూడా ఎక్కడికక్కడ టీడీపీ అక్రమాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. అబద్ధాలే బాబును కాటేసే పాములు ప్లీనరీకి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు అధికారానికి సోపానాలైన అబద్ధాలే ఇప్పుడు చంద్రబాబును పాములై కాటేయబోతున్నాయని జోస్యం చెప్పారు. రైతుల రుణమాఫీ దీనికొక ఉదాహరణ అన్నారు. ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొన్న తర్వాతే రైతుల రుణాల మాఫీ చేయలేమని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పేశారు. సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకొనే చంద్రబాబుకూ ఈ విషయం తెలియనిది కాదు. రూ.84 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాల్సింది పోయి రకరకాల సాకులతో ఈ మూడేళ్లలో కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం తీర్చింది. ఎన్నికల లబ్ధి కోసం ఆయన చేసిన మోసాలను ప్రజలు గ్రహించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి బుద్ధి చెప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టాలనే నిర్ణయానికి వచ్చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయాలను నేరమయం చేసేసిన టీడీపీకి తగిన శాస్తి తప్పదు. నవనిర్మాణ దీక్షలు, విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాలు, నీరు–చెట్టు వంటి జేబులు నింపే పథకాలతో ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం దుబారా, దుర్వినియోగం చేస్తోంది. మరోవైపు నిధులు లేవంటూ ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాలు, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలను నీరుగార్చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నాటి పేదల సంక్షేమరాజ్యం మళ్లీ రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంద’ని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4.30 గంటల వరకూ కొనసాగింది. తొలుత పార్టీ జెండాను రెడ్డి శాంతి ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ప్లీనరీలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్, పేరాడ తిలక్, నర్తు రామారావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు తదితర నాయకులు ప్రసంగించారు. జిల్లా సమస్యలు, ప్రభుత్వ వాగ్దానాల భంగంపై పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి బాధ్యత అని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మాణాత్మకంగా ఎన్నికల దిశవైపు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, జడ్పీ మాజీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, జడ్పీ ఫ్లోర్‌లీడర్ ధర్మాన పద్మప్రియ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, శ్రీకాకుళం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్లు అంధవరపు వరం, ఎంవీ పద్మావతి, డాక్టర్స్ సెల్ జిల్లా కన్వీనర్ పైడి మహేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు టొంపల సీతారాం, జిల్లా అధికార ప్రతినిధులు సిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, పార్టీ నేతలు మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, తమ్మినేని చిరంజీవినాగ్, మండవిల్లి రవి, గుమ్మా నగేశ్, గొండు కృష్ణమూర్తి, మార్పు ధర్మారావు, పీస శ్రీహరి, సువ్వారి గాంధీ, సనపల నారాయణరావు, బల్లాడ జనార్దనరెడ్డి, పి.కామేశ్వరి, గొర్లె రాజగోపాల్, కేఎల్ ప్రసాద్, సురంగి మోహనరావు, కిల్లి లక్ష్మణరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కళావతి, జోగులును ఘనంగా సన్మానించారు. జగన్‌ను సీఎం చేద్ధాం టీడీపీ నాయకులు స్వార్థ చింతనతో జిల్లా అభివృద్ధిని పాతాళానికి తొక్కేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రోటోకాల్ నిబంధనలను సైతం ఉల్లంఘించి అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. సంక్షేమ పథకాల సహా అన్ని పనులు జన్మభూమి కమిటీలకు అప్పగించేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారు. జిల్లా మంత్రులు సైతం జిల్లా ప్రజల పట్ల బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నారు. మన్యం ప్రజలు జ్వరాల బారిన పడుతుంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. గిరిజనులు మనుషులు కాదా? మళ్లీ రాజశేఖరుడి పరిపాలన రావాలంటే జగన్‌ను సీఎం చేద్దాం. – విశ్వసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే వైఎస్ పాలనలో రైతురాజ్యం... దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆరేళ్లలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. రైతు రాజ్యం ఎలా ఉండాలో చేసి చూపించారు. టీడీపీ పాలన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేశారు. నాసిరకం విత్తనాలను అంటగడుతోంది. ఈ దగా ప్రభుత్వాన్ని గద్దె దించాలి. రైతు, కార్మిక, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కావాలంటే జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. – కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే ప్రజలను చైతన్యం చేయడమూ బాధ్యతే.... ప్రజలను వంచించడం చంద్రబాబుకు కొత్తకాదు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేయడాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒక బాధ్యతగా తీసుకోవాలి. పార్టీని మరింత పటిష్టం చేయాలి. వచ్చే ఎన్నికలలో జిల్లాలోని ఎంపీ సహా పది ఎమ్మెల్యే స్థానాల్లోనూ పార్టీ విజయకేతనం ఎగురవేయాలి. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు -
ప్రజా సమస్యలే అజెండాగా...
- నేడు వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ - హాజరుకానున్న రాష్ట్ర ప్రముఖులు - వేదికకు వైఎస్సార్ ప్రాంగణంగా పేరు - ఏర్పాట్లు పూర్తి చేసిన నేతలు కాకినాడ : ప్రజా సమస్యలు, తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు పూర్తి చేశారు. కాకినాడకు సమీపంలోని తూరంగి–నడకుదురు రహదారిలోని కుసుమ సత్య కన్వెన్షన్ హాలు వద్ద ఈ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ జరిగే వేదికకు వైఎస్సార్ ప్రాంగణంగా పేరు పెట్టి అవసరమైన ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు జిల్లా ముఖ్యనేతల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. జెండా వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రముఖులు ప్లీనరీకి విచ్చేస్తున్నారు. 30 వేల మందికి ఆహ్వానాలు... మున్నెన్నడూ జరగని రీతిలో జిల్లా ప్లీనరీని నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం సుమారు 30 వేల మందికి నాయకులు, కార్యకర్తకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు కూడా పంపారు. ఆయా నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ముఖ్య నేతలను సమన్వయం చేసి ప్లీనరీకి ఆహ్వానించారు. ప్రముఖుల రాక... జిల్లా ప్లీనరీకి రాష్ట్ర స్థాయిలోని పార్టీ ప్రముఖులను ఆహ్వానించారు. జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ప్లీనరీ ప్రత్యేక ఆహ్వానితులు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.పార్థ సారథి, రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ,బీసీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున, జంగా కృష్ణమూర్తి ప్లీనరీకి విచ్చేస్తున్నారు. .ప్రజా సమస్యలే అజెండా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీకి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా చర్చించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ప్లీనరీలో అనేక ప్రధాన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో జరిగిన ప్లీనరీల్లో చర్చకు వచ్చిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని జిల్లా ప్లీనరీలో తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి నివేదించనున్నారు. ఏర్పాట్లు పూర్తి... ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను పార్టీనేతలు పూర్తి చేశారు. జిల్లాకు చెందిన అనేక మంది నేతలను సమన్వయం చేసి బాధ్యతలు అప్పగించారు. వేదిక అలంకరణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పార్టీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను నేతలు పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీకి తరలిరండి... జిల్లా ప్లీనరీకి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలిరావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గ స్థాయిల్లో జరిగిన ప్లీనరీల్లో చర్చకు వచ్చిన అంశాలపై కూడా చర్చించనున్నారు. జిల్లాస్థాయి అంశాలను కూడా చర్చించి తీర్మానాల రూపంలో రాష్ట్ర పార్టీకి నివేదిస్తాం. రాష్ట్ర స్థాయి ప్లీనరీ అనంతరం పార్టీ ఆదేశాల మేరకు ప్రజలకు అండగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. - కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
సమరమే..
♦ అరాచక పాలనకు చరమగీతం.. ♦ కార్యకర్తలపై దాడులను సహించేది లేదు ♦ జగన్ పేరు వింటేనే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు ♦ వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీలో గళమెత్తిన నాయకులు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని, సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, త్వరలోనే తెలుగుదేశం పార్టీని పాతాళంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు పునరుద్ఘాటించారు. ఆదివారం ఏలూరు మినీబైపాస్ రోడ్డులోని క్రాంతి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రుణమాఫీ ఫైలుపై సంత కం చేసిన చంద్రబాబు మూడేళ్లయినా ఆ హామీని నెరవేర్చలేకపోయారని, అదేమని అడిగితే కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలు, అన్నదాతలను నమ్మించి నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణ పాలన జగన్‌తోనే సాధ్యం : బొత్స వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీలో అందరూ దొంగలేనని, ప్రతి నేతకూ ఓ మచ్చ ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు హాయిగా నిద్రపోవాలంటే దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగం తిరిగి రావాలని, అది ఒక్క వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బెదిరిపోయేంత పిరికివాళ్లు కాదన్నారు. వారు గ్రామాన్ని, మండలాన్ని, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలరని, 2019లో జరిగే మహా సంగ్రామంలో సడలని పోరాట పటిమతో పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మైనార్టీలకు అన్యాయం పార్టీ జిల్లా ఇన్చార్జ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. మైనార్టీలకు ఏడాదికి రూ.1500 కోట్లు ఇస్తానని చెప్పిన బాబు తన మూడేళ్ల పాలనలో ఇప్పటికీ రూ.1500 కోట్లను ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఉపాధి పథకాన్ని సాగుకు అనుసంధానం చేయాలి ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, చేనేత రంగంలో ఉత్పత్తి చేసే ప్రతి వస్త్రానికీ 30 శాతం రిబేటు ఇవ్వాలని, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఆర్ఆర్ఆర్ పథకం కింద రూ.100 కోట్లు కేటాయించాలని తీర్మానించారు. బాబుకు ప్రజలంటే చిన్నచూపు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నాయకులు గడపగడపకూ వైఎస్సార్ పేరుతో ప్రజలను కలుస్తుంటే టీడీపీ నాయకులు భయపడుతున్నారన్నారు. నవ్యాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంశాలను చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. ఇప్పటికీ సాగు, తాగు నీటి కోసం పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు వ్యవసాయమంటే చులకన అని, రైతులన్నా.. ప్రజలన్నా.. చిన్నచూపని విమర్శించారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వంకా రవీంద్ర మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున జిల్లాలో ఒక గొప్ప టీం పనిచేస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపన కోసం బాబు రూ.200 కోట్లు ఖర్చుపెట్టి విదేశాలు తిరిగి వచ్చారు.. తప్ప ఇప్పటికీ ఒక్క విదేశీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు వంకా రవీంద్ర, కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, పాతపాటి సర్రాజు, తెల్లం బాలరాజు, తానేటి వనిత, గంటా మురళీరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు కవురు శ్రీనివాస్, దయాల నవీన్ బాబు, కొఠారు రామచంద్రరావు, తలారి వెంకటరావు, పుప్పాల వాసుబాబు, రాజీవ్‌కృష్ణ, గుణ్ణం నాగబాబు, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఇందుకూరి రామకృష్ణం రాజు, పార్టీ నేతలు చీర్ల రాధయ్య తదితరులు పాల్గొన్నారు. జగన్ పేరు వింటే టీడీపీ నేతలకు హడల్ ప్లీనరీకి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ ఇటీవల కొవ్వూరులో జరిగిన టీడీపీ మినీ మమానాడులో గానీ, రాష్ట్రస్థాయిలో జరిగిన మహానాడులో గానీ టీడీపీ నాయకులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేరు ఎత్తకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ పేరు చెబితే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇటీవల కర్నూలులో జరిగిన సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని, ఇది ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నంధ్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అక్కడి ప్రజలను భయపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు రూ.5 వేలు ఇస్తానని అనడం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. పైగా ఆ 5 వేలూ తిరిగి ప్రజల వద్ద నుంచే వసూలు చేస్తాననడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు కుటిల యత్నాలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 3 పార్లమెంట్, 15 అసెంబ్లీ స్థానాలనూ వైఎస్సార్ సీపీకి కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. -
సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి
♦ మంత్రి పదవికోసం పార్టీ మారడానికి సిగ్గు లేదా? ♦ నీతిమంతులమని చెప్పుకునేవారి బండారం త్వరలోనే బయటపెడతా ♦ కేంద్రమంత్రిగా ఉండి ఏం అభివృద్ధి వెలగబెట్టారు? ♦ కోటచుట్టూ మొక్కలు నాటించడమే అభివృద్ధా? ♦ మంత్రి పదవులు కేవలం ఆస్తులు కాపాడుకోవడానికేనా? ♦ అశోక్, సుజయ్‌పై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ ♦ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయం: భూమన ♦ విజయవంతమైన విజయనగరం వైఎస్సార్సీపీ ప్లీనరీ విజయనగరం మున్సిపాలిటీ: నిజమైన రాజరిక వంశీయుడివై.. తాండ్రపాపారాయుని వంశంలో పుట్టి ఉండి... సిగ్గు... పౌరుషం ఉంటే తక్షణమే ఏ పార్టీ జెండాతో ఎమ్మెల్యేగా గెలిచారో... ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రి సుజయ్‌కు సవాల్ విసిరారు. విజయనగరం పట్టణంలోని జగన్నాథ కల్యాణ మండపం ఆవరణలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అధ్యక్షతన శనివారం జరిగిన పార్టీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తొలుత పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాస్, ఇతర నాయకులు కోలగట్ల, పెనుమత్సతో కలసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ జిల్లాలోని ఇద్దరు మహారాజులకు మంత్రి పదవులిస్తే వారి ఆస్తులు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని మండిపడ్డారు. వారికి రైతు, సామాన్య కుటుంబాలవారి కష్టాలు, ఇబ్బందులు వారికి పట్టవన్నారు. నీతి మంతులమని చెప్పుకుంటున్న వారి దొంగపనులను, దోపిడీ వ్యవహారాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు. తాను దొడ్డిదారిలో వస్తున్నానని ప్రచారం చేస్తున్న మంత్రి సుజయ్ చేసిందేంటని ప్రశ్నించారు. అధి కారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోనే తాను చేరితే...ఒక పార్టీ గుర్తుపై గెలిచి అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని అనుభవించటాన్ని ఏమంటారని ప్రశ్నించారు. ఇదేం రాజనీతి? జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాననని చెప్పి... మాన్సాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు పావులు కదిపి... చివరికి మెడికల్ కళాశాల రాకుండా చేయడమేనా రాజనీతి అని అశోక్‌గజపతిరాజుపై బొత్స ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా ఇప్పటివరకూ జిల్లాకు చేసింది ఏంటని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే సొంత కోట చుట్టూ, పెద్ద చెరువు చుట్టూ మొక్కలు నాటించటమేనా అని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల అనంతరం తాను జిల్లా వదిలి పోరిపోయానని ప్రచారం చేస్తున్నారని, అయితే ప్రజల తీర్పుకు అనుగుణంగా వారేం అభివృద్ధి చేస్తారో చూసేందుకే ఇన్నాళ్లూ వేచి చూశానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో రహదారుల విస్తరణను అడ్డుకున్నదీ, చెల్లూరు వద్ద కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నదీ ఎవరో జనానికి తెలుసన్నారు. గతంలో తానే మద్యం సిండికేట్‌ను నడుపుతున్నట్లు ప్రచారం చేసిన కేంద్రమంత్రి తన కారులో పక్కనే కూర్చుంటున్న వారితో పాటు ఇతర తొత్తులు చేస్తున్నది ఏంటో తెలుసుకోవాలన్నారు. కావాలంటే వారి పేర్లను పంపిస్తామని చెప్పారు. ప్రతిసారీ తనపై ఆరోపణలు చేస్తున్న ఇద్దరు మంత్రులు తన అవినీతి, అక్రమాలను నిరూపించగలిగితే శాశ్వతంగా రాజ కీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా అందరి దృష్టి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంపైనే ఉండాలని, జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ గెలిస్తే వైఎస్సార్ హయాంలో కడప మాదిరి విజయనగరం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములునాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు, డీసీసీబీ ఛైర్పర్సన్ మరిశర్ల తులసి, వైస్ చైర్పర్సన్ చనుమళ్ల వెంకటరమణ, ఎస్‌కోట నియోజకవర్గ ఇన్చార్జి నెక్కల నాయుడుబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రొంగలి జగన్నాథం, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పిళ్లా విజయ్‌కుమార్, ఎ.కె.వి.జోగినాయుడు, అలజంగి జోగారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శులు అవనాపు విజయ్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, జి.వి.రంగారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మ, యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎం.ఎల్.ఎన్.రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షుడు షకీల్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఎం.సన్యాసినాయుడు, ప్రచార విభాగం అధ్యక్షుడు ఎం.కృష్ణమోహన్, గర్భాపు ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై తీర్మానాలు: జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన వైఎస్సార్సీపీ ఆదేశాల మేరకు జిల్లాలో 9 నియోజకవర్గాలో ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఆ సమావేశాల్లో స్థానిక సమస్యలపై చేసిన తీర్మానాలతో పాటు జిల్లా సమావేశంలో చేసిన 9 తీర్మానాలను వచ్చే నెల 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర ప్లీనరీలో ప్రవేశపెడతామన్నారు. అధికార పార్టీ చేపడుతున్న అక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై ఆలుపెరగని పోరాటం చేసేందుకు జగన్ సారధ్యంతో ముందుకు దూసుకువెళతామన్నారు. డబ్బులిచ్చి మంత్రి పదవి కొన్నారు: మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి జిల్లాలో ఇటీవల దొడ్డిదారిన మంత్రి ఆయన సుజయ్ ఆ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్‌కు డబ్బులిచ్చి కొనుక్కున్నారని మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు అన్నారు. ప్రజా సమస్యలు పట్టని మంత్రి కోటను ముట్టడించాలని పిలుపునిచ్చారు. టీడీపీలో దమ్మున్న నాయకుడు లేకే కొత్తగా పార్టీలో చేరినవారికి మంత్రి పదవి ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రజా నాయకుడు జగన్: పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమన ప్రజల కన్నీళ్లు, కష్టాలు తీరాలంటే... అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఒక్కటే మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మరల రాజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డితో సాధ్యపడుతుందన్నారు. విజయమే లక్ష్యం కావాలి: జిల్లా ఇన్చార్జి ధర్మాన కృష్ణదాస్ గ్రామాల్లో, పట్టణాల్లో తటస్థంగా ఉండే ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేలా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా ఇన్చార్జి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలంటే ప్రతి ఓటరూ ముఖ్యమేనన్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి... ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. -
నేడు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్లీనరీ
- మెగాసిరి ఫంక్షన్ హాల్లో ఉదయం10 గంటలకు నిర్వహణ - వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెగాసిరి ఫంక్షన్ హాలులో గురువారం ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక పరిశీలకులుగా తిరుపతి ఎంపీ వరప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితులుగా అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతారన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీల్లో వెలుగులోకి వచ్చిన సమస్యలపై చర్చించి రాష్ట్ర స్థాయి ప్లీనరీకి పంపనున్నట్లు వివరించారు. జూలై 8, 9 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్లీనరీ అనంతరం ప్రభుత్వానికి సమస్యలపై డిమాండ్‌ను అందజేస్తారన్నారు. అప్పటికీ స్పందించకపోతే పోరాటాలకు శ్రీకారం చుడతామన్నారు. జిల్లా ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావాలని కోరారు. వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్‌లో చేరిక నగరంలోని వివిధ కాలేజీల్లో బీటెక్ చదువుతున్న 100 మందికి పైగా విద్యార్థులు బుధవారం గౌరు వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్‌లో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాలీ, డ్యానీ, ఖాన్, చైతన్య ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు గౌరు వెంకటరెడ్డి పార్టీ కండువా వేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్లీనరీ
– మెగాసిరి ఫంక్షన్హాల్లో నిర్వహణ – ప్రత్యేక పరిశీలకుడిగా తిరుపతి ఎంపీ వరప్రసాద్ రాక – ప్రత్యేక ఆహ్వానితులుగా అనంత, రవీంద్రనాథ్‌రెడ్డి హాజరు – నియోజకవర్గాల ప్లీనరీ తీర్మానాలపై లోతైనా విశ్లేషణ – విజయవంతం చేయాలని ఎంపీ బుట్టా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 22 మెగాసిరి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన ఉదయం 10గంటలకు ప్రారంభించనున్న కార్యక్రమానికి ప్రత్యేక పరిశీలకుడిగా తిరుపతి ఎంపీ వరప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితులుగా అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి హాజరు కానున్నట్లు వివరించారు. ఇటీవల నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్లీనరీలు విజయవంతమయ్యాయన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి మరణంతో పత్తికొండలో మాత్రం ప్లీనరీ జరగలేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన అమలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. 13 నియోజకవర్గాల ప్లీనరీల్లో తీర్మానించిన సమస్యలపై జిల్లా స్థాయి ప్లీనరీలో లోతైనా విశ్లేషణ చేసి ప్రభుత్వానికి డిమాండ్‌గా ఉంచుతామన్నారు. జిల్లా స్థాయి ప్లీనరీలో ఆమోదించిన సమస్యలను రాష్ట్ర స్థాయి ప్లీనరీలో కూడా ఉంచి ఆమోదం తరువాత ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వివరించారు. జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి వైఎస్ర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, సత్యం యాదవ్, శౌరీ విజయకుమారి, నరసింహులు యాదవ్, కృష్ణారెడ్డి, రాజా విష్ణువర్దన్‌రెడ్డి, టీవీ రమణ, ఫిరోజ్‌ఖాన్, గోపీనాథ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం: గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే సీఎం చంద్రబాబునాయుడు జిల్లాలో చేసిన అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైంది. జిల్లాకు సీఎం ఎన్నికల సమయంలో 93హామీలు, 2014 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 33 హామీలు ఇచ్చినా అందులో 20 శాతం కూడా అమలు కాలేదు. అమలైనా వాటిలో టీడీపీ నాయకులు, మంత్రులకు మేలుచేసే పథకాలే ఎక్కువగా ఉన్నాయి. పాణ్యం నియోజకర్గంలోని ఓర్వకల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెడుతున్నారు. సీఎం జిమ్మిక్కులను ముస్లింలు నమ్మరు: హఫీజ్‌ఖాన్, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు నంద్యాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.90 లక్షలతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లింలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జిమ్మిక్కులను ముస్లింలెవరూ నమ్మరు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లింలను బలవంతంగా అధికార బలంతో బస్సుల్లో నంద్యాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరాధ్య దైవం. సీఎం చంద్రబాబునాయుడుకు నిజంగా ముస్లిలపై ప్రేమ ఉంటే ఉర్దూ యూనివర్సిటీ, పాఠశాలలు, కళాశాలల సమస్యలను పరిష్కరించాలి. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలి. వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి భర్తీ చేయాలి. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరు: బీవై రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీదే విజయం. సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల వరకు నంద్యాలలోనే తిష్టవేసినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమను చూసిన ప్రజలు ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. -
ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా జరపాలి: జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్ష... ముఖ్య నేతల హాజరు సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సోమవారం ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ప్లీనరీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గుంటూరు – విజయవాడ మధ్య గల ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఎంపిక చేసిన స్థలంలో జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరగాలని నిర్ణయించిన విషయం విదితమే. పార్టీ పిలుపు నిచ్చిన విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్లీనరీలు చాలా బాగా జరిగాయని జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కింది స్థాయి నుంచీ చాలా ఉత్సాహంగా జరిగిన ఈ సమావేశాల వల్ల పార్టీ శ్రేణులకు మంచి ఊపు నిచ్చిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టతకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడ్డాయని కూడా ప్రస్తావించారు. అసెంబ్లీ ప్లీనరీల విజయవంతం కావడం ప్రజాభీష్టాన్ని సూచిస్తోందని కూడా నేతలు పేర్కొన్నారు. జిల్లా ప్లీనరీలను కూడా ఇదే ఒరవడిలో పూర్తవుతాయనే ఆశాభావం వ్యక్తం అయింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరుగుతోందని కనుక దాని ప్రభావం గుంటూరు, కృష్ణా జిల్లాలపై బాగా ఉంటుందనే విషయం చర్చించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో అసహనం పెరుగుతోందనేది స్పష్టంగా వెల్లడవుతోంది కనుక వచ్చే రెండేళ్లలో ఎన్నికల వరకూ ప్రభుత్వంపై పోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ ప్లీనరీలో సిద్ధం చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తీర్మానాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్లీనరీని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీల నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మళ్లీ ఈ నెల 23వ తేదీన ప్లీనరీ ఏర్పాట్ల సమీక్షపై నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎస్.దుర్గాప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ పాల్గొన్నారు. -
కృష్ణా, గుంటూరు నేతలతో వైఎస్ జగన్ భేటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జులై 8, 9 తేదీల్లో నిర్వహించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీపై వైఎస్ జగన్ చర్చించారు. ఇప్పటికే అన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో త్వరలో జిల్లాస్థాయిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ప్లీనరీ సమావేశాల్లో ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ప్లీనరీ కమిటీలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. -
చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి
-
28న వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశం
శ్రీకాకుళం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించ నున్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ప్లీనరీని విజవంతం చేయాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాటాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల స్థాయి, జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ప్లీనరీ సమావేశాలను నిర్వహించామని చెప్పారు. సమావేశాలు విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసిందన్నారు. ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను, అవినీతి, అన్యాయాలను ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లడంలో సఫలీకృతమయ్యామన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరగనున్న జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశంలో 10 నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులన్నీ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి జిల్లా పరిశీలకులు కొయ్య మోషేన్‌రాజు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ కిల్లి సుభాష్ చంద్రబోస్‌లు హాజరవుతారని పేర్కొన్నారు. పీఏసీ, సీజీసీ సభ్యులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, సంయుక్తకార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మాజీ చైర్పర్సన్లు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్‌లు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశం విజయవాడలో జూలై 8, 9వ తేదీల్లో జరుగుతుందని, అక్కడికి కూడా అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశం
- కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు హాజరుకావాలి - పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సన్నాహక సమావేశాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహించామని, జిల్లా స్థాయి ప్లీనరీ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. జిల్లా ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలనే అంశంతోపాటు, సమావేశ అజెండా, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లా ప్లీనరీకి పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ప్లీనరీ పరిశీలకులుగా పార్టీ నియమించిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరవుతారన్నారు. సన్నాహక సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, ఇతర ముఖ్యనేతలు విధిగా హాజరుకావాలని కన్నబాబు కోరారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
21న జిల్లా ప్లీనరీని విజయవంతం చేయండి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు శంకరనారాయణ మడకశిర : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ విమర్శించారు. ఆయన బుధవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థులు తదితర అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. అనంతపురంలో ఈనెల 21న నిర్వహించనున్న వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో జిల్లా సమస్యలతోపాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనా లోతుగా చర్చిస్తామన్నారు. ప్రధాన సమస్యలపై ఈ ప్లీనరీలో తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన నియోజకవర్గ ప్లీనరీలు విజయవంతమయ్యాయని, విశేష స్పందన లభించిందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మడకశిర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామికి సహాయ సహకారాలు అందించి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీసీసీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఎస్ఆర్ అంజినరెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అనంతరాజు, సోమనాథ్‌రెడ్డి, ఉగ్రప్ప, మడకశిర మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్లీనరీకి తరలిరావాలి
► పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ జనగామ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల మూడో వారంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్లీనరీకి కార్య కర్తలు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్ రాజ్ అన్నారు. పట్టణంలో శుక్రవారం వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చిన్నపాగ వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. ప్లీనరీకి వైఎస్సా ర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హా జరుకానున్నట్లు చెప్పారు. ప్లీనరీలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడెకరాల భూపంపిణీ విషయంలో వైఫల్యంతో పాటు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కేవలం వందల సం ఖ్యలో భర్తీచేయడం దారుణమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీకి తెలంగాణలో మంచి భవిష్యత్ ఉం టుందని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కందికొండ భిక్షపతి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఐలయ్య, ఎస్సీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రొడ్డ కృష్ణ, చింతకింది శ్రీహ రి, మండల అధ్యక్షుడు బక్క జంపన్న, నాయకులు ఊరిడి శ్రీనివాస్, దేవరాయ ఆంజనేయులు, రడపాక భాస్కర్, జంగిశేఖర్, బొట్ల నవీన్, గుండె శ్రీకాంత్, దారావత్ నరేష్, కల్లెపు ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
చమురు సంస్థల అన్యాయంపై సమరం చేయాలి
-ముమ్మిడివరం వైఎస్సార్ సీపీ ప్లీనరీలో ఎమ్మెల్సీ బోస్ -టీడీపీ పాలనపై కన్నబాబు, పినిపే ధ్వజం ముమ్మిడివరం : చమురు సంస్థల నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ముమ్మిడివరం శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణమండపంలో బుధవారం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రత్యేకమైన ప్రాంతమైన కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలు విరివిగా జరగటంతో సీఎస్ఆర్ నిధులతో మంచి అభివృద్ధి జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశించారన్నారు. ఈ ప్రాంతంలో ఆ నిధులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కళాశాలల వంటివి నిర్మించక పోవడం దురదృష్ణకరమన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు సరైన అవగాహన లేకపోవడంతో ఆ నిధులను అతిథి గృహాలకు, కల్యాణ మండపాలకు, కేటాయించడం శోచనీయమన్నారు. ఈ అంశాలపై ప్లీనరీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్లీనరీలో ప్రవేశపెట్టాలని సూచించారు. మరో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని విమర్శించారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మిస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలకగా ప్రభుత్వ అవినీతిలో అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. సబ్ ప్లాన్ నిధులను షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలలో ఖర్చుచేయకుండా అమరావతిలో నిర్మించే 120 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి మళ్లించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ౖఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం కావాలన్న లక్ష్యంతో కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా అప్పటి ఉమ్మడి రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకొని వెళ్లిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌కే దక్కిందన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్ల్రంలో14లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తే తన హయాంలో 73లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ ప్రవేశపెడితే చంద్రబాబు అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశార విమర్శించారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నా భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సమావేశంలో గ్రేటర్ రాజమండ్రి కోఆర్డినేటర్ కందుల దుర్గేష్, పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర పార్టీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరావు, రాజమండ్రి నగర పాలక సంస్థఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు భూపతిరాజు సుదర్శనబాబు, పెయ్యల చిట్టిబాబు, పాలెపు «ధర్మారావు, ఏడిద చక్రపాణిరావు, మిండగుదిటి మోహన్, అత్తిలి సీతారామస్వామి, కొల్లి నిర్మలాకుమారి, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
ప్లీనరీలకు పోటెత్తిన శ్రేణులు
చంద్రబాబు రాక్షస పాలనను ఎండగట్టిన నేతలు పార్టీ ఫిరాయింపుదారులకు చురకలు కేడర్‌లో ఉత్సాహం నింపిన నాయకులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో మంగళవారం జరిగిన మూడు ప్లీనరీలకు అభిమానులు పోటెత్తారు. ప్లీనరీలు జరిగిన వేదికలు తరలివచ్చిన శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. కాకినాడ రూరల్, రాజోలు, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బొంతు రాజేశ్వరరావు, రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగాయి. కాకినాడ రూరల్ ప్లీనరీ జరిగిన స్పందన ఫంక్షన్ హాలు కేడర్‌తో నిండిపోవడంతో బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాజోలు, రాజమహేంద్రవరం సిటీ ప్లీనరీలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోన్న వైనాన్ని జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎత్తిచూపారు. ప్రజావ్యతిరేక విధానాలను, మోసపూరిత విధానాలను ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేత వైఎస్, మాట తప్పేవాడే బాబు అని ఇద్దరి మధ్య ఉన్న అంతరాన్ని ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విశ్లేషించారు.మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రంలో తండ్రీ కొడుకులు దొంగపాలన చేస్తూ ప్రజలను దోచుకు తింటున్నారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఫిరాయించిన జిల్లా నేతలను తన సహజ శైలిలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరోక్ష హెచ్చరికలతో చురకలంటించిన తీరు కేడర్‌లో ఉత్తేజాన్ని నింపింది. శివకోడులో రాజోలు ప్లీనరీ కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో సుఖశాంతులతో ఉన్న ప్రజలు చంద్రబాబు గద్దెనెక్కాక రాక్షస పాలన కొనసాగిస్తున్న వైనాన్ని రాజోలు ప్లీనరీలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎండగట్టారు. దళిత ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతారని రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున చంద్రబాబు అన్నారు. నిరంకుశ పాలనపై దండెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకునే వారిని జగన్మోహన్ రెడ్డి గుర్తించి పగ్గాలు అప్పగిస్తారని చెబుతూ కేడర్ అంతా కలిసి కట్టుగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ పరిశీలకుడు వలవల బాబ్జీ, డీసీసీబీ డైరెక్టర్ పాముల విజయరంగారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి టీడీపీ రాక్షస పాలనను ఎండగట్టారు. రాజమహేంద్రవరం సిటీ ప్లీనరీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి చంద్రబాబు మోసాలను శాస్త్రీయంగా విశ్లేషించిన తీరు కేడర్‌ను ఆకర్షించింది. బాబు హస్తం భస్మాసురమని రాజమహేంద్రవరం గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ సూత్రీకరించారు. ఆయా ప్లీనరీలలో మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరి, రౌతు సూర్యప్రకాశరావు టీడీపీ మోసాలను ఎండగట్టారు. కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, ముత్యాల శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్ పార్టీ కేడర్‌కు దిశానిర్థేసం చేశారు. ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు టీడీపీ మోసాలను ఎండగట్టారు. రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని కేడర్‌లో మనోధైర్యాన్ని నింపారు. వైద్య, ఎస్సీ విభాగాల అధ్యక్షులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
అవినీతి ప్రదేశ్‌గా మార్చారు ఐకమత్యంతో పని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేద్దాం ‘అనంత’ ప్లీనరీలో వైఎస్సార్సీపీ నేతల పిలుపు అనంతపురం : టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ పాలనకు చరమగీతం పాడేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని గొంగటి రామప్ప ఫంక్షన్ హాలులో అనంతపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీ జరిగింది. పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడారు. ప్రజల కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారన్నారు. విలువలు, విశ్వసనీయత అనేది వైఎస్ కుటుంబం నుంచే నేర్చుకున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఓడిపోయినంత మాత్రాన తాము జేసీ దివాకర్రెడ్డిలాగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోలేదన్నారు. నియోజకవర్గంలోనే ఉన్నామని, విలువలు, విశ్వసనీయతతో రాజకీయాల్లో ఉన్నంత కాలమూ ప్రజలు ఆదరిస్తారని అన్నారు. నాయకులంతా సమష్టిగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని రెండు ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, నాయకులు గిర్రాజు నగేష్, అనంత చంద్రారెడ్డి, పామిడి వీరాంజనేయులు, మీసాల రంగన్న, మునిరత్నం శీనా తదితరులు పాల్గొన్నారు. ఆధిపత్యం కోసం మూడు స్తంభాలాట – మాజీ ఎంపీ అనంత నగరంలో ఆధిపత్యం కోసం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప మూడు స్తంభాలాట ఆడుతున్నారు. నగర అభివృద్ధిని పక్కన పెట్టి కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. ఎమ్మెల్యే చౌదరి మూడు లక్షల మొక్కలు నాటామని చెబుతున్నారు. అవి ఎక్కడ పెరిగి చెట్లు అయ్యాయో చెప్పాలి. నగరాన్ని మురికికూపంగా మార్చేశారు. పైపులైను పనుల్లో ప్రజాధనం దోపిడీ చేశారు. మరో 30 ఏళ్లు నగరానికి నీటి సమస్య లేకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పీఏబీఆర్ పథకాన్ని తీసుకొచ్చాం. ఇందిరమ్మ పాలనను వైఎస్ మరిపించారు. అలాంటి పాలన మళీ రావాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయనపై ప్రజల్లో నమ్మకం ఉంది. మూర్ఖత్వంతో వెళ్తున్నారు – ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి చంద్రబాబు మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో విద్య,వైద్యం నిర్వీర్యమయ్యాయి. రాయలసీమలో విపరీతమైన కరువు ఉంది. ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జెండాను రెపరెపలాడించాలి – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించాలి. ఇందులో భాగంగా సంస్థాగతంగా బలోపేతం కావాలి. పార్టీ శ్రేణులపై అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. టీడీపీ నేతలు సొంత డబ్బా కొట్టుకునేందుకే మహానాడు నిర్వహించారు తప్ప ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదు. అవినీతి ప్రదేశ్‌గా మార్చారు – కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్లీనరీ పరిశీలకులు చంద్రబాబు వందలాది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా మార్చారు. అత్యంత అవినీతి రాష్ట్రంగా ఏపీని ఒక సంస్థ గుర్తించిందంటే చంద్రబాబు పాలన ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కాదది.. తెలుగు ద్రోహం పార్టీ. మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. విలువలు, విశ్వసనీయతకు ఆయన పెద్దపీట వేస్తారు. -
విజయవంతంగా ప్లీనరీలు
కేడర్‌లో ఉత్సాహం నింపిన నాయకులు అమలాపురం, ప్రత్తిపాడులో ప్లీనరీల నిర్వహణ తరలివచ్చిన పార్టీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార పార్టీ ఆగడాలు, వైఫల్యాలను ఎండగట్టి వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్న ప్లీనరీలు జిల్లాలో విజవంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమలాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్లీనరీలు పార్టీ కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్, పర్వత ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. అమలాపురంలో... అమలాపురం ప్లీనరీకి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్షత్రియ కల్యాణ మండపం కిటకిటలాడింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలైన ఫీజు రీయింబర్స్మెంట్, 108, గృహ నిర్మాణం..వంటి వాటిని చంద్రబాబు సర్కార్ కోత పెడుతున్న తీరును లెక్కలతో సహా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ కార్యకర్తల ముందుంచారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.35 వేలు ఇస్తుంటే కార్పొరేట్ కళాశాలలు రూ.75 వేలు పెంచేయడంతో పేదలు పడుతున్న ఇబ్బందులు వివరించారు. తన తండ్రి జక్కంపూడి ద్వారా సంక్రమించిన రాజకీయ వారసత్వాన్నే కాకుండా ఆపద వస్తే ఎదురొడ్డేలా అప్పగించిన పోరాట పటిమను కార్యకర్తల కోసం వినియోగిస్తామని పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బాబు అమలాపురంలో కాపు ఓట్ల కోసం డిప్యూటీ సీఎం పదవి ఎరగా వేసి ఆ వర్గంపై పెట్టిన అక్రమ కేసులు పెరిగేలా చేశారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీని చేయడమే కాకుండా, జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్లకు పసుపు రంగు వేసి టీడీపీ భవనాలుగా మార్చేస్తున్న వైనాన్ని పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఎండగట్టినప్పుడు కేడర్ ఈలలతో హోరెత్తించారు. ఇందుకు అల్లవరం పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేసిన ఉదాహరణను ఆయన ఆధారాలతో వివరించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు సర్కార్‌ను అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర కార్యదర్శి కొల్లి నిర్మలాకుమారి ఎత్తి చూపారు. చంద్రబాబు వైఫల్యాలను కో–ఆర్డినేటర్లు ముదునూరి ప్రసాదరాజు, వేగుళ్ల లీలాకృష్ణ, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, పితాని బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌లు ఎండగట్టారు. పార్లమెంటు పరిశీలకుడు వలవల బాబ్జీ, ప్లీనరీ పరిశీలకులు మేడపాటి షర్మిలారెడ్డి, కర్రి పాపారాయుడు, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మి ఇజ్రాయిల్, దంగేటి రాంబాబు, చెల్లుబోయిన శ్రీనువాసు, మిండుగుదిటి మోహనరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు జక్కంపూడి కిరణ్, జున్నూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శంఖవరంలో... శంఖవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో ప్రత్తిపాడు, కొంకాపల్లి క్షత్రియ కల్యాణ మండపంలో అమలాపురం నియోజకవర్గ ప్లీనరీలు జరిగాయి. ప్రత్తిపాడు ప్లీనరీకి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పార్టీ, కార్యకర్తల మధ్య అనుబంధాన్ని మరింత పెంచే దిశగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నమే ఈ ప్లీనరీలని ముఖ్య అతిథిగా హాజరైన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఎన్నికలు ఒక ఏడాది ముందే వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న పరిస్థితులను వివరిస్తూ అందుకు పార్టీ శ్రేణులను ఈ వేదిక నుంచి సమాయత్తం చేశారు. ఎంతో నమ్మకం ఉంచి జగన్మోహన్రెడ్డి పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో ప్రకటిస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేసి తోడల్లుళ్లు పార్టీకి ద్రోహం చేసి టీడీపీలోకి ఫిరాయించేశారంటూ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పదునైన పదాలతో ఫిరాయింపుదారులను కడిగి పారేశారు. ప్లీనరీలో చర్చకు వచ్చే స్థానిక సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి జూలైలో విజయవాడలో జరిగే రాష్ట్ర ప్లీనరీకి తీసుకు వెళతామని చెప్పడం ద్వారా కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం ఇస్తుందనే విషయాన్ని నూరిపోశారు. ఈ దిశగా కార్యకర్తలను కార్యోన్ముకులను చేసేందుకు సునీల్ ప్రాధాన్యం ఇచ్చారు. ప్లీనరీ పరిశీలకుడు, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్ సమక్షంలో జరిగిన ఈ ప్లీనరీలో మాజీ మంత్రి కొప్పన మోహనరావు, కోఆర్డినేటర్లు ముత్యాల శ్రీనివాస్, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి
-
యనమల అరాచక పాలనకు చరమగీతం తప్పదు
ప్లీనరీలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : అధికారం అండతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం చామవరం శివారులో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ ప్లీనరీకి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, 2004కు ముందు టీడీపీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉండేది కాదన్నారు. ఇప్పుడు గుండెధైర్యంతో ఎక్కడైనా ఎప్పుడైనా సభలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు. ఎన్నో కేసులు పెట్టి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ వెరవక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో వేలాదిమంది తనవెంట నడవడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. మూడు నియోజకవర్గాలకు సేవలందించే తుని ఏరియా ఆస్పత్రిని టీడీపీ నాయకులు ఆదాయ వనరుగా చేసుకుని పేదల రక్తాన్ని సొమ్ముల రూపంలో పిండుకుంటున్నారన్నారు. తుని నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్, భూములవంటివాటిని విచ్చలవిడిగా దోచుకునేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆర్థిక మంత్రి సొంత గ్రామమైన ఏవీ నగరంలో 105 మందికి చెందిన పింఛన్ల సొమ్మును స్వాహా చేస్తున్నా స్పందించలేదన్నారు. నిజంగా సిగ్గుంటే దీనిపై విచారణ జరిపించి పేదలకు పింఛను సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో సభాప్రాంగణం కిక్కిరిసింది. టీడీపీని ఎప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడానికి ప్లీనరీకి వచ్చిన జనసందోహమే నిదర్శనమని రాజా అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్లీనరీ ఇన్చార్జి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, పెండెం దొరబాబు, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఉత్సాహం పంచి..ఉత్తేజం నింపి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజాధనాన్ని దుబారా చేస్తూ.. అధికారులపై ఒత్తిడి తెస్తూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలు పేలవంగా సాగుతుంటే.. వైఎస్సా ర్ సీపీ నిర్వహిస్తున్న నియోజకవర్గ ప్లీనరీలకు జనం నుం చి మంచి స్పందన లభిస్తోం ది. గత మూడు రోజులుగా జిల్లాలో ప్లీనరీలు జరుగుతుండగా.. ఆదివారం ఒక్క రోజే ఐదు నియోజకవర్గాల్లో ప్లీనరీలు నిర్వహించారు. వీటికి పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. తుని, రాజానగరం, జగ్గంపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీలకు రాష్ట్ర నేతలు తరలిరావడం పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర, ప్రజాప్రతినిధులు, నేతలు ప్లీనరీల్లో ఎండగడుతున్న తీరుకు పార్టీ కేడర్‌తో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు వంటి అగ్రనేతలు ఒకేసారి ఆదివారం తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.∙తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన ప్లీనరీకి అనూహ్య రీతిలో జనం తరలివచ్చి స్థానికంగా యనమల సోదరులపై వ్యతిరేకతను చాటారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైనాన్ని పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు వివరించారు. మంత్రి యనమల సోదరుల అరాచకాలను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎండగట్టినప్పుడు నియోజకవర్గం నలుమూలల నుంచీ తరలివచ్చిన జనం నుంచి ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. తునిలో నడుస్తున్న దోపిడీ రాజ్యాన్ని ఎదుర్కొనేందుకు వెన్నంటి ఉంటానన్నప్పుడు ‘జై రాజా’ అనే నినాదాలు మిన్నంటాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తీరుతో ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. యనమల ఆగడాలు సాగుతున్నా జనం భయపడకుండా ఎమ్మెల్యే రాజాకు అండదండలు అందిస్తుండటం అభినందనీయమని కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ అన్నారు. రెండేళ్లలో రానున్న కురుక్షేత్రంలాంటి ఎన్నికల్లో పాండవుల్లా అధికారాన్ని చేపట్టేందుకు సైనికుల్లా పని చేయాలని పరిశీలకుడు కందుల దుర్గేష్ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ∙జగ్గంపేటలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గ పాలనను దుయ్యబట్టారు. అవినీతిని, దోపిడీని రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేశారని, చట్టాలను మార్చి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఓడిపోలేదని, మొదట ఒక సీటు, తరువాత 17 సీట్లు, గత ఎన్నికల్లో 67 సీట్ల స్థాయికి చేరుకుందని చెబుతూ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు జిల్లా ప్లీనరీ ఉంటుందని వివరించారు. టీడీపీ మహానాడు ఫుడ్ ఫెస్టివల్‌గా మారిందని, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కాకినాడ పీతలు తప్ప ప్రజల సమస్యలు పట్టలేదని విమర్శించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పాగా వేయడమే లక్ష్యంగా పని చేయాలని, జగ్గంపేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. దివాన్‌చెరువులోని ఎంఎఫ్ కన్వెన్షన్ హాలులో జరిగిన వైఎస్సార్ సీపీ రాజానగరం నియోజకవర్గ ప్లీనరీకి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహానేత వైఎస్, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావుల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి కొద్దిసేపు మౌనం పాటించారు. ఇసుక, మట్టితో దొరికిన కాడికి దోచుకోవడమే చంద్రబాబు సర్కార్ విధానంగా పెట్టుకుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. నియోజకవర్గం అవినీతికి పరాకాష్టగా మారిందని, పాడైన కోడిగుడ్డు, పాలప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, విజయలక్ష్మి సాక్ష్యాధారాలతో సహా ప్లీనరీ ముందుంచారు. అవినీతికి అంతు లేకుండా ఉందని, వివిధ రకాల పథకాల పేరుతో దోపిడీయే ధ్యేయంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆక్షేపించారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అడుగుజాడల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ సూచించారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి నొక్కి చెప్పారు. ∙రావులపాలెంలో జరిగిన కొత్తపేట నియోజకవర్గ ప్లీనరీకి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు, నేతలతో ప్లీనరీ జరిగిన బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రకృతి వనరులను నిలువునా దోచుకుంటున్న చంద్రబాబు ప్రజాకంటక పాలనపై ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిప్పులు చెరిగినప్పుడు జనం చప్పట్లతో స్వాగతించారు. జన్మభూమి పేరుతో గ్రామాల్లో అక్రమాలకు పాల్పడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్న వైనాన్ని ఎండగట్టారాయన. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్లీనరీలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని జగ్గిరెడ్డితోపాటు జెడ్పీ ప్రతిపక్ష నేత సాకే ప్రసన్నకుమార్ తదితరులు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్లీనరీలో 13 తీర్మానాలను ఆమోదించారు. ∙అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక ప్రాంగణంలో ప్లీనరీ జరిగింది. ఎమ్మెల్సీ, పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పి, చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అనంతరం జనాన్ని నిలువునా ముంచేశారని, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను నీరుగార్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కుటుంబం వైఎస్సార్‌దని అన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, నీరు – చెట్టు, ఉచిత ఇసుక, మద్యం షాపులను అక్రమ ఆదాయ మార్గాలుగా చేసుకుని చంద్రబాబు అండ్ కో 420గా మారిందని తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించడంతో జనం ఈలలతో కేరింతలు కొట్టారు. అక్రమాలతో సంపాదించిన కోట్ల కరెన్సీ కట్టలతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న బాబుకు జనం ఓట్ల కట్టలతో బుద్ధి చెప్పేలా కార్యకర్తలు ముందుండి నడిపించాలంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం సర్కార్‌పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతున్నారని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా విశ్లేషించారు. ఈ ప్లీనరీల్లో పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, పరిశీలకులు వలవల బాబ్జీ, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, పెండెం దొరబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పరిశీలకులు మిండగుదిటి మోహనరావు, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర, జిల్లా నేతలు కొల్లి నిర్మలకుమారి, కర్రి నాగిరెడ్డి, మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్‌రాజు, మోతుకూరి వెంకటేష్, కర్రి పాపారాయుడు, సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహం పంచి.. ఉత్తేజం నింపి..
- వైఎస్సార్ సీపీ ప్లీనరీలకు పోటెత్తిన జనం - తరలివచ్చిన రాష్ట్ర నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రజాధనాన్ని దుబారా చేస్తూ.. అధికారులపై ఒత్తిడి తెస్తూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలు పేలవంగా సాగుతుంటే.. వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న నియోజకవర్గ ప్లీనరీలకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. గత మూడు రోజులుగా జిల్లాలో ప్లీనరీలు జరుగుతుండగా.. ఆదివారం ఒకే రోజే ఐదు నియోజకవర్గాల్లో ప్లీనరీలు నిర్వహించారు. వీటికి పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. తుని, రాజానగరం, జగ్గంపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీలకు రాష్ట్ర నేతలు తరలిరావడం పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర, ప్రజాప్రతినిధులు, నేతలు ప్లీనరీల్లో ఎండగడుతున్న తీరుకు పార్టీ కేడర్‌తో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు వంటి అగ్రనేతలు ఒకేసారి ఆదివారం తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన ప్లీనరీకి అనూహ్య రీతిలో జనం తరలివచ్చి స్థానికంగా యనమల సోదరులపై వ్యతిరేకతను చాటారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైనాన్ని పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు వివరించారు. మంత్రి యనమల సోదరుల అరాచకాలను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎండగట్టినప్పుడు నియోజకవర్గం నలుమూలల నుంచీ తరలివచ్చిన జనం నుంచి ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. తునిలో నడుస్తున్న దోపిడీ రాజ్యాన్ని ఎదుర్కొనేందుకు వెన్నంటి ఉంటానన్నప్పుడు ‘జై రాజా’ అనే నినాదాలు మిన్నంటాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తీరుతో ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. యనమల ఆగడాలు సాగుతున్నా జనం భయపడకుండా ఎమ్మెల్యే రాజాకు అండదండలు అందిస్తుండటం అభినందనీయమని కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ అన్నారు. రెండేళ్లలో రానున్న కురుక్షేత్రంలాంటి ఎన్నికల్లో పాండవుల్లా అధికారాన్ని చేపట్టేందుకు సైనికుల్లా పని చేయాలని పరిశీలకుడు కందుల దుర్గేష్ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. జగ్గంపేటలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గ పాలనను దుయ్యబట్టారు. అవినీతిని, దోపిడీని రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేశారని, చట్టాలను మార్చి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఓడిపోలేదని, మొదట ఒక సీటు, తరువాత 17 సీట్లు, గత ఎన్నికల్లో 67 సీట్ల స్థాయికి చేరుకుందని చెబుతూ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు జిల్లా ప్లీనరీ ఉంటుందని వివరించారు. టీడీపీ మహానాడు ఫుడ్ ఫెస్టివల్‌గా మారిందని, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కాకినాడ పీతలు తప్ప ప్రజల సమస్యలు పట్టలేదని విమర్శించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పాగా వేయడమే లక్ష్యంగా పని చేయాలని, జగ్గంపేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. దివాన్‌చెరువులోని ఎంఎఫ్ కన్వెన్షన్ హాలులో జరిగిన వైఎస్సార్ సీపీ రాజానగరం నియోజకవర్గ ప్లీనరీకి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహానేత వైఎస్, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావుల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి కొద్దిసేపు మౌనం పాటించారు. ఇసుక, మట్టితో దొరికిన కాడికి దోచుకోవడమే చంద్రబాబు సర్కార్ విధానంగా పెట్టుకుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆక్షేపించారు. నియోజకవర్గం అవినీతికి పరాకాష్టగా మారిందని, కోడిగుడ్డు, పాడైన పాలప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, విజయలక్ష్మి సాక్ష్యాధారాలతో సహా ప్లీనరీ ముందుంచారు. అవినీతికి అంతు లేకుండా ఉందని, వివిధ రకాల పథకాల పేరుతో దోపిడీయే ధ్యేయంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆక్షేపించారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అడుగుజాడల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరాన్ని పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ సూచించారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్లో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి నొక్కి చెప్పారు. రావులపాలెంలో జరిగిన కొత్తపేట నియోజకవర్గ ప్లీనరీకి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు, నేతలతో ప్లీనరీ జరిగిన బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రకృతి వనరులను నిలువునా దోచుకుంటున్న చంద్రబాబు ప్రజాకంటక పాలనపై ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిప్పులు చెరిగినప్పుడు జనం చప్పట్లతో స్వాగతించారు. జన్మభూమి పేరుతో గ్రామాల్లో అక్రమాలకు పాల్పడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్న వైనాన్ని ఎండగట్టారాయన. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్లీనరీలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని జగ్గిరెడ్డితోపాటు జెడ్పీ ప్రతిపక్ష నేత సాకే ప్రసన్నకుమార్ తదితరులు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్లీనరీలో 13 తీర్మానాలను ఆమోదించారు. అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక ప్రాంగణంలో ప్లీనరీ జరిగింది. ఎమ్మెల్సీ, పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పి, చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అనంతరం జనాన్ని నిలువునా ముంచేశారని, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను నీరుగార్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడే కుటుంబం వైఎస్సార్‌దని అన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, నీరు - చెట్టు, ఉచిత ఇసుక, మద్యం షాపులను అక్రమ ఆదాయ మార్గాలుగా చేసుకుని చంద్రబాబు అండ్ కో 420గా మారిందని తనదైన శైలిలో వాక్బాణాలు సంధించడంతో జనం ఈలలతో కేరింతలు కొట్టారు. అక్రమాలతో సంపాదించిన కోట్ల కరెన్సీ కట్టలతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న బాబుకు జనం ఓట్ల కట్టలతో బుద్ధి చెప్పేలా కార్యకర్తలు ముందుండి నడిపించాలంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం సర్కార్‌పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతున్నారని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా విశ్లేషించారు. ఈ ప్లీనరీల్లో పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, పరిశీలకులు వలవల బాబ్జీ, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, పెండెం దొరబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పరిశీలకులు మిండగుదిటి మోహనరావు, శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర, జిల్లా నేతలు కొల్లి నిర్మలకుమారి, కర్రి నాగిరెడ్డి, మార్గాని గంగాధర్, గొల్లపల్లి డేవిడ్‌రాజు, మోతుకూరి వెంకటేష్, కర్రి పాపారాయుడు, సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
బాబు..రాయలసీమ ద్రోహి
- రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి - విలయతాండవం చేస్తున్న కరువు - నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం - విజయవంతమైన ప్లీనరీ నంద్యాల: రాయలసీమకు అన్యాయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీమ ద్రోహిగా మారారని వైస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ నంద్యాల నియోజకవర్గం ప్లీనరీ.. స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవైరామయ్య, ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వేదికపైన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీగంగుల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జిలు బుడ్డా శేషారెడ్డి, కాటసాని రామిరెడ్డి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల హత్యకు గురైన చెరుకులపాడు నారాయణరెడ్డి చిత్రపటానికి కూడా వీరు పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ నేత ద్వారం మాధవరెడ్డి అధ్యక్షతన ప్లీనరీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పాలన కొనసాగుతోందన్నారు. వైఎస్ఆర్ హయాంలో శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులు నీరు ఉండేదని, అప్పట్లో రాయలసీమ కూడా కోన సీమ లాగా ఉండేదని గుర్తు చేశారు. నంద్యాల ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హామీలను విస్మరించారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవైరామయ్య అన్నారు. గతంలో నంద్యాల ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపించారని, ఈ స్థానంతో తాము తప్పక గెలిచి తీరుతామన్నారు రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేసిన ఘనత చంధ్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు, భూ దందాలు పెరిగిపోయయని, కుమారుడు లోకేష్‌ను దొడ్డిదారిన మంత్రిని చేశారని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం... సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేనని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పేవారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం..హామీలను విస్మరించి..ప్రజలను దగా చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బాబు అబద్ధాలను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజాయితీని ప్రజలు గుర్తించారన్నారు. నంద్యాల ఉపఎన్నికన కార్యకర్తలు ప్రతిష్టాత్మంగా తీసుకొని..భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్నారు. -
‘నవనిర్మాణ దీక్ష కాదు.. నయవంచన దీక్ష’
తణుకు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసేది నవ నిర్మాణ దీక్ష కాదని, అది నయవంచన దీక్ష అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ఆదివారం తణుకు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, కారుమురు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదని అన్నారు. రెండేళ్ల తర్వాత ఓడిపోతామని తెలిసి దోపిడి రాజ్యంగా మార్చారని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్లీనరీ సమావేశంలో కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, పాతపాటి సర్రాజు, మేకా శేషుబాబు, పీ. వాసుబాబు, కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోత’ల బాబును సాగనంపండి
- నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీల్లో నేతల దిశా నిర్థేశం - సైనికుల్లా పని చేయండి ... విజయం మనదే సాక్షి ప్రతినిధి, కాకినాడ : హామీలు అమలు చేయకుండా సంక్షేమ పథకాలకు కోతలు పెడుతున్న చంద్రబాబు సర్కార్ దాష్టీకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వైఎస్సార్సీపీ ప్లీనరీలు పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశనం చేస్తున్నాయి. మూడో రోజు శనివారం పి.గన్నవరం, రాజమహేంద్రవరం రూరల్, మండపేట నియోజక వర్గాల్లో పార్టీ ప్లీనరీలు జరిగాయి. ఈ ప్లీనరీల్లో గణాంకాలతో కూడిన నివేదికలు, చైతన్య పరిచే నేతల ప్రసంగాలు క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేయడం, ఫీజు రీ ఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ తదితర సంక్షేమ పథకాల్లో చంద్రబాబు కోతలు పెట్టిన విషయంపై కార్యకర్తలకు వివరించారు. ప్లీనరీలు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కాగా రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించారు. నేతల ప్రసంగాలు, క్షేత్రస్థాయి నాయకులు తీర్మానాలను చదివే తీరు, కార్యకర్తలు చర్చల్లో పాల్గొన్న తీరు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ప్రజా సంక్షేమంలో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ఔన్నత్యాన్ని, చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని, దళితులను దగా చేస్తున్న వైనాన్ని వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. అంబాజీపేటలో కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, కొంతమూరులో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మండపేటలో పరిశీలకుడు చెల్లుబోయిన వేణు అధ్యక్షతన జరిగిన ప్లీనరీల్లో నేతలు చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టారు. మండపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అంబాజీపేటలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజమహేంద్రవరం రూరల్‌లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరై చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని కార్యకర్తలకు వివరించి ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత తీసుకునేలా వారిలో స్ఫూర్తిని రగిలించారు. కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రియల్ స్టేట్‌గా కాకుండా రియల్ ఎస్టేట్‌గా చంద్రబాబు, అతని తనయుడు లోకేష్ తయారు చేశారని ధ్వజమెత్తారు. కార్యకర్తలపై ఈగవాలితే ఉపేక్షించేది లేదని అంతా వారి వెంటే ఉంటామని కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతుల రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఏ రీతిలో భ్రష్టుపట్టించారో లెక్కలతో సహా ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వివరించారు. సంక్షేమ పథకాల్లో కోత పెడుతూ అవినీతిలో అభివృద్ధి సాధించిన చంద్రబాబు సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు రాజమహేంద్రవరం రూరల్‌లో గెలుపొందడం ద్వారా తుని తప్ప జిల్లా అంతటా అప్పట్లో గెలుపు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిని గ్రామగ్రామాన ఎండగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు గద్దె దిగే వరకు సమిష్టిగా నేతలు, కార్యకర్తలు పోరాటాలు చేయాలని పీఏసీ, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. ప్లీనరీ పరిశీలకుడు వట్టికూటి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, పార్లమెంటరీ పరిశీలకుడు వలవల బాబ్జి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర కార్యదర్శి కొల్లి నిర్మలాకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, రావూరి వెంకటేశ్వరరావు పార్టీకార్యకర్తలు సమన్వయంతో చంద్రబాబు అరాచక పాలనపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయకుంటే చంద్రబాబు అరాచక పాలనకు అడ్డు అదుపు లేకుండా పోతోందని యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు అనంతబాబు, గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం ఫ్లోర్‌లీడర్ షర్మిలా రెడ్డి తదితరులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కో ఆర్డినేటర్లు గిరజాల బాబు, వేగుళ్ల పట్టాభిరామయ్య, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, మిండగుదిటి మోహనరావు, కర్రి పాపారాయుడు, నక్కా రాజబాబు, కర్రి నాగిరెడ్డి, రెడ్డి రాజబాబు, కొవ్వూరి త్రినాధరెడ్డి, పి కె రావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెట్టా శ్రీనివాసరావు, మార్గని గంగాధర్, జున్నూరి వెంకటేశ్వరరావు, సిరిపురపు శ్రీనివాసరావు, కాశి బాలమునికుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా కోర్టులో చంద్రబాబు దోషి
- ఎన్నికల హామీలను విస్మరించిన సీఎంకు గుణపాఠం తప్పదు - రాజధాని అభివృద్ధి అంటూ ప్రజా ధనం దుర్వినియోగం - కాటసాని రామిరెడ్డికి ప్రజాదరణ పెరుగుతోంది - బనగానపల్లె ప్లీనరీలో గౌరు వెంకటరెడ్డి బనగానపల్లె: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుందని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు 600 అబద్దపు హామీలు ఇచ్చి విస్మరించిన సీఎంకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బనగానపల్లె హరిహర జూనియర్ కళాశాల సమీపంలో శుక్రవారం బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ప్లీనరీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గౌరు మాట్లాడుతూ 2014లో జిల్లాలో వైఎస్సార్సీపీ 11 సీట్లతో పట్టు సాధించిందన్నారు. 2019 ఎన్నికల్లో పత్తికొండ నుంచి చెరకులపాడు నారాయణరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డిలు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయని చెప్పారు. దీంతో రాజకీయంగా ఎదుర్కోలేకనే పత్తికొండ నియోజకవర్గ నాయకుడు చెరకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమం కనుమరుగైందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు కాగా, టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుతమ్ముళ్లకే ఇళ్లు కేటాయిస్తుందని విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గంలో కాటసాని కుటుంబం 30 సంవత్సరాలుగా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా బనగానపల్లె ప్లీనరీకి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలిరావడం చూస్తే వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు. కుట్రలతో అడ్డుకోలేరు: బీవై రామయ్య, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ఆర్సీపీని అడ్డుకోలేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు దోచుకోవడం, దాచుకోవడం, అధికారులను బెదిరించడం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప చేసేందేమి లేదు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీల మధ్య చిచ్చు పెడుతూ నిధులు మంజూరు చేయడం లేదు. ముస్లిం మైనార్టీ శాసనసభ్యులు ఉన్నప్పటికి ఒక్క ముస్లిం ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. టీడీపీపై అసంతృప్తికి ఇదే నిదర్శనం : బుడ్డా శేషారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ పాలనలో అమలుపరిచిన అభివృద్ధి పథకాలను నేడు చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చినా విజయవంతంగా అమలు చేయలేకపోయారు. టీడీపీపై రోజురోజుకు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్లీనరీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలే ఇందుకు నిదర్శనం. లోకేష్ మంత్రిగా అనర్హుడు : రాజగోపాల్‌రెడ్డి , నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే లోకేష్ ఓటమి చెందుతాడన్న భయంతోనే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్ మంత్రిగా అనర్హుడు. ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రజల్లో నుంచి వస్తారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సార్లు తన పదవులకు రాజీనామా చేసి అఖండ మెజార్టీతో గెలిచారు. -
చంద్రబాబు టీడీపీకే ముఖ్యమంత్రి
♦ రాష్ట్రంలో వంచన పాలన.. ♦ ఓటుకు నోటు కేసులో భయపడే విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి ♦ 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం ♦ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాసు చీపురుపల్లి/ గరివిడి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వంచన పాలన కొనసాగిస్తోందని, చంద్రబాబునాయుడు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని గురువారం సాయంత్రం గరివిడిలో గల మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగితే.. చంద్రబాబునాయుడు హయాంలో హత్యలు, అరాచకాలు, మోసాలతో కూడిన పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ దగ్గర భయపడిన చంద్రబాబు హైదరాబాద్‌ను కేసీఆర్‌కు ధారాదత్తం చేసి విజయవాడకు పరుగు తీశాడన్నారు. మూడేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో జరిగిందని చెప్పుకోవడానికి ఆ పార్టీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం టీడీపీ పాలనలో బీసీ ప్రజాప్రతినిధులకు అన్యాయం జరుగుతోందని కృష్ణదాస్ ఆరోపించారు. చౌదరి, రాజవంశీకులనే కేంద్రమంత్రులుగా పంపించారే తప్ప బీసీలకు అత్యున్నత పదవులు ఇవ్వలేదన్నారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 9 నియోజకవర్గాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, జగన్ పేరు వింటేనే టీడీపీ నాయకులు భయపడుతున్నారన్నారు . తమ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల మనస్సుల్లో స్థానం దక్కించుకోగా, లోక్ష్ పప్పుసుద్ధగా మారాడని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి కమిటీలు వేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు చేసిన మోసాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) మాట్లాడుతూ, ఎంతో వెనుకపడి ఉన్న చీపురుపల్లి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏ స్థాయిలో అభివృద్ధి చేసి చూపించారో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రహదారులు, ఇళ్లు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు సత్యనారాయణ విశేష కృషి చేశారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కూడా జరగలేదన్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
ఈ సారి క్లీన్ స్వీప్ చేస్తాం
♦ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు తథ్యం ♦ చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు ♦ మార్కాపురం ప్లీనరీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని మార్కాపురం/మార్కాపురం టౌన్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక విధానాలతో జనం విసిగి వేసారిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజ లు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం ఖాయమన్నారు. గురువారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్టీ ప్లీనరీలకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యా రు. మార్కాపురం పట్టణ సమీపంలోని రాయవరం జీఎస్ కల్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలినేని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు, పక్కా గృహాలు ఇచ్చారన్నారు. మూడేళ్ల నుంచి బాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అర్హులను పక్కన పెట్టి టీడీపీ కార్యకర్తలకు పథకాలు కట్టబెడుతున్నారన్నారు. దీంతో పేదలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన నేత జగన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో గెలిచారని, ఆయన పార్టీ పెట్టి ప్రజల హృదయాల్లో ఉండగా, లోకేష్ తండ్రిని అడ్డం పెట్టుకొని పరోక్షంగా ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవిని అనుభవిస్తున్నాడని బాలినేని ఎద్దేవా చేశారు. లోకేష్ తాను ఏం మాట్లాడుతాడో తనకే తెలియదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల అని, అందుకే ఆయన వేల కోట్ల నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు చేయించారని చెప్పారు. వైఎస్ మృతి చెందగానే ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే తన బాధ్యత అని బాలినేని పేర్కొన్నారు. అదరం..బెదరం..: ఎమ్మెల్యే జంకే నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు, బెదరింపులు ఎక్కువైపోయాయని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అధోగతి పాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించి సంతోషంగా ఉంచగా, బాబు పాలనలో కరువు వచ్చి పంటలు పండక, ధరలు లేక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల హృదయాల్లో రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోగా.. బాబు పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు దక్కాయని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేల అధికారాలను హరిస్తూ అనర్హులకు పథకాలను వర్తింప చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కె.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, పరిశీలకులు వై.వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి మాట్లాడారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తిప్పి కొడదాం : బాలినేని యర్రగొండపాలెం: ప్రజా వ్యతిరేక విధానాలను అవలభిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని త్రిప్పి కొట్టే సమయం ఆసన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక డీసీఆర్ (ముద్ర)స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వమించారు. నియోజకవర్గ ఇన్చార్జి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో బాలినేని మాట్లాడుతూ ప్రతిపేదోడు తమవాడేనని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. బాబు పాలనంతా అవినీతి మయంగా మారిందని, డబ్బు సంపాదనకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో గెలిచిన డేవిడ్‌రాజు కేవలం డబ్బులకు అమ్ముడుబోయాడని, పేదోడని టికెట్టిప్పించి, ఆర్థికంగా అన్నివిధాల ఆదుకుంటే పార్టీ ఫిరాయించి మోసం చేశాడని విమర్శించారు. ముందుగా స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిధిగృహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహానికి బాలినేని పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్లీనరీలో నియోజకవర్గ అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే కె.పి.కొండారెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు వరికూటి కొండారెడ్డి, ఎస్ రవణమ్మలు పాల్గొన్నారు. -
దోపిడీరాజ్యం సాగనివ్వం
నల్లజర్ల: జిల్లాలో తెలుగుదేశం పార్టీ అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇకపై సాగనివ్వబోమని, టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. నల్లజర్లలో బుధవారం పార్టీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీమంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి సంతాపం తెలిపి శ్రద్ధాంజలి ఘటిం చారు. అనంతరం ముఖ్యఅతిథి ఆళ్ల నాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు తొత్తులుగా ఉన్న జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు దోచుకో–దాచుకో పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలపై నిలదీసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దగ్గరనుంచి మండల, గ్రామస్థాయి నాయకుల వర కు కేసులు బనాయించి ఇబ్బందులు పాల్జేస్తున్నారని, ఇకపై ఇటువంటివి సాగనివ్వబోమని హెచ్చరించారు. ‘మిమ్మల్ని గెలిపించింది మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికా? లేక ప్రజల డబ్బుదోచుకోవడానికా?’ అని ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులు ఇసుక, మట్టి, మద్యం మాఫీయాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజల భూములను అక్రమంగా లాక్కుని నష్టపరిహారం అడిగితే ఎంతో కొంత ఇచ్చి తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారని నాని ఆరోపించారు. -
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
– వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక హత్యా రాజకీయాలు – రాజధాని నిర్మాణం ముసుగులో ప్రజాధనం దుర్వినియోగం – ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ నేతలు – పాణ్యం నియోజకవర్గ ప్లీనరీకి విశేష స్పందన ఓర్వకల్లు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ప్లీనరీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కాల్వబుగ్గలో పాణ్యం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఆపార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఫిరోజ్‌ఖాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా పార్టీకి విశేష సేవలందించి, ప్రత్యర్థులు చేతిలో హత్యకు గురైన పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికార పార్టీ నాయకుల ఆగడాలపై చర్చించారు. అనంతరం పార్టీ నిర్మాణాత్మకమైన పనులకు వివిధ మండలాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి తీర్మానించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తోందని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఆయన పాలనలో వర్షాలు పుష్కలంగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని ఆయా మండలాలకు చెందిన కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు ముఖ్య నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు, పాణ్యం మండల కన్వీనర్లు సత్యనారాయణరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి, కళాధర్‌రెడ్డి, చంద్రారెడ్డి, ఎంపీపీ వెంకట రమణమ్మ, గడివేముల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అనసూయమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారసత్వ రాజకీయాలకు చంద్రబాబు నిదర్శనం: బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని తన కుమారుడికి మంత్రి పదవులు ఇవ్వడం ఇంత వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పైసా నిధులు ఇవ్వకుండా తమ పార్టీకి చెందిన ఇన్‌చార్జ్‌లకు నిధులు ఇస్తూ నియంత పాలనకు పాల్పడటం అప్రజాస్వామికం. రూ.5 కోట్ల స్థిరీకరణ నిధిని అమలు చేయడంలో విఫలమయ్యారు. రైతుల సంక్షేమాలను విస్మరించి వ్యవసాయరంగాన్ని నీరుగారుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పాలనకు స్వస్తి పలికి జగన్మోహన్రెడ్డిని అధికారంలోకి తీసుకరావాలి. వైఎస్ఆర్సీపీకి ఆదరణ పెరుగుతోంది: గౌరు వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి రోజురోజుకు ప్రజాధరణ పెరుగుతోంది. అధికార పార్టీ ఇది సహించలేక, వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదురో్కలేక హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. చంద్రబాబు కుఠిల రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మండల స్థాయి నాయకులతో తరుచూ ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించండి. ప్రజలకు అందుబాటులో ఉంటాం: గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకునేందుకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మాపై ఉన్న అభిమానంతో రెండుసార్లు గెలిపించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. సాధారణ ప్రజలకు ఏమాత్రం భద్రత ఉంటుంది. అధికార అహంతో పోలీసులను కొందరు నేతలు కరివేపాకులా వాడుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని చెరుకులపాడు నారాయణరెడ్డిని అంతమొందించారు. ఇలాంటి రాక్షస పాలన ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. వైఎస్ఆర్సీపీని బలోపేతం చేద్దాం : కొత్త కోట ప్రకాష్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా నేత గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు కలిసి పార్టీని బలోపేతం చేద్దాం.. ప్రతి కార్యకర్త జగన్‌పై ఉన్న అభిమానంతో పార్టీకి సేవలు చేస్తే భవిష్యత్తులో జగన్ అధికారంలోకి తప్పక వస్తారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయకుండా అమరావతి నిర్మాణానికి, తన ప్రచారానికి వినియోగిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. -
టీడీపీకి చరమగీతం పాడుదాం
- మూడేళ్లలో ఒక్క అభివృద్ధీ లేదు - రుణమాఫీ పేరుతో మోసం - జన్మభూమి కమిటీలదే పెత్తనం - రాజ్యాంగ విరుద్ధంగా నిధుల కేటాయింపు - నారాయణరెడ్డిది రాజకీయ హత్యే - ఆదోని ప్లీనరీలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆదోని: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీడీపీకి చరమగీతం పాడుదామని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం ఆదోని పట్టణం బాబా గార్డెన్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు పట్టణంలో పార్టీ కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్లీనరీలో ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రసంగించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి కూడా లేదన్నారు. ఆదోని డివిజన్‌కు పరిశ్రమలు రాలేదని, రోడ్లు వేయలేదని గుర్తు చేశారు. పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని.. అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజలలో కలుగుతోందన్నారు. అధికారం ఉందని.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని, ప్రజలుఅంతా గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యేలకు కాకుండా రాజ్యంగ విరుద్ధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు నిధులు కేటాయిస్తున్నారని.. జన్మ భూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోసం బట్టబయలు రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను, రైతులు మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లయినా ఏ హామీ నెరవేరకపోవడంతో తాము మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే బాగుపడాలనే దుర్మార్గపు ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ విజయ పతాకం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీపై పెరుగుతున్న అసంతృప్తి.. చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో విసిగి వేశారి పోయిన ప్రజలు నాటి వైఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే, ప్లీనరీ సమావేశం పరిశీలకుడు బాలనాగిరెడ్డి అన్నారు. టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పింఛన్, రేషన్ కూడా సకాలంలో అందడం లేదన్నారు. టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, మూడోసారి కూడా తామే గెలుస్తామని చెప్పారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, పోలీసు కేసులకు తామెప్పుడు భయపడబోమన్నారు. తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా నిలబడుతామని భరోసానిచ్చారు. చంద్రబాబు పాలనలో కరువు వైఎస్ హయాంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షమైన జీవితం గడిపితే.. చంద్రబాబు హయాంలో వర్షాలు కనుమరుగై కరువు తాండవిస్తోందని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఒక్క ఫోన్ కొడితే తాగునీరు ఇంటికి చేరుతోందని చెపుతున్నారని, అయితే ఆలూరనులో పది రోజులైనా బిందెడు నీరు దొరకని పరిస్థితి ఎందుకు నెలకొందని ఆయన ప్రశ్నించారు. తాగునీరు ఇవ్వండని ఆందోళన చేసిన ప్రజలపై పోలీసులు కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడం... ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక.. నిరుద్యోగులకు కాకుండా తన కుమారుడు నారా లోకేష్‌కు మాత్రం ఉద్యోగం ఇచ్చారని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ దౌర్జనాలకు భయపడేది లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరకులపాడు నారాయణరెడ్డి ఎదుగుదల చూసి ఓర్వలేక దారుణంగా హత్య చేయించారన్నారు. చంద్రబాబు సహకారంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. -
రాజకీయ హత్యలు మానుకోండి
- అభివృద్ధి చేసి ప్రజా మన్ననలు పొందండి - టీడీపీ నాయకులకు వైఎస్ఆర్సీపీ నేతల హితవు - డోన్‌లో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ - టీడీపీ పాలనపై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి - కార్యకర్తలకు అండగా ఉంటామని బుగ్గన, గౌరు భరోసా డోన్ టౌన్: రాజకీయ హత్యలు మానుకొని..అభివృద్ధి పనులు చేసి ప్రజా మన్ననలు పొందాలని టీడీపీ నాయకులకు వైఎస్ఆర్సీపీ నేతలు హితవు పలికారు. ఆదివారం డోన్ పట్టణం సాయి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించారు. పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనంతపురం మాజీ ఎంపీ, పార్టీ కర్నూలు జిల్లా పరిశీలకులు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై హింసాత్మక ఘటనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు.. డోన్ నియోజకవర్గానికి ఒక్క శాశ్వతమైన పని చేపట్టిన దాఖలు లేవన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలన అవినీతి మయమైందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అందినకాటికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చెరువుల్లో మట్టిని, నదుల్లో ఇసుకను దిగమింగిన చరిత్ర టీడీపీ నాయకులదేనన్నారు. ప్రజాకంటక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులపై టీడీపీ నేతలు నిరంతరం దాడులు చేస్తున్నా.. కేసులు నమోదు కాకుండా సీఎం స్థాయిలో చంద్రబాబు అడ్డుపడడం సిగ్గుచేటన్నారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్న హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్ఆర్ చలువేనన్నారు. ప్రజలకు ఏం చేశారు... డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. ప్రజలకు ఏం చేశారని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీశారు. ఇటీవల నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో డిప్యూటీ సీఎం తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గానికి ఒక్క శాశ్వతమైన పనిఏదైనా చేపట్టి ఉంటే ప్రజలకు తెలియజేయాలని కేఈకి సవాల్ విసిరారు. ప్రజల చేతిలో ఘోరంగా ఓడిపోయిన వారికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఏ హోదాతో కేఈ సోదరుడు, తనయుడు పోలీస్ సైరన్లతో ఊరేగుతున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వైఎస్ హయాంలోనే అభివృద్ధి.. వైఎస్ హయాంలోనే డోన్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని బుగ్గన పేర్కొన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా మంచినీరు అందించారని. రూ. 30కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారని గుర్తు చేశారు. వేలాది గృహ నిర్మాణాలతో పలు కాలనీల ఏర్పాటు సా«ధ్యమైందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ ధర్మవరం సుబ్బారెడ్డి తనపై విరమ్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ట్రస్టు ఏర్పాటు చేసి ఉన్నత పాఠశాల భవనాలను నిర్మించినట్లు ఆరోపించారని.. వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఆరుగురి ఎంపీటీసీ సభ్యుల ఓట్లను టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డికి బహిరంగంగా అమ్ముకున్న వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులను కాపాడుకునేందుకే ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ పంచన చేరాడని బుగ్గన ఆరోపించారు. కార్యకర్తలకు అండగా ఉంటాం హత్యా రాజకీయాలకు, హింసాత్మక దాడులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమాత్రం బెదరరని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. పార్టీ కార్యకర్తల జోలికి వస్తే టీడీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. టీడీపీని అరేబియాలో కలిపేయండి నిరుపేద రైతాంగాన్ని ఆదుకోకుండా వారి జీవితాలతో ఆటలాడుకొంటున్న టీడీపీని వచ్చే ఎన్నికల్లో ఆరేబియా మహాసముద్రంలో కలపాలని ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను దగాచేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. సీమద్రోహి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా సీఏం చంద్రబాబు నిలిచారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. దోచుకో – దాచుకో అనే చందంగా టీడీపీ నేతల వ్యవహార శైలి ఉందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పార్టీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ రాజగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, ఎంపీపీ గంజి కృష్ణమ్మ, ప్యాపిలి, బేతంచర్ల సర్పంచ్‌లు గౌసియాబేగం, రోజమ్మ, పార్టీ నాయకులు బోరెడ్డి శ్రీరామరెడ్డి, మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్, దినేష్‌గౌడ్, ఆర్ఈ రాజవర్దన్, రఫీ, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలే అజెండాగా ప్లీనరీలు
- సన్నాహక సమావేశంలో వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు - నేడు పరిశీలకుల నియామకం - ఐదో తేదీ తరువాత మరోసారి భేటీ - జయప్రదానికి పార్టీ శ్రేణులు కసరత్తు ఇప్పటికే గడప గడపకూ వైఎస్సార్ పేరుతో ప్రతి ఇంటి తలుపు తట్టి పలుకరించిన వైఎస్పార్ సీపీ పార్టీ ... గ్రామ, మండల, జిల్లా స్థాయి సమస్యలే అంజెండాగా ప్లీనరీ సమావేశాలను నియోజకవర్గ స్థాయిల్లో వినూత్నంగా చేపట్టడానికి శ్రీకారం చుడు తోంది. గ్రామ స్థాయి సమస్యలను నియోజకవర్గ స్థాయి సమవేశంలో చర్చించి ... అందులో ప్రధానమైనవాటిని జిల్లా ప్లీనరీలో చచ్చకు పెట్టి వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. మరీ కీలకమైన సమస్యలను రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానాలుగా ప్రవేశ పెడతారు. ఆ దిశగా బలంగా అడుగులు వేయడానికి జిల్లా పార్టీ సమాయత్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలకు సిద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అన్ని నియోజక వర్గాల్లో ప్లీనరీ సమావేశాలు చేపట్టనున్నారు. నియోజక వర్గాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పార్టీ అభిమానులు, ప్రజల సమక్షంలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించి జిల్లా ప్లీనరీలో ప్రతిపాదించడం, ఆ తరువాత రాష్ట్ర ప్లీనరీలో ఆమోదించాలనేది పార్టీ ఆదేశం. ఈ ప్లీనరీలలో ఎటువంటి సమస్యలు చర్చించాలి, ఎలా నిర్వహించాలి, ఎవరు పర్యవేక్షించాలి, నిర్వహణ తదితర అంశాలపై గురువారం కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. తొలిసారి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్లీనరీల్లో పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిపై సమగ్రంగా చర్చించాల్సి ఉంటుంది. చర్చ అనంతరం ఆ సమస్య పరిష్కారానికి పార్టీ తరఫున తీసుకోవాల్సిన ఆందోళనకు కార్యచరణను రూపొందించి జిల్లా ప్లీనరీకి నివేదించనున్నారు. వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు నిర్వహించే జిల్లా ప్లీనరీలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి జిల్లా స్థాయిలో ఒక ప్రతిపాదన ముసాయిదాను రూపొందించి రాష్ట్ర ప్లీనరీ ముందుంచాలనేది పార్టీ నిర్ణయం. ఇందుకు నియోజకవర్గ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యచరణపై పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, దాడిశెట్టి రాజా, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గానికి ఒక్కో పరిశీలకుడి పర్యవేక్షణలో... ఇందుకోసం ప్రతి నియోజక వర్గానికి ఒక పరిశీలకుడిని నియమించే విషయమై కసరత్తు చేశారు. ఏ నియోజక వర్గానికి ఎవరిని నియమించాలనే జాబితా శుక్రవారం నాటికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ఏ నియోజకవర్గంలో ఏ తేదీన నిర్వహిస్తారనేది నియోజకవర్గ నేతలు తమకున్న వెసలుబాటును చూసుకుని చర్చించి శుక్రవారం మధ్యాహ్నానికి పార్టీ జిల్లా కార్యాలయానికి నివేదించాలని తీర్మానించారు. జిల్లా స్థాయిలో ప్లీనరీ ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనేది వచ్చే నెల 5 తరువాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునేందుకు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్లీనరీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజా సమస్యలను ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గట్టిగా చెప్పారు. పార్టీ యువజన విభాగం నుంచి ప్రతి ఒక్కరు విధిగా ఎవరి పరిధిలో వారు నియోజకవర్గ ప్లీనరీకి హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆ విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు. పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పార్టీ కేడర్ ద్వారా దిశా నిర్థేసనం చేసేందుకు ఉపయోగపడే నియోజకవర్గ ప్లీనరీలు సద్వినియోగంచేసుకునేందుకు వేదికగా చేసుకోవాలని రాజమహేంద్రవరం గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ప్లీనరీ ద్వారా టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై హడలెత్తిపోయేలా కార్యక్రమాలుండాలని సీజీసీ సభ్యులు కుడుపూడి, విజయలక్ష్మి సూచించారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటానికి దోహదపడే వీటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరీదేవి, పెండెం దొరబాబు, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకే ప్రసన్నకుమార్ సూచించారు. పార్టీని నిర్మాణాత్మకంగా క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు ప్లీనరీలు దోహదపడేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అమలాపురం పార్లమెంటు పరిశీలకుడు వలవల బాబ్జీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహనరావు, కర్రి పాపారాయుడు తదితరులు పేర్కొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించడం, మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయడం ద్వారా ప్లీనరీ ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్‌లు సూచించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల పట్టాభి, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గుత్తుల సాయి, రావూరి వెంకటేశ్వరరావు, పాలెపు ధర్మారావు, వట్టికూటి రాజశేఖర్, ఎస్ వెంకటరెడ్డి, కాకినాడ పార్టీ నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథం.. ప్రగతి రథం
- బంగారు తెలంగాణే మా ధ్యేయం - ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ ఏడు తీర్మానాలు - ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరణ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 16వ ప్లీనరీ సందర్భంగా పార్టీ సాధించిన విజయాలు.. చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, బంగారు తెలంగాణ సాధనకు తీసుకుంటున్న చర్యలపై ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. శుక్రవారం కొంపల్లిలో తెలంగాణ ప్రగతి ప్రాంగణం వేదికగా పార్టీ నేతలు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో ఆమోదించారు. వీటిలో ‘సంక్షేమంలో స్వర్ణయుగం’ తీర్మానాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టగా.. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ బుడాన్‌బేగ్ బలపరిచారు. ‘నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో నూతనాధ్యాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం’ తీర్మానాన్ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎన్.నిరంజన్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ బలపరిచారు. ‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం..వృత్తి పనులకు ప్రోత్సాహం’ తీర్మానాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రవేశపెట్టగా.. టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బలపరిచారు. ‘విద్యుత్ రంగంలో విజయం–పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన–ఐటీ రంగ అభివృద్ధి’ తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు బలపరిచారు. ‘వినూత్న విధానాలు– ప్రగతికాముక పథకాలు’ తీర్మానాన్ని ఎంపీ బి.వినోద్‌కుమార్ ప్రవేశపెట్టగా.. మరో ఎంపీ బాల్క సుమన్ బలపరిచారు. ‘తాగునీటి వ్యథతీర్చే మిషన్ భగీరథ’ తీర్మానాన్ని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బలపరిచారు. ఏడో తీర్మానంగా ‘సామాజిక రుగ్మతలపై సమరం’ను ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రవేశపెట్టగా.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు. 1.సంక్షేమంలో స్వర్ణయుగం రాష్ట్రంలో 90 శాతం ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సంక్షేమ రంగానికి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఏటా రూ.35 వేల కోట్లు కేటాయిస్తోంది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా 35.87 లక్షల మందికి ఆసరా పింఛన్ల కోసం ఏటా ప్రభుత్వం రూ.5,330 కోట్లు ఖర్చు చేస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో రైతులకు రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు 26 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా అందజేస్తోంది. ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు నేరుగా అందజేస్తోంది. ఎస్సీల సంక్షేమానికి రూ.14,375 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,156 కోట్లు కేటాయించింది. మానవీయతే అభిమతంగా రాజీలేని కార్యాచరణ రూపొందించింది. బీసీ సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.5,070 కోట్లు కేటాయించింది. ఎంబీసీల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మైనార్టీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 470 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు కేటాయించి వారిని ఆదుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 20 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటుంది. విద్యుత్ శాఖలో 24 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. సైనికులు, సింగరేణి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు 2.6 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. 1,426 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. విద్యార్థులకు మెస్‌చార్జీల పెంపుతో 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. విద్యార్థులకు సన్నబియ్యం అన్నంతో ఆకలి తీర్చిన ఘనత మా ప్రభుత్వానిదే. 2.80 కోట్ల మందికి రేషన్ బియ్యానికి బడ్జెట్లో రూ.2,200 కోట్లు కేటాయించింది. కార్మికులకు జీవిత బీమా, బీడీ కార్మికుల సంక్షేమం, ఒంటరి మహిళల సంక్షేమం, వ్యవసాయ ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను రద్దు, కళాకారుల సంక్షేమం, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి–కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్, అంగన్వాడీల సంక్షేమం, షీటీమ్స్, జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, పేదల మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు పరమపద వాహనాల ఏర్పాటు వంటి అంశాలను ఈ తీర్మానంలో పేర్కొన్నారు. 2.సాగు, నీటిపారుదల రంగాల్లో నూతనాధ్యాయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేల చెరువుల్లో ప్రభుత్వం గత రెండేళ్లలో 19,500 చెరువులను బాగు చేసింది. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో ఏడు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ చేపట్టింది. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు మొదటిసారి నీళ్లందించాం. ఇప్పటివరకు రూ.35,200 కోట్లు ఖర్చుతో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 11 నెలల రికార్డు కాలంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. పాలమూరు– రంగారెడ్డి, డిండి, ప్రాణహిత చేవెళ్ల, కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, మిడ్‌మానేరు, మిషన్ కాకతీయ పనుల పూర్తికి బడ్జెట్లో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశాం. 3.గ్రామీణ ఆర్థికం పరిపుష్టం..వృత్తులకు ప్రోత్సాహం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.5 వేల కోట్లు కేటాయించింది. నాయీ బ్రాహ్మణులు, రజకుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించారు. విశ్వకర్మలు, కుమ్మరి, గౌడ వృత్తుల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందజేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల ఆధునిక సెలూన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. నేత కార్మికులను ఆదుకునేందుకు తాజా బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించింది. వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించింది. 4.విద్యుత్‌లో విజయం.. ఐటీలో అభివృద్ధి విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక చేపట్టి విజయం సాధించింది. రాష్ట్రం ఆవిర్భాం సమయంలో స్థాపిత విద్యుత్ సామ ర్థ్యం 6,574 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 11,689 మెగావాట్ల సామర్థ్యం. 2019 నాటికి 27,187 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చింది. టీఎస్ఐపాస్ ద్వారా 2,929 పరిశ్రమలకు అనుమతులు మంజూరుతో రూ.49,463 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. దీంతో ప్రత్యక్షంగా 1.95 లక్షలు, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి లభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేందుకు టీఎస్‌ప్రైడ్, టీఎస్ప్రైమ్ ఏర్పాటు చేసింది. ఆపిల్ నుంచి అమెజాన్ వరకు దిగ్గజ ఐటీ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. ఈ రంగంలో ఏటా రూ.75,070 కోట్ల పెట్టుబడులతో 4.07 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. 5.వినూత్న విధానాలు– ప్రగతికాముక పథకాలు పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రభుత్వం 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్ పరిధిలో రెండు, మూడు లక్షల కుటుంబాలు ఉండేలా చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీల కోసం 134, ఎస్టీలకు 54, బీసీలకు 124, మైనార్టీలకు 201 రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య 804కు చేరుకుంది.రాష్ట్రంలో 33 శాతం మేర హరితాన్ని పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేస్తోంది. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు తీసుకుంది. పంచాయతీరాజ్ పరిధిలో రూ.2247 కోట్ల వ్యయంతో 14,689 కి.మీ మేర బీటీ రహదారులకు మరమ్మతులు చేశాము. రాష్ట్రంలో 2,776 కిలోమీటర్ల నిడివిగల 19 జాతీయ రహదారులను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సాధించింది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. 6.తాగునీటి వ్యథ తీర్చే మిషన్ భగీరథ ఈ పథకానికి ప్రభుత్వం రూ.43 వేల కోట్లు వెచ్చించనుంది. 2017 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 24,248 గ్రామీణ ఆవాసాలు, 65 పట్టణ ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మిషన్ భగీరథ కోసం కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 19 ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణాలు, 50 నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 596 ఓహెచ్‌బీఆర్, 547 జీఎల్‌బీఆర్, 18,500 ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపు 1,69,700 కి.మీ. మార్గంలో పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకంలో ఇంటింటికీ నల్లా ఏర్పాటుతో తెలంగాణ ఆడపడచుల కన్నీటి కష్టాలు దూరం కానున్నాయి. 7. సామాజిక రుగ్మతలపై పోరు.. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు షీటీమ్స్, ఆహార పదార్థాల కల్తీ నివారణ, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ, అనవసర ఆపరేషన్లకు అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలను ఇందులో వివరించారు. -
ప్లీనరీ ఏర్పాట్లు షురూ..
కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం కొంపల్లి జీబీఆర్ గార్డెన్లో కొనసాగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. భోజనం, పార్కింగ్, వీఐపీ విడిది, వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు వసతి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పరిపాలనా పరంగా కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా అభివర్ణించారు. తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే అబ్బుర పడే విధంగా 21 శాతం వృద్ధి రేటుతో దూసుకు పోతుందన్నారు. 21న జరుగుతున్న ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఇందుకుగాను 60 ఎకరాల్లో ఏర్పాట్లు చేశామని, ప్రధాన సభా ప్రాంగణం ఐదున్నర ఎకరాలు ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, మైనంపల్లి, కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాల మల్లు, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద్ ఉన్నారు. -
ఐక్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం
గౌడ ప్రజాప్రతినిధుల ప్లీనరీలో వక్తలు హైదరాబాద్: సర్దార్ సర్వారుు పాపన్నగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ముందుకుసాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ గౌడ ప్రజాప్రతినిధుల వేదిక ప్లీనరీ ఆదివారం ఇక్కడ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణగౌడ్, గంగాధర్‌గౌడ్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కిగౌడ్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గౌడ కులస్తులు ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక గౌడ కులస్తులకు, బీసీలకు గతంలో కంటే ప్రాధాన్యం పెరిగిందన్నారు. బీసీ కులాలన్నింటినీ సమన్వయం చేస్తూ ఐక్యంగా ఉంటే అసెంబ్లీలో బీసీల స్థానాలు జనాభా ప్రతిపాదికన పెరుగుతాయని, ఓటే ఆయుధంగా పనిచేయాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అధిక శాతం బీసీలు ఉన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇదేస్థారుులో లేకపోవడానికి బీసీల మధ్య ఐక్యత లేకపోవమేనని తెలిపారు. ఈ సందర్భంగా గౌడ ప్రముఖులను సత్కరిం చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేశిని చినమల్లయ్య, తూళ్ల వీరేందర్‌గౌడ్, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికే ప్రాధాన్యం..
టీఆర్ఎస్ ప్లీనరీలో 13 అంశాలపై తీర్మానాలు సుమారు నాలుగున్నర గంటల పాటు చర్చ ♦ కరువుపై కేంద్రం కనికరించాలని విజ్ఞప్తి ♦ నివేదికలో పేర్కొన్నవి 15 తీర్మానాలు.. ప్లీనరీలో ప్రవేశపెట్టినవి 13 ♦ మిషన్ కాకతీయ, ఐటీ-పారిశ్రామిక విధానాలపై కేవలం చర్చ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవంలో 13 అంశాలపై తీర్మానాలు చేశారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే... కరువుపై కేంద్రం కనికరించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమం, భారీ నీటిపారుదల, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్, వ్యవసాయం, విశ్వనగరంగా హైదరాబాద్, విద్యుత్, కేజీ టు పీజీ, కృష్ణా పుష్కరాలు, శాంతిభద్రతల పరిరక్షణ, విభజన చట్టం హామీలు, అనావృష్టి, నీటిఎద్దడి నివారణ, తెలంగాణ హరితహారం, పారిశ్రామిక విధానం-ఐటీ పాలసీ అంశాలపై చర్చించారు. ప్లీనరీ ఉదయం 10.35 గంటలకు ప్రారంభం కాగా... 11.55 నుంచి మధ్యాహ్నం 1.36 వరకు, భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.20 వరకు తీర్మానాలపై చర్చించారు. అయితే తొలుత ప్లీనరీ ప్రణాళికలో 15 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నా... 13 తీర్మానాలనే ప్రవేశపెట్టారు. మిషన్ కాకతీయ, ఐటీ పారిశ్రామిక విధానంపై సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, మంత్రులు ఇతర అంశాల్లో భాగంగా మాట్లాడారు. కానీ తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టలేదు. తొలి తీర్మానం సంక్షేమం ప్లీనరీలో తొలుత సంక్షేమ రంగంపై తీర్మానాన్ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రతిపాదించారు. ఎన్నో అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కొని కూడా సంక్షేమానికి రూ.35వేల కోట్లను ఖర్చు పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ఆదాయపరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షలకు పెంచామని చెప్పారు. తమ ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున బియ్యం ఇస్తూ కడుపునిండా అన్నం పెడుతోందన్నారు. కల్యాణలక్ష్మి, హాస్టళ్లకు సన్నబియ్యం పథకాలతో దేశానికే ఆదర్శనీయంగా నిలిచామని చెప్పారు.ఈ తీర్మానాన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బలపరిచారు. విశ్వనగరంగా హైదరాబాద్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘విశ్వనగరంగా హైదరాబాద్-రాష్ట్రంలో పట్టణాభివృద్ధి’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. దేశంలో ప్రస్తుతం హైదరాబాద్ 5వ పెద్ద నగరమని.. భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి... రూ.4,051 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామన్నారు. 8,024 కిలోమీటర్ల పొడవునా రోడ్లను మెరుగుపరచడానికి రూ.337 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ తీర్మానాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బలపరిచారు. కోటి ఎకరాల మాగాణం గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులను నిర్మించి... రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ‘గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.. మేజర్ ఇరిగేషన్‌తో పసిడి సిరులు పండాలి’ అంటూ రెండో తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. టీఆర్ఎస్ పురుడు పోసుకున్న మొదట్లోనే జలసాధన ఉద్యమం చేశామని... నదులు, వాగులు, వంకలు సహా ప్రతిచుక్క నీటిపై సీఎం కేసీఆర్ 20 నెలలు అధ్యయనం చేశారని తెలిపారు. కాళేశ్వరం, ప్రాణహిత, పాలమూరు ఎత్తిపోతలు, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత జితేందర్‌రెడ్డి బలపరిచారు. ఇంటింటికీ మంచినీరు.. ‘ఆరోగ్య తెలంగాణ రక్షణ చక్రం.. మిషన్ భగీరథ సుజ ల చక్రం’ అనే అంశాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా... ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు. 20 ఏళ్ల క్రితమే ఆడబిడ్డలు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులను చూసి సిద్దిపేటలో ఇంటింటికి నీరిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథతో 2017 డిసెంబర్ నాటికి 90 శాతం గ్రామాలకు తాగునీటిని అందించాలన్నది లక్ష్యమన్నారు. వ్యవసాయానికి ప్రోత్సాహం ‘పల్లెకు ఫలసాయం-తెలంగాణకు వ్యవసాయం’ అనే అంశాన్ని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని... గత ప్రభుత్వాలు చెల్లించని రూ.480.83 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఒకే విడతలో చెల్లించి రైతులను ఆదుకున్నదని చెప్పారు. తెలంగాణను విత్తన భాండాగారంగా రూపొందించడానికి కృషి చేస్తోందన్నారు. ఈ తీర్మానాన్ని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ బలపరిచారు. పేదలకు ఇళ్లు ‘పేదల ఆత్మగౌరవం.. డబుల్బెడ్రూమ్ ఇళ్ల పథకం’ అంశాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ ప్రతిపాదించారు. 150 గజాల స్థలంలో డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ మోడల్ కాలనీలో 375 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి, ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల ‘డబుల్’ ఇళ్లను ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే కొండా సురేఖ బలపరిచారు. నిరంతర విద్యుత్ తెలంగాణ ఇప్పుడు వెలుగులు విరాజిల్లుతున్న రాష్ట్రంగా వర్ధిల్లుతోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తపస్సు నుంచి ఉషస్సు వైపు- తెలంగాణలో నిరంతర విద్యుత్’ అంశాన్ని ఆయన ప్రతిపాదించారు. విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నా ప్రజలపై చార్జీల భారం మోపని ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ అంశాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు. ఘనంగా కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలను మహబూబ్‌నగర్, నల్లగొం డ జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ‘కృష్ణా పుష్కరాలు-నదీమతల్లితో అనుబంధాలు’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించా రు. కృష్ణా తీరంలో 281 కిలోమీటర్ల పొడవునా పుష్కరాలు జరపనున్నామని.. ఈ పనులకు రూ.825.16 కోట్లను విడుదల చేశామని చెప్పారు. దీన్ని నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ బలపరిచారు. కరువుపై కనికరించండి.. కరువు పరిస్థితుల నేపథ్యం లో కేంద్రం కనికరించి రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. ‘అనావృష్టి, నీటి ఎద్దడి.. నివారణ చర్యలు’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. కరువు నుంచి ఉపశమనం కోసం రూ.3,064.75 కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని, పెద్దగా స్పందన లేదని చెప్పారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి బలపరిచారు. ప్రతిష్టాత్మకంగా కేజీ టు పీజీ పేద వర్గాల వారు ఉన్నత చదువులు చదివేందుకు సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ విద్యను తీసుకువచ్చారని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘కేసీఆర్ మానసపుత్రిక కేజీ టు పీజీ గురుకుల విద్య’ అంశాన్ని ఆయన ప్రతిపాదించారు. అంబేడ్కర్ 125వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం 250 గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే వినయభాస్కర్ బలపరిచారు. శాంతిభద్రతలపై దృష్టి శాంతి భద్రతల పరిరక్షణ, గుడుంబా నిర్మూలన ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ‘శాంతి భద్రతల పరిరక్షణ, పేకాట, గుడుంబా నిర్మూలన’ తీర్మానాన్ని ఆమె ప్రతిపాదించారు. శాంతిభద్రతల కోసం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రూ.275 కోట్లు ఖర్చుతో 4,433 వాహనాలను కొనుగోలు చేశామన్నారు. జిల్లాల్లోనూ 550 వాహనాలను కొనుగోలు చేశామని తెలిపారు. గ్రామాలు, తండాల్లో గుడుంబాను నిర్మూలించి పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్సీ రాములునాయక్ బలపరిచారు. విభజన హామీలు నెరవేర్చాలి రాష్ట్ర విభజన చట్టం హామీలను నెరవేర్చాలని, తెలంగాణలోని 119 అసెంబ్లీస్థానాలను 153కు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ... ‘విభజన చట్టం హామీలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి’ తీర్మానాన్ని ఎంపీ వినోద్‌కుమార్ ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. తెలంగాణ, ఏపీల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కోసం రైలు, రోడ్డు మార్గాలను చేపడతామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ, రామగుండంలో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ బలపరిచారు. జూన్ నుంచి హరితహారం జూన్ నుంచి హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ‘ప్రకృతి రమణీయం - తెలంగాణ హరితహారం’ తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. హరితహారం ముఖ్యమంత్రి మానసపుత్రిక అన్నారు. తెలంగాణలో 120 కోట్ల మొక్కలు నాటాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశమని.. 2015-16 బడ్జెట్లో దీనికి రూ.325 కోట్లు కేటాయించామని తెలిపారు. దీన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బలపరిచారు. తీర్మానాలు చేయని అంశాలు.. మిషన్ కాకతీయకు పెద్దపీట ప్లీనరీ ప్రణాళికలో ‘కాకతీయ జలకళ పునరుజ్జీవం-మిషన్ కాకతీయ బహు ప్రశంసనీయం..’ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. దానిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రతిపాదించాల్సి ఉంది. కానీ దీనిని ప్లీనరీలో తీర్మానంగా ప్రవేశపెట్టలేదు. దీనిపై సీఎం కేసీఆర్ ప్రసంగంలో, మం త్రుల ప్రసంగాల్లో మాట్లాడారు.రెడ్డిరాజుల కాలం నాటి కాకతీయ చెరువులను తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వారు పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల కుట్రలతో చెరువుల పూడిక తీయకుండా నీరు నిల్వకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 45 వేల చెరువులను రూ.40వేల కోట్లతో పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఉత్తమ విధానం ‘టెక్నాలజీకి జోడించిన మానవీయకోణం.. తెలంగాణ పారిశ్రామిక విధానం’ తీర్మానాన్ని ప్లీనరీ ప్రణాళికలో పేర్కొన్నా మంత్రి కేటీఆర్ దానిని ప్రతిపాదించలేదు. కానీ ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. టీఎస్ ఐపాస్‌తో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, పారిశ్రామికంగా యువత బలపడేందుకు చేయూతనిస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్‌పార్క్, వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల నుంచి ప్రతినిధులు టీఆర్ఎస్ ప్లీనరీకి లండన్, ఆస్ట్రేలియా నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. లండన్ శాఖ నుంచి అనిల్, ఆస్ట్రేలియా నుంచి బెరైడ్డి అనిల్ హాజరయ్యూరని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ టీఆర్ఎస్కు శాఖలున్నాయని.. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విదేశాల్లో చాలామంది ప్రశంసిస్తున్నారని చెప్పారు. పార్టీకి విరాళాలివ్వండి బంగారు తెలంగాణ కోరుకునేవారంతా రూ.100కు పైబడి టీఆర్ఎస్కు విరాళాలు అందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒకనెల వేతనాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చారని చెప్పారు. విరాళాల విషయాన్ని టీఆర్ఎస్ కేంద్ర కమిటీ నేడో, రేపో ప్రకటిస్తుందని తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా టీఆర్ఎస్కు కేడర్ ఉండాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇండియాలో మనిషికి 28 చెట్లే.. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని కేసీఆర్ ప్లీనరీలో పేర్కొన్నారు. ‘‘ఇటీవల పారిస్‌లో 175 దేశాలు గ్లోబల్ వార్మింగ్‌పై సమావేశమయ్యాయి. ఉష్ణోగ్రతలను ఎలా తగ్గించాలి, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి అనే అంశాలపై అందులో చర్చించారు. కెనడాలో ఒక్క మనిషికి 8 వేల చెట్లు, రష్యాలో 4 వేల చెట్లు, అమెరికాలో 600 చెట్లు, చైనాలో 102 చెట్లు ఉంటే.. ఇండియాలో ఒక్కో మనిషికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మనమెలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు..’’ అని చెప్పారు. గతంలో ఉష్ణోగ్రతలు 37, 38 డిగ్రీలుంటే ఇప్పుడు 47 డిగ్రీలకు చేరాయని... దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. తెలంగాణలో హరితహారం కింద 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని సూచించారు. తలసాని స్థాయి తగ్గలే.. పెంచినం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో ఎనిమిది రోజుల ముందే పోర్ట్‌ఫోలియో మార్పుపై చర్చించానని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘తలసాని ప్రజలతో సంబంధాలున్న నాయకుడు. పోర్టుఫోలియో మార్పుతో తలసాని స్థాయి తగ్గలేదు.. పెంచాం’’ అని పేర్కొన్నారు. తలసాని స్థాయి తగ్గించినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, లక్ష్యాలను సాధించడానికే వాణిజ్య పన్నుల శాఖను తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. భలే ఐడియా.. టీఆర్ఎస్ ప్లీనరీకి వచ్చిన వేలాది మంది కార్యకర్తలకు చల్లని మంచినీళ్లు అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్త ఆలోచన చేశారు. కేసీఆర్ చిత్రపటంతో ముద్రించిన బాటిళ్లను ప్లీనరీ కోసం ప్రత్యేకంగా తెప్పించారు. సభా ప్రాంగణంలో పెద్ద గొయ్యి తవ్వి, దానిలో టార్పాలిన్ పరిచి ఐస్ ముక్కలు వేసి వాటిపై బాటిళ్లను వేసి, వాటిపై మళ్లీ ఐస్ ముక్కలు వేశారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ భలే ఐడియా గురూ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్లీనరీలో ఆదిలాబాద్ అంబలి టీఆర్ఎస్ ప్లీనరీలో ఆదిలాబాద్ అంబలి వేసవి తాపాన్ని తీర్చింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ప్లీనరీకి హాజరైన నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అంబలి అందించారు. సుమారు మూడు వేల లీటర్లకుపైగా ప్రత్యేకంగా తయారు చేసిన అంబలిని ప్లీనరీ ఆవరణలో అందజేశారు. స్వయంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శిబిరంలో కూర్చుని ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పర్యవేక్షించడం విశేషం. వేదిక వద్దకే కారు.. టీఆర్ఎస్ ప్లీనరీ హాల్లోకి ప్రవేశించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కారు మాత్రం సభా వేదిక వద్దకు నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌పై ప్రేమతో.. టీఆర్ఎస్ ప్లీనరీలో వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన మనోహర్ అనే టీఆర్ఎస్ కార్యకర్త కేసీఆర్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ప్లీనరీకి వచ్చిన ఆయన తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాలు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించిన ఫొటోలను లామినేషన్ చేయించి, తన కోటు (చొక్కా)పై ధరించాడు. ప్లీనరీ ప్రధాన ద్వారం వద్ద నిల్చుని వాటితో ప్రదర్శన ఇచ్చాడు. -
కరువుతో అల్లాడుతుంటే ప్లీనరీ నా: రాఘవరెడ్డి
రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తూంటే ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లీనరీ నిర్వహించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో సాక్షితో మాట్లాడారు. తాగేందుకు నీరు లేక గ్రామాల్లో జనాలు అల్లాడుతున్నారన్నారు. గడ్డి లేక పశువులు ఆలమటిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్లీనరీకి రూ. కోట్లు తగలేసే సీఎంని ఒక్క కేసీఆర్‌ను మాత్రమే చూస్తున్నామని ఆయన విమర్శించారు. ఏదైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో దివంగత నేత కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తున్నప్పుడు ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉండడడం సంప్రదాయంగా పేర్కొన్నారు. కానీ, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయించటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాధనం వృధాగా ఖర్చు చేయటం ఎందుకు సీఎంను ప్రశ్నించారు. పాలేరు ఎన్నికలకు పెట్టే ఖర్చుతో ఆ జిల్లాల్లోని గ్రామాల్లో తాగునీటి సమస్య, పశువులకు పశుగ్రాసం సమస్య పరిష్కరించవచ్చని చెప్పారు. 15 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో 11 వందల మంది బలిదానం చేస్తే.. ఇప్పటి కేవలం 250 మందికి సహయం చేశారని వివరించారు. డబల్ బెడ్ రూం ఇళ్లు ఒక్క హైదరాబాద్‌లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదన్నారు. సీఎం మాటల గారడీ ఎంతో కాలం నడవదని ప్రజలు తిరగబడ్డ రోజు పలాయనం చిత్తగించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం
ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండా ఎగురవేసి 10.40గంటల ప్రాంతంలో ప్లీనరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ అమర వీరులకు నివాళి అర్పించారు. ప్లీనరీకి భారీ సంఖ్యలో ప్రతినిధులు, నేతలు పార్టీ అభిమానులు తరలి వచ్చారు. ఈ ప్లీనరీలో ప్రధానంగా పదిహేను అంశాలను చర్చించనున్నారు. -
ఆహ్వానం ఉన్నవారే ప్లీనరీకి రండి
టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి జగదీశ్‌రెడ్డి సూచన ఖమ్మం: ఖమ్మంలో ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి ఆహ్వానం ఉన్నవారే హాజరుకావాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. ఆదివారం సాయంత్రం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందనే విషయాన్ని విపక్షాలు చెప్పకనే చెబుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. సిట్టింగ్ స్థానం కావడంతో పరువు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని నిలుపుతోందని, టీడీపీ పోటీలో నిలవలేక పారిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. -
దయ గురించి రాస్తే దయ పుట్టదు!
రచనా ప్రక్రియ అమెరికన్ కథా, నవలా రచయిత్రి ఫ్లానెరీ ఓ కానర్ (1925-1964)కు కథా ప్రక్రియ గురించి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలున్నాయి: ‘‘కథంటే ఒక పరిపూర్ణ నాటకీయత కలిగిన కథనం. మంచి కథలో యాక్షన్ ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది. పాత్రలే యాక్షన్‌ను కంట్రోల్ చేస్తాయి. ఫలితంగా, కథ ఒక అనుభవైకవేద్యమైన అనుభూతిగా మిగిలిపోతుంది. పాత్రంటే ఒక వ్యక్తి. లక్షల మందిలో అతడొకడైనప్పటికీ కథకు సంబంధించినంతవరకూ అతడో ప్రత్యేకమైన వ్యక్తి. కథా గమనంలో ఆ ప్రత్యేక వ్యక్తిలోని అనిర్వచనీయత, మిస్టరీ పాఠకునికి అవగతమవుతుంది. కానీ, కొందరు రచయితలు వ్యక్తుల్ని గురించి గాక, సమస్యల గురించి రాయాలని తహతహలాడుతారు. తమకు తెలిసిన లౌకిక జ్ఞాన సారమంతా పాఠకులకు కథలుగా చెప్పాలనుకుంటారు. అసలు విషయమేమిటంటే, వాళ్ల దగ్గర జ్ఞానం వుంటే వున్నదేమోగాని కథ మాత్రం లేదు. ఉన్నా రాసే ఓపిక లేదు. కథలు రాసేటప్పుడు మన నమ్మకాలు, మన నైతిక విలువలు మనకు మార్గదర్శకంగా, కరదీపికలుగా వుంటాయి. అయితే, ఆ విలువలు వెలుగుగా పనికొస్తాయిగాని వస్తువులు మాత్రం కావు. వెలుగు సాయంతో లోకాన్ని చూడాలి. కాని వెలుగే లోకం కాదు. దయ గురించి రాసి దయనూ, సానుభూతి గురించి రాసి సానుభూతినీ , ఉద్రేకం గురించి రాసి వుద్రేకాన్నీ పాఠకుల్లో కలిగించలేమని రచయితలు గ్రహించాలి. ఈ దయ, సానుభూతి, వుద్రేకం వున్న సజీవ వ్యక్తుల్ని- బరువూ, ఒడ్డూ, పొడుగూ, కొంత నిర్ణీత జీవితకాలమూ వున్న వ్యక్తుల్ని సృష్టించాలి.కథా రచన అనే ప్రక్రియకు మూలం కథ చెప్పడం కాదు, జరిగింది చూపించడం’’. (రెండు నవలలూ, 32 కథలూ, ఎన్నో వ్యాసాలూ రాసిన ఫ్లానెరీ ఓ కానర్ నలభై ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు.) ముక్తవరం పార్థసారథి 9177618708 -
ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీకి ఈసీ అనుమతి
హైదరాబాద్ : ఖమ్మం నగరంలో ఈ నెల 27న టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలకు ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎన్నికల నియమావళి వర్తించనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పార్టీ కార్యక్రమాల కోసం ముందు నుంచే ఏర్పాట్లు చేశామని, ఇప్పటికిప్పుడు మరో చోటకు తరలించడం సాధ్యం కాదని, ఖమ్మంలోనే నిర్వహించుకునేందుకు అనుమతించాలంటూ.. మంత్రి కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని లేఖ ద్వారా కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం ఈ నెల 27న ఖమ్మంలో సభ, ప్లీనరీ నిర్వహణకు షరతులతో అనుమతించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి లేఖ ద్వారా శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చునంతా పార్టీ తరఫున వెచ్చించాలని, ప్రజా ధనాన్ని ఖర్చు చేయరాదని ఈసీ ఆదేశించింది. అలాగే అధికార యంత్రాంగాన్ని వాడరాదని, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అధికారిక పర్యటన జరపరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు షరతులతో అనుమతిస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ లేఖలో పేర్కొన్నారు. -
ప్లీనరీ సమావేశంపై టీఆర్ఎస్ లో చర్చ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంపై పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 27న ప్లీనరీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్లీనరీ సమావేశం నిర్వహించాలా వద్దా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ప్లీనరీకి, నోటిఫికేషన్‌కు సంబంధం లేదని టీఆర్ వర్గాలంటున్నాయి. బహిరంగ సభకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకునే యోచనలో టీఆర్ఎస్ ఉంది. కాగా రెండు, మూడు రోజుల్లో ప్లీనరీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ కమిటీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. ఎంపీ కే.కేశవరావు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్లీనరీ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ కాలేజీలు, కేజీ టు పీజీతో పాటు 12 కీలక అంశాలపై తీర్మానాలు పెట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు. -
వర్సిటీలపై మావోయిస్టుల గురి!
-
వర్సిటీలపై మావోయిస్టుల గురి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేజిక్కించుకునే దిశగా మావోయిస్టులు అడుగులు వేస్తున్నారా... అటు కేడర్‌ను పెంచుకోవడంతోపాటు ఇటు టెక్నాలజీని పొందేలా ఇంజనీరింగ్ విద్యార్థులను చేర్చుకోవడంపై దృష్టిపెట్టారా..? ఈ ప్రశ్నలకు నిఘావర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తెలంగాణలో కేడర్‌ను పెంచుకునే దిశగా పావులు కదుపుతున్న మావోయిస్టు పార్టీ... పౌర సమాజంలో ఉండి తమకు మద్దతు పలకడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే వారి సహకారం తీసుకోవాలని గతేడాది నవంబర్‌లో జార్ఖండ్‌లో జరిగిన ప్లీనరీలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగానే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల సహకారం తీసుకునే దిశగా అడుగులు వేసింది. ఉద్యమంపై సానుభూతి ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారికి ఆర్థిక సమస్యలు లేకుండా తగిన పారితోషికం అందించాలనేది వారి వ్యూహం. ఇందుకోసం పౌరసమాజంలో ఉన్న ఉద్యమ నేతలు, సానుభూతిపరుల సహాయం తీసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు కాకతీయ, జేఎన్టీయూ (హైదరాబాద్, మంథని, జగిత్యాల) కాలేజీల నుంచి 75 మంది విద్యార్థులను గుర్తించి వారి సహకారం కోరింది. కాలేజీల సమీపంలోనే షెల్టర్లను ఏర్పాటు చేసుకుని సానుభూతిపరుల ద్వారా కార్యకలాపాలు సాగించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోం శాఖకు ఈ విషయాలను వెల్లడించింది. ‘మావోయిస్టు పార్టీ రెండు దశలుగా కేడర్‌ను విస్తరించుకునే వ్యూహంతో వెళుతోంది. పూర్తిగా ఉద్యమంలో మమేకమై, ఉద్యమ విస్తృతి కోసం పనిచేసేవారిని నియమించుకోవడం ఒకటైతే, పౌర సమాజంలోనే ఉంటూ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేలా ఇంజనీరింగ్ విద్యార్థుల సహకారం తీసుకోవడం రెండోది. రాయ్‌పూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు వైర్లెస్ సెట్ల పనితీరుపై అధ్యయనం చేయడం ద్వారా మావోయిస్టు పార్టీకి సహకారం అందించినట్లు సమాచారం అందింది. ఈ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తే తెలంగాణలోనూ ఇలాంటి కార్యకలాపాలు నడుస్తున్నాయని వెల్లడైంది..’ అని ఛత్తీస్‌గఢ్ తన నివేదికలో పేర్కొంది. ఏడాది నుంచి.. మావోయిస్టు పార్టీ కేడర్‌ను పెంచుకునే కార్యక్రమాన్ని గతేడాది నవంబర్లోనే ప్రారంభించిందని, ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ దృష్టికి తీసుకువెళ్లామని ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోంశాఖకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీ కేంద్రంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో విద్యార్థులను నియమించుకుందని...వెల్లడించింది. ‘కరీంనగర్ జిల్లాకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదని, వారి తల్లిదండ్రులు, బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆ జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తించింది. దీన్ని వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు విశ్వవిద్యాలయాలు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులపై నిఘా పెంచారు. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ దాదాపుగా నిలిచిపోయింది..’ అని ఐబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరి గిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి సాంకేతిక విద్యార్థుల సహకారం కోసం పని చేసిందన్నది ఐబీ దగ్గర ఉన్న సమాచారం. ఈ ఏడాది ఆగస్టులోనే శ్రుతి కార్యకలాపాలను తెలంగాణ నిఘావర్గాలు పసిగట్టాయి. ఆమెకు ఎవరు సహకరిస్తున్నారనే కోణంలో దర్యాప్తు జరిగిందని ఐబీ వర్గాలు పేర్కొన్నాయి. వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన విద్యార్థుల ఆచూకీ కోసం రాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విశ్వవిద్యాలయాల వారీగా మావోయిస్టు సానుభూతి పరుల జాబితాను రూపొందించి వారెక్కడ ఉన్నారన్నదానిపై విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చిన కొందరు విద్యార్థులను గుర్తించారు. వారిలో అత్యధికులు ఇష్టం లేక తిరిగి వచ్చేసినవారేనని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. ‘వారు (మావోయిస్టులు) ఎంత ప్రయత్నించినా కేడర్ దొరకడం కష్టం. విద్యార్థులు, నిరుద్యోగులు కెరీర్, ఉద్యోగావకాశాల మీద దృష్టి సారిస్తున్నారు. తెలియక వెళ్లిన కొద్ది మంది కూడా అనతి కాలంలోనే తిరిగి బయటకు వస్తున్నారు..’ అని అధికారి పేర్కొన్నారు. -
'వచ్చే నాలుగు ఏళ్లల్లో ఇంటింటికి నల్లా'
-
ప్లీనరీని ఆత్మపరిశీలన వేదికగా చేసుకోవాలి
టీఆర్ఎస్ నేతలకు మాజీ చీఫ్ విప్ గండ్ర సూచన హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీని ఆత్మపరిశీలన వేదికగా చేసుకోవాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రజలకిచ్చిన హామీలేమిటి, అందులో ఎన్ని అమలయ్యాయో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్లీనరీలో నేతలతో కాకుండా సామాన్య కార్యక ర్తలతో మాట్లాడిస్తే వాస్తవ పరిస్థితులు వెల్లడవుతాయన్నారు. గ్రామాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల వంటి వాస్తవాలు తెలుస్తాయన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తి: నాయిని
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. పార్కింగ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఆయన బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్లీనరీ జరిగే ఎల్బీ స్టేడియం వద్దకు ప్రతినిధుల వాహనాలను అనుమతించడం లేదని చెప్పారు. నగరంలో ఎనిమిదిచోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామని వివరించారు. కనీసం 50 వేల మందికి సరిపోయేలా నిజాం కాలేజీ మైదానంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. -
టీఆర్ఎస్ తీర్మానాలు ఖరారు
క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ భేటీ ప్లీనరీ కోసం 12 తీర్మానాలు రెడీ {పభుత్వ పథకాల ప్రచారానికే ప్రాధాన్యం హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయ్యాక నిర్వహిస్తున్న పార్టీ తొలి ప్లీనరీ విషయంలో అధికార టీఆర్ఎస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. పది నెలలుగా ప్రభుత్వ పని తీరును కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్లీనరీని వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో 36 వేల మంది ప్రతినిధులతో జరిగే ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాలపై భారీ కసరత్తు చేసింది. చివరకు సోమవారం రాత్రి సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత 12 తీర్మానాలను ఖరారు చేసింది. ప్లీనరీ కోసం నియమించిన ఏడు కమిటీల్లో ఒకటైన తీర్మానాల కమిటీకి పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు(కేకే) నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ రూపొందించిన తీర్మానాలను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు పరిశీలించి పలు మార్పుచేర్పులు సూచించారు. ఆదివారం రాత్రి సుదీర్ఘంగా చర్చించినా వాటికి తుదిరూపు రాకపోవడంతో సోమవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులతో కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. పార్టీకి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే విధంగా కనీసం 24 తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశ పెట్టాలన్న చర్చ తొలుత జరిగింది. అయితే సమయాభావ సమస్య తలెత్తుతుందన్న ఆలోచనతో వాటిని తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలపై తీర్మానాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. విద్యుత్ రంగంలో సమస్యలు, మిగులును సాధించే లక్ష్యాన్ని వివరిస్తూ ఓ తీర్మానాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలపై తీర్మానాలు ఉంటాయి. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచితే విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనవచ్చని, అందుకే వాటికి ప్రాధాన్యమిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తీర్మానాల ఖరారులో ఇక ఆలస్యం జరగరాదన్న ఉద్దేశంతోనే సోమవారం మళ్లీ సమావేశమై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాత్రి చాలా సేపటివరకు జరిగిన ఈ భేటీలో 12 తీర్మానాలకు తుదిరూపునిచ్చినట్లు సమాచారం. అయితే మంగళవారం రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వద్ద మరోసారి కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
ప్లీనరీలో 11 తీర్మానాలు
⇒ టీఆర్ఎస్ తీర్మానాల కమిటీ నిర్ణయం ⇒ కేసీఆర్ నేతృత్వంలో సుదీర్ఘ సమావేశం ⇒ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశంపై చర్చ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో 11 తీర్మానాలు చేయాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో పార్టీ తీర్మానాల కమిటీ ఆది వారం రాత్రి కమిటీ చైర్మన్ కె.కేశవరావు నివాసంలో 4 గంటలకుపైగా సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీ బి.వినోద్‌కుమార్, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, దేశపతి శ్రీనివాస్ తదితరులు దీనికి హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేసే దిశగా తీర్మానాలు ఉండాలని, ఉద్యమ పాత్ర నుంచి బయటపడి పరిపాలనపై దృష్టి పెట్టేవిధంగా నిర్మాణాత్మక దృష్టితో వ్యవహరించాలని కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాల్సి ఉందని చర్చించారు. ఈ సందర్భంగా ప్లీనరీ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇప్పటివరకు జరిగిన పార్టీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికల ప్రక్రియను స్టీరింగ్ కమిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్లీనరీలో వివరిస్తారు. దీనిపై కేశవరావు కూడా ప్రసంగిస్తారు. తర్వాత హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తిచేస్తారు. పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికవనున్న కేసీఆర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 11 తీర్మానాలు చేస్తారు. రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ నిర్వహించాల్సిన పాత్ర-ఉద్యమకాలంలో పనిచేసిన వారికి ప్రభుత్వంలో అవకాశాలు, వ్యవసాయం-సాగునీరు, పంచాయతీరాజ్ సంస్థలు-వాటర్‌గ్రిడ్, విద్యుత్‌రంగం, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు-విధులు-కార్యక్రమాలు, మిషన్ కాకతీయ, హరితహారం, విశ్వనగరంగా హైదరాబాద్, పట్టణాల్లో మౌలిక వసతులు-సౌకర్యాల కల్పన, గిరిజనులు-దళితులు-మైనారిటీల అభివృద్ధి(కళ్యాణలక్ష్మి, దళితులకు భూ పంపిణీ), తెలంగాణ వారసత్వ-సాంస్కృతిక పునరుజ్జీవం (భాష, యాస పరిరక్షణ) వంటి ముఖ్యమైన తీర్మానాలు ఉంటాయి. ఒక్కో తీర్మానంపై 15-20 నిమిషాలకు మించకుండా ప్రసంగాలు ఉంటాయి. ఎక్కువగా పార్టీ నేతలకే మాట్లాడే అవకాశమివ్వాలని నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహిళా నేతలకు తదితరులు ప్రసంగిస్తారు. -
కేటీఆర్ కనుసన్నల్లోనే ప్లీనరీ ఏర్పాట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి వార్షికోత్సవ సభ, ప్లీనరీకి ఏర్పాట్లన్నీ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో మంత్రులు, ముఖ్యనాయకులతోనే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతో నేరుగా మాట్లాడుతూ కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా క్రియాశీలంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా జరిగిన అన్ని సభల్లోనూ, కార్యక్రమాల్లోనూ అత్యంత క్రియాశీలంగా ఉన్న రాష్ట్ర మంత్రి, కేసీఆర్ మేనల్లుడు టి.హరీశ్‌రావు ఈ కార్యక్రమానికి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ భావిస్తున్న కార్యక్రమానికి హరీశ్‌రావు దూరంగా ఉండడం, అదే సమయంలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశమయింది. -
కేడర్ కోసం లీడర్
-
ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ
అడహక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్: అధికార పార్టీ హోదాలో తొలిసారి నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ప్లీనరీకి 36 వేల మంది ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుంచి లక్ష చొప్పున మొత్తం 10 లక్షల మందిని 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు తరలిస్తామని చెప్పారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రతినిధులతో క్షేత్ర స్థాయిలో చర్చిస్తారని వివరించారు. ప్లీనరీని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు. కాగా, ప్లీనరీ, బహిరంగ సభల విజయవంతానికి 7 కమిటీలను ఏర్పాటు చేశారు. ఎంపీ కె.కేశవరావు చైర్మన్‌గా మరో 9 మందితో తీర్మానాల కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి కె . తారకరామారావు చైర్మన్‌గా మరో 16 మందితో నగర అలంకరణ కమిటీ , ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చైర్మన్‌గా మరో 11 మందితో ఫుడ్ కమిటీ ఏర్పాటు చేశారు. సభా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లకు 14 మంది సభ్యులున్న కమిటీకి మంత్రి పద్మారావు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పార్కింగ్ ఏర్పాట్ల కమిటీకి హోం మంత్రి చైర్మన్‌గా మరో 8 మంది సభ్యులుంటారు. మహిళా ప్రతినిధుల కమిటీకి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా, 6మందిని మీడియా ఏర్పాట్ల కమిటీని ఎంపీ బాల్క సుమన్ చైర్మన్‌గా మరో ఐదుగురిని సభ్యులుగా నియమించారు.ప్లీనరీకి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులను ఆహ్వానించనున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. -
టీఆర్ఎస్ ప్లీనర్ మరోసారి వాయిదా
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ముహుర్తం కుదిరినట్లు లేదు. ప్లీనరీ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. అక్టోబరు 18, 19 తేదీల్లో జరగాల్సిన ప్లీనరీ సమావేశాలను పార్టీ నాయకత్వం వాయిదా వేసింది. ప్లీనరీని ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు కూడా ప్లీనరీ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా దీపావళి తర్వాత ప్లీనరీ జరగనున్నట్లు సమాచారం. ప్లీనరీ తేదీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. -
18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తుపాను కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన ప్లీనరీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు, బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్లీనరీకోసం చేస్తున్న ఏర్పాట్లను గురువారం పార్టీ శ్రేణులు నిలిపివేశాయి. -
18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా పడింది. ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలను 18, 19వ తేదీలకు వాయిదా వేసింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాయిదా పడిన ప్లీనరీ ఈ నెల 18న ఎల్బీస్టేడియంలో , 19న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. తుపాన్ నేపథ్యంలో హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున ప్లీనరీ వాయిదా వేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా దీపావళి తర్వాతే నిర్వహించనున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా
-
టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా?
తుపాను నేపథ్యంలో కేసీఆర్ యోచన హైదరాబాద్: టీఆర్ఎస్ ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలను వాయిదా వేయాలని యోచిస్తోంది. అల్పపీడనం వల్ల ఆ రెండు రోజుల్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ నుంచి వస్తున్న సమాచారంతో ఈ సమావేశాలను వాయిదా వేయాలని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాలుంటే ప్లీనరీ సమావేశం నిర్వహణకు ఇబ్బందులు వస్తాయని, బహిరంగ సభ నిర్వహణ సాధ్యం కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రెండ్రోజుల్లో నిర్వహించాల్సిన సమావేశాలను వాయిదా వేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బుధవారం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్లీనరీ, సభ వాయిదాపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. గురువారం వచ్చే వాతావరణ నివేదికలను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. వేదికపై 210 మంది: ప్లీనరీ వేదికను 210 మంది కూర్చోవడానికి వీలుగా నిర్మిస్తున్నారు. వేదికకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, పూల రవీందర్ తదితరులు ఎల్బీ స్టేడియంలో బుధవారం పరిశీలించారు. దాదాపు 30 వేల మంది హాజరయ్యే ఈ ప్రతినిధుల సభకు నిజాం కాలేజీ మైదానంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన ఏర్పాట్లను ఫుడ్ కమిటీ చైర్మన్, ఎంపీ జితేందర్ రెడ్డి పరిశీలించారు. కాగా, ప్లీనరీలో తీర్మానాలకు సంబంధించిన అంశాలపై తీర్మానాల కమిటీ... చైర్మన్ కె.కేశవరావు నివాసంలో బుధవారం సమావేశమైంది. ప్లీనరీలో 30 తీర్మానాలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
మూడోవారంలో టీఆర్ఎస్ ప్లీనరీ
ఎల్బీ స్టేడియంలో నిర్వహణ 5 నుంచి సీఎం జిల్లాల పర్యటన మంత్రులు, ఎంపీల సమావేశంలో కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆది వారం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. మూడోవారంలో ఒకరోజు పూర్తిగా పార్టీ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయిం చారు. ప్రభుత్వంతో పార్టీకి సమన్వయాన్ని పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి పార్టీ ఆశిస్తున్నదేమిటి, ప్రజల్లో ఎలాంటి డిమాండ్లు ఉన్నాయనే సమాచారాన్ని పార్టీ మండలస్థాయి నాయకుల నుంచి తీసుకోవాలంటున్నారు. పార్టీలో ఉన్న ఖాళీలు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ వంటివాటిపైనా దృష్టి సారించను న్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడం, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం పెంచే విధంగా ప్లీనరీని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 19న జరిగే ఇంటింటీ సర్వేను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15నగాని, 22న గాని ఈ ప్లీనరీని నిర్వహిస్తారు. జిల్లాల పర్యటనలో కేసీఆర్... సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్, 7న నిజామాబా ద్, 8న ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. జి ల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమాచారాన్ని సేకరించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. చానళ్లపై దీటుగా స్పందించండి కొన్ని ఛానళ్లను తెలంగాణలో ఎంఎస్ఓలు నిలిపేయడంపై పార్లమెంటులో చర్చకు వస్తే, టీఆర్ఎస్ ఎం పీలు దీటుగా స్పందించాలని సీఎం కేసీఆర్ సూచిం చారు. ఆ ఛానళ్లపై చర్య అంశం స్పీకరు, మండలి చైర్మన్ పరిధిలోనే ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలన్నారు. ప్రత్యేక హైకోర్టుపై పార్లమెంట్లో పోరాటం: కేకే తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని, దీనిపై పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామ ని ఎంపీ కె.కేశవరావు చెప్పారు. ఏపీతో వైరం లేదని, అభివృద్ధిలో పోటీ మాత్రమే ఉందన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, డాక్టర్ టి.రాజయ్య, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, సాగునీటిపారుదల, గనుల శాఖల మంత్రి టి.హరీశ్‌రావు, ఎక్సైజ్‌శాఖా మంత్రి టి.పద్మారావు, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్, కె.విశ్వేశ్వర్ రెడ్డి, కె.కవిత, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. కేసీఆర్‌తో గట్టు, జనక్ ప్రసాద్, విజయారెడ్డి భేటీ ఇదిలా ఉండగా, కె.చంద్రశేఖర్‌రావుతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్‌లు ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తెరువబోయే కల్లు దుకాణాల్లో పాతవారినే నియమించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. కల్లు దుకాణాల్లో గతంలో పనిచేసిన వారంతా ఉపాధిని కోల్పో యి చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ వ్యూహం, ప్రజల సమస్యలు, పరిష్కారాలపై సుమారు గంటన్నర పాటు వీరితో కేసీఆర్ మాట్లాడారు. వీరు చర్చిస్తున్న సమయంలోనే పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి రానున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో టీఆర్ఎస్ను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నా రు. ఇందుకోసం పార్టీశ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు వివిధ పార్టీల ముఖ్యనేతలను, కార్పొరేటర్లను టీఆర్ఎస్లో చేర్చుకోవాలని ఆదేశించారు. సుమారు 25 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. పార్టీని డివిజన్ల వారీగా సమాయత్తం చేయాల్సిన బాధ్యతను పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావుకు కేసీఆర్ అప్పగించారు. -
‘అమ్మ ఒడి’తో బడికి దారి
-
అమ్మ ఒడి
-
ఎల్లో మీడియా పై తీవ్రంగా మండిపడ్డ షర్మిల
-
నాలుగేళ్లలో అమ్మలో ఎంతో మార్పు...
-
ఆధికారం రాగానే ’వైఎస్ఆర్ అమ్మ ఒడి’
-
'బోనులో ఉన్నా సింహం సింహమే'
-
విజయమ్మ భావోద్వేగ క్షణాలు...
-
ఆ 16నెలలు నేను మరిచిపోను:జగన్
-
అన్నదాతలకు వైఎస్ జగన్ వరాలు
-
రాజన్న రాజ్యం
-
వైఎస్సాఆర్సీపీకి స్వచ్చందంగా విరాళాలు
-
సింహాలై కదలాలి
-
'రాష్ట్రం అభివృద్ది ఫ్యాన్ గుర్తుతోనే సాధ్యం'
-
'బిజెపి వర్క్ షాప్ లో టిడిపి సైకిల్ రిపేర్ చేస్తున్నారు'
-
త్వరలో వైఎస్ జగన్ తెలంగాణలో పర్యటిస్తారు
-
YSRCP అధ్యక్షుడుగా మళ్లీ జగన్ ఏకగ్రీవ ఎంపిక
-
'పోరాటాల్లో పుట్టి పోరాటాల్లో పెరిగిన పార్టీ'
-
ప్లీనరీలో వాసిరెడ్డి పద్మ ప్రసంగం
-
ప్లీనరీలో కార్యకర్తలతో వైఎస్సాఆర్ సీపీ ప్రమాణం
-
అమరులకు ప్లీనరీ నివాళి
-
ప్లీనరీకి తరలివచ్చిన నేతలు
-
జగన్ ను డిస్టర్బ్ చేయలేరు: లక్ష్మీపార్వతి
-
మహానేతకు జగన్, షర్మిళ ఘన నివాళి
-
YSRCP ప్లీనరీకు ఏర్పాట్లు పూర్తి
-
నేడు రెండో ’ప్రజాప్రస్థానం’
ఇడుపులపాయలో వైఎస్సార్ సీపీ ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి తొలుత వైఎస్, మృతి చెందిన పార్టీ నేతలకు సంతాప ప్రకటన ఆపై విజయమ్మ ప్రారంభోపన్యాసం, షర్మిల ప్రసంగం పలు అంశాలపై తీర్మానాలు.. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కూడా నేడే ప్లీనరీ ముగింపు సందర్భంగా అధ్యక్షుడి సందేశం సాక్షి, హైదరాబాద్: ఆవిర్భావం నుంచీ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పోరుబాటలో తన భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకునే దిశగా ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో రెండో ప్లీనరీ నిర్వహించనుంది. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8.30 గంటలకే ప్రతినిధుల నమోదు ప్రారంభం కానుంది. ప్లీనరీలో మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు సంతాపం తెలియజేస్తారు. ఆ తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, రైతు శ్రేయస్సు, ఆర్థిక అంశాలు తదితరాలపై పలు తీర్మానాలను ప్రవేశపెడతారు. సమావేశం మధ్యలో.. ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆమోదిస్తారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడి సందేశం ఉంటుంది. ఆవిర్భావం నుంచి గెలుపుబాటే.. 2010 ఫిబ్రవరి 10న పార్టీ ఆవిర్భావం తర్వాత అతి తక్కువ సమయంలో జరిగిన కడప పార్లమెంటు, పులివెందుల శాసన సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో రెండు చోట్లా పార్టీ అభ్యర్థులే గెలిచారు. కడప పార్లమెంటు స్థానంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పులివెందుల శాసనసభా స్థానంలో వైఎస్ విజయమ్మ గెలుపొందారు. దేశంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందిన అరుదైన ఎంపీగా జగన్మోహన్రెడ్డి నిలిచారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తంగా 16 ఎమ్మెల్యే స్థానాల్లో పార్టీ విజయఢంకా మోగించింది. 2012 ఏడాది ఆరంభంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే స్థానాన్ని పార్టీ గెలుపొందింది. అదే ఏడాదిలో 18 ఎమ్మెల్యే స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది. విభజనను నిక్కచ్చిగా నిలదీసిన పార్టీ రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ పోరాటం చేసిన ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ నిలిచింది. ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడంతో పాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలసి విభజన వల్ల కలిగే నష్టాలను విన్నవించింది. దీంతోపాటు జాతీయ పార్టీల అధ్యక్షులను, అగ్రనేతలను జగన్ కలిసి 371డీ సవరణకు మద్దతు కూడగట్టారు. విభజనతో రాష్ర్టం నీటి సమస్యలతోపాటు అభివృద్ధిలో ఎదుర్కొనే సవాళ్లను వివరించారు. జగన్ ప్రభంజనాన్ని చాటుతున్న సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి ప్రజల మద్దతు దక్కుతున్న విధానాన్ని ఇటీవల పలు ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన సర్వేలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఇటీవల జాతీయ ఆంగ్ల వార్తా చానల్ సీఎన్ఎన్-ఐబీఎన్ చేసిన సర్వేలో రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీమాంధ్రలో ఏకంగా 48 శాతం మంది వైఎస్సార్ సీపీకే ఓటేస్తారని పేర్కొంది. ఆ స్థాయి ఓట ్లతో పార్టీ సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తుందని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి 25 శాతం ఓట్లు దక్కుతాయని తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీకి 20కిపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. లోక్‌నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ ఫలితాలు ఇదే తరహా విశ్లేషణ చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11-19 పార్లమెంటు స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చిచెప్పింది. నేడు అధ్యక్షుడి ఎన్నిక: ఉమ్మారెడ్డి వేంపల్లె, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామవళి ప్రకారం ప్రతి మూడేళ్లకొకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలతోపాటు రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా జరగాల్సి ఉందని ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో భాగంగా శనివారం పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇడుపులపాయలో మొదలైంది. ఈ మేరకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన సీజీసీ సభ్యులు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధ్యక్షుడి నామినేషన్ పత్రాలను సీజీసీ సభ్యులకు అందజేశారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటలవరకు సీజీసీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, 3 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ, 4 నుంచి 4.30 గంటల వరకు వాటి పరిశీలన, 5 గంటలకు ఆమోదిత నామినేషన్ల ప్రకటన, 5గంటల నుంచి 5.30 వరకు నామినేషన్ల ఉప సంహరణ, 6 గంటలకు తుది జాబితా ప్రకటన విడుదల జరిగిందని ఆయన వివరించారు. మొత్తం 13 సెట్ల నామినేషన్లను సీజీసీ సభ్యులు దాఖలు చేశారని, ఒకే వ్యక్తిని వాటిలో ప్రతిపాదించారని తెలిపారు. అన్ని నామినేషన్లు నిబంధనల ప్రకారమే ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొని ఉంటే నైజం తెలిసేది విభజన బిల్లుపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడకపోవడంపై విజయమ్మ వ్యాఖ్య పులివెందుల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడి ఉంటే.. ఆయన నైజం బయటపడేదని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలమంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు టీడీపీ సమైక్య పార్టీ అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాష్ట్ర విభజనకు సంపూర్ణంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమైక్యత కోసం మొదటినుంచి రాజీలేని పోరాటం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసి.. విభజన బిల్లును పార్లమెంటుకు పంపవద్దని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇడుపులపాయలోని అతిథి గృహంలో శనివారం మధ్యాహ్నం జరిగిన పార్టీ సీజీసీ సభ్యులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ముఖ్యాంశాలు.. సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఓట్లు, సీట్ల రాజకీయానికి తెర తీశారు. రాహుల్‌ను ప్రధానిని చేయడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి నిర్ణయించుకున్నారు. బిల్లును అడ్డుకొనేందుకు అసెంబ్లీలో అన్నివిధాలా నిరంతరం పోరాటం చేశాం. సీడబ్ల్యుసీలో తెలంగాణా ప్రకటన వెలువడకమునుపే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. రాజ్యాంగం సంక్షోభం సృష్టించడానికి ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండు చేసినా కాంగ్రెస్, టీడీపీలు ముందుకురాలేదు. బిల్లు వెనక్కి పంపాలని రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చాం. దేశంలోని అన్ని పార్టీల నాయకులను వైఎస్ జగన్ కలసి విభజనను వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగితే చరిత్ర క్షమించదని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించాం. రాష్ట్ర విభజన బిల్లుకు సంబంధించి ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ఎందుకు తెచ్చారో.. ఎందుకు వెనక్కి పంపారో సీఎం సమాధానం చెప్పాలి. ఆరోగ్యం బాగా లేదంటూ మొదటిరోజు అసెంబ్లీకి రాకుండా సీఎం తప్పించుకున్నారు. సభ్యులందరూ మాట్లాడాక.. సభ నాయకుడుగా చివరగా మాట్లాడాల్సిన సీఎం మధ్యలోనే మాట్లాడి చంద్రబాబుకు లోపాయికారిగా సహకరించారు. 2009 ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోవడం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది. ఎక్కడికెళ్లినా.. చివరకు వరదబాధిత ప్రాంతాలకు పరామర్శకు వెళ్లినా వైఎస్ఆర్, జగన్‌లనే విమర్శిస్తూ ముందుకెళుతున్నారు. పస్తుత రాజకీయాల్లో మాటమీద నిలబడి ప్రజలకు మంచి చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే. కాచే చెట్టుకే రాళ్లు పడుతాయన్నట్లు.. గెలిచే పార్టీ మనదే కాబట్టి అందరు మనల్నే టార్గెట్ చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారు. -
రేపు వైఎస్సార్సీపీ రెండవ ప్లీనరీ