నల్లజర్ల: జిల్లాలో తెలుగుదేశం పార్టీ అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇకపై సాగనివ్వబోమని, టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. నల్లజర్లలో బుధవారం పార్టీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మాజీమంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి సంతాపం తెలిపి శ్రద్ధాంజలి ఘటిం చారు.
అనంతరం ముఖ్యఅతిథి ఆళ్ల నాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు తొత్తులుగా ఉన్న జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు దోచుకో–దాచుకో పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలపై నిలదీసిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరనుంచి మండల, గ్రామస్థాయి నాయకుల వర కు కేసులు బనాయించి ఇబ్బందులు పాల్జేస్తున్నారని, ఇకపై ఇటువంటివి సాగనివ్వబోమని హెచ్చరించారు.
‘మిమ్మల్ని గెలిపించింది మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికా? లేక ప్రజల డబ్బుదోచుకోవడానికా?’ అని ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులు ఇసుక, మట్టి, మద్యం మాఫీయాలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజల భూములను అక్రమంగా లాక్కుని నష్టపరిహారం అడిగితే ఎంతో కొంత ఇచ్చి తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారని నాని ఆరోపించారు.
దోపిడీరాజ్యం సాగనివ్వం
Published Thu, Jun 1 2017 5:04 AM | Last Updated on Mon, Sep 17 2018 7:53 PM
Advertisement