అందుకే చంద్రబాబును ప్రజలు సాగనంపారు: మంత్రి కాకాణి | minister kakani govardhan reddy comments Sarvepalli YSRCP Plenary | Sakshi
Sakshi News home page

అందుకే చంద్రబాబును ప్రజలు సాగనంపారు: మంత్రి కాకాణి

Published Sat, Jun 25 2022 6:47 PM | Last Updated on Sat, Jun 25 2022 7:08 PM

minister kakani govardhan reddy comments Sarvepalli YSRCP Plenary - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: మంత్రికాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం అట్టహాసంగా సాగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ప్లీనరీ పరిశీలకులు సుకుమార్‌ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ప్లీనరీ సమావేశం సాగింది. వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. 

ప్లీనరీ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తోంది. సీఎం వైఎస్ జగన్‌కి రోజురోజుకూ జనాదరణ పెరుగుతోంది. ఇది ఓర్వలేని టీడీపీ.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోంది. కార్యకర్తలు సంఘటితమై టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే చంద్రబాబును ప్రజలు సాగనంపారు. ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి సీఎం జగన్‌. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టింది. ప్రజా సమస్యల పరిష్కారానికే పనిచేస్తోంది. పేద పిల్లల భవిష్యత్‌ కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి పైన పచ్చ మీడియా విషం చిమ్ముతోంది అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.

చదవండి: (‘ఆ ఘటన వెనుక ఎవరున్నారు?.. వారిద్దరూ ఎందుకు ఖండించలేదు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement