
సాక్షి, నెల్లూరు: వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో భేటీ అయ్యారు. మంత్రిగా తొలిసారి తన ఇంటికి వచ్చిన కాకానికి అనిల్ కుమార్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలతో పాటు, పార్టీని పటిష్టం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీ గెలుపుకోసం సాయశక్తుల పనిచేస్తామని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.
గత కొన్నిరోజులుగా వైఎస్సార్‌సీపీలో విభేదాలు వీధిన పడ్డాయని ప్రచారం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు తాజా, మాజీ మంత్రుల కలయికతో కంగుతిన్నారు. తమది మర్యాద పూర్వక భేటీ అని, జిల్లాలో అందరినీ కలుపుకొని పోతూ సీఎం వైఎస్ జగన్ జనబలాన్ని రెట్టింపు చేస్తామని తాజా, మాజీ మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
చదవండి👉🏾 (ప్రశాంత్ కిషోర్ సేవలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment