Ex-Minister Anil Kumar Yadav Key Comments Over CM YS Jagan - Sakshi
Sakshi News home page

ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటా: అనిల్‌కుమార్‌ యాదవ్‌

Published Sat, Jun 24 2023 7:42 AM | Last Updated on Sat, Jun 24 2023 8:48 AM

Ex Minister Anil Kumar Yadav Key Comments Over Cm YS Jagan - Sakshi

నెల్లూరు(బారకాసు): తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌తోనే ప్రయాణమని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఇటీవల కొద్దిరోజుల పాటు నెల్లూరు నగరంలో తాను లేకపోవడంతో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేశారన్నారు. కొన్ని పచ్చపత్రికలు, మీడియాల్లో కూడా తనపై దుష్ప్రచారం చేస్తూ వార్తలు వచ్చాయని చెప్పారు.  2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందుతానని స్పష్టం చేశారు. రాజకీయ పరంగా పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబితే తప్ప.. ఇంకెవరు చెప్పినా తాను పార్టీ నుంచి వెళ్లేది లేదన్నారు. 

తాను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, ఎవరి వద్ద నుంచి కూడా ఒక్కరూపాయి తీసుకోలేదని చెప్పారు. ఎన్నికలకు మరో 9 నెలలు గడువు ఉందని.. ఇక నుంచి నిత్యం నగర ప్రజలతోనే ఉంటానని వివరించారు. 

ఇది కూడా చదవండి: ‘ఎల్లో మీడియా నుంచి స్క్రిప్ట్.. ఓ పథకం ప్రకారం కథ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement