![Kakani Govardhan Reddy Serious Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/12/Kakani%20Govardhan%20Reddy.jpg.webp?itok=LSavO5LD)
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మాజీ సీఎం చంద్రబాబునాయుడు నుంచి పవన్‌కళ్యాణ్‌కు 2014 ముందే ఒక విడత కింద రూ.370 కోట్లు ముట్టిందని.. అందుకే ఆయన రుణం తీర్చుకుంటున్నాడని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును సీఐడీ అరెస్టుచేస్తే సీఎం జగన్ మీద నిందలు వేశారని.. ఏ ప్రభుత్వంలోనైనా అవినీతి అక్రమాలు, దొంగ పనులు చేస్తే చట్టపరిధిలో జరగాల్సింది జరుగుతుందన్నారు. ప్రభుత్వంపైన, న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం శోచనీయమన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- టీడీపీ బంద్‌కు స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు తెలపలేదు. బంద్ చేయాలని దుకాణదారుల మీద దౌర్జన్యాలకు పాల్పడితే తిరగబడ్డారు. బాబు అవినీతిపరుడని ప్రజలు విశ్వసిస్తున్నారు.
- లోకేశ్ తన ఎర్ర పుస్తకంలో తండ్రి చంద్రబాబు పేరు ప్రధానంగా చేర్చుకోవాలి.
- స్కిల్ స్కాంలో బాబు తన తప్పుని కేబినెట్ పైన రుద్దే ప్రయత్నం చేశాడు.
- ఫైబర్‌నెట్ కుంభకోణంలో కూడా బాబు అవినీతికి పాల్పడ్డారు. బాబు దగ్గర పీఏగా పనిచేసిన శ్రీనివాస్ కూడా రూ.2,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఐటీ శాఖ చెబుతోంది.
- బాబు అరెస్టుతో ఎవరెవరు ఎంతెంత భాగస్వామ్యం ఉందో బయటపడుతుంది. స్కిల్ స్కాంలో పవన్‌కూ ప్యాకేజీ అందింది. అందుకే టీడీపీ నేతల కంటే ఆయనే ఎక్కువగా రోడ్డుపై బైఠాయించాడు.
- టీడీపీ శ్రేణులకు కూడా ఇది అవాస్తవం అని చెప్పేందుకు నోరు రావడంలేదు. బాబు అంతరాత్మకు కూడా తాను దొంగనని తెలుసు. ఎవరూ కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు.
- ఇక చంద్రబాబును అరెస్టుచేస్తే ఒక్కరు కూడా బయటకు రాలేదు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకు కొద్దిమంది అక్కడక్కడ మాట్లాడారు. దీంతో చంద్రబాబు బలం, పరపతి ప్రజలకు అర్థమైంది.
Comments
Please login to add a commentAdd a comment