సాక్షి, నెల్లూరు: తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. తన స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. పోరాటం చేయడం వైఎస్సార్‌సీపీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు.
కాగా, వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్స్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి వ్యక్తిని గతంలో ఎప్పుడూ చూడలేదు. తన స్వార్ధ రాజకీయాలు కోసం తిరుమల పవిత్రతను దెబ్బతిశాడు. మనం ఓడిపోయాం తప్ప.. ప్రజలని ఎప్పుడూ మోసం చేయలేదు. ఒక్క సీటుతో ప్రయాణం ప్రారంభించిన డీఎంకే.. ప్రతిపక్షానికి కేవలం నాలుగు సీట్లే మిగిల్చి అధికారంలోకి వచ్చింది. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ రాసుకోండి.. అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ధ్వంసం చేసిన వారి సొంత ఖర్చులతోనే నిర్మాణాలు చేయిస్తాం. జమిలీ ఎన్నికలు వచ్చినా.. 2029 ఎన్నికలు వచ్చినా గెలుపు వైఎస్సార్‌సీపీదే. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారికే భవిష్యత్తులో పదవులు వస్తాయి. కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు.
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసుకుందాం. రూరల్‌లో పార్టీకి బలమైన కేడర్ ఉంది. పార్టీ కష్ట కాలంలో మనతో ఉండే వారికీ భవిష్యత్తులో పదవులు వరిస్తాయి. నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. రూరల్ నియోజకవర్గానికి బలమైన నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి ద్వారా దొరికారు. సిటీ, రూరల్‌లో మళ్ళీ మన జెండా ఎగరేస్తాం.
రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రూరల్‌లో వైఎస్సార్‌సీపీ గెలిచింది. రూరల్ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి కంచుకోటలాంటిది. ఈసారి జరిగే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం. స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు పార్టీ మారారు. కార్యకర్తలు మాత్రం పార్టీలో ఉన్నారు. పార్టీ మారిన వారికి భవిష్యత్తులో తన్నులు తప్పవు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇబ్బంది పెడతాడని.. ఆయన్ను తిడుతూనే పంచన చేరుతున్నారు. నా నేతల జోలికి వస్తే ఎవరికైనా తాట తీస్తాం. ఊరికే వదిలిపెట్టం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మా టైమ్ కూడా వస్తుంది. అప్పుడు చెబుతాం.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 40 శాతం ఓట్లతో దేశంలో శక్తివంతమైన నాయకుడిగా వైఎస్ జగన్ ఉన్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఏపీలోని పార్టీలకు లేవు. రాష్ట్రం నాశనం అయిందనే భావన మూడు నెలల్లోనే వచ్చింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్‌తోనే ఉంటాం. పోరాటాలు చేయడం మాకు కొత్త కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తాడో పేడో తేల్చుకునే వాళ్ళకే జిల్లా పదవులు, రాష్ట్ర పదవులు ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం కలిసి కొట్లాడతాం.. కార్యకర్తలను బతికించుకుంటాం. ఎల్లో మీడియా నన్ను నిత్యం కలవరిస్తోంది. నేను ఎక్కడికి పోలేదు.. విజయదశమి తర్వాత యాక్టివ్ అవుతా’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్ జగన్ పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment