సాక్షి, నరసారావుపేట: టీడీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగరాజును వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. నాగరాజును జాగ్రత్తగా చూసుకోమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని వైఎస్ జగన్ ఆదేశించారు.
పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లకు చెందిన చల్లా నాగరాజు మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించాడు. దీంతో నాగరాజుపై కక్ష కట్టిన స్థానిక టీడీపీ నాయకులు, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన్ను బెదిరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కూటమి నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, తేలుకుట్ల వదిలి పులిపాడు వచ్చి అక్కడే ఉంటున్నాడు.
కాగా, గత నెల 20న వ్యక్తిగత పనిమీద తేలుకుట్ల వెళ్లి పులిపాడు తిరిగి వస్తుండగా, గ్రామ శివారులోని గాడిదల వాగు వద్ద కాపుకాసిన 10 మంది టీడీపీ గుండాలు, నాగరాజుపై విచక్షణా రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రెండు కాళ్లనూ నాలుగు చోట్ల విరగ్గొట్టారు. దీంతో, నాగరాజును వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కొరకు నరసారావుపేట జీబీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యం చేసిన వైద్యులు.. నాగరాజు కుడి కాలు చికిత్స చేసే అవకాశం లేదని, మోకాలు కింద నుంచి కాలు తొలగించాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్.. నాగరాజును ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైఎస్ ఆకాక్షించారు. ఈ సందర్భంగా నాగరాజుకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగరాజుకు పూర్తి వైద్య సాయం చేయించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment