
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వరద బాధితులకు చిన్నారి సాయం
వరద బాధితులకు అండగా నేను ఉన్నానంటూ పులివెందులకు చెందిన చిన్నారి వర్ణిక ముందుకొచ్చింది. తాను దాచుకున్న పాకెట్‌మనీని వరద బాధితుల కోసం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి అందజేసింది. తాన బాబాయితో వచ్చిన విద్యార్థిని వరద బాధితుల కోసం రూ.72,500 ఆర్థిక సాయాన్ని అందించింది.
ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు?

Comments
Please login to add a commentAdd a comment