MLA Anil Kumar Yadav Strong Warning To Nara Lokesh, Details Inside - Sakshi
Sakshi News home page

‘లోకేష్‌కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి’

Published Mon, Jun 26 2023 11:28 AM | Last Updated on Mon, Jun 26 2023 12:03 PM

MLA Anil Kumar Yadav Strong Warning to Nara Lokesh - Sakshi

సాక్షి,  నెల్లూరు: లోకేష్‌కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. ఒకవేళ లోకేష్‌ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అదే తాను గెలిస్తే లోకేష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? అని ప్రశ్నించారు. ‘దొడ్డిదారిన మంత్రి అయ్యి..పోటీ చేసిన ఫస్ట్‌ ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర లోకేష్‌ది. తండ్రి, తాత సీఎం కాకపోయి ఉంటే లోకేష్‌ వార్డు మెంబర్‌గా కూడా గెలిచే వాడు కాదు.

నేను చేసిన సవాల్‌ను ఆనం స్వీకరించలేకపోయాడు. లోకేష్‌కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి. లోకేష్‌ ప్రసంగం అర్ధంకాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ హయాంలో చెయ్యలేని సాగునీటి ప్రాజెక్టులను మేం పూర్తి చేశాం. నాయుడుపేటలో నాకు ఎలాంటి లే అవుట్లు లేవు’ అని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

చదవండి: ఆ రాతలతో.. పవన్‌ పరువు గంగలో కలిపేసిన టీడీపీ మీడియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement