నెల్లూరు: పార్టీలోని నేతలందరం కలిసిమెలిసి పనిచేస్తున్నామని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోర్థన్‌రెడ్డి తెలిపారు. తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు. ఇద్దరి మధ్య విబేధాలను పెంచేందుకు కొంతమంది ఫ్లెక్సీలను చించివేశారని అన్నారు. ఎవరూ ఫ్లెక్సీలను కావాలని తొలగించరని తెలిపారు.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీలు తాను చించను, తన ఫ్లెక్సీలు ఆయన చించరని తెలిపారు. తన మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారని, టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ వేస్తే కోర్టు అది సరైన కేసు కాదని తేల్చి చెప్పిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యిందని తెలిపారు. దొంగతనాలు చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.
దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? అని ప్రశ్నించారు. పథకం ప్రకారం కావాలని చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందని తెలిపారు. టీడీపీకి సందేహాలుంటే హైకోర్టు ద్వారా సీబీఐ విచారణ కోరాలని అన్నారు. పవన్ కళ్యాణ్ నటనకు సరిపోతారు, రాజకీయాల్లో పనికిరాడని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment