psr nellore district
-
మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు, సాక్షి: తన భద్రత విషయంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ భద్రత సరిగా లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘సొంత సెక్యూరిటీ సిబ్బందితో నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లైసెన్సుడ్ వెపన్‌ను క్యారీ చెయ్యాలనుకుంటున్నా. అందరికీ సెక్యూరిటీ ఇచ్చినట్లే నాకు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది’ అని అనుమానం వ్యక్తం చేశారు.చదవండి: ‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’ -
టీడీపీ అధినేతపై రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్యే!
నారా చంద్రబాబునాయుడు డిఫరెంట్ పర్సనాలిటీ. టీడీపీ కోసం కష్టపడి పనిచేసినవారిని పక్కన పెట్టడం...డబ్బిచ్చినవారికి సీటివ్వడం ఆనవాయితీ. నెల్లూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను తాజాగా దూరం పెట్టేశారు చంద్రబాబు. ఇంతకాలం తాను పడ్డ కష్టం అంతా వృధా చేశారంటూ టీడీపీ అధినేతపై ఆ మాజీ ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. తనకు సీటు రాకపోవడంతో ఎలాగైనా టీడీపీని ఓడించడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జిల్లాలోని పాత, కొత్తతరం నాయకులకు విష్ణువర్థన్‌రెడ్డి బాగా పరిచయం ఉన్న నాయకుడే. గత ఎన్నికల్లో కూడా కావలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఎన్నికల తర్వాతి నుంచి టీడీపీ నాయకత్వం ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. ఎన్నికల నాటికి పూర్తిగా పక్కన పెట్టేసింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర సూచనతో సుబ్బానాయుడిని కావలి ఇన్చార్జ్గా నియమించారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడిని పక్కకు నెట్టేసినందుకు ఇప్ప్పుడు టీడీపీ అక్కడ పతనం దిశగా పరుగులు తీస్తోంది. జిల్లాలో తన ప్రాబల్యం తగ్గకుండా కాపాడుకునేందుకే బీదా రవిచంద్ర కాటంరెడ్డిని పక్కన పెట్టి సుబ్బానాయుడిని ఇంచార్జ్‌గా తీసుకువచ్చారని కావలి టీడీపీ నేతలే చెబుతున్నారు. చాలాకాలంగా విష్ణువర్డన్ రెడ్ది..రవిచంద్ర కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుండటమే దీనికి కారణమని అంటున్నారు. సుబ్బానాయుడు కావలి ఇన్చార్జ్గా మూడేళ్ళపాటు వ్యవహరించారు. అయితే ఇటీవల మాఫియా డాన్ కావ్య కృష్ణారెడ్డిని కావలి అభ్యర్థిగా ప్రకటించారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో కావలిలో ఉపయోగపడతాడని చంద్రబాబు భావించారు. ఇదిలాఉంటే కావలిలో ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ జెండా ఎగరనివ్వబోనని కాటంరెడ్డి శపథం చేశారు. తాను కూడా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి చెమట్లు పడుతున్నాయి. నియోజకవర్గంలో కావ్యను వ్యతిరేకించేవారంతా కాటంరెడ్డికే మద్దతిస్తారు. బడా కాంట్రాక్టర్‌గా ఉన్న కావ్య కృష్ణారెడ్డిని మామూలుగానే కలవడం కష్టమని..ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక మాకు అసలు అందుబాటులో ఉండడని టీడీపీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఈవిధంగా సొంత పార్టీలోనే కావ్య కృష్ణారెడ్డికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో కాటంరెడ్డి బరిలో ఉంటే కావ్య గల్లంతు కావడం ఖాయమనే టాక్ నడుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టిక్కెట్ తెచ్చుకుంటే ఈ ఖర్మ ఏంటని టీడీపీ అభ్యర్థి తలపట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్ది 49 శాతం ఓట్లు సాధించారు. కావలి నియోజకవర్గంలో అయన చేసిన అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు ఆయన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని.. ఈసారి 59 శాతం ఓట్లు కచ్చితంగా పడతాయని tdp చేసిన సర్వేల్లోనే తేలిందని చెబుతున్నారు. ఈ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి రెబల్‌గా పోటీపడితే Tdp ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఆ పార్టీ నాయకులు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందిన టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి...మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డితో రాజీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది. -
టీడీపీలో రచ్చకెక్కుతున్న ‘సీటు’ రాజకీయాలు
ఓడిపోయే పార్టీ అయినా టిక్కెట్ల కోలాహలం బాగానే ఉంటుంది. ఆ మాత్రం బిల్డప్ ఇస్తేనే టిక్కెట్లు అమ్ముకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీలో అదే జరుగుతోంది. సీటు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఓ నియోజకవర్గానికి ఇంచార్జ్ ఉన్న తనను కాదని వేరే వారికి టిక్కెట్ ఇస్తే ఊరుకునేదే లేదని ఆ మాజీ ఎమ్మెల్యే ఓపెన్‌గానే పార్టీ అధినేతకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఇక్కడ చంద్రబాబు రాజకీయాల్లో పావుగా మారుతున్న నేత ఎవరు? ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో పచ్చపార్టీ టిక్కెట్ ఫైట్ రోజు రోజుకూ ముదురుతోంది. వెంకటగిరి టికెట్ తనదే అంటూ ముగ్గురు నేతలు తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరపున కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం చంద్రబాబు రాజకీయ క్రీడలో పావుగా మారి అధికార పార్టీ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలోకి జంప్ చేశారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసహనంతో ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. టీడీపీలో చేరేసమయంలోనే తనకు ఆత్మకూరు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ తన ఆటలు సాగవని భావించిన ఆనం తిరిగి వెంకటగిరికి వచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. తనకు వెంకటగిరి టిక్కెట్టే ఇవ్వాలంటూ చంద్రబాబును ఆనం రామనారాయణరెడ్డి కోరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి తమకే టిక్కెట్ ఇస్తున్నారంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ నేతగా ఉన్న మస్తాన్ యాదవ్ సైతం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వారి ద్వారా టిక్కెట్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో ముగ్గురిలో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక పార్టీ క్యాడర్ అయోమయంలో పడిందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.. నేను లోకల్ టికెట్ నాకే అంటూ మస్తాన్ యాదవ్ విస్తృతంగా జనాల్లో తిరుగుతూ ఉండడంతో అటు అనంకి ఇటు కురుగొండ్ల రామకృష్ణకి టికెట్ భయం పట్టుకుందట. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చరిష్మాతో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి మంచి మెజార్టీతో గెలుపొందారు. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఆనం టిడిపిలోకి జంప్ అవడం.. టిడిపి టికెట్ ని ఆశిస్తూ ఉండడంతో చంద్రబాబుకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని కురుగొండ్ల రామకృష్ణ పబ్లిక్ గా చెబుతుంటే.. ఆనం మాత్రం సైలెంట్ గా ఆయన సీటుకి ఎసరు పెడుతున్నారని యాంటీ కురుగొండ్ల వర్గం చెబుతోంది. వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారని పాతతరం నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ చంద్రబాబు పార్టీ ఫండ్ ఇచ్చే వారికీ ప్రయారిటీ ఇస్తారా లేక పార్టీని నమ్ముకున్న నేతకు టికెట్ ఇస్తారో చూడాలి. -
మిచౌంగ్ ముంచేసింది.. తీరం దాటింది.. అప్డేట్స్
cyclone michaung Live Updates.. బాపట్ల జిల్లా: అద్దంకి లో మిచౌంగ్ తూపాను ప్రభావంతో పొంగిపొర్లుతున్న వాగులు నల్లవాగు, దోర్నపువాగు ఉధృతంగా ప్రవహించడంతో నిలిచిన రాకపోకలు అద్దంకి, పరిసర ప్రాంతాలలో విరిగిపడ్డ చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ►భారీ వర్షాలు కారణంగా రేపు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తీరం దాటిన మిచౌంగ్ తుపాను 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు రాగల రెండు గంటల్లో తుపానుగా బలహీనపడనున్న తీవ్ర తుపాను తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన కాకినాడ జిల్లా తుపాను ప్రభావంతో గడిచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా నమోదయిన వర్షపాతం జిల్లా వ్యాప్తంగా 990.6 మి.మి అత్యధికంగా కాజులూరు మండలం 79.08 మి.మి, తాళ్లరేవు 73.08 మి.మి వర్షపాతం అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 24 మి.మి నమోదు కాకినాడ రూరల్ 72.6. మి.మి, కాకినాడ అర్భన్ 60.2 మి.మి వర్షపాతం నమోదు కోనసీమ పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పినిపే విశ్వరూప్ భగవంతుడి దయవల్ల కోనసీమపై మిచౌంగ్ ప్రభావం పెద్దగా లేదు ఇప్పటికే లక్షా ఆరు వేల ఎకరాల్లో పంట కోతలు పూర్తయ్యాయి ఇంకా 51 వేల ఎకరాల్లో మాత్రమే కోతలు కోయాల్సి ఉంది దాదాపు తొమ్మిది వేల ఎకరాలపై తుఫాన్ ప్రభావం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా తడిచిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కచ్చితంగా కొనుగోలు చేస్తాం మిల్లర్లకు ఆదేశాలు.. ప్రత్యేక అధికారిణి జయలక్ష్మి కోనసీమలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాం సీఎం జగన్ ఆదేశాల మేరకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించాం రైతుకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నాం రైతుల్ని ఆదుకుంటాం.. కలెక్టర్ హిమాన్షు శుక్లా చేలలో నీరు నిల్వ ఉండకుండా జాతియ ఉపాధి హామీ పథకం కూలీలను పెట్టి నీటిని బయటికి తోడిస్తున్నాం దీనివల్ల నేలనంటిన పైరు సైతం నష్టపోకుండా ఉంటుంది ప్రాథమికంగా తొమ్మిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించాం నక్కా రామేశ్వరం వద్ద డ్రైన్‌కు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయడంతో చేయడంతో వర్షపు నీరు చాలా వరకూ బయటకు పోతుంది సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని ఆదుకుంటున్నాం పశ్చిమగోదావరి జిల్లా ► మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ మోళ్లపర్రు లో పర్యటించి పునరావాస కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ► ఈడురు గాలులు ఎక్కువగా ఉన్నందున దయచేసి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ► ఇళ్ళ నుండి బయటకు రావొద్దు.. పిడుగులు పడే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ► పునరావాస కేంద్రాలకు రావాలి.. అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది. ► పోలీస్,రెవెన్యూ,ఎలక్ట్రికల్,ఇతర అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయటం జరిగింది. ఏలూరు జిల్లా ►తూఫాన్ నేపథ్యంలో వాతారవరణ హెచ్చరికల మేరకు ఏలూరు జిల్లాలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు . ►ఏలూరు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18002331077. ►సబ్ కలెక్టర్ కార్యాలయం నూజివీడు : 08656-232717 ►ఆర్డీఓ కార్యాలయం, జంగారెడ్డిగూడెం : 9553220254 ►ఆర్డీఓ కార్యాలయం, ఏలూరు - 8500667696 కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ►కంట్రోల్ రూమ్ లను అత్యవసర సహాయం కోసం వినియోగించుకోవాలి. ►లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి. ►నేడు, రేపు భారీ, అతి భారీ వర్షాలు ఉంటాయి ►ప్రజలు అవసరమైతే తప్ప ఇంటిని వదిలి బయటికి రావద్దు. ►బలహీనంగా వున్న ఏటిగట్లు, వంతెనలు, తదితర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ. ప్రకాశం జిల్లా: ►మిచౌంగ్ తుఫాన్ కారణంగా సంతనూతలపాడు మండలం మంగమూరు-ఒంగోలు మధ్యలోనీ రోడ్డుపై పారుతున్న వర్షపు నీరు ►రాకపోకలు అంతరాయం ►రెండు రోజుల వరకు ఈ రోడ్డులో ఎవరు ప్రయాణం చేయవద్దని సూచించిన అధికారులు ►దగ్గరుండి సహాయ చర్యలు చేపడుతున్న ఎమ్మార్వో మధుసూదన్ రావు, సిబ్బంది నెల్లూరు జిల్లా: ►ఉలవపాడు మండలంలోని తుపాను పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. ►బాధితులను పరామర్శించి భోజన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ►నిర్వాసితులకు బ్రెడ్, బిస్కెట్లు అందజేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో మినీ టోర్నడో బీభత్సం ►విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు పలు దుకాణాలు ధ్వంసం కృష్ణాజిల్లా ►జిల్లాలో 25 మండలాల పై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ►పంట నష్టం పై ప్రాధమిక అంచనా ►68392 హెక్టార్లలో వరి,212 హెక్టార్లలో పత్తి, 162 హెక్టార్లలో మొక్కజొన్న,583 హెక్టార్లలో మినుము,854 హెక్టార్లలో వేరుశెనగ, పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు విశాఖ: ►విశాఖ రూరల్ అత్యధికంగా 51.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ►ఆనంద పురంలో 37.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►భీమిలి లో 44.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►పద్మనాభం 35.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►సితమ్మధర 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం ►పెందుర్తి 35.8 మిల్లీ మీటర్ల వర్షపాతం ► గాజువాక 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం ►గోపాలపట్నం 46.8 మిల్లీ మీటర్ల వర్షపాతం ► ములగడ 49.2 మిల్లీ మీటర్ల వర్షపాతం గుంటూరు: ► తెనాలి మండలం ఖాజీపేట, కొలకలూరు లో మిచౌంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి నున్న. వెంకటేశ్వర్లు. గుంటూరు జిల్లా: ►ప్రత్తిపాడులో పొంగుతున్న ప్రత్తిపాడు-గొట్టిపాడు మధ్యనున్న లోలెవల్ చప్టా వద్ద పోలీసుల పహారా ►ప్రజలు, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రాకపోకలు నిలిపివేసిన ఎస్ఐ రవీంద్ర బాబు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు ►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్టీసీ బస్సు స్టాండ్ నీటమునక ►బస్సు రాకపోకలకు అంతరాయం కాకినాడ జిల్లా ►మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో కోత గురయిన ప్రాంతాలను సందర్శించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ►ఉప్పాడ,మాయపట్నం,సుబ్బంపేటలో బైక్ మీద తిరుగుతూ తుఫాన్ సహయక చర్యలు పరిశీలించిన ఎమ్మెల్యే దొరబాబు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు ►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్ టి సి బస్సు స్టాండ్ నీటమునక ► బస్సు రాకపోకలకు అంతరాయం ► బాపట్ల దగ్గర కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ► మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా ►తీరం వెంబడి గంటకు 100-120కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ► మరో రెండు గంటల్లో మిచౌంగ్ తుపాను తీరం దాటనుండగా.. తుపాను తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను: డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ. ►మరో రెండు గంటల్లో పూర్తిగా తీరాన్ని దాటనుంది ►తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు ►తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ►ఈరోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ►పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు. ►అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం నెల్లూరు జిల్లా: ►మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన ►గొలగమూడి,అనికేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి,బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి ►బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, బాధితులకు దుప్పట్లు, ఆహారం అందజేసిన మంత్రి ►కనుపూరు చెరువు ఆయుకట్టను జిల్లా కలెక్టర్ హరి నారాయణ్‌తో కలిసి పరిశీలించిన మంత్రి కాకాణి. తాడేపల్లి: మిచౌంగ్ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంళవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుపాను పరిస్థితులపై ఆరా: ► నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని తెలిపిన అధికారులు ► చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ► తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న అధికారులు ► తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడి ► ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామని చెప్పిన అధికారులు ► ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మందిని తరలించినట్టు వెల్లడి సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ►బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. ►సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. ►నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ►మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. ►తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలి. ►గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారును ఆదేశించారు. తుపాను ఎఫెక్టుపై వైసీపి కేంద్ర కార్యాలయం సమీక్ష ► తీర ప్రాంత ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ ► ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించాం: కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జి కేళ్ల అప్పిరెడ్డి ► బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపులో నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు ► ట్రాక్టర్లు, ఆటోలలో బాధితులను తరలిస్తారు ► ఇల్లు ఖాళీ చేయాల్సిన సమయంలోనూ సహకరిస్తారు ► ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం తమ ధర్మం ► రైతులు ఎవరూ భయపడాల్సిన పనిలేదు ► తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు ► వర్షాలు తగ్గగానే పంటనష్టం అంచనాలు వేస్తారు తిరుమలలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జలాశయాల పరిశీలన. ► నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన జలాశయాలు. ► తిరుమలలో ఉన్న ఐదు జలాశయాలు ఫుల్ ► పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్ లలో నీటి నిల్వాలను అధికారులు అడిగి సమాచారం తీసుకున్న టీటీడీ చైర్మన్ ► పాప వినాశనం ,గోగర్భం డ్యామ్ లు గెట్లు ఎత్తిన అధికారులు. ► 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం మొదలైన రోజు నుంచి వర్షం కురుస్తుంది ► రెండు రోజులుగా 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ► తిరుమలలో అన్ని జలాశయాలు నిండాయి ► ఒకటిన్నర సంవత్సరానికి సరిపడా నీరు చేరింది ► తిరుపతి భూగర్భ నీటిశాతం పెరిగింది ► శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం ద్వారానే వర్షాలు కురిశాయి. తీరానికి చేరువలో మిచౌంగ్ తుపాను: విశాఖ వాతావరణం కేంద్రం డైరెక్టర్ సునంద ► మరి కాసేపట్లో బాపట్ల వద్ద తీరాన్ని దాటే అవకాశం ► తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ► మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులో పదో నంబరు ప్రమాద సూచిక కాకినాడలో తొమ్మిదో నెంబర్ ప్రమాద సూచిక ఎగురువేత ► తీరం దాటిన తర్వాత తుఫానుగా ఉత్తర దిశలో పయనించనున్న తుపాను ► తుపాను ప్రభావంతో ఉత్తరకొస్తా జిల్లాలో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు ► తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ► తుపాను ప్రభావంతో ఒడిశా, చత్తీస్‌గఢ్ తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బికే కేంద్రాన్ని పరిశీలించిన సివిల్ సప్లై కమిషనర్ అరుణ్ కుమార్ ► తుఫాను వలన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం: అరుణ్ కుమార్ ► రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం ► ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ► రవాణ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం ► రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు ► సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ► రాష్ట్రంలో మిచౌంగ్ తుపాను ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ► ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ► రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదు అవుతోంది ► 8 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపాము ► రేపు సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయి ► 22 కోట్లు తక్షణ చర్యలు కోసం విడుదల చేశాం ► లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం ► 4 లక్షల టన్నుల ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకున్నాం ► 11 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు ► అందరికి ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నాం ► తుపాను ప్రభావంతో కలిగే నష్టాన్ని వెంటనే అంచనా వేసి కేంద్రానికి పంపిస్తాం ► వర్షాలు అధికంగా ఉన్న చోట పాఠశాలలకు సెలవు ప్రకటించాం ► ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం కృష్ణాజిల్లా : ► కృత్తివెన్ను మండలం పీతలావ, వర్లగొంది తిప్ప గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు. ► పునరావాస కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. ► నిడమర్రు, చిన్న గొల్లపాలెం, పడతడిక, ఇంతేరు సముద్ర తీరం వెంబడి 75 మంది అదనపు పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు జిల్లా ఎస్పీ జాషువా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ► రాజోలు నియోజకవర్గంలో భారీ వర్షంతో నేలకు ఒరిగిన చేతికి అంది వచ్చిన వరిచేలు. ► శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుపాను కారణంగా చేతికి అందకుండా పోయిందని రైతుల ఆవేదన. ► ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు. తిరుపతి: ►మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ఆంక్షలు విధించారు. వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహన రాకపోకులకు అంతరాయం కలుగుతోంది. ►అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురవుతున్నారు. తద్వారా వాహనాలు, ప్రయాణికులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ► ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. వరద సృష్టించిన విధ్వంసం(ఫోటోలు) బాపట్ల జిల్లా: ►చీరాలలో 10 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ►మిచౌంగ్ తుపాను ప్రభావంతో చీరాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం. ►తీరప్రాంతంలోని 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ►విపత్తును ఎదుర్కొనేందుకు 16 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేసిన అధికారులు. ►మిచౌంగ్ తుపాను కారణంగా చీరాల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో మరో మూడు రైళ్లు రద్దు. ►గూడూరు-రేణిగుంట, రేణిగుంట-గూడూరు, తిరుపతి-పుల్ల రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ►హౌరా కన్యాకుమారి రైలు దారి మళ్లింపు. తిరుపతి ► వరద బాధితులకు అండగా నిలుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ► అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించిన భూమన. ► పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించిన భూమన. ► పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించిన భూమన. రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్ ►హైదరాబాద్ నుంచి దక్షిణాదికి నిలిచిన రైళ్లు ►ఉత్తరాది నుంచి వచ్చే వాటికీ బ్రేక్ ►ఇప్పటికే 150కిపైగా రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే ►వివరాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు ►తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులకు జీఎం ఆదేశాలు ►అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచనలు కాకినాడ జిల్లా ►పెద్దాపురం:మీచాంగ్ తూపాన్ నేపథ్యంలో సామర్లకోట మండలంలో 4000 వేలమంది రైతుల వద్ద నుండి ఆన్లైన్లో 17,450, ఆఫ్ లైన్లో 1504 మెట్రిక్ టన్నుల ధాన్యం. ►పెద్దాపురం మండలంలో 832 మంది రైతుల వద్ద నుండి ఆన్లైన్లో 4303, ఆఫ్‌లైన్‌లో 369 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన వ్యవసాయ అధికారులు. ►రెండు మండలాల్లో 80 శాతం పూర్తైన వరి కోతలు. నెల్లూరు జిల్లా: బంగాలఖాతంలో ఏర్పడ్డ తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద. ►ఇన్ ప్లో 10,915 క్యూసిక్కులు,అవుట్ ప్లొ 70 క్యూసెక్కులు. ►ప్రస్తుత జలాశయం సామర్థ్యం 30.756 టీఎంసీలు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం పశ్చిమగోదావరి జిల్లాకు రెడ్ ఎలర్ట్, ఏలూరు జిల్లాకు ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు నర్సాపురం, మొగల్తూరు రెండు మండలాల్లో 12 తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గుర్తింపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు భీమవరం కలెక్టర్ కార్యాలయంలో 'మిచాంగ్' తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అత్యవస సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219... విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు ఎన్ డి ఆర్ ఎఫ్ ,ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచిన అధికారులు జిల్లాలో 1. 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు ముమ్మరంగా తుపాను సహాయచర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం రాష్ట్రంలో తుపాను ప్రభావిత జిల్లాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం బాపట్ల, కోనసమీ, తూర్పుగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం పలు జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు కోనసీమలో86, క్రిష్నా జిల్లాలో 55, బాపట్ల జిల్లాలో 64, నెల్లూరు జిల్లాలో 55, చిత్తూరు జిల్లాలో 93 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు. 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు తిరుపతి జిల్లా కోటలో అత్యధికంగా 388 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు మనుబోలు లో 366, చిల్లకూరు లో 350, నాయుడు పేటలో 271, బలయపల్లిలో 239, సైదాపురంలో 223, వెంకటాచలంలో 213 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో సున్నపువాగులో చిక్కుకున్న బండారు పల్లెకు చెందిన శివ, వెంకటేష్ నిన్న సాయంత్రం సున్నపు వాగు ఉదృతి పెరగడం తో మధ్యలో నిలిచిపోయిన వ్యవసాయ కూలీలు రక్షించే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు, ఫైర్ అధికారులు కాకినాడ: మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు ఇవాళ కూడా పాఠశాలలకు శెలవు ప్రకటించిన అధికారులు కాకినాడ పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం వేటను నిలిపివేసి తీరానికే పరిమితమైన గంగపుత్రులు ఉప్పాడలో తుపాను పునరావాస కేంద్ర ఏర్పాటు భారీ వర్షాలకు 3 వేల ఎకారాల్లో నేల కొరిగిన వరి పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్: ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుపాను మధ్యాహ్ననంలోపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్ తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు మిచౌంగ్ తుపాను కారణంగా విశాఖలో బీచ్‌లు మూసివేత ఆర్కే బీచ్‌లో పోలీసుల ప్రత్యేక పెట్రోలింగ్ అన్ని బీచ్‌ల వద్ద పోలీసుల పర్యవేక్షణ పర్యాటకులు బీచ్‌లోకి దిగకుండా ఆంక్షలు చెన్నైలో జలప్రళయం ముంచెత్తిన మిచౌంగ్ తుపాను ఏకంగా 35 సెంటీమీటర్ల వాన పూర్తిగా స్తంభించిన జనజీవనం వరదలకు కొట్టుకుపోయిన పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు. రన్ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయం కూడా మూసివేత హైవేలు, సబ్‌వేల మూసివేత నీట మునిగిన విమానాశ్రయం 160 విమానాలు రద్దు నేడు మరింత వర్ష సూచన! Chennai in deep trouble.. 😔#ChennaiRain #MichaungCyclone pic.twitter.com/DSXZvIo3p5 — Dr. Jitendra Nagar (@NagarJitendra) December 5, 2023 తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి నగరంలో నిలిచిపోయిన వర్షం.. స్తబ్దంగా ఉన్న వాతావరణం ఏజెన్సీ ప్రాంతంలో తుఫాను ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షం ముందస్తు చర్యగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 30 పురావస కేంద్రాల ఏర్పాటు ఇవాళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యకారులు గాని, పిక్నిక్ల పేరిట సాధారణ జనం కానీ వెళ్ళద్దని హెచ్చరికలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు పూర్తి చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రైతులకు సహాయపడుతున్న అధికారులు తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం రాజమండ్రి కలెక్టరేట్, రాజమండ్రి ,కొవ్వూరు ఆర్డీవో కార్యాలయాల్లోను, అమలాపురం కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు తిరుపతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశాం: భూమన గత అనుభవాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరిగింది. ముందుస్తుగా వరద కాలువల్లో పూడిక తీయడం వంటి చర్యలు చేపట్టం జరిగింది దీని వల్ల మరీ లోతట్టు ప్రాంతాల్లో మినహా వరద నీటి ఉదృతి చాలా వరకు తగ్గింది తిరుమలలో కూడా జలాశయాన్ని పూర్తిగా నిండాయి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది కృష్ణాజిల్లా: మచిలీపట్నం హార్బర్ లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేత తీరప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం తుపానుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుపాను మధ్యాహ్ననికి నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్ తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు తీవ్ర రూపం దాల్చిన తుపాను.. 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పలు చోట్ల 15–20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం.. అత్యధికంగా బుచ్చినాయుడు కండ్రిగలో 28 సెంటీమీటర్లు కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ.. పొంగుతున్న వాగులు, వంకలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ మొదలైన వానలు.. నేటి మధ్యాహ్నం చీరాల, బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉప్పాడ తీరంలో గ్రామాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు.. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా పెళ్లకూరులో 23.1, దొరవారిసత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. నేడు, రేపు భారీ వర్షాలు మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాలుస్తూ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటల్లో సముద్రం 120 నుంచి 250 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఐఎండీ సూచన తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఫలితంగా తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, యానాం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం. తెలంగాణలోని ఖమ్మం, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదకు అవకాశం ఉంది -
నెల్లూరులో ‘పచ్చదొంగల ముఠా’ ఆగడాలు
సాక్షి, నెల్లూరు: ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్న ‘పచ్చదొంగల ముఠా’ బాగోతం మరోసారి వెలుగుచూసింది. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగలించడానికి యత్నించిన ఘటన తాజాగా నెల్లూరులో బయటపడింది. మాజీ మంత్రి పొంగురు నారాయణకు చెందిన ప్రైవేటు సైన్యం ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. నగరంలో ఇంటింటికి తిరుగుతూ సెల్ఫోన్లో మీకు ఓటిపి వస్తుంది అని ఓటిపి తీసుకొని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(శనివారం) మూలాపేటలో ఓ ఇంటికి వెళ్లి ఇలా వ్యక్తిగత డేటాను దొంగిలించే యత్నించేందుకు ఓటీపీలు అడుగుతున్నటువంటి పచ్చదొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇది చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
నారాయణవనం/కావలి: తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి... తిరుపతి జిల్లా, పుత్తూరు మండలం, పరమేశ్వరమంగళానికి చెందిన రమేశ్ నాయుడు (60), భార్య పుష్ప (55), వదిన వనజాక్షి (60), సమీప బంధువులు భాను, శివమ్మ కారులో నిశ్చితార్థానికి చెన్నైలోని పెరంబూరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు నారాయణవనం బైపాస్ వద్ద వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి, ఎదురుగా వస్తున్న కాలేజ్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేశ్ నాయుడు, పుష్ప, వనజాక్షి, భాను అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ శివమ్మను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ఘటనలో... హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో తిరుమల వచ్చారు. తిరుగు ప్రయాణంలో కారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్ద గడ్డిమోపుతో రోడ్డు దాటుతున్న కరకమిట్ల సుబ్బమ్మ (55)ను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అంతే వేగంతో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహంకాళి సునీత (40), డ్రైవర్ జీవన్‌కుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందగా, భవాని (57), శేఖర్ (58) తీవ్రంగా గాయపడ్డారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్
-
పౌరాణిక సినిమాలు చూసి ఆకర్షితుడై.. గోల్డ్ మెడల్! ఒలింపిక్స్ లక్ష్యంగా..
చాట్ల అక్షయ్.. విలువిద్యలో సత్తా చాటుతున్నాడు. గురితప్పని సాధనతో విజయాలను తన విలువిద్యతో సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. సాధారణంగా పౌరాణిక సినిమాలు చూసే అలవాటున్న అక్షయ్ ఆ సినిమాల్లోని బాణాల వైపు ఆకర్షితుడయ్యాడు. అది గమనించిన తండ్రి ఆర్చరీలో శిక్షణను ఇప్పించడంతో అతనిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసింది. నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన చాట్ల రాజేష్, సుమలకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరూ విలువిద్యల్లో రాణిస్తున్నారు. పెద్దబ్బాయి చాట్ల అక్షయ్ మహదేవ్ 2019లో విలువిద్య సాధన ప్రారంభించారు. 3వ తరగతిలో ప్రారంభమైన విలువిద్య 8వ తరగతికి వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రారంభించిన ఏడాది నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాణించడం మొదలు పెట్టారు. ఐదేళ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. విలువిద్యలో మూడు సెగ్మెంట్లు ఉంటాయి. ఇండియన్ రౌండ్ సెగ్మెంట్ జాతీయ స్థాయిలో, రికార్వ్ సెగ్మెంట్ ఒలింపిక్స్‌లో, కాంపౌండ్ సెగ్మెంట్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తుంటారు. ఆకాష్ మహదేవ్ క్లిష్టతరమైన రికార్వ్ సెగ్మెంట్లో రాణించడం విశేషం.- నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) కాస్ట్లీ క్రీడ... అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. నెల్లూరులో ఆర్చరీకి తగిన ఆదరణ లేని సమయంలో అక్షయ్ మాధవ్ తాత చాట్ల నర్సింహారావు స్కూల్ డైరెక్టర్‌గా తన స్కూలు కోసం ఒక ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక విల్లు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటుంది. బాణాలు రూ.12 వేలు, రూ.40 వేలు వరకు విలువ చేస్తాయి. ఇక టార్గెట్ పేస్లు, టార్గెట్ బట్టర్స్ ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడినవే. ఇప్పటి వరకు విజయవాడ, హైదరాబాదులకు పరిమితమైన ఈ ఆర్చరీ శిక్షణ నెల్లూరులో ప్రారంభం కావడంతో అక్షయ్‌కు కలిసి వచ్చింది. ఖర్చు అధికమైనప్పటికీ ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.40 నుంచి 6.30 గంటల వరకు సాధన చేస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతూ పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించేవాడు. ఖర్చు అధికమైనప్పటికీ స్కూల్లో పిల్లలు సైతం విలు విద్యలో రాణిస్తారని, ఏకాగ్రత సాధించగలుగుతారని స్కూల్ డైరెక్టర్ చాట్ల నర్సింహారావు తెలిపారు. అక్షయ్ మహదేవ్లో విలువిద్య క్రీడా ఆసక్తిని గమనించిన తండ్రి రాజేష్ శిక్షణ ఇప్పించేందుకు జార్ఖండ్ నుంచి దివ్య ప్రకాష్‌ను ఎంపిక చేసుకున్నారు. కోచ్ దివ్య ప్రకాష్ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం సాధనలు చేస్తున్నాడు. జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పావురాల వేణు, రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి సత్యనారాయణలు మంచి సహాయ సహకారాలను అందచేస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు బాటలు వేస్తున్నారు. పతకాలిలా... 2022వ సంవత్సరం నుంచి జరిగిన ప్రతి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అక్షయ్ ప్రతిభ కనపరిచారు. 2023 జూలైలో శ్రీలంకలో జరిగిన కొలంబో ఓపెన్ ఆర్చరీ ఇంటర్నేషనల్ పోటీల్లో అండర్–12 రికార్వ్ విభాగంలో గోల్డ్ మెడల్‌ను, 30 మీటర్ల ఓపెన్ రికార్వ్ పోటీల్లో సిల్వర్ మెడల్‌ను సాధించి అబ్బుర పరిచారు. గోల్డ్ మెడల్ లక్ష్యం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి పేరు తెస్తాను. చదువుల్లో రాణించి ఐఏఎస్ అధికారి కావాలన్నది కోరిక. ఉదయం సాయంత్రం సాధన చేస్తూ చదువుల్లో కూడా రాణిస్తాను. పోటీల్లో పాల్గొనడం వల్ల వివిధ క్రీడాకారుల ఆట తీరు, పలు ప్రాంతాల పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చు. చదువుకుంటూనే ఇష్టమైన క్రీడల్లో రాణించవచ్చు. తాతయ్య, అమ్మ నాన్నలు, కోచ్‌లు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. – చాట్ల అక్షయ్ మహదేవ్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! -
ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే నెల్లూరు రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ వారు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. నిఘా నీడలో... రొట్టెల పండుగ సందర్భంగా దర్గా ఆవరణతోపాటు స్వర్ణాల చెరువు, పార్కింగ్ ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల సమాచారాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగిస్తున్నారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి చిన్నారులు లోతుగా వెళ్లకుండా పటిష్టమైన నిఘా పెట్టారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. -
‘చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు ఇదే నా సవాల్’
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో నీతిమాలిన వ్యక్తి, అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడేనని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమని, అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబేనని ధ్వజమెత్తారు మంత్రి కాకాణి. మేనిఫెస్టోను మాయం చేసినటువంటి చీచ చరిత్ర చంద్రబాబుదని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు, అచ్చెన్నాయుడలకు సవాల్ విసరుతున్నానని. ఏ గ్రామానికైనా వెళ్దామని.. అబివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఎవరి హయాంలో లబ్ధి జరిగిందో ప్రజలను అడుగుదామని మంత్రి చాలెంజ్ చేశారు. వారికి చీము, నెత్తురుంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు మంత్రి కాకాణి. -
ఇప్పుడు పార్టీ విడిచిపెట్టే వారికీ అదే గతి పడుతుంది: లక్ష్మీ పార్వతి
-
‘లోకేష్‌కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి’
సాక్షి, నెల్లూరు: లోకేష్‌కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఒకవేళ లోకేష్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అదే తాను గెలిస్తే లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? అని ప్రశ్నించారు. ‘దొడ్డిదారిన మంత్రి అయ్యి..పోటీ చేసిన ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర లోకేష్‌ది. తండ్రి, తాత సీఎం కాకపోయి ఉంటే లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలిచే వాడు కాదు. నేను చేసిన సవాల్‌ను ఆనం స్వీకరించలేకపోయాడు. లోకేష్‌కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి. లోకేష్ ప్రసంగం అర్ధంకాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ హయాంలో చెయ్యలేని సాగునీటి ప్రాజెక్టులను మేం పూర్తి చేశాం. నాయుడుపేటలో నాకు ఎలాంటి లే అవుట్లు లేవు’ అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. చదవండి: ఆ రాతలతో.. పవన్ పరువు గంగలో కలిపేసిన టీడీపీ మీడియా -
ఆనంకు మాజీ మంత్రి అనిల్ కుమార్ సవాల్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము ఆనం రాం నారాయణ రెడ్డికి ఉందా? అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. తాను ఆనం మీద పోటీ చేసి ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. ఆనం రాజకీయం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో.. అక్కడే క్లోజ్ చేస్తానన్నారు అనిల్. అలా చేయని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలుగుతానని అనిల్ పేర్కొన్నారు. నెల్లూరు సిటీని తాను ఎంత అభివృద్ధి చేశానో.. టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు అనిల్. -
నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటన
-
ఘనంగా లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
-
‘మాది రైతుల ప్రభుత్వం.. వారికి సీఎం జగన్ అండగా ఉంటారు’
సాక్షి, నెల్లూరు: ఏపీ వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుంటే, పంట నష్ట నివారణ చర్యలపై ఈనాడు, కొన్ని తోక పత్రికలు ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తున్నాయని, ఇదంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే జరుగుతోందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పంట నష్ట నివారణ చర్యలపై ఇప్పటికే అధికారులను ఆదేశించామని, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు. అకాల వర్షాలు, పంటనష్ట నివారణ చర్యలపై ‘సాక్షి’తో మాట్లాడిన మంత్రి కాకాణి.. ‘ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి.పంట నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అన్ని చోట్లా వర్షాలు తగ్గిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. తడిచిన ధాన్యాన్ని గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తాం.ప్రతిపక్షాల అనవసర విమర్శలు పట్టించుకోవలసిన అవసరం లేదు.చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు , కొని తోక పత్రికలు పని చేస్తున్నాయి.మాది రైతుల ప్రభుత్వం.. వారికి అండగా సీఎం వైఎస్ జగన్ ఉంటారు.- పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ లోనే పరిహారం అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిది’ అని తెలిపారు. -
ఉనికి కోసం టీడీపీ పాట్లు.. నేతల చీప్ ట్రిక్స్
అంపశయ్య మీదున్న టీడీపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్రయోగించడంలో మాత్రం ముందే ఉంటారు. అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయడంలో పచ్చ పార్టీ ఎంతకైనా తెగిస్తోంది. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం పది సీట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా పదికి పది సీట్లు గెలుచుకునే లక్ష్యంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి. అయితే అంపశయ్య మీదున్న టీడీపీ ఎలాగొలా ఉనికి చాటుకునేందుకు పాట్లు పడుతోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దుష్ప్రచారానికి తెరతీసింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్సార్సీపీని వీడుతున్నారంటూ ప్రచారం చేస్తోంది. క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్ ట్రిక్‌లు ప్రయోగిస్తోంది. తెలుగుదేశం నాయకులు చేస్తున్న చిల్లర ప్రచారంపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎల్లో బ్యాచ్ చేస్తున్న ప్రచారాలను వారు ఖండించారు. సీఎం వైఎస్ జగన్ కి తమ కుటుంబాలతో సాన్నిహిత్యం ఉందని.. తుది శ్వాస వరకు పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని సోషల్ మీడియా సైట్స్ ద్వారా చంద్రబాబే ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తన పార్టీని బ్రతికించుకోవడం కోసం...అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి తో ఉన్నారంటూ చిల్లర బ్యాచ్‌లో దుష్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు విజయం సాధించే ప్రసక్తి లేదని రిపోర్టులు రావడంతో చంద్రబాబు కంగుతిన్నారట. పైగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారు. దీంతో కొత్త ముఖాల కోసం వేట సాగిస్తున్న టీడీపీ నాయకత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని ఏడాదిన్నర ముందే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. ఈ క్రమంలో టికెట్‌పై ఆశలు వదులుకున్న కొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చెయ్యడంతో వారిపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెత్తను ఊడ్చేస్తుంటే...ఆ చెత్తనే మహా ప్రసాదంగా టీడీపీ స్వీకరిస్తోందనే కామెంట్స్ నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయనతో సన్నిహితంగా ఉండే నల్లపురెడ్డి కుటుంబం, మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుటుంబాలపై టీడీపీ పథకం ప్రకారం ట్రోలింగ్ నడుపుతోంది. తొలినుంచీ ఈ రెండు కుటుంబాలు వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ వెంటే ఉన్నారు. ఈ రెండు కుటుంబాలంటే జగన్ కూడా ఎంతో అభిమానంతో ఉంటారు. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేయడంతో నల్లపురెడ్డి, మేకపాటి కుటుంబాలపై దుష్ప్రచారం ప్రారంభించారు. ఈ ట్రోలింగ్‌తో పార్టీ కేడర్ గందరగోళానికి గురువుతారని వారి దుష్ట ఆలోచన. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎల్లో పార్టీ కుట్రలను భగ్నం చేశారు. తాము జగన్ వెంటే అని విస్పష్టంగా ప్రకటించారు. ఆ విధంగా టీడీపీ ట్రోలింగ్ రాయుళ్ళ నోళ్లు మూతపడ్డాయి. -
‘దశాబ్దాల సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపారు’
నెల్లూరు: చుక్కల భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూమల సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చూపారని అన్నారు. టీడీపీ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం జగన్ జీవో విడుదల చేయడంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని కాకాణి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి కాకాణి ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి నెల్లూరు రైతులు పాలాభిషేకం చేశారు. దీనిలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రైతులతో కలిసి కాకాణి మీడియాతో మాట్లాడారు. ‘ చుక్కల భూములకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు .దశాబ్దాలుగా ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యకు సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. చుక్కల భూముల విషయంలో వీఆర్ఓ నుంచి ఫైల్ రావాలంటే ఆరు నెలలు పట్టేది. రైతాంగానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 2016 లో అప్పటి సీఎం చంద్రబాబు.. చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. నెల్లూరు జిల్లాలో 43 వేల 270 ఏకరాలకు పట్టాలు ఇవ్వనున్నారు. సీఎం చేతుల మీదుగానే రైతులకు పట్టాలు పంపిణీ చేయబోతున్నాం. చుక్కల భూముల వల్ల గత ప్రభుత్వంలో రైతుల మధ్య గొడవలు కూడా అనేకం జరిగాయి.. ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. చాలా చోట్ల రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు. వీరికి పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేయమని సీఎం జగన్ చెప్పారు’ అని పేర్కొన్నారు. -
‘నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్‌తోనే ఉంటా’
సాక్షి, నెల్లూరు: పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, చివరి రక్తపు బొట్టు వరకు సీఎం జగన్‌తోనే ఉంటానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని ధ్వజమెత్తారు. అందులో భాగమే ఈ దుష్ప్రచారమని.. కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కోవూరులో వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏదేమైనా జగన్‌తోనే తన పయనమని స్పష్టం చేశారు. -
నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం
ట్రాక్టర్ నడుపుతున్న బడియా సావిత్రిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం. మత్స్యకార కుటుంబానికి చెందిన సావిత్రి పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ కూలీగా పనిచేసేది. ఆడవాళ్లు కార్లు, బైక్‌లు, బస్సులు, రైళ్లు, విమానాలు నడుపుతున్నారు, ట్రాక్టర్ కూడా నడపవచ్చు అనుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంది. తనకు సొంతంగా ట్రాక్టర్ ఉంటే బావుణ్నని కలగన్నది. స్వయంసహాయక బృందంలో సభ్యురాలు కావడంతో గత ఏడాది ఆమెకు ‘స్త్రీ నిధి’ నుంచి 80వేలు, గ్రామ సంఘం నుంచి లక్ష రూపాయల లోన్ వచ్చింది. ఆ డబ్బు డౌన్ పేమెంట్‌గా కట్టి వాయిదాల పద్ధతిౖపై ట్రాక్టర్ కొన్నది. ప్రస్తుతం తన ట్రాక్టర్‌ను తానే నడుపుతూ వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటోంది సావిత్రి. ►విజయవాడ నగరం, రామలింగేశ్వర నగర్ నివాసి రమాదేవి. . భర్త వ్యసనపరుడై మరణించాడు. ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఇంత కష్టమైన పనిని చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మెకానిక్‌గా పని చేస్తోంది. ►ఆటో నడుపుతున్న సరస్వతి సుమతిది నెల్లూరు నగరం. ఇంటర్ వరకు చదువుకున్న సుమతి పిల్లల పోషణ కోసం ఆటో నడుపుతూ, పిల్లలతో పాటు చదువును మళ్లీ మొదలు పెట్టి బీఎల్ పూర్తి చేసింది. ►స్వరూపరాణిది పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, గంగన్నగూడెం. ఆడవాళ్లు వేదాలను ఎందుకు చదవకూడదనే ప్రశ్నకు తానే జవాబుగా నిలవాలనుకుంది. వేదాలు ఔపోశన పట్టి, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పౌరోహిత్యం చేస్తున్నారు. ►నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ... పొలం దుక్కి దున్నడంతోపాటు నిమ్మచెట్లకు తెగుళ్లు సోకితే స్ప్రేయర్‌తో క్రిమిసంహారక మందులను స్వయంగా పిచికారి చేస్తుంది. ►కాచరమైన కళమ్మ ఉండేది కుషాయిగూడ హైదరాబాద్‌లో.మొదట భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న కళమ్మ 30 ఏళ్లుగా ఇండ్లకు, దేవాలయాలకు పెయింటింగ్ వేస్తోంది. ►మదనపల్లె పట్టణంలో రేణుక... డ్రైవింగ్ స్కూల్లో స్వయంగా తానే మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తోంది. ►యదళ్ళపల్లి ఆదిలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తోంది. ►కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెట్రోలు బంకులో పెట్రోలు పడుతున్న పగిడేల ఉమా మహేశ్వరి. చదవండి: Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో.. -
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాటి నేరాలే.. నేటి కేసులు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు కొత్త డ్రామాకు తెర లేపాడు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తన అనుచరగణంతో అరాచకాలకు పాల్పడ్డాడు. లెక్కకు మించి నేరాలు చేశాడు. అతనిపై కేసులు పెట్టేందుకు బాధితులు సాహసం చేయలేకపోయారు. పోలీసులకు సాక్షం చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ కమిషన్ ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తే ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆగమాగం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నేరాలు చేసింది ఆయన. నెపం ప్రభుత్వంపై నెట్టేందుకు రాజకీయ రంగు పులుముతూ ఆగమాగం చేస్తున్నాడు. ఎమ్మెల్యేననే అధికారంతో తన మందీమార్బలాన్ని అడ్డం పెట్టుకుని మదమెత్తిన మత్తగజంలా అరాచకాలు సృష్టించానని ఇటీవల పచ్చమీడియాలో ఒప్పుకున్నాడు. కోటంరెడ్డి అప్పటి నేరాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ పెద్దలు తనపై కక్ష సాధిస్తున్నారంటూ తాను నంగనాచినంటూ రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాడు. నేరం చేసిన వాడు ఎవరైనా చట్టానికి అతీతులు కారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా నిందితుడే అని పోలీసుల విచారణలో నిగ్గు తేల్చారు. దీంతో తనను అరెస్ట్ చేయడం ఖాయమని తెలిసి ముందుగానే.. అస్కార్ అవార్డు గ్రహీతల నటనకు మించి నంగి రాజకీయాలు చేస్తున్నాడు. టీడీపీకి చెందిన దళితనేతపై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌ను కూడా రాజకీయంగా వాడుకోవడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలేం ఏం జరిగింది.. గతేడాది అక్టోబర్ 17న టీడీపీకి చెందిన ముస్లిం నేత అల్లాభక్షు నెల్లూరురూరల్ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారంటూ అయన అనుచరులు ద్వారా దాడి చేయించారు. ఆ సమయంలో అతనికి అండగా ఉన్నాడన్న కారణంతో అదే పార్టీకి చెందిన దళిత నేత మాతంగి కృష్ణను టార్గెట్ చేసి అక్టోబర్ 18వ తేదీన కోటంరెడ్డి సోదరుల ప్రోత్సాహంతో దాదాపు 11 మంది ఆయన అనుచరులు దళిత నేతను కారులో ఎక్కించుకుని విచక్షణా రహితంగా దాడి చేశారు ముందురోజే అతని బైక్‌ను తగులబెట్టారు. ఆయా ఘటనలపై అప్పట్లో హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలియడంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ లోపు నిందితులపై చర్యలు చేపట్టలేదని దళితనేత మాతంగి కృష్ణ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. అందులో భాగంగానే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించేలా చేశారు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముస్లింల గొంతునొక్కుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తానంటూ చెప్పుకునే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి రెండు రోజుల క్రితం ముస్లింలకు అన్యాయం జరిగిందంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లింలపై తన అనుచరులతో దాడులు చేయించినప్పుడు వారు గుర్తుకు రాలేదా అని మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన అల్లాభక్షుపై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇద్దరు జర్నలిస్టులు, పలువురు నేతలపై దాడులు చేయించిన ఘటనలు ఉన్నాయి. ఇదేనా దళితుల ప్రేమ దళితులంటే తనకు ఎంతో ప్రేమ ఉందని సమావేశాల్లో ఊదరగొడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దళిత నేతపై పాశవికంగా దాడులు చేయించడమేనా దళిత ప్రేమంటే? అంటూ నగరంలోని దళితులు ప్రశ్నిస్తున్నారు. అధికార మదమెక్కి చేసిన అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేసి దాడులు చేయించాడు. రౌడీ మూకలను ప్రోత్సహించి దాడులు చేయించేవాడు. ఏకంగా టీడీపీకి చెందిన విద్యార్థి నేతపై కూడా హత్యాయత్నం చేయించాడు. ఈ రౌడీ రాజకీయాన్ని సింహపురికి పరిచయం చేసిన ఎమ్మెల్యే దళితనేతపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే అదేదో రాజకీయ కుట్ర అంటూ మీడియా ముందుకు రావడంపై ప్రజలు మండి పడుతున్నారు. ప్రధానంగా దళితలపై కపట ప్రేమ నటించే దానికి ఈ ఘటనే ఉదాహరణ అంటూ విమర్శిస్తున్నారు. -
AP: రైతన్నకు కంటి వెలుగును ప్రసాదించిన ఆరోగ్యశ్రీ.. తొలిసారి కంటి మార్పిడి
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నేత్ర విభాగంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఓ రైతన్నకు కంటి మార్పిడి (కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేసి చూపును ప్రసాదించారు. నెల్లూరు జీజీహెచ్‌లో తొలిసారి కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన సందర్భంగా ఆ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ శనివారం తెలియజేశారు. తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామానికి చెందిన రామయ్య (60) అనే రైతుకు 20 ఏళ్ల క్రితం కంటికి దెబ్బతగిలి నల్లగుడ్డు మీద పువ్వు ఏర్పడింది. దీంతో కంటి చూపు పూర్తిగా తగ్గి రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రామయ్య ఈ నెల 3న నెల్లూరు జీజీహెచ్‌కి రాగా, కంటి విభాగాధిపతి డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి కంటి గుడ్డు మార్పిడి ద్వారా చూపును ప్రసాదించవచ్చని చెప్పారు. ఈ నెల 9న రాజయ్య కంటికి ఆపరేషన్ చేసి దాత నుంచి సేకరించిన నల్లగుడ్డును విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్‌ను విజయవంతంగా చేసిన డాక్టర్ సంధ్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. రోగి రామయ్య మాట్లాడుతూ తనకు చూపును ప్రసాదించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనను జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు తాడికొడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ..సమావేశానికి పర్మిషన్ తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలిపారు. సభ ప్రాంగణం అనుమతి గురించి చర్చ జరిగిందన్నారు. అనుమతి తీసుకున్న డాక్యుమెట్స్ అడిగారని, సభకు అనుమతి తీసుకున్న పత్రాలు కమిషన్‌కు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 15 వ తేదీన 3 గంటలకు మళ్లీ విచారణకు రమన్నారని తెలిపారు. కాగా ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారించిన సంగతి తెలిసిందే. కందుకూరు విచారణ అనంతరం ప్రభుత్వానికి కమిషన్ నివేదకి అందజేయనుంది. కందుకూరులో చంద్రబాబు నాయుడు గత డిసెంబర్లో నిర్వహించిన రోడ్ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్ షో జరిగిన ఎన్టీఆర్ సర్కిల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. -
వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు
అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి. సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల. అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!. ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు. ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్‌క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు. నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు) -
రైతుకు దన్నుగా ఈ-ఫారం మార్కెట్
రైతులకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్లో ప్రభుత్వ రంగ సంస్థలు 30 శాతం మాత్రమే కొనుగోలు చేయగలుగుతున్నాయి. మిగతా 70 శాతం సరుకు దళారులు, కమీషన్ల ఏజెంట్ల ద్వారా వ్యాపారులకు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతు ఉత్పత్తులు నూరు శాతం నేరుగా వ్యాపారులకే గిట్టుబాటు ధరకు విక్రయించునే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ–ఫారం మార్కెట్ మొబైల్ యాప్‌ను రూపొందించింది. దేశ వ్యాప్తంగా వ్యాపారులను అనుసంధానం చేసి నేరుగా రైతులు తమ ఉత్పత్తులను తాము నిర్ణయించిన ధరలకే విక్రయించుకునేట్లు మార్కెటింగ్‌శాఖ మధ్యవర్తిగా వ్యవహరించనుంది. ఉత్పత్తులు విక్రయించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేయనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు): రైతులు పండించిన పంట ఉత్పత్తులను సులభంగా, ఎక్కడ అధిక ధర వస్తే అక్కడ విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందు కోసం ‘ఈ–ఫారం మార్కెట్’ పేరుతో ఓ మొబైల్ యాప్‌ను రూపొందించి దేశంలోని 20 వేల మంది వ్యాపారులతో అనుసంధానం చేసింది. ఈ యాప్‌లో రైతులే నేరుగా తమ పంట ఉత్పత్తుల వివరాలను నమోదు చేసుకుని, ధరను కూడా నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆన్లైన్ మార్కెటింగ్ విధానం వల్ల రైతులకు విస్తృతమైన మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఉత్తమ ధరను కల్పించడమే లక్ష్యం రైతులు ఆరుగాలం పండించిన పంటలకు ఉత్తమ ధరను కల్పించడమే లక్ష్యంగా ఈ–ఫారం మార్కెట్ మొబైల్ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రతి రైతు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తన మొబైల్ నంబర్‌తో వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో రైతు తన వద్ద ఏ పంట ఉత్పత్తి ఎంత ఉంది, ఎంత ధరకు విక్రయించుకోవాలని భావిస్తున్నాడో ధరను నిర్ణయించుకోవచ్చు. ఓ రైతు వద్ద మినుములు ఉన్నాయనుకుంటే.. అవి ఎన్ని క్వింటాళ్లు ఉన్నాయి, ఏ క్వాలిటీతో ఉన్నాయి, క్వింటా ఏ ధర ఎంత అనే వివరాలు యాప్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. రైతు నమోదు చేసిన ఈ వివరాలను పరిశీలించిన వ్యాపారులు తమకు కావాల్సిన వారు నేరుగా ఆ రైతు వివరాలతో అనుసంధానం అవుతాడు. ఎంత మొత్తం కొంటారు, ఏ రేటుకు కొనుగోలు చేస్తామనే వివరాలు వ్యాపారులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదే యాప్‌లో మధ్యవర్తులుగా అనుసంధానమై ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఇటు వ్యాపారితో, అటు రైతుతో మాట్లాడి విక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు. రైతు, వ్యాపారి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిన తర్వాత ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు మార్కెటింగ్‌శాఖ అనుమతిస్తుంది. వ్యాపారే నేరుగా రైతు వద్దకు వచ్చి ఉత్పత్తులు చెప్పిన రేటుకు కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్‌పోర్టు, హమాలీ ఖర్చులను సైతం పూర్తిగా వ్యాపారే భరించాల్సి ఉంటుంది. రైతుకు ఎటువంటి సంబంధం ఉండదు. మూడు రోజుల్లో నగదు జమ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయించిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు నేరుగా డబ్బులు జమ చేసే విధంగా మార్కెటింగ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. దీనికి పూర్తి బాధ్యత మార్కెటింగ్‌శాఖ వహిస్తోంది. ప్రస్తుతం పంట చేతికొచ్చిన తర్వాత రైతు నేరుగా కల్లాల్లోనే దళారులు, కమీషన్ ఏజెంట్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. 15 నుంచి 20 రోజుల తర్వాత కానీ డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. ఇదే క్రమంలో తరుగు, తాలు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మార్కెటింగ్ శాఖ అధికారులు సరుకు నాణ్యతను సర్టిఫై చేయడంతో పాటు వ్యాపారులతో ధరలు మాట్లాడి ఒప్పించే బాధ్యత తీసుకుంటున్నారు. అయితే రైతులు తమ ఉత్పత్తులను క్వాలిటీ ఉండేలా చూసుకోవడం ఒక్కటే చేయాలని, క్వాలిటీ ఎంత బాగుంటే అంత మంచి ధర వస్తుందని చెబుతున్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరలకు దళారులకు విక్రయించుకోకుండా ఈ–ఫారం మార్కెట్ విధానంలో అత్యంత సులభంగా విక్రయించుకోవచ్చునని సూచిస్తున్నారు. జిల్లాలో ఈ ఉత్పత్తులకు అవకాశం జిల్లా నుంచి ఇప్పటికే పలు రకాల ఉత్పత్తులను ఈ విధానంలో మార్కెటింగ్ శాఖ అధికారులు విక్రయాలు చేశారు. దాదాపు రూ. 35 కోట్ల లావాదేవీల వరకు జరిగాయి. వేరుశనగ, బియ్యం, కూరగాయలు, పచ్చి మిర్చి, పత్తి వంటివి తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులకు విక్రయాలు చేశారు. కందుకూరు, ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో అన్ని రకాల పంటలు పండుతాయని, మిగిలిన చోట్ల ధాన్యం ఎక్కువగా పండుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు తేల్చారు. డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో జిల్లా నుంచి ఉత్పత్తులను విక్రయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈ–ఫారం మార్కెట్ విధానంలో ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. శనగ, వేరుశనగ, మినుము, ఉద్యాన ఉత్పత్తులు, ధాన్యం, బియ్యం ఇలా ఏ పంట ఉత్పత్తి ఉన్నా నేరుగా యాప్‌లో నమోదు చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. పండిన ఉత్పత్తుల్లో ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్, నాఫెడ్, సివిల్‌సప్లయిస్ వంటి సంస్థలు కేవలం 30 శాతం ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని, మిగిలిన 70 శాతం ఉత్పత్తులను రైతులు దళారుల ద్వారా విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టిందని అధికారులు పేర్కొంటున్నారు. విస్తృత మార్కెటింగ్ సదుపాయం ఈ–ఫారం మార్కెట్ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. నాణ్యమైన ధరలకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవచ్చు. దేశంలోని వ్యాపారులంతా ఉన్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుతోంది. అప్పుడు అధిక ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన విక్రయాల్లో రైతులకు చాలా మేలు జరిగింది. వేరుశనగ, కూరగాయలు వంటి తెలంగాణకు అధికంగా పంపించాం. – శ్రీనివాసులు, ఏఎంసీ కార్యదర్శి, కందుకూరు రైతు గిట్టుబాటు ధర పొందవచ్చు ఈ–ఫారం మార్కెట్ వల్ల రైతులకు వ్యాపార అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం రైతులకు బాగా ఉపయోగపడుతోంది. పండించిన పంటను నేరుగా రైతులే అమ్ముకునేందుకు అవకాశం ఉన్న ఈ విధానంపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తే బాగుంటుంది. అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. – జె.శ్రీనివాసులు, రైతు, గుడ్లూరు అన్ని రకాల పంటలు అమ్ముకోవచ్చు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ మార్కెట్ విధానం రైతులకు ఉపయోగపడుతుంది. రైతులు నేరుగా తమ పంటలకు ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం ఉంది. అన్ని రకాల రైతులు ఈ పంటలను ఈ–యాప్‌లో నమోదు చేసుకుని అమ్ముకోవచ్చు. రైతులంతా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. – పి.మాధవ, రైతు, ఓగూరు -
సౌర కాంతులు: సోలార్ విద్యుత్‌పై పెరుగుతున్న ఆసక్తి
నెల్లూరు సిటీ: ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తున్న సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తిపై జిల్లా ప్రజలు దృష్టి సారించారు. ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యాపార సంస్థలు, గృహ వినియోగంలో సోలార్ గ్రిడ్ సిస్టమ్‌పై ఆసక్తి పెరిగింది. భవిష్యత్‌లో తమ అవసరాలకు పోను మిగులు విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు విక్రయించే అవకాశం ఉండడంతో దీనిపై దృష్టి సారిస్తున్నారు. ఇటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు రాబడిని పెంచుకునేందుకు ఇదొక మార్గంగా ఉండడంతో రోజు రోజుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్స్ ఏర్పాటుకు ఆదరణ పెరుగుతోంది. గ్రిడ్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌కు విద్యుత్ శాఖ సంపూర్తిగా సహకరిస్తోంది. సోలార్‌ను వినియోగించడం ద్వారా బొగ్గు వినియోగం, కాలుష్య సమస్యలు తగ్గుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో 60 కేడబ్ల్యూపీ గ్రిడ్ కనెక్ట్డ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.32.50 లక్షలు ఖర్చు చేశారు. ప్రతి రోజూ 240 కేడబ్ల్యూహెచ్ విద్యుత్ వినియోగం ఖర్చు అవుతోంది. నెలకు 7,200 కేడబ్ల్యూహెచ్ ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి నెలా రూ.55,080 ప్రకారం ఏడాదికి రూ.6,60,960 ఖర్చు అవుతుంది. నెల్లూరులోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ ప్యానల్స్ వినియోగిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నూనతంగా కార్పొరేషన్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ విద్యాసంస్థలు గీతాంజలి, నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయదారులు, విద్యాసంస్థలు, వ్యాపారస్తులు, ఇళ్లకు కలిపి దాదాపు 500 సోలార్ కనెక్షన్లు ఉన్నాయి. సోలార్‌లో రెండు రకాలు సోలార్‌లో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ రెండు రకాలు ఉన్నాయి. వినియోగదారుడు తనకు రెండింట్లో ఏది అవసరమో దానిని వినియోగించుంటారు. రెండింటి ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గించుకునేందుకు, పూర్తిగా రాకుండా ఉండేందుకు ఉపయోగ పడుతుంది. వినియోగదారుడు తన ఇంటికి ఎంత అవసరమో ఆ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంది. సోలార్ గ్రిడ్లు ఒక కిలోవాట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఒక కిలో వాట్‌కు రోజుకు 4 యూనిట్లు విద్యుత్ తయారు అవుతుంది. ß ఆన్‌గ్రిడ్ సిస్టమ్: ఆన్‌గ్రిడ్ సోలార్ ప్యానల్స్ ఏర్పా టు చేసుకోవడం ద్వారా సూర్యరస్మి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు కనెక్ట్ చేసుకోవాలి. తయారైన విద్యుత్‌ను గ్రిడ్ నుంచి ఉపయోగించుకోవచ్చు. కరెంట్ మీటర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఎంత వరకు విద్యుత్‌ను వినియోగిస్తామో, అంత వరకు గ్రిడ్ ద్వారా తీసుకుని, మిగిలినది విద్యుత్ శాఖకు విక్రయించవచ్చు. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్: ఇది బ్యాటరీని రీచార్జ్ చేసుకున్న తర్వాత ఇంట్లో విద్యుత్ వినియోగ వస్తువులకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ఇన్వర్ట్లా పని చేస్తుంది. మూడేళ్ల నుంచి వినియోగిస్తున్నాను.. ప్రతి నెలా నాకు రూ.1500 నుంచి రూ.2000 విద్యుత్ బిల్లు వచ్చేది. మూడు కిలో వాట్ల సోలార్ ప్యానెల్‌ను పెట్టుకున్నాను. ప్రతి రోజూ 12 యూనిట్లు కరెంట్ తయారవుతుంది. నెలకు 250 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నాను. మిగిలిని విద్యుత్‌ను విద్యుత్‌శాఖకు విక్రయిస్తున్నాను. మూడేళ్ల నుంచి సోలార్‌ను వినియోగిస్తున్నాను. – వీ సుధాకరన్, ఉస్మాన్‌సాహెబ్‌పేట రూ.6 వేల విద్యుత్ బిల్లు ఆదా నాకు దుస్తుల దుకాణం ఉంది. నేను ఇటీవల సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాను. నా దుకాణానికి ప్రతి నెలా రూ.6 వేల విద్యుత్ బిల్లు వచ్చేది. వ్యాపారస్తులు సోలార్‌ను వినియోగించడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. – రాజీవ్, వస్త్ర వ్యాపారి, కావలి 50 కిలో వాట్స్ ఇన్స్టాలేషన్ చేశాను నేను రెండేళ్లుగా సోలార్ ఇన్స్టాలేటర్గా ఉన్నాను. ఇప్పటి వరకు 50 కిలో వాట్స్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేశాను. ప్రజలు కూడా అవగాహన పెంచుకుని సోలార్‌ను వినియోగించాలి. భవిష్యత్‌లో విద్యుత్ ధరలను తగ్గించుకునేందుకు సోలార్ సిస్టం ఉపయోగపడుతోంది. – పీ శ్రావణ్, సోలార్ ఇన్స్టాలర్ ఐదు రకాలు 1. సోలార్ వాటర్ హీటర్ 2. సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్ 3. సోలార్ ఫెన్సింగ్ ఫర్ అగ్రికల్చర్ 4. సోలార్ స్ట్రీట్ లైట్ 5. సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ సోలార్ వాటర్ హీటర్: చల్లటి నీటిని వేడినీళ్లుగా మార్చే సాధనాలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. 100 లీటర్ల సోలార్ వాటర్ హీటర్ నుంచి 10 వేల లీటర్లకు పైగా వేడి చేసేందుకు వీలు ఉంటుంది. సోలార్ అగ్రికల్చర్ మోటర్: విద్యుత్ శాఖ రాత్రి సమయాల్లోనే వ్యవసాయానికి విద్యుత్‌ను అందజేస్తున్నారు. పగలు సమయంలో ఫ్యాక్టరీలు, ఇతర సంస్థలు అధికంగా విద్యుత్‌ను వాడడం ద్వారా కరెంట్ సమస్య ఉంది. అయితే విద్యుత్ సమస్యను అధిగమించేందుకు తక్కువ ఖర్చుతో సోలార్ అగ్రికల్చర్‡ మోటార్స్‌తో పగటి పూట మోటార్స్‌ను వినియోగించవచ్చు. సోలార్ ఫెన్సింగ్: రైతులకు తమ పొలాల్లో ఇతర జంతువులు దాడి నుంచి తప్పించుకునేందుకు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్‌ను వినియోగిస్తుంటారు. రైతులు పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్న సమయంలో కరెంట్ లేని సమయాల్లో పొలంలోకి ఇతర జంతువులు దాడి చేసే అవకాశం ఉంది. సోలార్‌ను వినియోగించడం ద్వారా 24 గంటలు రక్షణ కవచంగా మారుతుంది. సోలార్ స్ట్రీట్ లైట్: ప్రభుత్వాలు ఇప్పటికే రోడ్లు డివైడర్లకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు కొన్ని ప్రధాన రోడ్లలో సోలార్ స్ట్రీట్ లైట్స్‌ను వినియోగిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సోలార్ స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం సమయాల్లో విద్యుత్‌ను స్టోరేజ్ చేసుకుని రాత్రి సమయాల్లో వినియోగించుకుంటుంది. సోలార్ గ్రిడ్ సిస్టమ్ ఫర్ హోమ్ అండ్ ఇండస్ట్రీ: సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవ చ్చు. ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, విద్యుత్ బిల్లులు కట్టాలనే సమస్య లేకుండా ఉండొచ్చు. -
ముమ్మరంగా నాడు – నేడు రెండోదశ పనులు
నెల్లూరు(టౌన్): ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజలకు చిన్నచూపు ఉండేది. అక్కడ సౌకర్యాలు ఉండవని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పంపేవారు. నేడు పరిస్థితి మారింది. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో తొలివిడతలో 1,059 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.232 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడత పనులు ప్రస్తుతం శరవేగంగా నాణ్యతగా జరుగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 15 శాతం నిధులు విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేట్ లుక్‌లో విద్యార్థులకు స్వాగతం చెప్పనున్నాయి. ఏం చేస్తారంటే.. ఎంపికైన పాఠశాలలు, అంగన్వాడీలు, బీఈడీ, డైట్ కళాశాలల్లో మొత్తం పది రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. పెయింట్ వేయిస్తారు. లైట్లు, ఫ్యాన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం కుర్చీలు, బెంచీలు, ఇంగ్లిష్ ల్యాబ్, గ్రీన్ చాక్బోర్డు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. మేజర్, మైనర్ రిపేర్లు చేపడతారు. ఎక్కడంటే.. కొత్త నెల్లూరు జిల్లాలో రెండో విడత నాడు – నేడులో భాగంగా 1,357 పాఠశాలలు, అంగన్వాడీలు తదితరాలను ఎంపిక చేశారు. మొత్తం 531 పాఠశాలల్లో 1,841 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. రెండో విడత పనుల కోసం ప్రభుత్వం రూ.466.40 కోట్లను కేటాయించింది. దీనికి సంబంధించి తొలిదశలో రూ.79.67 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను నేరుగా ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటికే రూ.72.10 కోట్లు ఖర్చు చేసి పనులు చేశారు. మిగిలిన నిధులను దశల వారీగా ప్రభుత్వం ఆయా అకౌంట్లలో జమ చేయనుంది. పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు నాడు–నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, మండల స్థాయిలో ఎంఈఓ, ఏపీఎం, డివిజన్ స్థాయిలో డిప్యూటీ డీఈఓ, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ ఎస్ఈ, సమగ్రశిక్ష ఈఈ కమిటీల్లో ఉన్నారు. సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ రోజూ తమ బడులకు వెళ్లి పనులను ఫొటో తీసి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. త్వరగా పూర్తి చేయాలి నాడు–నేడు పనుల కోసం రూ.4 కోట్ల మేర సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ (ఫర్నీచర్, శానిటరీ, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్స్, సిరామిక్ టైల్స్ తదితరాలు) జిల్లాకు వచ్చింది. వీటితోపాటు సిమెంట్ కూడా వచ్చింది. పనులను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి. పనులు జరుగుతున్న పాఠశాలల్లో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష జూనియర్ కళాశాలల్లోనూ.. జిల్లాలోని 22 జూనియర్ కళాశాలలను నాడు–నేడుకు ఎంపిక చేశారు. వాటిల్లో పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడం, కళాశాల భవవాలకు మరమ్మతులు, పెయింట్ వేయించడం, గ్రీన్ చాక్బోర్డు, కుర్చీలు, బల్లలు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.13.44 కోట్లను మంజూరు చేశారు. తొలివిడతలో భాగంగా రూ.2.42 కోట్లను తల్లిదండ్రుల కమిటీ అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటివరకు రూ.1.62 కోట్లను ఆయా పనుల కోసం ఖర్చు చేశారు. కళాశాలల్లో నాడు–నేడు పనులను కూడా మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఇలా చెప్పడం ఆత్మవంచన కాదా చంద్రబాబు?
కందుకూరు విషాద ఘటన తర్వాత కూడా ప్రతిపక్ష తెలుగుదేశం విపరీత ధోరణిలో ఏ మాత్రం మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర మీడియా సంస్థలు కందుకూరులో టీడీపీ అదినేత చంద్రబాబు రోడ్ షో లో ఎనిమిది మంది మరణిస్తే దాని ప్రభావాన్ని తగ్గించి ప్రచారం చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇదే వైసీపీ వారి సభలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు,పలవలుగా రాసేవి. ఇలాంటివి ఏ సభలోను జరగకూడదు. ఇక్కడ జరిగింది మానవ తప్పిదమా? ప్రచార యావతో జరిగిన తప్పిదమా? లేక ఇంకేదైనా కారణమా ? అన్న విషయాలపై విశ్లేషణకు వెళ్లకుండా టీడీపీ మీడియా జాగ్రత్తపడుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీనికి ఎలా కవరింగ్ ఇస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఇలాంటి ఘటనలను కూడా దిక్కుమాలిన రాజకీయాలకు వాడుకుంటారా అన్న బాద కలుగుతుంది. బాధితులు తొక్కిసలాటకు గురై మరణిస్తే వారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని అన్నారట. ఆయన ఉద్యమం రాష్ట్రం కోసం చేస్తున్నారట. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నమాట. చనిపోయినవారు రాష్ట్రం కోసం సమిదలుగా మారారని ఆయన చెబుతున్నారు. ఇంత ఘోరంగా మాట్టాడవచ్చని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారు. కందుకూరులో డ్రోన్‌తో షూటింగ్ జరపడం కోసం, జనం బాగా వచ్చారని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు గాను చిన్న బజారులో సభ పెట్టి, తొక్కిసలాటకు కారణమై, పలువురు మురికి గోతిలో పడిపోతే రాష్ట్రం కోసం చనిపోయినట్లా?మరి అలాగైతే గోదావరి పుష్కరాలలో తన సినిమా యావకోసం 29 మంది చనిపోతే వారు ఎందుకు మరణించారు?అప్పుడు ఆయన ఏమని చెప్పారో గుర్తుందా?కుంభ మేళాలలో మరణించడం లేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించి అవమానించారు. మరి ఇప్పుడేమో రాష్ట్రం కోసం చనిపోయారని అంటున్నారు. నిజానికి ఈ ఘటన జరిగిన తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నిటిని వాయిదా వేసుకుని కందుకూరు బాధితులను పరామర్శించిన తర్వాత విజయవాడకో, హైదరాబాద్ కో వెళ్లిపోయి ఉంటే బాగుండేది. కాని అలాకాకుండా తన టూర్ షెడ్యూల్‌ను మాత్రం వాయిదా వేసుకోకుండా ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ యాత్ర కోసం పర్యటించడం పద్దతిగా కనిపించదు. ఘటన జరిగిన తర్వాత బాదితులను పరామర్శించి వస్తానని, అంతవరకు జనం రోడ్డు మీదే ఉండాలని ఆయన కోరారంటే ఆయన యావ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. అయినా ఆయన ఇష్టం. రాజకీయమే ఊపిరిగా జీవించే ఆయనకు ఇలాంటివి చిన్నవిగానే ఉండవచ్చు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రభుత్వం కోటి రూపాయలు సాయం ప్రకటిస్తే అదేమి సరిపోతుంది అని ప్రశ్నించి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు పది లక్షలతో సరిపెట్టుకున్నారు. మరో పాతిక లక్షలు పార్టీ ఇతర నేతలు ఇస్తారట. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. టీడీపీ ఆర్దికంగా పటిష్టంగా ఉన్న పార్టీనే. అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. విరాళాలు కూడా కోట్లలోనే వస్తుంటాయి. అయినా పది లక్షలకే పరిమితం అయ్యారు. ఎదుటివాడికి చెప్పడం కాకుండా మరికొంత అదనంగా పార్టీ తరపున సాయం చేసి ఉండాల్సింది. చంద్రబాబు సభకు వెళితే మంచి కూలీ వస్తుందనుకున్నవారు ఈ తొక్కిసలాటలో మరణించారని వార్తలు వచ్చాయి. కూలి కోసం వచ్చినవారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు చెప్పడం ఆత్మవంచనే అవుతుంది.ఇక పోలీసులు భద్రత ఎక్కువగా ఉండాల్సిందని ఆయన చెబుతున్నారు.ఎక్కువ మందిని పెడితే ఒక ఆరోపణ. ఇలాంటివి జరిగితే మరో ఆరోపణ. అసలు ప్రజలంతా అంత ఎగబడి వస్తుంటే ఏదైనా పెద్ద మైదానంలో సభ పెట్టుకుని సవాల్ విసిరి ఉండవచ్చు కదా! దాని గురించి మాట్లాడారు. గతంలో ఎన్.టిఆర్ సర్కిల్ లో సభలు జరిగాయని అంటున్నారు. జరిగి ఉండవచ్చు.కాని ఏభై మీటర్ల దూరం వెళ్లి సభ ఎందుకు పెట్టినట్లు? పర్మిషన్ తీసుకున్నదెక్కడ? మీటింగ్ జరిగిందెక్కడ?వాటన్నిటిని పోలీసులు వివరిస్తున్నారు కదా? అయినా ఇక్కడా డబాయింపేనన్నమాట. తెలుగుదేశం, చంద్రబాబు చేసిన తప్పులను పోలీసులపై తోసి వేయడానికి ఈనాడు పత్రిక ముందుగానే వ్యూహం రచించింది. ముఖ్యమంత్రి సభకు వందల సంఖ్యలో పోలీసులు వస్తున్నారని, చంద్రబాబు సభకు అలా రావడం లేదని పేర్కొంది.ఇది ఎంత దారుణంగా ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది పోలీసులు ఉండేవారు?ఆనాటి ప్రతిపక్ష నేత జగన్‌కు భద్రతగా ఎందరు ఉండేవారు? ఆ సంగతి తెలియదా? మరో సంగతి ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబుకు ఉన్నంత మంది భద్రతా సిబ్బంది మరే నేతకు లేరు. కేంద్ర బలగాలు సైతం ఆయన వెన్నంటి ఉంటాయి. అయినా వారెవ్వరూ చాలలేదట. రోడ్ షో లో ఎవరినైనా పోలీసులు ఆపితే ఇదే ఈనాడు, టీడీపీ మీడియా ఎంతగా గగ్గోలు పెట్టేవి. సీఎం సభ నిమిత్తం రోడ్డుపై బారికేడ్లు పెట్టారని వీరే కదా విమర్శించింది. ఇలా ఎక్కడ ఏ అవకాశం వస్తే, ఆ విదంగా అడ్డగోలుగా కథనాలు రాయడం, వాటిని టీడీపీవారు ప్రచారం చేయడం మామూలు అయింది . మామూలుగా అయితే రెండు, మూడు రోజుల పాటు ఈ ఘటనపై పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసే ఈనాడు, ఈ ఘటనకు వచ్చేసరికి పందా మార్చేసింది. చంద్రబాబు వారిని ఆదుకుంటానన్నారన్న విషయాలకే ప్రాదాన్యత ఇచ్చి ఇక్కడ కూడా సానుభూతి సంపాదించాలన్న నీచమైన ఆలోచన చేసినట్లు అనిపిస్తుంది. లేకుంటే రోడ్డు అంతా కొలతలు వేసి, ఎక్కడ సభ జరగాలి? ఎక్కడ జరిగింది?రోడ్డు పై ఏమి అడ్డం ఉన్నాయి.. డ్రోన్ ఎవరు పెట్టారు? ఎవరు సలహా ఇచ్చారు? ఇలా నానా పరిశోధనలతో వార్తలు ముంచెత్తే ఈనాడు తెలుగుదేశం విషయంలో మాత్రం పూర్తిగా నోరుమూసుకుని ఉండడం వారి ప్రమాణాల పతనానికి అద్దం పడుతుంది. కావలిలో జరిగిన సభలో చంద్రబాబు పోలీసులను మళ్లీ ఎలా బెదిరిస్తున్నారో చూడండి. మా పై కేసులు పెడతారా? పెట్టండి. అక్రమ కేసులు పెట్టిన ఏ అధికారిని వదలం. చట్టం ప్రకారం శిక్షిస్తాం. కావలిలో ఇరవై కేసులు పెట్టారు. మేము వచ్చాక 200 కాదు.. రెండువేల కేసులు పెడతాం అని ఆయన అంటున్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయా? చంద్రబాబును ఎన్నుకుంటే వేల కేసులు పెడతామని ఆయన పోలీసులను కాదు హెచ్చరిస్తున్నది. ప్రజలందరిని అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు. కేసులు కావాలంటే ఆయనను ఎన్నుకోవాలన్నమాట!ఇది కొత్త నినాదమే. దీని ఆధారంగానే తెలుగుదేశం ఎన్నికలకు వెళుతుందా! -
కోవూరులో చంద్రబాబు రోడ్‌షో అట్టర్ ఫ్లాప్
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా: కోవూరులో చంద్రబాబు చేపట్టిన రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జన సమీకరణ కోసం రోడ్ షోను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ స్పందన కరువైంది. చివరకు డబ్బులిచ్చి వాహనాల్లో జనాన్ని తరలించినా రోడ్ షో మాత్రం ఫ్లాప్ అయ్యింది. అధినేత మెప్పుకోసం స్థానిక నేతలు పడరాని పాట్లు పడ్డా జన స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దాంతో సభా స్థలి వద్ద కనీస సందడి కనిపించలేదు. కొంతమంది మహిళలకు రూ. 200 ఇచ్చి మీటింగ్‌కు తరలించారు. డబ్బులిస్తే తాము వచ్చామని సదరు మహిళలు చెప్పడంతో అసలే నిరాశలో ఉన్న టీడీపీ నేతలకు మరింత తలపోటు ఎక్కువైంది. -
అనుమతి ఇచ్చిన ప్రాంతంలో సభ నిర్వహించలేదు: ఎస్పీ
నెల్లూరు: జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోలో చోటు చేసుకున్న విషాద సంఘటనపై జిల్లా ఎస్పీ విజయరావు విచారం వ్యక్తం చేశారు. సాక్షి టీవీతో ఎస్పీ మాట్లాడుతూ.. ‘కందుకూరు సంఘటన దురదృష్టకరం. ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు సభ ఏర్పాటు చేసేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అయితే తొక్కిసలాటకు ఆస్కారం ఉండదు. అనుమతి ఇచ్చిన ప్రాంతాన్ని దాటి ఇరుకుగా ఉన్న రోడ్లోకి చంద్రబాబు వెళ్లారు. 46 మీటర్లు ముందుకు వెళ్లిపోయారు. ఒకే చోటికి జనం ఒక్కసారిగా చేరటంతో తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ పిచ్చయ్య ఇచ్చిన ఫిర్మాదుతో కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి సెక్షన్లు నమోదు చేస్తాం’ అని తెలిపారు. -
‘ఆయన మానసిక స్థితి బాలేదు.. మైకేల్ జాక్సన్ తరహాలో ప్రచారాలు’
నెల్లూరు: చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాలేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మైకేల్ జాక్సన్ తరహాలో ప్రచారాల్లో పాల్గొంటున్న బాబు ఏవోవో మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి విమర్శించారు. వ్యవసాయం దండగన్న బాబు.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్న వ్యక్తి చంద్రబాబని, రైతులను కాల్చి చంపిన ఘన చరిత్ర బాబుదని మంత్రి కాకాణి ధ్వజమెత్తారు. ‘పదవి.కోసం ఎంత కైనా చంద్రబాబు దిగజారుతాడు. అవసరం ఉన్నపుడు మోదీ ని పొగిడి,అవసరం తీరగానే విమర్శలు చేశాడు. రాహుల్ గాంధీని సీపీఎం, సీపీఐలను కూడా కలుస్తాడు. ఎవరితో అవసరమైతే వారితో జత కట్టడం అవసరం తీరగానే వారిని వదిలేయడం చంద్రబాబుకు అలవాటే. కుప్పం నియోజకవర్గానికి రెవిన్యూ డివిజన్ కూడా తెచ్చుకోలేక పోయాడు. దాన్ని కూడా సీఎం జగన్ ఇచ్చారు. లోకేష్‌ను విదేశాల్లో ఎవరి ఖర్చు తో చదివించారో చెప్పాలి. నీ కొడుకు ప్రయోజకుడు కాకపోవడంతోనే దత్త పుత్రుడు పై ఆధార పడుతున్నాడు. ఉత్తరాంధ్ర విలన్ చంద్ర బాబు’ అని విమర్శించారు మంత్రి కాకాణి. -
వలంటీర్లను చూస్తే చంద్రబాబుకు వణుకు
కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ‘ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉన్న వలంటీర్ వ్యవస్థను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వణుకు పట్టుకుంది. అందుకే ఎల్లో మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నాడు.’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని నార్తురాజుపాళెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వలంటీర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో అర్హులకు పక్కాగా ప్రభుత్వ పథకాలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా గడ్డు కాలంలో ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో ఉండి అండగా నిలిచారన్నారు. వారి పనితీరును చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. దీంతో ఎల్లో మీడియాలో దిగజారుడు రాతలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటును మొత్తం వలంటీర్ వ్యవస్థకు ఆపాదించి ఇష్టం వచ్చినట్లు రాయడం సబబేనా అని ప్రశ్నించారు. పలువురు ముఖ్యమంత్రులు ఈ వ్యవస్థ గురించి తెలుసుకుని ఆయా రాష్ట్రాల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఎల్లో మీడియా పనికట్టుకుని వ్యతిరేక వార్తలు రాసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని బాబు పగటికలలు కంటున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వదులుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని బాబు గుర్తించుకోవాలన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, జెడ్పీటీసీ పి.సరోజనమ్మ, ఎంపీపీ జి.జ్యోతి, సర్పంచ్‌లు బి.సుప్రియ, ఎన్.కామాక్షి, ఎంపీటీసీ పి.అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
నెల్లూరులో సైకిల్ పంక్చరేనా?
సింహపురి జిల్లాలో పచ్చ పార్టీ పూర్తిగా కనుమరుగు కానుందా? ఇప్పటికే నిర్వీర్యంగా మారిన టీడీపీ పతనం జిల్లాలో పరిపూర్ణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్ళేందుకు జంకుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దయనీయంగా మారిన నెల్లూరు జిల్లా టీడీపీ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బాబుకు మిగిలింది సున్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం పది అసెంబ్లీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రజా తీర్పుతో జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని దయనీయ స్థితికి దిగజారిపోయింది పచ్చపార్టీ. పార్టీలకతీతంగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమంతో టీడీపీ చేవ చచ్చిపోయింది. ప్రజా పోరాటాలు కూడా చేసే అవకాశం, అవసరం కూడా లేకపోవటంతో తెలుగు తమ్ముళ్లు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు. అధినేత ఆదేశించినప్పుడు ఇష్టం లేకపోయినా అరగంట హడావుడి చేయటం మినహా కొన్నేళ్ళుగా టీడీపీ చేస్తన్నదేమీ లేదు. చిత్తశుద్ధి లేని కార్యక్రమాలతో ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా టీడీపీ కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ స్థాయి ఏంటో ప్రజలు నిరూపించారు. చిత్తశుద్ధి లేని పోరాటాలతో జనం చీత్కారాలకు గురవుతూ ఉన్న కొద్దిపాటి సానుభూతిని కూడా కోల్పోయారు టీడీపీ నేతలు. జిల్లా పరిషత్‌లో అలాగే నెల్లూరు కార్పొరేషన్ లోనూ ఒక్కస్థానాన్ని కూడా గెలిపించుకోలేక పోయారు టీడీపీ నేతలు. దీంతో పెద్ద పెద్ద నాయకులం అనుకునేవారంతా తెరవెనక్కు వెళ్లిపోయారు . చెప్పాడు.. చేశాడు.. మూడేళ్ళ పాటు పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలను నేరుగా ఇళ్లకే చేరవేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజలకు మరింతగా చేరువయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ..పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకుటున్నారు ఎమ్మెల్యేలు. నేతలు నిత్యం జనంలో ఉండటంతో పార్టీ క్యాడర్ లో కూడా నూతనోత్సహం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్ధులని ప్రచారానికి రానివ్వబోమంటూ అడ్డుకొన్న గ్రామాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఘనస్వాగతం లభిస్తోంది. ఊహించని సంక్షేమం ఓట్లు వేయక పోయినా , టీడీపీ సానుభూతి పరులని తెలిసినా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో ఎమ్మెల్యేలకు బ్రహ్మరధం పడుతున్నారు . మంగళ హారతులిచ్చి ఆశీర్వదిస్తున్నారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ వంటి వారు అడ్రస్ లేకుండా పోయారు. మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈసారి పోటీ చేయరనే టాక్ నడుస్తోంది. చినబాబు నడిస్తే.. జనం చూస్తారా? నెల్లూరు జిల్లాలో అచేతనావస్థలోకి చేరుకొన్న పార్టీని ఎలా బతికించుకోవాలన్న మీమాంసలో పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు పడిపోయారు. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మను రంగంలోకి దింపి జిల్లాలో కొన ఊపిరితో ఉన్న పార్టీలో జవసత్వాలు నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. కొడుకు లోకేష్ పాదయాత్ర చేపట్టే నాటికి కొంతమేరైనా పార్టీని మెరుగు పరిచేందుకు పడరాని పాట్లు పడుతున్నారు టీడీపీ బాస్ చంద్రబాబు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగే అభ్యర్థులను అరువు తెచ్చయినా బరిలో దింపేందుకు వెంపర్లాడుతున్నారు. మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ తెలుగుదేశం పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోందన్న టాక్ నెల్లూరు జిల్లాలో సాగుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
రాష్ట్రానికి మణిహారం రామాయపట్నం పోర్టు
గుడ్లూరు(పీఎస్ఆర్ నెల్లూరు): అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టు రాష్ట్రానికే మణి హారం అవుతుందని కలెక్టరు కేవీఎన్ చక్రధర్‌బాబు అన్నారు. మండలంలోని రామాయపట్నం పోర్టు భూ నిర్వాసితులకు పునరావాస సహాయ కార్యక్రమాల్లో భాగంగా తెట్టు–రామాయపట్నం గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న గృహాలకు శనివారం కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, జేసీ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ శోభికతో కలిసి కలెక్టర్ భూమి పూజలు చేశారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఏర్పాటుకు భూములిచ్చిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండి మెరుగైన పునరావాస వసతులు కల్పిస్తామన్నారు. రామాయపట్నం పోర్టు వ్యవసాయ, మైనింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు అనుకూలంగా ఉండడమే కాక నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు విరివిగా లభిస్తాయన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ముడి సరుకులను ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు చేయవచ్చన్నారు. జిల్లాలో ఒక వైపు కృష్ణపట్నం మరో వైపు రామాపట్నం పోర్టు ఏర్పాటుతో పారిశ్రామికంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మొండివారిపాళెం, ఆవుల వారిపాళెం, కర్లపాళెం గ్రామాల ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఈ మూడు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఆర్‌అండ్‌అర్ ప్యాకేజీ, నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు. ముందుగా మొండివారిపాళెం వారికి 111 గృహాలు మంజూరయ్యాయని, అందురూ ఇళ్లు నిర్మించుకుని త్వరగా గృహ ప్రవేశాలు చేయాలన్నారు. 2023 డిసెంబర్ నాటికి మొదటి దశ పూర్తి 850 ఎకరాల్లో చేపట్టిన పోర్టు నిర్మాణ పనులు మొదటి దశ 2023 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలు గొప్పదార్శకులని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా శంకుస్థాపనతో సరి పెట్టకుండా ముందుగానే అన్ని రకాల అనుమతులు, నిధులు సమకూర్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 20న భూమి చేశారని అప్పటి నుంచి అరబిందో కంపెనీ, మారిటైం బోర్డులు ఆధ్వర్వంలో పనులు నిర్విరామంగా జరుగుతున్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురి చేసినా నీతి నిజాయితీ ఉన్న మత్స్యకారులు వాటిని తిరస్కరించి ప్రభుత్వంపై నమ్మకంతో పోర్టుకు ఈ ప్రాంత సమగ్రాభావృద్ధికి తమ భూములను అందించారన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టరు, సబ్ కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని నాలుగు నెలల వ్యవధిలోనే ఆర్అండ్ఆర్ కాలనీకి భూసేకరణ ప్రకియ వేగంగా చేపట్టాన్నారు. శంకుస్థాపన, ప్యాకేజీలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకు నచ్చినట్లు గృహాలు నిర్మించుకునేలా సంపూర్ణ స్వేచ్ఛను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జేసీ కూర్మనాథ్ మాట్లాడుతూ అత్యంత వేగంగా రామాయపట్నం పోర్టు పునరావాస ప్రక్రియను చేపట్టామని గతంలో ఎక్కడా కూడా ఇంత వేగంగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అనంతరం మొండివారిపాళెంకు చెందిన 111 కుటుంబాలకు రూ.22.49 కోట్లు నష్ట పరిహార చెక్కులు, ఇంటి నివేశ స్థలాల చెక్కులు కలెక్టర్, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. కాలనీలో రామాలయ నిర్మాణానికి కాపులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రామాయపట్నం పోర్టు ఎంపీ ప్రతాప్‌రెడ్డి, లైజనింగ్ ఆఫీసర్ ఐ.వెంకటేశ్వరరెడ్డి, అరబిందో సంస్థ ప్రతినిధి భీముడు, జనరల్ మేనేజరు ఎంఎల్ నరసింహారావు, ఎంపీపీ పులి రమేష్, జెడ్పీటీసీ కొర్శిపాటి బాపిరెడ్డి, తహసీల్దార్లు లావణ్య, సీతారామయ్య, సర్పంచ్‌లు గంగమ్మ, రమణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ కాపు పోలయ్య, అధికారులు, నిర్వాసిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
జల ఆశయం..మరి కొద్ది రోజుల్లో సాకారం
పాలకుల సంకల్పం.. ప్రభుత్వ చిత్తశుద్ధి వెరిసి జలసిరులు ఒడిసి పట్టేందుకు చేస్తున్న జల ‘ఆశయం’ పటిష్టం.. మరి కొద్ది రోజుల్లో సాకారం కానుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో వేలాది ఎకరాలకు ప్రధాన జలవనరుగా ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తాత్కాలిక పనుల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. ఒకానొక దశలో వచ్చిన వరదలకు రిజర్వాయర్ కట్టలు కొట్టుకుపోయే దుస్థితికి చేర్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి రంగాలపై దృష్టి సారించారు. వెంకటాచలం(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): బ్రిటిష్ కాలంలో నిర్మించిన సర్వేపల్లి రిజర్వాయర్‌కు ఎట్టకేలకు ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన రిజర్వాయర్‌ను గత ప్రభుత్వాలు ఆలనాపాలనా పట్టించుకోకపోవడంతో కాలక్రమేణ దెబ్బతినే పరిస్థితికి చేరింది. 1.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ వెంకటాచలం మండలంలోని తొమ్మది గ్రామాలతో పాటు, ముత్తుకూరు మండలంలోని పొట్టెంపాడు, పోలంరాజుగుంట గ్రామాల్లో సుమారు 15,350 ఎకరాల అధికార, మరో 10 వేల అనధికార ఆయకట్టుకు సాగునీటిని, తాగునీటిని అందిస్తోంది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రిజర్వాయర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. అనికేపల్లి వద్ద పూర్తయిన కలుజు నిర్మాణం ఆయన మరణాంతరం ఈ పనులు చేపట్టిన అప్పటి కాంట్రాక్టర్ పనులు సక్రమంగా చేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రిజర్వాయర్ పటిష్టత, భద్రతపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో 2015లో కురిసిన భారీవర్షాల కారణంగా రిజర్వాయర్ కట్ట దాదాపు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. రిజర్వాయర్ కట్ట తెగి ఉంటే అప్పట్లో ఊళ్లకు, ఊళ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉండింది. అప్పటి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం అయి ఇసుక బస్తాలు అడ్డుకట్ట వేసి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత నుంచి కరువు తాండవించడంతో చంద్రబాబు పాలనలో రిజర్వాయర్ అభివృద్ధిని పట్టించుకోలేదు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవతో.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాలకు సాగు, తాగునీటి వనరుగా సర్వేపల్లి రిజర్వాయర్ ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కాకాణికి రిజర్వాయర్ పరిస్థితిని రైతులు, వివిధ గ్రామాల నాయకులు తెలియజేశారు. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనికేపల్లి నుంచి జోసఫ్‌పేట వరకు సర్వేపల్లి రిజర్వాయర్ కట్టపై పాదయాత్ర చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అప్పటి ప్రభుత్వానికి రిజర్వాయర్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా చెవిన కూడా పెట్టుకోలేదు. కానీ రిజర్వాయర్ కింద ఏటా కాలువల అభివృద్ధి, మరమ్మతుల పేరిట, నీరు–చెట్టు పేరుతో రూ.కోట్ల దోచుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా విక్రమసింహపురి యూనివర్సిటీకి వచ్చారు. ఆ సమయంలో రిజర్వాయర్ కట్ట ఆధ్వాన పరిస్థితిని, రిజర్వాయర్ అభివృద్ధి చేస్తే జరిగే ప్రయో జనాలను సీఎం దృష్టికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీసుకెళ్లారు. దీంతో అడిగిన వెంటనే సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణకు రూ.11.37 కోట్లు మంజూరు చేశారు. కాకాణి ఇరిగేషన్ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించి రిజర్వాయర్ పనులు వేగవంతంగా చేయాలని ఆదేశాలిస్తూ వచ్చారు. ఫలితంగా మొత్తం 2000 మీటర్లు రిజర్వాయర్ కట్ట రివిట్మెంట్ చేయాల్సి ఉండగా ఇప్పటికే 1000 మీటర్లకుపైగా పనులు పూర్తయ్యా యి. అనికేపల్లి వద్ద కొత్త కలుజు నిర్మాణ పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్ కట్ట పైభాగాన గ్రావెల్ రోడ్డు పనులు చేస్తున్నారు. రిజర్వాయర్ కట్ట కింద బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రబీ సీజన్లో రిజర్వాయర్ కింద ముమ్మరంగా వరినాట్లు సాగుతున్నాయి. ఏప్రిల్ రెండో వారానికి వ్యవసాయ పనులు ముగియనున్నాయి. వ్యవసాయ పనులు ముగిసిన రెండు నెలల్లో మిగిలిన రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఆధునికీకరణ పనులు పూర్తయితే రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంచుకునే వెసులుబాటు కలిగి రెండు పంటలు పండించుకోవచ్చునని రైతులు సంతోషిస్తున్నారు. పటిష్టంగా ఆధునికీకరణ పనులు సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు చాలా పటిష్టంగా జరుగుతున్నాయి. రిజర్వాయర్ అభివృద్ధిని గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించారు. పనులు పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయి. – ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, మాజీ నీటిసంఘం అధ్యక్షుడు సాగునీటి కష్టాలు ఇక ఉండవు సర్వేపల్లి రిజర్వాయర్ అధునికీకరణకు మంత్రి కాకాణి నిధులు మంజూరు చేయించి, శరవేగంగా పనులు చేయిస్తున్నారు. దశాబ్దాల తర్వాత రిజర్వాయర్ పటిష్టతకు ప్రభుత్వం పూనుకుంది. గతంలో దివంగత వైఎస్సార్, ఇప్ప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన రిజర్వాయర్‌కు పూర్వ వైభవం రానుంది. – తాళ్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సర్వేపల్లి త్వరితగతిన పనులు పూర్తి సర్వేపల్లి రిజర్వా యర్ ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తికానున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. రబీ సీజన్ పనులు ముగిసిన రెండు నెలల్లోపు మిగతా పనులు పూర్తి కానున్నాయి. రిజర్వాయర్ కట్ట రివిట్మెంట్ పనులు చాలా పటిష్టంగా జరుగుతున్నాయి. – ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ -
సేద్యానికి ఆర్థిక దన్ను
మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పొదుపు సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి, ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ, వ్యవసాయానికి కావాల్సిన యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సామాజిక పెట్టుబడి, సీఐఎఫ్, గ్రూపు అంతర్గత అప్పులు, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తోంది. ఆయా రుణాలను మహిళలు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళల కోసం వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పి వారి ఆర్థికాభివృద్ధికి చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): సన్న, చిన్న కారు మహిళా రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహిళా రైతులతో ‘రైతు ఉత్పత్తి దారుల సమాఖ్య’ గ్రూపులను ఏర్పాటు చేసి, వివిధ శాఖల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. బ్యాంక్‌లు, ప్రభుత్వ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు వారే కల్పించుకునేలా వసతులు సమకూరుస్తోంది. ఇప్పటికే మూడు విడతల్లో 24 మండలాల్లో 27,412 మంది సభ్యులతో 2,492 గ్రూపులు ఏర్పాటయ్యాయి. తొలివిడతలోని గ్రూపులు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. మహిళా రైతులు సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. డీఆర్డీఏ ద్వారా అమలు ఈ సంఘాల ఏర్పాటు బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. మండలానికి 150 గ్రూపులు లక్ష్యంగా నిర్దేశించింది. సంఘాలు ఎలా ఏర్పాటు చేయాలి, వారికి ప్రభుత్వ శాఖల సహకారం ఏ విధంగా అందించాలి. వారి ఉత్పత్తులకు ధర పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల లభ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. దీంతో డీఆర్డీఏ అధికారులు అంచలంచెలుగా జిల్లా అంతటా సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే తొలిదశలో సైదాపురం, రాపూరు, చేజర్ల, కలువాయి, కొండాపురం, దుత్తలూరు, మర్రిపాడు, రెండో దశలో మనుబోలు, వెంకటాచలం, ఇందుకూరుపేట, అల్లూరు, విడవలూరు, సంగం, అనంతసాగరం, ఏఎస్‌పేట, వింజమూరు, మూడో దశలో కావలి, జలదంకి, సీతారామపురం, కొడవలూరు, కోవూరు, నెల్లూరు, ముత్తుకూరు, బోగోలు మండలాల్లో సంఘాలు ఏర్పాటయ్యాయి. సత్ఫలితాల దిశగా తొలిదశ సంఘాలు తొలి దశలో ఏర్పాటైన సంఘాలు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. చేజర్ల, రాపూరు, కలువాయి తదితర మండలాల్లో రుణం పొంది మినీ రైస్ మిల్లు, పిండి మిల్లు, పొట్టేళ్ల పెంపకం, సేంద్రియ ఎరువులతో పెరటి తోటల పెంపకం చేస్తున్నారు. తద్వారా వచ్చే నాణ్యమైన ఉత్పత్తులను ‘కాలుగుడి’ యాప్‌లో పొందు పరచి ఆన్లైన్ మార్కెట్ చేసి లాభపడుతున్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల సహకారం వ్యవసాయశాఖ సంఘాలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. మౌలిక వసతులను కల్పిస్తోంది. భూసార పరీక్షలు చేయించడం. సమగ్ర వ్యవసాయ విధానంపై శిక్షణ ఇవ్వడం చేస్తోంది. సెర్ఫ్: బ్యాంక్ ఖాతాలను తెరిపించడంతో పాటు రుణాలు పొందే విధంగా ప్రోత్సహిస్తుంది. పుస్తక నిర్వహణపై శిక్షణ ఇస్తుంది. ఉద్యానశాఖ: ప్రభుత్వ, ఇతర సంస్థల సబ్సిడీ పథకాలను సంఘాలకు అందిస్తుంది. సాంకేతిక సహకారమందిస్తుంది. సమీకృత వ్యవసాయంపై శిక్షణ ఇస్తుంది. రైతు సాధికార సంస్థ: సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు అందేలా చూడడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం చేస్తుంది. పశుసంవర్థశాఖ: పాడి పశువులు, సన్న జీవాల కొనుగోలుకు సహకారమందిస్తుంది. వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయిస్తుంది. డెయిరీ కార్యక్రమాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఎన్ఆర్ఈజీఎస్: గొర్రెలు, మేకలు, కోళ్లు, పశువుల షెడ్స్, ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది. రుణ పరపతి: ఒక్కో సంఘ సభ్యురాలికి రూ.25 వేల రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. సభ్యులంతా కలిపి తీసుకోవాలంటే రూ.1.50 లక్ష వరకు రుణం పొందవచ్చు. సభ్యులు పొదుపులోని నగదును రుణంగా పొందవచ్చు. వీటితోపాటు ఉద్యానశాఖ 75 శాతం రాయితీతో ఇస్తున్న పథకాలు పొందవచ్చు. సంఘాలు ఏర్పాటు చేశాం ఒకే రకం పంట సాగు చేసే మహిళా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు కూడా ఆరంభించాం. అధికారుల సూచనలు, సలహాలతో ఎలాంటి పంటలు వేస్తే లాభ దాయకంగా ఉంటుంది. ఆ సాగు పద్ధతులను గురించి అవగాహన చేసుకుంటున్నాం. మార్కెట్ మెళకువలు తెలుసుకుని త్వరలోనే ప్రక్రియ ప్రారంభిస్తాం. – జి.లక్ష్మిరాణి, అన్నదాత రైతు ఉత్పత్తి దారుల సంఘం, కొడవలూరు లాభదాయక సంఘాల స్ఫూర్తితో సాధికారత తొలి దశలో ఏర్పాటైన మా సంఘాలు ఇప్పటికే వివిధ రకాల పంటలు, రైస్ మిల్లు, ఆన్లైన్ మార్కెట్లు చేస్తూ లాభ పడుతున్నాయి. ఆ సంఘాల స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం. వివిధ శాఖలు సహకారమందిస్తున్నందున తప్పక లాభాల బాట పడుతామన్న ధీమా ఉంది. ఉద్యాన శాఖ ద్వారా 75 శాతం రాయితీ రావడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం మెరుగ్గా ఉంది. – కె.సుభాషిణి, వాసు రైతు ఉత్పత్తిదారుల సంఘం త్వరలో రూ.1.20 కోట్లతో సేకరణ కేంద్రాల ఏర్పాటు సంఘాలు పండించిన ఉత్పత్తులను ఒక చోటకు సమీకరించి గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి మండలానికో షెడ్డు నిర్మించనున్నాం. ఒక్కో షెడ్డుకు ప్రభుత్వం రూ.20 లక్షల వంతున మంజూరు చేస్తోంది. రూ.15 లక్షలు షెడ్డుకు, రూ.5 లక్షలు కోల్డ్ రూమ్‌కు మంజూరు చేస్తోంది. తొలివిడతలో కలువాయి, రాపూరు, చేజర్ల, గుడ్లూరు, సైదాపురం, ఓలేటివారిపాళెంలో షెడ్ నిర్మాణాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. రైతులు పండించిన పండ్లు, నిమ్మకాయలు, కూరగాయల్లాంటివి రెండు లేదా మూడు రోజులు నిల్వ ఉండాల్సి వస్తే చెడిపోకుండా కోల్డ్ రూమ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఉత్పత్తిదారుల సంఘాలను కూడా దశల వారీగా 37 మండలాల్లో ఏర్పాటు చేయనున్నాం. – కేవీ సాంబశివారెడ్డి, డీఆర్డీఏ పీడీ నెల్లూరు -
చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారు’
నెల్లూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదని అనడానికి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శమన్నారు. చంద్రబాబు మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని కాకాణి స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదని అర్థం అవుతోంది. కర్నూల్ పర్యటన పై చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నాడు. కర్నూలు లో న్యాయ రాజధాని పై ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నాడు. చంద్రబాబును ప్రశ్నిస్తే వారిని వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ముద్ర వేస్తున్నాడు’ అని తెలిపారు. చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారని కాకాణి తెలిపారు. -
ఫిషింగ్ హార్బర్‌పై పచ్చ కుట్ర
పచ్చకుట్రలకు హద్దూపద్దూ లేకుండాపోతోంది. లక్షలాది మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై కుట్రలకు తెగబడింది. చివరి దశకు చేరుకున్న హార్బర్ నిర్మాణం పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయనే ఆక్రోశంతో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. మత్స్యకారులకు వర ప్రసాదినిగా మారుతున్న హార్బర్ నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. బిట్రగుంట(పీఎస్ఆర్ నెల్లూరు): టీడీపీ నేతలా మజకా. ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించారు. రొయ్యల గుంతలుగా మార్చుకుని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. ఆ భూమిని లక్షలాది మత్స్యకారుల జీవితాలను మార్చే ఫిషింగ్ హార్బర్‌కు కేటాయించడంతో స్వాధీనం చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు టీడీపీ నేతల ఆక్రమణలు కనిపించాయి. వీటిని తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులకు రొయ్యలు సాగులో ఉన్నాయి... రెండు నెలలు గడువిస్తే స్వాధీనం చేస్తామని లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. సరే కదా అని గడువిస్తే.. ఇప్పుడు రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో పాటు నిర్ధాక్షిణ్యంగా రొయ్యల గుంతలు తొలగిస్తున్నారంటూ పచ్చ మీడియా, సోషల్ మీడియా వేదికగా అసత్య, విష ప్రచారాలు సాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు వాస్తవాలు ఇవీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేలా, గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేలా రాష్ట్ర ప్రభుత్వం జువ్వలదిన్నె వద్ద సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్‌ను మంజూరు చేసింది. ఇందుకోసం సర్వే నంబర్లు 1197, 1198, 1196, 1194, 1199, 1200, 1201,1202, 1203, 1204, 1205, 1206లో 76.87 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటిలో 1205, 1206 సర్వే నంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలోని సుమారు 45 ఎకరాల భూమి చుక్కల భూమిగా నమోదై ఉండడంతో ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్పు చేస్తూ కలెక్టర్‌కు స్థానిక రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఫారం–5 ద్వారా స్థానికుల నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించారు. స్థానికులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో చుక్కల భూమిగా నమోదైన 45 ఎకరాల భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మారుస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరంగా అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మొత్తం 76.89 ఎకరాల భూమిని హార్బర్ నిర్మాణం కోసం మత్స్యశాఖకు అందజేశారు. ప్రభుత్వం కూడా త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేయడంతో హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి నాటికి పనులు పూర్తి చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి చేసిన ప్రస్తుతం హార్బర్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తున్నారు. ఆక్రమణలతో అడ్డుకునే కుట్ర ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ ప్రహరీ 1205, 1206 సర్వే నంబర్ల మీదుగా నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ సర్వే నంబర్లలో మొత్తం 12.04 ఎకరాల భూమి ఉండగా కావలిరూరల్ మండలం తుమ్మలపెంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకుని రొయ్యల గుంతలు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఆక్రమణలు తొలగించి హార్బర్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా మత్స్యశాఖ రెవెన్యూ అధికారులకు సూచనలు చేసింది. రొయ్యల గుంతలు ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సూచించగా ప్రస్తుతం రొయ్యలు సాగులో ఉన్నాయని 60 రోజులు గడువు కావాలని కోరారు. ఈ మేరకు ఆక్రమణదారులు సెప్టెంబర్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో రొయ్యలు పట్టుబడి అయ్యేంత వరకు రెవెన్యూ అధికారులు ఆగారు. ఇందుకు సంబంధించిన ఎండార్స్‌మెంట్‌ను కూడా ఆక్రమణదారులకు అందించారు. ప్రస్తుతం రొయ్యల పట్టుబడి పూర్తవడంతో రెండు రోజుల క్రితం అధికారులు గుంతలు తొలగించేందుకు వెళ్లగా తుమ్మలపెంటకు చెందిన టీడీపీ నాయకులు అడ్డుతగిలి నానా హంగామా చేశారు. ఈ భూములను 2012లో అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశామని, ప్రస్తుతం తమకు రూ.3 కోట్లు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవాలని వాదనకు దిగారు. రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు గ్రామస్తులు, స్థానిక సంస్థల ప్రతినిధుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలను తొలగించారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం రొయ్యల గుంతలు ధ్వంసం చేసి రూ.1.5 కోట్ల మేర నష్టం కలిగించారంటూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ గొడవలు సృష్టించేలా పోస్టులు పెడుతున్నారు. కోర్టుకెళ్లి హార్బర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని శపథాలు చేస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఆ 12.04 ఎకరాలు ప్రభుత్వ భూములే ఫిషింగ్ హార్బర్‌కు కేటాయించిన భూముల్లో సర్వే నంబర్లు 1205, 1206లో ఉన్న 12.04 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందిందే. చుక్కల భూమిగా ఉన్న ఈ భూమిని ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చే సమయంలో కూడా స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాం. ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో నిబంధనల మేరకు చుక్కల భూమి నుంచి ప్రభుత్వ పోరంబోకు భూమిగా మార్చి హార్బర్‌కు కేటాయించడం జరిగింది. ప్రభుత్వ భూమిని అగ్రిమెంట్ల ద్వారా విక్రయించడం, కొనుగోలు చేయడం చెల్లదు. రొయ్యల గుంతలు ఖాళీ చేసేందుకు ఆక్రమణదారులకు 60 రోజులకు పైగా గడువు కూడా ఇవ్వడం జరిగింది. రొయ్యలు పట్టుబడి చేసిన తర్వాత గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీల సమక్షంలో పంచనామ నిర్వహించి ఖాళీగా ఉన్న రెండు గుంతలు మాత్రమే తొలగించాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, బోగోలు -
సేవకు సెల్యూట్..వరసగా నాలుగో సారి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయికి పెరిగి విశిష్ట సేవలు అందిస్తున్న ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి మరో సారి ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే వరుసగా ఏ ప్రభుత్వ ఆస్పత్రికి లభించని విధంగా వరుసగా నాల్గో ఏడాది కూడా కాయకల్ప అవార్డు వరించింది. వైద్యశాలకు వచ్చే రోగులకు అందించే సేవల్లో వైద్య సిబ్బంది నిబద్ధత, కృషి ఫలితంగా ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చిందని వైద్యాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వరసగా నాలుగో సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందజేసే ప్రతిష్టాత్మకమైన ‘కాయకల్ప’ అవార్డు దక్కింది. పీహెచ్సీ నుంచి సీహెచ్‌సీగా, 2015లో నూరు పడకల ప్రాంతీయ వైద్యశాలగా ఎదిగి విశిష్ట సేవలు అందించిన ఈ ఆస్పత్రి ఏడాది కాలానికే జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ సాధించింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ప్రజలతో పాటు వైఎస్సార్ జిల్లా బద్వేల్, పోరుమామిళ్ల, మైదుకూరు వంటి దూరప్రాంత ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తోంది. 23 మంది వైద్యులు, 30 మందికిపైగా సిబ్బందితో విశేష సేవలు అందిస్తూ.. అనతి కాలంలోనే నూరు పడకల నుంచి 150 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. ఈ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ (చిన్నపిల్లల వ్యాధులు), ఈఎన్టీ, ఆప్తామాలిక్, జనరల్ మెడిసిన్, సర్జరీ, దంత వైద్యం, ఫిజియోథెరపీ, ఎన్సీడీ (నాన్ కమ్యూకబుల్ డిసీజెస్) తదితర పలు రకాల వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు ఈ ఆస్పత్రిలో లభిస్తుండడంతో సోమ, బుధవారాల్లో ఓపీ 600 మందికిపైగా నమోదు అవుతుందంటే అతిశయోక్తి కాదు. ఇలా ఆరోగ్య పరంగా విశిష్ట సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రిగా పేరుగాంచింది. వరుసగా అవార్డులు ప్రాంతీయ వైద్యశాలగా అప్‌గ్రేడ్ అయిన తొలి ఏడాదే 2016లో రాష్ట్రస్థాయి ఉత్తమ కాయకల్ప అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రూ.3 లక్షలు ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు. 2017–18, 2018–19 సంవత్సరాల్లో కాయకల్ప అవార్డులు లభించాయి. ఈ అవార్డుల కింద ఏటా రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహక బహుమతులు లభించాయి. కరోనా నేపథ్యంలో మధ్యలో రెండేళ్ల పాటు అవార్డుల ప్రకటన చేయలేదు. తిరిగి 2020–22 సంవత్సరానికి అవార్డుల ఎంపికలో ఆత్మకూరు ఆస్పత్రికి రాష్ట్ర స్థాయిలో నాలుగో సారి కాయకల్ప అవార్డు దక్కింది. ఈ అవార్డుతో పాటు ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ కంపెనీ సర్టిఫికేషన్) అందజేయనున్నారు. డిసెంబరులో అవార్డు అందజేత జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లోని జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఉత్తమ సేవల ఎంపికలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి కాయకల్ప అవార్డులభించడంతో డిసెంబరులో న్యూఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌క్యూఏఎస్ సర్టిఫికెట్తో పాటు అవార్డు షీల్డ్, రూ.20 లక్షల ప్రోత్సాహక నగదు చెక్కు ఆస్పత్రికి అందజేయనున్నారు. రాష్ట్రంలోనే వరసగా నాలుగు సార్లు ఉత్తమ అవార్డు దక్కించుకున్న చరిత్ర ఆత్మకూరు ఆస్పత్రికి దక్కడం విశేషం. బ్లడ్ స్టోరేజ్‌కి అవార్డు ఈ ఆస్పత్రిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ (రక్తనిల్వ మాత్రమే) నిర్వస్తున్నారు. వేలాది మందికి సకాలంలో కావాల్సిన మేరకు రక్తం సరఫరా చేయడంలో, ఉత్తమ సేవలు అందించడంలో ఆ విభాగంలో గతేడాది ఈ ఆస్పత్రి రాష్ట్ర స్థాయిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అవార్డు దక్కింది. అప్పట్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో బ్లడ్ బ్యాంక్ (సేకరణ, నిలువ) మంజూరు అయింది. త్వరలోనే భవన వసతిని చూసుకుని ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించనున్నారు. అవార్డుకు ఎంపిక ఇలా ఈ అవార్డు ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో డాక్టర్లతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వారు ఆస్పత్రులను పరిశీలించి పర్యావరణం, గ్రీనరీ, అత్యధిక విభాగాల్లో వైద్యసేవలు, యంత్ర పరికరాల నిర్వహణ, ల్యాబ్ నిర్వహణ, భవన వసతి, ఆస్పత్రి పరిసర ఆవరణలో పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలు, నీటి వినియోగం, ఆస్పత్రి వేస్టేజ్ మేనేజ్మెంట్ నిర్వహణ తదితర 16 అంశాల్లో పరిశీలించి ఈ అవార్డుకు ఎంపికలు చేస్తారు. సమష్టి కృషితో సాధించాం ఈ ఆస్పత్రికి వరసగా నాలుగు సార్లు కాయకల్ప అవార్డు రావడం ఎంతో సంతోషం. సహచర డాక్టర్లు, సర్వీస్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అందరి సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగాం. గతంలో పనిచేసిన సూపరింటెండెంట్ డాక్టర్ చెన్నయ్య కృషి ఎంతో ఉంది. మరిన్ని పరికరాలు ఏర్పచుకొని మరింతగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తాం. – డాక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఆత్మకూరు ప్రసూతిలో విశేష సేవలు నాలుగేళ్లుగా ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నాను. అన్ని వైద్య విభాగాలతో పాటు ప్రసూతి విభాగ నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఏడాదికి 1800పైగా కాన్పులు జరుగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధికంగా అందజేస్తున్నాం. వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహక నగదు అందజేస్తున్నాం. మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. – డాక్టర్ ఉషాసుందరి, ఆర్ఎంఓ, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఆత్మకూరు -
23న ఎమ్మెల్సీ ఓటర్ల ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా ప్రచురణ
నెల్లూరు(అర్బన్): జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19 నాటికి డ్రాఫ్ట్ తయారు చేసి 23న ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 7వ తేదీ నాటికి 1,13,837 మంది పట్టభద్రులు, 7,783 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా చేరేందుకు దరఖాస్తులు సమర్పించారన్నారు. తాము ప్రచురించే ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను డిసెంబర్ 9వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను 25వ తేదీ నాటికి పరిష్కరించి తుది జాబితాను డిసెంబర్ 30న ప్రచురిస్తామన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 76 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతులు ఉన్న పాఠశాలలు, కళాశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం ఉంటుందన్నారు. ఆత్మకూరు, బుచ్చి, కోవూరు, పొదలకూరు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి మండలాల్లో రెండు పోలింగ్ కేంద్రాలు వంతున, కందుకూరులో 4, కావలిలో 6, నెల్లూరు అర్బన్‌లో 9, నెల్లూరు రూరల్‌లో 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిర్వహణపై తమ సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తరఫున మురళీధర్‌రెడ్డి, టీడీపీ తరఫున వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ నుంచి ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ నుంచి బాలసుధాకర్, సీపీఎం నుంచి మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు. -
తల్లిదండ్రులకు గుడి కట్టిన తనయుడు
విడవలూరు: తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో కుమారుడు తన తల్లిదండ్రులకు గుడి కట్టి అందులో విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని నాగమాంబపురం పంచాయతీ పరిధిలోని కొట్టాలకి చెందిన పుట్టా సుబ్రమణ్యంనాయుడు (జొన్నవాడ ఆలయ చైర్మన్) గ్రామంలో తన సొంత స్థలంలో తల్లిదండ్రులకు గుడి కట్టించాడు. తన తల్లి పుట్టా సుబ్బమ్మ మొదటి వర్థంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన గుడిలో తన తండ్రి పుట్టా రామయ్య, తల్లి పుట్టా సుబ్బమ్మ విగ్రహాలను ప్రతిష్టించారు. అనంతరం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో
పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆవిర్భవించి అర్ధ శతాబ్దం అయింది. ప్రభుత్వ యాజమాన్యంతో ప్రారంభమైన ఈ సంస్థ సుమారు 32 ఏళ్ల పాటు నిర్జీవంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జవసత్వాలు పుంజుకుంది. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులకు అండదండగా నిలిచింది. వేలాది పరిశ్రమల స్థాపనకు పునాదులు వేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించింది. తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రగతిని విస్తరిస్తోంది. ఆత్మకూరురూరల్(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): అర్ధ శతాబ్దం క్రితం రెక్కలు తొడిగిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు గత ప్రభుత్వాలు రెక్కలు విరిచేశాయి. నిధులు.. విధులు లేక ఆ సంస్థ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చేతులు ముడుచుకుని కూర్చొంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ సంస్థ చేతినిండా పనితో తన కార్యకలాపాలను సమృద్ధిగా విస్తరించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. 2004 నుంచి 2009 వరకు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏపీఐఐసీ వైఎస్సార్ మరణం తర్వాత మళ్లీ నిధులు, విధులు లేక చతికిలపడింది. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ సంస్థకు మళ్లీ రెక్కలొచ్చాయి. పారిశ్రామిక ప్రగతికి తనవంతుగా భూసేకరణ చేయడంతో పాటు అందులో మౌలిక వసతులు కల్పించడంలో అహర్నిశలు శ్రమిస్తోంది. మూడు పారిశ్రామికవాడల నుంచి.. 1973లో ఏపీఐఐసీ ప్రభుత్వ సంస్థగా ఆవిర్భవించింది. అయితే 2004 సంవత్సరానికి ముందు వరకు జిల్లాలో ఈ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఆటోనగర్, ఉడ్‌కాంప్లెక్స్, వెంకటాచలం పరిధిలోనే మాత్రమే పరిశ్రమల ఏర్పాటు చేయగలింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు, పంటపాళెం, కొడవలూరు ప్రాంతాల్లో పారిశ్రామికవాడల విస్తరణకు ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 27 వేల ఎకరాల భూములను సేకరించి పరిశ్రమల స్థాపనకు అనువుగా మార్చింది. వేలాది మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచింది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. కొత్త పరిశ్రమలకు ఊతంగా.. జిల్లా విభజతో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు తదితర పారిశ్రామికవాడలు తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక జిల్లాలో ఏపీఐఐసీకి మిగిలిన 4,107.97 ఎకరాల భూములను పారిశ్రామిక పార్కులుగా తీర్చిదిద్ది పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు కూడా పూర్తి చేసింది. జిల్లాలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటి వరకు 1883.59 ఎకరాల్లో 925 సంస్థలు రూ.9,422.93 కోట్ల పెట్టుబడితో వివిధ పరిశ్రమలను స్థాపించింది. తద్వారా 11,939 మంది నిరుద్యోగులకు ఆయా సంస్థల్లో ఉపాధి లభించింది. రెండో దశలో 648.64 ఎకరాల్లో 47 సంస్థలు రూ.6,661.02 కోట్ల పెట్టుబడితో స్థాపించబోయే పరిశ్రమల ద్వారా 10,188 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మూడో దశలో 67.16 ఎకరాల్లో రూ.346.92 కోట్ల పెట్టుబడితో 44 సంస్థలు తాము ప్రారంభించబోయే పరిశ్రమల్లో 5,176 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. నారంపేటలో వడివడిగా నిర్మాణాలు దివంగత పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మానసపుత్రికగా ప్రారంభమైన ఆత్మకూరు మండలం నారంపేట పారిశ్రామికవాడ నిర్మాణాలు ఆయన హఠాణ్మరణం కారణంగా కొంత కాలంగా పనులు మందగించాయి. తన అన్న ఆశయ సాధనే తొలి ప్రాధాన్యంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నారంపేట పారిశ్రామికవాడపై దృష్టి సారించడంతో ఆగిపోయిన పనులు మళ్లీ జోరందుకున్నాయి. తొలి దశలో 2.30 కి.మీ. బీటీ రోడ్లు, 3.22 కి.మీ. సిమెంట్ డ్రెయినేజీ కాలువలు రూ.6.46 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. రెండో దశలో రూ.12.73 కోట్ల వ్యయంతో 6.70 కి.మీ. బీటీ రోడ్లు, 19.40 కి.మీ. సిమెంట్ కాలువలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం 2.30 కి.మీట. బీటీ రోడ్లు, 4.60 కి.మీ. సిమెంటు కాలువలు నిర్మాణాలు పూర్తయ్యాయి. పారిశ్రామికవాడ ప్రత్యేకతలు 173.67 ఎకరాలు విస్తీర్ణంలో చేపట్టిన నారంపేట ఎంఎస్ఎంఈ పార్కులో ప్లాస్టిక్ పార్కు, ఫర్నీచర్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 337 ప్లాట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ ప్లార్కు ఏర్పాటుకు 36.23 ఎకరాలు, ఫర్నీచర్ పార్కుకు 25.56 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఇప్పటికే పది ఎకరాల విస్తీర్ణాన్ని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశారు. గృహ నిర్మాణాల కోసం 5.49 ఎకరాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవి కాకుండా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల కోసం గృహ సముదాయం, మౌలిక వసతుల కోసం ప్రత్యేక భవనాలు, విశాలమైన గ్రీన్ పార్కు, 24 గంటలు అందుబాటులో ఉండేలా విద్యుత్, నీరు, వాహనాల పార్కింగ్ తదితర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో భారీగా విస్తరణ దిశగా.. బొడ్డువారిపాళెం పారిశ్రామికవాడలో మిథాని గ్రూపు సంస్థలు ఏపీఐఐసీ ద్వారా 110 ఎకరాలు సేకరించి రూ.4,500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. క్రిబ్కో గ్రూపు సంస్థలు కూడా 289.81 ఎకరాల్లో రూ.560 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించే మరో పరిశ్రమ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పారిశ్రామికవాడలను విస్తరించిన ఏపీఐఐసీ తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. రామాయపట్నం ఇండస్ట్రియల్ హబ్ ద్వారా కందుకూరు డివిజన్ సమీపంలో రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో 3,773.47 ఎకరాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామాయపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించాలని నిర్ణయించారు. నెల్లూరురూరల్ మండలం కొత్తూరు, నెల్లూరు బిట్ 1 వద్ద 4 ఎకరాల్లో హెల్త్ హబ్ నిర్మించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ముమ్మరంగా కృషి చేస్తోంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో 4 చోట్ల, వెంకటాచలం, కావలి, అనంతవరం, కొత్తపల్లి కౌరుగుంట, బొడ్డువారిపాళెం, ఆమంచర్ల, చెన్నాయపాళెం, ఏపూరు, గుడిపల్లిపాడు, పంటపాళెం, పైనాపురం, రామదాసుకండ్రిక, సర్వేపల్లి, తదితర ప్రాంతాల్లో 3,756.62 ఎకరాల భూమిలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2 వేల ప్లాట్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 738 ప్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఏపీఐఐసీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం ఏపీఐఐసీ ద్వారా సకల సదుపాయాలతో తీర్చిదిద్దిన పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాం. జిల్లాలోని కొత్తపల్లికౌరుగుంట, నారంపేట, బొడ్డువారిపాళెం, అనంతవరం పారిశ్రామికవాడల్లో ఏర్పాటు చేసిన యూనిట్లను ఎస్సీ, ఎస్టీల వారికి 50 శాతం సబ్సిడీపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే డీఐఈపీసీ సమావేశంలో కేటాయింపులు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ కులాల వారికి 21 శాతం ప్లాట్లు రిజర్వు చేయబడతాయి. ఏపీఐఐసీ వెబ్సైట్లో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి తుది నిర్ణయం చేస్తారు. – జే.చంద్రశేఖర్, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ నెల్లూరు -
బైజూస్ బోధన..ఉచితంగా నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థిని ఇంగ్లిష్ మీడియంలో తీర్చిదిద్దేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రైవేట్‌గా ఈ తరహా విద్యాబోధనకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ తరహా విద్యను ప్రారంభించి ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలలంటే ఆకర్షించే తరగతి గదులు, మౌలిక వసతులే కాకుండా నాణ్యమైన విద్య సైతం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే నాడు–నేడుతో పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఉండే విధంగా జిల్లాలో 51 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. దీంతో పాటు మెరుగైన బోధన అందించేందుకు జిల్లాలో 17 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్ ఎడ్టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 4వ తరగతి నుంచి బైజూస్ ద్వారాా ఆన్లైన్లో వీడియో పాఠాలు బోధన అందించే విధంగా చర్యలు చేపట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఉచితంగా నాణ్యమైన విద్య ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 10వ తరగతి వరకు 1,42,907 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ బైజూస్ అప్లికేషన్ ద్వారా తరగతికి సంబంధించి కంటెంట్‌ను అప్లోడ్ చేయనున్నారు. బైజూస్యాప్తో విద్యాబోధన అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఈ యాప్‌తో పాటు ఇంగ్లిషు లెర్నింగ్ యాప్‌ను ఉచితంగా అందజేస్తోంది. పర్చువల్ పద్ధతిలో ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధంగా యాప్‌ను రూపకల్పన చేశారు. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫిక్స్ ద్వారా విద్యార్థులు బోధనను మరింత సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది. సోషల్, సైన్స్, మ్యాథ్స్ తదితర సబ్జెక్ట్లన్నింటిని ఇంగ్లిష్తో పాటు తెలుగులో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో విద్యార్థులు భాషా పరంగా ఇబ్బందులు ఎదుర్కొకుండా సులభంగా అర్థం చేసుకోగలరు. వీడియో పాఠాలు నాణ్యతతో పాటు స్పష్టతతో ఉంటాయి. నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు ప్రశ్నలు యాప్‌లో పొందుపరిచారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రొగ్రెస్ రిపోర్టు ఇవ్వనున్నారు. బైజూస్ యాప్‌ను విడిగా కొనుగోలు చేయాలంటే రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అటువంటిది ఉచితంగా అందిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో 85,572 మంది బైజూస్ ప్రీమియం యాప్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే యాప్ ద్వారా విద్యాబోధన ప్రారంభమైంది. 21,092 మందికి ఉచితంగా ట్యాబ్‌లు బైజూస్ వీడియో పాఠాల కోసం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 21,092 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేయనున్నారు. ట్యాబ్‌లను ఈ నెలలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బయట మార్కెట్లో ఒక్కో ట్యాబ్ ధర 19,446 ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.12,843లకే అందుబాటులోకి తీసుకురానుంది. బైజూస్ కంటెంట్‌కు ఒక్కో విద్యార్థిపై తరగతి బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అప్లోడ్ చేయనున్నారు. వీళ్లు 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతికి వెళ్లే సమయంలో ఆయా తరగతి సబ్జెక్ట్‌లకు సంబంధించిన కంటెంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. విద్యార్థులకు బైజూస్ ప్లాట్‌ఫాం లాంటిది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ప్లాట్‌ఫాం లాంటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం అభినందనీయం. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. వీడియో పాఠాల ద్వారా బైజూస్ సబ్జెక్ట్‌లకు సంబంధించి కంటెంట్‌ను అందిస్తోంది. రివిజన్‌కు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. – సుబ్బారావు, ఇన్చార్జి డీఈఓ -
కంప్యూటర్ ఆపరేటర్.. కుంభకోణంలో అన్నీ తానై
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కుంభకోణంలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ కీలక పాత్రధారిగా వ్యవహరించాడు. నలుగురు మేనేజర్ల హయాంలో అవినీతికి అంతా తానై సూత్రధారిగా నిలిచాడు. అప్పనంగా డబ్బు సంచులు ఇంటికి చేరుతుండడంతో జిల్లా మేనేజర్‌గా విధుల్లో ఉన్న వారు కిమ్మనకుండా భాగస్వామ్యులయ్యారు. మొత్తం విషయం బహిర్గతం కావడంతో తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. తమకేమి తెలియదంటూ ఉన్నతాధికారుల ఎదుట నంగనాచి కబుర్లు చెబుతున్నారు. డీఎం ఓటీపీల ద్వారానే శివకుమార్ నిధులు పక్కదారి పట్టించారు. రూ.40 కోట్లు ప్రజాధనం స్వాహా కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం సీఐడీకి బదలాయించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ లావాదేవీలు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా చెల్లింపులు ఉండాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్‌కు ఎస్బీఐ బ్యాంకు అధికారులు అనుమతించారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి తమ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలు మేనేజర్లు నిర్బయంగా చెప్పడంతో కంప్యూటర్ ఆపరేటర్ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక అకౌంట్లకు ప్రభుత్వ నగదు బదలాయించాడు. ఐదేళ్లుగా ప్రజా«ధనాన్ని పక్కదారి పట్టించి కొల్లగొట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే, మరో 24 మంది ప్రైవేట్ వ్యక్తులు ప్రమేయం ఉండడం విశేషం. నిస్సంకోచంగా దోపిడీ ప్రజాధనం దోపిడీ వ్యవహారం ఎప్పటికైనా బహిర్గతం అవుతుందనే విషయం తెలిసీ కూడా నిస్సంకోచంగా దోపిడీ చేయడంలో డీఎంలు కీలకంగా నిలిచారు. ఈ తరహా అవినీతికి తెర తీసిన కృష్ణారెడ్డి నుంచి కొండయ్య, రోజ్‌మాండ్, పద్మ ఇలా ఒకరి తర్వాత మరొకరు నలుగురు డీఎంలు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఇంటర్నల్ ఆడిటర్లను మేనేజ్ చేయవచ్చనే ధీమా, రికార్డులు అందుబాటులో లేకుండా చేస్తామనే ధైర్యంతో ఈ దోపిడీకి తెరతీశారు. కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ చెప్పినట్లు నడుచుకోవడంతో అత్యంత సులువుగా స్వాహా సాధ్యమైంది. ఒక వైపు బ్యాంకర్ల సహకారం, మరో వైపు ఇంటర్నల్ ఆడిటర్లు దన్నుగా నిలవడంతో బయటకు దోపిడీకి మార్గం సుగమం అయింది. 12 డ్యాకుమెంట్లు ఫ్రీజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఫ్రీజ్ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రోణింకి కూర్మనాథ్ ప్రకటించారు. వాస్తవంగా 32 మంది ప్రత్యక్ష పాత్రధారులున్నారు. అయితే వీరిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, మిగతావారంతా ప్రైవేట్ వ్యక్తులే. ఇందులో చేజర్ల దయాకర్ (9 డాక్యుమెంట్లు), సూర్యపవన్ (3 డాక్యుమెంట్లు) పేరిట ఉన్న 12 డాక్యుమెంట్లు మాత్రమే ఫ్రీజ్ చేశారు. నెల్లూరు, కోవూరు, బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న ఆ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం రూ.3 కోట్లు మాత్రమే. బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్లు విలువైన ఆస్తులుగా పలువురు చెబుతున్నారు. పాత్రధారులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తే మిగతా వారి ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయాల్సి ఉంది. జల్సాలకు అలవాటు పడి.. కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ ఏర్పాటు చేసే పార్టీలకు అలవాటు పడడంతోనే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఊబిలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. మరి కొందరికి వ్యక్తిగత అవసరాలు, బంధువులు శుభకార్యాలకు సైతం డబ్బులు వెచ్చించినట్లు సమాచారం. మరో వైపు బ్యాంకర్లకు కూడా అదే స్థాయిలో ట్రీట్ ఇవ్వడంతో ఎనీటైమ్మనీ (ఏటీఎం) లాగా ఉపయోగపడినట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు ఎవరెవరికి ఎంత మొత్తం, ఎక్కడెక్కడ అందించింది.. ఎవరి అకౌంట్లకు ఎంత మొత్తం బదిలీ చేసిందనే వివరాలు పోలీసులకు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. సీఐడీకి కేసు బదలాయింపు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నిధులు స్వాహా వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 14న క్రైమ్ నంబర్ 527/2022గా ఐసీపీ సెక్షన్లు 120బీ, 409 మేరకు 11 మందిపై కేసు నమోదు చేశారు. తాజా నివేదిక ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది ప్రమేయం ఉందని వెల్లడియ్యింది. వీరిలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్, పవన్, రాజాం అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరు పరిచారు. నిందితుల్లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, దాదాపు రూ.40 కోట్లకుపైగా స్వాహాకు గురైనట్లు గుర్తించడంతో మరింత లోతైన విచారణ చేపట్టి కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు సీబీసీఐడీ విభాగాన్ని జిల్లా యంత్రాంగం ఆశ్రయించింది. ఆ మేరకు శుక్రవారం ఎస్పీ విజయారావుతో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న వ్యవహారాన్ని వివరిస్తూ లేఖ రాస్తూనే, ఎఫ్ఐఆర్తో పాటు, అధికారిక నివేదిక సీబీసీఐడీ ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు లభించిన తర్వాత కేసును బదలాయించనున్నారు. -
‘రూ.40 కోట్ల స్వాహా’ లెక్క తేలింది..!
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో అవినీతి వ్యవహారంలో లెక్క తేలింది. రూ.40 కోట్లను స్వాహా చేశారు. 2017–2022 కాలంలో పనిచేసిన నలుగురు డీఎంలకు ప్రత్యక్షపాత్ర ఉంది. మొత్తం 32 మంది స్వాహా పర్వంలో భాగస్వాములయ్యారు. వారిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు. మిగిలిన వారంతా ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు. ఈ తతంగం మొత్తం బ్యాంకు ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైంది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టం ఓటీపీ ద్వారా నగదు కాజేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో అవినీతి వ్యవహారానికి సంబంధించి మూడువారాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రజాధనం స్వాహా విషయం ఒక కొల్కికి వచ్చింది. అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు 2017–2022 వరకూ రూ.40 కోట్లు దారి మళ్లించారని నిర్ధారణైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు పాత్రధారులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చారు. డీఎం స్థాయి అధికారుల బరితెగింపే అందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ప్రభుత్వ చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడం విశేషం. జిల్లా మేనేజర్‌గా పనిచేసిన కృష్ణారెడ్డి, కొండయ్య, రోజ్‌మాండ్, పద్మ ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నట్లు స్పష్టమైంది. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో.. సెప్టెంబర్‌లో ఇంటర్నల్ ఆడిటర్ అక్రమ చలాన్‌ను గుర్తించారు. దానికి చెందిన రికార్డులు కోరడంతో డీఎం కార్యాలయం సక్రమంగా స్పందించలేదు. ఆడిటర్ అనుమానాల నివృత్తి కోసం ప్రయత్నించారు. ఈక్రమంలో డీఎం కార్యాలయాన్ని విజిట్ కోసం వచ్చిన ఎండీ వీరపాండ్యన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన 2021 సంవత్సరం వరకూ ఆడిట్ చేయాలని ఆదేశించారు. దీంతో మరిన్ని దుర్వినియోగ వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. ఇలా ఒక్కో ఏడాది ఆడిట్ చేసుకుంటూ వెళ్తే రూ.40 కోట్లు స్వాహా జరిగినట్లు గుర్తించారు. అదే కాకుండా మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ (బీజీ) తీసుకోవాల్సింది ఉంది. అయితే ఆ స్థానంలో రూ.14.91 కోట్లు పోస్టు డేటెడ్ చెక్కులు తీసుకున్నారు. ఆ మొత్తం కూడా స్వాహా చేశారా? ఆ స్థానంలో చెక్కులు మాత్రమే తీసుకున్నారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇదివరకే 11 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో 32 మందికి ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు ప్రభుత్వ లావాదేవీలు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారానే జరగాలి. పైగా వివిధ లావాదేవీలకు అనుగుణంగా డీఎం బ్యాంకు అకౌంట్లు విడివిడిగా ఉండడం తప్పనిసరి. ఇవేమీ పట్టించుకోకుండా సింగిల్ అకౌంట్ మీద లావాదేవీలు నడిపారు. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీతో నిమిత్తం లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పక్కదారి పట్టించారు. ఆ సమయంలో పనిచేసిన డీఎం స్థాయి అధికారి, బ్యాంకర్ కుమ్మకై ఓటీపీ ద్వారా నగదును పక్కదారి మళ్లించారు. పెద్దమొత్తంలో చెల్లింపు చేపట్టగా దీనికి బ్యాంకర్లు పక్కాగా సహకరించారు. వారి ప్రమేయం ఎంత ఉందో పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. ఇంటర్నల్ ఆడిటర్ల సహకారం డీఎం కార్యాలయంలో ఇంటర్నల్ ఆడిటర్ల సహకారంతో ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అవినీతి వ్యవహారం నడించింది. డీఎం తన ఖాతాకు వచ్చిన మొత్తం, ఆ ఖాతా నుంచి చేపట్టిన చెల్లింపులకు సంబం«ధించి అందించిన నివేదిక ఆధారంగా ఇంటర్నల్ ఆడిటర్లు సంతకాలు చేసుకుంటూ వెళ్లారు. నిబంధనలు మేరకు చెల్లింపులు చేశారా? ఆ మేరకు ఆక్విడెన్స్లు ఉన్నాయా? అర్హులకే ఆ మొత్తం చేరిందా? ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు. దీనిని బట్టి ఇంటర్నల్ ఆడిటర్ల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురి అరెస్ట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి వ్యవహారానికి సంబంధించి పోలీసులు గురువారం రాత్రి సూత్రధారితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు గతనెల 14వ తేదీన 11 మందిపై కేసు నమోదు చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఏఎస్పీ, వేదాయపాళెం పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురు అధికారులు, సిబ్బంది పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలు వారికోసం గాలించాయి. ప్రధాన సూత్రధారి ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివకుమార్‌తోపాటు కేసుతో సంబంధం ఉన్న పవన్, రాజాలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో కీలక సమాచారాన్ని సేకరించారు. ఆ ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు. సీఐడీ లేదా విజిలెన్స్ విచారణకు సిఫార్సు ‘సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో రూ.40 కోట్లు స్వాహా చేశారు. 2017–2022 వరకూ ఆడిట్ పూర్తి చేసి నివేదిక అందించాం. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ లేదా సీఐడీ విచారణ చేపట్టాల్సిందిగా కోరాం.’ అని జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో 32 మందికి ప్రత్యక్ష్య ప్రమేయం ఉందన్నారు. వారిలో నలుగురు డీఎంలతో సహా 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, ఇదివరకే 11 మందిపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఫ్రీజ్ చేయించామని చెప్పారు. ఎలాంటి క్రయవిక్రయాలు చేపట్టకుండా కట్టడి చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు సిఫార్సు చేశామన్నారు. ఇంత పెద్దఎత్తున గోల్మాల్ వ్యవహారాన్ని గుర్తించుకుండా చూసీచూడనట్లు వ్యవహరించిన, గతంలో ఆడిట్ నిర్వహించిన ఇంటర్నల్ ఆడిటర్లపై చర్యలకు సిఫార్సులు చేశామన్నారు. అందుబాటులో రికార్డుల మేరకు ఇప్పటి వరకూ రూ.40 కోట్ల మేర అవినీతి జరిగిందని బహిర్గతమైందన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి, ఎంత మొత్తం దేనికి మంజూరైంది, ఎవరికి చెల్లించారు? ఇంకా ఏమైనా నిధులు స్వాహా అయ్యాయా? తదితర విషయాలు బహిర్గతం కావాల్సి ఉందన్నారు. -
పచ్చపత్రిక మాయాజాలం
నెల్లూరు టౌన్: వర్షం కారణంగా సంగం మండలంలోని కొరిమెర్ల ఉన్నత పాఠశాల ఉరుస్తుందని తలపై ప్లేట్లు పెట్టుకొని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఓ పత్రికలో వచ్చిన కథనం దాని దిగుజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. తలపై ప్లేట్లు పెట్టుకోమని అమాయకులైన బాలబాలికలకు చెప్పి ఫొటోలు తీసుకుని తప్పుడు రాతలు రాసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నా రు. పాఠశాలలోని భోజన శాలలో ఎంతటి తుపాన్, వర్షం వచ్చినా నీరు కారే అవకాశమేలేదని చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా బుధవారం జోరు వర్షం వస్తున్నా.. పిల్లలను భోజనశాలలో కూర్చోబెట్టి భోజనం పెడుతున్న ఫొటోలను విద్యాశాఖ మీడియాకు విడుదల చేసింది. మంగళవారం జోరు వర్షం వస్తుండడంతో పిల్లలు వేరే దారి నుంచి భోజనశాలకు వచ్చారని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే పచ్చపత్రికపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అభూత కల్పన కొరిమెర్ల పాఠశాలలో వర్షం వస్తే వరండాలో ఓ వైపు ఉరుస్తుంది. పాఠశాలలోని గదుల నుంచి భోజన శాలకు వెళ్లే దారిలో ఎక్కడా వర్షం పడదు. దీని వల్ల తలలపై ప్లేట్లు పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఓ పత్రిక విలేకరి పిల్లలను తప్పుదోవ పట్టించి ఆ దారిన తీసుకెళ్లి ఫొటోలు తీసి వార్త రాశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జానకిరామ్, కొరిమెర్ల,జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ, సంగం -
ఉపాధి అభివృద్ధి.. మూడు జాతీయ స్థాయి అవార్డులు
ఉపాధి కూలీలకు జీవనోపాధి కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధిలో జిల్లా దూసుకెళ్తోంది. మెటీరియల్ కాంపోనేట్తో గ్రామీణాభివృద్ధిలో భాగంగా పది రకాల భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఏడాదిలో సుమారు 1.20 కోట్ల పని దినాలు కల్పించడం, అభివృద్ధే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించారు. నెల్లూరు (పొగతోట): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి నిధులతో 10 రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఉపాధి హమీ పథకం ద్వారా రూ.1,419.38 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు రూ.828.95 కోట్లు వేతనా ల రూపంలో చెల్లించారు. మెటీరియల్ కాంపో నేట్ ద్వారా రూ.590.43 కోట్లు ఖర్చు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీరోడ్లు, సీసీ డ్రెయిన్లు, రైతుభరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, సచివాలయాలు, బల్క్ మిల్క్ సెంటర్స్ తదితర భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనులు హాజరయ్యే కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.252 వేతనం చెల్లించాల్సి ఉంది. రూ.252 వేతనం కూలీకి చెల్లిస్తే రూ.171 అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంజూరు చేస్తున్నారు. జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు గ్రామాల్లో అవసరం పనులను ఉపాధి హామీ సిబ్బంది ద్వారా గుర్తించి ప్రతి వారం ఆయా పనులను అప్లోడ్ చేస్తున్నారు. గుర్తించి పనులకు కూలీలు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత నింబంధనల ప్రకారం గుర్తించిన పనులను పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. ఉపాధి పని దినాలు కల్పించడంలో జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.29 కోట్ల పనిదినాలు కల్పించారు. కూలీలకు వేతనం ద్వారా రూ 266.96 కోట్లు, మెటీరియల్ కాంపోనేట్కు రూ.132.13 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు వారి బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అవుతుంది. కూలీలు ఉదయం 6 గంటలకు వచ్చి 10.30లోపు ఉపాధి పనులు పూర్తి చేసుకుని వెను తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు అధికంగా జరిగే రోజుల్లో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తక్కువగా ఉంటుంది. రాపూరు, వింజమూరు, వరికుంటపాడు, ఉదయగిరి తదితర మండలాల్లో ఉపాధి పనులు అధికంగా జరుగుతున్నాయి. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచి నిర్దేశించిన వేతనం మంజూరు చేయించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు క్రమం తప్పకుండా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సూచనలు సలహాలు ఇస్తున్నారు. డ్వామా పీడీ , అడిషనల్ పీడీ నిర్మలారెడ్డి నిత్యం మండల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌లో నిర్వహించి ఉపా«ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. 1.20 కోట్ల పని దినాలే లక్ష్యం జిల్లాలోని 37 మండలాల్లో 722 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 4.43 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలు ఉన్నారు. ప్రతి రోజు 50 నుంచి 60 వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. గతేడాది 90 వేల నుంచి లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిలో 82 లక్షల పనిదినాలు జిల్లాకు కేటాయించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు 1.10 కోట్ల నుంచి 1.20 కోట్ల పని దినాలు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య తక్కువగా ఉంది. ఉపాధి పనులతో అభివృద్ధి పనులతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి కూలీకి రూ.252 వేతనం వచ్చేలా పనులు చేయిస్తున్నారు. ఉపాధి పనులు అధికంగా జరిగి కూలీలకు వేతనం అధికంగా చెల్లిస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. కూలీలకు నిర్దేశించిన వేతనం చెల్లించేలా చర్యలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి కూలీలకు రూ.252 వేతనం చెల్లించేలా చర్యలు చేపట్టాం. ఉపాధి పనులు అధికంగా జరిగితే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. సీసీ రోడ్లు, ఆర్బీకేలు, అంగన్వాడీ భవనాలు తదితర భవన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 82 లక్షల పని దినాలు కల్పించమని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు కల్పించాం. ఉపా«ధి పనులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు అధికంగా చేపట్టే అవకాశం ఉంది. – వెంకట్రావ్, డ్వామా పీడీ -
ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి ప్రత్యక్షం
నెల్లూరు రూరల్: వరకట్న వేధింపులతో జైలుపాలై ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి శుక్రవారం నెల్లూరులో ప్రత్యక్షయ్యాడు. జిల్లాలోని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే శివకుమార్‌సింగ్ నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు పోలీసు కాలనీలోని అపార్ట్మెంట్లో నివశిస్తుండేవాడు. మొదటి భార్య నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న అతను తిరిగి గుంటూరుకు చెందిన సుభాషిణిని రెండో వివాహం చేసుకుని పోలీసు కాలనీలో ఉంటుండేవాడు. రెండో భార్యతో కూడా వివాదాలు తలెత్తడంతో ఆమె మహిళా పోలీసుస్టేషన్లో శివకుమార్‌సింగ్‌పై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుగా ఉండి జైలులో గడపడంతో భార్య సుభాషిణిపై తీవ్రంగా మనస్తాపం చెందాడు. రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యాడు. దీంతో రెండో భార్య సుభాషిణి సోదరుడు తులసీరామ్‌సింగ్ నెల్లూరు రూరల్ పోలీసులకు 2016లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో సుభాషిణి గుంటూరుకు వెళ్లి అక్కడే ఉంటుంది. అదృశ్యమైన అతడిని ఈ ఏడాది జూలైలో కేరళలోని ఓ సేవాసంస్థ వారికి కనిపించాడు. అనారోగ్యంతో ఉన్న అతడికి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. తాను నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు వారికి చెప్పాడు. దీంతో సేవాసంస్థ ప్రతినిధి అతడిని వెంటబెట్టుకుని నెల్లూరు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నిండుకుండల్లా జలవనరులు.. రబీకి జలసిరులు
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జలసిరులు తాండవిస్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా చెరువులు, ప్రాజెక్ట్‌ల్లో నీరు పుష్కలంగా ఉంది. నదులు పొంగిపొర్లుతున్నాయి. జలవనరుల్లో నీటి లభ్యతనుసరించి ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు అంచనాలకు తగినట్లుగా కేటాయించిన సాగునీటి వినియోగం తగ్గింది. జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు ఏ మాత్రం తగ్గకపోవడంతో పాటు, కార్తెలకు తగినట్లుగా వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వలకు కొదవలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కేటాయించిన నీటి వినియోగం జరగలేదు. తాజాగా రబీకి నీటి కేటాయింపులను ఆదివారం ఐఏబీ సమావేశంలో నిర్ణయించనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జిల్లాలో నీటికి కొరతే లేదు. జలాశయాలు పూర్తి సామర్థ్యానికి చేరుకుంటున్నాయి. రైతుల్లో నీటి గురించి ఏ మాత్రం చింత లేదు. సోమశిల, కండలేరు ప్రాజెక్ట్‌లతో పాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజీ పూర్తయిన తర్వాత జరిగే మొట్టమొదటి ఐఏబీ సమావేశం. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 66.192 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఆరంభంలోనే సోమశిల 76 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు భారీగా వరద రావడంతో అంతే సామర్థ్యంలో నీటిని పెన్నానది ద్వారా సముద్రానికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం 45,885 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు వచ్చే వరద నీటిని సమన్వయం చేసుకుంటూ డిసెంబర్ నెలకు 78 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డెడ్ స్టోరేజీ, తాగునీటి అవసరాలు, రాళ్లపాడు జలాశయం, నీటి ఆవిరి శాతం పోనూ మొత్తం 65.102 టీఎంసీల నీటిని రబీ సీజన్లో ఇప్పటికే స్థిరీకరించిన ఆయకట్టుతో పాటు తాజాగా స్థిరీకరించిన అదనంగా 55.1000 ఎకరాలకు నీటిని అందించనున్నారు. పది వేల ఎకరాలకు ఒక టీఎంసీ అందించే అవకాశం ఉంది. దీన్ని బట్టి సోమశిల కింద సుమారు 6.50 లక్షల ఎకరాలు సాగునీటిని అందించనున్నారు. కండలేరు కింద 3.50 లక్షల ఎకరాలు కండలేరు జలాశయంలో ప్రస్తుతం 53.852 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డిసెంబర్ నాటికి డెడ్ స్టోరేజీ నీటి ఆవిరి మినహా 60.854 టీఎంసీలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుగంగ పథకం కింద చెన్నై నగరానికి నీటి సరఫరాతో పాటు నెల్లూరు జిల్లాలో 74,436 ఎకరాలకు, తిరుపతి జిల్లాలో 1,72,423 ఎకరాల మెట్ట భూములతో పాటు చెరువుల కింద 1.08,357 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. చెన్నై తాగునీటి అవసరాలకు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు, స్వర్ణముఖి బ్యారేజీకి తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు నీటిని కేటాయించనున్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా పరిషత్‌లో 10 గంటలకు సాగునీటి సలహా మండలి సమావేశం కానుంది. నీరు సమృద్ధిగా ఉండడంతో ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. -
విషాద జీవితాల అనాథ బిడ్డలకు ‘అమ్మఒడి’ ఆలంబన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ బిడ్డలు చేసిన పాపం ఏమిటో వారెవరికీ తెలియదు. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే అనాథలయ్యారు. అమ్మ ఆప్యాయత, నాన్న అనురాగానికి దూరమయ్యారు. వారిని ‘దాతృత్యం’ అక్కున చేర్చుకుంది. కన్నబిడ్డల కంటే మిన్నగా ఆదరించి కడపు నింపింది. అయితే దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. పాలకులు మారినా ఇటువంటి వారికి అందరి మాదిరిగానే ప్రభుత్వ పథకాలకు అర్హులైనా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానవత్వం, ప్రభుత్వ యంత్రాంగం చొరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయాన్ని కదిలించింది. హృదయాలు ద్రవించే విషాద జీవితాల అనాథ బిడ్డలకు ఒక్క సంతకం ‘అమ్మఒడి’ ఆలంబనగా నిలిచింది. తల్లిదండ్రుల స్థానంలో దేవుళ్ల పేరు పాఠశాలలో చేరే విద్యార్థులకు తల్లిదండ్రులు పేర్లు, మతం, కులం తప్పనిసరిగా పొందుపర్చాల్సింగా స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ బిడ్డలకు దేవుళ్లే తమ తల్లిదండ్రులుగా భావించి (సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి) వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో ఎస్ఎస్సీ పరీక్షల్లో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేయడంతో తల్లి పేరు కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన విద్యార్థులు చివరకు తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తుల్లో నమోదు చేసుకుంటున్నారు. సంక్షేమానికి దూరంగా అనాథ బాలబాలికలు రాష్ట్ర ప్రభుత్వం విద్యావిప్లవాన్ని తీసుకొచ్చింది. పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. నాడు–నేడు పథకంతో మౌలిక వసతులను సమకూర్చింది. అర్హులైన విద్యార్థులు పాఠశాలల్లో ఉండాలనే సంకల్పం తీసుకుంది. ఇంతటి మహోన్నత ఆశయంలో కూడా అనాథ బాలబాలికలకు ‘అమ్మఒడి’ అర్హత లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్ కార్డు తప్పనిసరిగా అయ్యాయి. ఎవరో దాత దాతృత్వంతో బతికే వీరికి కులం, ఆదాయ ధ్రువీకరణ, గుర్తింపు కార్డులు గగనమయ్యాయి. దీంతో అర్హులైనప్పటికీ అమ్మఒడి వర్తించడంలేదు. ఫలించిన ఎంపీ వేమిరెడ్డి కృషి వాత్సల్య అనాథాశ్రమ నిర్వాహకులు ఈ పరిస్థితిని ఓ వైపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తూనే మరోవైపు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలబాలికల విద్యకోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణంలో అనాథలకు అమ్మఒడి పథకం వర్తించకపోవడాన్ని విని చలించిపోయారు. కలెక్టర్‌తో చర్చించి నివేదికను రూపొందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 227 మంది అనాథ బాలబాలికలు అమ్మఒడికి అర్హులుగా తేల్చారు. అదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాతో సరిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమాల్లో ఉంటూ చదుకుంటున్న అనాథ బాలబాలికలు వివరాలపై నివేదిక కోరారు. ఆ విధంగా 5,990 మంది అనాథ విద్యార్థులకు రూ.7.787 కోట్లు విడుదల చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లెటర్ నంబర్.1768275/2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు నెల్లూరు జిల్లాలోని అనాథ బాలబాలికలకు రూ.29.51 లక్షలు విడుదలయ్యాయి. నెల్లూరులో బీజం.. అనాథ బిడ్డలకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలనే ఆలోచనకు నెల్లూరులో బీజం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న అందరికీ వర్తించింది. నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రమం పొందుతున్నారు. దాతల దాతృత్వంలో నడిచే ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో భారతీయ విద్యా వికాస్ పేరుతో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను నిర్వహిస్తోంది. ఆ పాఠశాలలో విద్యను అభ్యసించే ఇతర విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తిస్తోంది. అనాథలుగా ఉన్న విద్యార్థులకు వర్తించడం లేదు. ఇదే విషయం జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ చక్రధర్‌బాబు చొరవతో ఇటువంటి అనాథలను జిల్లా వ్యాప్తంగా 227 మందిని గుర్తించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో అమ్మఒడి పథకం వర్తించింది. జిల్లా నుంచి వెళ్లిన సిఫార్సులను పరిశీలించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథ బాలబాలికలకు 5,590 మందికి రూ.7.787 కోట్లు అమ్మఒడి నిధులు మంజూరయ్యాయి. అనాథలకు ఎంతో ఉపయోగం చదువుకు సర్కార్ తోడ్పాటునిస్తోంది. అమ్మఒడి చక్కటి పథకం. ఎంతో కాలంగా అనాథ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాం. మా అభ్యర్థను కలెక్టర్ మన్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చొవర కారణంగా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న ముఖ్యమంత్రి అని చాటుకున్నారు. ఆశ్రమాలు నిర్వహణకు అమ్మఒడి తోడ్పాటు కానుంది. – జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమం సంస్థాగత కార్యదర్శి సమాజంలో వారికి గుర్తింపు సమాజంలో అనా«థలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనా«థల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయింది. కేవలం దాతల దాృతత్వంతోనే జీవనం సాగిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం స్పందించింది. అమ్మ ఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షనీయం. అనా«థలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. వారిని చేరదీసి ప్రయోజకుల్ని చేయాలి. – సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు -
సరికొత్తగా.. తైవాన్ నిమ్మ
తైవాన్ జామ.. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం పల్లెల్లో ప్రాచుర్యంలోకి వచ్చి రైతులు సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. రైతులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు సాగుకు శ్రీకారం చుట్టగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు. పొదలకూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో సైదాపురం, పొదలకూరు, వెంకటగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో తైవాన్ నిమ్మ సాగు తక్కువ విస్తీర్ణంలో జరుగుతోంది. సాధారణ నిమ్మతోటల్లో రెండు నెలలు కాపు కాస్తే మరో రెండు నెలలు ఉండదు. తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. చెట్టుకు ఓ వైపు కాయలు ఉంటే మరో వైపు పూత ఉంటుంది. గుత్తులుగా కాపు ఉంటే కోసేందుకు కూలీలకు సులువుగా ఉంటుంది. సాధారణ నిమ్మతోటల్లో మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత దిగుబడి వస్తే తైవాన్ రకం నిమ్మకు సంబంధించి ఏడాది పూర్తయిన వెంటనే దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణ రకం ఎకరానికి 100 మొక్కలు పడితే తైవాన్ రకంలో 300 మొక్కలు నాటుకునేందుకు అవకాశం ఉంది. ఫలితంగా చిన్నా సన్నకారు రైతు కూడా దిగుబడిని పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం కడియం, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి రైతులు తైవాన్ నిమ్మ మొక్కను రూ.100 వెచ్చించి తీసుకొస్తున్నారు. గుర్తింపు లేదు తైవాన్ సాగుకు సంబంధించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు, నిమ్మ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించిన తర్వాతే ఈ నిమ్మ సాగుపై స్పష్టత వస్తుంది. పొదలకూరు మండలం పార్లపల్లిలో రెండెకరాల్లో ఓ రైతు తైవాన్ నిమ్మ సాగు చేస్తున్నారు. అలాగే పులికల్లు, వావింటపర్తి, ప్రభగిరిపట్నం, కనుపర్తి గ్రామాల్లో సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. మార్కెటింగ్ ఎలా? తైవాన్ నిమ్మ దిగుబడి వస్తే మార్కెటింగ్ చేసుకునే విషయంలో సమస్యలు ఎదురవుతాయని రైతులు భావిస్తున్నారు. పొదలకూరు ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డుకు ఎగుమతుల్లో రాష్ట్రస్థాయిలో పేరుంది. ఇక్కడి నుంచి ప్రతినిత్యం పదుల సంఖ్యలో లారీల్లో ఢిల్లీ మార్కెట్‌కు ఎగుమతులు జరుగుతుంటాయి. అక్కడి వ్యాపారులు తైవాన్ నిమ్మను స్వీకరిస్తారా? లేదా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగు చేసేందుకు సమాయత్తమవుతున్న రైతులు వ్యాపారులతో చర్చిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసక్తి ఉంది సాధారణ రకం నిమ్మ సాగు కంటే తైవాన్ నిమ్మ సాగుపై ఆసక్తి పెరిగింది. పార్లపల్లికి వెళ్లి తోటను పరిశీలించాను. సాగుకు అనుకూలంగానే ఉండడంతోపాటు యాజమాన్య పద్ధతుల ఖర్చు తక్కువగా ఉంది. ప్రస్తుతం ఒక ఎకరాలో సాగు చేసి దిగుబడి, మార్కెటింగ్ సమస్యలు లేకుంటే విస్తీర్ణం పెంచుతాను. – సీహెచ్ రమేష్, రైతు, నావూరుపల్లి అవగాహన లేదు తైవాన్ నిమ్మకాయలు ఇప్పటి వరకు మార్కెట్‌కు రాలేదు. పూర్తిగా అవగాహన కూడా లేదు. నిమ్మ మార్కెట్‌ను శాసించే ఢిల్లీ మార్కెట్ వ్యాపారులు ఈ రకాన్ని తీసుకుంటారో లేదో తెలియదు. మార్కెట్‌కు వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. – ఎం.బాలకృష్ణారెడ్డి, నిమ్మమార్కెట్ వ్యాపారి, పొదలకూరు స్వల్పంగా సాగు చేస్తున్నారు తైవాన్ నిమ్మ రకం సాగు స్వల్పంగా ఉంది. పార్లపల్లిలో రెండెకర్లో సాగు చేస్తుండగా, మరో ఐదారు గ్రామాల రైతులు మొక్కలు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. వాటి చీడపీడలపై అవగాహన కోసం నిమ్మ శాస్త్రవేత్తలతో మాట్లాడాం. వారు పరిశోధనలు చేస్తున్నామని ఇప్పటికిప్పుడు సాగు చేసుకోవచ్చని చెప్పలేమన్నారు. సాధారణ నిమ్మ సాగులా తైవాన్ రకం కూడా ఎలాంటి నేలల్లోనైనా వస్తుంది. కాయ సైజు కూడా సాధారణ రకం కంటే పెద్దదిగా ఉంటుంది. – ఈ.ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు -
మెట్ట భూములకు పాతాళగంగ
మెట్ట ప్రాంతాల్లో పారుదల నీటి వసతిలేని సన్న, చిన్న కారు రైతుల పొలాలకు పాతాళ గంగను అందిస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో గడిచిన మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న రైతుల పొలాల్లో ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేస్తోంది. నిపుణుల ద్వారా హైడ్రో, జియాలజికల్, జియోఫిజికల్ అన్వేషణతో జలవనరులను గుర్తించి బోరుబావుల తవ్వకానికి అనుమతులు మంజూరు ఇస్తోంది. తద్వారా మెట్ట భూముల్లో రైతులు సిరులు పండించుకోగలుగుతున్నారు. నెల్లూరు (పొగతోట): మెట్ట ప్రాంతాల్లో జలసిరులు అందించి రైతులు సిరులు పండించేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళను ప్రారంభించింది. ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు, మర్రిపాడు, అనంతసాగరం వంటి మెట్ట ప్రాంతాల్లోని బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ జలకళ ఉపయోగపడుతోంది. ఉదయగిరి, ఆత్మకూరు, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో మెట్ట భూములు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాధారంపైనే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ జలకళ పథకాన్ని రైతుల దరిచేర్చేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పథకంపై రైతులకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంది. 2.5 ఎకరాల భూమి కలిగిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతుకు ఒకే ప్రాంతంలో 2.5 ఎకరాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి గతంలో బోరు లేకుండా ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు. 2.5 ఎకరాల విస్తీర్ణం లేని రైతులు పక్క రైతుతో కలిపి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. చిన్న, సన్న కారు రైతులకు (కుటుంబానికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన) బోరుతో పాటు విద్యుత్ కనెక్షన్ మోటారు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. 5 ఎకరాల కంటే అధికంగా భూమి కలిగిన కుటుంబాలకు బోరు మాత్రమే తవ్విస్తోంది. అర్హులైన రైతులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. పంచాయతీ పరిధిలోని క్షేత్ర సహాయకులు, వలంటీర్లు దరఖాస్తు నమోదుకు రైతులకు సహాయపడుతున్నారు. నియోజకవర్గానికి ఒక డ్రిల్లింగ్ యంత్రం జలకళ పథకం ద్వారా బోర్లు వేసేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్ యంత్రాలను జిల్లాకు కేటాయించింది. ప్రస్తుతం ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో బోర్లు వేయడం ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గంలో రెండు రోజుల్లో వైఎస్సార్ జలకళకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు వేగవంతం చేసి బోర్ల తవ్వకానికి అధికారులు అనుమతులు ఇస్తున్నారు. భూగర్భ జలమట్టం అధిక స్థాయిలో ఉన్న రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలుకాదు. హైడ్రో, జియాలజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించిన అనంతరమే బోరు బావుల తవ్వకానికి అనుమతి మంజూరు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 3 వేలకు పైగాదరఖాస్తులు అధికారులకు అందాయి. వాటిలో సర్వే పూర్తి చేసి సుమారు 2 వేల బోర్లకు అనుమతి మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ 11.64 కోట్ల ఖర్చుతో 1,343 బోర్లు పూర్తి చేశారు. కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానం వైఎస్సార్ జలకళ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయిస్తుంది. దరఖాస్తుతో పాటు రైతు పాస్‌ఫొటో, పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలతో సచివాలయం లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం మరొక పర్యాయం కల్పించింది. పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రైతుల ఫోన్ నంబర్లు దరఖాస్తులో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి బోరు డ్రిల్లింగ్ చేసేంత వరకు ప్రతి సమాచారాన్ని రైతులకు అందించనుంది. రైతులు దరఖాస్తులు చేసుకోవాలి పేదల రైతుల పొలాలను సాగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జలకళను అమలు చేస్తోంది. బోరు కావాల్సిన అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. రైతులు ఇబ్బందులు పడకుండా సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకునే వేసులబాటును ప్రభుత్వం కల్పించింది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వెంకట్రావు, డ్వామా పీడీ -
హస్తకళా వైభవం.. చెక్క కళ భళా!
ఉదయగిరి(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాచరిక సామ్రాజ్య కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో ఇప్పుడు ఆ ప్రాభవ వైభవం కనిపించకపోయినా హస్తకళా వైభవానికి కొదువ లేదు. చెక్కపై చెక్కిన కళాత్మక వస్తువులు తయారు చేస్తున్న ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ఉదయగిరి దిలావర్‌భాయి వీధిలోని హస్తకళల అభివృద్ధి కేంద్రంగా తయారయ్యే వస్తువులకు ఖండాంతర ఖ్యాతి ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తకళ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 150 కుటుంబాలకు జీవనోపాధి చెక్క నగిషీ వస్తువుల తయారీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందిస్తుండడంతో ప్రస్తుతం 150 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వందేళ్లకు పూర్వం ఒకట్రెండు కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగించాయి. ఉదయగిరి హస్తకళల కేంద్రంతో తయారయ్యే వివిధ రకాల వస్తువులకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు పొందింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన చేతివృత్తుల ఎగ్జిబిషన్లో ఉదయగిరి కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి అబ్బురపడి ప్రశంసలు అందించారు. కళకు ప్రాణం పోసిన అబ్దుల్‌బషీర్ తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న షేక్ అబ్దుల్‌బషీర్ తన 24వ ఏట ఈ వృత్తిలోకి ప్రవేశించి వివిధ రకాల వస్తువులను తయారు చేయం ప్రారంభించారు. దీనిపై ఇతరులు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తన ఇద్దరు కుమార్తెలు గౌసియాబేగం, ఫాయిదాలకు నేర్పించారు. 2003లో 15 మంది సభ్యులు సంఘంగా ఏర్పడి చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉడెన్ కట్టరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి హ్యాండ్‌క్రాఫ్ట్స్ మినిస్టరీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్థిక సాయం అందించారు. ప్రశంసల జల్లులు ఈ కళకు ఊపిరిపోసిన అబ్దుల్బషీర్కు లేపాక్షి, హస్తకళల అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు బహుమతులు అందజేశారు. ఆయన కూతురు షేక్ గౌసియాబేగంకు కూడా ఇదే సంస్థ ఆమె ప్రతిభను గుర్తించి వివిధ బహుమతులు అందించారు. తాజాగా కేంద్రం నిర్వాహకురాలు షేక్ గౌసియాబేగంకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులు మంజూరు చేసింది. 200 రకాలు పైగా వస్తువుల తయారీ ఉదయగిరి దుర్గం, కొండ ప్రాంతాల్లో లభించే లద్ది, బిల్లనద్ది, కలువ, బిక్కి, దేవదారు తదితర అటవీ కర్రను ఉపయోగించి ఈ వస్తువులు తయారు చేస్తారు. ఈ కొయ్య ద్వారా స్పూన్లు, ఫోర్కులు, అట్లకర్ర, గరిటెలు, డైనింగ్ టేబుల్స్, ఫొటో ఫ్రేమ్స్, పిల్లలు ఆడుకునే వివిధ రకాల వస్తువులు, వివిధ వస్తువులు నిల్వ చేసుకునేందుకు ఉపయోగించే ట్రేలు, చిన్న గిన్నెలు, ప్లేట్లు, దువ్వెనలు తదితర 200 రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ వృత్తిలో ముస్లిం మహిళలే అత్యధికంగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రాంగణంలోనే కొత్త భవనం ఏర్పాటు చేసి ఆధునిక మెషిన్లు సమకూర్చాలి. తద్వారా ఎక్కువ మంది ఈ వృత్తిలోకి ప్రవేశించి తమ ఆదాయం పెంచుకునే వీలుంటుంది. – షేక్ గౌసియా బేగం -
AP: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి.. బడికి నిధుల వెల్లువ
టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్కారు పాఠశాలల నిర్వహణను గాలికొదిలేశారు. వాటి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టి బడుల రూపురేఖలు మార్చేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు(టౌన్): పాఠశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఖర్చు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా నిధులు విడుదల చేసేవారు. అది కూడా విద్యాసంవత్సరం ముగిసే సమయంలో వచ్చేవి. ఒక్కోసారి రెండేళ్ల నుంచి మూడేళ్లు వరకు కూడా నిధులు విడుదల చేసేవారు కాదు. దీంతో స్కూళ్ల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో నుంచి డబ్బు తీసి ఖర్చు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పరిస్థితి మారింది. సకాలంలో నిధులను కేటాయించి విడుదల చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో అండగా నిలిచారు. తక్షణ గ్రాంట్ కింద.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 3,343 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.8,88,45,000 గ్రాంట్‌ను మంజూరు చేసింది. తక్షణం గ్రాంట్ కింద రూ.1,77,69,000ను ఇటీవల విడుదల చేసింది. కాంపోజిట్ గ్రాంట్స్‌ను పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. 1 నుంచి 30 మంది ఉండే స్కూల్‌కి రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది ఉంటే రూ.75 వేలు, 1,000 మందిపైన ఉండే బడికి రూ.లక్ష ఇస్తారు. ఈ నిధులను విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, వాటర్ బిల్లులు, మైనర్ రిపేర్స్ తదితర వాటికి ఖర్చు చేయాలి. ఎమ్మార్సీలకు ఇలా.. మండల రీసోర్స్ సెంటర్లకు నిధులు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 47 మండల రీసోర్స్ సెంటర్లున్నాయి. ఒక్కో దానికి రూ.70 వేలు చొప్పున రూ.32.90 లక్షలను ఇచ్చారు. ఎమ్మార్సీల నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, టెలిఫోన్లు, కంప్యూటర్ల నిర్వహణ తదితర వాటికి నగదును ఖర్చు చేయనున్నారు. సీఆర్సీలకు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 318 స్కూల్ కాంప్లెక్స్‌లున్నాయి. ఒక్కో దానికి రూ.19 వేలు చొప్పున రూ.60.42 లక్షలు నిధులను విడుదల చేశారు. అదే విధంగా ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌కు మొబైల్ సపోర్ట్ టు సీఆర్సీ కింద రూ.1,000 రూ.3.18 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని మొత్తం 318 స్కూల్ కాంప్లెక్స్‌లకు రూ.63.60 లక్షల నిధులను విడుదల చేసింది. దీనిపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూసీలు అందజేయాలి పాఠశాలలకు విడుదల చేసిన కాంపోజిట్ గ్రాంట్స్ ఖర్చులపై యుటిలైజేషన్ సర్టి ఫికెట్లను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందజేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా మున్సిపల్ స్కూళ్లకు కూడా కాంపోజిట్ నిధులను విడుదల చేశారు. ఇప్పటికే స్కూల్ మెయింటెనెన్స్, టాయ్‌లెట్ గ్రాంట్స్‌ను ఆయా పాఠశాలలకు అందజేశాం. స్కూల్ కాంప్లెక్స్‌ల అభివృద్ధికి దోహదపడాలి. – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష -
సీఎం జగన్ పాలనలో వలసల్లేవు
ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసమే రాష్ట్ర ప్రజలు బయటకు వెళుతున్నారు తప్ప, బతకడానికి పనుల కోసం వలసలు వెళ్లేవారు లేరని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మండలంలోని రాముడుపాళెం వచ్చారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు బెంగళూరు, కేరళ, చెన్నై వంటి ప్రాంతాలకు దినసరి కార్మికులుగా వలసలు పోయారని వాపోయారు. జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో 38 లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారన్నారు. సీఎం చెప్పిన విధంగా ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలను నెరవేరుస్తున్నారన్నారు. రైతాంగానికి మరింత పెద్ద పీట వేశారని చెప్పారు. ప్రతి ఏటా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, పునర్ నిర్మా ణం చేస్తున్నారన్నారు. గతంలో ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ.2లకు ఇవ్వాలని అప్పటి ఎంపీ రాజమోహన్‌రెడ్డితో కలిసి మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో వినతిపత్రం అందించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్‌ను రూ.1.50లకే ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. మూడేళ్లలో ఆక్వా రంగానికి రూ.2,400 కోట్ల ఇచ్చారన్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌కు సుమారు రూ.6.50 ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగనన్న కాలనీల్లో 30 లక్షల నివాసాలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఎలాంటి అసమానతలకు తావులేకుండా చేశారని నాగిరెడ్డి కొనియాడారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కైలా సం ఆదిశేషారెడ్డి, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, పెనుబల్లి హనుమంతరావు నాయుడు, గూడూరు ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, షబ్బీర్, కైలాసం శ్రీనివాసులురెడ్డి, పంబాల జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ వైద్యశాలకంటే దీటుగా వైద్య సేవలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు అయ్యాక కార్పొరేట్ వైద్యశాలకంటే దీటుగా వైద్య సేవలు అందిస్తోంది. ఫలితంగా రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వైద్యశాల, కళాశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, పెద్దాస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేసింది. ఈ పరిణామం వైద్యానికి ఊతంగా నిలుస్తోంది. నెల్లూరు (అర్బన్): వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రోగులకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించేందుకు డాక్టర్లను నుంచి నర్సింగ్, పారామెడికల్, పారిశుధ్య సిబ్బంది వరకు ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వేగంగా భర్తీ చేస్తోంది. తాజాగా అభివృద్ధి పనులకు రూ.48.50 కోట్లను మంజూరు చేసింది. ప్రొద్దుటూరుకు చెందిన కేపీసీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ రివర్స్ టెండర్ ద్వారా కాంట్రాక్ట్ పనులు దక్కించుకుంది. ఈ నిధులతో త్వరలోనే పెద్దాస్పత్రిలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. బాయ్స్‌కు, లేడీస్‌కు విడివిడిగా పీజీ హాస్టల్స్, యూజీ హాస్టల్స్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న పల్మనాలజీ వార్డు పైన మరో బ్లాక్‌ను, డెర్మటాలజీ విభాగానికి సంబంధించి మరో అదనపు బ్లాక్‌ను నిర్మించనున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు క్వార్టర్స్ ఏర్పాటు చేయనున్నారు. సీపేజ్ రాకుండా చర్యలు పెద్దాస్పత్రిలో నూతనంగా నిర్మించిన 5 అంతస్తుల భవనంలోని సెల్లార్ అధిక వర్షాలతో ఊట ఉబికి నడుము లోతు నీటితో నిండిపోతుంది. ఫలితంగా అత్యంత ఖరీదైన విద్యుత్ ప్యానెల్స్లోకి వర్షపు నీరు చేరి పెద్దాస్పత్రికి విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది. దీంతో అప్పటికప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంజినీర్లు అత్యంత కష్టపడి రోగులు ఇబ్బంది పడకుండా జనరేటర్లు, ఇతర మార్గాల ద్వారా విద్యుత్‌ను పునరుద్దరించారు. ఆ పరిస్థితి మళ్లీ వర్షాలకు తలెత్తకుండా ఉండేందుకు మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్లు పరిశీలించారు. ప్రొఫెసర్ల నివేదిక మేరకు ప్రస్తుతం రూ.1.50 కోట్ల అంచనాలతో కెమికల్ బాండింగ్ చేపట్టి వర్షపు ఊట రాకుండా అరికట్టనున్నారు. పరికరాల కోసం అదనంగా రూ.5 కోట్లు ఇప్పటికే రేడియాలజీ విభాగానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 6 పీజీ సీట్లను మంజూరు చేసింది. రేడియాలజీ విభాగంలో ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను అదనంగా మంజూరు చేసింది. పీజీ సీట్లు ఎన్ని ఎక్కువ మంజూరైతే అంత మంది స్పెషలైజేషన్ డాక్టర్లు అందుబాటులోకి వచ్చి రోగులకు నాణ్యమైన వైద్యం మరింత ఎక్కువ మందికి అందుతుంది. రూ.3.5 కోట్లతో క్రిటికల్ కేర్ బిల్డింగ్ భవనం కోవిడ్ వంటి అనుకోని ఉపద్రవాలు వచ్చినప్పుడు రోగులు ఇబ్బంది పడకుండా క్రిటికల్ కేర్ యూనిట్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పెద్దాస్పత్రిలో రూ.3.5 కోట్లతో క్రిటికల్ యూనిట్‌ను నిర్మించేందుకు ప్రతి పాదనలు సిద్ధమయ్యాయి. కేంద్ర అధికారుల బృందం అధికారులు ఈ ఏడాది జూలై 12న æ నెల్లూరు పెద్దాస్పత్రిలో స్థలపరిశీలన చేసి వెళ్లారు. అత్యవసర వైపరీత్యాలు సంభవించినప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలో వైద్య సేవలు అందిస్తారు. మిగతా సమయాల్లో లాబోరేటరీ వంటి సాధారణ వైద్యసేవలకు వినియోగించుకుంటారు. ఇవన్ని పూర్తయితే పెద్దాస్పత్రిలో మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలో పనులు ప్రారంభం మెడికల్ కళాశాలతో పాటు అనుబంధ ప్రభుత్వ పెద్దాస్పత్రిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.48.50 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న కేపీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టర్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. పనులు పూర్తయితే మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చి రోగులకు ఎంతో మేలు చేకూరుతుంది. – ఎం. విజయభాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ జిల్లా ఈఈ మెయింటెనెన్స్‌కు మరో రూ. 1.30 కోట్లు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల పెద్దాస్పత్రిని పరిశీలించి డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెయింటెనెన్స్‌కు నిధులు లేవని తెలుసుకున్న మంత్రి కాకాణి ఇందు కోసం ప్రతిపాదనలు తయారు చేయా లని ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్‌ను ఆదేశించారు. దీంతో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ విజయభాస్కర్ రూ.1.30 కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఈ నిధులను రోగులకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ థియేటర్లో ఏసీలు, లిఫ్ట్‌లు, సెంట్రల్ లైటింగ్, పైపుల మరమ్మతులకు వినియోగించనున్నారు. -
అటెండెన్స్ యాప్‌తో డుమ్మాలకు చెక్.. గంటలోనే సమాచారం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మనబడి నాడు–నేడుతో ఎన్నో బడుల రూపురేఖలు మారిపోయాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తెచ్చారు. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందిస్తున్నారు. విద్యాకానుక అందజేస్తున్నారు. బోధనపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు స్కూల్ అటెండెన్స్ యాప్‌ను తెచ్చారు. దీంతో పిల్లలు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం ఉండడంతో వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు బడికి వెళ్లకుండా క్లాసులకు డుమ్మా కొట్టేవారు. దీంతో వారు చదువులో వెనుకంజలో ఉండేవారు. ఈ విషయంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉండేది. విద్యార్థుల హాజరు పక్కాగా ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అటెండెన్స్ యాప్‌ను కొంతకాలం క్రితం ప్రారంభించింది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతితోపాటు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేస్తున్నారు. యాప్‌లో రోజూ ఉదయం 10 గంటల్లోపే వివరాలు నమోదు చేస్తున్నారు. వీరు భోజనం కూడా చేస్తారా లేదా అనే విషయాన్ని మరో విండోలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి హెచ్ఎం లాగిన్ ద్వారా ఆన్లైన్ చేయనున్నారు. ఏమి చేస్తారంటే.. రోజూ అటెండెన్స్ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. విద్యార్థి గైర్హాజరైన సమాచారాన్ని హెచ్ఎం లాగిన్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ విషయం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వెళ్తుంది. అనంతరం హాజరు కాని విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులతోపాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడతారు. అలాగే విద్యార్థి వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే సంబంధిత సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్‌కు సమాచారం పంపుతారు. దీంతో వారు స్వయంగా విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు ఎందుకు గైర్హాజరయ్యారన్న కారణం తెలుసుకుంటారు. రోజూ బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాణించాలంటే.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించి పని ఉన్న సమయంలో తమ వెంట తీసుకెళ్తుంటారు. దీని వల్ల వాళ్లకి చాలా పాఠాలపై అవగాహన ఉండదు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని నిబంధన విధించింది. ఈ విధంగానైనా తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపిస్తారని భావించింది. కాగా విద్యార్థి బడికి వచ్చే బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేయకుండా ప్రభుత్వం అటెండెన్స్ యాప్‌ను తెచ్చింది. దీంతోపాటు రోజూ క్రమం తప్పకుండా స్కూల్‌కి వస్తేనే చదువు మెరుగుపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. వీరు ఉన్నత విద్యలో రాణించాలంటే బేసిక్ లెవల్ గట్టిగా ఉండాలని ప్రభుత్వం భావించింది. పిల్లలు సక్రమంగా బడికి వచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్) బడికి రావాలన్నదే లక్ష్యం ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా బడికి వచ్చి చదువులో రాణించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశారు. పిల్లలపై పర్యవేక్షణకు కొత్తగా అటెండెన్స్ యాప్‌ను అమల్లోకి తెచ్చారు. ఆయా తరగతి టీచర్ హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు కూడా బడికి రెగ్యులర్‌గా వస్తారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – పి.రమేష్, నెల్లూరు డీఈఓ -
జగనన్న తోడుగా.. ఊరూవాడా పండగ
సామాన్య మహిళలను చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తలను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లుగా క్రమం తప్పకుండా అందిస్తున్న ‘వైఎస్సార్ చేయూత’ పథకంతో లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ పథకం నిధులతో పాటు బ్యాంక్ రుణాలు అందించి ఇప్పటికే వ్యాపారవేత్తలుగా మారిన ఎందరో అక్కచెల్లెమ్మలు చేయూత పథకం కార్యక్రమాన్ని ఊరూవాడా పండగలా సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు, çపుష్పాభిషేకాలు చేస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. ప్రధానంగా అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా చేయూత నివ్వాలనే ఉద్దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అండగా ఉంటున్నారు. బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలనే సంకల్పంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని చేపట్టి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద మహిళలు వ్యాపార వేత్తల నుంచి పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఆర్థికంగా ఎంతో చేయూతనిస్తున్నారు. గత నెల 23 నుంచి సంబరాలు గత నెల 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నిత్యం ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత సంబరాలు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాల అభివృద్ధి కోసం తపిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆర్థికంగా ఎదుగుతామని పలువురు మహిళలు ప్రతినపూనారు. పాలాభిషేకాలు.. పుష్పాభిషేకాలు వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో తమ కుటుంబం ఎంతో ఆర్థికంగా ఎదుగుతుందని, గత మూడేళ్లుగా వరుసగా నగదు ఇస్తుండడంతో సంతోషంగా ఉన్నామని పలువురు మహిళలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు, çపుష్పాభిషేకాలు చేస్తున్నారు. 1,23,838 మందికి లబ్ధి వైఎస్సార్ చేయూత పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,23,838 మందికి లబ్ధి చేకూరింది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.18,750 వంతున రూ.232.20 కోట్లను జమ చేశారు. వరుసగా మూడో ఏడాది క్రమం తప్పకుండా నగదు తమ ఖాతాల్లో ముఖ్యమంత్రి వేయడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. -
నెల్లూరు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్: రాష్ట్రంలో మొదటి స్థానం.. దేశంలో రెండో స్థానం
ఈయన పేరు ఎం.మధుసూదన్‌రావు, నెల్లూరు. రక్తదాన మోటివేటర్. కేవలం మోటివేటర్గానే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి మూడు, నాలుగు నెలలకో దఫా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికే 110 దఫాలు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈయన పేరు చంద్రగిరి అజయ్‌బాబు, నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు. దూరప్రాంత గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం బ్లడ్‌బ్యాంకు కన్వీనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాక ఇంటికి వెళ్లకుండా నేరుగా బ్లడ్ బ్యాంకుకే వస్తారు. అక్కడ బ్లడ్‌బ్యాంకులో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు 93 దఫాలుగా రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తి దాయకంగా నిలిచాడు. నెల్లూరు (అర్బన్): ప్రాణాపాయంలో క్షతగాత్రుల ఊపిరి నిలిపేందుకు అత్యవసరంగా రక్తం అందించాల్సి ఉంది. రక్తహీనతతో ఉన్న గర్భిణులు, ఇతర సర్జరీల సమయంలో రక్తం అవసరమైనప్పుడు, హీమోఫీలియో, తలసేమియా రోగులకు క్రమం తప్పకుండా రక్తం అందించాల్సి వచ్చినప్పుడు వారి ప్రాణాలు కాపాడేందుకు తామున్నామంటూ అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ప్రాణదాతలుగా నిలుస్తూ జిల్లాకు గుర్తింపు తెచ్చారు. ఎంతో మందికి స్ఫూర్తిదాతలు నిలుస్తున్నారు. భారతదేశంలో స్వచ్ఛంద రక్తదాన ఉద్యమానికి మార్గదర్శకుడు, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ పితామహుడు డాక్టర్ జేజీ జోలి. ఆయన చేసిన పరిశోధనలు, కృషి వల్లనే అక్టోబర్ 1వ తేదీని జాతీయ రక్తదాన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిందింది. డాక్టర్ జేజీ జోలి స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. అదే స్ఫూర్తితో జిల్లాలో ఎంతో మంది స్వచ్ఛంద రక్తదాతలుగా మారారు. జిల్లాలో ఉన్న పలు బ్లడ్‌బ్యాంకులు రోగుల రక్త కొరత తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో రెడ్‌క్రాస్‌తో పాటు నోవాబ్లడ్ బ్యాంకు, పెద్దాస్పత్రి, నారాయణ, అపోలో ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులున్నాయి. అందులో రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు 90 శాతం వరకు రోగులను ఆదుకుంటుంది. రాష్ట్రంలో మొదటి స్థానం.. దేశంలో రెండో స్థానం 1997లో రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు పూర్తి స్థాయి వినియోగంలోకి వచ్చింది. నెల్లూరు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు రాష్ట్రంలో ప్రథమ, దేశంలో రెండో స్థానాల్లో నిలుస్తున్నాయి. కోవిడ్ సమయంలో వందలాది మంది కరోనా రోగులకు ప్లాస్మాదానం చేయడంలో దేశంలోనే మొదటి స్థానాన్ని జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సాధించింది. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు 3 మొబైల్ వాహనాలు జిల్లా రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు సేవలు బాగుండడంతో ఇటీవల రూ.1.25 కోట్లతో రెండు మొబైల్ వాహనాలను ఇండియన్ రెడ్‌క్రాస్–న్యూఢిల్లీ నెల్లూరుకు అందజేశారు. పదిరోజుల క్రితం వీటిని రాష్ట్రమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రూ.కోటి నిధులతో మరో మొబైల్ బస్సును ఇక్కడికి పంపారు. దీంతో మొత్తం రూ.2.25 కోట్లతో మూడు ఆధునిక మొబైల్ వాహనాలు నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొబైల్ బస్సులో ఒకే దఫా ఐదుగురు రక్తదానం చేసేందుకు సీటింగ్, డాక్టర్‌కు రెస్ట్ రూం, పరీక్షలు చేసేందుకు, రక్తదానం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునేందుకు వసతులు ఏర్పాటు చేశారు. సెంట్రలైజ్డ్ ఏసీని వాహనంలో ఏర్పాటు చేశారు. గ్రామీణులు ముందుకు రావాలి రక్తదానంపై అవగాహన అవసరం. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం 1000 మందిలో ఐదుగురు మాత్రమే పట్టణాల్లో రక్తదానం చేస్తున్నారు. గ్రామీణులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. 1000 మందిలో కనీసం 15 మంది రక్తదానం చేసినప్పుడు కొరత తీరుతుంది. నేను 49 దఫాలు రక్తదానం చేశాను. – మోపూరు భాస్కర్‌నాయుడు, నోవా బ్లడ్‌బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ రక్తం కొరత ఉంది ఎంతోమంది సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ వందనాలు. అయితే డెంగీ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు రోగుల అవసరాలకు తగిన విధంగా రక్తం అందక ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల రక్తదానం అనేది కుటుంబ సంప్రదాయంగా మారాలి. రక్తం ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ బ్యాంకు సేవలను విస్తృతం చేస్తున్నాం. ఇకమీదట నేరుగా గ్రామా ల్లో పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహిస్తాం. రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ -
ఈ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు పోటీ చేయాలన్నా భయపడాలి
నెల్లూరు(సెంట్రల్): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రకటించారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్లో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల మొదటి నుంచి ఓటర్ జాబితాలో పేర్ల నమోదు ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లను గుర్తించి నమోదు చేసే ప్రక్రియపై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. పట్టభద్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వాటిని కూడా గుర్తు చేయాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో అధిక ఓట్లు ఉన్నాయని, పూర్తిగా వైఎస్సార్సీపీ వైపే పట్టభద్రులు ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు భయపడాలి పట్టభద్రుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీ చూసి ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పును తీసుకువద్దామన్నారు. ఓటరు లిస్టులో పేర్లు నమోదు అనేది అత్యంత ప్రతిష్టాత్మంగా జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటు నమోదు చేయించడంతో పాటు, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పట్టభద్రుల ఓట్లు చాలా కీలకమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వాళ్లు గమనిస్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రత్యేక ఆదరాభిమానాలు వాళ్లకు ఉన్నాయన్నారు. ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావించి మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు. చాలా కాలం తర్వాత జిల్లాలో తిరిగి పట్టభద్రుల ఎన్నికల వాతావరణం వస్తోందని, ఈ విషయంపై ప్రతి ఒక్కరం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గెలవడం ఖాయమని, మెజార్టీని చూసి ప్రతిపక్షాలు భయపడే విధంగా తీసుకుని వద్దామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, పి రూప్‌కుమార్, నిరంజన్‌బాబురెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ దందాపై కన్నెర్ర
అధిక లోడుతో గ్రానైట్‌ను రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా పోలీస్, విజిలెన్స్ శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్‌ను తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. దీంతో అధికారులు పలు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు. తనిఖీల్లో కొన్ని వాహనాలు మాత్రమే పట్టుబడుతుండగా అధికారుల కళ్లుగప్పి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. నెల్లూరు(టౌన్): మన రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి, గురుజేపల్లి, బల్లికురువ, శ్రీకాకుళం టెక్కలి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు ప్రాంతాలకు నిత్యం 200కు పైగా గ్రానైట్ వాహనాలు వెళ్తుంటాయి. వాటిలో అధికశాతం ఓవర్ లోడుతో ఉంటాయి. గ్రానైట్‌ను ఎక్కువగా 22 చక్రాల లారీలు రవాణా చేస్తుంటాయి. ఒక్కో దాంట్లో 57.750 టన్నుల సరుకు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు యజమానులు 90 నుంచి 100 టన్నుల వరకు రవాణా చేయిస్తుంటారు. అధిక లోడు కారణంగా వాహనం అదుపులో ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా తనిఖీల్లో ఓవర్ లోడు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమికంగా రూ.20 వేలు, దీంతోపాటు వాహన పరిమితికి మించి అధికంగా ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్నారు. తనిఖీల సమయంలో రోడ్డుపై వాహనాన్ని ఆపి డ్రైవర్ కనిపించకుండా వెళ్తే దానికి రూ.40 వేలు ఫైన్ వేస్తున్నారు. ఆ వాహనాన్ని ఫొటో తీసి రవాణా శాఖ వెబ్సైట్లో ఉంచుతారు. అక్కడే కేసులు రాస్తే.. అధిక లోడుతో వస్తున్న వాహనాలు అవి మొదలయ్యే పాయింట్లలోనే కేసులు నమోదు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరులో ఆపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుండడంతో యజమానులు దుర్భాషలాడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారని చెబుతున్నారు. కాగా అధిక లోడుతో తిరుగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక తదితర వాహనాలపై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వాటిపై కూడా కేసులు నమోదు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. దెబ్బతింటున్న రోడ్లు అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలపై నేషనల్ హైవే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో అధిక లోడు గ్రానైట్ వాహనాల వల్లే రహదారులు దెబ్బతినడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నెల్లూరు జిల్లా వరకు యాక్సిడెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ అధిక లోడు వాహనాలను అరికడితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు నివేదించారు. తనిఖీలు ముమ్మరం జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కొద్దిరోజులుగా రవాణా శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే పట్టుబడుతున్న వాహనాల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 234 వాహనాలను పట్టుకుని రూ.కోటికి పైగా అపరాధ రుసుము విధించి వసూలు చేశారు. వాటిలో అధిక శాతం గ్రానైట్ లారీలే ఉన్నాయి. అధిక లోడు వాహనాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేసులు నమోదు చేస్తే సర్కారుకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం ఓవర్‌లోడుతో వెళ్లే వా హనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1.38 కోట్ల లక్ష్యాన్ని విధించింది. దీనిని చేరుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మా వంతు కృషి చేస్తాం. – బి.చందర్, ఉపరవాణా కమిషనర్, నెల్లూరు -
NUDA: వడివడిగా నుడా విస్తరణ అడుగులు
నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. గత ప్రభుత్వ హయాంలో నుడా ఆవిర్భవించినప్పటికీ నిధులివ్వకుండా నిస్తేజంగా మార్చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సుమారు మూడు వేల చ.కి.మీ. పరిధిలోని గ్రామాలను నుడాలోకి తీసుకురావడంతో పాటు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నుడా అధికారాలను అడ్డం పెట్టుకుని అప్పటి పాలకులు అడ్డంగా దోచుకున్నారే తప్ప.. నుడా పేరుతో చేపట్టిన అభివృద్ధి శూన్యంగానే చెప్పొచ్చు. నెల్లూరు సిటీ: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధి భారీగా విస్తరిస్తోంది. పట్టణ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల నుంచి పల్లెల వరకు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా నుడా పరిధిని విస్తరిస్తూ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు పలు మండలాలు, గ్రామాలను నుడాలో కలుపుతూ జీఓలు విడుదల చేసింది. తాజాగా ఈ నెల 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 13 మండలాల పరిధిలోని 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. ఇందులో ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు ఉండడం విశేషం. మూడేళ్లలో భారీగా విస్తరణ 2017 మార్చి 24న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆవిర్భవించింది. తొలుత నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం ప్రాంతాల్లోని మొత్తం 21 మండలాల పరిధిలోని 156 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 1,644.17 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న నుడా పరిధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 5,023.44 చ.కి.మీ. వరకు విస్తరించింది. ► 2020 ఏప్రిల్ 24న 135 జీఓ నంబర్‌తో రెండు మండలాల్లోని 65 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో 567.49 చ.కి.మీ. పెరిగింది. ► 2022 జూన్ 15న జీఓ నంబరు 97తో మరో రెండు మండలాల్లోని 39 గ్రామాలను నుడాలో కలపడంతో మరో 475.54 చ.కి.మీ. పరిధి పెరిగింది. ► తాజాగా 2022 సెప్టెంబరు 15న జీఓ నంబర్ 132 ద్వారా 13 మండలాల పరిధిలో 166 గ్రామాలను నుడా పరిధిలోకి తీసుకురావడంతో మరో 2,336.24 చ.కి.మీ. పరిధి పెరిగింది. ప్రస్తుతం 31 మండలాల పరిధిలోని 426 గ్రామాలతో మొత్తం 5,023.44 చ.కి.మీ. నుడా విస్తరించింది. 97 ఎకరాల్లో 1,112 ప్లాట్లు ఏర్పాటు నుడా అభివృద్ధిలో భాగంగా కావలికి సమీపంలోని జలదంకి మండలం జమ్మలపాళెం వద్ద ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పథకం కింద 97 ఎకరాల్లో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. తక్కువ ధరలో ప్లాట్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ ఇచ్చారు. రూ.50 కోట్లతో లేఅవుట్లో పార్కులు, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ లైట్లు, పచ్చదనంతో కూడిన అన్ని వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే 250 ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. లేఅవుట్లో ప్లాట్లు దరఖాస్తు చేసుకునేందుకు mig.apdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 9121162478 నంబరులో సంప్రదించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అక్రమ లేఅవుట్లపై కొరడా నుడా పరిధిలో అక్రమలేఅవుట్లపై నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, నుడా వైస్ చైర్మన్ నందన్ ప్రత్యేక దృష్టి సారించారు. 300కు పైగా లేఅవుట్లను నుడా పరిధిలో ఏర్పాటు చేశారు. వాటిలో 118 అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించి ఎల్ఆర్ఎస్ స్కీం కింద క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 55 అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించారు. మరో 20 లేఅవుట్లు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. 180 ప్లాట్ల యజమానులు వ్యక్తిగతంగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 46 దరఖాస్తులు మంజూరు చేశారు. ఇప్పటికే నుడాకు రూ.60 లక్షలు వరకు ఫీజు రూపంలో వచ్చింది. రూ.3.18 కోట్లతో నుడా కార్యాలయ నిర్మాణం నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ఫుడ్ కార్పొరేషన్ కార్యాలయం వెనుక వైపు నుడా కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. రెండు అంతస్తులతో మొత్తం 10,650 చదరపు అడుగుల స్థలంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఐదేళ్లుగా అద్దె భవనంలో నుడా కార్యాలయ కలాపాలు జరుగుతున్నాయి. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేక చొరవ తీసుకుని నుడాకు చెందిన స్థలంలో కార్యాలయం నిర్మాణం చేపట్టారు. కొన్ని నెలల్లోనే కార్యాలయం నిర్మాణం పూర్తి కానుంది. మూడేళ్లలో రూ. 54.32 కోట్లతో అభివృద్ధి నుడా పరిధిలో గత మూడేళ్లలో రూ.54.74 కోట్లు నిధులతో పార్కులు, పాఠశాల నిర్మాణాలు, సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రెయిన్లు, కమ్యునిటీ హాల్స్ నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 135 పనుల్లో 57 పనులు పూర్తయ్యాయి. మరో 30 పనులు జరుగుతున్నాయి. 40 పనులు ప్రారంభించనున్నారు. 3 పనులు టెండర్ ప్రాసిసెంగ్‌లో ఉన్నాయి. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుడాకు రూ.61.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం!) ► నెల్లూరు నగరంలో రూ.6.90 కోట్లతో 15 పార్కులు నిర్మించారు. రూ.2.2 కోట్లతో మరో 4 పార్కులు నిర్మాణంలో ఉన్నాయి. నర్తకీ థియేటర్ వద్ద రూ.3 కోట్లతో ఫుట్‌పాత్, డివైడర్, రోడ్డు నిర్మాణాలకు కేటాయించారు. చింతారెడ్డిపాళెం బలిజపాళెంలో రూ.35 లక్షలతో పాఠశాల భవనం, రూ.15 లక్షలతో ధోబీఘాట్ నిర్మాణం జరిగింది. నవాబుపేటలో రూ.30 లక్షలతో వజూఖానా, రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోన్నాయి. 48వ డివిజన్లో రూ.50 లక్షలతో కమ్యూనిటీహాల్, రూ.30 లక్షలతో తోటబడి వద్ద పార్కు నిర్మాణం జరుగుతోంది. ► నెల్లూరు రూరల్ పరిధిలో రూ.72 లక్షలతో షాద్కాలనీ, మారుతీనగర్‌లో పార్కుల నిర్మాణం జరిగింది. డైకాస్‌రోడ్డులోని మహిళా ప్రాంగణం సమీపంలో రూ.30 లక్షలతో ఏవీకే ఎస్టేట్ పార్కు నిర్మాణం జరుగుతోంది. రూ.48 లక్షలతో ఆనం వెంకురెడ్డి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ జరిగింది. అన్నమయ్య సర్కిల్ వద్ద ఎన్టీఆర్ పార్కులో రూ.30 లక్షలతో టెన్నిస్ కోర్టు, రూ.13 లక్షలతో అదనంగా మరికొన్ని ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రూ.50 లక్షలతో ఆరు ప్యాకేజీ కింద సీసీరోడ్డు నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. 4వ మైలులో రూ.76 లక్షలతో ప్రేయర్ హాల్, మరుగుదొడ్లు, వాచ్‌మన్ గది నిర్మాణం చేస్తున్నారు. మినీబైపాస్‌రోడ్డులోని హీరో హోండాషోరూమ్ వద్ద రూ.19.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రూ.కోటితో బారాషహీద్ దర్గాలోకి ప్రవేశమార్గం వద్ద రెండు ఆర్చ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రూ.17.5 కోట్లతో నెక్లెస్‌రోడ్డులో పార్కు, మరమ్మతులు చేయనున్నారు. ► కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెంలో రూ.5.10 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం జరిగింది. కోవూరు, మైపాడు, నార్త్‌రాజుపాళెం ప్రాంతాల్లో రూ.1.50 కోట్లతో డ్రెయినేజీలు నిర్మించారు. బుచ్చిరెడ్డిపాళెంలో రూ.కోటితో బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు నిర్మాణం చేశారు. రూ.3.25 కోట్లతో బుచ్చిరెడ్డిపాళెంలో డ్రెయినేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ► సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.1.40 కోట్లతో 5 కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ప్రారంభించనున్నారు. రూ.5.54 కోట్లతో 21 శ్మశానాలను నిర్మించారు. మరిన్ని ప్రగతి పనులు చేస్తాం నుడా పరిధి విస్తరించడంతో పాటు రాబడిపై దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కంటే రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. నుడా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. అక్రమలేఅవుట్లకు అవకాశం లేకుండా నుడా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు కూడా అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలు చేసి ఇబ్బందులు పడకండి. – ముక్కాల ద్వారకానాథ్, నుడా చైర్మన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం నుడా పరిధిలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సూచనల మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కావలి నుంచి తడ, కృష్ణపట్నం నుంచి కడప మీదుగా ఉన్న ప్రాంతాలు నుడాలో కలిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగవంతంగా అభివృద్ధి జరగనుంది. – ఓ నందన్, నుడా వైస్ చైర్మన్ -
AP: టెన్త్.. నో టెన్షన్
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో నూతన సంస్కరణల వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌కు టెన్త్ కీలక మలుపు. పదో తరగతి పరీక్షలంటే విద్యార్థుల్లో ఎక్కడాలేని భయం. ఈ భయాన్ని పోగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో సమూల మార్పులు తీసుకు వచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు. నెల్లూరు (టౌన్): టెన్త్ పరీక్షలంటే.. ఇక నో టెన్షన్. విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో విద్యార్థులపై చదువులు, ర్యాంక్‌లు, మార్కులు ఒత్తిడి తగ్గనుంది. తద్వారా నాణ్యమైన విద్య ప్రమాణాలు అందనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లనే ఉండడంతో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గుతుందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 420 వరకు ఉన్నాయి. వీటిల్లో 35 వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గతంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు ఉండేవి. హిందీ మినహా మిగిలిన ఒక్కో సబ్జెక్ట్‌కు రెండు పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా గతేడాది çపది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మార్కులు కేటాయించారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచి పది పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు భారం తగ్గడంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పది పబ్లిక్ పరీక్షల్లో తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిల్లో హిందీకి తప్ప మిగిలిన సబ్జెక్ట్‌లకు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరహాలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక్కో పరీక్షను మాత్రమే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మోడల్ పేపర్లను సిద్ధం చేసి ఉపాధ్యాయులకు అందజేశారు. చదువుకునేందుకు ఎక్కువ సమయం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లకు తగ్గించడంతో విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఎక్కువ రోజులు పరీక్షలు జరగకుండా నూతన పరీక్ష విధానం వల్ల పరీక్షలు కేవలం 6 రోజుల్లోనే ముగిసిపోతాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల సమయంలో ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులు టెన్షన్‌ను పక్కన బెట్టి రాసేందుకు సిద్ధమవుతారు. – పి. రమేష్, డీఈఓ ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు నిర్వహించాలని నిర్ణయించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల్లో తక్కువ పేపర్లు నిర్వహించడం వల్ల చదువుకునేందుకు సమయం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు టెన్షన్ కూడా తగ్గుతుందంటున్నారు. నూతన జిల్లాల్లోనే పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించారు. -
కళాశాలలకు కార్పొరేట్ కళ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కార్పొరేట్ కళను సంతరించుకోనున్నాయి. నాడు–నేడు పనులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులకు కార్పొరేట్ సొబగులు అద్దిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలలపై దృష్టి సారించింది. డిసెంబరు నాటికి పూర్తి స్థాయిలో సకల వసతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. జిల్లాలో తొలి విడతలో 1,059, రెండో విడతలో 1,112 పాఠశాలలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం తాజాగా జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కళాశాలల్లో 9 రకాల వసతులను కల్పించనున్నారు. వీటి అభివృద్ధికి రూ.13.44 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. త్వరలో పనులు ప్రారంభించి డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధునిక వసతులు ఏర్పాటు కానుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 9 రకాల వసతుల ఏర్పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 9 రకాల వసతులు కలి్పంచనున్నారు. అవసరమైన కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, మేజర్, మైనర్ రిపేర్స్, రన్నింగ్ వాటర్, ఆర్వో ప్లాంట్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ పనులు, ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, బెంచీలు, టేబుల్స్, గ్రీన్ చాక్బోర్డు, పెయింటింగ్, కాంపౌండ్ వాల్ తదితర వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ విభాగం అధికారులు కళాశాలల్లో మౌలిక వసతులు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కళాశాల డెవలప్మెంట్ కమిటీ ప్రతిపాదనల మేరకు తీర్మానాలు చేశారు. వీటికి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆమోదముద్ర వేశారు. డిసెంబరు నాటికి పూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను బట్టి విడతల వారీగా నిధులను విడుదల చేయనున్నారు. వారం రోజుల్లో తొలుత ఆయా కళాశాలలకు 15 శాతం నిధులు విడుదల చేయనున్నారు. పనులు ఆయా కళాశాల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. నాడు–నేడు పనులు పూర్తతే కళాశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనున్నాయి. – ఎ. శ్రీనివాసులు, డీవీఈఓ 22 కళాశాలల ఎంపిక జిల్లాలో మొత్తం 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 4 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 25 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. ప్రస్తుతం నాడు–నేడుకు జిల్లాలో 22 జూనియర్ కళాశాలలు ఎంపిక చేశారు. వీటి అభివృద్ధికి రూ.13,44,95,539 ని«ధులు మంజూరు చేశారు. -
ప్యాకేజీ.. హ్యాపీ: పుష్కర కాలంగా నెలకొన్న సమస్యకు పరిష్కారం
పుష్కర కాలంగా నెలకొన్న మత్స్యకారేతరుల సమస్యకు పరిష్కారం లభించింది. పేదల దశాబ్దాల కల నెరవేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనను ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సఫలీకృతం చేశారు. కృష్ణపట్నంపోర్టు పరిధిలో మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో సీఎం చేతుల మీదుగా అర్హులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ముత్తుకూరు: రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్న కృష్ణపట్నం పోర్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసి జాతికి అంకితం చేశారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. తద్వారా ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాలకు రూ.32 కోట్లు అందించారు. అప్పట్లో 2 వేల మంది మత్స్యకారేతరులను గుర్తించారు. అంతలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం నాన్ ఫిషర్మన్ కుటుంబాల పాలిట శాపంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ ఫైల్‌ను బుట్టదాఖలు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్యాకేజీ చెల్లింపులకు పీఠముడి వేసింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పి రూ.3 కోట్లతో సరిపెట్టారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు అప్పట్లో రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానికుల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకు తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 16,337 కుటుంబాలకు రూ.35.75 కోట్లు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. మత్స్యకారేతర ప్యాకేజీ అంటే.. కృష్ణపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలతో పాటు విద్యుత్ కొరత తీర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీజెన్కో ద్వారా ప్రథమంగా 1,600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటైంది. వీటితో పాటు ప్రైవేట్ రంగంలో సెంబ్‌కార్ఫ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్‌ల కోసం ముత్తుకూరు మండల తీర ప్రాంతంలో సుమారు 6,000 ఎకరాలకుపైగా భూములు సేకరించారు. పోర్టు విస్తరణకు 5 గ్రామాలను ఖాళీ చేసి, ముత్తుకూరుకు తరలించారు. పోర్టుకు అనుబంధంగా పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా ఈ భూములపై ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయ కూలీ కుటుంబాలు, మాత్స్యకారులు కాకుండా చేపలు పట్టుకొని జీవనం సాగించే ఇతర పేద కులాల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ సమస్యను గుర్తించారు. ముఖ్యంగా నిరుపేద ఎస్టీ, ఎస్సీ కులాలకు ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. మొదట ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో సర్వే చేసి, 2,000 మందికి ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత ఇందులో ఉపాధి కోల్పోతున్న బీసీలు, మైనార్టీలు కూడా చేరారు. కాలక్రమేపి మత్స్యకారేతరుల లబి్ధదారుల సంఖ్య 16,337కు చేరింది. ప్రభుత్వాలు మారిన ప్యాకేజీ మాత్రం దక్కని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్యాకేజీ నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్టు 3వ యూనిట్ నిర్మాణం పూర్తయింది. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జనన్మోహన్రెడ్డి రానున్నట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా మత్స్యకారేతర ప్యాకేజీ స్వయంగా అందజేయనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ ప్రారం¿ోత్సవం అటూ ఇటూ అయినా అక్టోబర్‌లో మత్స్యకారేతర ప్యాకేజీ అర్హుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న మత్స్యకారేతర ప్యాకేజీ త్వరలో పంపిణీ చేస్తారనే విషయం చాలా సంతోషం కలిగించింది. అసలు ఈ ప్యాకేజీ వస్తుందా, రాదా అనే అనుమానం మాలో ఉండేది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్యాకేజీ సాధించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొన్నారు. – పర్రి రామమ్మ, వెంకన్నపాళెం మంత్రి కాకాణికి కృతజ్ఞతలు తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలకు మత్స్యకారేతర ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన మంత్రి కాకాణి గోవర్ధ న్‌రెడ్డికి కృతజ్ఞతలు. కుటుంబానికి రూ.25 వేలు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. గతంలో కొందరు మాయమాటలు చెప్పారు. అయితే మంత్రి కాకాణి మాత్రం ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. – దారా ముత్యాలమ్మ, ఈపూరు మంత్రి కాకాణి చొరవ.. సీఎం గ్రీన్‌సిగ్నల్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ మత్స్యకారేతర ప్యాకేజీ వర్తింపజేస్తామని అప్పట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పకుండా ప్యాకేజీ పంపిణీ చేస్తామని ప్రతి సందర్భంలో చెప్పుకొచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాకాణి ఈ సమస్యపై ప్రత్యేక చొరవ కనబర్చారు. వేగంగా ఫైల్ కదిలింది. నిధుల మంజూరుకు మార్గం ఏర్పడింది. ప్యాకేజీ పంపిణీకి రూ.35.75 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా లభించింది. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి తెల్లరేషన్ కార్డులున్న ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ అందించనున్నారు. మొత్తంగా 16,337 మంది లబి్ధదారులు ఉండగా ఇందులో 3,550 కుటుంబాలకు ఎన్నికలకు ముందు ఒక విడతగా రూ.14,350 పంపిణీ చేశారు. అందులో మిగిలిన 12,787 కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున ప్యాకేజీ మొత్తం అందజేస్తారు. వారికి సుమారు రూ.32 కోట్లు వ్యయమవుతుంది. గతంలో కొంత పరిహారం పొందిన 3,550 కుటుంబాలకు మిగిలిన రూ 10,650 చొప్పున రూ.3.78 కోట్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. -
ఆధునిక టెక్నాలజీతో.. కొత్త ఫ్లైఓవర్
అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పటి వరకు మహానగరాల్లోనే నిర్మించిన విధంగా నెల్లూరు నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో వెంకటేశ్వరపురం, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి ప్రాంతాల్లో మూడు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. తాజాగా మినీబైపాస్‌లో హరనాథపురం సర్కిల్లో నాల్గో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఫ్లై ఓవర్ గతంలో నిర్మించిన మూడింటి కంటే సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో విభిన్నమైందిగా చెప్పుకోవచ్చు. నెల్లూరు (బారకాసు): నగరంలోని ముత్తుకూరురోడ్డులో రామలింగాపురం కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మార్గంలో నాలుగు వైపులా వాహనాల రాకపోకలను రెండు రోజుల నుంచి నిలిపివేసి పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే కీలకమైన పిల్లర్ల నిర్మాణం పూర్తికావడంతో గడ్డర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధానంగా ఫ్లై ఓవర్‌కు రెండు వైపులా ఎర్త్ వర్క్ పనులు ముమ్మరం చేశారు. నెల్లూరు నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా జనాభా సంఖ్య కూడా పెరగడంతో పాటు వాహనాల రాకపోకలు అధికమవుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడం కారణంగా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గుర్తించిన నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం కేంద్రం నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం మంజూరు చేయించి అవసరమైన నిధులు కూడా విడుదల చేయించింది. కరోనాతో పనులు ఆలస్యం 2020 ఆగస్టులో రూ.41.88 కోట్ల అంచనాలతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులు 2022 ఆగస్టు కల్లా పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అడుగులు ముందుకేశారు. అయితే ఓవైపు కరోనా, మరో వైపు వర్షాలు కారణంగా నిర్మాణ పనులు నెమ్మదిగా జరిగే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జరిగేలా తగు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పనులను పూర్తి చేసేందుకు మరో ఆరో నెలలు పొడిగింపునకు అనుమతి ఇచ్చింది. 2023 ఫిబ్రవరి కల్లా పూర్తి చేసేలా ఇటు అధికారులకు, అటు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పూర్తికి మరో ఐదు నెలలు గడువు ఉన్నప్పటికీ అధికారులు మరో మూడు నెలల్లోపు పూర్తి చేయాలనే ప్రయత్నంతో పనుల్లో వేగాన్ని పెంచారు. ఆధునిక టెక్నాలజీతో.. రామలింగాపురం కూడలిలో జరుగుతున్న ఫ్లై ఓవర్ మొట్టమొదటి సారిగా మహానగరాల్లో నిర్మించిన ఆధునిక టెక్నాలజీ తరహాలో నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇటువంటి టెక్నాలజీతో ఫ్లై ఓవర్ వంతెనల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లై ఓవర్ టెక్నాలజీతో మహానగరాలైన హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లోనే జరిగాయి. ఈ వంతెన పొడవు 810 మీటర్లు. 10 పిల్లర్లు ఆధారంతో వంతెనను నిర్మిస్తున్నారు. ఒక పిల్లర్‌కు మరో పిల్లర్‌కు మధ్యలో (సెంటర్ స్పాన్) భీమ్‌లను డయాఫ్రంభీమ్లో అమర్చుతున్నారు. ఈ సెంటర్ స్పాన్లు ప్రీ్రస్టెస్ గడ్డర్లు టెక్నాలజీతో 9 అడుగుల ఎత్తు, 100 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయడం విశేషం. ఈ వంతెన నిర్మాణం పూర్తితో త్వరలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. త్వరతగతిన పూర్తికి చర్యలు నగరంలోని రామలింగాపురం సెంటర్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ త్వరతిగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. 2023 ఫిబ్రవరి కల్లా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనత త్వరగా మరో మూడు నెలల్లో పూర్తి చేసేలా పనులు వేగవంతంగా జరిపిస్తున్నాం. త్వరతిగతిన వంతెన నిర్మాణం పూర్తికి మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. – అనిల్‌కుమార్‌రెడ్డి, డీఈఈ, ఎన్‌హెచ్ విభాగం, ఏపీ ఆర్అండ్బీ శాఖ -
Fact Check: ఆ బ్యారెజ్ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..?
ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తన ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. ఇంతవరకూ బాగానే వుంది. సీఎం ఆ రెండు ప్రాజెక్టులను ప్రారంభించారో.. ఆ వెంటనే ఆ ఘనత తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడం ప్రారంభించారు. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత ...? సాక్షి ఫ్యాక్ట్ చెక్ చూద్దాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన సంగం , నెల్లూరు బ్యారేజీలివి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టుల్లో భాగంగా వీటికి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఆయన అకాల మరణం చెందారు. దాంతో కొంతకాలంపాటు మూలన పడిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఇవి కూడా వున్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేస్తామని పదే పదే ప్రకటనలు చేశారుగానీ పూర్తి చేయలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్సార్ స్ఫూర్తిని ప్రతి ఫలించేలా ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞం పనులను ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా వీటిని పూర్తి చేయించారు. అవసరమైన నిధులను కేటాయించి పనులయ్యేలా చూశారు. దాంతో సంగం, నెల్లూరు బ్యారేజీలు రెండూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇంతవరకూ బాగానే వుంది. రెండు జలయజ్ఞం ప్రాజెక్టులు కళకళలాడుతూ, ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు... నెల్లూరు నగరానికి పుష్కలంగా తాగునీరు అందించడానికి సిద్ధం కావడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. ఇక వెంటనే ఈ రెండూ పూర్తవ్వడం తెలుగుదేశం ఘనతే అని చెప్పుకోవడం ప్రారంభించారు. వారికి ఎల్లో మీడియా కూడా తానా అంటే తందాన అనేసింది. నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణం విషంలో తెలగుదేశం పార్టీ నేతలు, వారికి కొమ్ముకాసే పచ్చ మీడియా ప్రచారంలో ఎంత నిజం వుందో చూద్దాం. నెల్లూరు బ్యారేజీ నిర్మాణ సవరించిన అంచనా విలువ రూ. 274.83 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే రాష్ట్ర విభజన కి ముందు రూ. 86.62 కోట్లు ఖర్చు చేశారు. ఇక చంద్రబాబు హయాంలో 2014-2019 వరకూ అంటే ఐదు సంవత్సరాల్లో రూ. 71.54 కోట్లు వ్యయం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటినుంచీ ఇప్పటివరకు ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో రూ. 77.37 కోట్లు ఖర్చు చేసి నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశారు. జాతికి అంకితం చేశారు.. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని చూద్దాం. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ రూ. 335.80 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే రాష్ట్ర విభజన కి ముందు రూ. 30.85 కోట్లు ఖర్చు చేయగా 2014-2019 వరకూ అంటే చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాల్లో రూ. 86.10 కోట్లు వ్యయం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ అంటే సంగం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేవరకూ ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో సైత రూ. 131.12 కోట్లు ఖర్చు చేశారు. ఇవీ వాస్తవాలు. అటు వైఎస్ఆర్ హయాన్ని, ఇటు వైఎస్ జగన్ హయాంను కలుపుకుంటే నెల్లూరు, సంగం బ్యారేజీలకోసం సింహభాగం డబ్బులు ఖర్చు చేశారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. అంతే కాదు కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో..అన్ని సమస్యలు పరిష్కరించి చకచకా పనులు చేసి ఈ రెండు ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు సీఎం వైఎస్ జగన్. కళ్ల ముందు లెక్కలు తప్పులు చెప్పవు కదా.. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కోటరీ మాత్రం ఈ రెండు ప్రాజెక్టులు మా ఘనతే అని చెప్పుకుంటున్నారు. ఇతరుల కష్టాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఏమాత్రం సందేహించకపోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. -
తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలిన ఏడో తరగతి విద్యార్థిని
-
నెల్లూరులో విషాదం.. క్లాస్‌రూంలో కుప్పకూలి విద్యార్థిని మృతి
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని వింజమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెనువిషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల షేక్ సాజీదా అనే విద్యార్థిని.. తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. చిన్నవయసులోనే చిన్నారి కన్నుమూయడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఏడో తరగతి చదువుతున్న సాజీదా.. క్లాస్ రూంలో టీచర్ ప్రశ్నలు అడగడంతో లేచి సమాధానాలు ఇస్తోంది. అయితే ఒక్కసారిగా ఆ చిన్నారి కుప్పకూలింది. వెంటనే స్కూల్ సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. గుండె పోటుతో సాజీదా మృతి చెందిదని ప్రాథమికంగా చెబుతున్నా.. పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే మృతికి అసలు కారణం తెలుస్తుందని వైద్యులు స్పష్టత ఇస్తున్నారు. సమాధానాలు చెబుతూ హఠాత్తుగా ఆమె కుప్పకూలిందని.. ఫిట్స్ అనుకుని తాళాలు చేతిలో పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని బయాలజీ టీచర్ చెబుతున్నాడు. ఆ వెంటనే సహోద్యోగి సాయంతో ఆస్పత్రికి తరలించామని తెలిపాడాయన. మరోవైపు సాజీదాకు ఎలాంటి గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని సాజీదా కుటుంబం కన్నీళ్లతో చెబుతోంది. పదమూడేళ్ల వయసుకే గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త.. స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఇదీ చదవండి: మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి.. -
నెల్లూరుకు నగిషీ.. వందేళ్ల కల సాకారం
(నెల్లూరు బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజ్ సాకారమవుతోంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన నెల్లూరు బ్యారేజ్ పనులను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈ బ్యారేజ్‌ను ఈనెల 6వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు. బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందనుంది. బ్యారేజ్‌ను పూర్తి చేసి నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. వరద నియంత్రణ ద్వారా ముంపు ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ 2 వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడంతో నెల్లూరు–కోవూరు మధ్య రవాణా ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమయ్యాయి. దీంతోపాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని కూడా సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆంగ్లేయుల కాలంలో... 1854–55లో ఆంగ్లేయుల హయాంలో నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్ట నిర్మించి అరకొరగా మాత్రమే ఆయకట్టుకు నీళ్లందించారు. 1862లో భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్ట నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలం కావడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్‌గా మారింది. నెల్లూరు తాగునీటికి తల్లడిల్లింది. ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరును ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించాలని 1904 నాటి నుంచి నెల్లూరు ప్రజలు కోరుతున్నా 2004 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో 2008 ఏప్రిల్ 24న చేపట్టారు. ఆయన హయాంలో బ్యారేజ్ పనులు పరుగులెత్తాయి. రూ.86.62 కోట్లను ఖర్చు చేశారు. మహానేత హఠాన్మరణం నెల్లూరు బ్యారేజ్‌కు శాపంగా మారింది. నాడు కాలయాపన.. కమీషన్లకే ప్రాధాన్యం రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ నెల్లూరు బ్యారేజ్ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బ్రిటీష్ సర్కార్ నిర్మించిన పాత ఆనకట్టకు పది మీటర్ల ఎగువన 10.9 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా 640 మీటర్ల వెడల్పుతో నెల్లూరు బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. పాత ఆనకట్ట వల్ల వరద ప్రవాహం వెనక్కి ఎగదన్నడం బ్యారేజ్ నిర్మాణానికి సమస్యగా మారింది. పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజ్ నిర్మిస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. 2016 వరకూ టీడీపీ సర్కార్ దీన్ని పరిశీలించకుండా జాప్యం చేసింది. ఆ తరువాత డిజైన్లలో మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించింది. కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు రాబట్టుకునే పనులకే ప్రాధాన్యం ఇచ్చింది. 2016 నుంచి 2019 మే 29 వరకూ రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా బ్యారేజ్‌లో 57 ఫియర్లను (కాంక్రీట్ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది. నేడు ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తి.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2020 మార్చి నుంచి 2021 చివరిదాకా కరోనా మహమ్మారి మూడు దఫాలు విజృంభించింది. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో వరుసగా భారీ వరదలు వచ్చాయి. నెల్లూరు బ్యారేజ్ నుంచి 2019–20లో 45.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయంటే ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో అంచనా వేయవచ్చు. వరద ఉద్ధృతికి బ్యారేజ్‌కు ఎగువన ఆయకట్టుకు నీళ్లందించడం కోసం తాత్కాలికంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ (మట్టికట్ట) దెబ్బతిన్నది. వరదలు తగ్గాక మళ్లీ మట్టికట్టను సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు చేయడం సవాల్‌గా మారింది. ఈ తీవ్ర ప్రతికూలతల్లోనూ బ్యారేజ్‌లో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 57 పియర్ల మధ్య పది మీటర్ల ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు, కోతకు గురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి పది మీటర్ల ఎత్తు, 4.3 మీటర్ల వెడల్పుతో 8 గేట్లు (స్కవర్ స్లూయిజ్ గేట్లు) వెరసి 51 గేట్లను ఏర్పాటు చేసింది. గేట్లను ఎత్తడం, దించడానికి వీలుగా ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటు చేసింది. బ్యారేజ్‌కు 22 మీటర్ల ఎత్తులో 1.2 మీటర్ల మందం, 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను పూర్తి చేశారు. బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా కుడి, ఎడమ కరకట్టలను పటిష్టం చేసేందుకు రూ.77.37 కోట్లను ఖర్చు చేశారు. నూతన అధ్యాయం.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ బ్యారేజీని పూర్తి చేశారు. ఈనెల 6న నెల్లూరు బ్యారేజ్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేసి చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనున్నారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీటితోపాటు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి పెరగనున్న భూగర్భ జలమట్టం.. నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా, వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులు కొనసాగాయి. సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు మార్గదర్శకాల మేరకు సవాల్‌గా తీసుకుని పెన్నా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటి సరఫరాతోపాటు బ్యారేజ్‌లో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగునీటి సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారాన్ని చూపారు. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ. వరద ఉద్ధృతిలోనూ.. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా భారీ వరదలు వచ్చాయి. మట్టికట్ట కొట్టుకుపోవడంతో దాన్ని సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు పూర్తి చేయడం సవాల్‌గా మారింది. వరద ఉద్ధృతిని అధిగమించి సీఎం జగన్ నిర్దేశించిన గడువులోగా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఈ బ్యారేజ్ పూర్తవ్వడంతో నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కల నెరవేరుతోంది. – హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ -
ఎంజీఆర్ సంగం బ్యారేజీ ఆత్మకూరుకే తలమానికం
నెల్లూరు (సెంట్రల్): ఆత్మకూరు నియోజకవర్గానికే ఎంజీఆర్ సంగం బ్యారేజీ తలమానికమని, బ్యారేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో సంగం, ఏఎస్‌పేట, చేజర్ల మండలాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటి నుంచో కలలు కంటున్న ఎంజీఆర్ సంగం బ్యారేజీ ప్రారంభం ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం కాబోతుందన్నారు. ముఖ్యంగా ఈ బ్యారేజీకి మన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అటువంటి మంచి కార్యక్రమానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
వెనామీకి గిరాకీ: ఆక్వా రైతుల్లో జోష్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆక్వా రంగం మళ్లీ వికసిస్తోంది. 2014–19 టీడీపీ హయాంలో కుదేలైన రైతులు ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కోలుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ, ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ అందే విధంగా ఆక్వా ల్యాబ్‌లను అందుబాటులోకి తేవడంతో ఆదాయబాట పడుతున్నారు. జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఆక్వా సాగులో ఉంది. దాదాపు లక్ష టన్నుల ఆక్వా ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ దఫా విదేశాలకు ఎగుమతులకు అనుమతులు లభించడంతో ఒక్కసారిగా ధరలు ఊపందుకున్నాయి. పక్షం రోజుల క్రితం వరకు 100 కౌంట్ రూ. 90 ఉండగా ఇప్పుడు రూ. 270లకు చేరడంతో ఆక్వా రైతులు ఆనందానికి అవధుల్లేవు. ఆక్వా రైతుల పక్షపాతిగా.. రైతు ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగంలో పెను మార్పులు తీసుకువచ్చారు. విద్యుత్ చార్జీల తగ్గింపు, ఉచితంగా ఆక్వా ల్యాబ్‌లు, నాణ్యమైన సీడ్, సాగులో మెళకువలు, సూచనలు అందేలా మత్స్యశాఖ పర్యవేక్షణలో చేపట్టారు. దళారుల నియంత్రణ, గిట్టుబాటు ధర, విదేశాలకు ఎగుమతులకు అనుమతులు తదితర లాభసాటి ప్రయోజనాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఆక్వా సాగు రోజు రోజుకు వృద్ధి చెందింది. వెనామీ రొయ్యల ధరలు మూడు వారాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రతి నెల ఆక్వా ధరలు పెరుగుతూ ప్రతి కౌంట్‌లో వ్యత్యాసం కనిపిస్తోంది. 30 కౌంట్ రూ. 530 వద్ద ట్రేడ్ అవుతోంది. గత రెండు నెలల ధరలతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి కౌంట్‌పై రూ.100 నుంచి రూ. 150 వరకు ధర పెరుగుదలతో రైతులకు గణనీయమైన ఆదాయం దక్కుతోంది. టీడీపీ హయాంలో ఆక్వాసాగు కుదేలు టీడీపీ హయాంలో ఆక్వా రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. అధిక విద్యుత్ చార్జీలు, ప్రకృతి వైపరీత్యాలతో టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగు సంక్షోభంలో పడింది. ఆశించిన దిగుబడులు లభించకపోవడంతో ఆక్వా రంగం క్రమేపీ అవరోహణ క్రమంలో దిగజారిపోయింది. -
పట్టా పట్టు.. కొలువు కొట్టు
చదువు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే లక్ష్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు కోసం ఉన్నత విద్యలో నూతన జాతీయ విద్యావిధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి దశలోనే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సిద్ధపడిన విద్యార్థులను పరిశ్రమలతో మ్యాపింగ్ పూర్తి చేసింది. నెల్లూరు (టౌన్): ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పని సరి చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ ఉంది. డిగ్రీలో కూడా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తే విద్యార్థులు చదువు పూర్తి కాగానే సులభంగా ఉద్యోగ, ఉపాధి పొందే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తోంది. 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పని సరి డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్ తప్పని సరి చేశారు. అకడమిక్ విద్యా సంవత్సరం ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభకు మార్కులు కేటాయించారు. కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో చదువుతో పాటు అనుభవం సంపాదించడం, పరిశ్రమలతో అనుబంధం ఏర్పడేందుకు ఇంటర్న్‌షిప్ ఎంతో ఉపయోగపడుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రెండు సెమిస్టర్ పరీక్షలు అయిన తర్వాత 2 నెలలు పాటు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4 సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. డిగ్రీ తృతీయ సంవత్సరంలో 5వ సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్లు డిగ్రీ కోర్సు అమలు చేయనున్నట్లు ఉన్నత విద్య అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కోర్సును బట్టి (ఉదాహరణకు బీఏ హానర్స్ పేరుతో) సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. 8,964 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ జిల్లాలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ–10, ఎయిడెడ్–3, ప్రైవేట్– 61 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో డిగ్రీ 3 సంత్సరాలు కలిపి మొత్తం 45 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 13,547 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 8,964 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 3,883 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు ఆయా పరిశ్రమలు, సంస్థలతో మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకునేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌తో విద్యార్థుల డేటాను తెప్పించి వర్సిటీలోనే నమోదు చేయిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ మీద కళాశాలల యాజమాన్యాలతో పాటు ప్రిన్సిపల్స్‌కు కూడా వర్సిటీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలు నూతన విద్యా విధానాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్‌గా వర్సిటీ వైస్ చాన్సలర్, మెంబర్ సెక్రటరీగా జాయింట్ కలెక్టర్, అడిషనల్ మెంబరు సెక్రటరీగా వర్సిటీ రిజిస్ట్రార్, మెంబర్లుగా డీఐఈపీసీ జనరల్ మేనేజర్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (చేజర్ల), కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్, ఆదానీ విల్మర్, సీమెన్స్గమేసా, ఆదానీపోర్ట్, ఐఆర్సీఎస్ చైర్మన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, బీఎం ఆర్ గ్రూపు జీఎంలు ఉన్నారు. ఇంటర్న్‌షిప్‌కు అవకాశం డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కోసం తిరుపతి జిల్లా కలెక్టర్‌తో సమావేశ అనంతరం పరిశ్రమలు, సచివాలయాలు, ఆర్బీకేలు, శ్రీసిటీ, స్కిల్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో 4 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించారు. వచ్చే నెల 6న కమిటీ చైర్మన్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మాట్లాడి మిగిలిన విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించనున్నాం. – సుందరవల్లి, వైస్ చాన్సలర్, వీఎస్‌యూ -
సీతాకోక చిలుక ‘పడగ విప్పడం’ ఎప్పుడైనా చూశారా?
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్ పరిధి ముస్తాపురం సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనిపించింది. వాయీజ్ అనే వ్యక్తి సమీపంలోని ఓ చెట్టుపై దీనిని చూసి మొదట కంగారు పడ్డాడు. ఆ తర్వాత తేరుకుని దానిని గమనించాడు. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్లు మాదిరి ఉన్నాయి. – ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) -
నెల్లూరులో నకిలీ అధికారుల కలకలం
-
మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే..కానీ సేవల్లో శ్రీమంతులు
ఆ ముగ్గురూ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. అయితేనేం సేవలో మాత్రం శ్రీమంతులని నిరూపించుకున్నారు. తమకు ఉన్నంతలోనే సాయపడుతు న్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఒకతను కరోనా సమయంలో పేదలకు అండగా నిలిస్తే.. మరొకతను ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. ఓ మహిళ బాలికలకు తోడుగా నిలిచారు. ఆత్మకూరుకు చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం, కరవళ్ల రవీంద్రారెడ్డి, జ్యోతి జయలక్ష్మి విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. – ఆత్మకూరు వైఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకుని.. పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కరవళ్ల రవీంద్రారెడ్డి సామాన్య రైతు. పొలం పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను చదివించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది తన కొడుకు పుట్టినరోజు నాడు 200 మందికిపైగా పేదలకు దుప్పట్లు, వస్త్రాలు అందజేస్తుంటారు. ఇంకా నల్లపరెడ్డిపల్లి, బట్టేపాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మెరిట్ విద్యార్థులకు, ఆత్మకూరు కళాశాలలో మంచి మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం పేదలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. ఈయన సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సమీప బంధువులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు పెట్టి.. దొరవారిసత్రం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పున్నేపల్లి సుబ్రహ్మణ్యం బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అండగా ఉంటారనుకున్న అక్కలు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో దాతల సహకారంతో సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నారు. బీకాం కంప్యూటర్స్ చేశారు. ఈయన 18 ఏళ్ల క్రితం ఆత్మకూరులో స్థిరపడ్డారు. ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆయన వల్ల అనేక మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఇంకా తల్లి పేరుతో రమా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మదర్‌థెరిస్సా జయంతి రోజున గిరిజన, దళితకాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు పంపిణీ చేస్తుంటారు. ఉపాధి కోసం పలువురికి ఉచితంగా కంప్యూటర్లను అందజేశారు. ఈయన సేవలను చూసి పలువురు తమవంతుగా ఆర్థిక సాయాన్ని ట్రస్ట్‌కు అందజేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నో కాలనీల్లో నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లను రోజుల తరబడి పంపిణీ చేశారు. దాతల సహకారంతో నెల్లూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశారు. చేసిన సేవలకు గానూ ఇప్పటికి ఆరుసార్లు మంత్రులు, కలెక్టర్ ద్వారా అవార్డులు అందుకున్నారు. బాలికలకు భరోసా జ్యోతి జయలక్ష్మి ఆత్మకూరు మండలం కరటంపాడు మజరా శ్రీనివాసపురం దళితకాలనీకి చెందిన మహిళ. ఆమె పుట్టి పెరిగింది తమిళనాడు రాష్ట్రంలోనైనా వివాహానంతరం శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. చిన్నప్పటి నుంచి సేవా భావాలు కలిగిన జయలక్ష్మి కిశోర బాలికల సమస్యలను అర్థం చేసుకుని వారికి కావాల్సిన న్యాప్కిన్లు, సోప్‌లు అందజేశారు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత తన సేవలను మరింత విస్తరించారు. పౌష్టికాహారం తయా రు చేసి పేద పిల్లలకు అందిస్తున్నారు. పేద బాలికలకు యూనిఫాం కొనుగోలు చేసి అందజేశారు. కాలనీల్లో ప్రజలకు పరిశుభ్రత, దాని ప్రాధాన్యం వివరిస్తూ వారిని క్రమశిక్షణ దిశగా నడిపిస్తున్నారు. -
‘రియల్’ అక్రమాలపై నుడా కొరడా
అసలే అక్రమాలు.. ఆపై ఆక్రమణలు. నుడా పరిధిలో రియల్ ఎస్టేట్ యజమానులు భూదందాకు తెగించారు. గత టీడీపీ హయాంలో నుడా పాలకులు, అధికారుల అండతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి లేఅవుట్ ఫీజులు చెల్లించకుండా యథేచ్ఛగా రియల్ అక్రమాలకు తెరతీశారు. ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాలు ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయాలు చేశారు. భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అండంతో ఇందుకు బాధ్యులైన అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నుడా అధికారులు అక్రమ లేఅవుట్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ పరిధిలో టీడీపీ హయాంలో 32.63 ఎకరాల్లో 7 లేఅవుట్లను ఏర్పాటు చేశారు. అందులో 6.3 ఎకరాల ఇరిగేషన్, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని అక్రమించి లే అవుట్లో కలిపేసుకుని ప్లాట్లు వేశారు. పైగా ఈ లేఅవుట్లకు నుడా అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయం కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి రావడంతో చర్యలకు ఉపక్రమించారు. భూ ఆక్రమణకు పాల్పడిన లేఅవుట్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా నుడా అనుమతులు తప్పనిసరి. గతంలో టీడీపీ సర్కార్ హయాంలో వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లను వేశారు. అందులో 118 అక్రమ లేఅవుట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది. వాటన్నింటికీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్)ను ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకొని క్రమబద్ధీకరించుకోవాలని నుడా చైర్మన్ ముక్కాల ద్వారాకనాథ్, వైస్ చైర్మన్ నందన్ లేఅవుట్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక బృందం ఏర్పాటు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, వైస్‌చైర్మన్ నందన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే నుడా అధికారులు జాబితాను సిద్ధం చేశారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీలు, పోలీసుశాఖ అధికారులు ఈ బృందంలో ఉండనున్నారు. 42 లేఅవుట్ల క్రమబద్ధీకరణ 118 అక్రమ లేఅవుట్లలో 42 లేవుట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ పథకం కింద క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. అందులో ఇప్పటికే 22 లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుని నుడా అనుమతులు పొందారు. మరో 20 లేవుట్ల క్రమబద్ధీకరణ ప్రాసెస్‌లో ఉంది. కొన్ని అక్రమ లేవుట్లలోని ప్లాట్ల యజమానులు స్వయంగా 14 శాతం పన్నులు చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే 180 ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరించుకున్నారు. దీంతో నుడాకు రూ.50.46 లక్షలు ఆదాయం వచ్చింది. 118 అక్రమలేవుట్ల క్రమబద్ధీకరించుకుంటే మరో రూ.3.5 కోట్ల వరకు ఆదాయం రానున్నట్లు సమాచారం. అక్రమ లేఅవుట్లను ఉపేక్షించేది లేదు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్లను వేస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రజలు కూడా లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా? లేదా? అని పరిశీలించి కొనుగోలు చేపట్టాలి. లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన జగనన్న స్మార్ట్ షిప్ లేఅవుట్లలో భాగస్వామ్యం కండి. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. – ఓ నందన్, నుడా వైస్ చైర్మన్ -
ప్రాణం పోతది స్వామి.. లోన్ యాప్ జోలికి పోమాకు..
► ‘అన్నా.. లోన్ యాప్స్ జోలికి పోకే.. ఆళ్లు జలగ లెక్క.. నీ రత్తాన్ని పీల్సి పీల్సి పాణం తీస్తారన్నా..’ ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో బాలికను కలిసి తిరిగి వెళ్లేప్పుడు వచ్చే సీన్ ఇలా మీమ్‌గా మారింది. ► ఏ శ్రీవల్లి ఆన్లైన్ లోన్ యాప్‌లో అప్పు చేసి పట్టీలు కొన్నానే.. ప్రాణం పోతది స్వామి.. లోన్ యాప్ జోలికి పోమాకు.. పుష్ప సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణను ఇలా మార్చారు.. ► ‘తల్లి : ఒరే.. లోన్ యాప్‌లో అప్పు చేసి గోల్డ్ తీసివ్వరా.. హీరో : లోన్ తీసుకుంటే మనకు చుక్కలే కనిపిస్తాయి అమ్మా..’ రఘువరన్ బీటెక్ సినిమాలో తల్లీకొడుకుల మధ్య జరిగిన సీన్ ఇలా మీమ్‌గా మారింది. నెల్లూరు(క్రైమ్): సోషల్ మీడియాలో మీమ్స్ చాలా ఫేమస్. సినిమాల్లోని గుర్తుండిపోయే సీన్లను సమకాలిన అంశాలకు తగినట్లుగా మీమ్స్‌గా మారుస్తుంటారు. వాటిలో కొన్ని చూడగానే నవ్వొస్తుంది. మరికొన్ని ఆలోచింపజేస్తుంటాయి. చాలామంది వాటిని షేర్ చేస్తుంటారు. జిల్లా పోలీస్ శాఖ సైబర్ నేరాలపై వినూత్న ప్రచారానికి తెరలేపింది. ప్రజలు లోన్ యాప్స్ వలలో చిక్కుకోకుండా అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అందులో మీమ్స్ ద్వారా ప్రచారం ఒకటి. సైబర్ నేరాల విషయంలో.. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఫేక్ లింకులు పంపి, ఓటీపీలు అడిగి అందిన కాడికి దోచేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో కేసులు పోలీసు రికార్డులకెక్కుతున్నాయి. నిందితులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోతున్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతూనే ఉన్నారు. కాగా ఇప్పటికే నేరం జరిగిన వెంటనే 1930, సైబర్‌మిత్ర 9121211100, సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌తో పాటు స్థానిక పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కలి్పస్తున్నారు. కొంతకాలం క్రితం.. జిల్లాకు చెందిన ఓ మహిళ లోన్ యాప్‌లో రూ.2,500 నగదు తీసుకున్నారు. యాప్‌కు సంబంధించిన ఓ వ్యక్తి ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.70,000 వరకు కట్టించుకున్నాడు. అయితే ఇంకా బాకీ ఉందని వేధించాడు. ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఫేస్బుక్లో పేజీ పేరు : నెల్లూరు పోలీస్ ఫాలోవర్ల సంఖ్య : 49,000 లోన్ యాప్స్‌పై.. ఇన్స్టెంట్ లోన్ యాప్స్. ఇటీవలి కాలంలో యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఎక్కువయ్యాయి. తక్కువ మొత్తం అప్పు ఇచ్చి ఎక్కువ నగదు కట్టించుకోవడం.. కట్టలేని వారిని బెదిరించడం జరుగుతోంది. ఫొటోలను మారి్ఫంగ్ చేసి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండేవాళ్ల వాట్సాప్ అకౌంట్‌కు పంపుతున్నారు. ఈ యాప్స్ వల్ల అధికశాతం మంది మోసాలు, వేధింపులకు గురవుతుండడంతో పోలీస్ శాఖ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సినిమాల్లోని పాపులర్ సీన్లతో మీమ్స్ చేసి ఫేస్‌బుక్‌లోని నెల్లూరు పోలీస్ పేజీలో తదితర వాటిల్లో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఈ పోస్టులు ఉంటున్నాయి. దీంతో వాటిని బాగా షేర్ చేస్తున్నారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణోత్సవం
నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీవారి ఆనంద నిలయంలో శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ, వీపీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం దేవదేవేరుల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్ ఎల్ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు కల్యాణ వధూవరులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ బద్ధంగా సాయంత్రం 6.30 గంటలకు వేదపండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాకంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని, సంకల్పం, భక్తసంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణో త్సవాన్ని నిర్వహించారు. అనంతరం నక్షత్రహారతి, మంగళహారతులతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. భక్తులు వేలాదిగా హాజరై కల్యాణ వేంకటేశ్వరుడిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందడోలికల్లో ఓలలాడారు. గోవింద నామస్మరణతో పులకింతులయ్యారు. అంతకు ముందు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకరణలో శ్రీనివాసుడు భక్తులను కరుణించారు. రాత్రి 10 నుంచి 10.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. తదుపరి రాత్రి 10.30 గంటల తర్వాత ఏకాంత సేవ జరిగింది. చివరి సేవతో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్ ఎల్ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుపతి ఎమ్పీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ కల్యాణచక్రవర్తి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, జేఈఓ సదాభార్గవి తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పుష్పయాగం సప్తవర్ణశోభితంగా భక్తులను కనువిందు చేసింది. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ, వీపీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్ ఎల్ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీనివాసుడికి నమూనా ఆనంద నిలయంలో శనివారం ఉదయం పుష్పయాగం నయనానందకరంగా జరిగింది. ఆ దివ్యమనోహర దృశ్యాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు. స్వామి, అమ్మవార్లకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు, నూరువరహాలు, కనకాంబరాలు తదితర 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి రెండు టన్నుల సుగంధభరిత పుష్పాలతో ఆద్యంతం శోభాయమానంగా సాగిన పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఉత్సవాల్లో, నిత్యకైంకర్యాల్లో అర్చకులు, అధికార, అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏదైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణతో సమస్తదోషాలు పరిహారమవుతాయని విశ్వాసం. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. నిత్యకైంకర్యాలు శ్రీవారికి ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులును వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. -
సంప్రదాయ సేద్యం వైపు రైతులు..!
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న నాణ్యతలు.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ధరలు కూడా ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. సహజ సిద్ధ పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. సాగులో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో ఆ దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోంది. దీంతో ఏటా జిల్లాలో ప్రకృతి సేద్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఆత్మకూరురూరల్: రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా దశాబ్దకాలంగా సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం సాగిస్తున్న మెట్ట రైతులు పంటల దిగుబడిలోనే గాకుండా తమ భూములను సారవంతం చేస్తూ వ్యవసాయ రంగంలో స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం మహిమలూరులో తొలుత సహజ సేద్యం ప్రారంభమైంది. గడిచిన ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో జిల్లాలో ప్రతి మండలంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గోమూత్రం, వివిధ రకాల చెట్ల ఆకులు తదితరాల మిశ్రమాన్ని మగ్గబెట్టడం ద్వారా తయారయ్యే కషాయాలను పంటలకు తగు మోతాదులో అందజేస్తూ ఆశించిన ఫలితాలు రాబడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టడంతో జిల్లాలోని రైతులు అన్ని మండలాల్లో ఈ విధానానికి ఆకర్షితులయ్యారు. ఒక్కో మండలంలో ప్రకృతి వ్యవసాయ ప్రధాన గ్రామాన్ని ఎంపిక చేసి సాగును ప్రారంభించారు. తొలి విడతలో 26గ్రామాలు, 2వ విడతలో 14, 3వ విడతలో 20, 4వ విడతలో 46, ఐదో విడతలో 22 ప్రకృతి వ్యవసాయ అధ్యాయన గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. జిల్లాలో మరో 27 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేసేందుకు ప్రాథమిక ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. ఏడో విడతలో జర్మనీ నిధులతో ప్రత్యేక ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పలు రకాల పంటల సాగు ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, పిండి పదార్థాలు తదితర రకాలను అంతర పంటలుగా మిశ్రమ పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. భూమిని పచ్చగా ఉంచడం ద్వారా భూసారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చనే మూల సిద్ధాంతాన్ని రైతులు ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. పత్తి, వరి, మామిడి, మినుములు, పెసర, తదితర పంటల సాగుతో పాటు 9 నుంచి 18 రకాలను ఏకకాలంలో పీఎండీఎస్ (ప్రీ మాన్సోన్ డ్రై సోయింగ్) విధానంలో పంటల సాగు చేపట్టడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మిశ్రమ పంటలతో మెరుగైన ఫలితాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతు మిశ్రమ పంటలు సాగు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు భూమి సేంద్రియ పద్ధతుల్లో సారవంతం చేసుకోవడానికి ప్రకృతి వ్యవసాయం బలమైన చేయూతనిస్తోంది. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని స్థిరమైన ఆదాయం పొందగలుగుతున్నాం. – ఇరగన శ్రీనివాసులు, రైతు, మహిమలూరు, ఆత్మకూరు మండలం ఖర్చులు సగానికి పైగా తగ్గింపు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగులో రైతులకు అయ్యే ఖర్చులను సగానికిపైగా తగ్గించగలుగుతున్నాం. ఈ పద్ధతిలో ఉత్పత్తి అయిన వరి, మినుము, పెసర, కూరగాయలు, రకరకాల పండ్లు, ఇప్పటి వరకు స్థానిక రైతులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఆయా పంట ఉత్పత్తులకు తగు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నాం. – చంద్రశేఖర్, ఎస్డీఏ (సబ్ డివిజన్ యాంకర్), ఆత్మకూరు అంతర్ పంటల సాగుతో ఆదాయం మా పొలాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, పత్తి ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నాం. అధికారుల సూచనలతో 18 రకాల చిరుధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు అంతర్ పంటలుగా సాగు చేసి ఆదాయం పొందుతున్నాం. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్నాం. – చిరుమామిళ్ల రాధమ్మ, మహిళా రైతు, బసవరాజుపాళెం, ఆత్మకూరు మండలం జీవామృతంతో మేలైన విత్తన శుద్ధి ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో తయారు చేస్తున్న జీవామృతంతో మేలైన విత్తనశుద్ధి ద్వారా పంట దిగుబడిలో ఆశాజనకమైన ఉత్పత్తులు పొందుతున్నాం. మేము సాగు చేసిన పత్తి పైరులో 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం పిచికారీ చేస్తున్నాం. పిండినల్లి, రసం పీల్చు పురుగు వంటి నివారణ కోసం నీమాస్త్రం, ఇంగువ ద్రావణం పిచికారీ చేసి సత్ఫలితాలు పొందుతున్నాం. – గాలి విజయలక్ష్మి, మహిళా రైతు, బసవరాజుపాళెం, ఆత్మకూరు మండలం -
విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు వైఎస్సార్
పొదలకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. వ్యవసా యానికి ఉచితంగా ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి రైతులకు అండగా నిలిచారు.’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సర్వేపల్లి నియోజకవర్గ రైతులకు వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద గురువారం ఒకే పర్యాయం 55 ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను వైఎస్సార్ నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. 1.91 లక్షల మంది రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తున్నామని, ఇందుకోసం రూ.70 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 476 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, 301 మందికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ విజయకుమార్‌రెడ్డి, ఈఈ జయకష్ణారెడ్డి, డీఈ దొరస్వామిరెడ్డి, ఏఈ గోవర్ధన్‌గిరి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ నగేష్‌కుమారి, ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ చిట్టెమ్మ, నాయకులు పెదమల్లు రమణారెడ్డి, కోనం బ్రహ్మయ్య, వాకాటి శ్రీని వాసులురెడ్డి, ఎంపీటీసీలు జి.శ్రీనివాసులు, జి.లక్ష్మీకల్యాణి, ఎస్కే అంజాద్ పాల్గొన్నారు. -
నెల్లూరులో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు
-
సస్యశ్యామలం.. సిరుల పంటలకు సంగం బ్యారేజీ సిద్ధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సంగం బ్యారేజీ చివరి దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి.. ఈ సీజన్లోనే ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్ సర్కార్ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. జలయజ్ఞంలో భాగంగా కొత్త బ్యారేజీకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. బ్యారేజీ పనులు చేయడంలో టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతుల కలల బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బీడు భూముల్లో సిరుల పంటలు పండనున్నాయి. ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు యోగ్యకరం కానుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంకరార్పణ చేస్తే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణ పనులు పూర్తిచేశారు. శిథిలావస్థలో ఉన్న 135 ఏళ్ల నాటి ఆనకట్ట కమ్ బ్యారేజీ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. త్వరలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. బ్రీటీష్ కాలంలో సింహపురి ప్రాంత అన్నదాతల కోసం నిర్మించిన సంగం బ్యారేజ్ శిథిలావస్థకు చేరుకుంది. సాగునీటి కోసం అన్నదాతలు, తాగునీటి కోసం నెల్లూరు ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంగం బ్యారేజీ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. సంగం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిపక్షనేత హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంగం పర్యటించారు. అన్నదాతల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంగం వద్ద పెన్నానదిలో నూతన బ్యారేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.122.50 కోట్ల వ్యయంతో 2006లో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ అకాల మరణంతో బ్యారేజీ పనులు నత్తనడకన సాగాయి. బ్యారేజ్‌పై రాకపోకల కోసం ఏర్పాట్లు నిర్మాణం పూర్తి సంగం నూతన బ్యారేజ్ నిర్మాణ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసింది. 1,195 మీటర్ల పొడవుతో పెన్నానదిలో బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్యారేజ్‌కి 85 గేట్లు ఏర్పాటుచేసి వాటి నిర్వహణకు మోటార్లు సైతం ఏర్పాటు చేశారు. బ్యారేజ్ నుంచి కుడివైపు కనుపూరు కాలువ, నెల్లూరు చెరువుకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎడమ వైపు కనిగిరి రిజర్వాయర్, బెజవాడ పాపిరెడ్డి కాలువలకు నీటిని విడుదల చేసే నిర్మాణాలు పూర్తయ్యాయి. సంగం పాత ఆనకట్ట జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల జిల్లాలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిధుల వృథాకు చెక్ పాత ఆనకట్ట వల్ల కనుపూరు కాలువ, బెజవాడ పాపిరెడ్డి కాలువకు నీరు అందించేందుకు ప్రతి సంవత్సరం రూ.50 లక్షలకు పైగా నిధులతో ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి నీరు అందించేవారు. నూతన బ్యారేజ్ నిర్మాణం వల్ల ఇసుక బస్తాలతో పనిలేకపోవడంతో ప్రతి సంవత్సరం రూ.50లక్షలకు పైగా ప్రజాధనం వృథా కాకుండా నిలిచిపోతుంది. పైగా సంగం బ్యారేజ్ వద్ద 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. మరోవైపు భూగర్భజలాలు పెరిగి నీరు మోటార్లకు సైతం అందుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకల సమస్యకు బ్రేక్ నిత్యం సంగం పాత బ్యారేజ్ పైన రాకపోకలు స్తంభించేవి. ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు ఉండేది. త్వరలో ఈ సమస్య తీరిపోనుంది. నూతన బ్యారేజ్ మీద రాకపోకల కోసం 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించారు. రెండు వైపులా వాహనాలు తిరిగే వీలు ఏర్పడింది. పాదచారులు నడిచేందుకు వీలుగా 1.5 మీటర్ల నడక దారిని సైతం నిర్మించారు. సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు సౌకర్యం మెరుగుపడుతుంది. ఆనందంలో అన్నదాతలు కలలు కార్యరూపం దాల్చడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి, పనులు పూర్తిచేసిన ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నూతన బ్యారేజ్‌కు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం జగన్మోహన్రెడ్డి మంచితనానికి నిలువెత్తు నిదర్శనమని అన్నదాతలు, ప్రజలు హర్షాతిరేకాల మధ్య చెబుతున్నారు. అపర భగీరథుడు డాక్టర్ వైఎస్సార్ సంగం బ్యారేజ్ స్థానంలో నూతన బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడు. అన్నదాతల కష్టాలు తెలిసిన నేత నూతన బ్యారేజ్‌తో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. సాగునీరు పొందిన ప్రతి రైతు ఆ మహానుభావుడి పేరును చిరకాలం గుర్తుంచుకుంటారు. – పులగం శంకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తండ్రికి మించిన తనయుడు తండ్రి శంకుస్థాపన చేసిన సంగం నూతన బ్యారేజ్‌ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన తనయుడు. అన్నదాతల కష్టాలు తీర్చిన తండ్రి, తనయులను ఎప్పుడూ గుర్తించుకుంటారు. – కంటాబత్తిన రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం సంగం నూతన బ్యారేజ్‌కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం. దీని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను నమ్ముకున్న వారికి ఎంతటి మర్యాదనిస్తారో తెలియచెప్పారు. అంతేకాకుండా తన దగ్గరి వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటారనే విషయం మరోమారు రుజువైంది. – ముడి మల్లికార్జునరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, మర్రిపాడు -
కోర్కెలు తీరాలి.. మళ్లీ రావాలి (ఫొటోలు)
-
స్వర్ణాల తీరం.. జనసంద్రం
రొట్టెల పండగకు భక్తులు పోటెత్తారు. స్వర్ణాల తీరానికి వెళ్లే ప్రతి మార్గం గురువారం కిటకిటలాడింది. బారాషహీద్‌లను స్మరించుకుని కోర్కెలు తీరాలని చెరువులో ఒకరికొకరు రొట్టెలు మార్చుకున్నారు. పండగకు అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు పర్యవేక్షించి ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. నెల్లూరు సిటీ: స్వర్ణాల తీరం జనసంద్రమైంది. గంధ మహోత్సవం తర్వాత రొట్టెల కోసం పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈక్రమంలో దేశ, విదేశాల నుంచి గురువారం దర్గాకు అధికంగా వచ్చి బారాషహీద్‌లను దర్శించుకుని కోర్కెల రొట్టెలను స్వీకరించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన గంధ మహోత్సవం గురువారం తెల్లవారుజాము వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, ముఖ్య నాయకులు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన ప్రభుత్వ ఆదేశాల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఘాట్ నిర్వహణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. పక్క జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఆరోగ్య రొట్టె ఉందా? ఈ ఏడాది ఆరోగ్య రొట్టెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనికోసం అనేకమంది వెతుకులాడారు. రెండు సంవత్సరాలపాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకమంది వైరస్ బారినపడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రొట్టె కోసం డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. బందోబస్తును పరిశీలించిన ఎస్పీ నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ సందర్భంగా గురువారం బారాషహీద్ దర్గాకు ఎస్పీ సీహెచ్ విజయారావు విచ్చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. రొట్టెల మార్పిడి ప్రదేశంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, నిర్దేశిత ప్రదేశంలోనే రొట్టెలు మార్పిడి చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంధ మహోత్సవం సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులకు అప్పగింత గురువారం దర్గా ఆవరణం భక్త జనసందోహంతో కిక్కిరిసింది. క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ నేరస్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఓ పాతనేరస్తుడిని అదుపులోకి తీసుకుని రూ.3 వేల నగదు, ఓ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి వాటిని అప్పగించారు. తప్పిపోయిన పదిమంది చిన్నారులను పోలీసులు సంరక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏఎస్పీ (క్రైమ్స్) కె.చౌడేశ్వరి పర్యవేక్షణలో నగర ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ పటిష్ట చర్యలు తీసుకున్నారు. మంటలు ఆర్పే పరికరాల ఏర్పాటు అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు. దర్గా ప్రధాన ద్వారంతోపాటు దుకాణాల వద్ద మంటలను ఆర్పే సిలిండర్లు, పరికరాలను అందుబాటులో ఉంచారు. రొట్టెల మార్పిడి ప్రదేశం వద్ద ఫైర్ ఇంజిన్లు, మినీవాటర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, రెస్క్యూ బోట్లను అందుబాటులో ఉంచారు. అగ్నిమాపక« అధికారి కె.శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది దర్గా ఆవరణలో విధులు నిర్వహిస్తున్నారు. రొట్టెల కోసం.. నెల్లూరు(మినీబైపాస్): కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు స్వర్ణాల చెరువు వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరోగ్య, వ్యాపార, ధన, చదువు, గృహ తదితర రొట్టెలను తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇల్లు నిర్మించుకోవాలని.. చాలా సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మంచుకోవాలని కోరిక. పలువురు చెప్పడంతో ఇక్కడికి వచ్చి గృహ రొట్టె పట్టుకున్నా. జనాన్ని చూసిన తర్వాత ఇల్లు కట్టుకుంటామని నమ్మకం కుదిరింది. – లలిత, నెల్లూరు ఆరోగ్య రొట్టె పట్టుకున్నా ప్రతి సంవత్సరం రొట్టల పండగకు వస్తున్నా. పలురకాల రొట్టె పట్టుకున్నా. ఈ ఏడాది ఆరోగ్య రొట్టె పట్టుకున్నా. అందరూ బాగుండాలని ప్రార్థించా. – రసూల్, నెల్లూరు -
కోర్కెల రొట్టె.. ఒడిసి పట్టు
మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనం, సౌభాగ్యం, వివాహం, ఆరోగ్యం, ప్రమోషన్, గృహం.. కోర్కెల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మది నిండా భక్తి, విశ్వాసంతో కోరిన కోర్కె›లు తీరి వదిలే రొట్టెలు, కోర్కెలతో రొట్టెలను పట్టుకునే భక్తులతో పవిత్ర స్వర్ణాల తీరం జనసంద్రంగా మారింది. భక్తజనంతో బారాషహీద్ దర్గా పులికించింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నెల్లూరు సిటీ: ఎన్నెన్నో కోర్కెలతో రొట్టెల పండగకు వచ్చిన భక్తులతో బుధవారం బారాషహీద్ దర్గా పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నమ్మకానికి ప్రతీకగా ఉండే బారాషహీద్‌లను దర్శించుకునే భక్తులతో దర్గా దారులు జనప్రవాహమయ్యాయి. స్వర్గాల చెరువు జనసంద్రమైంది. విద్య, ఆరోగ్య, వివాహ, సౌభాగ్యం వరాలను పొందేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలు మార్చుకున్నారు. ఉద్యోగం, వివాహం, ఆరోగ్య ఇతర రొట్టెలను తీసుకున్నారు. అనంతరం క్యూలైన్లలో నిరీక్షించి 12 మంది అమరవీరులను స్మరిస్తూ, దర్శించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత రవాణా బారాషహీద్ దర్గాకు వచ్చే భక్తుల్లో నడవలేని వృద్ధులు, దివ్యాంగులను కార్పొరేషన్ ఉన్నతాధికారుల కారుల్లో దర్గా వరకు తీసుకెళ్లి తీసుకువస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు దర్గాను సందర్శించేందుకు, రొట్టెలు మార్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీల్చైర్లను సైతం ఏర్పాటు చేసి భక్తులకు దర్గాను సందర్శించేందుకు అవకాశం కల్పించారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ విజయారావు, కమిషనర్ హరిత, ఇతర అధికారులు దర్గా ప్రాంగణంలో పర్యటించారు. ధనం రొట్టె వదిలాను మేము ఐదేళ్లు గా ఇక్కడకు వస్తున్నాం. కోరిన కోరి కలు మాకు తీరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా రాలేదు. ఇప్పుడు ధనం రొట్టెను వదిలాను. ప్రస్తుతం ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాను. మాతో పాటు మా బంధువులు కూడా వచ్చారు. – సుల్తానా బేగం, హైదరాబాద్ ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్నాం. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి. నా ఆరోగ్యం చాలా బాగోలేదు. రొట్టెను పట్టుకున్నాక.. కుదుట పడింది. అందుకే ఇప్పుడు కూడా ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాను. చాలా సేపటి నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు దొరికింది. – హసీనా, కోలార్ భక్త సుగంధమై.. రొట్టెల పండగలో కీలక ఘట్టం గంధమహోత్సవం. బుధవారం అర్ధరాత్రి దాటాక కోటమిట్టలోని అమీనియా మసీదులో సంప్రదాయంగా మతపెద్దలు, పీఠాధిపతుల ఆధ్వర్యంలో అత్తర్లు.. సుగం«ధ «ద్రవ్యాలు.. పన్నీరుతో పవిత్ర గంధాన్ని 12 బిందెల్లో భక్తిశ్రద్ధలతో కలిపారు. ప్రత్యేక ప్రార్థనలు, నమాజు అనంతరం గంధం నింపిన బిందెలను తీసుకుని విశేషంగా అలంకరించిన వాహనంపైకి చేర్చారు. ముందు నిషాని జెండా వెళ్తుండగా అశేష భక్తజనం వెంటరాగా భారీ బందోబస్తు నడుమ గంధమహోత్సవం కోటమిట్ట, జెండావీధి, పెద్దబజారు, ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోలు బంక్, జిల్లా పోలీసు కార్యాలయం, డీకేడబ్ల్యూ కళాశాల మీదుగా బారాషహీద్‌ల దర్గా వద్దకు చేరింది. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ఆధ్వర్యంలో ముజావర్లు, ఫకీర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం 12బిందెలలో తెచ్చిన గంధాన్ని బారాషహీద్‌లకు లేపనం చేశారు. అనంతరం గంధాన్ని భక్తులకు పంచారు. గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. కార్యక్రమాలను దర్గా ఫెస్టివల్ కమిటీ, దర్గా పరిరక్షణ కమిటీ, వక్ఫ్‌బోర్డు పర్యవేక్షించారు. – నెల్లూరు (బృందావనం) -
Andhra Pradesh: రెట్టింపు ఆనందం
సచివాలయ వ్యవస్థ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఇది ఒకటి. నిరుద్యోగులకు వాటిల్లో ఉద్యోగాలు లభించాయి. ఈ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నాయి. సంక్షేమ పథకాలు ఇళ్ల ముంగిటకే చేరుతున్నాయి. కొత్త జీతం జమ కావడంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. నెల్లూరు(అర్బన్): సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వెల్లవిరిసింది. వారి జీతం రెట్టింపు కావడమే దీనికి కారణం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి ప్రొబేషన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల్లా తొలిసారి పే స్కేల్, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన జూలై నెలకు సంబంధించిన వేతనం సోమవారం ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. జిల్లాలో 7,091 మంది ఉద్యోగులున్నారు. కొత్త జీతం పడడంతో గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కలెక్టర్ చక్రధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అలాగే డీపీఓ ధనలక్ష్మిని కలిసి మాట్లాడారు. ఆమె వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు కలెక్టరేట్లో సాక్షితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కల సాకారం చేసిన సీఎం నిరుద్యోగుల కలను సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. మా అందరికీ ఉద్యోగాలు కల్పి ంచారు. సమాజసేవలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. కొత్త జీతాలు పొందడం ద్వారా మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. – సందీప్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సౌత్‌మోపూరు సీఎం ఉద్యోగాల సృష్టికర్త సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాల సృష్టికర్త. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సకాలంలో ప్రొబేషన్ ఖారారు చేసి కొత్త జీతా లు విడుదల చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాం. సచివాలయ ఉద్యోగుల గుండెల్లో ముఖ్యమంత్రి చిరస్థాయిగా ఉంటారు. – మనోహర్, వీఆర్వో, వరికుంటపాడు, అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రుణపడి ఉంటాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్ ఖారారు చేశారు. అంతే వేగంగా కొత్త జీతాన్ని అందించారు. దీంతో ఒక్కసారిగా తమ జీతం రెట్టింపు అయ్యింది. దీంతో మా కుటుంబాల్లో ఆనందం వెల్లి విరిసింది. సీఎంకు రుణపడి ఉంటాం. – మల్లంపూడి సతీష్‌రెడ్డి, గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గ్రామ స్వరాజ్యం సాకారం ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే అందేలా చేసి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సకాలంలో ప్రొబేషన్ డిక్లేర్ చేసినందుకు కృతజ్ఞతలు. మా కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. – బాలారాజన్, సచివాలయ మున్సిపల్ అధ్యక్షుడు -
ఉద్యాన సిరులు
ఈమె పేరు పాదర్తి కృష్ణమ్మ. పొదలకూరు మజరా లింగంపల్లి. కృష్ణమ్మ ఈ ఏడాది 1.20 ఎకరాల్లో కూరగాయాల సాగు చేపట్టింది. ఉద్యానశాఖ ద్వారా ఆమెకు రూ.19,200 సబ్సిడీ బ్యాంకు ద్వారా ప్రభుత్వం అందజేసింది. కూరగాయాల సాగులో మెళకువలను తెలుసుకుని దిగుబడి సాధించారు. యర్రనాగు దొరసానమ్మ. మండలంలోని మొగళ్లూరు. ఆమె తన ఎకరా పొలంలో నిమ్మ మొక్కలు నాటారు. ఆమెకు ఉద్యానశాఖ ద్వారా ఈ ఏడాది రూ.9,602 రాయితీ లభించింది. ఉద్యానాధికారుల సలహాలు సూచనలతో చీడపీడలు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా అందజేస్తున్న రాయితీ వస్తుందని, దీనిపై ఆధారపడి నిమ్మ మొక్కలు నాటుకున్నట్టు వెల్లడించారు. ఈ రైతు పేరు అక్కెం అంకిరెడ్డి. మండలంలోని ముదిగేడు. తనకున్న 1.20 ఎకరాల్లో నిమ్మమొక్కలు నాటుకుని జీవిస్తున్నారు. ఉద్యానశాఖ రాయితీ సహకారంతో తోటలో మల్చింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఈ ఏడాది రూ.19,200 బ్యాంకులో సబ్సిడీ నగదు జమఅయ్యింది. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా కల్పిస్తున్న రాయితీలు రైతుకు ఉపయోగకరంగా ఉన్నాయి. పొదలకూరు: పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా 70 శాతం మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే పంట మార్పిడి పద్ధతిని రైతులకు అలవాటు చేసే దశగా ప్రభుత్వం ఉద్యాన పంటలను గణనీయంగా పెంచేందుకు కృషి చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు అదనంగా మరో 20 వేల హెక్టార్లలో సాగు పెంచేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. నిమ్మ, మామిడి విస్తీర్ణం పెరుగుతున్నా మిగిలిన పండ్ల తోటల సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ప్రభుత్వ ప్రకటిస్తున్న రాయితీలతో పండ్లు, కూరగాయలు, పూల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. మూడు విడతల్లో రాయితీ పండ్ల తోటల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని మూడు విడతలుగా పంపిణీ చేస్తోంది. పండ్ల తోటల సాగు ద్వారా అధిక దిగుబడులను సాధించేందుకు నూతనంగా తోటల అభివృద్ధి పరిచేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పండ్ల తోటలతో పాటు మల్లె, చామంతి, కనకాంబరం, బంతి, లిల్లీ పూల తోటల పెంపకానికి కూడా రాయితీలను అందజేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టే మొత్తం ఖర్చులో 40 శాతం రాయితీని హెక్టారుకు రూ.16 వేలు, ఇతర రైతులకు 25 శాతం హెక్టారకు రూ.10 వేలు అందజేస్తున్నారు. పూలపెంపకం మల్చింగ్‌కు రూ.16 వేలు, ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.10 లక్షలు, ప్యాక్‌హౌస్ రూ.2 లక్షలు, కోల్డ్‌స్టోరేజ్‌కు రూ.5.25 లక్షలు, సంకరజాతి కూరగాయాల పెంపకానికి హెక్టారుకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తున్నారు. యాంత్రీకరణకు రాయితీలు ఉద్యాన యాంత్రీకరణకు రాయితీలు అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు 50 శాతం, ఇతరులు 40 శాతం రాయితీ పొందవచ్చు. మినీ ట్రాక్టర్‌కు రూ.75 వేలు, పవర్ టిల్లర్ రూ.40 వేలు, తైవాన్ స్ప్రేయర్ రూ.8 వేలు రాయతీ కల్పిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు తోటల్లో నీటి కుంటల నిర్మాణానికి ఉద్యానశాఖ ద్వారా కమ్యూనిటీ నీటి కుంట రూ.20 లక్షలు, పంట కుంట రూ.75 వేలు అందజేస్తున్నారు. పంటల సాగుకు ప్రోత్సాహం ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలను అందజేస్తోంది. ప్రధానంగా పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. రైతుల అనుమానాలను క్షేత్రస్థాయికు వెళ్లి నివృత్తి చేస్తున్నాం. ఉద్యానశాఖ నిబంధనల ప్రకారం రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. – ఈ.ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు -
దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయ్
విధి వారి జీవితాల్లో విషాదం నింపింది. దొడ్డ మనస్సులు వారిని నడిపిస్తున్నాయి. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో కాళ్లు కోల్పోయి వీల్ చైర్లకు.. పాకడానికి పరిమితమైన వారిని కృత్రిమ కాళ్లు నడిపిస్తున్నాయి. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఎంతో మంది నిర్భాగ్యులకు జైపూర్ కృత్రిమ కాళ్లు, చేతులు అందిస్తోంది. మూడు రోజులుగా దివ్యాంగులు కృత్రిమ అవయవాల కోసం కొలతలు ఇచ్చేందుకు తరలివచ్చారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని ఆనంద పరవశులు అవుతున్నారు. నెల్లూరు (అర్బన్): సేవకు ప్రతి రూపం పేరును సార్థకం చేస్తూ జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దివ్యాంగులకు నాలుగైదేళ్లకోసారి జైపూర్ కృత్రిమ కాలు, చేతులు అందిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లకు పైగా కృత్రిమ అవయవాలు పొందేందుకు దివ్యాంగులకు బ్రేక్ పడింది. దెబ్బతిన్న కృత్రిమ అవయవాలను మార్చుకోవాలనుకునే అభాగ్యులు, కొత్తగా ప్రమాదాలు, జబ్బుల కారణంగా కాలు, చేయి పోగొట్టుకున్న వారు కృత్రిమ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సారథ్యంలో కలెక్టర్ చక్రధర్‌బాబు సహకారంతో ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు సుమారు 600 మందికి పైగా దివ్యాంగులకు జైపూర్ కృత్రిమ కాలు, చేయి ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం రెడ్‌క్రాస్ తొలిసారిగా ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించింది. దివ్యాంగుల జీవితాల్లో కొంత మేరకైనా వెలుగులు ప్రసాదించేందుకు పూనుకుంది. ఈ శిబిరాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రారంభించి అభినందించారు. సుమారు 600 మందికి ఉపకరణాలు అనేక మంది దివ్యాంగులు కృత్రిమ అవయవాలను కావాలని అడుగుతుండడంతో రెడ్‌క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ విషయాన్ని కలెక్టర్ చక్రధర్‌బాబు వద్దకు తీసుకెళ్లి 200 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 200 మంది కాదు కనీసం 500 మందికైనా కృత్రిమ అవయవాలు ఇవ్వండి.. అంటూ ప్రోత్సహించారు. ఈ క్రమంలో 500 మందికి కృత్రిమ కాలు, చేతులను ఏర్పాటు చేసేందుకు ఈ నెల 23 నుంచి స్థానిక మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ కార్యాలయంలో మూడు రోజుల పాటు కొలతలు తీసుకునేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే తొలి రోజే 540 మంది తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుమారు 600 మించివచ్చని రెడ్‌క్రాస్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. సంస్థల సహకారం భేష్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రాయచూరుకు చెందిన రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, జైపూరుకు చెందిన భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. తాము 1000 మందికైనా కృత్రిమ కాలు, చేయి అమర్చేందుకు సాయం చేస్తామంటూ ముందుకువచ్చాయి. వీరి సేవా నిరతికి దివ్యాంగులు తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రూ 1.50 కోట్ల ఖర్చు రెడ్‌క్రాస్ సంస్థ భోజనం, ఇతర వసతుల కోసం చేసే ఖర్చుతో పాటు ఫౌండేషన్ సంస్థలు అందించే కృత్రిమ కాలు, చేతుల ఏర్పాటుకయ్యే ఖర్చును పరిశీలిస్తే సుమారు రూ 1.50 కోట్లు ఖర్చు కానుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఊహించిన వారి కన్నా ఎక్కువ మంది వస్తుండటంతో ఖర్చు కూడా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. రెడ్‌క్రాస్ సంస్థకు రుణపడి ఉంటా నేను నెల్‌కాస్ట్ కంపెనీలో కార్మికుడిని. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో 5 నెలల క్రితం నా కాలును డాక్టర్లు తొలగించారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాను. జైపూర్ కాలు గురించి వినడమే తప్ప ఎవరి వద్దకు వెళ్లి ఏర్పాటు చేయించుకోవాలో తెలియలేదు. రెడ్‌క్రాస్ నా విషయం తెలుసుకుని కృత్రిమ కాలు ఏర్పాటు శిబిరానికి రావాలని నా ఫోన్‌కు మెసేజ్ పంపించారు. ఇప్పుడు వచ్చి కొలతలు ఇచ్చాను. నన్ను పిలిపించి కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తున్న రెడ్‌క్రాస్ వారికి రుణపడి ఉంటా. – కాకాణి రామకృష్ణ, బత్తలాపురం, ఓజిలి మండలం ఏడు నెలల క్రితమే ప్రణాళిక కొంత మంది తమకు కృత్రిమ చేయి, కాలు ఏర్పాటు చేయమని కోరారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు జైపూర్ కాలు చేయి ఏర్పాటు చేయించాలని 7 నెలల క్రితమే అనుకున్నాం. తమ పాలకవర్గ సభ్యులతో చర్చించాను. అందరి సహకారంతో కలెక్టర్‌కు తెలిపాం. కలెక్టర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించాం. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నాలాంటి పేదకు వరం కృత్రిమ కాలు నేను లారీ క్లీనర్‌ను. నాకు జరిగిన ప్రమాదంలో 2014లో ఆపరేషన్ చేసి డాక్టర్లు కాలు తీసేశారు. తర్వాత కొంత మంది దాతలు లోకల్‌గా తయారైన కాలును అమర్చారు. అయితే అది సెట్ కాలేదు. స్టీలు రాడ్ కూడా ఇచ్చారు. సెట్ కాలేదు. విధిలేని పరిస్థితుల్లో ఇంటికే పరిమితమయ్యాను. అయితే ఇప్పుడు రెడ్‌క్రాస్ ఖరీదైన, క్వాలిటీ ఉన్న జైపూర్ కాలును ఏర్పాటు చేసేందుకు కొలతలు తీసుకున్నారు. నాలాంటి పేదకు కృత్రిమ కాలు వరం. – ఎస్కే సందాని, వెంకటేశ్వరపురం, నెల్లూరు కందుకూరు రామమ్మ.. వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఈమె కూలి పని చేసుకునే నిరుపేదరాలు. దురదృష్టవశాత్తు ఆమెకు డయాబెటీస్ మిల్లిటస్ (షుగర్) వ్యాధికి గురైంది. షుగర్ కంట్రోల్ తప్పింది. కాలుకు గాయమై రక్త సరఫరా తగ్గిపోయింది. దీంతో రక్తసరఫరా తగ్గిన వరకు కాలును తీసేయాలని లేదంటే మిగతా కాలు కూడా పనికి రాదని డాక్టర్లు తెలిపారు. బాధాకరమైనప్పటికీ ఆమెకు డాక్టర్లు ఆపరేషన్ చేసి ఒక కాలును తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు మించి పోయింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైంది. నడిచేందుకు వీలులేకుండా పోయింది. రెడ్‌క్రాస్ ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల శిబిరం గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతం వెందోడుకు చెందిన రామమ్మ చెల్లెలు కుమార్తె పావనికి తెలిసింది. దీంతో పావని తమ పిన్నిని నెల్లూరు రెడ్‌క్రాస్ కార్యాలయానికి తీసుకువచ్చింది. కృత్రిమ కాలు ఏర్పాటుకు కొలతలు ఇచ్చింది. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కృత్రిమ కాలు కాలు ఏర్పాటు చేస్తే నడుస్తానని ఆనందంగా చెప్పింది. -
సింహపురికి కలియుగ దైవం
నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు జరుగనున్నాయని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అధికారులతో కలిసి శనివారం ఆయన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఆలయంలో నిత్యం నిర్వహించే అన్ని సేవలను భక్తులు వీక్షించే వీలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందు కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. టీటీడీ దిల్లీ సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి ఉదయం 5.30 గంటలకు సుప్రభాతం నుంచి రాత్రి 8.30 గంటలకు జరిగే ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వైభవోత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్న ప్రసాదాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. భక్తులందరూ స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి కృపకుపాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ నాగేశ్వరరావు ఎస్ఈ–2 జగదీశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, పీఆర్వో డాక్టర్ టి.రవి, ధార్మిక ప్రాజెక్ట్‌ల అధికారి విజయసారథి, పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాళ్లపాడుకు జలసిరులు
వర్షాధారిత ప్రాజెక్ట్‌గా మిగిలిన రాళ్లపాడుకు మహర్దశ పట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో జలసిరులు పొంగనున్నాయి. 1.1 టీఎంసీల సామర్థ్యం కలిగిన రాళ్లపాడు ప్రాజెక్ట్ నియోజకవర్గ రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరు. ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న భూములను సస్యశ్యామలం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఇప్పటికే సోమశిల జలాలను కేటాయించగా, తాజాగా వెలిగొండ నుంచి కూడా నీటి వాటాను కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాళ్లపాడులో నిరంతరం జలకళ తాండవియనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాళ్లపాడు ప్రాజెక్ట్.. రతనాల ప్రాజెక్ట్‌గా మారనుంది. కేవలం వర్షాధారితంగా నీటిని నింపుకునే ఈ ప్రాజెక్ట్‌కు ఇక నుంచి పుష్కలంగా నీటి వనరులు అందనున్నాయి. అటు పెన్నా, ఇటు కృష్ణా నది జలాలు తరలి రానున్నాయి. ఇప్పటికే సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టుకు పెన్నానది జలాలు వస్తుండగా, భవిష్యత్‌లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా నది జలాలు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. మరో పక్క రాళ్లపాడు ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిని పెంచేందుకు ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీంతో రాళ్లపాడు ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు, తాగునీటి అవసరాలకు పుష్కలంగా నీరు అందనుంది. నీటి వనరులతో సస్యశ్యామలం రాళ్లపాడు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.1 టీఎంసీలు. అధికారిక, అనధికారిక ఆయకట్టు కలుపుకుని మొత్తం 25 వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ పరిధిలోని 130 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు దాదాపు 2.2 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. తాజా నిర్ణయంతో సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీల నీరు అదనంగా ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కింద 20.14 కి.మీ. పొడవు ఉండే కుడి కాలువ పరిధిలో లింగసముద్రం, గుడ్లూరు, కొండాపురం మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 3 కి.మీ. పొడవు ఉండే ఎడమ కాలువ కింద లింగసముద్రం, వలేటివారిపాళెం మండలాల్లో 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. పూర్తిగా వర్షాధార ప్రాజెక్ట్ కావడంతో వర్షాలు పడి ప్రాజెక్ట్ నిండితేనే పంటలు పండుతాయి. గడిచిన దశాబ్దన్నర కాలంలో కేవలం రెండు, మూడు సార్లే పూర్తి స్థాయిలో పంటలు పండాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సోమశిల ఉత్తర కాలువ ద్వారా 1.5 టీఎంసీల నీటిని రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు కేటాయించారు. 1.17 టీఎంసీల వెలిగొండ జలాలు వెలిగొండ ప్రాజెక్టు నుంచి 1.17 టీఎంసీల నీటిని కేటాయిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. నీటి కేటాయింపుతో పాటు కాలువ పనులకు రూ.6.14 కోట్లు కేటాయించారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఉదయగిరికి నీటిని తరలించే ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్‌లోకి నీటిని మళ్లించనున్నారు. ఇక్కడి నుంచి రాళ్లపాడు వరకు మొత్తం 57 కి.మీ. దూరం ఉంది. కేవలం 4 కి.మీ. కాలువ తవ్వడం ద్వారా ఉప్పువాగు నుంచి నక్కలగండి చెరువుకు మళ్లించి అక్కడి నుంచి మన్నేరు ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టులోకి నీటిని తరలించాలనేది ప్రతిపాదన. త్వరలో టెండర్ల కేటాయించి, పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎడమ కాలువ పొడిగింపునకు రూ.27 కోట్లు రామాయపట్నం పోర్టు భూమి పూజకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టేందుకు రూ.27 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం 3 కి.మీ. పొడవు ఉన్న కాలువను 15.95 కి.మీ. మేర పొడిగించనున్నారు. తద్వారా కాలువ పరిధిలో ఉన్న ఆయకట్టు 1,500 ఎకరాల నుంచి 4 వేల ఎకరాలకు పెరుగుతోంది. చీమలపెంట, శాఖవరం, వీఆర్ కోట, కలవళ్ల, నలదలపూరు గ్రామాల చెరువులకు నీరు అందుతోంది. వర్షాధారితంగా చేరే నీటితో పాటు అదనంగా సోమశిల జలాలు 1.5 టీఎంసీలు, వెలిగొండ జలాలు 1.17 టీఎంసీలు మొత్తం 2.67 టీఎంసీలు రావడంతో ప్రాజెక్ట్ పరిధిలో ఆయకట్టు 40 వేల ఎకరాల వరకు పెరుగుతుందని అంచనా. ఎడమ కాలువ -
ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండగ
నెల్లూరు (సెంట్రల్): ఆగస్టు 9 నుంచి నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, కమిషనర్ జాహ్నవి, మేయర్ స్రవంతితో కలిసి వివిధ శాఖలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనా కారణంగా రొట్టెల పండగను నిర్వహించ లేకపోయామన్నారు. ఈ ఏడాది రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేద్దామన్నారు. ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. గత అనుభవాలు, లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా వైద్యం, మంచి నీరు, టాయిలెట్స్, విద్యుత్, పారిశుధ్యం, పోలీసులు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ దఫా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ రొట్టెల పండగను అందరం గర్వించేలా చేసుకుందామన్నారు. రెండేళ్ల తర్వాత నిర్వహించే ఈ పండగకు గతంలో కంటే లక్షల సంఖ్యలో అధికంగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ పండగలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొంటారని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బడ్జెట్ విషయంలో రాజీలేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారని, ముస్లిం మతపెద్దల సూచనల మేరకు రొట్టెల పండగ పూర్తి చేసుకున్న తర్వాత చేస్తామన్నారు. కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ముందుగా సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాటు, లోపాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. పండగ ముందు నుంచి ముగిసే వరకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటూ నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎస్పీ విజయారావు మాట్లాడుతూ పోలీసు శాఖ నుంచి ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఈ పండగను గతంలో నిర్వహించిన అనుభవం ఉన్న అధికారులను కూడా ఉన్నతాధికారుల అనుమతితో ఇక్కడకు తీసుకువస్తామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమరాలు ఏర్పాటు, పార్కింగ్, శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా ఉండే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఖలీల్‌అహ్మద్, పలువురు మతపెద్దలు పాల్గొన్నారు. -
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేవీఎన్ చక్రధర్‌బాబు.. ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నేటితో మూడేళ్లయింది. 2019 జూలై 16వ తేదీన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఆయన అడుగులు వేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపించి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో తనవంతు పాత్ర పోషించారు. చక్రధర్‌బాబు హయాంలో పలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వరించాయి. పీఎం ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై) పథకం అమలుకు సంబంధించి దేశం మొత్తంలో మూడు అవార్డులు రాగా, అందులో జిల్లాకు రెండు వచ్చాయి. రూ.10 లక్షల నగదు బహుమతిని కేంద్రం ప్రకటించింది. 2021 సంవత్సరంలో కలెక్టర్ పర్యవేక్షణలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా అమలు చేసినందుకు జిల్లా వ్యవసాయ శాఖకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందజేయడం, రూ.2.97 కోట్లను రుణాలుగా అందించి వారికి అవసరమైన యంత్రాలను సమకూర్చడంతో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘సఫాయీ మిత్ర సురక్ష చాలెంజ్’లో నెల్లూరు నగరపాలక సంస్థకు దేశంలో ప్రథమ స్థానం దక్కింది. ఉపాధి హామీ పథకంలో అమలులో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఏడు జాతీయ అవార్డులు వచ్చాయి. నెల్లూరు రూరల్ మండలంలోని పాత వెల్లంటి గ్రామ పంచాయతీకి ‘నానాజీ దేశ్ముఖ రాష్ట్రీయ పురస్కార్’ లభించింది. అదే వి«ధంగా స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా వందశాతం ఓడీఎఫ్ ప్లస్ లక్ష్యాలను సాధించడంతో జిల్లా పంచాయతీ విభాగానికి నగదు పురస్కారం లభించింది. -
ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలకు ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అవి సకాలంలో అందుతున్నాయా? లేదా? అని ఆరా తీస్తున్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. గురువారం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తమ సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజానీకం ఆశీస్సులు అందిస్తోంది. పథకాలు అందిస్తున్నాం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ నగరంలోని మూడో డివిజన్ వేణుగోపాల్ నగర్ ప్రాంతం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి అవి అందాయా? లేదా? అని తెలుసుకున్నారు. అర్హులందరికీ పథకాలను అందిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. జగనన్నపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం కావలి రూరల్ మండలంలోని కొత్తసత్రం, రామచంద్రాపురం, పట్టణంలోని ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పథకాలు ఎవరికైనా అందలేదా? అని ఆరాతీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. సమస్యలు తెలుసుకుని.. కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం గుండ్లపాళెంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను ఆరాతీశారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పేదల కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. త్వరగా పరిష్కరించాలి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఏఎస్‌పేట బిట్–1లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై గురువారం ఏఎస్‌పేటలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అర్జీదారులతో మాట్లాడారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఉద్యోగులను ఆదేశించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. -
సింహపురి సిగలో మరో మణిహారం
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు హడావుడి శంకుస్థాపనకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పరిమితం కాగా, చిత్తశుద్ధితో నిర్మాణ పనులు చేపట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అవసరమైన భూసేకరణ పూర్తయింది. ఈనెల 20న పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం సింహపురి ఉన్నతికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంది. విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూనే పారిశ్రామికాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయనున్నారు. ఉదయగిరిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చింది. జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి తగినట్లుగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇదివరకే అదానీ కృష్ణపట్నం పోర్టు సమీçపంలో క్రిస్ సిటీకి కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చాయి. మరోవైపు బయో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించింది. ఎగుమతులకు తగినట్లుగా.. రాష్ట్రానికి విశాల సముద్ర తీరం ఉంది. మునపటి రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి సిమెంట్, ఐరన్, పొగాకు ఇంకా పలురకాల ఖనిజాలు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. బొగ్గు, ఎరువులు తదితరాల దిగుమతి జరుగుతోంది. ఈ వ్యవహారమంతా ప్రస్తుతం అదానీ కృష్ణపట్న ం పోర్టు ద్వారా కొనసాగుతోంది. తదుపరి చెన్నై ఓడరేవు అందుబాటులో ఉంది. ఉత్పత్తుల ఎగుమతులకు కృష్ణపట్నం ఓడరేవు సామర్థ్యం సాధ్యపడకపోవడంతో రామాయపట్నం పోర్టు తెరపైకి వచ్చింది. 25 మిలియన్ టన్నుల సామర్థ్యంలో రూ.10,640 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టనున్నారు. మొత్తం 19 బెర్తులు కట్టనున్నారు. తొలివిడతలో ఒకటి కోల్, రెండు బెర్తులు కంటైనర్లు, ఒక బెర్త్ మల్టీపర్పస్ కోసం నిర్మించదలిచారు. పోర్టుకు అనుబంధంగా ఏపీఐఐసీ పరిధిలో భూసేకరణ చేస్తున్నారు. అందులో అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. ఎంతో ప్రాధాన్యం కలిగిన రామాయపట్నం పోర్టు నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీగా మిగిలిపోవడం మినహా కార్యరూపం దాల్చలేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో హడావుడిగా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,736 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. పోర్టుకు అవసరమైన 803 ఎకరాలను సేకరించారు. ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పెద్దఎత్తున ఉద్యోగాలు చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్ఎంఈ రంగాల పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దక్కనుంది. తొలిదశ కోసం పర్యావరణ అనుమతులు, కండలేరు ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా అనుమతులు పూర్తయ్యాయి. అలాగే సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటీవ్ లిమిటెడ్ (క్రిబ్కో) పరిధిలో రూ.560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. కష్టాలు తొలగిపోతాయి రామాయట్నం పోర్టు నిర్మిస్తే అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఇది శుభపరిణామం. జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలతో యువత వారి అర్హతకు తగ్గట్లుగా ఉపాధి పొందుతారు. పారిశ్రామికాభివృద్ధితో కష్టాలు తొలగిపోతాయి. – వంశీ, నవాబుపేట యువతకు మంచిరోజులు జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే అనేక పరిశ్రమలు నెల్లూరుకు వచ్చాయి. మరిన్ని ఏర్పాటుతో యువతకు బాగా ఉద్యోగాలొస్తాయి. వారికి మంచి రోజులొచ్చాయి. – అరవ యాకుబ్, స్టౌన్‌హౌస్‌పేట -
నాణ్యమైన విద్యే లక్ష్యం
పాఠశాలల్లో కొన్ని తరగతుల విలీనం చేయడం ద్వారా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల తరగతులు, హైస్కూల్లో ప్రాథమికోన్నత పాఠశాల తరగతులు విలీన ప్రక్రియను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరంభించింది. అయితే ఈ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నా.. విద్యార్థుల్లో కింది తరగతుల నుంచే విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే విద్యా విధానంలో అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా 2022–23 విద్యా సంవత్సరం నుంచి మరో కొత్త అడుగు వేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఒకటి నుంచి మూడు కి.మీ. దూరంలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖాధికారులు ఈ మేరకు పాఠశాలల విలీనం మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. మరికొన్ని పాఠశాలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 17,588 మంది విద్యార్థులు విలీనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కి.మీ. దూరంలోపు ఉన్న 478 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 276 హైస్కూల్స్ల్లోకి విలీనం చేశారు. మరో 113 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను 87 ప్రా«థమికోన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. కిలో మీటరు నుంచి 3 కి.మీ.లోపు ఉన్న 19 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులను 15 ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,588 మంది విద్యార్థులు విలీనమయ్యారు. ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్‌గా ఏర్పాటు నూతన విద్యావిధానం అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి హైస్కూల్స్ ప్లస్‌గా తరగతుల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్‌గా పీపీ–1, పీపీ–2, 1 నుంచి 5 తరగతుల వరకు, ప్రీ హైస్కూల్స్‌లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, హైస్కూల్లో 3 నుంచి 10వ తరగతి వరకు, హైస్కూల్ ప్లస్ స్కూల్లో 3 నుంచి 12 తరగతుల వరకు నిర్వహిస్తారు. నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడిని నియమించనున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు నూతన విద్యా విధానం అమలు చేయడంతో ఉపాధ్యాయులను త్వరలో సర్దుబాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికే అవసరానికి మించి 2,514 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు. 980 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు తేలింది. వీరిని విద్యార్థులు ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలను గుర్తించి సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఉపాధ్యాయులకు వారంలో 30 నుంచి 32 గంటలకు మించి పనిభారం పడకుండా 45 పిరియడ్లకు మించకుండా చర్యలు తీసుకోనున్నారు. విలీనం వల్ల ఉపయోగాలు విద్యార్థుల్లో ప్రాథమిక తరగతుల నుంచి విద్యా పునాదులు వేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులు ఉన్నా.. విద్యార్థులను బట్టి ఒకరిద్దరూ మాత్రమే ఉపాధ్యాయులు ఉంటారు. దీని వల్ల ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులను బోధించడం వల్ల ప్రాథమిక స్థాయిలో మెరుగపడడం కష్టం. అదే 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే సబ్జెక్ట్‌కు ఒక టీచరు బోధించడం వల్ల విద్యార్థులోనైపుణ్యం పెరగడంతో పాటు ఉత్తమ బోధన అందుతుంది. ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్, గ్రంథాలయం ఉండడం వల్ల విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది. ఆటలు ఆడుకునేందుకు విశాల మైదానం ఉంటుంది. బాలురు, బాలికలకు విడివిడిగా టాయ్‌లెట్స్ ఉంటాయి. వీటితో పాటు మెరుగైన వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ ఆలోచన. విద్యార్థులకు ఎంతో మేలు 3, 4, 5 తరగతులను హైస్కూల్స్‌ల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచరు ఉండడం వల్ల సబ్జెక్ట్‌పై విషయ పరిజ్ఞానం పెంచకునేందుకు వీలు పడుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 117ను స్వార్థంగా ఆలోచించే ఉపాధ్యాయలు మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. – జీవీ ప్రసాద్, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఏ ఒక్క పాఠశాల మూతపడదు నూతన విద్యా విధానం వల్ల ఏ ఒక్క పాఠశాల మూతపడదు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కి.మీ. లోపు ఉంటే హైస్కూల్స్‌కు పంపిస్తున్నాం. ఆరు అంచెల విద్యావిధానాన్ని అమలు చేస్తున్నాం. 3, 4 ,5 తరగతులకు సబ్జెక్ట్‌కు ఒక టీచరు ఉండడం వల్ల నాణ్యమైన బోధన అందుతుంది. హైస్కూల్స్‌ల్లో పూర్తిస్థాయిలో వసతులు ఉంటాయి. – పి. రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి -
నెల్లూరులో గ్యాస్ పరిశ్రమ ఏర్పాటు పనులు షురూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ అందించేందుకు అనుమతులు పొందిన ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులు షురూ చేసింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పనుల పరిశీలన... వెంకటరెడ్డి పాళెం పంచాయితీ పరిధిలోని ఓజ్లీలో ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులను సూళ్లూరు పేట ఆర్డీఓ పరిశీలించారు. పరిశ్రమ నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఆయన సర్వే సిబ్బందితో కలిసి నిశితంగా సమీక్షించారు. చెరువులో గానీ, గురుకుల పాఠశాల, వాకాటి వారి కండ్రిగ, రాజు పాలెం ఎస్టీకాలనీలకు సమీపంలో నిర్మాణాలు ఏమైనా చేపట్టారా అనే అనుమానాల నేపధ్యంలో ఈ పరిశీలన జరిపినట్టు ఆయన వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం పరిశ్రమ ప్రతినిధులు, గ్రామస్తులతో అధికారుల బృందం మాట్లాడింది. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులు తమ పరిశ్రమ ఏర్పాటు సంబంధిత వివరాలు అందించారు. ఓజ్లిలో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్సన్నాహాలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీగా ఏజీ అండ్ పీ ప్రథమ్‌కు 12 సీజీడీ లైసెన్లనుపెట్రోలియం– సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్ జీఆర్బీ) మంజూరు చేసింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 34 జిల్లాల్లో ప్రతి రోజూ వినియోగం కోసం గ్యాస్‌ను ఏజీ అండ్ పీ అందిస్తుంది. అలా సంస్థ సరఫరా చేస్తోన్న ఓ గ్రామమే నెల్లూరు జిల్లాలోని ఓజ్లి గ్రామం.జ్లీ వద్ద ఎల్‌సీఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటుచేయడం కోసం పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ; డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్ (డిష్); ద ఫైర్– స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (ఫైర్ ఎన్ ఓసీ), నెల్లూరు నగరాభివృద్ధి సంస్ధ (నుడా), అపెక్స్ సేఫ్టీ స్టాట్యూటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కంపెనీ అవసరమైన అన్ని అనుమతులను తీసుకుంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంగీకారం (సీటీఈ) సైతం పొందింది. పరిశ్రమ ఏర్పాటులో వర్తించేటటువంటి అన్ని చట్టాలకూ, అదే విధంగా స్టెయినబల్ గ్యాస్ ఆర్ధిక వ్యవస్ధ సృష్టికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రతినిధులు వివరించారు. -
నిర్బంధ విద్యపై నిఘా
మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా కళాశాలలు, కోచింగ్ సెంటర్లు నిర్బంధ విద్యకు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు కోచింగ్ సెంటర్ల కార్యకలాపాల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీ (డీఎంఎస్సీ)కి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా సమావేశాలు పెట్టి ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్ల లోపాలపై చర్యలకు సిఫారసు చేస్తే ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. నెల్లూరు (టౌన్): బలవంతపు చదువులకు స్వస్తి చెబుతూ ప్రశాంత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పర్యవేక్షణ కమిటీలతో శ్రీకారం చుట్టింది. ఇంటర్ నుంచే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్›డ్, నీట్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లో మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై బలవంతపు చదువులను రద్దుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఒక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలకు లోనుకాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అనువైన పరిస్థితులను ఆయా కళాశాలల్లో కల్పించాలని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 204 జూనియర్ కళాశాలలు ఉంటే.. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యం 65, ప్రైవేట్ 139 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 57,647 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 28,510, ద్వితీయ సంవత్సరం 29,137 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 20కు పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలను పునః ప్రారంభించారు. పరీక్షల్లో ర్యాంకుల కోసం ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు వీరిని చదివిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. డీఎంఎస్సీ కమిటీ ఏర్పాటు జిల్లాలో జూనియర్ కళాశాలలు, కోచింగ్ సెంటర్లు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా మానిటరింగ్ అండ్ సూపర్వైజింగ్ కమిటీకి గౌరవాధ్యక్షులుగా కలెక్టర్ చక్రధర్‌బాబు వ్యవహరించనున్నారు. కమిటీ అధ్యక్షులుగా జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కన్వీనర్‌గా జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి శ్రీనివాసులు, సభ్యులుగా ఆర్ఐఓ వరప్రసాదరావు, డీఈఓ రమేష్, డీఎంహెచ్ఓ పెంచలయ్య, సీడీపీఓ అనూరాధ, ఫుడ్‌సేఫ్టీ అధికారి నీరజ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు జాషువా, మానసిక వైద్యులు డాక్టర్ క్రిష్టినా, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ రమ్య ఉంటారు. ఇప్పటికే కలెక్టర్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. కమిటీ విధి, విధానాలు కమిటీ సభ్యులు ప్రతి నెలా జిల్లాలో 2 జూనియర్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలి. అక్కడ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకు వస్తున్నారనే కారణాలను గుర్తించాలి. కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థులతో మమేకమై వారి సాధక బాధలను అడిగి తెలుసుకోవాలి. వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఆత్మహత్యల నివారణకు మార్గనిర్దేశం ఇవ్వాలి. ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించే కళాశాలలను గుర్తించాలి. వాటిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదించాలి. ఇంటర్ విద్యలో సంస్కరణలను సూచించాలి. కళాశాల సందర్శన, పరిశీలన వివరాలతో కూడిన నివేదికను తయారు చేసి ప్రతి నెలా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రతి నెలా జేసీ అధ్యక్షతన కమిటీ సభ్యులు కలిసి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలి. అక్కడ గుర్తించిన సమస్యలు, వివరాలను సమావేశంలో వారి దృష్టికి తీసుకెళ్లాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించే కళాశాలలను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తాం. ఆయా కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో నాణ్యమైన భోజనాన్ని అందించాలి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వసతులు కల్పించాలి. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా తరగతులు నిర్వహించాలి. – ఎ.శ్రీనివాసులు, డీవీఈఓ, కమిటీ కన్వీనర్ -
ఆక్వానందం.. ‘టైగర్’ రీ ఎంట్రీ
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఆక్వా సాగుకు మళ్లీ పూర్వవైభవం మొదలైంది. కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులతో నష్టాలు చవిచూసిన ఆక్వారైతులు ప్రకృతి అనుకూలం, ప్రభుత్వం ప్రోత్సాహంతో క్రమంగా లాభాలు చూస్తున్నారు. గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీగా కరెంట్ బిల్లులు, నకిలీల బెడదతో అక్వా సాగు అంటేనే రైతులు హడలెత్తిపోయే పరిస్థితులు ఉండేవి. చాలా మంది రైతులు నష్టాలు భరించలేక పంట విరామం ప్రకటించి సాగుకు దూరమయ్యారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆక్వా రంగానికి ప్రాధాన్యతనివ్వడంతో తిరిగి ఊపిరి పోసుకుంది. ఆక్వా సాగుకు విద్యుత్ రాయితీలు ప్రకటించడంతో పాటు ఏపీ ఆక్వా కల్చర్ యాక్ట్, ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్–2020 ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌కు అవకాశం కల్పించడం, నకిలీలపై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో మళ్లీ నీలివిప్లవం మొదలైంది. బిట్రగుంట: ఆక్వా సాగులో విప్లవం సృష్టించిన జిల్లా మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లాదే అగ్రస్థానం కావడం విశేషం. ఆక్వా సాగుకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండేళ్ల నుంచి ఆక్వా సాగుతో పాటు దిగుబడులు, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోట, చిట్టమూరు, వాకాడు, తడ, తదితర మండలాల్లో వెనామీ రొయ్యల సాగు ఊపందుకుంది. ఆయా మండలాల పరిధిలో సుమారు 20 వేల హెక్టార్లకు పైగా రొయ్యల సాగు జరుగుతున్నట్లు అంచనా. గడిచిన రెండేళ్లలోనే సాగు విస్తీర్ణం 20 శాతానికి పైగా పెరిగినట్లు ఆక్వా రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగానికి విద్యుత్ భారం తగ్గించడంతో సాగు వేగంగా ఊపందుకుంది. ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ 1.50 పైసలకే సరఫరా చేస్తుడడంతో రైతులకు లక్షల్లో ఆర్థిక ఊరట లభించింది. ఇప్పటి వరకు ఐదెకరాలకు మాత్రమే వర్తించే విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం పదెకరాలకు పెంచడంతో యువ రైతులు కూడా ఆక్వా సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్, సవరణ) చట్టాలను తీసుకురావడంతో నకిలీ సీడ్, ఫీడ్‌లకు అడ్డుకట్ట పడి దిగుబడులు కూడా పెరిగాయి. క్షేత్ర స్థాయిలో అండగా ప్రభుత్వం ఆక్వా సాగు చేస్తున్న రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాగులో మెళకువలు, ఆధునిక పద్ధతులు, నకిలీలను గుర్తించడం, తదితర అంశాలపై ఆర్బీకేల ద్వారా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు కల్పించింది. సచివాలయాల స్థాయిలో ‘ఈ–ఫిష్’ బుకింగ్ చేసి వైఎస్సార్ మత్స్య పొలంబడి ద్వారా ఆక్వా రైతులకు అవగాహన కల్పిస్తోంది. గతంలో రొయ్యల సాగుకు అనుమతుల కోసం ఆక్వా రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ప్రస్తుతం అధికారులే నేరుగా ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు మంజూరు చేస్తుండడం, విద్యుత్ రాయితీలు లభిస్తుండటంతో రైతులు ఉత్సాహంగా సాగుకు శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను తీసుకు వస్తుండడంతో రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా ల్యాబ్‌ల ద్వారా వాటర్, సాయిల్, మైక్రోబయాలజీ, ఫీడ్ అనాలసిస్ పరీక్షలు ఆక్వా రైతులకు అందుబాటులో ఉంటాయి. ల్యాబ్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులు అనవసరంగా ప్రోబయాటిక్స్, యాంటీబయాటిక్స్ వాడే బాధ తప్పి ఖర్చులు ఆదావుతాయి. ఇంటికొచ్చి మరీ అనుమతులు గతంలో రొయ్యల సాగు చేయాలంటే అనుమతుల కోసం ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం అధికారులే ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. సబ్సిడీ కరెంట్ ఇస్తుండటంతో ఖర్చులు కూడా బాగా తగ్గాయి. మా ఏరియాలో సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. ధరలు కూడా గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా ఉన్నాయి. – గుమ్మడి వెంకటేష్, ఇస్కపల్లి, ఆక్వా రైతు కరెంటు ఖర్చులు సగం తగ్గాయి ఆక్వా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుంది. యూనిట్ కరెంట్ 1.50 పైసలకే ఇస్తుండడంతో కరెంట్ ఖర్చులు సగానికి తగ్గాయి. కరెంట్ సరఫరా కూడా బాగుంది. నేను మూడెకరాలు సాగు చేస్తున్నాను. గతంలో హేచరీలు నాసిరకం సీడ్ ఇచ్చేవి. ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టడంతో ఇప్పుడు మంచి సీడ్ లభిస్తోంది. ఫీడ్ ధరలపైన నియంత్రణ ఉంచితే బాగుంటుంది. – బత్తల ఆంజనేయులు, గోగులపల్లి, ఆక్వారైతు ‘టైగర్’ రీ ఎంట్రీ రాష్ట్రంలో ఆక్వా రంగానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వెనామీతో పాటు ‘టైగర్’ రొయ్యల సాగుకు కూడా మళ్లీ ఊపిరి పోస్తున్నాయి. వ్యాధి రహిత తల్లి రొయ్యలను (స్పెషిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) దిగుమతి చేసుకుని వాటి ద్వారా సీడ్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతులు మంజూరు కాగా వీటిలో మూడు హేచరీలు జిల్లాకు చెందినవే కావడం విశేషం. వీటి ద్వారా డిమాండ్‌కు సరిపడా నాణ్యమైన సీడ్ అందుబాటులోకి రానుంది. నకిలీ సీడ్‌కు అడ్డుకట్టకు కూడా ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టింది. వైల్డ్ బ్రూడర్స్ (సముద్రంలో సహజ సిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తో పాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్ బ్రూడర్ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా ఆక్వా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించింది. టైగర్ సాగుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో జిల్లాతో పాటు ఒంగోలు, గుంటూరు జిల్లాలో కూడా టైగర్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. -
తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం
నెల్లూరు: ‘క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే కలలను సాకారం చేసుకోగలం. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పుస్తక పఠానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవే తన విజయానికి బాటలు వేశాయి.’ అని గ్రూప్–1లో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన వల్లెం విష్ణుస్వరూప్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేఅవుట్‌లోని పావని అపార్ట్మెంట్లో నివాసముంటున్న వల్లెం ప్రతాప్‌రెడ్డి విశ్రాంత మున్సిపల్ ఉద్యోగి. ఆయన సతీమణి వెంకటరమణమ్మ గృహిణి. వారికి విష్ణుస్వరూప్‌రెడ్డి, సుక్రుతరెడ్డి సంతానం. విష్ణుస్వరూప్‌రెడ్డి చెన్నైలోని ఎస్ఆర్ఎంలో బీటెక్ ఈసీఈ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష అతడిలో బలంగా ఉండేది. మేనమామ శివారెడ్డి, ఇంకా డాక్టర్ వివేకానందరెడ్డి ప్రోత్సాహంతో ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో ప్రణాళికతో సన్నద్ధమై రాశారు. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. కుమారుడు డీఎస్పీగా ఎంపికవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం విష్ణుస్వరూప్‌రెడ్డి దుబాయ్‌లో ఎంబీఏ చదువుతున్నారు. -
జూన్ నాటికి రూ.109 కోట్లతో రిజిస్ట్రేషన్స్
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. గతంలో కరోనా వల్ల కొంత వెనుకబడినా ఈ ఏడాది మాత్రం రిజిస్ట్రేషన్స్ దూకుడు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకువస్తుండడంతో మొదటి మూడు నెలల త్రైమాసికంలో రూ.2 కోట్ల రాబడిని రిజిస్ట్రేషన్ శాఖ రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలకు చేయూతనిస్తుండడంతో రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించి క్రయవిక్రయాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాబడి పెరుగుతోంది. జిల్లాలోని కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరు, నెల్లూరు, నెల్లూరులోని స్టౌన్‌హౌస్‌పేట, బుజబుజనెల్లూరులలో మొత్తం 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్ నుంచి జూన్ నెల మొదటి త్రైమాసికంలో టార్గెట్‌ను ఆ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మూడు నెలలకు గాను 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రూ.107 కోట్లు టార్గెట్ రావాల్సి ఉంది. కాగా రూ.109 కోట్ల టార్గెట్‌ను పూర్తి చేయడం గమనార్హం. 37 వేల రిజిస్ట్రేషన్స్ జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధిచి గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పరిశీలిస్తే 16 వేల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ కాగా, కేవలం రూ.60 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. గతేడాది కరోనా ప్రభావంతో రాబడి తగ్గిందని తెలుస్తోంది. కానీ ఈ ఏడాది 37,700 డాక్యుమెంట్స్ రిజి స్ట్రేషన్స్ కాగా, రూ.109 కోట్ల రాబడిని రిజి స్ట్రేషన్స్ శాఖ రాబట్టడం గమనార్హం. నెల్లూరు ముందజ.. రాపూరు వెనుకంజ రిజిస్ట్రేషన్స్ పరంగా జూన్ వరకు పరిశీలిస్తే 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నెల్లూరు ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయం రూ.40.79 కోట్లతో ముందంజలో ఉండగా రాపూరు కార్యాలయం రూ.53.58 లక్షలతో వెనుకంజలో ఉంది. మిగిలిన కార్యాలయాలు కూడా అన్నింటిలో రాబడిలో దూకుడుగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం చిన్నా, పెద్ద పరిశ్రమలతోపాటు ఇతర నిర్మాణ రంగానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తుండడంతో క్రయవిక్రయదారులు ముందుకువస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు క్రయవిక్రయాలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్స్ ద్వారా రాబడి పెరుగుతోంది. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న నాన్ టీడీసీపీ లేఅవుట్లకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండాపోయాయి. రానున్న రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు – 15 మొదటి త్రైమాసికంలో రాబడి – రూ.109 కోట్లు అన్నివిధాలుగా సేవలు అందిస్తున్నాం జిల్లాలోని 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంబంధించి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా, చిన్నచిన్న సాంకేతి సమస్యలు వస్తే తప్ప, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. – కిరణ్‌కుమార్, డీఐజీ, రిజిస్ట్రేషన్స్ -
తీరనున్న కల.. హైవే.. లైన్ క్లియర్
కందుకూరు వాసులను ఐదు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న 167–బి జాతీయ రహదారి నిర్మాణం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి కందుకూరు మీదుగా వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు. ఇప్పటికే భూసేకరణను పూర్తి చేసిన అధికారులు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కందుకూరు ప్రజల జాతీయ రహదారి కల తీరనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): కేంద్ర ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017 సంవత్సరంలో రాష్ట్రంలో మూడు రోడ్లను జాతీయ రహదారులుగా ఎంపిక చేసింది. వాటిలో 167–బి ఒకటి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి (చెన్నై టు కోల్‌కతా – ఎన్‌హెచ్ 16) కడప జిల్లా మైదుకూరు వరకు (ఎన్‌హెచ్ 67) ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి 195 కి.మీల మేర పదిమీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు సింగరాయకొండ, కందుకూరు, పోకూరు, వలేటివారిపాళెం, మాలకొండ, పామూరు, సీఎస్‌పురం, డీజీపేట, అంబవరం, టేకూరుపేట, రాజాసాహెబ్‌పేట, వనిపెంట మీదుగా మైదుకూరు వరకు సాగనుంది. దీనికి 2018 కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ కారణాలతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పనులను మొదలు పెట్టేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్యాకేజీ కింద వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు వేస్తున్నారు. మొదటి ప్యాకేజీ పనులిలా.. మొదటి ప్యాకేజీ కింద ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని మాలకొండ వరకు 45 కి.మీ. మేర రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.263 కోట్లను ఇప్పటికే కేటాయించారు. సింగరాయకొండ, కందుకూరు, వలేటివారిపాళెం మండలాల్లోని పలు గ్రామాల్లో భూసేకరణను పూర్తి చేశారు. మొత్తం 150 ఎకరాలను సేకరించి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని కూడా జమ చేశారు. గతేడాది ఆగస్టులోనే టెండర్లు పిలిచారు. 32 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తర్వాత పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో దానిని రద్దు చేసిన ఎన్‌హెచ్ అధికారులు కొత్తగా టెండర్లు పిలిచారు. అది త్వరలో ఫైనల్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే మొదటి ప్యాకేజీ పనులు ప్రారంభించనున్నారు. అలాగే మాలకొండ నుంచి సీఎస్ పురం వరకు రెండో ప్యాకేజీగా, సీఎస్ పురం నుంచి నెల్లూరు, కడప అడ్డరోడ్డు వరకు మూడో ప్యాకేజీగా, కడప అడ్డరోడ్డు నుంచి మైదుకూరు వరకు నాలుగో ప్యాకేజీగా టెండర్లు కేటాయించి పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తీరనున్న కల నిన్నటి వరకు అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన కందుకూరు పట్టణానికి భారీ స్థాయిలో రహదారి సౌకర్యం ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం 167–బి నిర్మాణంతో కందుకూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి కొరత తీరనుంది. మొదటి దశలో 45 కి.మీ. రహదారి నిర్మాణంలో నాలుగైదు కిలోమీటర్లు మినహా మిగిలింది మొత్తం కందుకూరు నియోజకవర్గంలోనే జరుగుతుంది. ప్రధానంగా పట్టణానికి దక్షిణం వైపు భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే పోకూరు, వలేటివారిపాళెం వంటి ప్రాంతాల్లోనూ ఊరిబయటి నుంచి హైవే వెళ్తుందని భావిస్తున్నారు. ప్రవిత్ర పుణ్యక్షేత్రం మాలకొండకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడనుంది. -
సమస్యల్లేని గ్రామాలే లక్ష్యం
మనుబోలు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వీరంపల్లి పంచాయతీ కొండుపాళెం, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో సోమవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఆయన పర్యటించి గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రజాప్రతినిధులు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్య కర్తలు ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళితే వివిధ సమస్యలపై కుప్పులు తెప్పలుగా అర్జీలు అందేవన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పర్యటిస్తుంటే సంక్షేమ పథకాలు, మౌలిక వసతులపై ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు చిట్టమూరు నరసారెడ్డి, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, జట్టి సురేందర్‌రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, మోటుపల్లి వెంకటేశ్వర్లు, దాసరి భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ఉన్నత విద్య
పేద విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుంది. నూతన విద్యా విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది నుంచి జెడ్పీ హైస్కూ ల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఒక జూనియర్ కళాశాల కేవలం బాలికలకు కేటాయించనున్నారు. ఇప్పటికే అన్ని వసతులు ఉన్న జెడ్పీ హైస్కూల్స్‌ను పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. నెల్లూరు (టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నుంచి ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 51 జెడ్పీ హైస్కూల్స్‌ల్లో ఇంటర్ విద్యను ఈ ఏడాది నుంచి ప్రవేశ పెట్టనున్నారు. వాటిల్లో ఒకటి బాలిక కళాశాల ఒకటిని ఏర్పాటు చేయనున్నారు. తొలుత కేజీబీవీ, మోడల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని ప్రాంతాల్లోని జెడ్పీ హైస్కూల్స్‌ను ఎంపిక చేశారు. వీటిల్లో 33 బాలికల, 18 కో–ఎడ్యుకేషన్ (బాలురు, బాలికలు) కళాశాలలుగా ఎంపిక చేశారు. అయితే వచ్చే ఏడాది నుంచి కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్కడే ఇంటర్ చదివే విధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ప్రోత్సహించే పనిలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం రెండు మండలాల్లో రెండేసి జూనియర్ కళాశాలలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు మండలంలోని కోవూరు, ఇనమడుగు ప్రాంతాల్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మహిళల కోసం కేవలం డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల మాత్రమే ఉంది. ఇప్పటికే 6 కేజీబీవీల్లో బాలికలకు ఇంటర్ అందిస్తున్నారు. మరో 4 కేజీబీవీల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వీటితో పాటు 10 మోడల్స్ స్కూల్స్‌ల్లో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న జూనియర్ కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. ఒక్కో గ్రూపులో కనీసం 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. విద్యార్థుల ఎంపికలో రిజర్వేషన్, దారిద్య్రరేఖకు దిగువను ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇంటర్‌కు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 4వ తేదీ నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు. ఈ కళాశాలలను ప్రారంభిస్తే పేద వర్గాలకు ఉన్నత విద్య మరింత అందుబాటులోకి రానుంది. అందరికీ అందుబాటులో ఇంటర్ విద్య ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్య అందరికీ అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 33 హైస్కూల్స్‌ల్లో బాలికల జూనియర్ కళాశాలలను, మరో 18 ఉన్నత పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయబోతున్నాం. దీనిపై విధి విధానాలు వచ్చిన వెంటనే ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను ప్రారంభిస్తాం. – డీఈఓ రమేష్, డీవీఈఓ శ్రీనివాసులు -
రైతుల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం
కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): వ్యవసాయ రంగంపై ప్రభుత్వ ఆలోచనా విధానాల ఆధారంగానే రైతుల జీవితాలు మారతాయని, క్షేత్ర స్థాయి నుంచి రైతుల జీవితాలను మెరుగు పర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను సాగులో వినియోగించాలని చెప్పారు. గతేడాది చెరువుల నిండా నీరున్నా.. వరి సాగు చేసేందుకు రైతులు ముందు రాలేదని గుర్తు చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టు కింద వరి సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదన్నారు. ఆర్బీకేలు సంపూర్ణ రైతు సేవా కేంద్రాలుగా మారాయన్నారు. సీహెచ్‌సీ గ్రూపుల ద్వారా రూ.15 లక్షల విలువైన పనిముట్లను అందుబాటులో ఉంచుతుందని, నిరుద్యోగులైన వ్యవసాయ పట్టభద్రులకు రూ.10 లక్షల విలువైన కిసాన్ డ్రోన్లను సరఫరా చేస్తుందని తెలిపారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత నకిలీ విత్తనాలకు పూర్తిగా చెక్ పడిందని, ఎక్కడా కూడా నకిలీ విత్తనం అనే మాట వినిపించడం లేదన్నారు. కందుకూరు ప్రాంతంలో వరి, శనగ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేశామని, తాజాగా జొన్నల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నంద్యాలలో పండే రకం జొన్నను ఈ ప్రాంత రైతులు సాగు చేసి విజయం సాధించారని తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటైందన్నారు. రూ.2,738 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ వల్ల రైతు రూ.1000 నుంచి రూ.1500 వరకు ధాన్యం కొనుగోళ్లలో నష్టపోవాల్సి వచ్చిందని, అటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి జొన్నలు ప్రభుత్వానికి విక్రయించుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ ఎస్.పవన్‌కుమార్, వ్యవసాయశాఖ ఏడీఏ శేషగిరి, ఏఓ అబ్దుల్‌రహీం, నాయకులు గణేశం గంగిరెడ్డి, వసంతరావు, ఎం శ్రీనివాసులు, గేరా మనోహర్, కామాక్షినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..
పత్తి.. తెల్లబంగారమాయింది. రైతులకు సిరులు కురిపిస్తోంది. మెట్ట ప్రాంతాలకే పరిమితమైన పత్తి మాగాణుల్లో సాగు చేస్తున్నా రు. గడిచిన మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు జరగడంతో ఊహించని దిగుబడులు పెరిగాయి. మార్కెట్ డిమాండ్ తక్కువగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి పంట సాగుపై దృష్టి సారించారు. దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆత్మకూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పత్తి సాగు ఏటేటికి పెరుగుతోంది. గతంలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా చివరికి దిగుబడులు రాక, పెట్టి పెట్టుబడులు నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా విత్తన నాణ్యతపై దృష్టి సారించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. పత్తికి మద్దతు ప్రకటించడంతో రైతుల పాలిట వరంగా మారింది. జిల్లాలో తొలి కారుగా వరి సాగు చేస్తే.. రెండో కారుగా పత్తి సాగు చేయడంపై రైతులు దృష్టి సారించారు. జిల్లాలో పత్తి సాగు ఈ ఏడాది గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గతంలో 3,500 హెక్టార్ల నుంచి 4 వేల హెక్టార్ల వరకు సాగు చేస్తుంటే.. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 6 వేల హెక్టార్లలో సాగవుతోంది. కొన్ని చోట్ల ఫిబ్రవరిలోనే (రబీ సీజన్) రైతులు వరికి ప్రత్యామ్నాయంగా దాదాపు 1,500 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సాగు వ్యయం అధికమైనా.. పత్తి పంట సాగుకు సాధారణంగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. గతంలో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ. 6 వేలు అయ్యే వ్యయం ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. గతంలో మాగాణి భూముల్లో రెండు కార్లు వరి సాగు చేసే వారు. అయితే పంట మార్పిడితో భూసారం పెరుగుతుందనే వ్యవసాయ నిపుణులు, భూమి శాస్త్రవేత్తలు చెబుతుండడంతో వరి సాగు అనంతరం రెండో కారుగా పత్తి సాగు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా సాగు ఖర్చు పెరిగినా దానికి రెట్టింపుగా పత్తి కొనుగోళ్లు పెరగడం, «కొనుగోలు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో అధిక శాతం రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. బీటీ పత్తి సాగు అధికం జిల్లాలో (కందుకూరు డివిజన్‌తో కలుపుకొని) 38 మండలాల్లోని 22 మండలాల్లో పత్తి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. మిగిలిన మండలాల్లో అరకొరగా సాగు చేస్తున్నారు. గతంలో నాటు గింజలు పత్తి సాగుకు ఉపయోగించే వారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బీటీ పత్తి మంచి దిగుబడులు ఇస్తుండడంతో అధిక శాతం రైతులు బీటీ పత్తి సాగు చేస్తున్నారు. పలు మండలాల్లోని గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా పత్తి విత్తనాలు వ్యవసాయ అధికారులు రైతులకు అందజేశారు. దీనికి తోడు రైతులకు సాగులో మెళకువులు, చీడపీడల నివారణ చర్యలు సూచిస్తుండడతో నష్ట నివారణ చర్యలతో పత్తి దిగుబడులు పెరిగాయి. రైతులకు అందుబాటులో సిబ్బంది రైతులు తొలికారు వరి సాగు చేసే అధిక వర్షాలకు నష్టపోయారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా విత్తనాలు రెండో మారు ఇచ్చాం. అయితే రెండో కారుగా పత్తి సాగు చేయడంతో తొలి కారు నష్టాలను కొంత మేర రైతులు పూడ్చుకోగలుగుతున్నారు. పత్తి సాగు చేస్తున్న రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ సిబ్బందికి సూచనలు ఇచ్చాం. నేను స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి పరిశీలించి సూచనలు ఇస్తున్నాం. – దేవసేన, ఏడీఏ, ఆత్మకూరు లాభాలు బాగున్నాయి ఈ ఏడాది పత్తి పైరు సాగుతో లాభాలు వస్తున్నాయి. కొంత వరి పైరులో నష్టపోయినా పత్తి ధర అధికంగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతున్నాయి. ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా. దిగుబడి బాగుంది. వర్షాలు లేకుంటే మరో రెండు నెలల పాటు పత్తి దిగుబడి వస్తుంది. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సలహాలు చెబుతున్నారు. – ఓబుల్ రెడ్డి, రైతు, రామస్వామిపల్లి కేజీ రూ.70 నుంచి రూ.120 గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పత్తి కొనుగోలు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గతంలో రూ.50 లేదా రూ.60లకే కిలో పత్తి కొనుగోలు ఉంటే.. ఈ ఏడాది అధిక గిట్టుబాటు ధర లభిస్తోంది. తొలి దశలో మే నెలలో కిలో పత్తి రూ.118, రూ.120 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేశారు. జూన్ 20వ తేదీ వరకు ఇదే ధరతో పలు మండలాల్లో కొనుగోలు చేస్తుండగా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు వల్ల కొనుగోలు ధర తగ్గింది. పత్తి నాణ్యత తగ్గడంతో రూ.70 నుంచి వంద రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అయినా మంచి ధరే తమకు దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమం అందించారు’
నెల్లూరు: పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల పాలనలో చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సంక్షేమం అందించారన్నారు. నెల్లూరులో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కాకాణి.. ‘కోవిడ్ కారణంగా రెండేళ్లు ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోలేకపోయాం. చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సంక్షేమం అందించారు. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ప్రతిపక్షం అక్కసుతో అసత్య ఆరోపణలు చేస్తోంది. పచ్చమీడియా తప్పుడు రాతలు రాస్తోంది.రైతులకు అండగా నిలిచింది, నిలుస్తోంది వైఎస్సార్ కుటుంబం మాత్రమే. చంద్రబాబుకి, సీఎం వైఎస్ జగన్‌కి చాలా వ్యత్యాసం ఉంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించి ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా నిలిచారు. శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు అంతే ముఖ్యం.చంద్రబాబు దివాలాకోరు తనం వల్లే కాంట్రాక్టర్లకు ఇబ్బందులు వచ్చాయి. 2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలసిన పరిస్థితి చంద్రబాబుది.అందుకే కుట్రలు ,కుతంత్రాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. -
ఆత్మకూరు పోలింగ్: బయటపడ్డ టీడీపీ బండారం
సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. సాంప్రదాయ పద్దతంటూ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ.. బద్వేల్ తరహాలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. పోలింగ్ రోజు టీడీపీ బండారం బయటపడింది. ఆత్మకూరు, అనంత సాగరం, మర్రిపాడు, సంగం, ఏఎస్ పేట, చేజర్ల మండలాల్లో పలు చోట్ల టీడీపీ నేతలు.. బీజేపీ ఏజెంట్ల అవతారమెత్తారు. చదవండి: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్ పోలింగ్ జరిగింది. పోలింగ్ పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఈనెల 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఆత్మకూరు ఉపఎన్నిక.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం
ఆత్మకూరు: మూడేళ్లుగా కులమతాలకు అతీతంగా పారదర్శకంగా లక్షలాది కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని, దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలు కన్న అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు మంత్రులు అన్నారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో సోమవారం పార్టీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ, జోగి రమేష్, రాజ్య సభ్యుడు బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీతో పట్టణం జనసంద్రమైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జెండాలు చేతబట్టి వేలాదిగా పాల్గొనడంతో రోడ్లు కిక్కిరిశాయి. బంగ్లా సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేట, సోమశిల రోడ్ సెంటర్, బస్టాండ్, వైశ్య బజారు మీదుగా సత్రం సెంటర్ వరకు సాగింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రజల సమస్యలను అతి తక్కువ కాలంలో దగ్గరగా పరిశీలించారని, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే పార్టీ గుర్తు ఫ్యాన్‌కు వేసేందుకు స్థిర నిర్ణయం తీసుకున్నారని మెజార్టీ లక్షకుపైగా సాధించేందుకు తాము ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి లేనిలోటు తీర్చేలా విక్రమ్‌రెడ్డి పని చేస్తారని ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉందని, మచ్చలేని రాజకీయాలు చేస్తున్న వారిని ఆదరించి అభిమానించాలన్నారు. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలా భారీ మెజార్టీని అందివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి మంచి తనం చూసి ఆయన సోదరుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీలతో పాటు బీసీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌తో పాటు అన్ని వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్, రాజకీయంగా పదవులు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు తనకు కొత్త అయినా పైనుంచి దీవిస్తున్న అన్న ఆశీర్వాదాలు, ప్రజల అభిమానం, ముఖ్యమంత్రి, మంత్రుల అండదండలు, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపుతానన్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ప్రచారంలో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, సంతృప్తి కనిపిస్తున్నాయని, అమలు అవుతున్న నవరత్నాల పథకాలే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, షేక్ సర్ధార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు జితేంద్రనాగ్‌రెడ్డి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
పేదల పొదరిల్లు
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా సకల సౌకర్యాలతో జగనన్న ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో పేదలకు ఇంటి స్థలాలు నివాస యోగ్యం కాని కొండలు, గుట్టల ప్రాంతాల్లో ఇచ్చే వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించి.. అభివృద్ధి పరిచిన ప్లాట్లలో స్థలాలు ఇచ్చింది. పేదల కోసం కట్టిన ఇళ్లు చూస్తే అవి బలహీన వర్గాల ఇళ్లని తెలిసి పోయేవి. జగనన్న కాలనీల్లో ఇళ్లు పేదల పొదరిల్లు తలపిస్తున్నాయి. ఏకంగా ఊళ్లే ఆవిష్కృతమవుతున్నాయి. నెల్లూరు (అర్బన్): వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలందరికీ పక్కా ఇళ్లు పథకం ద్వారా నిర్మితమవుతున్న కలల సౌధాలతో కొత్త ఊళ్లు వెలుస్తున్నాయి. జిల్లాలో తొలిదశలో సకల సౌకర్యాలతో 282 లేఅవుట్లు నిర్మించారు. 58,070 ఇళ్లు మంజూరు అయ్యాయి. అయితే లేఅవుట్ల స్థలాలపై కొంత మంది కోర్టులకు వెళ్లడం, నవంబర్ నుంచి జనవరి వరకు భారీ వర్షాలు కురవడం, వరదలు రావడం వల్ల ఇళ్ల నిర్మాణాలకు కొంత అంతరాయం కలిగింది. ప్రస్తుతం కోర్టు కేసులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు సాయపడుతున్నారు. జగనన్న లే అవుట్లలో పూర్తి సౌకర్యాలు టీడీపీ పాలనలో సొంత నివేశన స్థలం ఉన్న వారికే ఇళ్లు మంజూరు చేసేది. ప్రజలకు ఎక్కడా నివేశన స్థలాలు ఇచ్చిన పాపాన పోలేదు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థలం మంజూరుతో పాటు ఇంటిని కూడా మంజూరు చేసింది. ఇందు కోసం లే అవుట్లను ఏర్పాటు చేశారు. లే అవుట్లంటే సాదా.. సీదాగా కాకుండా అక్కడ సకల సౌకర్యాలు కల్పించారు. చెట్టూ, పుట్టా తొలగించి భవిష్యత్ అవసరాల కోసం బడి, గుడి వంటి వాటి కోసం కొంత రిజర్వు స్థలాన్ని సిద్ధం చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ సౌకర్యం కల్పించారు. తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పైపులైన్లు ఏర్పాటు చేశారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటి జగనన్న కాలనీలు (లేఅవుట్లు)ను అందంగా తీర్చిదిద్దారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి సొంతం జిల్లాలో 282 లేఅవుట్లకు సంబంధించి మొత్తం రూ.1,320 కోట్ల ఆస్తిని ప్రజలకు జగనన్న ఇళ్ల రూపంలో అందిస్తున్నారు. ప్రభుత్వం నివేశన స్థలం ఇవ్వడమే కాకుండా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ఆ స్థలానికి డిమాండ్ పెరిగింది. నెల్లూరు నగరం, కోవూరు కావలి, ఆత్మకూరు, కందుకూరు తదితర పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్థలం, ఇంటి నిర్మాణం విలువ కలుపుకుంటే రూ.15 లక్షల ఆస్తి లబ్ధిదారుడి సొంతమవుతోంది. పట్టణాలకు కొంచెం దూరంగా ఉన్న చోట జగనన్న ఇంటి విలువ రూ.10 లక్షల వరకు లబ్ధిదారుడికి సొంతమవుతోంది. కోవూరు సమీపంలో నిర్మాణం పూర్తయిన ఇల్లు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.223 కోట్లు జమ ఇప్పటి వరకు లబ్ధిదారులు పూర్తి చేసిన నిర్మాణాలకు రూ.228 కోట్లు బిల్లులు రావాల్సి ఉండగా రూ.223 కోట్లు చెల్లించారు. ఆప్షన్ 3 కింద లబ్ధిదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే దగ్గర కొంత మంది బ్యాంకు ఖాతాలు తెరవకపోవడంతో మరో రూ.5 కోట్లు మాత్రమే జమ కావాల్సి ఉంది. ఇంటి నిర్మాణాలకు పొదుపు మహిళలకు మెప్మా, డీఆర్‌డీఏల ద్వారా రూ.35 వేలు బ్యాంకు రుణాలు అందిస్తున్నారు. ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ ఇవ్వడంతో సుమారుగా అదనంగా రూ.44 వేల లబ్ధి చేకూరుతోంది. దీంతో లబ్ధిదారుడి కష్టం, ప్రభుత్వ సాయంతో ఇళ్లను వడి వడిగా పూర్తి చేసుకుంటున్నారు. సొంతింటి కల తీరనుంది నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. సొంతిల్లు లేదు. ఎన్నో ఏళ్లుగా స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ గత ప్రభుత్వాలు నాకు స్థలం ఇవ్వలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా ఇవ్వడమే కాకుండా, ఇంటిని సైతం మంజూరు చేశారు. నిర్మాణం పూర్తి కావస్తోంది. సొంతిల్లు కల నెరవేరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. – ప్రమీల, పండ్ల వ్యాపారి, గాంధీ గిరిజన సంఘం వేగంగా ఇళ్లు పూర్తి చేస్తున్నాం ప్రస్తుతం కోర్టు అడ్డంకులు తొలగిపోయాయి. జూన్, జూలై నెలల్లోనే వేగంగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం. లబ్ధిదారుల ఖాతాల్లో వారం, వారం బిల్లులు జమ అవుతున్నాయి. బిల్లులు పెండింగ్ లేవు. దీంతో లబ్ధిదారులు మరింత ఉత్సాహంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. – నరసింహం, ప్రాజెక్టు డైరెక్టర్, హౌసింగ్ కార్పొరేషన్ -
ఆత్మకూరు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు(అర్బన్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరు కలెక్టరేట్లో నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చక్రధర్‌బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులుండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు. 279 పోలింగ్ స్టేషన్లలో ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. దొంగ ఓట్లు పడకుండా.. ఓటర్ల జాబితాలను పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించాలని ఆదేశించినట్లు తెలిపారు. 123 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.. వాటి వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు మైక్రో అబ్జర్వు, వీడియో, వెబ్ కాస్టింగ్ లైవ్ తదితరాలను సిద్ధం చేశామని చెప్పారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. వలంటీర్లు కరపత్రాలు పంచినా, ప్రచారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్, ఎస్పీ విజయరావు, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్, మునిసిపల్ కమిషనర్ జాహ్నవి, ఏఎస్పీ హిమవతి, సెబ్ జేడీ శ్రీలక్ష్మి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, డీఎంహెచ్‌వో డాక్టర్ పెంచలయ్య, డీపీవో ధనలక్ష్మి, డీసీవో తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ తొండాట..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొండాట ఆడుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో సంప్రదాయం ప్రకారం పోటీకి దూరమంటూ ప్రచారం చేసుకుంటూనే మరో వైపు ఓట్లు మాత్రం పక్క పార్టీలకు వేయించాలని రెండు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీని బలహీనపర్చాలని ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీకి దూరమంటూనే ఓట్లు వేసేందుకు పోటీలో ఉన్న ఇతరులకు వేసేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో ఓ వర్గం మాత్రం బీఎస్సీ అభ్యర్థికి వేయాలని తీర్మానించుకోగా , మరో వర్గం మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓటు విషయంలో కూడా వర్గరాజకీయాలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులే నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 23న పోలింగ్ కావడంతో 21వ తేదీకే ప్రచార ఘట్టం ముగియనుంది. వైఎస్సార్సీపీ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాలు, ఒక మున్సిపాల్టీ ఉండగా మండలానికో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్‌లుగా నియమించడంతో ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎన్నిక రోజున ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మెజార్టీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించి ఆ దిశగా పనిచేస్తున్నారు. టీడీపీ ఓట్లు హోల్‌సేల్ ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల పరిస్థితి ఇరకాటంగా మారింది. ఆ పార్టీలో ఇప్పటికే వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థి పోటీ చేయలేదు. అధికార పార్టీ వైఎస్సార్సీపీతో పాటు బీజేపీ, బీఎస్పీ, మరో పదకొండు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం ఎవరికి ఓటు వేయాలని సందిగ్ధంలో ఉంటే.. ఆ పార్టీ ఓట్లను ఇతరులకు వేసేందుకు హోల్‌సేల్ బేరం మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీలో మూడు వర్గాలు నడుస్తున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో ఆ ముగ్గురు నేతలు తెరపైకి రావడంతో ఆధిష్టానం ఎటూ తేల్చలేక ఇన్చార్జి నియామకం నిలిపేసింది, ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం టీడీపీలో ఓ వర్గ నేత మాత్రం బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయమని తన అనుచర వర్గానికి ఆదేశాలు ఇచ్చారు. మరో వర్గ నేత మాత్రం ప్రస్తుత ఎన్నికల బరిలో తన సొదరుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. టీడీపీ తరఫున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఉన్నాడు. అతనే ఈ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలో దిగడంతో ఆ పార్టీ కూడా అతన్ని సన్పెండ్ చేసింది. అయితే పార్టీ నుంచి బయటకు పంపినా ఆయన ఓ వర్గనేతకు సొదరుడు కావడంతో లోలోన తన సోదరుడికి ఓట్లు వేయించాలని ప్రయత్నాలు మమ్మురం చేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.. దీంతో టీడీపీ శ్రేణులు పోలింగ్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీ బలం పెరిగితే నష్టమని.. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఓట్లు బీజేపీకి పడితే ఆత్మకూరులో ఆ పార్టీకి ఓటు బలం పెరిగిందని వారు చెప్పుకొస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే ఈ ఓటింగ్ బలం చూపి పొత్తులో భాగంగా సీటు అడిగే ప్రమాదం ఉందని, బీజేపీకి రెండో స్థానం దక్కకుండా ఉండాలని బీఎస్సీకి ఓటు వేయండని ఆ నేత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు. అలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండాలంటే టీడీపీ ఓటింగ్ బీజేపీకి దూరండా ఉండాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన మాత్రం బీజేపీతో దోస్తితో ఉండడంతో వారు బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. -
‘కమలం కమిలిపోయే మెజార్జీ వైఎస్సార్సీపీకి ఇవ్వాలి’
నెల్లూరు జిల్లా: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి ఆర్కే రోజా మరోసారి గుర్తుచేశారు. చేజార్ల మండలం యనమదల, ఎర్రబల్లిలోమేకపాటి విక్రమ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆర్కే రోజా.. ఈనెల 23వ తేదీ ఆత్మకూరు ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కమలం కమిలిపోయేలా మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారని, అమ్మ ఓడి పథకం పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి రోజా. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా నుంచి క్యాన్సర్ వరకూ ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. -
AP: మహిళా మార్ట్స్
మార్కెట్ ధరలకన్నా తక్కువకే నాణ్యమైన నిత్యావసర వస్తువులను గ్రామీణులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యాచరణను సిద్ధం చేసింది. తద్వారా పొదుపు మహిళల మెరుగైన జీవనోపాధికి బీజం వేస్తోంది. పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో మండలాల వారీగా ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్ట్లు విజయవంతం కావడంతో ఈ ఫార్ములాను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంకల్పించింది. సాక్షి, నెల్లూరు: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతి జిల్లాకు ప్రయోగాత్మకంగా రెండు మహిళా మార్ట్లు ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించింది. వీటికి ఆదరణ లభిస్తే భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒకటి చొప్పున విస్తరించాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలో మార్ట్లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు సుస్థిర ఆదాయం కల్పనే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ దుకాణాలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేలా రిలయన్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పరిమితంగా ఉన్న ఈ వ్యాపారాన్ని విస్తరించి నిర్వాహకులకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా మార్ట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్రామీణ వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసÆమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. నగరాల్లోని మాల్స్‌కు దీటుగా వీటిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో రెండు చోట్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల మహిళా మార్ట్లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో చర్యలు వేగవంతమయ్యాయి. జిల్లాలో తొలుత ఐదు మండలాలను ఎంపిక చేశారు. కావలి, వెంకటాచలం, కోవూరు, వింజమూరు, కందుకూరు వంటి ప్రాంతాలను ఎంపిక చేసి అందులో రెండు చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మహిళా సంఘాల ఎంపిక, స్థల సేకరణ, పెట్టుబడి నిధి సమీకరణ, వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్త్రీనిధి, బ్యాంక్ రుణంతో.. సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన వాహన పార్కింగ్ ఉండేలా బ్యాంకులు, బస్సు స్టేషన్ సమీపంలో ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ మార్ట్‌ల్లో స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయనున్నారు. సుమారు రూ.60 లక్షల వరకు మూలధనంగా సమీకరించనున్నారు. స్వయం సహయక సంఘాల మహిళలను ఈ మార్ట్‌ల్లో వాటాదారులుగా చేర్చనున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మహిళలు ఇష్టపడితే ప్రతి ఒక్కరి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు వాటా ధనం సేకరిస్తారు. బ్యాంకుల నుంచి, స్త్రీ నిధి అప్పుల రూపంలో సేకరిస్తారు మార్ట్ సేవలు ఇలా.. మహిళా మార్ట్ల ఏర్పాటుతో గ్రామీణ వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అనవసర వ్యయం, రవాణా ఖర్చు తగ్గించేలా దృష్టి పెడతారు. హోల్ సేల్ విక్రయాల ద్వారా తక్కువ ధరలకు సరుకుల లభ్యత ఉండేలా చూస్తారు. స్థానిక రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయానికి మార్ట్ మధ్యవర్తిగా వ్యవహరించి వారికి మద్దతు ధర లభించేలా చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం వంటివి మార్ట్లు చేపట్టనున్నాయి. మహిళా సంఘాలు బలోపేతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలు మరింత బలోపేతం అయ్యేందుకు మహిళా మార్ట్లు ఎంతో ఉపయోగపడతాయి. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు చోట్ల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్థల సేకరణ, నిధుల సమీకరణ, ఇతర కీలక అంశాలపై సమీక్ష నిర్వహించాం. వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్ల మాదిరిగానే మార్ట్లు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాం. త్వరలో మార్ట్లు కార్యరూపం దాల్చనున్నాయి. – సాంబశివారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఆర్డీఏ -
ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం
నెల్లూరు(క్రైమ్): నాటు సారారహిత గ్రామాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్–2 జిల్లాలో విజయవంతమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 15వ తేదీ నుంచి రెండునెలలపాటు ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జేడీ కె.శ్రీలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సారా తయారీ, విక్రయ, అక్రమరవాణా అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఆయా ప్రాంతాల్లో సెబ్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మరోవైపు కార్డన్ సెర్చ్‌లు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా నిర్మూలనతోపాటు వ్యాపారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సారాకు బానిసలు కావొద్దని యువతకు సూచించారు. తమ ప్రాంతాల్లో సారా తయారీకి ఒప్పుకోమని గ్రామస్తులతో ప్రమాణాలు చేయించారు. సారా వ్యాపారం మానుకున్న వారికి ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని ఇచ్చిన హామీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 81 కేసులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు 81 కేసులు నమోదు చేసి 79 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 238 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 23 వేల లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. 75 కేజీల బెల్లం, రెండు వాహనాలను సీజ్ చేశారు. కొందరు సారా తయారీదారులకు బెల్లం సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారిపై పీడీ యాక్ట్ తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన సముద్రాల దుర్గారావు, మేకల హరీష్‌పై పీడీ యాక్ట్ పెట్టి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. ఉక్కుపాదం మోపాం ఆపరేషన్ పరివర్తన్–2లో భాగంగా సారా తయారీ, విక్రయాలపై రెండునెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. నిందితులపై కేసులు నమోదుచేయడంతోపాటు తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేశాం. ఆత్మకూరు ఉప ఎన్నిక పూర్తయింతే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మత్తు పదార్థాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాం. ఈ తరహా నేరాలు జరుగుతన్నట్లు ప్రజలు గుర్తిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులు, సెబ్ «అధికారులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – శ్రీలక్ష్మి, సెబ్ జేడీ -
స్వచ్ఛ స్కూళ్లు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్వచ్ఛ తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత, కోవిడ్ మార్గదర్శకాలు అమలు అంశాల ఆధారంగా కేంద్రం స్కూల్స్‌కు స్వచ్ఛ పురస్కారాలను అందజేయనుంది. పాఠశాల భవనం, పారిశుద్ధ్యం, చేతుల పరిశుభ్రతపై అవగాహన, పచ్చదనం, మరుగుదొడ్ల నిర్వహణ, కోవిడ్ మార్గదర్శకాలు అమలు తదితర వాటిని పరిగణలోకి తీసుకున్నారు. నెల్లూరు (టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 4,440 పాఠశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి 38 పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఎంపికయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఇంటర్నల్ వాల్యుయేషన్ చేయగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీ, పీటీఐ, ఐఈఆర్టీలతో ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ చేయించారు. పాఠశాలల్లో అర్బన్ నుంచి ఒకటి, రూరల్ ప్రాంతం నుంచి రెండు పాఠశాలను ఎంపిక చేశారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఫొటోల ద్వారా ఎంపిక చేసిన పాఠశాలలను పరిశీలన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి స్టార్ రేటింగ్ కేటాయించనున్నారు. జిల్లా స్థాయి విద్యాలయ పురస్కారాలకు వెంకటగిరి నుంచి శ్రీచైతన్య పాఠశాల మాత్రమే ఎంపికైంది. మిగిలిన 37 ప్రభుత్వ పాఠశాలలే కావడం గమనార్హం. వీటిలో 8 ఓవరాల్ పర్ఫార్మెన్స్కు ఎంపికయాయ్యి. సబ్ కేటగిరీలో ఎంపికైన 30 పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ, చేతులు శుభ్రత తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో 20 పాఠశాలల ఎంపిక రాష్ట్ర స్థాయికి 20 పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. పట్టణ ప్రాంతాలు ఒక్కొక్కొటి, గ్రామీణ ప్రాంతాల్లో మూడేసి ప్రాథమిక, ఉన్నత పాఠశాల లను పరిశీలన బృందాలు పరిశీలించనున్నారు. ఆ పాఠశాలల్లో పారిశుధ్యం, తాగునీరు, పరిశుభ్రత, కోవిడ్ మార్గదర్శకాలు అమలు తదితర అంశాలు ఆధారంగా నివేదిక ఇవ్వనున్నారు. ఆ ప్రకారం 40 పాఠశాలలు, సబ్ కేటగిరీ విభాగంలో మరో 6 పాఠశాలలకు పురస్కారాలను ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన 40 పాఠశాలలకు ఒక్కో పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ అవార్డుతో పాటు రూ.50 వేల నగదు, సమగ్రశిక్ష పథకం కింద ఒక్కో పాఠశాలకు రూ.60 వేలు అందజేస్తారు. కేటగిరీ విభాగంలో ఎంపికైన పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.20 వేలు ఇవ్వనున్నారు. -
కావలి ఎమ్మెల్యే తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
నెల్లూరు: కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆదివారం కావలి మండలం గౌరవరం వద్ద ఉన్న రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై వరుడు బాల సాకేత్‌రెడ్డి, వధువు మహిమలను ఆశీర్వదించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి తదితర నేతలు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. -
రైతు ద్రోహితో మళ్లీ కలిసేందుకు పవన్ తహతహ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతు ద్రోహి చంద్రబాబుతో మళ్లీ చేతులు కలిపేందుకు సినీనటుడు పవన్‌కల్యాణ్ తహతహలాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే.. రైతుల రుణాలు భేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించి, మాట తప్పారు. రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చి, కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా వారిని మోసం చేసి రైతు ద్రోహిగా నిలిచిన చంద్రబాబును ఆ ఐదు ఏళ్లూ పవన్‌కల్యాణ్ సమర్ధించారు. ఆ తర్వాత ప్యాకేజీ కుదరక వ్యతిరేకించిన పవన్ మళ్లీ ఇప్పుడు అదే రైతుద్రోహితో కలిసేందుకు తహతహలాడుతున్నారు. అందుకే రైతులకు అన్ని విధాలుగా మేలు చేసి, వ్యవసాయాన్ని పండగలా చేసి రైతుమిత్రగా ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్‌కు అసలేం తెలుసు? ఇవాళ వ్యవసాయం, రైతుల స్థితిగతులకు సంబంధించి నటుడు పవన్‌కల్యాణ్, మహానటుడు చంద్రబాబుగారు వేర్వేరుగా, రకరకాల కామెంట్స్ చేశారు. ప్రధానంగా క్రాప్ హాలీడే గురించి మాట్లాడారు. వ్యవసాయం, వ్యవసాయ విధానం, రైతుల గురించి పవన్‌కు అసలు ఏం తెలుసు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదువుతున్నారు. అప్పుడు జరిగింది కాబట్టి.. చంద్రబాబు హయాంలో క్రాప్ హాలీడే జరిగింది కాబట్టి, ఆయన డైరెక్షన్లో పవన్ ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు పాలనలో వందలాది కరువు మండలాలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. ఆ దమ్ము ధైర్యం నీకున్నాయా?: పవన్.. మూడు ఆప్షన్లు ఇచ్చావు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటారంట.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏనాడూ ఎవరితోనూ జత కట్టలేదు. సింహంలా ఒంటరిగా పోటీ చేసి అందరినీ మట్టి కరిపించారు. ఆ దమ్ము, ధైర్యం మీకున్నాయా? పవన్.. నీవు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఎక్కడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగిందా? నీకా ప్రభుత్వం భయపడేది? ధాన్యం సేకరణ చేస్తే, వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. అయితే నాకు భయపడి, ప్రభుత్వం రూ.139 కోట్లు ఖాతాల్లో వేసిందని చెప్పుకుంటున్నావు. పవన్.. నీకా ప్రభుత్వం భయపడేది? ఈనెల 14న దాదాపు రూ.3 వేల కోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నాం. ఇది ఒక విడతలో, ఒక ఏడాదిలో ఇస్తున్న మొత్తం. చంద్రబాబు 100 జన్మలు ఎత్తినా ఆ పని చేయగలడని హామీ ఇవ్వగలవా.. అంటూ పవన్‌కల్యాణ్‌పై మంత్రి కాకాణి మండిపడ్డారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: వైఎస్సార్సీపీ ఇంచార్జిల నియామకం
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్సార్సీపీ ఇంచార్జిలను నియమించింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఇంచార్జిలను నియమించించింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ నుంచి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆత్మకూరు ఉఎ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇంచార్జిల నియామకం ఇలా.. అనంతసాగరం మండలం- మంత్రి మేరుగ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎఎస్‌పేట మండలం- మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి ఆత్మకూరు అర్బన్- మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ ఆత్మకూరు రూరల్- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి చేజర్ల మండలం- మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని మర్రిపాడు- మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంగం మండలం: మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి -
భూ సేకరణ పనులు శరవేగం
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ శరవేగంగా జరుగుతోంది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్లతోపాటు ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఎస్ఈలతో ఎప్పటికప్పుడు భూ సేకరణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో భూ సేకరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. మొత్తం తొమ్మిది సాగునీటి వనరుల పరిధిలో 10 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికే ఆరు వేల ఎకరాల పరిధిలో డిక్లరేషన్స్ పూర్తి చేయగా, మిగిలిన భూమి సర్వే దశలో ఉంది. మూడు, నాలుగు నెలల్లోనే భూ సేకరణ తంతు పూర్తి కానుంది. జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రూ. 1357 కోట్లతో రాజోలి రిజర్వాయర్, రూ. 852.59 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లి, గిడ్డంగివారిపల్లె చెరువులను విస్తరించి వాటి పరిధిలోని పలు చెరువుల ద్వారా‡ వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దీంతోపాటు రూ. 45.49 కోట్లతో అలవలపాడు లిఫ్ట్ స్కీమ్, రూ. 1100 కోట్లతో పీబీసీ, జీకేఎల్ఐల పరిధిలోని పులివెందుల నియోజకవర్గంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ. 3050 కోట్లతో గండికోట, సీబీఆర్ లిఫ్ట్ అలాగే గండికోట, పైడిపాలెం లిఫ్ట్ పనులు రూ. 1182 కోట్లతో జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనులను చేపట్టారు. ఇది కాకుండా రూ. 50 కోట్ల నిధులతో బ్రహ్మంసాగర్ పరిధిలోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులు, తెలుగుగంగ పరిధిలోని ఎస్ఆర్–1లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించిన పనులను పూర్తి చేయనున్నారు. 810,245.02 ఎకరాల భూ సేకరణ తొమ్మిది సాగునీటి వనరుల పరిధిలో మొత్తం 10,245.02 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 6076.02 ఎకరాల భూమికి డిక్లరేషన్ అవార్డు అయింది. మరో 9571.38 ఎకరాలు ప్రతిపాదనల దశలో ఉండగా, 3552 ఎకరాల భూమి సర్వే దశలో ఉంది. ఇది కాకుండా వైఎస్సార్ జిల్లాలో 1080 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 390 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 72 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తికానుంది. త్వరలోనే భూ సేకరణ పూర్తి భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మొత్తం 10,245.02 ఎకరాల భూమిని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 65 శాతం మేర భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 35 శాతం భూ సేకరణ మరో మూడు, నాలుగు నెలల్లో పూర్తి కానుంది. – రామ్మోహన్, స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ), జీఎన్ఎస్ఎస్, కడప వేగవంతంగా భూ సేకరణ జీఎన్ఎస్ఎస్ పరిధిలోని అన్ని కొత్త సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 65 శాతానికి భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 35 శాతం భూ సేకరణ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, ఆయా ప్రాజెక్టుల స్పెషల్ కలెక్టర్ భూ సేకరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రక్రియ మరింత వేగంగా సాగుతోంది. – మల్లికార్జునరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీరు, జీఎన్ఎస్ఎస్, కడప -
తండ్రి అండ.. అన్న ఆశయం నీడ
తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇచ్చిన ఆత్మకూరు ప్రజల అండదండలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నామని చెప్పుకోవడం మినహా, ప్రధాన పార్టీలకు స్థానిక అభ్యర్థులు కరువయ్యారు. ఆత్మకూరులో బీజేపీ స్థానికేతరుడైన భరత్‌కుమార్ యాదవ్‌ను బరిలోకి దింపాల్సి వచ్చింది. మరో వైపు విక్రమ్‌రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని చూరగొన్న దివంగత గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని పోలింగ్ తేదీ కోసం తహతహలాడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అతి తక్కువ సమయంలో ప్రజల అభిమాన పాత్రుడు అయ్యాడు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిపై గూడుకట్టుకున్న అభిమానాన్ని ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి పట్ల చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి విక్రమ్‌రెడ్డి సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. తన అన్నపై పెంచుకున్న అభిమానం, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గౌతమ్‌రెడ్డి ఆశయాలు నెరవేరుస్తానని ఘంటాపథంగా చెబు తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీ–ఫారం ఇచ్చిన తర్వాత ఈ నెల 2న నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు రోజుల్లో 18 పంచాయతీల ప్రజల దరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి చేరారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ స్థానికులతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూనే ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాన్ని బలపర్చాలని, సోదరుడు గౌతమ్‌రెడ్డి ఆశయ సాధన కోసం అంతా ఏకమై తీర్పు చెప్పాలని కోరుతున్నారు. గ్రామాల్లో అనూహ్య మద్దతు లభిస్తోండడంతో మరింత ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక రెఫరెండమ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి స్థానికేతరుడే దిక్కు భారతీయ జనతా పార్టీకి ఆత్మకూరులో అభ్యర్థి కరువయ్యారు. నోటిఫికేషన్ ప్రకటించక మునుపే ముందే పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఒకప్పుడు ఆత్మకూరులో బీజేపీ గణనీయమైన మద్దతు లభించింది. 1985, 89ల్లో స్వల్ప ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓటమి పాలైంది. అటువంటి నియోజకవర్గంలో ఈ దఫా డిపాజిట్లు కాదు కదా.. కనీస ఓట్లు కూడా పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూకుమ్మడిగా దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని ప్రజలు పార్టీలకతీతంగా భావిస్తున్నారు. ఈ తరుణంలో స్థానిక నాయకులు పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి బాహాటంగా ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికేతరులే దిక్కయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌ను బరిలోకి దింపారు. అపార మద్దతు లభిస్తోంది – మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సోదరుడు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు ప్రజల్లో ఒక్కరుగా మమేకమయ్యారు. ఆత్మకూరును అన్నీ విధాలు అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్లారు. ఆయన మృతితో రాజకీయాలకు వర్గాలకతీతంగా ప్రజల నుంచి అపార మద్దతు లభిస్తోంది. అనంతసాగరం మండలం మినగల్లు పంచాయతీలో ప్రచారం అనంతరం వెంకటరెడ్డిపల్లె స్థానిక నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించాను. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నాను. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ ప్రజాజీవితానికి అంకితం కానున్నట్లు ప్రకటించారు. సోదరుడి ఆశయసాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైనికుడిగా పని చేయనున్నట్లు వివరించారు. తన తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవాలను అనుసరించి ప్రజల కోసమే పని చేస్తాను. స్థానిక సమస్యలను ప్రణాళికా బద్ధంగా పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తాను. విక్రమ్ అన్నలో గౌతమన్నను చూసుకుంటున్నాం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం జీర్ణించుకోలేనిది. ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిలో గౌతమ్ అన్నను చూసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో గౌతమన్న ఆశయాల సాధన కోసం విక్రమ్‌రెడ్డి ద్వారా సాధించుకోవాలని ప్రజలు ఆకాంక్షతో పోలింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. – పెయ్యల సంపూర్ణమ్మ, అనంతసాగరం ఎంపీపీ భారీ మెజార్టీయే గౌతమన్నకు ఘన నివాళి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే ఘనమైన నివాళి. గౌతమన్న ప్రత్యేక పంథాతో వివాద రహితుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని దీవించి భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే గౌతమన్న ఆత్మ సంతోషిస్తుంది. – రాపూరు వెంకటసుబ్బారెడ్డి, అనంతసాగరం జెడ్పీటీసీ సభ్యుడు -
అభివృద్ధి దారులు.. వేగంగా రోడ్ల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రహదారులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.కోట్ల నిధులను వెచ్చిస్తోంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నాణ్యాతా ప్రమాణాలను పాటిస్తూ బీటీ, సీసీరోడ్లు నిర్మిస్తోంది. నెల్లూరు(బారకాసు): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు వినతులు ఇస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ పట్టింది. గతంలో ప్రతిపాదనలకే పరిమితం కాగా నేడు ఎన్నో కార్యరూపం దాల్చుతున్నాయి. ఎక్కడెక్కడంటే.. ఆర్అండ్బీ శాఖ నెల్లూరు డివిజన్ పరిధిలోని నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు, కొత్తగా రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటితో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఎనిమిది పనులను పూర్తి చేశారు. మిగిలిన నిర్మాణాలను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి నెల్లూరు డివిజన్ పరిధిలో నెల్లూరు – కృష్ణపట్నం రోడ్డు (మాదారాజుగూడురు నుంచి బ్రహ్మదేవి వరకు), పొదలకూరు – రాపూరు రోడ్డు, నెల్లూరుపాళెం – ఆత్మకూరు, ఆత్మకూరు – సోమశిల, ఈపూరు ఫిషరీస్ రోడ్డు, నెల్లూరు – అనికేపల్లి (వయా గొలగముడి), మొగళ్లపాళెం – సౌత్‌మోపూరు, ములుముడి – తాటిపర్తి రోడ్డు పనులు పూర్తయ్యాయి. గడువులోగా పూర్తికి చర్యలు నెల్లూరు డివిజన్ పరిధిలోని రోడ్లు నిర్మాణాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది చోట్ల పనులు పూర్తి చేశాం. మిగిలిన వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపపట్టాం. కిందిస్థాయి అధికారులతో సమీక్షిస్తూ పనుల పురోగతి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా సమస్యల్లేవు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ఎంతో సహకరిస్తున్నారు. – రామాంజనేయులు, ఈఈ, నెల్లూరు డివిజన్, అర్అండ్బీ -
చెరగని గౌతమ ముద్ర
ఎన్నికల క్షేత్రంలో ఆత్మకూరు గడ్డపై మహామహులు తలపడ్డారు. ఏడు దశాబ్దాల చరిత్రలో నేటితరం దివంగత నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇందులో అత్యధిక మెజార్టీల రికార్డు ఆయనకే సొంతమైంది. అతి స్వల్ప మెజార్టీతో విజయ తీరానికి చేరిన చరిత్రను ఆనం సంజీవరెడ్డి దక్కించుకున్నారు. వరుసగా రెండేసి సార్లు గెలుపొందిన ముగ్గురిలో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. ప్రజల మనస్సు దోచిన ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఉప ఎన్నికల్లోనూ గౌతమ్ ముద్ర సృష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయ యవనికపై ఎందరో నేతలు వస్తుంటారు.. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వారు ఒకరో ఇద్దరు ఉంటారు. అందులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని మూటకట్టుకున్న నేటి తరం నాయకుడు గౌతమ్ చెరగని ముద్ర వేశారు. వరుసగా రెండు దఫాలు అత్యధిక మెజార్టీలు దక్కించుకున్న నేతగా మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ నియోజకవర్గ చరిత్రలో మిగిలిపోయారు. 1952 నుంచి 2019 వరకు 16 దఫాలు ఎన్నికలు జరిగాయి. తాజాగా ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం ఇది రెండు దఫా అవుతుంది. 1958లో తొలిసారి ఆత్మకూరు ఉప ఎన్నికలు రాగా, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దివంగతులు కావడంతో రెండో దఫా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం నామినేషన్లు పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అత్యధికం గౌతమ్‌రెడ్డి.. అతి స్వల్పం సంజీవరెడ్డి ఆత్మకూరు ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ మేకపాటి గౌతమ్‌రెడ్డి సొంతం కాగా, అతి స్వల్ప మెజార్టీ ఆనం సంజీవరెడ్డి దక్కాయి. 1958లో బెజవాడ గోపాల్‌రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అప్పట్లో ఆయన సర్వేపల్లిలో కొనసాగుతూ ఆత్మకూరు శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అప్పట్లో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఆనం సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి జీసీ కొండయ్యపై 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డికి 22,358 ఓట్లు లభించగా, పీఎస్పీ అభ్యర్థి జీసీ కొండయ్యకు 22,313 ఓట్లు లభించాయి. ఆత్మకూరు చరిత్రలో ఇది అతి స్వల్ప మెజార్టీగా చరిత్రగా నిలిచిపోయింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి 31,412 ఓట్లు మెజార్టీ లభించింది. రెండో దఫా 2019 ఎన్నికల్లోనూ 22,276 ఓట్ల అత్యధిక మెజార్టీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలు ఇవే కావడంతో ఆ రికార్డులు గౌతమ్‌రెడ్డికి దక్కాయి. స్వల్ప మెజార్టీతో విజయం దక్కించుకున్న వారిలో మరో ఇరువురు ఉన్నారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి బి సుందరరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి కె ఆంజనేయరెడ్డిపై 334 ఓట్లుతో విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్షుమయ్యనాయుడిపై 2,069 ఓట్లతో విజయం సాధించారు. ఇవే తక్కువ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందిన ఎన్నికలు కావడం విశేషం. టీడీపీయేతరులే విజేతలు ఆత్మకూరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిలిచిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు 7 సార్లు ఎన్నికలు జరిగితే.. 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే 1983, 94లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, రెండు సార్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన జాబితాలో ముగ్గురు ఆత్మకూరులో 16 దఫాలుగా ఎన్నికలు జరిగితే.. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన వారు ముగ్గురే. ఇందులో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. 1958, 1962లో వరుసగా రెండు సార్లు ఆనం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1978లో తొలిసారి విజయం సాధించిన బి సుందరరామిరెడ్డి 1983లో టీడీపీ అభ్యర్థి అనం వెంకటరెడ్డితో తలపడి ఓడిపోయారు. తిరిగి 1985, 89లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచి సుందరరామిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 19ల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి వరసగా రెండు సార్లు ఘన విజయం సాధించారు. -
సాగర మథనం.. సాహస జీవనం
సాక్షి, నెల్లూరు: మత్స్యకారులు.. జన జీవన సవ్రంతి బతుకుతున్నా వారి బతుకు లోతుల్లోకి తొంగిచూస్తే విలక్షణత కనిపిస్తోంది. కడలి ఒడిలో చేపల వేటనే జీవనంగా మార్చుకున్న గంగ పుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఏడాదిలో పది నెలల పాటు సాగరాన్ని మథించే సాహజ జీవనాన్ని సాగిస్తుంటారు. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే వీరు.. బతుకు పోరాటంలో దశాబ్దాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. వేటే వీరి జీవనాధారం.. ఆ వేట ఆగితే.. ఆ పూట గడిచేది కడుభారం. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ విధించే వేట నిషేధం కాలంలో బతుకు జీవనం పెను సవాల్‌గా ఉంటుంది. జీవితం.. విభిన్నం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12 మండలాల పరిధిలో 169 కి.మీ. మేర సముద్ర తీరం ఉంది. ఆ తీరం వెంబడి ఉన్న 98 గ్రామాల్లో సుమారు 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 41 వేల మంది చేపల వేటనే జీవనం మార్చుకుని జీవిస్తున్నారు. ఏటా దాదాపు 65 వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి సేకరిస్తున్నారు. కడలినే నమ్ముకున్న గంగపుత్రుల జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. వేకువ జామున 2 గంటలకే సిద్ధం చేసుకున్న వలలను భుజాలపై వేసుకుని సంప్రదాయ బోట్లు ద్వారా సముద్రంలోకి వెళ్తారు. దాదాపు 5 కి.మీ. సముద్రంలోకి వెళ్లి వలలు వేసి మత్స్య సంపదను సేకరించి ఉదయం 8 గంటలకు తీరానికి చేరుకుంటారు. మెకనైజ్డ్ బోట్లు ఉన్న మత్స్యకారులు మాత్రం సముద్రంలో వెళ్లి వారం.. పది రోజుల పాటు అక్కడే ఉండి మత్స్య సంçపదను సేకరించి తీరానికి చేరుస్తారు. ఇలా పది నెలల పాటు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకుంటారు. పగలంతా తమ వలలను సరి చేసుకుని మళ్లీ మరుసటి రోజుకు సన్నద్ధమవుతారు. ఇదే వీరి నిత్య జీవితం. కుటుంబ సభ్యులతో గడిపేది చాలా తక్కువ సమయం. ఇలా ఏడాదిలో పది నెలలు సముద్రంలోనే వీరి జీవితం గడిచిపోతుంది. వేటకు ఇలా వెళ్తారు.. గ్రామంలో మత్స్యకారులు బోటు సామర్థ్యాన్ని బట్టి యూనిట్‌గా ఏర్పాటవుతారు. పెద్దబోటులో (మూడు ఇంజిన్లు) ఉన్న దానిలో 30 మంది వేటకు వెళ్తారు. సింగిల్ ఇంజిన్ ఉన్న బోటులో నలుగురు వెళ్తారు. డబుల్ ఇంజన్ ఉన్న బోటులో 20 మందికి పైగా వేటకు వెళ్తారు. వారు సేకరించే మత్స్య సంపదను అందరూ కలిసి పంచుకుంటారు. ఒకసారి వేటకు వెళ్తితే బోటు డీజిల్ ఇతరత్రా ఖర్చులకు రూ.15 వేలు వరకు ఖర్చవుతుంది. వేటకు వెళ్లినప్పడు ఒక వేళ ఆయా బోటులు, వలలు మరమ్మతులకు గురైతే ఆ యూనిట్లో ఉన్న వారందరూ కలిసి దళారుల వద్ద వడ్డీతో అప్పు తెచ్చుకుని మరమ్మతులు చేయించుకుంటారు. వేట సాగించి వచ్చిన డబ్బులను ఆ దళారులకే వడ్డీతో కలిసి తిరిగి చెల్లిస్తుంటారు. జీవనం.. విశిష్టం చుట్టూ ప్రపంచం పాశ్చాత్య పోకడలతో విలాస జీవనం సాగిస్తుంటే.. వీరు మాత్రం కులాల కుంపట్లకు.. రాజకీయాలకు దూరంగా ఉంటారు. అందరిదీ ఒక్కటే మాట.. బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. తమకు తాముగా విధించుకున్న కట్టుబాట్లకు కట్టుబానిసలు. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. వీరికి వీరు సృష్టించుకున్న చట్టం పేరు ‘దురాయి’. ఈ చట్టం కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఈ ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికి వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే.. ఆ ఊరంతా అనుసరించాల్సిందే. ఎవరైనా ఈ నిర్ణయాన్ని ధిక్కరిస్తే.. అందరికీ ఆమోదయోగ్యంగా ‘దురాయి’ విధిస్తారు. విరామ సమయంలో.. వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు జీవనం కాస్త దుర్భరమైనప్పటికి కాయకష్టాన్నే నమ్ముకుంటారు. కొంత మంది అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్‌లో కూలీలుగా వెళ్తారు. రొయ్యల చెరువుల్లో పట్టడం, ప్యాకింగ్ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో కాలక్షేపం కోసం చింతబెత్తలతో ఆట, పులిమేక, కబడ్డీ ఇలా ఆడుకుంటున్నారు. మారుతున్న జీవన విధానం మత్స్యకారులు పల్లెల్లో ఇప్పుడిప్పుడే చేపల వేటతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యవసాయం, ఉపాధి మార్గాలు అన్వేషించుకోవడం మొదలైంది. ఇందుకూరుపేట మండలంలో మైపాడులో మత్స్యకారులు వ్యవసాయం చేస్తున్నారు. వేరుశనగ, చేమ వంటి పంటలు సాగు చేస్తున్నారు. యువత చదువులపై దుష్టి సారించి విద్యావంతులుగా మారి ఉద్యోగావకాశాలు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ చేపల వేటను నమ్ముకున్న వారు మాత్రం వేటనే జీవనంగా మార్చుకుని ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి సారించడం లేదు. మత్స్యకారుల జీవనశైలి విభిన్నం సముద్ర తీరం వారికి తల్లి ఒడి. కడలి ఘోష వారికి అమ్మ లాలిపాట. భీతిల్లే అలల్లో ఊయలలు ఊగినంతగా అలవోకగా జలరాసిపై అనునిత్యం సాగర మథనం. అగాధ జలనిధిలో సాహస సమరంతో జీవనం సాగించే మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచి ఆరంభమవుతుంది. అందరూ జనం మధ్య తిరుగుతూ బతుకు జీవనం సాగిస్తుంటే.. వీరు మాత్రం నిర్మానుష్య కల్లోల కడలిలో మత్స్య వేట సాగిస్తుంటారు. ఇల్లు విడిచి కడలిలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటారు. మత్స్యకారుల జీవన విధానం.. శైలి విభిన్నంగా ఉంటుంది. కట్టుబాటుకు కట్టుబానిసలు వీరు. మూడేళ్లలో ఎంతో మార్పు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పు ప్రారంభమైంది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో చేపల పునరుత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వేటకు విరామం కల్పిస్తోంది. గత ప్రభుత్వాల కాలంలో అరకొర మందికి.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం.. 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. అయితే ఈ ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షలు పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్లు పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. విరామ సమయంలో ఇబ్బందులే చేపల వేట విరామం సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు వ్యవసాయ భూములు లేవు. పంటలు పండించే విధానం తెలియదు. మాకు తెలిసిందల్లా చేపలు వేట చేయడం తెలుసు. రెండు నెలల పాటు పనులు లేక ఇళ్లవద్దనే ఉంటున్నాం. ప్రభుత్వం మాకిచ్చేఆర్థిక సాయంతో పాటు వలలు బోటులకు రాయితీతో రుణాలు ఇవ్వాలి. – ఎస్.ఆర్ముగం, కృష్ణాపురం ప్రభుత్వ సాయంతోనే.. వేట విరామ సమయంలో రెండు నెలల పాటు ఖాళీగా ఉంటున్నాం. స్థానికంగా మాకు పనులు లేవు. ఆక్వా సాగు చేసే వారు ఏదైనా పనులకు పిలిస్తే పోతాం. అర్హత ఉన్నవారికి మాత్రం ప్రభుత్వం రూ.10 వేలు వంతున సాయం చేస్తోంది. వీటితో పాటు సంక్షేమ పథకాల ద్వారా వచ్చే నగదుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. – పి.చిన్న పిచ్చయ్య, కృష్ణాపురం అర్హులకు సంక్షేమ ఫలాలు మత్స్యకారులకు వేట విరామంలో ప్రభుత్వ సాయం అందిస్తోంది. జిల్లాలో ఉన్న 11 వేల మందికి రూ.10 వేలు వంతున ఆర్థిక సాయం అందించాం. ప్రధానమంత్రి మత్స్య సంపదయోజన పథకం ద్వారా కూడా బోట్లు, వలలు, అందిస్తున్నాం. మెకనైజ్డ్ బోట్లు పంపిణీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తోంది. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ -
మరో 30 ఏళ్లు వైఎస్ జగనే సీఎం
వెంకటాచలం: రాష్ట్రానికి మరో 30 ఏళ్లు సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఎన్నుకుంటారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జోస్యం చెప్పారు. వెంకటాచలంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భారీ కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోవడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. చంద్రబాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్ కాలం చేశారన్నారు. ఆయన శత జయంతి రోజు పూలమాల వేసి కీర్తించడం చూసి ఆత్మ ఘోషించి ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు అవమానించినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నామకరణం చేయడం గొప్ప విషయమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబే, చివరకు తమ పార్టీ గూండాలను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతంగా కలిగించే విధంగా చేయించడం దుర్మార్గమని మండి పడ్డారు. మంత్రులు ఇళ్లను తగులబెట్టించడం, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులకు ప్రేరేపించడం సిగ్గు చేటని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చంద్రబాబు ఏ నాడు మేలు చేయలేదని «ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం ఉందానని ప్రశ్నించారు. చంద్రబాబుకు తనపై, కొడుకు లోకేష్‌పైనా నమ్మకం లేకపోవడంతో దత్తపుత్రుడును నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ మందా కవిత, వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయగిరిలో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సోమవారం సంబరాలు జరుపుకున్నారు. ముందుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ జనం మెచ్చిన నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు తెచ్చుకొని ప్రజా మన్ననలు పొందుతున్నారని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. -
ఇందుకూరు పేట.. కూరగాయల తోట
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం కూరగాయల తోటలకు ప్రసిద్ధి. నెల్లూరులోని ప్రధాన కూరగాయల మార్కెట్‌కు వచ్చే ఆకు కూరలతో పాటు కూరగాయల్లో వంగ, బెండ, దొండ, కాకర, బీర, చిక్కుడు, చేమ వంటివి సింహభాగం ఇక్కడ పండేవే. చిన్న, సన్నకారు రైతులు వందలాది ఎకరాల్లో ఆకు కూరలు, కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. అన్ని కాలాల్లోనూ పంటలు సాగవుతుండడంతో ఈ పనులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకు కూరలు, కూరగాయలు కోసి, స్వయంగా రాత్రి పూట మార్కెట్‌కు తరలించి, విక్రయించుకుని వెళ్తుంటారు. మరి కొందరు టోకు ధరతో కొనుగోలు చేసి ఇక్కడ కూరగాయల మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఇందుకూరుపేట: దక్షిణ కోనసీమగా పిలిచే ఇందుకూరుపేట విభిన్న కోణాల్లో కనిపిస్తోంది. ఓ వైపు ప్రకృతి అందాలు, మరో వైపు ఆధ్యాత్మికత.. ఇంకో వైపు వివిధ రకాల పంటల సాగు దృశ్యాలు ఇందుకూరుపేట సొంతం. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సరఫరా అయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో అత్యధిక శాతం ఇక్కడ పండించేవే. నేల, నీరు, వాతావరణం అనుకూలంగా ఉండడంతోమండలంలోని ఇందుకూరుపేట, కొత్తూరు, డేవిస్‌పేట, జగదేవిపేట, పల్లిపా డు తదితర పంచాయతీల్లో వంగ, బెండ, మిరప, చిక్కడు, చేమ, అరటి తదితర పంటలు సుమారు 1000 నుంచి 1500 ఎకరాల విస్తీర్ణం వరకు సాగు చేస్తున్నారు. అనునిత్యం ప్రతి ఇక్కడి నుంచి టన్నుల కొద్దీ కూరగాయలను నెల్లూరు మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. రైతు కుటుంబాలే కూలీలు ఆకు కూరలు, కూరగాయల పంటలు అతి స్వల్ప కాలిక పంటలే. అర ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు సాగు చేసే రైతులే ఇక్కడ అధికం. సుమారు 400 మందికి పైగా రైతు కుటుంబాలు వారి తోటల్లో వారే కూలీలుగా పని చేస్తుంటారు. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉంటారు. వీరితో పాటు మరి కొందరు సహాయంతో ఈ పనులు చేస్తుంటారు. ఇటు వంటి మరో 300 మంది ఉంటారు. ప్రతి రోజు అందరికి చేతిలో పని ఉంటుంది. అదను చూసి దుక్కిదున్నడంతో పాటు నీరు పెట్టడం, కలుపు తీయడం,, మందులు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం వంటి పనులు రైతులు దినచర్యగా చేస్తోంటారు. వేకువజామునే లేచి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి తోటకు పయనమవుతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేసిన రైతులు సాయంత్రం పండిన పంటను కోసి తరలిచేందుకు వీలుగా బస్తాలకు, ప్లాస్టిక్ బాక్స్‌ల్లో నింపుకొని సి«ధ్దం చేసుకొంటారు. అర్ధరాత్రి లేచి కాలకృత్యాలకు తీర్చుకొని రెండు, మూడు గంటకు గ్రామం నుంచి నెల్లూరు నగరానికి బయలు దేరుతారు. నెల్లూరు మార్కెట్‌కు వెళ్లి విక్రయించుకుని తెల్లారే సరికి ఇళ్లకు చేరుకుంటారు. ఇదే వీరి నిత్యం జీవితం. ఉద్యాన పంటలే మాకు ఆధారం మొదటి నుంచి కూరగాయలు సాగు చేసే మేము జీవిస్తున్నాం. వాతావరణానికి అనుకూలంగా పంటలు వేస్తాను. మేమే కష్టపడి పనిచేసుకొంటాం. ప్రస్తుతం బెండ, ఆకుకూరలు వేసి ఉన్నాను. దీనికి తోడు కొబ్బరి చెట్లను లీజుకు తీసుకున్నాను. బెండ పంటను రోజు మార్చి రోజు కోత కోసి మార్కెట్‌కు తీసుకెళుతున్నాను. ప్రస్తుతం మంచి రేటు ఉంది. ఈ ఉద్యాన పంటలే మాకు ప్రధాన జీవనాధారం. – తిమ్మిరెడ్డి శేషయ్య, కొత్తూరు కూరగాయల సాగుతోనే జీవనం నేను నాకున్న ఎకరం భూమిలో వివిధ రకాల కూరగాయలు కొన్నేళ్లుగా సాగు చేస్తున్నాను. ఇదే నా కుటుంబానికి ఆదాయ వనరు. ప్రస్తుతం బెండ, పచ్చిమిర్చి, గోంగూర, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. ప్రతి రోజు కుటుంబ సభ్యులం ఉదయాన్నే తోటకు చేరి పనులు చేసుకొంటాం. ఎక్కువ దిగుబడి ఉంటే ఇక్కడే దళారులకు విక్రయిస్తాం. కొద్దిగా ఉంటే నెల్లూరు మార్కెట్‌కు వెళ్లి పంటను అమ్ముకొంటాం. – మేనాటి మురళీ, కొత్తూరు నేనే సొంతంగా విక్రయిస్తాను లాక్డౌన్ సమయం నుంచి మార్కెట్‌కు వెళ్లడం లేదు. సొంతంగా ఆటో కొనుక్కొని నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, పొరుగున ఉన్న టీపీ గూడూరు మండలంలో గ్రామంలో తిరుగుతూ సరుకును అమ్ముకొంటాను. నేను పండించిన పంటనే కాకుండా పక్కనున్న వారి కూరగాయలు సైతం కొనుక్కొని ఈ పని చేస్తున్నాను. మా కుటుంబంలో అందరికీ కూలి పాటు గిట్టుబాటు అవుతుంది. – అత్తిపాటి వెంకయ్య, కొత్తూరు -
ఆత్మకూరు ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు(అర్బన్): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో జేసీ హరేంద్ర ప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ సిద్ధం చేశామన్నారు. ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జేసీ హరేంద్ర ప్రసాద్ వ్యవహరిస్తారన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన వారు 4,981 మంది, విభిన్న ప్రతిభావంతులు 4,777 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వారు సజావుగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,000 ఓట్లుపైబడి ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాన్ని పెడతామన్నారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఇస్తామన్నారు. 648 బ్యాలెట్ యూనిట్స్‌ను, 593 కంట్రోల్ యూనిట్స్‌ను, 583 వీవీ ప్యాట్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటరు స్లిప్పులను ఓటర్లకు అందించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనరాదని సూచించారు. ప్రవర్తనా నియమావళి (కోడ్) సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యను నియమించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ హిమావతి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ∙ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ గురువారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ చక్రధర్‌బాబు ఎన్నికల నిర్వహణ గురించి చేపట్టిన చర్యలను వివరించారు. ఈవీఎం యంత్రాల గోదామును తనిఖీ చేశామన్నారు. జేసీ హరేంద్ర ప్రసాద్, ఏఎస్పీ హిమవతి పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మకూరు ఉప ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. -
రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగింత.. ఉదయగిరికి మరో మణిహారం
ఉదయగిరికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడ స్వర్ణయుగం నడిచినట్లు చెబుతుంటారు. కాలగమనంలో కరువు రాజ్యమేలింది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి మరో మణిహారం రానుంది. ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దాతృత్వంతో ప్రజలకు ఉపయోగపడేలా వర్సిటీని తీర్చిదిద్దనున్నారు. సాక్షి, నెల్లూరు: మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా వర్సిటీని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థుల్లో మరింత మక్కువ పెంచేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ వర్సిటీ అందుబాటులో ఉంటే అధిక మంది విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు సుమారు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీకి రాయలసీమ పరిధిలో ఉండే కళాశాలలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. మేకపాటి కుటుంబం దాతృత్వం మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి తప్పక జరుగుతుందనే ఆశయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే ఎంతో ఉదారంగా సాయం చేశారు. మర్రిపాడు మండలంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు సొంత భూములు కేటాయించారు. సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సొంత నిధులు సమకూర్చారు. ఎంఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు సొంత నిధులిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. మేకపాటి కుటుంబం ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగించడంతో వారి దాతృత్వానికి మెట్ట ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు. మహర్దశ పట్టించేలా.. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఉదయగిరిలో ఒకప్పుడు వ్యవసాయ రంగానికి సాగునీరు కరువై బతుకు దెరువు కోసం ఎంతోమంది వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో శ్రీమంతులైన వారు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయగిరికి సాగునీరందించే బృహత్తరమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవల్ కెనాల్ లాంటి ప్రాజెక్టులతో ఉదయగిరి వలస జీవనానికి కళ్లెం వేసి మోడుబారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తయితే వలసవాసులు తిరిగి వచ్చి సాగుబాట పట్టే అవకాశం ఉంది. దీనికితోడు వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుతో ఇక్కడి అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఔన్నత్యానికి నిదర్శనం మేకపాటి కుటుంబం ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రూ.250 కోట్లు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించమని కోరడం వారి ఔన్నత్యానికి నిదర్శనం. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండడం ఆనందదాయకం. – షేక్ గాజుల ఫారుఖ్‌అలీ, ఉదయగిరి హర్షదాయకం ఈ ప్రాంత రైతులకు ప్రయోజగకరంగా ఉంచేందుకు మెరిట్స్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షదాయకం. మెరిట్స్ కళాశాల ఉద్యోగులకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి చేయడం వారి దూరదృష్టికి నిదర్శనం. – డాక్టర్ ఎం.మనోజ్‌కుమార్‌రెడ్డి, మెరిట్స్ కళాశాల ప్రిన్సిపల్ గౌతమ్‌రెడ్డి పేరుతో.. మెరిట్స్ కళాశాల 106 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన అకాడమీ బ్లాక్స్, 600 అమ్మాయిలు, 750 అబ్బాయిలుండేలా హాస్టల్ భవవ సదుపాయాలున్నాయి. 89 స్టాఫ్ క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, లైబ్రరీ 27 వేల పుస్తక సముదాయం, మూడు బస్సులు, జనరేటర్స్, క్యాంటీన్, గెస్ట్ హౌస్, ఫిజికల్ డైరెక్టరీస్, ఎన్ఎస్ఎస్, భవన సముదాయాలు, ప్లే గ్రౌండ్ తదితర ఆస్తులను వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అలాగే సుమారు 50 ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములను కూడా ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. రూ.కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన ఎంఆర్ఆర్ ట్రస్ట్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్న వారి విన్నపానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. -
సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి
రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న పంట నాణ్యత.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. సహజ సిద్ధ (ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోంది. పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులతో జిల్లాలో ఏటా సహజ సేద్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. విడవలూరు/నెల్లూరు(సెంట్రల్): ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులకు వరంగా మారింది. ప్రస్తుతం రసాయనిక ఎరువుల ధరలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండడంతో సాగు పెట్టుబడి అధికం అవుతుంది. పంట నాణ్యత లేకపోవడంతో దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు వస్తుండడం, సేంద్రియ సేద్య (ఆర్గానిక్) ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్, రేటు లభిస్తుండడంతో రైతులు సైతం ఆ తరహా సేద్యంపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో జిల్లాలో ఏటేట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 67 వేల ఎకరాల్లో సాగు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి మహిళా రైతులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. విడవలూరు, వింజమూరు తదితర మండలాల్లో మహిళా రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. వీరు ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేయడంతో గతంలో వీరికి ఆదర్శ మహిళా రైతుగా బిరుదులు కూడా దక్కాయి. జిల్లాలో ఈ ఏడాది 53,764 మంది రైతులు 67,356 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో 222 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్ర«ధానంగా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా సాగు విస్తీర్ణం పెరిగింది. 18 రకాల పంటలు జిల్లాలో ఎక్కువగా 18 రకాల పంటలను ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా పండిస్తున్నారు. ప్రధానంగా వరి పంట అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. వరితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు, కందులు, పెసలు, పిల్లిపిసర, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొర్రలు, గోగులు, గోరుచిక్కుళ్లు, కాకర, బీర, సొరకాయలు, బెండ, టమాటాలు ఎక్కువగా వీటిని ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నారు. 110 గ్రామాల ఎంపిక ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎడగారులో వరి సాగు పండించేందుకు జిల్లాలో 110 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు బీజామృతం (విత్తన శుద్ధి), జీవామృతం (పంట సత్తువ), నీమామృతం (గుడ్డు దశ నాశనం), బ్రహ్మాస్త్రం (లబ్ధిపురుగు నివారణ) అగ్నాస్త్రం (అగ్గి తెగులు నివారణ) అజోల్లా (నత్రజని అందించడం) వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వాటి తయారీ విధానం, వాడుక విధానాన్ని తెలుపుతున్నారు. ప్రకృతి వ్యవసాయమే అనివార్యం ఈమె పేరు రొడ్డా వెంగమ్మ. ఊటుకూరు సర్పంచ్, వింజమూరు మండలం. ఈమె 5 ఎకరాల్లో మామిడి తోట, 5 ఎకరాల్లో వరి, అర ఎకరాలో కంది, అర ఎకరాలో కూరగాయలను పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేయడంతో పెట్టుబడులు పెరిగి, ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఆమె ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించారు. తొలుత కొంత సేంద్రియ విధానంలో సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. దీంతో పూర్తిగా ప్రకృతి సేద్యం చేయడం ద్వారా ఖర్చులు తగ్గించుకున్నారు. అధిక దిగుబడులతో రాబడి పెరిగిందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మూడేళ్ల నుంచి వరి పంట సాగు ఈమె పేరు చౌటూరు రమణమ్మ, విడవలూరు. ఈమె తనకున్న రెండు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేస్తున్నారు. గిరిజన మహిళ కావడంతో పెద్దగా విద్యను అభ్యసించలేదు. ఈమె కూడా అందరిలాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేసింది. పెద్దగా రాబడి లేకపోవడంతో సాగు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంపై అంతపట్టు లేకపోయినప్పటికీ, ప్రకృతి సేద్యంతో ఖర్చులు తగ్గుతాయని, రాబడి పెరుగుతుందని ప్రకృతి సేద్యం సిబ్బంది సూచనలతో ఆ వైపు అడుగులు వేసింది. వారి పర్యవేక్షణలో మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వరి సాగు చేస్తున్నారు. దీంతో ఈమెకు ఉత్తమ మహిళా రైతుగా బిరుదు లభించింది. అవగాహన కల్పిస్తున్నాం ప్రకృతి వ్యవసాయం సాగుపై జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయం సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని విధాలుగా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. – ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ చాలా బాగుంది ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను. వరితో పాటు, ఇతర పంటలను సాగు చేస్తున్నాను. పంటకు పోషకాలు అందించేందుకు అవసరమైన ప్రకృతి పరమైన పోషకాలు సిద్ధం చేసుకోవడం, వాటిని తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా.. ఖర్చులు భాగా తగ్గుతున్నాయి. అధిక దిగుబడులతో లాభాలు వస్తున్నాయి. – ఇందకూరు అనిల్‌రెడ్డి, రైతు, అశ్వనీపురం, ఆత్మకూరు మండలం -
ప్రతి గడపలో అపూర్వ స్పందన
నెల్లూరు(సెంట్రల్): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి జిల్లాలో అపూర్వ స్పందన వస్తోంది. ఇందులో భాగంగా స్వయంగా ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల వద్దకు వెళ్తుండగా వారు ఆనందించి ఆశీర్వదిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అవి తమకు అందుతున్నాయని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా తమకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎల్లవేళలా తమ ఆశీస్సులుంటాయని దీవిస్తున్నారు. పక్కాగా పథకాల అమలు కందుకూరు నియోజకవర్గంలోని పలుకూరు ప్రాంతంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన చిన్న సమస్యలను ఎమ్మెల్యే అక్కడే పరిష్కరిస్తుండడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మానుగుంట మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. అర్హులకు పక్కాగా పథకాలు అందిస్తున్నామని, అదే విధంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలకు అండగా ప్రభుత్వం వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలం దేవరవేమూరు ప్రాంతంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆనందం వ్య క్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా భరోసా కల్పించినట్లు చెప్పారు. ఇంకా అభివృద్ధి చేస్తాం ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి మున్సిపల్ పరిధిలోని 12, 13 వార్డుల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపలో ఆయనకు ఆత్మీక స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రజలకు విక్రమ్‌రెడ్డి సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరికీ ఎంతో బాధ్యతగా అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇంకా చేస్తామని తెలిపారు. -
గడప గడపలో ఆప్యాయత
నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని దీవిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం, విరువూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, మీకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పెనుబర్తిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నివర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. -
విరబూసిన విద్యావనం
చారిత్రక సింహపురి పేరుతో పురుడు పోసుకున్న విక్రమసింహపురి యూనివర్సిటీ అనతికాలంలో పేరెన్నిక వర్సిటీల సరసన నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరి చేర్చాలన్న సమున్నత సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సృష్టించిన వర్సిటీ సత్ఫలితాలను సాధిస్తోంది. వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ సగర్వంగా స్నాతకోత్సవాల పండగ చేసుకుంటోంది. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలను అందించనుంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి విద్యావనంలో విద్యా కుసుమాలు విరగబూస్తున్నాయి. ఉన్నత సంకల్పంతో నెలకొల్పిన యూనివర్సిటీ సత్ఫలితాలు సాధిస్తోంది. ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ దేశంలోనే అగ్రగామి వర్సిటీగా పరిణతి చెందుతోంది. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలో విద్యా వర్సిటీ లేకపోవడాన్ని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో విక్రమసింహపురిగా పేరొందిన నెల్లూరులో అదే పేరుతో వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలుత పరాయి పంచన ప్రారంభించిన వర్సిటీకి నెల్లూరుకు కూతవేటు దూరంలోని కాకుటూరులో 87 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ హంగులతో వర్సిటీ సొంత భవనానికి పునాదులు వేశారు. పుష్కర కాలంలోనే వైభవంగా వెలుగొందుతున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 6, 7 స్నాతకోత్సవాలను మంగళవారం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని వీఎస్‌యూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గవర్నర్ బిశ్వభూషణ్, మంత్రి బొత్స సత్యనారాయణ, హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. 26 గోల్డ్‌మెడల్స్ అందజేత వర్సిటీ స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో అత్యున్నత ప్రతిభ చాటిన 19 మంది విద్యార్థులకు 26 గోల్డ్ మెడల్స్‌ను అందించనున్నారు. 252 మందికి ప్రత్యక్షంగా, 4,071 మంది విద్యార్థులకు తపాలా ద్వారా పట్టాలు అందించేందుకు ప్రణాళికలు చేపట్టారు. శ్రీసిటీ సృష్టికర్తకు గౌవర డాక్టరేట్ పల్లెటూళ్లను పరిశ్రమల గూళ్లుగా మార్చిన శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందిస్తోంది. తడ–సత్యవేడు మండలాల మధ్య 5,700 ఎకరాల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో చేపట్టిన శ్రీసిటీకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. 28 దేశాలకు చెందిన 200 పరిశ్రమలు పైగా శ్రీసిటీలో నెలకొల్పారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తోంది. అందుకు కారకులైన ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందించనున్నారు. సామాజిక బాధ్యతలో ప్రత్యేకత వర్సిటీ సామాజిక బాధ్యతను గుర్తెరిగింది. కరోనా కారణంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్, గూగుల్ మీట్ వంటి మొబైల్ అప్లికేషన్లు ద్వారా బోధన చేసి, సకాలంలో పరీక్షలు నిర్వహించి సత్ఫలితాలు సాధించింది. 2019లో ఎన్ఎస్ఎస్ విభాగంలో భారతదేశంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వీఎస్‌యూ నిలిచింది. 2020లో రాష్ట్ర ఉత్తమ వలంటీర్ అవార్డు, 2021లో యూత్ ఐకాన్ అవార్డు దక్కించుకుంది. వర్సిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలకు సంబంధించి 19 జట్లలోని 164 మంది విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా వర్సిటీని తీర్చిదిదేందుకు వైస్ చాన్సలర్ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ ఎల్వీ కృష్ణారెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వర్సిటీలో 17 విభాగాలు ఉన్నాయి. జిల్లాకు అనువుగా మరిన్నీ సబ్జెక్ట్‌లు ప్రవేశ పెట్టేందుకు నిపుణుల కమిటీ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నాం. రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇçవ్వనున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాం. అవసరమైన మేరకు దాతల సహకారం కోరుతున్నాం. సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని అనుగుణంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రచించుకున్నాం. – ఎల్ విజయకృష్ణారెడ్డి -
డీకేడబ్ల్యూకు మహర్దశ
నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల.. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఎందరో ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్నారు. నాడు – నేడు కింద డీకేడబ్ల్యూ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు(టౌన్): నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ (డీకేడబ్ల్యూ) కొత్త కళ సంతరించుకోనుంది. ఈ కాలేజీ 25 ఎకరాల్లో 1,400 మందికి పైగా ఇంటర్మీడియట్, 1,200 మందికి పైగా డిగ్రీ విద్యార్థినులతో కళకళలాడుతూ ఉంటుంది. వారికి ఇక్కడే వసతి సౌకర్యాన్ని కూడా కల్పించారు. నాడు – నేడు కింద డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ.6.23 కోట్లతో ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్‌కు పంపించారు. దీంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద రూ.1.87 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఏ పనులంటే.. కళాశాలలో నాడు – నేడు కింద వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందులో భాగంగా మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్‌కు రూ.55 లక్షలు, మేజర్, మైనర్ మరమ్మతులకు రూ.1.53 కోట్లు, కాంపౌండ్ వాల్‌కు రూ.29 లక్షలు, ఫర్నీచర్‌కు రూ.44 లక్షలు, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్‌కు రూ.92 లక్షలు, ఆర్వో ప్లాంట్, తాగునీటికి రూ.17 లక్షలు, పెయింటింగ్‌కు రూ.80 లక్షలు, గ్రీన్ చాక్‌బోర్డుకు రూ.1.50 లక్షలు, ఇంగ్లిష్ ల్యాబ్, కంప్యూటర్లకు రూ.11 లక్షల వ్యయం కానుందని ఇంజినీరింగ్ విభాగం అధికారులు అంచనా వేశారు. ఎన్ఐఆర్ఎఫ్ నిధులతో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) నిధులతో కాలేజీలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే నిధులు కూడా విడుదలయ్యాయి. కళాశాలలోని 65 అంకణాల్లో కొత్త భవనం, ఉమెన్స్ వెయిటింగ్ హాల్, ఇన్‌సైడ్‌లో ఓపెన్ జిమ్ తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో పనులు ప్రారంభం నాడు – నేడు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్‌కు పంపించాం. ఎన్ఐఆర్ఎఫ్ నిధులతో కూడా కొత్త భవనం నిర్మించనున్నాం. విద్యార్థినులకు అన్ని వసతులను కల్పించనున్నాం. ప్రధానంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి కళాశాలలోని అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందిస్తాం. – గిరి, ప్రిన్సిపల్, డీకేడబ్ల్యూ కళాశాల ఇంకా ఏం చేస్తారంటే.. కళాశాలలో రూ.32 లక్షలతో డిజిటల్ ఎక్విప్మెంట్స్ను ఏర్పాటు చేయనున్నారు. సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా సెంబ్‌కార్ప్æ ద్వారా రూ.15 లక్షలతో పనులు చేపట్టనున్నారు. కళాశాలలో క్లీనింగ్‌తోపాటు మూడు వేల మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే కొన్ని మొక్కలు నాటారు. వాటికి నీరందించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొక్కల మెయింటినెన్స్‌ను రెండేళ్లపాటు సెంబ్‌కార్ప్ నిర్వాహకులు చూసుకోనున్నారు. కొన్ని మొక్కల పెంపకం బాధ్యతను విద్యార్థినులకు అప్పగించారు. -
మైమరిపించే మైపాడు
ఎటు చూసినా పచ్చని పొలాలు.. పొడవాటి కొబ్బరి చెట్లు.. అరటి తోటలు.. ఇంకొంచెం ముందుకెళ్తే విశాలమైన బీచ్.. ఎగిసిఎగిసి పడే అలల సవ్వడులు.. మధ్యలో ఆధ్యాత్మికత పరిఢవిల్లే జ్యోతిర్లింగాల క్షేత్రం. అటు ఆహ్లాదం.. ఇటు ఆధ్యాత్మికం ఉట్టిపడే మైపాడు. అలసిన మనస్సులను మైమరిపిస్తోంది.. సేద తీరుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు నేటి తరం ప్రభాస్ వంటి అగ్ర హీరోల సినిమాలు ఇక్కడ నిర్మించారు. చిన్నచిన్న సినిమాల అవుట్ డోర్ షూటింగ్‌లకు ఇక్కడి ప్రకృతి రా..రమ్మని పిలుస్తోంది. ఇందుకూరుపేట:(పొట్టి శ్రీరాములు నెల్లూరు) జిల్లాలోని ఇందుకూరుపేట మండలం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా నిలుస్తోంది. మైపాడు సముద్ర తీరం ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతకు కొదవ లేదు. క్షణం తీరిక లేకుండా ఉరుకుల పరుగుల జీవితాలు గడిపే ఈ ఆధునిక కాలంలో కాసింత సమయం దొరికితే ఆహ్లాదంగా గడిపేందుకు గుర్తుచ్చేది ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు. కోనసీమను తలపించే ప్రకృతి అందాలు, ఎగిసి ఎగిసి పడే అలల ఆహ్లాదం, ఆధ్యాత్మికత పరవశించే దివ్యక్షేత్రం పర్యాటకులను అలరిస్తోంది.. మళ్లీ మళ్లీ రా..రమ్మని ఆహ్వానిస్తోంది. జిల్లా వాసులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా గడిపి సేద తీరుతారు. నెల్లూరుకు 22 కి.మీ. దూరంలో మైపాడు సముద్ర తీరం ఉంది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుంచి ప్రతి గంటకు మైపాడు వరకు, ప్రతి గంటకు బీచ్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. నెల్లూరు రూరల్ మండలం దాటుకొని ఇందుకూరుపేట మండలంలోకి అడుగు పెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. సరిహద్దు గ్రామం డేవిస్‌పేట రాగానే దశాబ్దాల కాలం నాటి మహావృక్షాలు దర్శనమిస్తాయి. అక్కడ నుంచి ముందుకు సాగితే.. జగదేవిపేట, రావూరు, మొత్తలు, నరసాపురం గ్రామాల్లో రోడ్డు వెంబడి పొడవాటి కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, అరటి తోటలు చల్లని గాలులు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. మైపాడు బీచ్‌కు చేరుకుంటే.. ఎగిసి పడుతున్న సముద్రపు అలలు, ఇసుక తిన్నెలను చూడగానే తారతామ్యలు మరిచి సంతోషంగా గడపాల్సిందే. ముఖ్యంగా యువత చిన్న పిల్లలు, ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు అయిష్టతే చూపుతారు. ప్రేమికులకు సైతం ఈ సాగర తీరం స్వర్గధామంగా నిలుస్తోంది. జ్యోతిర్లింగాల క్షేత్రం మైపాడు తీరంలో ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి తీరంలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలయం దేశాన్ని చుట్టి వచ్చిన అనుభూతిని కలిగిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయంభుగా కొలువైన జ్యోతిర్లింగాలను దర్శించిన ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులు పొందుతారు. ఇక్కడ అమర్నాథ్ (జమ్మూ–కశ్మీర్) సోమేశ్వరుడు (గుజరాత్), మల్లికార్జునస్వామి (ఆంధ్రప్రదేశ్), మహా కాళేశ్వరుడు (మధ్యప్రదేశ్), కేధారేశ్వరుడు(ఉత్తరాంచల్), ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్) భీమేశ్వరుడు (పూణే, మహారాష్ట్ర), కాశీవిశ్వేశ్వరుడు(వారణాశి, ఉత్తరప్రదేశ్), త్రయంబకేశ్వరుడు (నాసిక్, మహారాష్ట్ర), వైద్యనాథేశ్వరుడు (దేవనగర్, జార్ఖండ్), నాగేశ్వరుడు (ద్వారకా, గుజరాత్), రామలింగేశ్వరుడు (రామేశ్వరం, తమిళనాడు)తో పాటు శ్రీఘ్రషోశ్వరుడు (ఔరంగాబాద్, మహారాష్ట్ర) సుబ్రహ్మణ్యం స్వామి (తమిళనాడు), గోకర్ణ గణేష్ (కర్ణాటక), పళని సుబ్రహ్మణ్యం స్వామి వళ్లీ దేవసేన సమేత సూర్య, చంద్ర పార్వతీ దుర్గాదేవిలు ఈ సాగర తీరంలోని ఒకే ఆలయంలో కొలువైన ఏకైక ఆధ్మాత్మిక క్షేత్రమిది. స్వామివార్ల మూలవిరాట్‌కు ఎదురుగా భారీ రాతి నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆలయ ఆవరణలో ఉన్న 25 అడుగుల కైలాసనాథుడు, 24 అడుగుల పొడవు పార్వతీదేవి భక్తులను ఆలయం వెలుపల నుంచి భక్తులను కటాక్షిస్తున్నారు. పక్కనే ఉన్న భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఆధ్యాత్మికతకు కొదువలేదు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎత్తైన మహా శివలింగం తన్మయత్వం చెందేలా చేస్తోంది. మైపాడు సముద్ర తీరం అటు ఆహ్లాదాన్ని, ఇటు ఆధ్మాత్మికతో పరవశింప చేస్తోంది. షూటింగ్‌లకు అనువు జగదేవిపేట, ఇందుకూరుపేట, కొత్తూరు, డేవిస్‌పేట, మొత్తలు గ్రామాల్లో తోటలు, చెట్లు పచ్చగా ఆహ్లాదకంగా ఉంటాయి. మైపాడు బీచ్ ఆనంద పరవశం చేస్తోంది. దీంతో ఫొటోలు తీసేందుకు అనువుగా ఉంటుంది. ఫొటో షూట్ కోసం ఎంతో మంది ఇక్కడి వస్తుంటారు. షార్ట్ ఫిల్మ్‌లు కూడా ఇక్కడ షూట్ చేస్తున్నారు. – బోయళ్ల శివప్రవీణ్‌కుమార్, నెల్లూరు, పీజే ఫొటోగ్రఫీ బీచ్‌లో గడపడమంటే ఇష్టం ఎప్పుడు సమయం దొరికిన స్నేహితులతో కలిసి మైపాడు బీచ్‌కు వస్తుంటాం. ఈ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ సేద తీరేందుకు బాగా ఇçష్టపడుతాం. జిల్లా కేంద్రానికి దగ్గరి దూరంలో ఉండడంతో పాటు బీచ్‌కు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. – సీహెచ్ వెంకటేష్, నెల్లూరు ప్రకృతి బాగుంటుంది ఇందుకూరుపేట మండలంలో ప్రకృతి బాగుంటుంది. పచ్చని పొలాలు, చెట్లు, సాగర తీరం ఇక్కడ ఉన్నాయి. దీంతో కొత్తగా పెళ్లయిన వారి ఫొట్ అల్బ్మ్ తయారీ కోసం ఈ ప్రాంంతం బ్యాక్‌గ్రౌండ్‌ను ఫొటోలు, వీడియోలు తీస్తోంటాం. నూతన వధూవరులు, కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఇష్టపడుతూ ఉంటారు. – గోడ విష్ణు, ఫొటో గ్రాఫర్, నెల్లూరు చిత్రసీమకు షూటింగ్ స్పాట్ మైమరిపించే ప్రకృతి అందాలకు నెలవైన మండలంలోని పరిసర ప్రాంతాలు చిత్రసీమకు షూటింగ్ స్పాట్‌గా మారింది. అలనాటి తర కథనాయకుల నుంచి నేటి యువతరం సినీ హీరోల సినిమాలతో పాటు చిన్నచిన్న సినిమాలు, షార్ట్ ఫీల్మ్ షూటింగ్స్, ఫొటో షూట్లకు ఈ ప్రదేశం చిరునామాగా మారింది. పెళ్లి అల్బ్మ్ల కోసం కొత్త జంటలు, కుటుంబ సభ్యులు ఇక్కడి బ్యాక్‌గ్రౌండ్ అందాలతో ఫొటోలు తీసుకుని మధుర జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటున్నారు. సీనియర్ ఎన్టీయార్, చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు ఇక్కడే షూటింగ్ చేయడం విశేషం. విడిది.. విందులకు రిసార్ట్స్ మైపాడు బీచ్ ప్రాంతం పర్యాటకుల ఆనందాలకు నెలవుగా ఉంటుంది. విడిది.. విందులకు అనువుగా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. పర్యాటకశాఖ (ఏపీ టూరిజం) బీచ్ వద్ద హరితా రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. తీరం సమీపాన తాటిచెట్ల మధ్యలో ఉన్న ఈ రిసార్ట్స్‌లో విడిదితో పాటు, రెస్టారెంట్‌ను అందుబాటులో ఉంది. పర్యాటకులు ఇక్కడ పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, విందులు, వినోదాలు చేసుకొని కాలాన్ని మైమరిచి పోతుంటారు. ఇక్కడి గదులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొనే సదుపాయం ఏపీ టూరిజం కల్పించింది. -
ఉదయగిరి.. చరిత్రలో ప్రత్యేక స్థానం
ఉదయగిరి.. చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల గిరులను పోలిన ఎత్తైన పర్వతశ్రేణులు, ప్రకృతి సోయగాలు, జలపాతాలతో కనువిందు చేస్తున్న ఉదయగిరి దుర్గం చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబుల పాలనలో వెలుగు వెలిగింది. ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తాజాగా యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడంతో జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. సాక్షి, నెల్లూరు/ఉదయగిరి: జిల్లాలోని ఉదయగిరి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. యుద్ధ నౌకకు ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్‌ట్టŠజ్ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు ముమ్మరంగా చేశారు. ఇంకా ఇక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆ కాలంలో.. క్రీ.శ 10 నుంచి 19వ శతాబ్దం వరకు ఇక్కడ ఎంతోమంది రాజుల పాలన సాగింది. ఇందులో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరి దుర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అందమైన కట్టడాలు, విశాలమైన తటాకాలు ఈయన కాలంలోనే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు కొన్నినెలలపాటు ఉదయగిరి కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ అలనాటి రాజులు, నవాబుల పాలనకు గుర్తుగా ఉదయగిరి కొండపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోట బురుజులు దర్శనమిస్తాయి. పేరిలా వచ్చింది సూర్యకిరణాలు ఉదయగిరి కొండ శిఖరంపై ప్రసరించి ప్రకాశవంతంగా దర్శనమిస్తుండడంతో ‘ఉదయ’గిరి పర్వతశ్రేణికి ఉదయగిరిగా పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. సముద్రమట్టానికి 3,079 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. తిరుమల గిరులను ఉదయగిరి పర్వతశ్రేణి పోలి ఉంటుంది. ఇందులో 3,600కి పైగా ఔషధ మొక్కలున్నట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో గుర్తించారు. ఉదయగిరి దుర్గం కోటలు, ఎత్తైన ప్రాకారాలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే జలపాతాలతో నిండి ఉంటుంది. ఓ కోటపైన పర్షియా సంప్రదాయ రీతిలో నిర్మించిన మసీదు ఉంది. దేశంతో ప్రసిద్ధి చెందిన చెక్క నగిషీ బొమ్మల తయారీకి ఉపయోగించే దేవదారు చెక్క ఇక్కడ లభ్యమవుతుంది. పర్యాటకాభివృద్ధి కోసం.. ఉదయగిరిని పర్యాటకరంగ పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కలెక్టర్ చక్రధర్‌బాబు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయించారు. హార్సిలీహిల్స్, ఊటీ తరహా వాతావరణం ఉదయగిరి దుర్గంపై ఉంటుంది. అక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖకు పంపారు. అభివృద్ధి చెందుతుంది ఉదయగిరి సమీపంలో బంగారు, రాగి నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయన్న జాతీయ సర్వే నిపుణుల ప్రకటనలతో ఉదయగిరికి ఖ్యాతి లభించనుంది. ఎక్కడో మారుమూల వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలుగుచూడడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశాభావం కలుగుతోంది. మొత్తంగా రెండు, మూడురోజల వ్యవధిలో ఉదయగిరికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతుందనే కాంక్ష ఈ ప్రాంతవాసుల్లో బలంగా ఉంది. – ఎస్కే ఎండీ ఖాజా, ఉపాధ్యాయుడు ఉదయగిరికి జాతీయ కీర్తి ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఉదయగిరికి జాతీయ గుర్తింపు లభించడం సంతోషం. జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరి దుర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దీంతో వెనుకబడి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ఒక గుర్తింపు తగిన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుంది. రక్షణ రంగంలో కీలక యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడం చారిత్రాత్మకం. – గాజుల ఫారుఖ్ అలీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడు ఖనిజ నిక్షేపాల కోసం.. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ జరిగింది. ఈక్రమంలో ఆ కొండపై రాగి, బంగారం, తెల్లరాయి ఖనిజ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమికంగా గుర్తించింది.. ప్రస్తుతం ఆ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అగ్రీ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్మారకార్ధంగా దీనిని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు కూడా మక్కువ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుమారు రూ.250 కోట్ల విలువైన భూములు, ఆస్తులను అప్పగించారు. ఇది ఏర్పాటైతే విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సులు చదివేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యుద్ధ నౌకకు పేరు ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముంబైలో ప్రారంభించారు. పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టే యుద్ధ నౌకకు ఏపీలోని నెల్లూరు జిల్లా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడంతో ఈ ప్రాంత ఖ్యాతి మరింత చరిత్రపుటల్లోకెక్కింది. దీనిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ప్రముఖులు రాజ్‌నాథ్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
అన్నదాతలకు ఆత్మస్థైర్యమై..
ఆత్మకూరు (చేజర్ల): వ్యవసాయ రంగంలో మహిళలు గురువుల పాత్ర పోషిస్తున్నారు. దాదాపు అన్ని రకాల పంటలకు సంబంధించి భూమిని సాగుకు సిద్ధం చేయడం దగ్గరి నుంచి.. నూర్పిడి, విత్తనాల నిల్వ వరకు వ్యవసాయ క్షేత్ర సహాయకులుగా, అధికారులుగా, శాస్త్రవేత్తలుగా బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అండగా ఉంటూ విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. పంటల్లో నూతన ప్రయోగాలు చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంపై ఆసక్తితో అభ్యసించిన చదువు పది మందికి ఉపయోగపడాలనే ఆశయంతో ఈ రంగాన్ని ఎంచుకుని పలువురు క్షేత్ర సహాయకుల నుంచి శాస్త్రవేత్తల వరకు రాణిస్తున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం 10,441 చదరపు కి.మీ. విస్తీర్ణంతో రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా అవతరించిన సింహపురి.. అన్నపూర్ణగా విరాజిల్లుతోంది. జిల్లాలోని 38 మండలాల్లో దాదాపు 15 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వరితో పాటు ఉద్యానవన పంటలు పండిస్తున్నారు. ఆయా శాఖల్లో అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు 291 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో అత్యధికులది వ్యవసాయ కుటుంబ నేపథ్యం కాగా, మరి కొందరు ఉద్యోగ, వ్యాపార నేపథ్య కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. జిల్లాలోని 38 మండలాల్లో (కొత్తగా కలిసిన కందుకూరుతో కలిపి) వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో 50 శాతానికి పైగా మహిళలే పని చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ (ఏఆర్సీ), కిసాన్ వికాస్ కేంద్రం (కేవీకే)ల్లోనూ మహిళలే అధికంగా ఉన్నారు. సేద్యంలో.. సేవల్లో సంపూర్ణం వ్యవసాయశాఖలో బహుముఖ పాత్రలు పోషిస్తున్న మహిళలు సేవల్లో సంపూర్ణతగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పారదర్శకంగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులకే చేరేలా బాధ్యత వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో వాటి అమలు కోసం నిత్యం రైతుల మధ్యనే వ్యవసాయాధికారిణులు సిబ్బంది ఉండాల్సిన పరిస్థితి. అను నిత్యం రైతులతో మమేకమై వారి అభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ ఉత్తమ అవార్డులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. వీరు పురుషులకు దీటుగా తమ విధులు నిర్వహిస్తూ పలువురికి వ్యవసాయంపై ఆసక్తి కలిగేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రైతులు ఆనందంగా ఉండాలి నా తండ్రి రాజశేఖర్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. పేద కుటుంబం కావడంతో మేనమామ పీర్ల సుబ్బయ్య నన్ను చదివించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. దీంతో నాకు వ్యవసాయంపై ఇష్టం ఏర్పడింది. ఎంతో కష్టపడే రైతులు ఆనందంగా ఉండాలంటే వారికి ప్రభుత్వ సహకారం, అధికారుల అండదండలు తప్పనిసరి. రైతులకు సేవలు అందించే ఈ ఉద్యోగంలో చేరేందుకు నాకు స్ఫూర్తిగా నిలిచింది. యనమదల ఆర్బీకేలో రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులందరికీ అందేలా చేస్తున్నా. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పొలాలకే వెళ్లి పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాను. – వీ హేమలత, ఏఏఓ, యనమదల రైతుల అభ్యున్నతికి కృషి మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు వెంకటరమణయ్య, వెంకటసుబ్బమ్మ. కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం మా స్వగ్రామం. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే వ్యవసాయశాఖలో ఉద్యోగం సంపాదించి వారి అభ్యున్నతికి నా వంతు కృషి చేద్దామని ఆసక్తితో ఈ విధుల్లో చేరా. సొంత మండలంలోనే ఆరేళ్లు ఏఓగా పని చేసి నా శక్తి మేర రైతులకు సహకరించాను. ప్రస్తుతం ఏడీగా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లో రైతుల అభివృద్ధి కోసం ఏఓలను, ఏఏఓలను సమాయత్తం చేస్తూ నిత్యం వారికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాను. మహిమలూరులో రైతులను ప్రోత్సహించి గతంలో కంటే ఎక్కువ ధాన్యం దిగుబడులు సాధించేలా చేయడం నాకు సంతోషం కలిగించిన విషయం. నా సేవలను గుర్తించి ఉత్తమ వ్యవసాయాధికారిణిగా జిల్లా స్థాయిలో అవార్డు సాధించడం మరువలేని విషయం. – వట్టూరు దేవసేన, ఏడీ, ఆత్మకూరు నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యం మా తల్లిదండ్రులు పెద్ది పోశయ్య, కొమరమ్మలతో చిన్న వయస్సు నుంచే తోటల్లో తిరగడం నాకు అలవాటు. దీంతో వ్యవసాయంపై ఇష్టం ఏర్పడింది. జిల్లాలోని కొన్ని భూముల్లో నీటి లభ్యత తక్కువగా ఉండడం, ధాన్యం తదితర పంటలు ఆ భూముల్లో సాగు చేసే కంటే ఉద్యానవన పంటల సాగుకు ఆ భూములు అనుకూలంగా ఉండడంతో ఆ దిశగా గ్రామాల్లో రైతులను ప్రోత్సహించి నాణ్యమైన ఉత్పత్తులు సాధించే లక్ష్యంతో కృషి చేస్తున్నాను. జిల్లాలో సుమారు 38 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. రైతలకు పెరిగిన సాంకేతిక గురించి వివరిస్తూ ఉద్యానవన పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి ఉపయోగపడేలా చేస్తున్నా. నా పరిధిలోని మూడు మండలాల్లో నిమ్మ, మామిడి, సపోటా, జామ, బొప్పాయి తోటలు సాగవుతున్నాయి. ఉద్యానవన సాగు కోసం రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను వారికి అందేలా చేయడంలో సహకరిస్తున్నాను. – ఉద్యానవనశాఖ అధికారిణి, పెద్ది లక్ష్మి, చేజర్ల ఇష్టంతో చేస్తున్నా మా తాతయ్య దగ్గర పెరుగుతూ ఏఎస్‌పేట మండలం గుంపర్లపాడులో ఆయనతో కలిసి పొలాలకు వెళ్తూ ఉండడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగం సైతం రైతులకు అందుబాటులో ఉంటూ ఇష్టంతోనే పని చేస్తున్నాను. నా ఆర్బీకే పరిధిలో రైతులకు అందుబాటులో ఉంటూ సబ్సిడీ పథకాలతో వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు వారికి అందేలా చూస్తున్నా. గతంలో బట్టేపాడు ఆర్బీకే కేంద్రంలో పని చేస్తున్న క్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఏఏఓగా అవార్డు పొందాను. దీంతో విధులపై మరింత బాధ్యత పెరిగింది. మా తండ్రి మల్లెం కొండయ్య, వసంతమ్మ ఆత్మకూరులో చిన్న నాటి వ్యాపారం చేస్తున్నారు. నేను చేజర్ల మండలం మడపల్లి ఆర్బీకేలో విధులు నిర్వహిస్తున్నాను. – ఏ మమత, ఏఏఓ, మడపల్లి -
దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్
నెల్లూరు (క్రైమ్): మహిళల రక్షణకు రూపొందించిన దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో అన్ని పోలీస్స్టేషన్లలో పరిధిలో బుధవారం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసు లు బృందాలుగా ఏర్పడి అంగన్వాడీ, ఆశ వర్క ర్లు, వలంటీర్ల సహకారంతో మహిళలు, యువతులు, విద్యార్థినులకు యాప్‌పై విస్తృత అవగాహన కల్పించారు. గంటల వ్యవధిలోనే లక్ష మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్న ప్రముఖులు, మహిళలు, యువత, ప్రజలకు దిశ యాప్ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. అందులో భాగంగా దిశ చట్టం, దిశ మొబైల్ యాప్‌ను రూపొందించిందన్నారు. దేశంలోని అన్నీ అత్యవసర యాప్‌ల్లో కెల్లా దిశ యాప్ అత్యున్నతమైందన్నారు. దిశ యాప్ ఉంటే పోలీసులు మీ వెన్నంటే ఉనట్లేన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ఎవరికి ఏ సమయంలో ఆపద వస్తుందో తెలియదని, నాకేం కాదని అనుకోవడం సరికాదన్నారు. ప్రతి మహిళ, యువతి తమ ఫోన్లలో యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆపద సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, ఫోనును నాలుగైదుసార్లు ఊపినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందని, సిబ్బంది అప్రమత్తమై నిమిషాల్లోనే చేరుకుని రక్షణ చర్యలు చేపడుతారన్నారు. యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి మహిళ ఆపద సమయంలో దానిని ఉపయోగించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. దిశ యాప్ విశిష్టతను వివరించిన విద్యార్థినులకు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. స్వర్ణవేదికలో మెగా డ్రైవ్‌లో ఎస్పీ పాల్గొని మహిళలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ డి. హిమవతి, ఏఎస్పీ క్రైమ్స్ కె.చౌడేశ్వరి, ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి పాల్గొన్నారు. నగరంలో.. నెల్లూరులోని ఆరు పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్, సీసీఎస్ పోలీసుస్టేషన్ల పరిధిలో మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ జరిగింది. నగర ఇన్స్పెక్టర్లు వీరంద్రబాబు, టీవీ సుబ్బారావు, అన్వర్‌బాషా, దశరథరామారావు, కె. నరసింహరావు, కె, రామకృష్ణ, సౌత్, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు జి. రామారావు, రాములునాయక్ తమ స్టేషన్ల పరిధిలో అవగాహన, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. -
భారీ పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత
పొదలకూరు: భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనిస్తూ స్థానికంగా నిరుద్యోగులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ప్రభగిరిపట్నంలో ఉన్న కిసాన్ క్రాఫ్ట్ వ్యవసాయ పనిముట్ల తయారీ పరిశ్రమను మంత్రి ఆదివారం కలెక్టర్ చక్రధర్‌బాబుతో కలిసి సందర్శించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న వ్యవసాయ పనిముట్ల యూనిట్‌ను మంత్రి, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి హోదాలో కాకాణి ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిసాన్ క్రాఫ్ట్ ఎండీ ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించాలని తన వద్దకు వచ్చిన వెంటనే అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందించామన్నారు. ముందుగా వారితో నైపుణ్యతతో పని లేకుండా స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధన పెట్టామన్నారు. తన నిబంధనకు ఒప్పుకుని నిజాయతీగా యాజమాన్యం ఉద్యోగావకాశాలు కల్పించిందని తెలిపారు. మంచి కంపెనీ ఈ ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందని, భవిష్యత్‌లో మరో 300 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. త్వరలో రెండో యూనిట్‌ను ప్రారంభిస్తామని యాజమాన్యం చెబుతుందన్నారు. సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేందుకు కలెక్టర్ చక్రధర్‌బాబు చేసిన కృషిని మరువలేమన్నారు. మంత్రి కృషి వల్లే పరిశ్రమ పీజీపట్నం పంచాయతీలో 46 ఎకరాల్లో రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించిన కిసాన్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కృషి వల్లనే స్థాపించారని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు అన్నారు. ఈ పరిశ్రమలో 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించడం మంచి పరిణామన్నారు. జిల్లాలో మరో 18 భారీ పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ ఉత్తర్వులు నిరుద్యోగ యువకులకు ఉపయోగపడుతుందన్నారు. ఫ్యాక్టరీ ఎండీ రవీంద్రఅగర్వాల్‌ను కలెక్టర్ అభినందించారు. కిసాన్‌క్రాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కిసాన్‌క్రాఫ్ట్ ఎండీ రవీంద్ర అగర్వాల్ కంపెనీ పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ అంకిత్, సీఎఫ్ఓ అజయ్‌కుమార్ చలసాని, జీఎం కేఎల్ రావు, ఎంపీడీఓ పీ.సుజాత, తహసీల్దార్ వి.సుధీర్ పాల్గొన్నారు. -
ఖాకీ వనం.. న్యాయాలయంగా మార్చిన పోలీస్ బాస్
మలి వయస్సులో బిడ్డలు ఆదరించలేదని.. జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్తే హింసిస్తున్నాడని.. భర్త చనిపోతే మెట్టింటి వారు బయటకు నెట్టేశారని.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. బరువెక్కిన గుండెలతో న్యాయం కోసం పోలీస్ స్పందనకు వచ్చే బాధితులకు జిల్లా పోలీస్ బాస్ బాసటగా నిలుస్తున్నారు. ఖాకీ వనాన్ని.. న్యాయాలయంగా మార్చారు. కుటుంబ సభ్యుల మధ్య భవబంధాలను, ఆప్యాయతా అనురాగాలను, కలిసి జీవించిన మధుర క్షణాలను గుర్తు చేస్తూ కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువస్తున్నారు. ఇతర ఫిర్యాదులపై పరిష్కరించ తగినవి అయితే అక్కడికక్కడే చర్యలు చేపడుతున్నారు. వ్యయప్రయాసలు పడి వచ్చే బాధితులకు ఆకలి తీరుస్తూ ఆదరిస్తూ.. పోలీసుల్లో కాఠిన్యమే కాదు.. కారుణ్యం ఉందని ఆర్తుల పాలిట ఆప్తుడయ్యాడు. సాక్షి, నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖను కారుణ్య వనంగా మార్చేశారు. ఇటు ప్రజల సమస్యలతో పాటు సిబ్బంది సమస్యలు, సంక్షేమంపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమ స్వరూపాన్ని పోలీస్ బాస్ మార్చేశారు. ఎంతో వేదనతో.. కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకుని న్యాయం కోసం వచ్చే బాధితులకు బాసటగా మార్చేశారు. కుటుంబ వివాదాలను మానవీయ కోణంలో ఆలోచించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి న్యాయం జరిగేలా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మాత్రం దాదాపు 200 పైగా పరిష్కరిస్తుంచారు. ఆర్థిక నేరాలు, వేధింపులు సైబర్ నేరాలుపై మాత్రం ఎఫ్ఐఆర్లు నమోదు చేయిస్తున్నారు. ఈ తరహా 375 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందనలో ఇలాంటి వందల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు 2,811 వినతులు రాగా అందులో 90 మాత్రమే పెండింగ్‌లో ఉన్నవి. మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించారు. కన్నీళ్లు తుడిచి.. ఆకలి తీర్చి.. న్యాయం చేసి.. మానసికంగా వేదనకు గురై న్యాయం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎస్పీ కార్యాలయానికి వచ్చే బాధితులకు పోలీస్ బాస్ విజయారావు ముందు వారి కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆ తర్వాత ఆకలి తీరుస్తున్నారు. అప్పుడే వారి కష్టాన్ని తీర్చి న్యాయం చేసి పంపిస్తున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు వారి సహాయకులకు మధ్యాహ్నం వేళ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏ పోలీస్ బాస్ ఇలా చేయని విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరూ ఆకలితో వెళ్లకూడదని తన సొంత ఖర్చుతోనే వారికి భోజనం పెట్టేలా ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా వచ్చిన కొందరు బాధితులకు చేతిలో డబ్బులేక మధ్యాహ్నం సమయంలో ఆకలితోనే ఉండి వెళ్లిన పలు ఘటనలు ఎస్పీ దృష్టికి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ బాధితులకు అందించారు. సిబ్బంది సంక్షేమంపై ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ఎస్పీ విజయారావు, తమ శాఖలోని ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించారు. సొంత శాఖలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల్లో ఆత్మçస్థైర్యం నింపేందుకు సత్వర చర్యలు చేపట్టారు. పోస్టింగ్‌లు లేక వీర్ఆలో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అంతే కాదు ప్రతి శుక్రవారం సిబ్బంది కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌డే నిర్వహించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వారికి న్యాయం చేస్తున్నారు. వింజమూరుకు చెందిన వై.వెంకటేశ్వర్లు (74)కు ముగ్గురు కుమారులు. బిడ్డల భవిష్యత్ కోసం ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో శాస్త్రవేత్త. రెండో కుమారుడు కూడా పీహెచ్డీ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు బీటెక్ పూర్తిచేసి విదేశాల్లో స్థిరపడ్డాడు. వారి బంగారు భవిష్యత్ కోసం ఆయన అష్టకష్టాలు పడి విద్యావంతులుగా తీర్చిదిద్ది, వివాహాలు చేశాడు. అందరూ స్థిరపడ్డారు. కానీ వారికి తండ్రి భారమయ్యాడు. ఆదరించమని వెళ్తే∙హింసించి పంపారు. బతకడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో న్యాయం కోసం స్పందన మెట్లు ఎక్కాడు. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆయన న్యాయం జరిగేలా చేశారు. నెల్లూరునగరంలోకి ఖుద్దూస్‌నగర్‌కు చెందిన ఎస్కే సబనా, రవితేజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 7 ఏళ్లు, 4 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. తొలుత అన్యోన్యంగా సాగిన ఆ కుటుంబంలో తర్వాత కలతలు రేగాయి. భర్త ఆమెను వేధించడం ప్రారంభించాడు. భరించలేని ఆమె స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ విజయారావు వెంటనే దిశ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్ చేసి ఆమెకు న్యాయం చేయమని ఆదేశించారు. దిశ స్టేషన్లో వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం వారి కాపురం సజావుగా సాగుతుంది. కొండాపురం మండలానికి చెందిన వెంకటరమణమ్మ (21) భర్త చనిపోయాడు. ఆదరించాల్సిన ఆమె మెట్టింటి వారు నిర్దాక్షిణ్యంగా బయటకు గెట్టేశారు. భర్త ఆస్తిలో కూడా ఏమీ ఇవ్వమని తెగేసి చెప్పి పుట్టింటికి పంపారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె స్పందనలో ఎస్పీ విజయారావు ఎదుట తన ఆవేదన వెలిబుచ్చుకుంది. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆమెకు న్యాయం జరిగేలా చేశారు. న్యాయం జరిగేలా చేయడం నా బాధ్యత ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి నా దగ్గరకు వస్తున్నా రు. వారి సమస్యలు విని సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ న్యాయం జరగలేదంటేనే నా వద్దకు రావాలి. జిల్లాలో మా పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేస్తుంది. ఎవరైనా నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు. ప్రతి సోమవారం జిల్లా కార్యాలయానికి వచ్చే బాధితులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. – విజయారావు, ఎస్పీ, నెల్లూరు -
ఆర్టీసీ బస్సు బోల్తా.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని మనుబోలు సమీపంలోని కోల్‌కత-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తాపడింది. ఈప్రమాదంలో కరీమా అనే వృద్ధురాలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు, గూడూరులోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా బస్సు ప్రమాద స్థలంలోనే వెనకే వచ్చిన ఓ లారీ డ్రైవర్ అయోమయానికి గురయ్యాడు. సడన్ బ్రేకులు వేయడంతో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. అయితే, డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాడు. చదవండి👉🏾 పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి -
చెక్కుచెదరని సౌధం
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కలలకు ప్రతి రూపం. పట్టణాల నుంచి పల్లెల వరకు అభివృద్ధి వేగవంతం అయింది. ఇళ్ల మధ్య సీసీ రోడ్లు ఎత్తు పెరగడంతో పూర్వం రోజుల్లో ఎంతో అపురూపంగా నిర్మించుకున్న ఇల్లు లోతట్టుగా మారింది. రూ.లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని వాస్తు, ఇతర కారణాలతో కొన్ని పరిస్థితుల్లో ఆ ఇంటిని కూల్చేసి పునర్నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంటికి ఎలాంటి నష్టం జరగకుండా లిఫ్టింగ్, షిఫ్టింగ్ జపాన్ టెక్నాలజీతో ఎన్నంతస్తుల భవనాలనైనా సునాయాసంగా అమాంతంగా ఎత్తేస్తున్నారు. ఈ టెక్నాలజీతో భవన యజమానులకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. పొదలకూరు: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు జనావాసాలు పెరుగుతున్నాయి. అందుకునుగుణంగా రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ రహదారులు ఎత్తుగా మారడంతో కొన్నేళ్ల క్రితం ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న కలల సౌదాలు లోతట్టులోకి మారిపోతున్నాయి. వర్షాకాలంలో ముంపు సమస్యలు ఒక ఎత్తైతే.. వాస్తుకు ఇది విరుద్ధంగా మారి ఆ ఇంటి యజమానులు కష్ట, నష్టాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిణామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతతరం తీపి జ్ఞాపకాలతో ఉన్న ఇంటిని కూల్చేయాలంటే కొందరి మనస్సు అంగీకరించదు. మరి కొందరు తాత తండ్రులు నిర్మించిన ఇంటిని పదిలంగా చూసుకుంటారు. ప్రతి ఇటుక పెద్దల కష్టార్జితంతో పెట్టినట్టు భావించి పాత ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఉన్న ఇంటిని ధ్వంసం చేయాల్సి వస్తే తల్లడిల్లిపోతారు. మూడు అడుగులు ఎత్తుకు.. పట్టణంలోని తొగటవీధిలో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన నర్ల చిన్నపరెడ్డి ఇంటిని లిఫ్టింగ్ టెక్నాలజీతో మూడు అడుగుల ఎత్తు లేపుతున్నారు. బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ మొత్తం జాకీల సహాయంతోనే ఉంటుంది. లిఫ్టింగ్‌కు సాధార జాకీలు, షిఫ్టింగ్‌కు రన్నింగ్ జాకీలను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇంజినీర్ల పర్యవేక్షణలో శిక్షణ పొందిన బిహార్‌కు చెందిన కూలీలు చేపడుతున్నారు. నర్ల చిన్నపరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి లిఫ్టింగ్ కంపెనీ వివరాలు తెలుసుకుని 30 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటి జ్ఞాపకాలను చెక్కు చెదరకుండా రోడ్డుకు మూడు అడుగుల ఎత్తులో ఉండేలా లిఫ్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం కంపెనీకు రూ.3.80 లక్షలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ కంపెనీ ఇంజినీరు పర్యవేక్షణలో పదిహేను రోజులుగా పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 1.5 అడుగుల మేర భవనాన్ని ఎత్తు లేపారు. మరో 1.5 అడుగుల ఎత్తు లేపాల్సి ఉందని వెల్లడించారు. టెక్నాలజీ సాయం.. భవనం పదిలం లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ (భవనం ఎత్తు లేవపడం, పక్కకు జరపడం) టెక్నాలజీ ఇప్పుడు వారి కష్టాలను తొలగిస్తోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో లిఫ్టింగ్ టెక్నాలజీ కొత్తమీ కాకున్నా గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి రావడం విశేషం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంస్థ పాత ఇళ్లను చెక్కు చెదరకుండా ఇంటి యజమాని జ్ఞాపకాలను వారితోనే ఉంచే విధంగా పనిచేస్తోంది. పొదలకూరులో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆలోచనే లేని సమయంలో బిల్డింగ్ లిఫ్టింగ్ టెక్నాలజీని వినియోగించుకుని తమ పాత ఇంటిని ఎత్తు లేపుకుంటున్న వైనం పరిశీలిస్తే సాంకేతికత గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తుందని అర్థం అవుతుంది. లిఫ్టింగ్, షిఫ్టింగ్ సురక్షితం భవనాల లిఫ్టింగ్, షిఫ్టింగ్ సురక్షితమని పనులు చేయించుకుంటున్న ఇంటి యజమానులు అంటున్నారు. ఈ టెక్నాలజీతో ఇప్పటికే చాలా చోట్ల బిల్డింగ్స్‌ను పైకి లేపడం, వాస్తురీత్యా పక్కకు జరపడం చేపట్టారు. వెంకటగిరి–ఏర్పేడు మార్గమధ్యంలో మల్లాం వద్ద హైవే రోడ్డు నిర్మాణం కోసం సేకరించిన భవనాన్ని 104 అడుగులు జరిపి మరో ప్లాటులో ఏర్పాటు చేసినట్టు లిఫ్టింగ్ ఇంజినీరు వెల్లడించారు. సుమారు 14 అడుగుల వరకు టెక్నాలజీతో భవనాలను ఎత్తు లేపవచ్చునంటున్నారు. ఒంగోలు, గూడూరుల్లో చాలా ఇళ్లను ఎత్తులేపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం భవంతులు, దేవాలయాలను ఎత్తులేపడం, పక్కకు జరపడం పూర్తి చేశారు. షిఫ్టింగ్ టెక్నాలజీలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలుస్తోంది. పాత జ్ఞాపకాలు.. తక్కువ ఖర్చు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇంటి జ్ఞాపకాలు చెదరకుండా తక్కువ ఖర్చుతో భవనాన్ని లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇదే ఇంటిని కూలదోసి అదే స్థలంలో నిర్మించాలంటే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుంది. లిఫ్టింగ్ టెక్నాలజీతో ఇంటిని ఎత్తు లేపడంతో పాటు ఇతర రీ మోడలింగ్‌కు మరో రూ.10 లక్షల ఖర్చుతోనే పాత భవనాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకోవచ్చని లిఫ్టింగ్ ఇంజినీర్లు అంటున్నారు. గతేడాది శ్రీనివాసపురంలో చెన్నైకు చెందిన లిఫ్టింగ్ కంపెనీ పాత భవనాన్ని జాకీల సాయంతో ఎత్తు లేపింది. ఇంటిని కూల్చేందుకు ఇష్టం లేక మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన మా ఇల్లు రోడ్లు అభివృద్ధి చెందడంతో లోతట్టుగా మారింది. అప్పటి పరిస్థితుల్లో ఎత్తులోనే నిర్మించుకున్నా.. ఇల్లు లోతట్టుగా మారడంతో వాస్తుకు విరుద్ధంగా ఉండడంతో ఇళ్లు కూల్చి కట్టడం తప్పనిసరి. అయితే పాత ఇల్లు కూల్చేందుకు ఇష్టం లేక లిఫ్టింగ్ టెక్నాలజీతో భవనాన్ని ఎత్తు లేపుకుంటున్నాం. చాలా చోట్ల విచారించే ఈ సాహసానికి పూనుకున్నాం. ఈ ప్రాంతంలో కొత్త అయినప్పటికీ సలహాలు తీసుకుని పెద్దలను ఒప్పంచి పనులు చేయిస్తున్నాం. ఈ విధానం వల్ల చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. – నర్ల శ్రీనివాసులురెడ్డి, ఇంటి యజమాని, పొదలకూరు ఖర్చు తక్కువతో సమస్యకు పరిష్కారం భవనాన్ని చెక్కు చెదరకుండా లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ పనులు చేపడతాం. ఏ డేళ్లుగా ఈ రంగంలో ఇంజినీరుగా కొనసాగుతూ సొంతంగా కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం. కూలీలకు సైతం శిక్షణ ఇచ్చి జాగ్రత్తలు పాటిస్తూ లిఫ్టింగ్ పనులు చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరిక లేనంతగా పనులు ఉన్నాయి. జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న మెటీరియల్, కూలీల ఖర్చులతో కొత్తగా భవనం నిర్మించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఈ టెక్నాలజీలతో చాలా తక్కువలో ఇంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. – ఎస్.అనిల్‌కుమార్, ఇంజినీరు -
కృష్ణపట్నంలో మినీ హార్బర్
ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే కడలి పుత్రులు ప్రాణాలను పణంగా పెట్టి ఎగసి పడే అలలను దాటుకుని సముద్రంలో వేట సాగిస్తేనే కడుపులు నిండుతుంది. ప్రకృతి విపత్తులు, వేట నిషేధిత కాలంలో రోజుల తరబడి వాటిని భద్రపరుచుకోవడం తలకు మించిన భారంగా మారింది. దీంతో పాటు వేట సమయంలో రోజుల తరబడి సముద్రంలో రెక్కలు ముక్కలు చేసుకుని మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చినా నిల్వ చేసుకునే పరిస్థితులు లేక దళారులకు తెగనమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఈ దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కృష్ణపట్నం తీర మండలాల మత్స్యకారులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.288 కోట్లతో జిల్లాలో జువ్వలదిన్నె వద్ద భారీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉంది. తాజాగా కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఈ దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిధిలోని ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. 14 ఏళ్ల క్రితం కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందు ఇక్కడి జెట్టీల కేంద్రంగా మత్స్యకారులు సముద్రంలో చేపలవేట చేపట్టారు. వలలకు చిక్కిన మత్స్య సంపదను ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం ద్వారా వందల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు. కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైన తర్వాత జెట్టీలు అదృశ్యమయ్యాయి. ఇక్కడి మెకనైజ్డ్ బోట్లు ఇతర రేవులకు తరలిపోయాయి. ఎక్కడికీ వెళ్లలేని మోటారు బోట్లు, నాన్ మోటారు బోట్లు మాత్రం నానా కష్టాల మధ్య సముద్రంలో వేట సాగిస్తున్నాయి. వేటాడిన తర్వాత మత్స్యసంపదను అపరిశుభ్ర వాతావరణంలో ఎండబెట్టుకుంటూ, అమ్మకాలు చేసుకునే దుస్థితి కొనసాగుతోంది. 15 ఏళ్ల క్రితమే సర్వే కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. ఉప్పు కాలువలో పడవల ద్వారా పర్యటించిన నిపుణులు హార్బర్ నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరమైనట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టును నాట్కో అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కాగా, ఆ సంస్థ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పోర్టును నాట్కో సంస్థ నుంచి నవయుగ సంస్థకు అప్పగించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఈ సంస్థ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న అంశానికి అప్పుడే బీజం పడింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే.. కృష్ణపట్నం తీరంలో ఏర్పాటు కావల్సిన ఫిషింగ్ హార్బర్ తర్వాత బోగోలు మండల పరిధిలోని జువ్వలదిన్నెకు తరలించారు. రూ.288 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. పూర్వ నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం నుంచి తడ వరకూ 169 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. సరైన వసతులు, స్టోరేజీ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతోంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలను సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారకం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ చేపడితే జిల్లాలో ప్రస్తుతం లభిస్తున్న 1.05 లక్షల టన్నులు రెట్టింపు మత్స్య సంపదను మత్స్యకారులు చేజిక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం రెట్టింపు కానుందని నిపుణులు వివరిస్తున్నారు. మరింత వెసులుబాటు కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ ఏర్పాటైతే కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, సర్వేపల్లి పరిధిలోని తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలాల మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మినీ హార్బర్ నిర్మాణంతో మత్స్యకార మహిళలకు సైతం సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు వివరిస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మినీ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉంటుంది. సముద్రతీరం వెంబడి మత్స్యకారులు అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడుతుంది. వారికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్ వంటి వసతులు చెంతకు వస్తాయి. – పామంజి నరసింహ, జిల్లా ఆక్వా సొసైటీ డైరెక్టర్ మత్స్యకారులకు ఎంతో మేలు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. అధునా«తన, బోట్లు, వలలతో వేటాడే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఉన్న గంగపుత్రులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీహరికోట శ్రీనివాసులు, మైపాడు తూర్పుపాళెం కాపు -
రాచబాటలు; రూ.322.11 కోట్లతో 84 రోడ్ల అభివృద్ధి
నెల్లూరు జిల్లాలో రహదారులు కళకళలాడుతున్నాయి. గత ప్రభుత్వ పాలనకు చిహ్నాలుగా మారిన గతుకులు, గుంతల రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. రెండేళ్లుగా తరచూ భారీ వర్షాలకు రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నిధుల కొరత, పనుల నిర్వహణ చేపట్టలేని పరిస్థితుల్లో మరమ్మతులు, అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. రోడ్ల అభివృద్ధికి గతేడాదే నిధులు కేటాయించడంతో రాచబాటలు రూపుదిద్దుకుంటున్నాయి. నెల్లూరు (బారకాసు): జిల్లాలో రోడ్లకు మహర్దశ పట్టింది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలను కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు సైతం అభివృద్ధి బాట పట్టాయి. రోడ్ల మరమ్మతులు, బాగా దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు నిధులు కూడా మంజూరు చేయడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన రహదారులు కళకళలాడుతున్నాయి. రోడ్ల అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదేళ్లు జిల్లాలో ప్రధాన రహదారుల అభివృద్ధిని విస్మరించింది. ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేసి గొప్పగా చెప్పుకుంది. దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధికి నోచుకోని రహదారులతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రజల విన్నపాలను పట్టించుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించింది. అయితే నిధులు సమీకరించే లోగా తరచూ భారీ వర్షాలు, ఆ తర్వాత కరోనా విపత్తు కారణంగా రోడ్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలకు రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. 84 రోడ్లకు రూ.322.11 కోట్లు మంజూరు గతేడాది ఆగస్టులోనే రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నిధులు కేటాయించింది. అక్టోబరు నుంచి దాదాపు డిసెంబరు ప్రారంభం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు వరదలు వచ్చాయి. వర్షాలు, కరోనా తగ్గుముఖం పట్టడంతో పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు రోడ్లు మరమ్మతులు, బాగా దెబ్బతిన్న రోడ్ల పటిష్టత కోసం వివిధ స్కీంల కింద ప్రభుత్వం రూ.322.11 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 337 కి.మీ. మేర మొత్తం 84 రోడ్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో రోడ్లు నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కళకళలాడుతున్న రోడ్లు జిల్లాలో గతంలో పది నియోజకవర్గాలుండేవి. ఆర్‌అండ్‌బీశాఖ పరిధిలో కావలి, నెల్లూరు, గూడూరు మూడు డివిజన్లు ఉండేవి. అయితే జిల్లాల పునర్వి భజన తర్వాత నెల్లూరు, కావలి రెండు డివిజన్లు మాత్రమే ఈ శాఖ పరిధిలో ఉన్నాయి. నెల్లూరు డివిజన్ పరిధిలో 64 రోడ్ల నిర్మాణాల పనులు చేపడుతున్నారు. రూ.153.63 కోట్ల నిధులతో 363.23 కి.మీ మేర మరమ్మతులు, పునర్నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే రూ.46.44 కోట్లు ఖర్చు చేసి 65.23 కి.మీ. మేర రోడ్లు పూర్తి చేశారు. ఇందులో పొదలకూరు–రాపూరు, నెల్లూరు నగరం నుంచి ములుముడి–తాటిపర్తి, కృష్ణపట్నంపోర్టు రోడ్డు–గొలగముడి రోడ్డు, ఆత్మకూరు–సోమశిల, నెల్లూరుపాళెం–ఆత్మకూరు తదితర రోడ్ల నిర్మాణాలు పూర్తయి కళకళలాడుతున్నాయి. కావలి డివిజన్ పరిధిలో రూ.198 కోట్లతో 196 కి.మీ మేర 26 రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. కావలి–ఉదయగిరి, సీతారామపురం రోడ్డు నుంచి గంగిరెడ్డిపల్లి మీదుగా తెల్లపాడు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. చిలకపాడు, బ్రాహ్మణక్రాక, ఏపిలగుంట, కావలి పట్టణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. జూలై లోపు పూర్తి చేసేలా చర్యలు జిల్లాలో మరమ్మతులకు గురైన రోడ్లు, బాగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నాం. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. మరో మూడు నెలల్లో జూలై నెలాఖరులోపు పూర్తి స్థాయిలో నిర్మాణాలను చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం – రామాంజనేయులు, ఇన్చార్జి ఎస్ఈ, ఆర్అండ్బీ -
కొత్తకొత్తగా.. రంజాన్ కానుకగా..
రొట్టెల పండగకు వేదికగా నిలిచే బారాషహీద్ దర్గా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి ఆవరణలో ఉన్న ఈద్గా భవనం ముస్లింలకు ఎంతో ప్రీతికరం. అయితే టీడీపీ హయాంలో ఈద్గా నిర్మాణాన్ని అర్థాంతరంగా కూల్చేశారు. కొత్త నిర్మాణం చేపడుతామని మిన్నకుండి పోయారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. రంజాన్ కానుకగా ముస్లింలకు అంకితం చేయనున్నారు. సాక్షి, నెల్లూరు : నెల్లూరులో చారిత్రాత్మకమైన ప్రదేశంగా విరాజిల్లుతున్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ప్రత్యేకతలతో కూడిన ఈద్గా నిర్మాణం పూర్తయింది. రంజాన్ మాసం కానుకగా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈనెల 29న ముస్లింలకు అంకితం చేయనున్నారు. గత టీడీపీ హయాంలో ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఈద్గాను కూల్చివేసి నిర్మాణం గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి చొరవతో పూర్తి హంగులతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం చేపట్టడం ఆనందదాయకం. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేయించి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేనివిధంగా నిర్మాణం చేయించారు. ముస్లింల పట్ల ఎమ్మెల్యేకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు మేమంతా కృతజ్ఞతులై ఉంటాం. – అబూబకర్, మాజీ చైర్మన్, బారాషహీద్ రొట్టెల పండగ కమిటీ ఎంతో సంతోషంగా ఉంది ప్రత్యేక హంగులతో నిర్మించిన ఈద్గాను రంజాన్ కానుకగా మాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా ఈద్గా లేక ప్రార్థనల కోసం ఇబ్బందిపడేవారం. స్థానిక ఎమ్మెల్యే మా మనోభావాలను గౌరవిస్తూ ఈద్గా నిర్మాణంపై దృష్టిపెట్టి మాకు రంజాన్ కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది. పండగ రోజు అందరం కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటాం. – ఎస్డీ ఇలియాజ్ స్థానికుడు, నెల్లూరు వైఎస్సార్సీపీ హయాంలో.. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. అదే విధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ముస్లింల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో రూ.1.03 కోట్ల వ్యయంతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. ► గత రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ముస్లింలు కలిసి ప్రార్థనలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. కానీ ఈ ఏడాది రంజాన్ పండగ కానుకగా ఈద్గాను వారికి అంకితం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈనెల 29న వారికి అంకితం చేసేందుకు కృషి చేస్తున్నారు. ► 100 అడుగుల వెడల్పు, సుమారు 70 అడుగుల ఎత్తులో మినార్ల నిర్మాణం చేపట్టారు. వచ్చే శుక్రవారం అంకితం.. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈద్గాను స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముస్లింలకు అంకితం చేయనున్నారు. దాదాపు రెండు వేల మందికి పైగా ముస్లింలు హాజరుకానున్న సభలో ఇఫ్తార్ విందు కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పూర్తి హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈద్గా నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేదని ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో.. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఈద్గాలో నగరంలో ఉన్న ముస్లింలు బక్రీద్, రంజాన్ పండగలకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేవారు. ప్రతి ఏటా రెండు పండగలకు ఈద్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యక ప్రార్థనలు చేసుకునేవారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈద్గాను కూల్చివేశారు. ఆ ప్రదేశంలో నూతన ఈద్గా నిర్మిస్తామని చెప్పి పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా ఈద్గా లేక ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పవన్ రాజకీయాలు ఎవరి కోసం?: కాకాణి
పొదలకూరు: రైటర్లు ఇచ్చే స్క్రిప్ట్‌లతో సినిమాల్లో నటించి డబ్బులు సంపాదించడం తప్పా వ్యవసాయమంటే తెలియని పవన్‌కల్యాణ్ రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలం విరువూరు వద్ద ఆదివారం సంగం బ్యారే జీ పనులను పరిశీలించిన మంత్రి మాట్లాడా రు. పవన్‌కల్యాణ్‌కు రైతు జీవన విధానం, సంస్కృతి, వ్యవసాయంపై ఆయనకు ఉన్న అవగాహన, రైతాంగంపై ఉన్న చిత్తశుద్ధి చెప్పగిలితే ఆయన చెప్పే మాటలను వింటామన్నారు. చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చాలని నిత్యం ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో పవన్‌కల్యాణ్ వంటి వ్యక్తులు రైతులపై మొసలికన్నీరు కార్చితే నమ్మే పరిస్థితి లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబును ఏనాడు విమర్శించలేదన్నారు. చంద్రబాబు పాలన వల్లే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగా యని, వారికి సైతం తమ ప్రభుత్వం పరిహారం అందించినట్లు గుర్తు చేశారు.తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతును రాజును చేయడానికి సీఎం జగన్మోహన్రెడ్డి తాపత్రయపడుతున్నట్టు తెలిపారు. రాయితీపై వ్యవసాయ యంత్రాలు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తున్నామని మంత్రి కాకాణి వివరించారు. వచ్చే నెలలో సీఎం జగన్మోహన్రెడ్డి చేతల మీదుగా ఒకే పర్యాయం రాయితీపై 3,500 ట్రాక్టర్లను అందిస్తామన్నారు. రైతులు ముందుగా పూర్తి మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం రాయితీ నగదును బ్యాంకులో జమ చేస్తుందన్నారు. వరికోత మిషన్లు కావాలని కొందరు రైతులు తనను కోరారని పరిశీలించి అందజేస్తామన్నారు. కోత మిషన్లకు రూ.8 లక్షల వరకు రాయితీ ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూక్ష్మ సేద్యం (డ్రిప్‌ఇరిగేషన్) రాయితీ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. సొసైటీలను సైతం ఆర్బీకేలకు అనుసంధానం చేసి రైతులు మండల కేంద్రాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతులు అమ్ముకోలేకపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా తొలుత విరువూరు ఎస్సీ కాలనీ నుంచి బ్యారేజీ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాధికారి సుధాకర్‌రాజు, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్, జిల్లా కోఆపరేటివ్ అధికారి తిరుపాల్‌రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ సుభానీ, ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, పొదలకూరు, ఏఎస్‌పేట జెడ్పీటీసీలు తెనాలి నిర్మలమ్మ, రాజేశ్వరమ్మ, విరువూరు మాజీ సర్పంచ్ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు జగన్మోహన్, వెంకయ్య, నాయకులు వళ్లూరు గోపాల్‌రెడ్డి, కొల్లి రాజగోపాల్‌రెడ్డి, డీ రమణారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్ప సినిమా సీన్.. రియల్‌గా ఎక్కడంటే?
ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో ఓ సీన్ ఇది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు ఓ ప్రదేశంలో దాచి ఉంచుతారు. ఆ ప్రదేశం గురించి పోలీసులు తెలుసుకుంటారు. వారు అక్కడికి వెళ్తున్న సమాచారం స్మగ్లర్లకు చేరడంతో ఆ సినిమా హీరో, మరికొందరు వెంటనే దుంగలను పక్కనే ఉన్న నీటి ప్రవాహంలోకి నెట్టేస్తారు. హీరో తన అనుచరుడి ద్వారా జలాశయ అధికారికి ముడుపులిచ్చి గేట్లు మూయించేస్తాడు. ఈ సీన్ మొత్తం రక్తి కట్టిస్తుంది. ఇలాంటి సీన్ జిల్లాలోని సోమశిల జలాశయంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు విలువైన దుంగలను నరికించి ఎవరికీ అనుమానం రాకుండా జలాశయంలో దాచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాక్షి, నెల్లూరు: జిల్లా జలనిధిగా ఉన్న సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతం ఎక్కవ భాగం వైఎస్సార్ జిల్లాలో ఉంది. రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు 48 చదరపు కి.మీ విస్తరించి ఉంది. ఆ ఫారెస్ట్‌లో ఎర్రచందనం వృక్షాలున్నాయి. నాణ్యత కలిగిన దుంగలు ఇక్కడ లభిస్తుండడంతో అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. దీనికితోడు జలాశయ లోతట్టు ప్రాంతం కావడంతో రవాణా మార్గానికి అనువుగా ఉండదు. దీంతో అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఆ వైపు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతుంటారు. తమ పరిధి కాదంటూ.. గతంలో సోమశిల జలాశయంలో ఓ ఇంజినీర్ లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి గేటు తాళం తనవద్దే ఉంచుకుని అక్రమ చేపల వేటకు, ఎర్ర స్మగ్లర్లకు రాత్రి వేళల్లో సహకరించి అధికారులకు దొరికిన సందర్భం ఉంది. కానీ ఆ అధికారి రాజకీయ పరపతితో కేసు లేకుండా తప్పించుకోగలిగాడు. మూడు రోజుల క్రితం 11 దుంగలు జలాశయంలో బయటపడ్డాయి. వాస్తవానికి దీని గురించి ముందే తెలిసినా అటవీశాఖ, పోలీస్ అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో కాదంటూ పట్టించుకోలేదు. తాజాగా దుంగల ఫొటోలతో సహా సోషల్ మీడియాలో రావడంతో హడావుడిగా స్వాధీనం చేసుకున్నట్లుగా అటవీ శాఖ ప్రకటించింది. ఇలా చేస్తున్నారు.. జలాశయం లోతట్టు ప్రాంతంలో ఇరువైపులా చేపలు పట్టే జాలర్లు ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా ఎర్ర స్మగ్లర్లకు సహకరించే వ్యక్తుల ద్వారా కొందరు జాలర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా పడవలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అలాగే తమిళ కూలీలను కూడా ఇదే పద్ధతిలో చేర్చి ఎర్ర వృక్షాలను నరికిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దుంగలను జలాశయం లోతట్టు కోనల్లోని నీటిలో నిల్వ ఉంచుతారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు దాడులు చేసినా కనిపించని విధంగా నీటిలో డంపింగ్ చేస్తారు. వారికి అనువైన సమయంలో ఆ డంప్‌ను రవాణా చేసుకుంటారు. ఇలా విలువైన సంపద తరలిపోతున్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలున్నాయి. పక్కా సమాచారం ఉన్నా.. స్థానికంగా ఉన్న ఎర్ర అక్రమార్కుల సహకారంతోనే దుంగలు తరలుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎవరు దొంగలో కూడా స్థానిక అటవీ, పోలీస్ శాఖకు పక్కా సమాచారం ఉంది. అయితే అక్రమార్కులతో ఉన్న లోపాయికారి ఒప్పందంతో వారు పట్టుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఏదైనా ఒత్తిడి వచ్చినా, సమాచారం బహిరంగమైతే అప్పటికప్పుడు అధికారులు నాణ్యత లేని దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన దుంగల విషయంలో కూడా అధికారులు పట్టించుకోకపోగా సమాచారం ఇచ్చిన మీడియాపై రుసరుసలాడడం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీరు చెబితే సస్పెండ్ చేయాలా? సోమశిల జలాశయంలో ఎర్రచందనం దుంగల డంప్‌పై మీడియా సమాచారం ఇస్తే వెంటనే మేము స్థానిక అధికారులను సస్పెండ్ చేయాలా?. మూడు రోజల క్రితం జరిగింది అని చెబుతున్నారు. అవన్ని మేము పరిశీలిస్తాం. విచారణ జరిపిస్తాం. – షణ్ముగకుమార్, డీఎఫ్ఓ, నెల్లూరు