
నెల్లూరు: కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆదివారం కావలి మండలం గౌరవరం వద్ద ఉన్న రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై వరుడు బాల సాకేత్‌రెడ్డి, వధువు మహిమలను ఆశీర్వదించారు.
సీఎం జగన్‌తో పాటు మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి తదితర నేతలు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment