
సాక్షి, నెల్లూరు: ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్న ‘పచ్చదొంగల ముఠా’ బాగోతం మరోసారి వెలుగుచూసింది. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి వ్యక్తిగత డేటాను దొంగలించడానికి యత్నించిన ఘటన తాజాగా నెల్లూరులో బయటపడింది.
మాజీ మంత్రి పొంగురు నారాయణకు చెందిన ప్రైవేటు సైన్యం ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. నగరంలో ఇంటింటికి తిరుగుతూ సెల్‌ఫోన్‌లో మీకు ఓటిపి వస్తుంది అని ఓటిపి తీసుకొని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు(శనివారం) మూలాపేటలో ఓ ఇంటికి వెళ్లి ఇలా వ్యక్తిగత డేటాను దొంగిలించే యత్నించేందుకు ఓటీపీలు అడుగుతున్నటువంటి పచ్చదొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.
ఇది చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment