
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ కిరణ్‌కుమార్ చీకటి కోణం
మహిళా ఉద్యోగులతో వివాహేతర సంబంధాలు
ఆయన రాసలీలల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
నెల్లూరు సిటీ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు డీఐజీ కిరణ్‌కుమార్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన పలువురు మహిళా ఉద్యోగులను ఫొటోషూట్‌ల పేరుతో దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి రాసలీలలు సాగించారని సమాచారం. ఆ దుర్మార్గాలను ఫొటోలు తీసుకుని దాచుకునేవాడని తెలుస్తోంది. కిరణ్‌కుమార్ చీకటి జీవితాన్ని వివరిస్తూ ఆయన భార్య అనసూయరాణి బయటపెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
భార్యకు దూరంగా ఉంటూ...
గుంటూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్, అనసూయరాణి ప్రేమించుకుని 1998లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. కిరణ్‌కుమార్‌కు 2009లో రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య ఏడాది కిందట విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనసూయరాణి వద్ద కుమారుడు ఉండేలా, వారి బాగోగులను కిరణ్‌కుమార్ చూసుకునేలా పది నెలల కిందట పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పందాలు జరిగాయి.
సోమవారం విజయవాడలో ఒక ఫంక్షన్‌లో కలిసిన కిరణ్‌కుమార్, అనసూయరాణి మధ్య గొడవ జరిగింది. తనతోపాటు తన కుమారుడిపై కిరణ్‌కుమార్ విచక్షణారహితంగా దాడి చేశారని అనసూయరాణి గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన వికృత చేష్టలు భరించలేక విడిగా ఉంటున్నానని ఆమె తెలిపారు. కిరణ్‌కుమార్ ఇతర మహిళలతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను తనకు పంపించి మానసిక క్షోభకు గురిచేసేవాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె కొన్ని ఫొటోలను కూడా బయటపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment