Kirankumar
-
సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడైన రౌడీషీటర్ నవీన్ చేతిలో హతమైన తెనాలి యువతి మధిర సహానా (25) కేసులో తాము చెప్పిన పనిని సకాలంలో చేయలేదన్న అక్కసుతో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దళితుడైన కిరణ్‌కుమార్ బదిలీ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం అయ్యిందని, నేడోరేపో బదిలీ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన నడుచుకోలేదని, సీఎంఓ కార్యాలయం నుంచి చెప్పినా వినలేదనే ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు నుంచి ఆయనను తొలగిస్తూ సీఎం కార్యాలయం ఆమోద ముద్ర వేసింది. అసలు కారణం ఇదీ..రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అ«ధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు. ఆమెకు మరుసటి రోజు ఉదయం 6గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
కేంద్ర సంప్రదింపుల కమిటీల్లో ఎంపీలకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ/కాజీపేట రూరల్: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు లభించింది. టెక్స్టైల్స్ శాఖ కమిటీలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం కల్పిస్తూ ఆయా మంత్రిత్వ శాఖలు గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీకి చైర్మన్‌గా ఆ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ వ్యవహరించనుండగా, సభ్యునిగా చామలకు అవకాశం దక్కింది.ఈ కమిటీలో సహాయ మంత్రి పవిత్రతో పాటు ఎనిమిది మంది లోక్‌సభ, నలుగురు రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి.. మొత్తం 14 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్ సంప్రదింపుల కమిటీలో ఎంపీలు మల్లు రవి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్యలకు చోటు దక్కింది. కమిటీకి కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఏడుగురు చొప్పున 14 మంది, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 16 మంది సభ్యులతో ఈ కమిటీ పని చేయ నున్నట్లు ఆయా మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. స్కిల్ డెవలప్మెంట్కు కృషి సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం దక్షిణ మ«ధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎ.కె.జైన్‌తో తెలంగాణ, కర్ణాటక ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. -
త్వరలో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులందరికీ మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో దాదాపు మూడు గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు.భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్షి్మ, చారకొండ వెంకటేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో భాగంగా నిరుద్యోగుల డిమాండ్ల గురించి సీఎం ఆరా తీశారు. సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులతో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబ్ కేలండర్ ప్రకారం భర్తీకి ప్రయత్నాలు: సీఎం ‘నిరుద్యోగులకు ఇచి్చన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్–1,2,3 ఉద్యోగాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. జాబ్ కేలండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రయతి్నస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తున్నాం.ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూలంకషంగా కసరత్తు చేస్తోంది. కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చేస్తున్న కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రాజకీయ పారీ్టలు, స్వార్ధపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు. గత ప్రభుత్వం లాగా మేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిబంధనలు మారిస్తే చట్టపరంగా తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్: టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కు తీసుకుని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పోస్టుల సంఖ్యను పెంచి కొత్తనోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.12 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు 4 లక్షల మంది హాజరయ్యారని, ప్రిలిమ్స్‌ను పూర్తి చేశామని, నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని, అదే జరిగితే మళ్లీ నోటిఫికేషన్ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనల మార్పు న్యాయపరంగా చెల్లుబాటు కాదని, బయోమెట్రిక్ పద్ధతి పాటించలేదన్న ఏకైక కారణంతో హైకోర్టు గ్రూప్–1 పరీక్షను రెండోసారి రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు ఉదహరించారు. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచి్చంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాగా గ్రూప్–2, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉండడంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయని, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని వివరించారు. కాగా టీజీపీఎస్సీ, విద్యాశాఖలు చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటాయని సీఎం వారికి హామీ ఇచ్చారు. -
ప్రత్తిపాడులో టీడీపీ గూండాయిజం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్తి బూర్ల రామాంజనేయులు వైఎస్సార్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్ ఇంటిపై స్వయంగా దాడికి తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం కార్లు, ఇతర వాహనాలపై 200 మంది టీడీపీ, జనసేన రౌడీలతో, మారణాయుధాలతో వచ్చి రామాంజనేయులు ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వారిని కార్లతో తొక్కించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో పలాయనం చిత్తగించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామాంజనేయులే ఓ గూండా మాదిరిగా ఇలా దాడికి పాల్పడటం అందరినీ విస్మయ పరిచింది. టీడీపీ గుండాయిజాన్ని తేటతెల్లం చేసింది. ఓడిపోతామన్న అక్కసుతోనే రామాంజనేయులు ఇలా దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. వారిపై పోలీసులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్, వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయలు ఓ పథకం ప్రకారం కర్రలు, రాడ్లు, ఇతర మారణాయుధాలతో 20 కార్లు, ఇతర వాహనాలతో రౌడీమూకలను తీసుకొని గుంటూరు నగరం జేకేసీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్సీపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న కిరణ్‌కుమార్ కారు డ్రైవర్లు, వైఎస్సార్సీపీ నాయకులు ఎవరు మీరు ఎందుకు వచ్చారని అడగ్గా, టీడీపీ రౌడీ మూకలు వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. కారులోనే ఉన్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కొట్టండిరా వాళ్లను అంటూ రౌడీ మూకలను రెచ్చగొట్టాడు. దీంతో వారు రెచ్చిపోయి అభ్యర్థి బలసానిని, కార్యకర్తలను కులం పేరుతో దుర్భాషలాడుతూ దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగటంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు కార్లు వెనక్కి తిప్పుకొని పారిపోయారు. కిరణ్‌కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు చేతికి తీవ్రగాయమైంది. గోరంట్లకు చెందిన తాళ్ళ అబ్బులును రౌడీ మూకలు కిందపడేసి కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటప్పారెడ్డి కాళ్ళ పైకి రామాంజనేయులు తన కారు ఎక్కించి, తొక్కించడంతో ఆయన కాలు విరిగింది.అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని కిరణ్‌కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ నరేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో టీడీపీ వారు కూడా అక్కడికి రావడంతో పోలీసు స్టేషన్ వద్ద కూడా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ అభ్యర్థి కిరణ్‌కుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారు రోశయ్య, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, గుంటూరు తూర్పు అభ్యర్థి షేక్ నూరీఫాతిమా, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ లాల్పురం రాము ఫిర్యాదు చేశారు. రాళ్ళతో దాడిచేస్తూ వచ్చారు కార్యాలయం వద్ద కింద నాతోపాటు మరో పది మంది కార్యకర్తలు భోజనం చేసేందుకు ఉపక్రమిస్తున్నాం. ఒకేసారి సుమారు 20 కార్లు ఇంటి ముందుకు వచ్చి ఆగాయి. వెంటనే కార్లలో నుంచి దిగిన టీడీపీ గూండాలు ఇంటిపైకి రాళ్ళు రువ్వుతూ ఎవరున్నారు లోపల బయటకు రాండిరా అంటూ దుర్భాషకు దిగారు. వెంటనే నేను, కార్యకర్తలు వారి వద్దకు వెళ్ళి ఎవరు మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించాం. కారులో ఉన్న టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు దుర్భాషలాడుతూ తనతో వచ్చిన రౌడీ మూకలతో వెయ్యండ్రా వీళ్ళని అని అరిచాడు. వెంటనే రౌడీ మూకలు మాపై దాడికి దిగారు. ఇంటివద్దకే వచ్చి చంపుతాం.. అంటూ రౌడీ మూకలు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. దాడిలో నా చేతికి గాయమైంది. – ఇంద్రబాబు, కిరణ్‌కుమార్ డ్రైవర్ కారు ఎక్కించి తొక్కెయ్యిరా వాడిని అని రామాంజనేయులు అన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపై రాళ్ళతో, రౌడీలతో దాడికి పాల్పడుతున్నావ్.. ఇదేనా నీ సంస్కారం అంటూ నేను గట్టిగా నిలదీశాను. నేను, ఇతర వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం రామాంజనేయులుతో వచ్చిన రౌడీ మూకలపై ఎదురు దాడికి దిగాం. దీంతో రామాంజనేయులు తన కారుతో వాళ్ళను తొక్కెయ్యమని డ్రైవర్‌కు చెప్పాడు. కారును ఒక్కసారిగా ముందుకు వెనక్కు కదపటంతో కారు టైరు నా ఎడమ కాలుపై ఎక్కింది. కాలు పాదం వద్ద ఫ్యాక్చర్ అయ్యింది. కారుతో తొక్కించి మమ్మల్ని అంతం చేయాలని బూర్ల రామాంజనేయులు ప్రయత్నించాడు. – మెట్టు వెంకటప్పారెడ్డి, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విచక్షణరహితంగా దాడి టీడీపీ రౌడీలు దాడికి దిగటంతో మమ్మల్ని మేం కాపాడుకునేందుకు ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో నన్ను, నాతోపాటు ఉన్న ఆర్ అండ్ బీ డైరెక్టర్ పిల్లి మేరిని సైతం రామాంజనేయులే స్వయంగా చేతులతో నెట్టి కిందపడేశాడు. ఆడ మనిషి అని కూడా చూడకుండా రౌడీ మూకలు మేరిపై దాడి చేశారు. నన్ను కొట్టారు. వెంటనే మేము లేచి ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో మమ్మల్ని కార్లతో తొక్కించే ప్రయత్నం చేసి పరారయ్యారు. – తాళ్ళ అబ్బులు, వైఎస్సార్సీపీ కార్యకర్త -
జమ్ములో ఏపీ జవాను మృతి
తుని రూరల్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవానుగా జమ్ములో విధులు నిర్వహిస్తున్న తంతటి కిరణ్ కుమార్ (41) సోమవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. తుని మండలం హంసవరం గ్రామం ఆయన స్వస్థలం. కిరణ్‌కుమార్ మృతి సమాచారం తెలియడంతో ఆయన భార్య విజయకుమారి, సోదరుడు రవికుమార్ హుటాహుటిన జమ్మూ వెళ్లారు. వారికి కిరణ్ కుమార్ పార్థివ దేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అప్పగించారు. భర్త మృతదేహాన్ని చూసి విజయకుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. రాత్రికి విశాఖపట్నానికి చేరుకుని తెల్లవారుజామున మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్ మృతదేహానికి బుధవారం ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిరణ్ కుమార్‌కు భార్యతో పాటు కుమారుడు జతిన్ (12), కుమార్తె మెర్సీ (10), తల్లిదండ్రులు జాన్, భాగ్యవతి ఉన్నారు. దేశ సేవలో ఇద్దరు కుమారులు హంసవరం గ్రామానికి చెందిన జాన్, భాగ్యవతి దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూండగా రెండో కుమారుడైన కిరణ్ కుమార్ 2005లో సీఆర్పీఎఫ్లో చేరారు. మూడో కుమారుడు రవికుమార్ ఆర్మీలో చేరాడు. ఇద్దరు కొడుకులు దేశ రక్షణలో సేవలు అందిస్తూండటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని, కిరణ్ కుమార్ మృతి పుత్రశోకాన్ని మిగిల్చిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. కిరణ్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులను సర్పంచ్ రాయి మేరీ అవినాష్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్‌గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్‌కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్‌కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
TS Crime News: కుటుంబ కలహాలతో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్ర నిర్ణయం..!
సంగారెడ్డి: కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన పుట్ల కిరణ్ కుమార్(32) సాఫ్ట్వేర్ ఉద్యోగి. కాగా గోదావరి ఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లి అయిన నెలకే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం కిరణ్ కుమార్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో నగరంలోని నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. అలాగే గోదావరిఖనిలో అశ్విని కూడా కిరణ్‌కుమార్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈనెల 23న కౌన్సె లింగ్‌కు రావాలని తెలిపారు. 21న అర్ధరాత్రి కిరణ్ కుమార్ సిద్దిపేటలోని తన ఇంటికి వచ్చాడు. తన మేన బావమర్ది పల్లె నరేందర్‌తో కలిసి 22న సాయంత్రం వారు రంగనాయకసాగర్ కట్టపైకి బైక్ మీద వెళ్లారు. కిరణ్ ఫోన్ మాట్లాడుకుంటూ దూరంగా వెళ్లాడు. చాలాసేపు వరకు రాకపోయే సరికి బావమరిది వెళ్లి చూడగా ఫోన్ మాత్రమే కనిపించింది. తన బావ కనిపించలేదు. పోలీసుల కౌన్సెలింగ్‌కు భయపడి పారిపోయి ఉండొచ్చని నరేందర్ భావించాడు. గురువారం రంగనాయక సాగర్‌లో కిరణ్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బావమర్ది నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. -
ఫ్యాప్సీలో లలితా జ్యువెల్లరి చైర్మన్‌కు ఘన సత్కారం
విశాఖపట్నం: లలితా జ్యువెల్లరి చైర్మన్ ఎం.కిరణ్ కుమార్‌ను ఏపీ మంత్రులు ఘనంగా సత్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్(ఫ్యాప్సీ) ఎక్స్‌లెన్స్ అవార్డుల లాంచింగ్ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 11 రంగాలలో రాణించిన వారికి ఫ్యాప్సీ ఎక్స్‌లైన్స్ అవార్డులు అందజేశారు. 2023 నుంచి 2033 వరకు పదేళ్ల కాలానికి అగ్రి, ఆక్వా ఆధారిత పరిశ్రమల్లో ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పినందుకుగానూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు కిరణ్‌కుమార్‌కు సన్మాసం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి, ఉపాధ్యాక్షుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
బాలీవుడ్ నటుడు కిరణ్‌కు కరోనా
బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్ (74) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం గురించి కిరణ్ మాట్లాడుతూ – ‘‘ఈ నెల 14న మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడ కరోనా టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలనే నిబంధన ఉంది. నాలో కరోనా లక్షణాలు ఏవీ కనిపించకపోయినా నాకు పాజిటివ్ వచ్చింది. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో రెండోసారి కరోనా టెస్ట్ చేయించుకోబోతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది’’అని పేర్కొన్నారు. ‘దడ్కన్, ముజే దోస్తీ కరోగీ’ వంటి చిత్రాల్లో నటించిన కిరణ్‌కుమార్ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. -
కిరణ్‌కుమార్‌కు గురజాడ పురస్కారం
ఎల్లారెడ్డిపేట: తిమ్మాపూర్ పరిధిలోని బాకూర్‌పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చుక్క కిరణ్‌కుమార్ రాష్ట్రస్థాయి గురజాడ తెలుగు కవితా పురస్కారం అందుకున్నారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేటకు చెందిన కిరణ్‌కుమార్ సాహిత్యం, చిత్రలేఖనంతోపాటు 10వేల మంది కవులతో ప్రారంభమైన ప్రయూత కవితాయజ్ఞంలో 100కు పైగా పద్యాలు రాసి సహస్త్ర కవిమిత్ర బిరుదును సాధించారు. బాలలకు గుడి.. బాకూర్‌పల్లి బడియే.. అనే శతకంతోపాటు అనేక కవితలు సాహిత్యంతో యూఎస్ఏ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి గురజాడ తెలుగు కవితా పురస్కారం 2016కు కిరణ్‌కుమార్‌ను ఎంపిక చేసింది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురజాడ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో అవార్డును అందించారు. భవిష్యత్తులో మరిన్ని కవితలు, పద్యాలు, సాహిత్యం, చిత్రలేఖనంతో కిరణ్‌కుమార్ రాణించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. -
'ఆవేశంలోనే దీప్తిని చంపేశాం'
-
'ఆవేశంలోనే దీప్తిని చంపేశాం'
గుంటూరు : కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక దారుణంగా హతమార్చిన ఆమె తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆవేశంలోనే కూతుర్ని చంపుకున్నామని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులే హతమార్చారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. కాగా రిసెప్షన్ చేస్తామని దీప్తిని ఇంటికి తీసుకు వచ్చామని... ఆమె తల్లి స్నానానికి వెళ్లినప్పుడు, తాను దీప్తిని కులాంతర వివాహం చేసుకున్నందుకు తిట్టానని, ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని తండ్రి హరిబాబు తెలిపారు. ఇష్టం లేకపోతే ఎప్పటికీ పుట్టింటికి రానని దీప్తి తెగేసి చెప్పడంతో, కోపంతో ఆమెను కొట్టానని, అయితే కణతపై దెబ్బ తగలడంతో చనిపోయిందని విచారణలో తెలిపారు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాలనుకున్నానని హరిబాబు విచారణలో చెప్పారు. నిందితుల్ని పోలీసులు ఈరోజు కోర్టులో హాజర పరచనున్నారు. -
పోలీసుల అదుపులో దీప్తి తల్లిదండ్రులు?
గుంటూరు, సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో మృతురాలు దీప్తి తల్లిదండ్రులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించి కుమార్తె దీప్తిని కడతేర్చడం విదితమే. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం దీప్తి తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, దీప్తి మృతదేహానికి సోమవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త కిరణ్‌కుమార్, కుటుంబసభ్యులు మృతదేహాన్ని తమకుఅప్పగించాలని కోరారు. దీప్తి బంధువులు మృతదేహాన్ని తమకే అప్పగించాలని పట్టుపట్టడంతో ఇరువర్గాలమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని దీప్తి తరఫు బంధువులకే అప్పగించేందుకు నిర్ణయించారు -
ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే : కేసీఆర్
* కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ కలసినా తెలంగాణ వెంట్రుక కూడా పీకలేరు * తెలంగాణ ఉద్యమం కోడి కూత.. సీమాంధ్ర ఉద్యమం అలారం కీ... * సీఎం ఆరే దీపం.. అక్టోబర్ 6 దాటడు.. స్విచాఫ్ అవుతది.. ప్లగ్ పీకేస్తరు * సున్నితంగా, హుందాగా వ్యవహరించాల్సిన మేధావులు ఆంధ్రాలో లేరుసాక్షి, హైదరాబాద్: ‘‘లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే. ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే. జగన్‌బాబు, చంద్రబాబు, కిరణ్‌కుమార్ అని కాదు. ఆంధ్రోళ్లంతా దోచుకునేటోళ్లే’’ అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఏనుగు వెళ్లి తోక చిక్కిందని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలంతా కలిసినా తెలంగాణ వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో గంభీరంగా, హుందాగా, సున్నితంగా వ్యవహరించాల్సిన మేధావులు అంధ్రా ప్రాంతంలో లేరన్నారు. ‘ఆంధ్రలో మేధావి అనేటోడు ఉన్నాడా అనే డౌట్ ఉన్నది. మానసికంగా విడిపోయిన ఈ సమయంలో కలసి ఉండాలని ఏ బేవకూఫ్ అనడు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సకల జనభేరిలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం కోడికూతలాగా సహజమైనదని, సీమాంధ్ర ఉద్యమం అలారం మోతలా ఎవరో కీ ఇస్తే తప్ప మోగదని వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ఉద్యమం ఒక ఉద్యమమేనా అని ప్రశ్నించారు. కొరడాలతో కొట్టుకోవడం, కోడి ఈకలు కట్టుకోవడం, గడ్డితినడం, సమాధుల మీద పడుకోవడం ఏం దిక్కుమాలిన ఉద్యమమని అని ఎద్దేవా చేశారు. ఉద్యమ బిడ్డలు సింహాల్లా ఉంటారని అన్నారు. 40 వేల మంది సీమాంధ్ర సభలో జై తెలంగాణ అని పోలీసు శ్రీనివాస్ నినదించడమే ఉద్యమం అన్నారు. అన్ని వేల మంది సభలో ఒంటరిగా పోయి నినదించడానికి ఎంతో గుండెదిటవు కావాలన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే ఉంటుందని, కుందేళ్లు, తోడేళ్లు మాత్రమే సమూహాలుగా వస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అశోక్‌బాబు సమైక్యాంధ్ర కోసం నినదిస్తుంటే కొట్టకుండా శ్రీనివాస్‌పై దాడికి ఎందుకు దిగారని అడిగారు. సీఎం కిరణ్ ఆరిపోయే దీపం... రాష్ట్ర విభజనకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలేనని కేసీఆర్ విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపం. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అక్టోబరు 6 దాటడు. స్విచ్ఛాఫ్ అయితది. కిరణం బొగ్గు అయితది. డీజీపీ దినేశ్‌రెడ్డికి కోర్టు కట్ చేసింది. కిరణ్‌కు కూడా ప్లగ్‌ను పీకేస్తరు’’ అని జోస్యం చెప్పారు. తెలంగాణతో పెట్టుకున్న చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి బాగుపడలేదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా పోయేకాలం వచ్చిందని హెచ్చరించారు. ఒక ప్రాంత ప్రజల గురించి మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టవా అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఎంతో దక్షతతో, గంభీరంగా వ్యవహరించి ఇరుప్రాంతాల వారిని సమన్వయం చేసి విభజన సమస్యను సున్నితంగా పరిష్కరించాల్సిన బాధ్యత కిరణ్‌పై ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించే తెలివిలేకుంటే, జీర్ణం కాకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘‘సీఎం కిరణ్‌ను తెలంగాణ ఆడబిడ్డలు సైతం బేవకూఫ్ అని తిడుతున్నా ఇజ్జత్ , మానం ఉన్నోడైతే సీఎంగా ఉంటడా?’’ అని ప్రశ్నించారు. ఇంకా సమైక్య ఉద్యమ జేఏసీ కన్వీనర్‌గా కిరణ్‌కుమార్ ఉద్యమాన్ని నడిపిస్తున్నడని విమర్శించారు. దిగ్విజయ్‌సింగ్‌కు ఇదే చెప్పినామని, సరైన సమయంలో పద్ధతి ప్రకారం పని చేద్దామని దిగ్విజయ్ చెప్పినట్టుగా కేసీఆర్ వెల్లడించారు. సీఎం ఇకనైనా మారతాడో, బుద్ధి అట్లానే ఉంటదో రాబోయే రోజుల్లో తెలుస్తదని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద సొరంగాన్ని పెద్దగా చేసి సీమాంధ్రలో 330 టీఎంసీల సామర్థ్యపు ప్రాజెక్టులను అక్రమంగా, దౌర్జన్యంగా పూర్తిచేశారని కేసీఆర్ ఆరోపించారు. 90 టీఎంసీల కేటాయింపులుంటే 330 టీఎంసీలను దోచుకుంటున్నామని సీఎం స్వయంగా ఒప్పుకున్నాడన్నారు. 100 టీఎంసీల నీరు ఇస్తే పాలమూరు వలసలు ఆగిపోతాయని, ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తే నల్లగొండ జిల్లా బతుకులు బాగుపడ్తాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజలు కారా? ‘‘పచ్చ పార్టీ చంద్రబాబుకు బతుక్కు ఎన్ని టర్నులుంటయి. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత సీమాంధ్రకు 5 లక్షల కోట్లతో ప్యాకేజీ ఇవ్వాలన్నడు. ఇపుడు సీమాంధ్ర మనోభావాలు పేరుతో ప్రజల టర్న్ అంటున్నడు. సకలజనుల సమ్మెలో లక్షలాది మంది రోడ్లమీదకొచ్చినా.. 1,000 మంది ఆత్మబలిదానం చేసుకుంటే వారి తల్లులు గర్భశోకంలో ఉన్నా.. చంద్రబాబు బయటకు రాలేదు. అప్పుడు ప్రజల టర్న్ ఎందుకు తీసుకోలేదు? తెలంగాణ ప్రజలు ప్రజలే కారా? వారికి మనోభావాలు ఉండవా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రోళ్లు గాయిగాయి చేయగానే కేంద్రం బిత్తరపోయి నిర్ణయం తీసుకోవద్దన్నారు. నష్టపోయి, కష్టపడ్డ తెలంగాణకే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రాణిహిత-చేవెళ్ల, కల్వకుర్తి ప్రాజెక్టులు రెండింటికీ జాతీయ హోదా కల్పించాలని కోరారు. తెలంగాణకు కావాల్సినవేంటో తమ ఢిల్లీ పర్యటనలో పెద్దలకు వివరించినట్లు కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా 10 ఏండ్లు ఉండనీ అంటే సీమాంధ్రుల పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్టుగా కొందరు తనను తప్పుబట్టారని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రా ఖజానా నుండి జీతాలు తీసుకుని, తెలంగాణలో ఖర్చు చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. వీరివల్ల వచ్చే ఆదాయంతో తెలంగాణవాసులకు లాభాలు చేకూరుతాయన్నారు. సమన్యాయం జరిగే అవకాశమే లేదు... వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అంటున్నట్టు సమన్యాయం జరిగే అవకాశమే లేదన్నారు. అసలు న్యాయమే లేకుంటే ఇంక సమన్యాయం ఎక్కడిదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటవుతున్న ఈ తరుణంలో ఏ మాత్రం తప్పటడుగులు వేసినా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచేయడానికి ఎన్నో కుట్రలు చేసినా ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నిజాం కాలేజీలో సభ అంటే స్థలం సరిపోదని తాము భావించామని జనాన్ని చూస్తే అదే నిజమని స్పష్టమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిపే సభ 60-70 ఎక రాల్లో నిర్వహించుకుందామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్న బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూపీఏ గోల్మాల్ చేసినా తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని వారు అందించారని కితాబిచ్చారు. త్వరలోనే తెలంగాణ విజయఢంకా మోగుతుందని, హైదరాబాద్‌పై ఏ మాత్రం కిరికిరి చేసినా మరోసారి ఉద్యమబావుటాను ఎగురేయడానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపిచ్చారు. -
సోరియాసిస్‌కు హోమియోలో పరిష్కారం
సోరియాసిస్ వ్యాధిగ్రస్తులలో చర్మంపై దురదతో కూడిన వెండి రంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవ్వవచ్చు... ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మన శరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఇవి సొంత కణజాలాన్నే దెబ్బదీస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత కొన్ని కుటుంబాలలో సోరియాసిన్ ఆనువంశికంగా వస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం: సోరియాసిస్‌ను ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణప్రమాదం జరుగదు. కాని వ్యాధి తీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధితీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధకశక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేటీ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్, రక్తపోటుకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్‌లో రకాలు సోరియాసిన్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి 5 రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం ఎర్రని మచ్చలుగా మొదలయి పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. ఎఠ్ట్ట్చ్ట్చ సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకుల్లా కనిపిస్తాయి. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారు అవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిన్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రని వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు: 1. చల్లని పొడి వాతావరణం 2. మానసిక ఒత్తిడి. 3. కొన్ని రకాల మందులు (మలేరియా మందులు, లితేలయ, బీటా, బ్లాకర్స్, మాంటి) 4. ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర వ్యాధులు. 5. అలవాట్లు 6. హార్మోన్ తేడాలు 7. ఆహార పదార్థాలు-ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. కాన్స్టిట్యూషన్ పద్దతిలో సోరియాసిస్ నివారణ గురించి తెలుసుకుందాం కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం.తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలి అనేది ముఖ్యం. మైనమ్ (సోరిక్, సైకోటిక్, సిఫిలిటిక్)ను బట్టి పొటెన్సీనీ నిర్ణయించి మందులు ఇవ్వబడతాయి. కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిన్ నుండి తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అస్సలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగుళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922