సంగారెడ్డి: కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన పుట్ల కిరణ్ కుమార్(32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కాగా గోదావరి ఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లి అయిన నెలకే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం కిరణ్ కుమార్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో నగరంలోని నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. అలాగే గోదావరిఖనిలో అశ్విని కూడా కిరణ్‌కుమార్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈనెల 23న కౌన్సె లింగ్‌కు రావాలని తెలిపారు. 21న అర్ధరాత్రి కిరణ్ కుమార్ సిద్దిపేటలోని తన ఇంటికి వచ్చాడు.
తన మేన బావమర్ది పల్లె నరేందర్‌తో కలిసి 22న సాయంత్రం వారు రంగనాయకసాగర్ కట్టపైకి బైక్ మీద వెళ్లారు. కిరణ్ ఫోన్ మాట్లాడుకుంటూ దూరంగా వెళ్లాడు. చాలాసేపు వరకు రాకపోయే సరికి బావమరిది వెళ్లి చూడగా ఫోన్ మాత్రమే కనిపించింది. తన బావ కనిపించలేదు. పోలీసుల కౌన్సెలింగ్‌కు భయపడి పారిపోయి ఉండొచ్చని నరేందర్ భావించాడు. గురువారం రంగనాయక సాగర్‌లో కిరణ్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బావమర్ది నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment