
'ఆవేశంలోనే దీప్తిని చంపేశాం'
గుంటూరు : కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక దారుణంగా హతమార్చిన ఆమె తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆవేశంలోనే కూతుర్ని చంపుకున్నామని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులే హతమార్చారని డీఎస్పీ నాగరాజు తెలిపారు.
కాగా రిసెప్షన్ చేస్తామని దీప్తిని ఇంటికి తీసుకు వచ్చామని... ఆమె తల్లి స్నానానికి వెళ్లినప్పుడు, తాను దీప్తిని కులాంతర వివాహం చేసుకున్నందుకు తిట్టానని, ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని తండ్రి హరిబాబు తెలిపారు. ఇష్టం లేకపోతే ఎప్పటికీ పుట్టింటికి రానని దీప్తి తెగేసి చెప్పడంతో, కోపంతో ఆమెను కొట్టానని, అయితే కణతపై దెబ్బ తగలడంతో చనిపోయిందని విచారణలో తెలిపారు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాలనుకున్నానని హరిబాబు విచారణలో చెప్పారు. నిందితుల్ని పోలీసులు ఈరోజు కోర్టులో హాజర పరచనున్నారు.