Deepti parents
-
'ఆవేశంలోనే దీప్తిని చంపేశాం'
-
'ఆవేశంలోనే దీప్తిని చంపేశాం'
గుంటూరు : కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక దారుణంగా హతమార్చిన ఆమె తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆవేశంలోనే కూతుర్ని చంపుకున్నామని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులే హతమార్చారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. కాగా రిసెప్షన్ చేస్తామని దీప్తిని ఇంటికి తీసుకు వచ్చామని... ఆమె తల్లి స్నానానికి వెళ్లినప్పుడు, తాను దీప్తిని కులాంతర వివాహం చేసుకున్నందుకు తిట్టానని, ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని తండ్రి హరిబాబు తెలిపారు. ఇష్టం లేకపోతే ఎప్పటికీ పుట్టింటికి రానని దీప్తి తెగేసి చెప్పడంతో, కోపంతో ఆమెను కొట్టానని, అయితే కణతపై దెబ్బ తగలడంతో చనిపోయిందని విచారణలో తెలిపారు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాలనుకున్నానని హరిబాబు విచారణలో చెప్పారు. నిందితుల్ని పోలీసులు ఈరోజు కోర్టులో హాజర పరచనున్నారు. -
పోలీసుల అదుపులో దీప్తి తల్లిదండ్రులు?
గుంటూరు, సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో మృతురాలు దీప్తి తల్లిదండ్రులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన పచ్చల హరిబాబు, సామ్రాజ్యం దంపతులు కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించి కుమార్తె దీప్తిని కడతేర్చడం విదితమే. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం దీప్తి తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, దీప్తి మృతదేహానికి సోమవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త కిరణ్కుమార్, కుటుంబసభ్యులు మృతదేహాన్ని తమకుఅప్పగించాలని కోరారు. దీప్తి బంధువులు మృతదేహాన్ని తమకే అప్పగించాలని పట్టుపట్టడంతో ఇరువర్గాలమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని దీప్తి తరఫు బంధువులకే అప్పగించేందుకు నిర్ణయించారు