బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్
బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్ (74) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం గురించి కిరణ్ మాట్లాడుతూ – ‘‘ఈ నెల 14న మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడ కరోనా టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలనే నిబంధన ఉంది. నాలో కరోనా లక్షణాలు ఏవీ కనిపించకపోయినా నాకు పాజిటివ్ వచ్చింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో రెండోసారి కరోనా టెస్ట్ చేయించుకోబోతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది’’అని పేర్కొన్నారు. ‘దడ్కన్, ముజే దోస్తీ కరోగీ’ వంటి చిత్రాల్లో నటించిన కిరణ్‌కుమార్ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment