Medical Checkup
-
రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరం
టాటా సన్స్ ఛైర్మన్ రతన్‌టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర ఆనారోగ్య పరిస్థితుల వల్ల రతన్‌టాటా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనరల్ చెక్-అప్ల కోసం హాస్పటల్‌కు వచ్చానని చెప్పారు. ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా ఉన్న టాటాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) టాటా గ్రూప్‌ను 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.30 లక్షల కోట్ల పైమాటే.రతన్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు.ఆయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు.ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.రతన్ టాటా ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాలు రాశారు.86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. ప్రేమలో విఫలం అయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకు లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు.తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు.టాటాకు సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు.ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోతున్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అందుకు సంబంధించిన వార్తలుకాస్తా వైరల్‌గా మారాయి. -
19 ఏళ్ల యువతికి అరుదైన శస్త్రచికిత్స
నెల్లూరు(బారకాసు) : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో ఓ యువతికి అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని నిప్పోసెంటర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల పావని ఆడుకుంటూ పడిపోయింది. దీంతో ఆమె ఎడమ కాలి తొడ విరిగిపోయింది. వెంటనే పావనిని పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చూపించారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఆమెకు సర్జరీ చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె నడవలేని స్థితికి చేరింది. చివరికి ఆమె తల్లిదండ్రులు జీజీహెచ్‌కు తీసుకొచ్చి ఆర్థోపెడిక్ విభాగంలో చూపించారు. అక్కడి వైద్యులు పావనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. పావనికి ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అయిందని గుర్తించారు. యువతి తల్లిదండ్రుల అంగీకారం మేరకు పావనికి నెల క్రితం ఆర్థోపెడిక్ విభాగ వైద్య బృందం ఆపరేషన్ చేసింది. నెల పాటు యువతికి ఆస్పత్రిలోనే మెరుగైన వైద్య సేవలందించి నడిచే స్థితికి తీసుకొచ్చారు. దీంతో పావనిని వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మస్తాన్‌బాషా మాట్లాడుతూ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను కార్పొరేట్ హాస్సిటల్లో నిర్వహిస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, అయితే జీజీహెచ్‌లో పూర్తి ఉచితంగా నిర్వహించి విజయవంతం చేశామన్నారు. ఆర్థోపెడిక్ విభాగ ప్రొఫెసర్ రవిశంకర్, ప్రొఫెసర్ చంద్రశేఖర్‌నాయుడు, వైద్యులు మధు, కిరణ్, భాస్కర్, దివ్య, గులాబీ సహకారంతో నాలుగు గంటల పాటు శ్రమించి పావనికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం పావని తండ్రి సురేష్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి డాక్టర్ కళారాణి పాల్గొన్నారు. -
బండి సంజయ్ కు వైద్య పరీక్షలు..!
-
ఆసుపత్రికి సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా.. సాధారణ పరీక్షల కోసం ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా బారిన పడిన అనంతరం వివిధ అనారోగ్య సమస్యలు సోనియా గాంధీని చుట్టుముట్టాయి. ఇటీవలే మెడకల్ చెకప్ కోసం విదేశాలకు సైతం వెళ్లొచ్చారు సోనియా. మరోవైపు.. సోనియా గాంధీకి తోడుగా ఉండేందుకు ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నారని, యూపీలో భారత్ జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చనే వాదనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా? -
గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
చాపాడు: గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు పీహెచ్సీ సిబ్బందికి సూచించారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాధికారి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహించి గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేసి రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన పోషక ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, తల్లీబిడ్డ ఎంసీపీ కార్డులలో వివరాలు నమోదు చేయాలని, వైద్య సిబ్బంది రోజూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. జిల్లా ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా అధికారి వెంకటశివ, జిల్లా పీఎంఎంవీవై జిల్లా కో ఆర్డినేటర్ విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు సురక్షితం ఖాజీపేట: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకోవడం సురక్షితమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు అన్నారు. ఖాజీపేట పీహెచ్‌సీని గురువారం ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో జరిగిన కాన్పుల సంఖ్యపై అధికారులతో ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు, ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య పాల్గొన్నారు. -
రజనీ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళన.. ప్రత్యేక విమానంలో...
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే హీరో రజనీకాంత్ కోరిన మీదట అమెరికా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇంతకీ విషయం ఏంటంటే... రజనీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారని సమాచారం. ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలసి రజనీ వెళ్లారట. ఈ విమానంలో పద్నాలుగు మంది వరకూ ప్రయాణించవచ్చట. కాగా, ఇప్పటికే హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ నిమిత్తం అమెరికాలో ఉన్నారు రజనీ అల్లుడు, హీరో ధనుష్. అలాగే ధనుష్ భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారట. కాగా, రజనీ అమెరికా వెళ్లారనే వార్త వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. -
మెడికల్ చెకప్ అనంతరం ఢిల్లీకి చేరుకున్న సోనియా
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం భారత్‌కు చేరుకున్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా తన కుమారుడు రాహుల్ వెంటరాగా ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మెడికల్ చెకప్ కోసం ఈనెల 12న అమెరికా వెళ్లారని, కోవిడ్-19 నేపథ్యంలో తరచూ నిర్వహించే వైద్య పరీక్షల్లో జాప్యం చోటుచేసుకుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న క్రమంలో కొద్దిరోజులే జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు సోనియా, రాహుల్ ఇప్పటివరకూ హాజరుకాలేకపోయారు. వ్యవసాయ బిల్లులపై పాలక, విపక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో సోనియా గాంధీ దేశంలో అడుగుపెట్టారు. రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయగా, సస్పెన్షన్ వేటుకు గురైన సభ్యులు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం కోరింది. సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేవరకూ తాము సభను బహిష్కరిస్తామని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయకుండా నిలువరించేలా మరో బిల్లు తీసుకురావాలని ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో ఆదివారం అనుచితంగా వ్యవహరించిన ఎనిమిది మంది సభ్యులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ సతవ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, రిపున్ బొరేన్‌లున్నారు. చదవండి : మనాలికి కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్! -
బాలీవుడ్ నటుడు కిరణ్‌కు కరోనా
బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్ (74) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం గురించి కిరణ్ మాట్లాడుతూ – ‘‘ఈ నెల 14న మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడ కరోనా టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలనే నిబంధన ఉంది. నాలో కరోనా లక్షణాలు ఏవీ కనిపించకపోయినా నాకు పాజిటివ్ వచ్చింది. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నాను. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో రెండోసారి కరోనా టెస్ట్ చేయించుకోబోతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది’’అని పేర్కొన్నారు. ‘దడ్కన్, ముజే దోస్తీ కరోగీ’ వంటి చిత్రాల్లో నటించిన కిరణ్‌కుమార్ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. -
టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి: హాగ్
మెల్బోర్న్: ఏదేమైనా సరే ఆస్ట్రేలియా ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో టి20 ప్రపంచకప్ నిర్వహించాల్సిందేనని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా లేదంటే రద్దు లాంటివి చేయవద్దని సూచించాడు. ‘ప్రపంచకప్‌పై చాలా చర్చ జరుగుతోంది. ఈవెంట్‌ను రద్దు చేయడమో లేదంటే రీషెడ్యూల్ చేస్తారంటున్నారు. ఇది సరికాదు. పకడ్బందీ చర్యలు తీసుకుంటే కప్ నిర్వహణ సాధ్యమే. పాల్గొనే అన్ని జట్లను ఓ నెలన్నర ముందుగానే చార్టెడ్ ఫ్లయిట్లలో ఇక్కడికి తీసుకురావాలి. క్వారంటైన్ సహా కరోనా పరీక్షలు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఈ సమయంలో వారి సన్నాహాలు జరుగుతుంటాయి. షెడ్యూలు వరకల్లా మెగా ఈవెంట్‌ను అనుకున్నట్లే ప్రారంభించవచ్చు’ అని హాగ్ సూచించాడు. -
ట్రంప్‌కి కరోనా నెగెటివ్
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ ఉధృతరూపం దాలుస్తున్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వైద్య పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వైట్ హౌస్ ఊపిరి పీల్చుకుంది. ఫ్లోరిడాలో గత వారం ట్రంప్‌ని కలుసుకున్న బ్రెజిల్ కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోకు కరోనా సోకడంతో ట్రంప్‌కి కూడా ఈ మహమ్మారి సోకుతుందా అన్న సందేహాలు చుట్టుముట్టాయి. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సియాన్ కోన్లీ ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి అమెరికా మరిన్ని చర్యలు చేపట్టింది. బ్రిటన్, ఐర్లాండ్ ప్రయాణాలపై నిషేధం విధించింది. ఇప్పటికే అగ్రరాజ్యంలో 2,100 కేసులు నమోదు కాగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. -
నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు
సూరత్: ‘పీరియడ్స్’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్ హాస్టల్లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్‌లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్ మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్‌లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు. ఈ ఘటన ‘సూరత్ మున్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్‌లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్ఎంసీలో క్లర్క్‌లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
అందరికీ ఆరోగ్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు. కుషు్ట, టీబీ, పాలియేటివ్ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల వ్యాధులను గుర్తించి వాటిని నయం చేయాలన్నదే ఈ పథకం ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 30 వరకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ ప్రక్రియ చేపడతారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడతారు. డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపులు, అంగన్వాడీ సభ్యుల సహకారం తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో స్క్రీనింగ్ చేసి సంబంధిత నివేదికను రోజూ జిల్లా కార్యాలయానికి పంపించాలి. అదే నివేదికను విలేజ్ హెల్త్ సరీ్వస్ యాప్‌లో నమోదు చేయాలని యోగితా రాణా కోరారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రజలను స్క్రీనింగ్ చేస్తారు. రోజూ 20 ఇళ్ల చొప్పున స్క్రీనింగ్ చేయాలి. ఇద్దరు చొప్పున ఒక టీమ్‌గా ఏర్పడి పని చేయాల్సి ఉంటుంది. దాదాపు కోటి కుటుంబాలను ఈ సందర్భంగా కలిసే అవకాశముంది. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అని పేర్కొంటున్నా.. ఈ కార్యక్రమంలో సమగ్ర ఆరోగ్య సర్వే చేపడుతున్నట్లు కనిపించట్లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇవీ మార్గదర్శకాలు.. హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఇది మున్ముందు గ్రామాల వారీగా ఆరోగ్య రికార్డు తయారు చేయడానికి వీలవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే పరీక్షలకు ఓ మెడికల్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తారు. సబ్ సెంటర్‌కు ఏఎన్ఎం పర్యవేక్షణగా ఉంటారు. ఉదయం 6.30 నుంచి 9.30 వరకు స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా లేకుంటే సాయంత్రం వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాధులు, అనుమానిత రోగాలను గుర్తించి నమోదు చేయాలి. వాటిని అదే రోజు జిల్లా వైద్యాధికారికి పంపాలి. టీబీ కేసులు ఏవైనా ఉంటే నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తే ప్రొటోకాల్ ప్రకారం సంబంధిత పరీక్షలను వారం రోజుల్లో చేయించాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ప్రొటోకాల్ ప్రకారం వైద్యం చేయాలి. వైద్యం చేయించే తేదీ కూడా నమోదు చేయాలి. రోజువారీ స్క్రీనింగ్ వివరాలను గ్రామ ఆరోగ్య రికార్డులో ఏఎన్ఎంలు నమోదు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే అందరికీ ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఈ నెల 17న ఉంటుంది. జిల్లాల్లో 20 నుంచి 22 వరకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఈ నెల 24, 25 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రకటిస్తారు. -
అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ చెర నుంచి మాతృ దేశంలో అడుగుపెట్టిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఆదివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ వైద్యులు ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేపడుతున్నారు. కూలింగ్ డౌన్ విధానంలో భాగంగా ఆయన మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతులను అధికారులు సమీక్షిస్తున్నారు. అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేపట్టిన వైద్యులు.. వెన్నుముక్క కింది భాగంలో గాయమైనట్టు గుర్తించారు. అలాగే అభినందన్ శరీరంలో ఎటాంటి బగ్స్‌ను వైద్యులు గుర్తించలేదు. అతనికి మరో పది రోజుల పాటు మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల చేపట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. శనివారం రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అభినందన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ చెరలో అనుభవాల్ని ఆయన మంత్రితో పంచుకున్నారు. అభినందన్‌కు ఆరోగ్య పరీక్షలు ముగిసిన తరువాత పాకిస్తాన్ నిర్భంధంలో ఎదుర్కొన్న పరిస్థితులపై అధికారులు ఆయనను విచారిస్తారు. -
అభినందన్ ఈ పరీక్షలు... పాసైతేనే...
ఎట్టకేలకు అభినందన్ భారత్‌లో అడుగుపెట్టారు. అన్ని ప్రక్రియలు ముగిసినా 2 రోజులపాటు పాక్ ఆర్మీకి చిక్కడంతో అభినందన్‌కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. పరాయిదేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు. అవేంటంటే.. ► అభినందన్‌ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అప్పగిస్తారు. ► అభినందన్ శారీరకంగా ఎంత ఫిట్నెస్తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. ► శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు.. అంటే గూఢచర్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చకోవడానికి శరీరం మొత్తం బగ్ స్కాన్ చేస్తారు. ► వింగ్ కమాండర్ మానసిక స్థితి ఎలా ఉందో కూడా పరీక్షలు చేసి తెలుసుకుంటారు. శత్రు దేశానికి చిక్కిన తర్వాత వాళ్లేమీ అతిథి మర్యాదలు చేయరు. ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు. ఎవరైనా పెదవి విప్పకపోతే చిత్రహింసలు పెడతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలేమైనా చెప్పారేమోనన్న దిశగా అభినందన్‌ను విచారిస్తారు. ► ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు. ► సాధారణ యుద్ధ ఖైదీలైతే ఈ రెండు సంస్థల విచారణ చేయనక్కర్లేదు. కానీ అభినందన్‌ను యుద్ధఖైదీగా పరిగణించాలో అక్కర్లేదో అన్న సందేహాలు ఉండటంతో ఐబీ, రా అధికారులు కూడా ప్రశ్నలు వేస్తారు. సందేహాల నివృత్తి తర్వాతే ఇంటికి.. మొత్తం వ్యవహారంలో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణే అత్యంత క్లిష్టమైన ప్రక్రియని పేరు చెప్పడానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. అభినందన్ పాక్ ఆర్మీకి బందీగా ఉన్న సమయంలో ఎంత ధీరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, భారతీయ అధికారులకు ఆయనంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌కి ఉండే అనుమానాలు ఉంటాయి. పాక్‌లో బందీగా ఉన్నప్పుడు వాళ్లు ఏ ప్రశ్నలు వేశారు? ఎలాంటి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక లొంగిపోయి వారి గూఢచారిగా తిరిగి మన దేశానికి వచ్చారా? ఇలాంటి సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి వెళ్లనిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని వివరించారు. చదవండి...(అభినందన్ ఆగయా..) కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాక్‌కి చిక్కి భారత్‌కు తిరిగి వచ్చిన పైలట్ కె.నచికేతను విచారించిన సమయంలో దగ్గరుండి ఈ వ్యవహారాలన్నీ చూశానన్నారు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప కుమారుడు కేసీ నంద కరియప్పను 1965 యుద్ధ సమయంలో బంధించి తిరిగి వచ్చాక జరిగిన ఘటనలపై ఆ అధికారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. పాక్ వారిని ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్ రహస్యాలు వాళ్లు బయటపెట్టలేదని చెప్పారు. అభినందన్ విషయంలో కూడా తమకు ఆ నమ్మకం ఉందని, కానీ తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు, విచారణలు చేయాల్సిందేనని చెప్పారు. అభినందన్ అయినా, మరో యుద్ధ ఖైదీ అయినా ఈ విధివిధానాలు పూర్తి చేసినప్పుడు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పారు. -
ఆస్పత్రికి సోనియా; బీజేపీకి రాహుల్ చురక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు. గతంలో సర్జరీ చేయించుకున్న సోనియా గాంధీ.. వార్షిక వైద్యపరీక్షల కోసం మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ సారి ఆమెను తనయుడే తోడ్కొనిపోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే వెల్లడించారు. ‘‘వార్షిక వైద్యపరీక్షల కోసం అమ్మను ఆస్పత్రికి తీసుకెళుతున్నాను. కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండను. ఈ సందర్భంగా.. బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి నాదొక సూచన. నన్ను విమర్శించడానికి అంతగా కసరత్తు చేయాల్సిన అవసరంలేదు. అతి త్వరలోనే తిరిగొస్తాను’’ అని రాహుల్ రాసుకొచ్చారు. గతంలో చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోవడం, ఎక్కడున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా రోజులకు రోజులు గడపడం లాంటివి రాహుల్ అలవాట్లుగా ఉండటం, ఆయా సందర్భాల్లో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శల దాడి చేయడం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి రాహుల్ తన విదేశీ పర్యటన వివరాలను ముందే వెల్లడించారు. మాందసౌర్ కాల్పులకు ఏడాది: తల్లి సోనియాను తీసుకుని రాహుల్ ఒకటి రెండు రోజుల్లోనే విదేశాలకు బయలుదేరి వెళతారని, వారం రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగొస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటకలో కేబినెట్ విస్తరణకు సంబంధించి రాహుల్ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారని, విదేశాల నుంచి వచ్చిన వెంటనే రాహుల్ మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారని, మాంద్సౌర్ రైతులపై కాల్పుల ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్6న రైతు కుటుంబాలను రాహుల్ కలవనున్నారు. Will be out of India for a few days, accompanying Sonia ji to her annual medical check up. To my friends in the BJP social media troll army: don’t get too worked up...I'll be back soon! — Rahul Gandhi (@RahulGandhi) 27 May 2018 -
బ్యాక్ టు హోమ్
రజనీకాంత్ సూపర్ స్టార్. అందరి కళ్లూ ఆయన మీదే ఉంటాయి. అందుకే ఆయన సతీమణి లత ‘ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి’ అంటూ దిష్టి తీసి, ఇంటి లోపలికి ఆహ్వానించారు. ఇటీవల జస్ట్ మెడికల్ చెకప్ కోసం యూఎస్ వెళ్లిన రజనీకాంత్ తిరిగి ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు దిష్టి తీశారు లత. ఈ సంగతి ఇలా ఉంచి సినిమాలను టచ్ చేస్తే... ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించిన ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ నెల 9న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకను వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించనున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. -
జస్ట్ చెకప్ మచ్చీ
రజనీకాంత్ రెండు వారాలపాటు అమెరికాలో ఉంటారు. షూటింగ్ కోసం కాదు. మెడికల్ చెకప్ కోసం. మెడికల్ చెకప్ కోసమా? తలైవర్ (నాయకుడు – అభిమానులు అలానే పిలుస్తారు)కి ఏమైంది? అని కంగారుపడకండి. తలైవర్ రొంబ (బాగా) ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది జస్ట్ రెగ్యులర్ మెడికల్ చెకప్పే మచ్చీ. రజనీ ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఈసారి అమెరికా ప్రయాణం అయ్యారు. రజనీతో పాటు ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా వెళ్లారని సమాచారం. మే సెకండ్ వీక్ వరకూ అమెరికాలోనే ఉంటారట రజనీకాంత్. తిరిగి రాగానే తన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ మూవీ ‘కాలా’ సినిమా ప్రమోషన్లో పాల్గొంటారట. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్ పతాకంపై ధనుష్ నిర్మించారు. మామ రజనీ సినిమాను అల్లుడు ధనుష్ నిర్మించడం ఇదే ఫస్ట్ టైమ్. ‘కాలా’ సినిమా ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా రంజాన్ స్పెషల్‌గా జూన్ 7న రిలీజ్ కానుంది. -
ట్రంప్‌కు చేసే పరీక్షల్లో అది లేదు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మానసిక సామర్థ్యానికి (మెంటల్ ఫిట్నెస్ టెస్ట్) సంబంధించిన పరీక్షలు నిర్వహించడం లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఈ వారంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అందులో మెంటల్ ఫిట్నెస్ టెస్ట్ లేదని వెల్లడించింది. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారికి రాబోయే ఏడాదిలో పనిచేయగల సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ వారంలో వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో ట్రంప్‌కు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఆ నివేదికను బహిర్గతం చేయనున్నట్లు వైట్ హౌస్ ఇది వరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ట్రంప్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన ట్వీట్లను విశ్లేషిస్తూ ఓ రచయిత ప్రత్యేకంగా పుస్తకం రాస్తూ ట్రంప్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారనే నిర్ణయాన్ని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే త్వరలో నిర్వహించనున్న వైద్య పరీక్షల్లో మెంటల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారా అనే విషయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆ పరీక్ష లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఆయనకు కేవలం దేహదారుఢ్య పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించింది. -
వైఎస్ఆర్ పథకాలు నిర్వీర్యం
– వైఎస్ఆర్సిపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి - కోవెలకుంట్లలో మెగా వైద్య శిబిరం కోవెలకుంట్ల: వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయ ఆవరణలో వైఎస్ఆర్ ఫౌండేషన్(అమెరికా), సీమాంధ్ర రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారితోపాటు వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, కోవెలకుంట్ల, సంజామల జెడ్పీటీసీ సభ్యులు గాండ్లపుల్లయ్య, చిన్నబాబు, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. డాక్టర్లు సురేంద్రనాథ్‌రెడ్డి, జ్యోతివాణి, జగన్మోహన్రెడ్డి, సిద్ధార్ధ, నాగరాఘవేంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివరామిరెడ్డి వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరు, కాటసాని, బుడ్డా మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పేదల ఆరోగ్యం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ, 104, 108, తదితర బృహత్తర పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పథకాలకు పేర్లు మార్చి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తోందన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం వైఎస్సార్ ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు నాగేశ్వరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాష, డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాదులు మధుసూదన్‌రెడ్డి, తిరుపతయ్య, ఎల్ఐసీ రామసుబ్బారెడ్డి, సంఘం సుధాకర్‌రెడ్డి, ఎర్రం ఈశ్వరరెడ్డి, పల్లె మహేశ్వరరెడ్డి, నాగేంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్పృహలోకి వచ్చిన చిన్నారి జ్ఞానసాయి
– పరీక్షలు నిర్వహించిన వైద్యులు ములకలచెరువు: కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన చిన్నారి జ్ఞానసాయి సోమవారం స్పృహలోకి వచ్చింది. గత శనివారం చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం చిన్నారి స్పృహలోకి వచ్చింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అక్కడి వైద్య బృందం వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలానికి చెందిన ఈ తొమ్మిదేళ్ల చిన్నారికి కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య బాధ్యత తీసుకుంది. కాగా చిన్నారి స్పృహలోకి రావడంతో వైద్యులు రక్త, యూరిన్ తదితర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి వివరాలు మంగళవారం వెల్లడించనున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. పూర్తిగా చిన్నారి కోలుకునేంతవరకు సుమారుగా వారం రోజుల పాటు ఐసీయూలో పెట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. చిన్నారి తండ్రి రమణప్ప సైతం ఐసీయూలో ఉన్నారు. రమణప్ప తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. అక్కడి వైద్యులు రమణప్ప పరిస్థితి గమనించి కుమార్తే జ్ఞానసాయిని చూపించడంతో కొద్దిగా మానసిక ఒత్తిడి నుంచి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 24 గంటల తర్వాత రమణప్పను నార్మల్ వార్డుకు మార్చనున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
హెల్త్ చెకప్ చేయించుకున్న సూపర్ స్టార్!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాధారణ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తన తాజా సినిమా 'కబాలి' కోసం మలేషియాలో నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొన్న నేపథ్యంలో చెన్నైకి తిరిగి వచ్చిన వెంటనే హెల్త్ చెకప్ చేయించుకున్నారు. 'ఆయన కూతురుతో కలిసి సోమవారం ఉదయం ఎంఐఓటీ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆయనకు ఓ ప్రత్యేక వార్డు కేటాయించాం. ఇందులో సాధారణ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సాయంత్రం ఆయనను డిశ్చార్జ్ చేశాం' అని వైద్యులు తెలిపారు. 65 ఏళ్ల రజనీకాంత్‌కి వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలిసింది. రజనీ ప్రస్తుతం బిజీబిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. 'కబాలి' సినిమా ముగిసీముగియకముందే.. ఆయన డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రోబో-2 (2.0)లో నటించనున్నారు. 'రోబో' సీక్వెల్‌గా భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్‌గా దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. -
అమెరికా వెళ్లిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం ఆమె అమెరికా వెళ్లారని, వారం రోజుల్లో తిరిగొస్తారని కాంగ్రెస్ పార్టీ సోమవారం వెల్లడించింది. 'రెగ్యులర్, రొటీన్ చెకప్ కోసమే సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. వారం రోజుల్లో తిరిగొస్తారు' అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా తెలిపారు. 68 ఏళ్ల సోనియా రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లాల్సివుందని, బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమె వెళ్లలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బిహార్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అమెరికా వెళ్లారని తెలిపాయి. -
'వైఎస్ జగన్ దీక్ష విరమిస్తే మంచిది'
-
'వైఎస్ జగన్ దీక్ష విరమిస్తే మంచిది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నామని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ ఉదయ్ శంకర్ తెలిపారు. వైఎస్ జగన్ శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని, ఆయన దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. కీటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. వైఎస్ జగన్ తక్షణం దీక్ష విరమించి, ఆహారం తీసుకోవాలని సలహాయిచ్చారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నివేదికను తమ సూపరింటెండెంట్ కు సమర్పిస్తామని చెప్పారు. ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పెద్ద ఘాట్లలో వైద్య శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వైద్య సౌకర్యాలు కల్పిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆయన శుక్రవారమిక్కడ సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఐదారు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మొత్తం 106 పుష్కర ఘాట్లు ఉండగా, అందులో 17 ఘాట్లు పెద్దవని చెప్పారు. పెద్ద ఘాట్ల వద్ద 24 గంటలూ వైద్య శిబిరాలు పనిచేస్తాయన్నారు. ఆయా శిబిరాల వద్ద స్పెషలాఫీసర్, ముగ్గురు చొప్పున మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, అటెండర్లు పనిచేస్తారని వివరించారు. చిన్న ఘాట్లను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)తో అనుసంధానం చేస్తామన్నారు. 104, 108 వాహనాలు, మందులు, పరికరాలను శిబిరాల వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఐదు జిల్లాల్లో పుష్కరాల వద్ద వైద్య సేవలను పర్యవేక్షించేందుకు ఒక్కో జిల్లాకు రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లను నియమిస్తామని, ఆయా జిల్లాల డీఎంహెచ్వోలు పర్యవేక్షిస్తారని చెప్పారు. నీటి కాలుష్యం వల్ల డయేరియా వంటివి వస్తాయని, తొక్కిసలాట, నీళ్లలో మునిగిపోవడం, గుండెపోటు వంటి ఘటనలు సంభవించే అవకాశాలు ఉంటాయని... వీటి బారినపడే వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లనూ అప్రమత్తం చేస్తామని తెలిపారు. 17 పెద్ద పుష్కర ఘాట్లు ఇవే... బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, కందకుర్తి, సోన్గూడెం, మంచిర్యాల, చెన్నూరు, మల్లూరు, మంగపేట, రాగన్నగూడెం, ముల్లకట్ట, పర్ణశాల, పోచంపాడు, తడపాగులు, కోటి లింగాల, మంథని. వైద్య ఏర్పాట్లపై ప్రణాళిక * తాత్కాలిక బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద వైద్య శిబిరాలు * డీఎంహెచ్‌వో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే జిల్లాస్థాయి పర్యవేక్షణ సెల్ * హైదరాబాద్‌లోని ప్రజారోగ్య కార్యాలయం నుంచి 24 గంటలూ పనిచేసే రాష్ట్రస్థాయి పర్యవేక్షణ సెల్ * వెద్య సేవల కోసం రూ. 2.37 కోట్ల కేటాయింపు. అందులో మందుల కోసం రూ. 1.22 కోట్లు. -
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
కడప అర్బన్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు ఆరు నెలలకు ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరమని కడప ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాష, కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు అన్నారు. ఆదివారం నగరంలోని తిరుమల హాస్పిటల్స్‌లో గోసుల కృష్ణారెడ్డి ఫౌండేషన్, తిరుమల హాస్పిటల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడతూ కడప నగరంలో ఒకటిన్నర సంవత్సరాల కాలంలో డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి 209 మందికి మోకాళ్ల కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ 50 సంవత్సరాలు పైబడిన వారికి మెకాళ్ల నొప్పులు రావడం సహజమన్నారు. డాక్టర్ సురేంద్రబాబు సారధ్యంలో ఏర్పాటైన తిరుమల హాస్పిటల్స్‌లో డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి 209 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ నెల 26న 210 మందిలో కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సను చేయించుకున్న వారిలో 2కే రన్ నిర్వహిస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి, తిరుమల హాస్పిటల్స్ డాక్టర్ పి.సురేంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో తిరుమల హాస్పిటల్స్ పరిపాలనాధికారి (ఏవో)మారుతితేజ, వైఎస్ఆర్సీపీ నేతలు షఫి, కార్పొరేటర్ రామలక్ష్మణ్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్యుల పర్యవేక్షణలో మంత్రి పోచారం
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సాధారణ వైద్య పరీక్షల కోసం కేర్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్యబృందం మంత్రిని ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తె లిపారు. -
బ్రోకర్లకు బిగుస్తున్న ఉచ్చు
మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో నిలదీస్తున్న బాధితులు డబ్బుల కోసం పెరుగుతున్న ఒత్తిడి తప్పించు కుతిరుగుతున్న దళారులు శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : మెడికల్ అన్‌ఫిట్‌లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం విచారణ చేపట్టడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మెడికల్ బోర్డు నిర్వహించిన ప్రతీసారి డబ్బులతో పండుగ చేసుకొనే బ్రోకర్ల పరిస్థితి కుడితిల పడిన ఎలుకల తీరుగా మారింది. జబ్బు పడిన వారి నుంచే కాకుండా దొంగ మెడికల్ అన్‌ఫిట్ కేసులు చేయించడానికి రూ.లక్షల్లో దండుకున్న దళారులకు డబ్బులిచ్చిన కార్మికుల నుంచి రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రేపు.. మాపు.. అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. మరి కొందరైతే ముఖం చూపించుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రకృతికి విరుద్ధమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి భూగర్భం నుంచి బొగ్గు వెలికితీస్తున్న కార్మిక కుటుంబాలకు మేలు చేయడానికి యాజమాన్యం కల్పించిన అవకాశం నేడు దళారులకు, కొందరు నాయకులకు వరంగా మారిపోయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇక విధులు నిర్వర్థించలేని కార్మికుడికి మెడికల్ బోర్డు అన్‌ఫిట్ సర్టిఫికెట్ ఇస్తే అతడి స్థానంలో వారసుడికి సంస్థ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు, నాయకులు బోర్డులోని అధికారులను మచ్చి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేకున్నా అన్‌ఫిట్ చేయిస్తామని ఒక్కో కేసుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారు. ఈ క్రమంలో వాస్తవంగా అనారోగ్యంతో ఉన్న కార్మికుల నుంచి సైతం త్వరగా అన్‌ఫిట్ చేయిస్తామని డబ్బులు దండుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మందికి పైగానే బ్రోకర్లు ఉన్నారని అంచనా. ఇందులో పలు సంఘాల నేతలు, ఉద్యోగులు, కొందరు అధికారులు, వైద్యుల పాత్రు సైతం ఉన్నట్లు సమాచారం. అయితే మెడికల్ బోర్డులో అక్రమాలపై దుమారం రేగడంతో ఆగస్టు నుంచి మెడికల్ అన్ఫిట్లు ఆగిపోయాయి. ఎప్పుడు మెడికల్ బోర్డు పెడుతారో తెలియకపోవడంతో బ్రోకర్లకు డబ్బులిచ్చిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్రోకర్ల వెంబడి పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వారి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో కొందరు ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో లేడని చెప్పి తప్పించుకుంటున్నారు. కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. అలాంటి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. -
మానవతకు ప్రేరణ
ఈ విద్యార్థి బృందం తమ సెలవులను గడపడంలో ఓ సృజనాత్మకత ఉంది. వారు తమ కార్యకలాపాలకు పెట్టుకున్న పేరు... ‘ప్రేరణ’లో ఓ చైతన్యం ఉంది. వారు వేసే అడుగులకు ఒక సత్సంకల్పం ఊతమైంది. వారి సంకల్పబలం ఎంతోమందికి జీవితాన్ని ఇస్తోంది. అనాథలు, వికలాంగులు, వృద్ధులు అని లేకుండా... అవసరంలో ఉన్నవారెవరి వద్దకైనా వాళ్లు వెళ్తారు. వారి అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తారు. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతారు. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు సహకరిస్తారు. ఐదుగురు స్నేహితులు మానవత్వంతో తిరుపతిలో మొదలు పెట్టిన ఈ సేవ, ఇప్పుడు ఆ పట్టణాన్ని దాటి, రాష్ట్రాన్ని దాటి, మెల్లగా ఇతర రాష్ట్రాలలోనూ విస్తరిస్తోంది! తల్లిదండ్రులు చేతిఖర్చులకిచ్చే డబ్బుతో పబ్‌లు, డిస్కో థెక్‌లు, సినిమాలు, విందులు వినోదాల్లో రిలాక్సవడం - ఆ తర్వాత చదువులు, ఉద్యోగాల్లో బిజీ అవడమే యువతరం జీవన విధానం అనుకుంటాం. కానీ కొందరు విద్యార్థులు అలా కాదు. సెలవుల్లో అనాథలు, వికలాంగులు, వృద్ధుల ఆలనాపాలనాలో మునిగిపోతారు. వీరిలో నాన్న ఇచ్చిన పాకెట్ మనీలో కొంత అనాథలకు వెచ్చిస్తారు. నెల జీతంలో పది శాతాన్ని సేవలకు ఖర్చు చేసేవారూ ఉన్నారు. సేవామార్గంలో సాగుతూ మానవత్వానికి ‘ప్రేరణ’గా నిలుస్తోన్న మిత్రబృందం... సుధాకర్, రాజశేఖర్, భార్గవి, ఆక్లేష, ప్రవీణ్‌కుమార్‌ల కథ ఇది. ఈ స్నేహితులందరూ ఒక క్లాసు వాళ్లు కాదు, ఒక కాలేజీ వాళ్లు కూడా కాదు. తిరుపతిలో వేర్వేరు కాలేజీల్లో చదువుకునేవారు. 2007లో అనుకోకుండా ఒకరికొకరు పరిచయమయ్యారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలూ ఉండటంతో... అనాథలు, వికలాంగులు, వృద్ధులకు ఆనందాన్ని పంచి వారికి జీవితం పట్ల భరోసా కల్పించాలని భావించారు. అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన తిరుపతిలో జగన్మాత చర్చి అనాథాశ్రమంలో ‘ప్రేరణ’ అనే సంస్థను స్థాపించారు. సెలవు రోజుల్లో తిరుపతి, ఆ పరిసరాల్లోని అనాథ, వృద్ధ ఆశ్రమాలను సందర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో అనాథలకు అవసరమైన వస్తువులను సమకూర్చి, వైద్యం చేయిస్తున్నారు. ఒక ఆదివారం రోజు... ప్రేరణ బృందం తిరుపతిలోని నవజీవన్ బ్లైండ్ స్కూల్‌ను సందర్శించింది. విద్యార్థులకు అవసరమైన సబ్బులు, తలనూనెలు, షాంపూ, టూత్పేస్టుతోపాటు తినుబండారాలు ఇచ్చింది. అంధ విద్యార్థులను ఆ రోజంతా ఆటపాటలతో ఉత్సాహపరిచింది. సాయంత్రం బయటకు వచ్చే సమయంలో రోజా అనే విద్యార్థిని.. ‘నా కాళ్లపై నేను నిలబడగలిగేలా చేయండి అన్నా’ అన్నది. ‘‘ఆ మాటలు వారిని కదిలించాయి. ఆమె కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నారు. సంగీతం పట్ల రోజాకు ఉన్న అభిరుచిని గుర్తించి, ఆ విభాగంలో ఆమెకు శిక్షణ ఇప్పించారు. ఆగస్టు 15, 2008న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రేరణ ప్రథమ వార్షికోత్సవంలో రోజా ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. తన కాళ్లపై తాను నిలబడగలననే ధైర్యం రోజాకు వచ్చింది. ఇది ప్రేరణ బృందానికి గొప్ప ప్రేరణ అయింది. విస్తరించిన సైన్యం... ఏడేళ్ల కిందట ఐదుగురితో ప్రారంభమైన ‘ప్రేరణ’ సైన్యం ఇప్పుడు 250 మందికి చేరుకుంది. తిరుపతి నుంచి చెన్నై, బెంగుళూరు వంటి నగరాలతోపాటూ కడప జిల్లాకూ సేవలను విస్తరించింది. అప్పటి విద్యార్థులు ఇప్పుడు తలా ఓ చోట ఉద్యోగంలో చేరి కూడా తమ కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూసుకుంటున్నారు. జీతంలో పది శాతాన్ని ‘ప్రేరణ’కు అందిస్తున్నారు. తమ సేవా కార్యక్రమాలను విస్తరించారు. స్నేహితులను కలుపుకుంటూ తమ సైన్యాన్ని పెంచుకుంటున్నారు. సెలవు దొరికితే చాలు... అందరూ కలిసి తిరుపతి, చెన్నై, బెంగళూరుల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మానసిక వికలాంగుల కేంద్రాలకు వెళ్తున్నారు. వికలాంగుల బాగోగులను విచారిస్తూ... వారిలో దాగిన నైపుణ్యాన్ని వెలికితీసి, సానపడుతున్నారు. ప్రేరణ బృందం సహాయంతో తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం సమీపంలోని అక్షయ కేంద్రంలోని మానసిక వికలాంగ బాలలైన నారాయణ, జ్యోతిలు వైకల్యం పోయి సాధారణ బాలలుగా మారారు. ఇదే కేంద్రంలోని మానసిక వికలాంగులు నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. ఢిల్లీలో నవంబర్ 14, 2014న నిర్వహించే బాలల దినోత్సవంలో నృత్య ప్రదర్శనకు ఈ బృందం ఎంపికైనట్లు ‘ప్రేరణ’ కో-ఆర్డినేటర్ బాషా చెప్పారు. తమ సేవలను ఇంతగా విస్తరించడం వెనుక ప్రేరణ సభ్యులు పడిన శ్రమ చాలానే ఉంది. ఆర్థిక సమస్యలతో పాలు ఇతరత్రా సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అమ్మాయిలకు అయితే... ఇంట్లో అనుమతి దొరికేదు కాదు. అబ్బాయిలుంటారు కాబట్టి సేవ చేయడానికి పంప డానికి తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు. కానీ ‘ప్రేరణ’ చేస్తున్న కార్యక్రమాలు చూశాక వారి మన సులు మారాయి. ఆడపిల్లలను సైతం ధైర్యంగా పంపించారు. పాకెట్ మనీని అధికంగా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దాంతో చాలామంది అమ్మాయిలు కూడా ప్రేరణ కార్యక్రమాల్లో పాలుపంచు కుంటున్నారు. వీళ్లందరి సేవలూ అనాథ, వృద్ధ, మానసిక వికలాంగుల ఆశ్రమాలకే పరిమితం కాలేదు. బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు, వైద్య శిబిరాలు, బస్టాండులు, దేవాలయాలను శుభ్రం చేయడం వరకూ విస్తరించాయి. ఇంత చిన్న వయసులో వీరు చేస్తోన్న సేవకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి! - ఎ.రామగోపాల్‌రెడ్డి, సాక్షి, తిరుపతి ఫొటోలు: కె.గిరిబాబు -
5 వేల జననాలు.. 2 వేల మరణాలు
ఏలూరు అర్బన్/భీమవరం అర్బన్ : జనన, మరణాల నమోదు ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైటల్ స్టాటిస్టిక్స్ డెప్యూటీ డెరైక్టర్ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని జనన, మరణ నమోదు రిజిస్టర్లను, భీమవరం మునిసిపల్ కార్యాలయంలోని జనన, మరణ నమోదు విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లాలో జనన, మరణాల నమోదు ప్రక్రియ అమలును పరిశీలించేందుకు తనిఖీలు ప్రారంభించామన్నారు. జిల్లాలో నెలకు సుమారు 5 వేల జననాలు, 2 వేల వరకు మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సంభవించే మరణాలు, ఇళ్ల వద్ద జరిగే ప్రసవాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావడం లేదని దుర్గాప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జనన, మరణాల సమాచారాన్ని ఆయా గ్రామాల కార్యదర్శులు సేకరించి తహసిల్దార్ కార్యాలయాలకు అందించాల్సి ఉందన్నారు. అయితే వారు వివరాలు అందించడంలో జాప్యం జరుగుతుందని గుర్తించామన్నారు. దీనిని నివారించేందుకు జనన, మరణాల నమోదు బాధ్యతలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఎల్డీ కంప్యూటర్ (కంప్యూటర్ ఆపరేటర్లు)కే అప్పగిస్తున్నామని దుర్గాప్రసాద్ తెలిపారు. ఇకపై జనన, మరణాలపై వివరాలను సేకరించి నమోదు చేసేందుకు ఎల్డీ క ంప్యూటర్లే నేరుగా గ్రామ సెక్రటరీల నుంచి సమాచారం సేకరించి డీఎంహెచ్‌వో కార్యాలయానికి అందిస్తారన్నారు. జనన, మరణం సంభవించిన 21రోజుల్లో ప్రజలు పంచాయతీల్లో నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 30 రోజుల దాటితే రూ.2 పెనాల్టీతో, ఏడాది దాటితే నోటరీ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఏడాది దాటితే ఆర్డీవో అనుమతితో ధ్రువీకరణపత్రాలు పొందాల్సి ఉంటుందని చెప్పారు. -
వరద ముంపులో బుచ్చెంపాలెం
దేవరాపల్లి: మండలంలోని వాలాబు రిజర్వాయరు నుంచి పోటెత్తిన వరదనీరు శనివారం బుచ్చెంపాలెం గ్రామాన్ని ముంచెత్తింది. వర్షా లకు రిజర్వాయరులో నీటి మట్టం పెరిగిపోవడంతో గ్రామంలో జనం ఎటూ వెళ్లలేని పరిస్థితి చోటుచేసుకుంది. ఏ క్షణాన వరదనీరు తమ గ్రామాన్ని ముంచెత్తుతుందోనన్న భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం కోసం ఎదురు చూపుఇక్కడ 18 కుటుంబాలవారు నిత్యావసరాలు, వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామంలో జ్వరాలతోపాటు కునెపు నర్సమ్మ(60) శుక్రవారం రాత్రి వంటచేస్తుండగా అగ్నిప్రమాదానికి గురైంది. వైద్యసిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు చర్యలు శూన్యం ముంపునకు గురవుతున్న ఈ గ్రామానికి వెళ్లేం దుకు దేవరాపల్లి ఎస్ఐ ఇ. లక్ష్మణరావు శుక్రవారం ప్రయత్నించారు. సెల్‌ఫోన్ సాయంతో వారి క్షేమసమాచారాన్ని తెసుకొని వారిని ముం పునుంచి బయటపడాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ఒకే నాటుపడవ ఉందని, మీరు రావద్దని, మేము రాలేమని ఆ గ్రామస్థులు చెప్పడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నారని గ్రామస్తులు విలేకరులకు చెప్పారు. -
అజిత్ ఔదార్యం
నటుడు అజిత్ గుప్తదానాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తన పేరిట ఏర్పాటయిన అభిమాన సంఘం ద్వారా పేదలకు తన వంతు సాయం అందజేస్తున్నారు. మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాల ఏర్పాటు, సంక్షేమ సహాయకాల పంపిణీ వంటివి చేపట్టారు. అభిమాన సంఘాన్ని తొలగించి తానే స్వయంగా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. షూటింగ్‌లోనూ సహ కళాకారులకు వైద్య సాయం చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసి అందరికీ వడ్డిస్తున్నారు. ప్రస్తుతం తన వద్ద పని చేసే 12 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇది వరకే వీరికి ఇళ్లు నిర్మించేందుకు చెన్నై సమీపంలోని కేళంబాక్కంలో స్థలాన్ని కొనుగోలు చేశారు. దాన్ని 12 మందికి విభజించి ఇచ్చారు. ఇళ్లు నిర్మించేందుకు పెద్ద మొత్తం అవసరం కావడంతో వారు నిర్మించుకోలేకపోయారు. ప్రస్తుతం అజిత్ తన సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించి వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. అజిత్ సేవలను సహ నటులు అభినందిస్తున్నారు. -
అంతంత మాత్రమే!
మన్యానికి అందని మందులు ఆశ కార్యకర్తల వద్ద ఔషధాల కొరత ఆరోగ్య కేంద్రాల్లోనూ అదే స్థితి గిరిజనులకు తప్పని ఇక్కట్లు పీహెచ్‌సీల వైద్యుల నిర్లక్ష్యం పర్యవసానం గోరంత దీపం కొండంత వెలుగన్నది ఆశ కార్యకర్తలకు అక్షరాలా సరిపోతుంది. మన్యంలో అనారోగ్యం చీకట్లు కమ్ముకున్న వేళ వారి చేయూత కారణంగా గిరిజనులకు ఎంతో ఊరట లభిస్తుంది. వ్యాధులు వేధిస్తూ ఉంటే, ఆశ కార్యకర్తల ద్వారా ప్రాథమిక వైద్యం సాధ్యమవుతుంది. కానీ ఆపాటి చికిత్సకూ వారి దగ్గర మందులు నిండుకుంటే? మారుమూల గ్రామాల్లో గిరిజనులకు ఆపాటి సాయం కూడా అందే దారేది? మన్యంలోని పీహెచ్‌సీల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. సకాలంలో మందులు సరఫరా కాక గిరిజనుల ఆరోగ్యం ఒడిదుడుకుల్లో పడేట్టు కనిపిస్తోంది. పాడేరు, న్యూస్‌లైన్: మన్యంలో గిరిజనులకు వైద్య సాయం అందేదే స్వల్పం.. అనారోగ్యం వేధిస్తున్నా చాలామందికి సాయం శూన్యం. కొద్దిపాటి చేయూత కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలోని గ్రామాలకు మందుల కొరత ఎదురవుతోంది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా పూర్తిస్థాయిలో మందుల నిల్వలు లేవు. ఏటా నాలుగు దఫాలుగా రూ. 3 కోట్ల బడ్జెట్‌తో మందులు విశాఖ సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుంచి అందాల్సి ఉంది. అయితే జనవరి మొదటి వారానికే చివరి విడత మందులు ఆరోగ్య కేంద్రాలకు చేరాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెలాఖరుకు కూడా ఏజెన్సీకి వైద్య ఆరోగ్యశాఖ నుంచి మందుల ఇండెంట్లు సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరలేదు. దాంతో మూడో దఫాలో అక్టోబర్‌లో పంపిణీ చేసిన మందులనే ఆస్పత్రులు, గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు వినియోగిస్తున్నా రు. పూర్తిస్థాయిలో మందుల నిల్వలు లేకపోవడంతో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలకు వెళ్లే వైద్య బృందాల వద్దకు కూడా అరకొరగానే మందులు ఉంటున్నాయి. బాధ్యతారాహిత్యం ఏజెన్సీలోని 3,200 మంది ఆశ కార్యకర్తల వద్ద జ్వరం, విరేచనాల మందులు, యాంటిబయోటిక్ మాత్రలు పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. ప్రతీ నెల ఆశ కార్యకర్తలకు ఆరోగ్య కేంద్రాల్లో 50కి మించి జ్వరం నివారణ బిళ్లలు పంపిణీ చేయడం లేదు. దీంతో గ్రామాల్లో జనాభాకు తగ్గట్టుగా ఆశ కార్యకర్తల వద్ద మందులు ఉండడం లేదు. డిసెంబర్ రెండో వారానికే ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల వైద్యులు చివరి దఫా మందుల ఇండెంట్‌ను వైద్య ఆరోగ్యశాఖకు, ఐటీడీఏ డ్రగ్‌స్టోర్‌లకు అందజేయాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరి ముగుస్తున్నా చాలా చోట్ల నుంచి ఇండెంట్ అందలేదు. కిలగాడ, ముంచంగిపుట్టు, సుంకరమెట్ట, అనంతగిరి, భీమవరం, యు.చీడిపాలెం, ధారకొండ, డౌనూరు, కె.డి.పేట, కంఠవరం, లుంగపర్తి తదితర పీహెచ్‌సీల నుంచి మందుల ఇండెంట్‌ను వైద్యులు పంపలేదు. సమయానికి మందులు రప్పించుకోవాల్సిన బాధ్యతను కూడా కొంతమంది వైద్యులు విస్మరిస్తున్నారు. అన్ని ఆస్పత్రుల నుంచి ఇండెంట్లు వస్తేనే పాడేరు డ్రగ్‌స్టోర్ నుంచి అధికారులు ఈ మందుల వివరాలను ఆన్లైన్ చేసి విశాఖపట్నంలోని సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌కు పంపుతారు. అక్కడినుంచి మందులను పాడేరుకు తరలిస్తారు. అయితే ఇండెంట్ లేక పాడేరు డ్రగ్‌స్టోర్ అధికారులు కూడా సమయానికి మందులు తెప్పించలేకపోయారు. మందులు పుష్కలంగా అందుబాటులో ఉంచామని అధికారులు ప్రకటిస్తున్నా బడ్జెట్ ప్రకారం సమయానికి మందులను కూడా పొందలేని పరిస్థితిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారు. -
మాత్రలు వికటించి..
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఐరన్ ట్యాబ్లెట్లు వికటించి దాదాపు 30 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో పాటు నందిమండలం పీహెచ్సీ వైద్యులు పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రి మండలం నందిమండలం జిల్లా పరిషత్ ైెహ స్కూల్లో శనివారం ఉద యం 11 గంటలకు పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్ఎం కేశవ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇచ్చారు. మాత్రలు తిన్న కొద్ది సేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. కొందరు కడుపునొప్పితో మరికొందరు వాంతులతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు మహ్మద్ రఫీ, నందిమండలం పీహెచ్సీ వైద్యుడు మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు ఇంజెక్షన్‌తో పాటు ఓఆర్ఎస్ ద్రావణం ఇచ్చారు. చెన్నూరు క్లస్టర్ వైద్యుడు ఇబ్రహీం, తహశీల్దార్ వేదనాయకం, వీఆర్వో సాంబశివారెడ్డి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. తాము ఇంటిదగ్గరే టిఫిన్ చేసినట్లు విద్యార్థులు చెప్పడంతో ఐరన్ మాత్రలు ఇచ్చినట్లు ఇన్చార్జి హెచ్ఎం కేశవ పేర్కొన్నారు. ఉదయం ఇవ్వడం వల్లనే... పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రతి గురువారం భోజనం చేసిన తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది. గురువారం విద్యార్థులు తక్కువగా ఉన్నారని శనివారం ఉదయం 11 గంటలకు ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. అన్నం తినకుండా ఖాళీ కడుపుతో మాత్రలు తీసుకోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీహెచ్సీ వైద్యుడు మాధవరెడ్డి ఏమంటున్నారంటే... విద్యార్థులు అన్నం తిన్న తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఉదయం 11 గంటలకే మాత్రలు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. వైద్యసేవలు అందించడంతో విద్యార్థులు కోలుకున్నారు. నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది ఇన్ఛార్జ్ హెచ్ఎం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఇవ్వాల్సిన మాత్రలు ఉదయమే ఇచ్చారు. ఇది ముమ్మాటికి నిర్లక్షమే. - వెంకటసుబ్బయ్య, విద్యార్థి తండ్రి, నంది మండలం -
మెరుగైన వైద్యసేవలందించండి
కడప రూరల్, న్యూస్‌లైన్: సరైన వైద్యసేవలు అందిస్తేనే ప్ర భుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తారని వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైవీ అనురాధ అన్నారు. రాబోవు మూడేళ్లలో జిల్లాలో పునరుత్పత్తి, మాతాశిశు యువత ఆరోగ్య సంరక్షణకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాను 30 శాతం అదనపు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. సోమవారం స్థానిక హరిత హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో పునరుత్పత్తి, యువత ఆరోగ్య సంరక్షణ, ప్రణాళిక రూపకల్పనపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించి దేశంలో 184 జిల్లాలు ఎంపిక కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జిల్లాలను ఎంపిక చేశారన్నారు. అందులో వైఎస్ఆర్ జిల్లా ఒకటని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తల్లుల మరణాల శాతం 6.9 శాతం తగ్గిందన్నారు. ఆరోగ్య ప్రణాళికల రూపకల్పనలో భాగంగా మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కుటుంబ నియంత్రణ పరిధిలోకి తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరాలను కూడా అంశాలుగా చేర్చాలన్నారు. కార్మిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది సరైన వైద్యసేవలు అందిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా లేబర్ రూములో మరిన్ని వసతులు పెంచాలన్నారు. నిధులు సద్వినియోగమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఆశావర్కరు,్ల గ్రామ సమాఖ్య సంఘాలు చైతన్యపరచడం ద్వారా భ్రూణ హత్యల నిరోధానికి కృషి చేయాలన్నారు. పేదవారి ఇళ్లల్లోనే చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు- కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పునరుత్పత్తి, మాతా శిశు, యువత ఆరోగ్య సంరక్షణ క్రింద జిల్లా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. పల్లె పిలుపు కార్యక్రమంలో మొదటి రెండు అంశాలుగా వైద్యం, ఆరోగ్యం అంగన్వాడిలను సమీక్షిస్తున్నామన్నారు. పేదవారి ఇళ్లల్లో మాత్ర మే పిల్లలు ఎందుకు చనిపోతున్నారో దృష్టి లో ఉంచుకొని డాక్టర్లు వైద్యసేవలు అందించాలన్నారు. మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, డీఆర్డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు. రిమ్స్ సందర్శన: కడప అర్బన్ : రిమ్స్‌లో చిన్న పిల్లల వైద్య సేవలను మెరుగు పరచాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వైవీ అనురాధశర్మ రిమ్స్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో పర్యటించిన ఆమె సాయంత్రం రిమ్స్‌ను సందర్శించారు. నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఎన్ ఐసీయూ యూనిట్‌ను పరిశీలించారు. కాన్పుల విభాగంలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలన్నారు. -
రూపాయి ఖర్చు లేకుండా వైద్యం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ‘ఇటీవల మా బృందం రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడి ఆసుపత్రుల్లో పేద రోగి ఓపీ టికెట్ తీసుకుంటే చాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 350 రకాల మందులు అన్నీ ఆసుపత్రిలోనే సమకూరుతున్నాయి. ఒక్క రూపాయి ఖర్చులేకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వైద్య సేవలు అందుతున్నాయి. అందుకే మన రాష్ట్రంలోనూ ఇలాంటి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం’ అని వైద్య విద్య రాష్ట్ర సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ కె.వెంకటేష్ చెప్పారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రేడియాలజీ విభాగంలో రెండు 500 ఎంఏ ఎక్స్‌రే యూనిట్ ప్లాంట్లు, కార్డియాలజీ విభాగంలో డైకామిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ కె. వెంకటేష్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఇక్కడి వైద్యులతో మాట్లాడి అవసరమైన పరికరాలు, సౌకర్యాలపై నివేదిక తీసుకున్నట్లు చెప్పారు. ఆ మేరకు సౌకర్యాలను సమకూరుస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే మూడు, నాలుగు వారాల సమయం పడుతోందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న కొన్ని గంటల్లోపే రిపోర్ట్ చేతికి అందేలా చూస్తామన్నారు. ఇందుకోసం ఆసుపత్రిలో అదనంగా అత్యాధునిక ఎంఆర్ఐ, సీటీస్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో మల్టిపుల్ అనలైజర్ పరికరాన్ని ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తద్వారా అన్ని రకాల హార్మోన్ టెస్ట్‌లు నిర్వహించే వీలుంటుందన్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం రోగులు అటూఇటూ తిరగకుండా కామన్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఆసుపత్రి, కళాశాలలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ యేడాది ప్రధానంగా వైద్యశాలలో వ్యాధి నిర్ధారణ పరికరాలు, పీజీ సీట్ల పెంపుపైనే దృష్టి సారించామన్నారు. తాను మరోసారి పర్యటనకు వచ్చేలోపు పరికరాలన్నీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైద్యశాలలో పీజీ, హౌస్సర్జన్ల వసతి గృహాల ఆధునీకరణకు నిధులు విడుదల చేస్తామని.. ప్రతి ఒక్కరూ వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రేడియాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్తమాలజీలలో అదనపు పీజీ సీట్లకు డీఎంఈ విశేష కృషి చేశారని అభినందించారు. త్వరలో సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లోనూ డీఎం సీట్లను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో డీఎం సీట్ల మంజూరు, పరికరాల కొరత తీర్చాలని కోరారు. కళాశాల పూర్వ విద్యార్థిగా డీఎంఈ కె.వెంకటేష్ ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ నరసింహరావు, ప్రభాకర్‌రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ జిక్కి, వైద్యులు జోజిరెడ్డి, పి.చంద్రశేఖర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ చేస్తే.. సాయం
సాక్షి,న్యూఢిల్లీ: చలితో వణుకుతూ అపాయకరస్థితిలో ఎవరైనా రోడ్లపక్కన, ఫుట్‌పాత్‌లపై కనిపిస్తే ‘మనకెందుకులే..’ అనుకోకుండా ఒక్క ఫోన్‌కాల్ చేస్తే ఆ బాధితుడి ప్రాణాలు నిలపవచ్చు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాట్స్ అంబులెన్స్‌లు మీరు ఫోన్ చేసిన నిమిషాల్లో అక్కడి వచ్చి అవసరమైన వైద్యసాయం అందిస్తాయి. పరిస్థితి బట్టి శరణార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ల వరకు తరలిస్తారు. చలికారణంగా ఢిల్లీలోని అనాథలు మరణించ కుండా చూడడం క్యాట్స్అంబులెన్స్ (సెంట్రలై జ్డ్ అంబులెన్స్ ట్రామా సర్వీస్-సీఏటీఎస్) సిబ్బంది ముఖ్యవిధి. క్యాట్స్ సిబ్బంది చెబుతున్న ప్రకారం రాత్రి చలిలో ఫుట్‌పాత్‌లపై పడుకునే నిరాశ్రయులకు అవసరమైన వైద్యసహాయం అందించడంతోపాటు వారిని దగ్గర్లోని నిరాశ్రయుల శిబిరాలకు తరలించడం వీరి ముఖ్య విధుల్లో ఒకటి. ఎవరు 102కి ఫోన్ చేసినా తాము స్పందించి అక్కడికి చేరుకుంటామని వారు పేర్కొంటున్నారు. అందుబాటులో 150 అంబులెన్స్‌లు: ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం 150 క్యాట్స్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. వీటన్నింటినీ 102 అత్యవసర నంబర్‌కు అనుసంధానం చేశారు. ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ఈ అంబులెన్స్‌లు రోగులతోపాటు రోడ్డు ప్రమాదాల బారిన పడినవారిని సైతం ఆస్పత్రులకు చేరవేస్తుంటాయి. గర్భిణులను ఆస్పత్రులకు చేర్చడం, ప్రసవం అనంతంర ఇళ్లకు తీసుకెళ్లడం వంటి సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో అమలు: చలికాలంలో ఢిల్లీలో నిరాశ్రయులైన అనాథలు చలికి వణుకుతూ మరణి స్తున్న కేసులు పెరగడంతో ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకుని వారి సంరక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చలి కారణంగా ఎవరైనా అనాథ మరణిస్తే దానికి ఢిల్లీ నగర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలతో ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 150 వరకు రాత్రిపూట వసతి శిబిరాలను ఏర్పాటు చేశారు. అనాథలకు రక్షణ కల్పించడంలో భాగంగానే ప్రభుత్వం క్యాట్స్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. -
నత్తనడకన హెల్త్‌కార్డుల నమోదు ప్రక్రియ
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్య కార్డుల్లో ఉద్యోగుల వివరాలు నమోదు కార్యక్రమం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. హెల్త్‌కార్డుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది. హెల్త్‌కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకునేందకు ఉద్యోగులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు ప్రమేయం లేని వైద్యం కోసం హెల్త్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 22 వేల మంది పెన్షనర్లు, సుమారు 17 వేల మంది ఉపాధ్యాయులున్నారు. వీరందరికీ హెల్త్‌కార్డులు వర్తిస్తాయి. హెల్త్‌కార్డుల్లో వైద్య పరిమితిని రూ. 2 లక్షలకు కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఉద్యోగులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిమితిని తొలగించమని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉద్యోగులు మాత్రం హెల్త్‌కార్డుల కోసం వివరాల నమోదుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెన్షనర్లు మాత్రం హెల్త్‌కార్డుల కోసం వివరాల నమోదులో బిజీగా ఉన్నారు. మార్గదర్శకాలపై అయోమయం హెల్త్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లోపించడంతో అంతా గందరగోళంగా ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం సంబంధిత డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్)లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉండగా వీరికి ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. ఈ హెల్త్‌కార్డులతో ఏ వైద్యశాలలో వైద్యం చేయించుకోవాలో నిర్దేశించలేదు. ఈ నెల 25 నాటికి అందరికీ తాత్కాలిక హెల్త్‌కార్డులు జారీచేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. హెల్త్‌కార్డుల కోసం ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఆసలు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. పెన్షనర్లుకు సంబంధించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు పీపీవో (పెన్షన్ పేమెంట్ ఆర్డర్) నంబర్ తప్పనిసరి. అయితే పెన్షనర్ల పీపీవో నంబర్లన్నీ వెబ్సైట్లో ముందుగా నమోదు చేయకపోవడంతో ఇబ్బంది తలెత్తింది. అదేవిధంగా మండలాల్లో, హైస్కూళ్లలో ఉపాధ్యాయులందరి వివరాలు వెబ్సైట్లో పొందుపరచకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడంలేదు. ఈ విషయంలో ప్రభుత్వం కేవలం ఉత్తర్వులు జారీ చేసి వివరాలను గాలికి ఒదిలేయడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పథకం వర్తించేవారు వీరు.. రాష్ట ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, రాష్ట్రీకరణ (ప్రొవిన్సలైజ్) చేయబడిన స్థానిక సంస్థల ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, పునర్నియామకం పొందిన సర్వీసు పెన్షనర్లు, ఆధారిత కుటుంబ సభ్యులు హెల్త్‌కార్డులకు అర్హులు. జీవనం కోసం ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత లేదా జన్మనిచ్చిన వారిలో ఒకరు), పురుష ఉద్యోగి విషయంలో చట్టబద్ధమైన భార్య, మహిళా ఉద్యోగి విషయంలో ఆమె భర్త, ఫ్యామిలీ పెన్షనర్ల ఆధారితులు, నిరుద్యోగులైన అవివాహిత, వితంతు, విడాకులు పొందిన ఒంటరి కుమార్తెలు, 25 ఏళ్లలోపు నిరుద్యోగ కుమారులు, ఉద్యోగానికి పనికిరాని వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు అర్హులు. ఇన్ పేషెంట్ చికిత్స ఈ పథకం ద్వారా జాబితాలో పేర్కొనబడిన వ్యాధులకు నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఇన్‌పేషెంట్ చికిత్స అందిస్తారు. హాస్పిటల్స్ జాబితా కోసం ఠీఠీఠీ.్ఛజిజ.జౌఠి.జీ వెబ్సైట్ చూడవచ్చు. శస్త్రచికిత్స అనంతర వైద్యం కూడా అందిస్తారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టుకు సంబంధించిన ఆరోగ్యమిత్ర రోగికి అవసరమైన సహకారం అందిస్తారు. నెట్వర్క్ హాస్పిటల్ సిబ్బంది ఒకరు సంధానకర్తగా వ్యవహరిస్తారు. చికిత్స ఖర్చు ఒక్కసారికి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా చికిత్స పొందవచ్చు. ఏదైనా సందర్భంలో చికిత్సకు అయ్యే ఖర్చు రూ.2 లక్షలు దాటినప్పటికీ చికిత్స కొనసాగుతుంది. 2 లక్షలు దాటిందని చికిత్స చేసేందుకు నిరాకరించే అవకాశం హాస్పిటల్స్‌కు లేదు. ఇంతకు ముందే పేర్కొన్న ప్యాకేజీ రేట్లలో చికిత్స ఖర్చురూ.2 లక్షలకు మించి పేర్కొని ఉంటే అటువంటి చికిత్సలకు రూ.2 లక్షల వరకు మాత్రమే అనే నిబంధన వర్తించదు. రూ.2 లక్షల నిబంధనను తొలగించి పరిమితి లేని వైద్యం అందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నమోదు చేసే విధానం దరఖాస్తులను ఈ-ఫారం ద్వారా ఆన్లైన్లో పంపించాలి. దీని కోసం www.ehf.gov.in వైబ్‌సైట్ ద్వారా పంపించాలి. ప్రతి ఉద్యోగికి ట్రెజరీ ఎంప్లాయి కోడ్ యూజర్ ఐడీగా ఉంటుంది. పాస్‌వర్డ్‌ను డీడీవోలు ఇస్తారు. పాస్వర్డ్ ప్రకారం వెబ్సైట్లోకి ప్రవేశించాలి. ఉద్యోగి కావాలంటే పాస్వర్డ్ మార్చుకోవచ్చు. వెబ్సైట్లోకి ప్రవేశించిన తరువాత తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి. పూర్తి సమాచారానికి ఉద్యోగే బాధ్యత వహించాలి. నమోదు పూర్తయిన తరువాత ప్రింట్ తీసుకుని సరిచూసుకోవాలి. తప్పులుంటే సరిచేసి మళ్లీ ప్రింట్ తీసుకోవాలి. ఈ-ఫారంతో జత చేయాల్సినవి.. పైన తెలిపిన ప్రింట్‌పై సంతకం చేసి స్కాన్ చేసి ఈ-ఫారానికి జత చేయాలి. ఉద్యోగి మరియు కుటుంబ సభ్యులందరి పాస్‌పోర్టు సైజ్ డిజిటల్ ఫొటోలు జతపరచాలి. ఉద్యోగి సేవా పుస్తకం (పాత సేవా పుస్తకం అయితే 1, 2 పేజీలు, కొత్త సేవా పుస్తకం అయతే 4, 5 పేజీలు) స్కాన్ చేసి జతపరచాలి. ఆధార్ కార్డు లేదా ఆధార్ నమోదు రసీదు జతపరచాలి. ఈ-ఫారంకు ఈ పత్రాలన్నీ జతపర్చి ఆన్లైన్లో సమర్పించాలి. ఒక్కసారి ఆన్లైన్లో సమర్పించిన తరువాత (తిరస్కరించబడితే తప్ప) తిరిగి మార్పులు చేసుకునే అవకాశం లేదు. దరఖాస్తు అంగీకరించిన, లేదా తిరస్కరించిన విషయం ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది. -
తాండూరులో ‘ట్రామాకేర్’
తాండూరు, న్యూస్‌లైన్: ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు తాండూరులోని ప్రభు త్వ జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంట ర్ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్యవిధా న పరిషత్ రాష్ట్ర కమిషనర్ స్వర్ణనాగార్జున వెల్లడించారు. శుక్రవారం ఆమె వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ లోక్నాయక్తో కలిసి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ట్రామాకేర్ సెంటర్‌తోపాటు ఆస్పత్రిలో పది పడకల సర్జికల్ ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు మందుల స్టోర్‌రూం, ఆపరేషన్ థియేటర్, సిక్ నియోనేటల్ కేర్ యూని ట్ తదితర విభాగాలను పరిశీలించారు. ఇన్‌పేషెంట్లకు అందించే భోజనం, కూరలను కమిషనర్ రుచి చూశారు. వంటల్లో ఉప్పు అధికంగా ఉందని ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు రోజూ పాలు, భోజనంలోకి మజ్జిగ ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశించిన కొల తల ప్రకారం రుచికరమైన భోజనం అం దేలా చూడాలని ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ను ఆదేశించారు. మందుల స్టోర్ రూం రికార్డులను పరిశీలించి నిర్వహణ సరిగా లేదన్నారు. పలు విభాగాలను కమిషనర్ సెల్ఫోన్లో చిత్రీకరించారు. సర్జరీ, స్కానింగ్ సేవలు మెరుగుపడాలి సర్జరీలు, స్కానింగ్ సేవలు మెరుగుపడాలని కమిషనర్ సూచించారు. 1,200 మేజర్ సర్జరీల లక్ష్యానికి 400 మాత్రమే పూర్తి చేశారని, స్కానింగ్లూ తక్కువే చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్జరీలలక్ష్యం అధికంగా ఇచ్చారని సూప రింటెండెంట్ వెంకటరమణప్ప చెప్పగా లక్ష్యాన్ని తగ్గిస్తామన్నారు. చిన్నారుల వైద్యసేవలపై ప్రత్యేక శ్రద్ధ సిక్నియోనేటల్ కేర్ యూనిట్లో తక్కువ బరువు, ఇతర సమస్యలు ఉన్న చిన్నారులకు వైద్యం అందించడంలో శ్రద్ధ చూపాలని కమిషనర్ ఆదేశించారు. చికిత్స పొందుతున్న 13మంది చిన్నారులను పరిశీలించారు. వారికి అందించే సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా ఆస్పత్రికి నిధులు సమకూరుతాయన్నారు. ట్యూబెక్టమీ, కాన్పుల సేవలు బాగున్నాయని కమిషన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ సెంటర్ ఆధునికీరణకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఐదుగురే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని వైద్యులు జయప్రసాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బ్లడ్ బ్యాంక్.. ఆస్పత్రి తనిఖీ అనంతరం కమిషనర్ మాట్లాడుతూ త్వరలోనే బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. లెసైన్స్ రాకపోవడమే బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటులో జాప్యానికి కారణమని, తాండూరు ఆస్పత్రిలో పనిచేయడానికిై వెద్యులు ఆసక్తిచూపడం లేదని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో జీతా లు తీసుకుంటూ ఇద్దరు వైద్యులు డిప్యూటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్న అంశాన్ని పరిశీలిస్తానన్నారు. స్థల సమస్య వల్ల 150 పడకల మాతాశిశు ఆస్పత్రి ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. -
అస్వస్థతకు గురై...
కడప అర్బన్, న్యూస్‌లైన్ : చెన్నై నుంచి ముంబైకి వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-7 బోగీలో ప్రయాణిస్తున్న ఎంఎస్ వీణా (32) తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకు చెందిన వీణా తన తండ్రి శేషాద్రి , సోదరుడు బాలాజీతో కలిసి మంగళవారం ఉదయం చెన్నై నుంచి ముంబైకు వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదే రారు. వీరు మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. రే ణిగుంటలో మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో పాటు వీణా ఆహారం తీసుకుంది. నందలూరుకు వచ్చే సమయానికి ఊపిరాడక, వాంతులకు గురై అస్వస్థత అయింది. కడపలోని రైల్వే అధికారులకు సమాచారం రాగా కడపలో 3వ నంబరు ప్లాట్‌ఫారంకు రైలు వచ్చి నిలబడగానే ఎస్-7 బోగీ వద్దకు రైల్వే అధికారులు చేరుకున్నారు. బాధితురాలికి వైద్య సహాయం అందించేందుకు స్ట్రెచర్‌పై బయటకు తీసుకు వచ్చారు. రైల్వే డాక్టర్, 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో రెండు నెలల్లో వీణాకు వివాహం కావాల్సి ఉందని, ఉన్నట్లుండి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మృతురాలి బంధువులు బోరున విలపించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ పీవీ రమణ, సిబ్బంది, ఆర్పీఎఫ్ పోలీసులు, అధికారులు బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు స్టేట్మెంట్ రికార్డు చేసి మృతదేహాన్ని వారికి అప్పగించారు. -
భారత్‌కు తిరిగొచ్చిన సోనియా
న్యూఢిల్లీ: సాధారణ వైద్య పరీక్షల కోసం ఈ నెల 2న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు. కుమార్తె ప్రియాంకాగాంధీతో కలిసి సోనియా అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్లారు. కాగా, ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో ప్రమేయమున్న పార్టీ నేతలను కాపాడుతున్నారనే ఆరోపణలపై సోనియాపై న్యూయార్క్ కోర్టులో దాఖలైన కేసుకు సంబంధించిన సమన్లను ఆమెకు పిటిషనర్లు పంపారు. న్యూయార్క్‌లో సోనియా చేరిన స్లోన్-కెట్టరింగ్ మెమోరియల్ ఆస్పత్రి నైట్‌షిఫ్ట్ సూపర్వైజర్కు సమన్ల కాపీ, ఫిర్యాదు, కోర్టు ఉత్తర్వులను అందించినట్లు సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రతినిధులు తెలిపారు. వాటిని సోనియాకు ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు. -
నేడు ఢిల్లీకి సోనియా రాక
న్యూఢిల్లీ: వైద్య పరీక్షలకుఈ నెల 2న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం ఢిల్లీ చేరుకోనున్నారు. సోనియాకు 2011, ఆగస్టు 5న అమెరికాలో శస్త్ర చికిత్స జరగడం తెలిసిందే. అయితే, గత నెల ఆగస్టులో ఆహార బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంలో తీవ్ర అలసట, ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన సోనియాను ఎయిమ్స్‌కు తరలించారు. తర్వాత, సెప్టెంబర్ 2న ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. -
అమెరికాకు వెళ్లిన సోనియా గాంధీ!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం మధ్యాహ్నం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఎనిమిది రోజుల తర్వాత భారత్ కు తిరిగి వస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. సోనియా గాంధీ వెంట కూతురు ప్రియాంక వాద్రా ఉన్నారు. ఆరు నెలలకు ఒకసారి జరిగే వైద్య పరీక్షల కోసం సోనియా అమెరికా వెళ్లారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. వాస్తవానికి సోనియా గత సంవత్సరం సెప్టెంబర్ లోనే వెళ్లాల్సి ఉంది అని.. అయితే కొన్ని కీలక సమావేశాల కారణంగా వాయిదా పడిందని ద్వివేది వెల్లడించారు. మళ్లీ వారం రోజుల తర్వాత భారత్ కు తిరిగి వస్తారన్నారు. ఆహర భద్రత బిల్లు చర్చ సందర్భంగా లోకసభలో సోనియాగాంధీ ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. -
వైద్య పరీక్షల కోసం నేడు అమెరికాకు సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు ఆదివారం చెప్పారు. వైద్య చికిత్స కోసం ఆమె సోమవారం సాయంత్రం అమెరికా వెళ్లనున్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా, ఈ విషయం చెప్పిన పార్టీ నేత, మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చికిత్స కోసం సోనియా అమెరికా బయలుదేరడం గత ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. 2011 ఆగస్టులో ఆమె అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా, లోక్‌సభలో ఆగస్టు 26న ఆహార బిల్లుపై ఓటింగు జరుగుతున్న సమయంలో అస్వస్థతకు గురైన సోనియా, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. -
వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లనున్న సోనియా గాంధీ!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం అమెరికాకు వెళ్లనున్నారని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తమే సోనియా అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. మిగితా వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. గత ఆరునెలల్లో సోనియా అమెరికాకు వెళ్లడం ఇది రెండవసారి. వైద్య పరీక్షల నిమిత్తం 2011 ఆగస్టులో, గత సంవత్సరం సెప్టెంబర్ 2 తేదిన, గత ఫిబ్రవరిలో సోనియా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా అనారోగ్యానికి లోనవ్వడంతో ఆగస్టు 26 తేదిన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు గంటల వైద్య పరీక్షల తర్వాత సోనియాను డిశ్చార్జి చేశారు. -
వైఎస్ జగన్ గ్లూకోజ్ తీసుకోవడం అత్యవసరం: మహ్మద్ రఫీ
-
వైఎస్ జగన్ గ్లూకోజ్ తీసుకోవడం అత్యవసరం: మహ్మద్ రఫీ
హైదరాబాద్: రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ ఆగస్టు 24వ తేదీ సాయంత్రం నుంచి 126 గంటలుగా చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష భగ్నానికి పోలీసులు గురువారం ప్రయత్నించారు. రాత్రి 11.58 గంటలకు ఆయనను బలవంతంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోనే జగన్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఉస్మానియా డాక్టర్ అశోక్ కుమార్ నేతృత్వంలో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు బీపీ 140/80, 60 ఎంజీ కి పడిపోయాయి. షుగర్ లెవెల్, పల్స్ రేట్ 86కి పడిపోయాయి. ఆస్పత్రిలో జగన్ కు ఎంఎల్సీ 23528 నెంబరును డాక్టర్లు కేటాయించారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. ఓపీ బిల్డింగ్‌లోని ఏఎంసీయూ 116 నెంబర్ గదిలో జగన్ కు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈసీజీ లో స్వల్ప తేడాలున్నట్టు వైద్యులు తెలిపారు. ఎనిమిది మంది డాక్టర్ల బృందంలో జగన్ కు వైద్యం అందిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని ఉస్మానియా ఆర్ఎంవో డాక్టర్ మహ్మద్ రఫీ పేర్కొన్నారు. గ్లూకోజ్ తీసుకోమని తాము కోరినా జగన్ తిరస్కరిస్తున్నారనిన్నారు. జగన్ గ్లూకోజ్ తీసుకోవడం అత్యవసరమని ఆయన తెలిపారు. పోలీసులు, తాము ఎంతకోరినా ఆయన వైద్యానికి అంగీకరించటలేదని చెప్పారు. కీటోన్ బాడీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అయితే వైఎస్ జగన్ కు అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని, ఇంకా రిపోర్ట్లు రావాల్సి ఉందని మహ్మద్ రఫీ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకో 24 గంటల వరకు ఏం చెప్పలేమని ఆర్ఎంవో మహ్మద్ రఫీ చెప్పారు. -
వరదల సమయంలో జాడలేని వైద్యులు..
కూనవరం, న్యూస్‌లైన్: అతిసార వ్యాధికి గురై మండలంలోని టేకులబోరుకు చెందిన ఎడ్ల వేదవతి(40) మంగళవారం తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం.. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వేదవతిని తొలుత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో చుట్టూ వరద నీరు ఉన్నప్పటికీ నాటు పడవ ద్వారా సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోని వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ చికిత్స చేసినప్పటికీ అతిసార అదుపులోకి రాలేదు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. వరదల సమయంలో తప్పని సరిగా ఉండాల్సిన వైద్యులు విధుల్లో లేకపోవడం వల్లే మెరుగైన చికిత్స అందలేదని, ఈ కార ణంగానే వేదవతి మృతి చెందిందని ఆమె బంధువులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వరదల సమయంలో ప్రతి అధికారి స్థానికంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మండలంలో ఇది మూడవ కేసు కావడంతో వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.