టాటా సన్స్ ఛైర్మన్ రతన్‌టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర ఆనారోగ్య పరిస్థితుల వల్ల రతన్‌టాటా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనరల్ చెక్-అప్‌ల కోసం హాస్పటల్‌కు వచ్చానని చెప్పారు. ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా ఉన్న టాటాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- టాటా గ్రూప్‌ను 1868లో 'జమ్‌సెట్‌జీ నుస్సర్వాన్‌జీ టాటా' (జంషెడ్‌జీ) ప్రారంభించారు. ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
- కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.30 లక్షల కోట్ల పైమాటే.
- రతన్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు.
- ఆయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.
- రతన్ టాటా క్యాంపియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు.
- ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.
- రతన్ టాటా ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాలు రాశారు.
- 86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. ప్రేమలో విఫలం అయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.
- పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకు లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు.
- తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు.
- టాటాకు సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.
- రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు.
- ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోతున్నారు.
ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!
టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అందుకు సంబంధించిన వార్తలుకాస్తా వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment