ఎవరికైనా అప్పు ఇచ్చారా..? తిరిగి చెల్లించడం లేదా..? అయితే కింద తెలిపిన విధంగా చేస్తే దాదాపు మీ డబ్బు తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు మీరు డబ్బు ఇచ్చినట్లు రుజువులు మాత్రం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు స్టేట్‌మెంట్ వంటి ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఒకవేళా గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్ చేసినా బ్యాంక్ ఇంటర్‌నెట్ సర్వీస్ ద్వారా స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు.
అప్పు ఇచ్చాక చెప్పిన సమయానికి తిరిగి చెల్లించకుండా చాలామంది కాలయాపన చేస్తూంటారు. అలాంటి సందర్భంలో అప్పు తీసుకున్నట్లు మీ వద్ద ఉన్న రుజువులతో లీగల్‌గా అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపవచ్చు. దాంతో చాలా వరకు ఆ లీగల్ నోటీసుకు బయపడి మీ అప్పు తీర్చే అవకాశం ఉంటుంది. అయితే కొందరు అలా నోటీసులు స్వీకరించినా అప్పు చెల్లించరు.
ఇదీ చదవండి: భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!
లీగల్ నోటీసులు అందుకుని అప్పు చెల్లించని వారికోసం మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. స్టేషన్ ద్వారా మనీసూట్‌ను పంపించాలి. అప్పు తీసుకున్న వారు దానికి స్పందించకపోతే కోర్టు ద్వారా తమను అదుపులోకి తీసుకుని వివరణ కోరే అవకాశం ఉంటుంది. అయితే అసలు అప్పు ఇవ్వడమే ఖర్చు..మళ్లీ పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాలంటే అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అలాంటి వారు మనీసూట్‌లో అందుకు అయ్యే ఖర్చును సైతం పొందేలా వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ కోర్టులో కేసు గెలిస్తే అప్పుతోపాటు దాని రికవరీకి అయిన ఖర్చును సైతం తిరిగి చెల్లించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment