law suit
-
ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!
ఎవరికైనా అప్పు ఇచ్చారా..? తిరిగి చెల్లించడం లేదా..? అయితే కింద తెలిపిన విధంగా చేస్తే దాదాపు మీ డబ్బు తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు మీరు డబ్బు ఇచ్చినట్లు రుజువులు మాత్రం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు స్టేట్మెంట్ వంటి ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఒకవేళా గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్ చేసినా బ్యాంక్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా స్టేట్మెంట్ తీసుకోవచ్చు.అప్పు ఇచ్చాక చెప్పిన సమయానికి తిరిగి చెల్లించకుండా చాలామంది కాలయాపన చేస్తూంటారు. అలాంటి సందర్భంలో అప్పు తీసుకున్నట్లు మీ వద్ద ఉన్న రుజువులతో లీగల్‌గా అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపవచ్చు. దాంతో చాలా వరకు ఆ లీగల్ నోటీసుకు బయపడి మీ అప్పు తీర్చే అవకాశం ఉంటుంది. అయితే కొందరు అలా నోటీసులు స్వీకరించినా అప్పు చెల్లించరు.ఇదీ చదవండి: భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!లీగల్ నోటీసులు అందుకుని అప్పు చెల్లించని వారికోసం మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. స్టేషన్ ద్వారా మనీసూట్ను పంపించాలి. అప్పు తీసుకున్న వారు దానికి స్పందించకపోతే కోర్టు ద్వారా తమను అదుపులోకి తీసుకుని వివరణ కోరే అవకాశం ఉంటుంది. అయితే అసలు అప్పు ఇవ్వడమే ఖర్చు..మళ్లీ పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాలంటే అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అలాంటి వారు మనీసూట్లో అందుకు అయ్యే ఖర్చును సైతం పొందేలా వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ కోర్టులో కేసు గెలిస్తే అప్పుతోపాటు దాని రికవరీకి అయిన ఖర్చును సైతం తిరిగి చెల్లించాల్సిందే. -
టైగర్‌వుడ్స్‌పై మాజీ గర్ల్‌ఫ్రెండ్ పరువునష్టం దావా
గోల్ఫ్ రారాజు టైగర్‌వుడ్స్‌పై పరువు నష్టం దావా దాఖలైంది. అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎరికా హెర్మన్ దాదాపు 30 మిలియన్ డాలర్ల కింద పరువునష్టం దాఖలు చేసినట్లు ఆమె తరపు లాయర్ వెల్లడించాడు. 2017లో టైగర్‌వుడ్స్, ఎరికా హెర్మన్ల మధ్య మొదలైన రిలేషిన్షిప్ 2022 వరకు కొనసాగింది. అయితే రిలేషన్షిప్ ప్రారంభంలో ఎరికా హెర్మన్, టైగర్‌వుడ్స్ మధ్య నాన్డిస్క్లోజర్ ఒప్పందం జరిగింది. తాజాగా ఈ ఒప్పందం నుండి తనను విడుదల చేయాలని కోరుతూ దావా వేసింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఫైలింగ్స్ చూపించింది. ఫ్లోరిడాలోని మార్టిన్ కౌంటీలోని 19వ జ్యుడీషియల్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ కోర్టులో అభ్యర్థనను దాఖలు చేసింది. ఏఎఫ్‌పీ చూసిన కోర్టు రికార్డుల ప్రకారం, స్పీక్ అవుట్ యాక్ట్ అని పిలువబడే యూఎస్ ఫెడరల్ చట్టం ప్రకారం ఆమె సంతకం చేయాల్సిన ఎన్డీఏ "చెల్లదు మరియు అమలు చేయలేనిది" అని హర్మన్ తరపు న్యాయవాదులు వాదించారు. 2022 చివరి వరకు తన ఫ్లోరిడా మాన్షన్‌లో 15 సార్లు విజేత అయిన టైగర్ వుడ్స్‌తో ఎరికా హెర్మన్ కలిసి ఉంది. చదవండి: 'గతంలో వచ్చిన రెండుసార్లు డ్రింక్స్ మోశాను.. సెంచరీ విలువైనది' మాజీ క్రికెటర్ ఇంట్లో దొంగతనం.. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ -
40 కోట్లు చెల్లించాలంటూ దిగ్గజం మైక్ టైసన్‌పై సివిల్ దావా
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తనకు 5 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఒక మహిళ కోర్టులో సివిల్ దావా వేయడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. 1992లో లిమోసిన్ నగరంలో ఒక పబ్‌లో 18 ఏళ్ల మోడల్‌పై బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అత్యాచారం కేసులో దోషిగా తేలిన టైసన్ మూడు సంవత్సరాలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. తాజాగా ఈ కేసులో పౌర నష్టపరిహారాన్ని కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం సదరు మోడల్.. కోర్టులో సివిల్ దావా సమర్పించారు. 1992లో నైట్‌క్లబ్‌లో మైక్ టైసన్‌ను కలిసినప్పుడు ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె తన సివిల్ దావాలో పేర్కొంది. టైసన్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను శారీరకంగా, మానసికంగా బాధపడుతూనే ఉన్నానని బాధిత మోడల్ చెప్పారు. తనకు 5మిలియన్ డాలర్ల( సుమారు రూ. 40 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. ఇక 1966వ సంవత్సరంలో బ్రూక్లిన్ నగరంలో జన్మించిన టైసన్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా అవతరించాడు. బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌గా నిలిచిన మైక్ టైసన్ పంచ్‌ల దాటికి ప్రత్యర్థులు వణికిపోయేవారు. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! బుమ్రా విషయంలో రోహిత్ శర్మ కీలక అప్డేట్ -
ఒప్పంద ఉల్లంఘన.. చిక్కుల్లో ఎలన్ మస్క్!
డోవర్: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించి.. ఆయన వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఆయన అధికారిక విచారణ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు డెలావేర్(యూఎస్ స్టేట్) కోర్టుకు ట్విటర్ సమర్పించిన ఒక నివేదిక గురువారం బహిర్గతమైంది. ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విటర్ కొనుగోలుకు సంబంధించి వ్యవహారంలో ఫెడరల్ అధికారులు విచారణలో ఉన్నారు అని మైక్రోబ్లాగింగ్ సైట్ తరపు న్యాయవాది అక్టోబర్ 6వ తేదీన సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. అంతేకాదు.. మస్క్ తరపు న్యాయవాదులు, ఫెడరల్ అధికారులకు సహకరించాలని నెలల తరబడి అభ్యర్థించినప్పటికీ.. సానుకూలంగా స్పందించలేదని ట్విట్టర్ కోర్టుకు నివేదించింది. బంతిని దాచిపెట్టే ఈ ఆట ముగియాలి అంటూ ఆసక్తికరంగా ట్విటర్ ఆ ఫైలింగ్‌లో పేర్కొంది. Tesla CEO ఎలన్ మస్క్ ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చి.. సంచలనానికి తెర లేపాడు. అయితే జులైలో నకిలీ-స్పామ్ ఖాతాల సంఖ్య గురించి ఆందోళనలతో ఒప్పందానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి మరో సంచలనానికి దారి తీశాడు. అయితే.. ట్విటర్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఒప్పందాన్ని బలవంతం చేసే ప్రయత్నంలో భాగంగా.. సదరు బిలియనీర్‌పై దావాతో ప్రతిస్పందించింది. ఇదీ చదవండి: ఈ వేస్టు దడ పుట్టిస్తోందిగా! -
కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్ డాలర్లు చెల్లించండి'
అమెరికన్ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ 2020లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణవార్త అప్పట్లో క్రీడాలోకాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగాయి. దీంతో బ్రియంట్తో సహా ఆయన 13 ఏళ్ల కూతురు జియానా దుర్మరణం చెందింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో హెలికాప్టర్లో ఉన్న మరో ఎనిమిది మంది కూడా సజీవదహనమయ్యారు.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. PC: కోబ్ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ అప్పట్లో కోబ్ బ్రియాంట్ మృతిపై సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ డిప్యూటీస్ సహా అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫోటోలు తీశారు. అంతటితో ఊరుకోకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బ్రియాన్ సజీవదహనం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు బ్రయంట్ భార్య వెనెస్సాను ఎమోషన్‌కు గురిచేయడంతో పాటు మానసిక సంఘర్షణకు గురయ్యేలా చేశాయి. తన అనుమతి లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంపై లాస్ ఏంజిల్స్ కౌంటీపై కోర్టులో దావా వేసింది. తాజాగా బుధవారం దావాను పరిశీలించిన తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం.. తీర్పును వెనెస్సాకు అనుకూలంగా ఇచ్చింది. కోబ్ బ్రయంట్ భార్య సహా మిగతావాళ్లకు కలిపి లాస్ ఏంజెల్స్ కౌంటీ 31 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. వెనెస్సా బ్రయంట్ కుటుంబంతో పాటు క్రిస్ చెస్టర్, అతని భార్య సారా, కుమార్తె పేటన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో 31 మిలియన్ డాలర్స్‌లో వెనెస్సా బ్రియంట్కు 16 మిలియన్ డాలర్లు.. చెస్టర్ ఫ్యామిలీకి 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని కౌంటీకి పేర్కొంది. PC: కోబ్ బ్రియాంట్ కుటుంబం(ఫైల్ ఫోటో) ధర్మాసనం తీర్పును చదవగానే భావోద్వేగానికి గురైన వెనెస్సా బ్రియాంట్ విలేకరులతో మాట్లాడకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ కోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్త బ్రియాంట్, కూతురు జియానా ఫోటోను షేర్ చేస్తూ "ఆల్ ఫర్ యు! ఐ లవ్ యు! జస్టిస్ ఫర్ కోబ్ అండ్ జిగి!" అని క్యాప్షన్ జత చేసింది. PC: కోబ్ బ్రియాంట్(ఫైల్ ఫోటో) కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరీర్లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్ గా నిలిచారు. 2016లో ఎన్ బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్ గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్ లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు. -
ఒప్పో, వన్‌ప్లస్‌కు భారీ షాక్.. ఇకపై ఆ కంపెనీ ఫోన్లు బ్యాన్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌కి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి నోకియా ఈ రెండు కంపెనీలపై జర్మనీలోని మాన్హీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు నోకియా సంస్థకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని తీర్పునిచ్చింది. ఏంటి ఆ వివాదం.. వివరాల్లోకి వెళితే.. నోకియా సంస్థ 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై పేటెంట్ కలిగి ఉంది. అందులోని ఓ టెక్నాలజీని నోకియా అనుమతులు లేకుండానే ఒప్పో, వన్‌ప్లస్‌లు ఉపయోగించాయి. ఓ వార్తా సంస్థ ప్రకారం.. 4G (LTE), 5G టెక్నాలజీలోని పేటెంట్లపై నోకియా, ఒప్పో, వన్‌ప్లస్‌ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడంతో వారిపై న్యాయపరమైన చర్యలకు నోకియా సిద్ధమైంది. అనంతరం పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం జర్మనీ కోర్టు ఇచ్చిన తీర్పు మొదటిది. నోకియా మూడు ప్రాంతీయ జర్మన్ కోర్టులలో తొమ్మిది స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEP), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్ల విషయంలో ఒప్పోపై దావా వేసింది. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్లను నోకియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాదానికి కారణం నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలపై దావా వేసింది. అయితే ఈ తీర్పుపై ఒప్పో, వన్‌ప్లస్‌లు ఎలా ముందుకు వెళ్లనున్నాయో చూడాలి. చదవండి: మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా! -
రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులున్న ఆటగాడిగా రొనాల్డో ఎప్పుడో చరిత్ర సృష్టించాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అత్యధిక ఫాలోవర్లతో రొనాల్డో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మూడు పదుల వయసులోనూ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదంటూ యువ ఆటగాళ్లతో పోటీ పడి మరీ సాకర్ గేమ్ లో దూసుకెళ్తున్నాడు. ఫుట్‌బాల్ కెరీర్లో ఎలాంటి మచ్చ లేకుండా సాగుతున్న రొనాల్డోకు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక అత్యాచారం కేసు చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది. తాజాగా రొనాల్డోపై ఉన్న అత్యాచారం కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పును వెలువరించింది. విషయంలోకి వెళితే.. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై గత కొన్నేళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపిన లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని 42 పేజీల తీర్పులో పేర్కొంది. అదే క్రమంలో రొనాల్డో అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది. ఇక రొనాల్డో నాయకత్వంలోనే పోర్చుగల్ జట్టు ఇటీవలే ఈ ఏడాది ఖతర్ వేదికగా జరిగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వయసు రిత్యా చూస్తే రొనాల్డోకు ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్ కావొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ జట్టుకు రొనాల్డో కెప్టెన్‌గాగా వ్యవహరిస్తున్నాడు. తనకు ఆఖరిదని భావిస్తున్న 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ను ఎలాగైనా విజేతగా నిలపాలని రొనాల్డో అనుకుంటున్నాడు. అతని కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. చదవండి: బేస్‌బాల్ మ్యాచ్‌లో యువతి అర్థనగ్న ప్రదర్శన.. గెంటేసిన నిర్వాహకులు ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ -
పన్ను వివాద కేసుల ఉపసంహరణ: కెయిర్న్
న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్లుగా భారత ప్రభుత్వంతో నెలకొన్న రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ వివాదానికి ముగింపు పలికే దిశగా బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ చర్యలు తీసుకుంది. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల కోర్టుల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటినీ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించనున్నట్లు కెయిర్న్ ఎనర్జీ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీ) తెలిపింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేస్తుందని పేర్కొంది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కంపెనీకి మార్గం సుగమం అయ్యింది. ఇదీ నేపథ్యం 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అంతర్జాతీయంగా పరువు పోతుండటంతో గతేడాది ఆగస్టులో వివాదాస్పద రెట్రాస్పెక్టివ్ చట్టాన్ని కేంద్రం పక్కన పెట్టింది. -
స్మార్ట్‌వాచ్ బదులు రాయి.. నటుడికి చేదు అనుభవం
ఈ-కామర్స్ పోర్టల్స్, సంబంధిత వెబ్‌సైట్స్ అలసత్వం అయితేనేం.. డెలివరీ సిబ్బంది నిర్లక్క్ష్యం అయితేనేం కొన్నిసార్లు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒక్కోసారి ప్రొడక్టు ఒకటి అయితే.. డెలివరీ మరొకటి వస్తుండడం చూస్తుంటాం కూడా. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే అది ఒక ఫేమస్ నటుడి విషయంలో.. బ్రెజిల్ టాప్ యాక్టర్ మురిలో బెనిసియో(50).. ఈ మధ్య యాపిల్ సిరీస్ 6 స్మార్ట్‌వాచ్‌ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 530 డాలర్లు(40 వేల రూపాయలపైనే) చెల్లించాడు. అదికాస్త 12 రోజుల లేట్ డెలివరీతో ఆయన దగ్గరికి చేరింది. తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో వాచ్‌కు బదులు బండరాయి ఉంది. దీంతో రిటైల్ కంపెనీ కర్రెఫోర్ను ఆశ్రయించాడు ఆ నటుడు. అయితే కంపెనీ వాళ్లు స్పందించేందుకు నిరాకరించారట!. దీంతో కస్టమర్ల సేవలకు అభ్యంతరం తెలిపిందంటూ కర్రెఫోర్ మీద నటుడు బెనిసియో కోర్టులో దావా వేశాడు. ఒక స్టార్ హీరో, పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న సెలబ్రిటీని ఇలా ఇబ్బందిపెట్టడం సరికాదని ఆయన తరపున న్యాయవాది వాదించాడు. అంతేకాదు తాను చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ దావాలో కోరాడు. అయితే ఆయన చెల్లించిన డబ్బుతో పాటు పరిహారం కింద మరో 1,500 డాలర్లు చెల్లించేందుకు కర్రెఫోర్ అంగీకరించింది. దీంతో వివాదం ముగిసింది. సెలబ్రిటీల విషయంలోనే కాదు.. సామాన్యుల విషయంలోనూ ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలంటూ కోర్టు సదరు రిటైల్ కంపెనీని మందలించింది. ఇదిలా ఉంటే యాపిల్ 6ను కిందటి ఏడాది లాంఛ్ చేసిన యాపిల్.. ఆ తర్వాత యాపిల్ 7 రాకతో ఉత్పత్తిని ఆపేసింది. ప్రస్తుతం 7s సిరీస్‌తో పాటు, యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ సిరీస్ 3లతో అలరించేందుకు యాపిల్ సిద్ధమైంది. చదవండి: వావ్.. క్లోజప్ షాట్లో సూర్యుడు -
ఫేస్‌బుక్‌కు భారీ షాక్.. 10 లక్షల కోట్లకు దావా
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌కు భారీ షాక్ తగిలింది. రొహింగ్యా శరణార్థులు కొందరు మెటా(ఇంతకు ముందు ఫేస్బుక్) కంపెనీ ఫ్లాట్‌ఫామ్ మీద దావా వేశారు. అదీ తమ జీవితాలు నాశనం అయ్యాయని 150 బిలియన్ డాలర్ల భారీ పరిహారం కోరుతూ!. యూకే, యూఎస్‌లోని డజను కొద్దీ రొహింగ్యా శరణార్థులు.. ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా దావా వేశారు. మయన్మార్‌లో తమకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం ఫేస్బుక్ ఫ్లాట్‌ఫామ్ వేదికగానే నడిచిందని, ఆ ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్బుక్ ఘోరంగా విఫలం అయ్యిందని, పైగా తమ వర్గానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించిందనేది వాళ్ల ప్రధాన ఆరోపణ. అందుకే నష్టపరిహారం కింద మెటా కంపెనీ నుంచి 150 బిలియన్డాలర్లు(దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు పైనే) కోరుతున్నారు. యూకేకు చెందిన లీగల్ కంపెనీలు ఎడెల్సన్ పీసీ, ఫీల్డ్స్ పీఎల్‌ఎల్‌సీలు ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా ‘రొహింగ్యాల జీవితాల్ని నాశనం చేశారంటూ’ శాన్ ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా)లో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అంతేకాదు లండన్‌లోని ఫేస్బుక్ కార్యాలయానికి నోటీసులు సైతం అందించారు. ఈ మేరకు 2013లో రొహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఫేస్బుక్ ప్రచారాలను కోర్టుకు సమర్పించింది. ►మయన్మార్‌లో ఫేస్‌బుక్‌కు 2 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. సమాచారాల షేరింగ్ ద్వారానే విపరీతమైన ఆదాయం వెనకేసుకుంది ఫేస్బుక్ అక్కడ. ►2017, ఆగష్టులో మిలిటరీ ఆక్రమణ సమయంలో చెలరేగిన హింస కారణంగా లెక్కకందని మరణాలు, అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. ఊళ్లకు ఊళ్లే తగలబడిపోయాయి. సుమారు ఏడున్నర లక్షల మంది రొహింగ్యాలు దేశం విడిచిపారిపోయారు. దీనింతటికి ఫేస్బుక్ ద్వారా జరిగిన ప్రచారమేనన్నది ప్రధాన ఆరోపణ. ►ఇక 2018లో ఐరాస మానవ హక్కుల దర్యాప్తు బృందం.. హింసకు ఫేస్బుక్ ద్వారా జరిగిన ప్రచారమేనని తేల్చి చెప్పారు. ►ఓ అంతర్జాతీయ మీడియా హౌజ్ చేపట్టిన దర్యాప్తులోనూ వెయ్యికిపైగా పోస్టులు, కామెంట్లు, రొహింగ్యాల మీద దాడుల ఫొటోలు బయటపడ్డాయి. ►ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు.. ఆ ప్రాంతంలో జరిగిన నేరారోపణలపై ఒక కేసు దాఖలు చేసింది. ఈ సెప్టెంబర్‌లో అమెరికా ఫెడరల్ కోర్టు.. రొహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫేస్బుక్ అకౌంట్ల(ఆ తర్వాత ఫేస్బుక్వాటిని మూసేసింది) వివరాలను సమర్పించాలని కోరింది. ►ఈ ఏడాదిలో ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హ్యూగెన్.. అంతర్గత డాక్యుమెంట్లు లీక్ చేయడంతో పాటు పలు దేశాల్లో(మయన్మార్ విద్వేషపూరిత, హానికారక సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించింది కూడా. ►మయన్మార్ మిలిటరీ కూడా ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లతో రొహింగ్యాలకు వ్యతిరేకంగా సమాచారాన్ని వైరల్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ దావాపై ఫేస్బుక్ స్పందించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, 2018లోనే తమ వైఫల్యంపై ఒక ప్రకటన విడుదల చేసింది. మయన్మార్‌లో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో, వ్యతిరేక ప్రసంగాల్ని అడ్డుకోవడంలో కొంచెం నిదానించిన మాట వాస్తమేనని పేర్కొంది. అంతేకాదు మయన్మార్ మిలిటరీని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి నిషేధించడం కూడా కొంచెం ఆలస్యం అయ్యిందని పేర్కొంది. ►అమెరికా ఇంటర్నెట్ చట్టం సెక్షన్ 230 ప్రకారం.. యూజర్ పోస్ట్ చేసే కంటెంట్ మీద మాత్రమే ఫేస్‌బుక్‌కు నియంత్రణ ఉంటుంది. మూడో వ్యక్తి చేసే కంటెంట్‌ను నియంత్రణ చేయలేదు. అయితే ఇది బర్మీస్ చట్టాలకు(ఫారిన్ చట్టాలకు) అన్వయిస్తుందా? ఫేస్బుక్ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? రొహింగ్యాలకు అనుకూలంగా ముందుకు వెళ్తుందా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!. చదవండి: సోషల్ మీడియాను మించిన డేంజర్! -
కోట్లమంది ఫోన్ డేటా చోరీ! ఎట్టకేలకు కదిలిన యాపిల్
Pegasus surveillance scandal: పెగాసస్ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. కోట్ల మంది ఐఫోన్ యూజర్ల డేటాను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ లక్క్ష్యంగా చేసుకుందంటూ మంగళవారం కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది యాపిల్. ఇప్పటికే పెగాసస్ స్పైవేర్ ద్వారా కోట్లమంది ఐఫోన్ యూజర్ల డేటాను హ్యాకర్లకు చేర్చిందని సదరు దావాలో యాపిల్ పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్.. పెగాసస్ స్పైవేర్‌ను ఇతర దేశాలకు అమ్ముతుంటుంది. అయితే ప్రభుత్వాలు మాత్రమే మెయింటెన్ చేసే ఈ స్పైవేర్‌ను.. హ్యాకర్లు లక్క్ష్యం చేసుకున్నారని, పలువురు ప్రముఖుల ఫోన్ డేటాను తస్కరించారనే ఆరోపణలతో ‘పెగాసస్ స్కామ్’ వెలుగుచూసింది. పైగా యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా లక్క్ష్యం అయ్యిందని, భవిష్యత్తులోనూ ఐఫోన్లు వాడేవాళ్ల డేటా తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Pegasus surveillance scandal నేపథ్యంలోనే మంగళవారం స్పైవేర్ మేకర్ ఎన్‌ఎస్‌వోపై దావా వేసింది. పెగాసస్ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించిన రెండు వారాలకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాదు ఎన్ఎస్వో గ్రూప్ యాపిల్‌కు సంబంధించి ఎలాంటి డివైజ్‌లను, సాంకేతికతను, సేవలను, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఫెడరల్ కోర్టును యాపిల్ అభ్యర్థించింది. అంతేకాదు తమ ఫోన్ డేటా కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉందన్న భయాందోళనను తాజా సర్వేలో పలువురు యూజర్లు వ్యక్తం చేశారని యాపిల్ దావాలో పేర్కొంది. అయితే పెగాసస్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి(భారత్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సెలబ్రిటీల పేర్లు కూడా!).. ఆరోపణల్ని ఎన్ఎస్వో గ్రూప్ ఖండిస్తోంది. పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా డేటా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా. అయినప్పటికీ వివాదం ముదురుతూనే వచ్చింది. ఇక ఎన్‌ఎస్‌వోకి ఇలాంటి దావాలు కొత్తేం కాదు. 2019లో ఫేస్బుక్ కూడా దావా వేసింది. వాట్సాప్ మెసేంజర్ ద్వారా సైబర్ గూఢచర్యానికి పాల్పడిందని, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘం ఉద్యమకారుల డాటాను తస్కరించిందనే ఆరోపణలు చేస్తూ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులోనే ఫేస్బుక్ దావా వేసింది. దావాలు చాలవన్నట్లు 500 మిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయి.. డిఫాల్ట్ ప్రమాదానికి చేరువలో ఉంది. మరోవైపు అమెరికా ఆంక్షల తర్వాత భారీ కొనుగోళ్ల ఒప్పందం నుంచి ఫ్రాన్స్ సైతం వెనుదిరిగింది. చదవండి: ఐఫోన్ యూజర్లకు హైఅలర్ట్! వెంటనే.. -
వింత బ్లాక్‌మెయిలింగ్.. అన్నంత పని చేస్తానంటున్న ఎలన్ మస్క్
Elon Musk Warns To JP Morgan: అమెరికా వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ వెరైటీ వార్నింగ్‌కు దిగాడు. అమెరికా బ్యాంకింగ్ దిగ్గజ కంపెనీ జేపీ మోర్గాన్ చేజ్, టెస్లాపై వేసిన దావాను వెనక్కి తీసుకోవాలని, లేని తరుణంలో తన ప్రతీకార చేష్టలు ఊహించని రేంజ్లో ఉంటాయని బెదిరిస్తున్నాడు. 2014లో జరిగిన ఒక ఒప్పందానికి సంబంధించి(బ్యాంకుకు అమ్మిన వారెంట్ల విషయంలో) ఉల్లంఘనలకు పాల్పడింది టెస్లా. దీంతో గతవారం జేపీ మోర్గాన్ చేజ్, టెస్లా మీద దక్షిణ న్యూయార్క్ న్యాయస్థానంలో దావా వేసింది(నవంబర్ 15న). మొత్తం 162 మిలియన్ డాలర్ల దావా ఇది. అయితే చెల్లింపులకు సంబంధించి టెస్లాకు చాలా అవకాశాలు ఇచ్చి చూశామని, కానీ అవతలి నుంచి స్పందన లేకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని జేపీమోర్గాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే మస్క్ ఈ దావా వ్యవహారాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు. అంతేకాదు జేపీ మోర్గాన్ గనుక కేసును వెనక్కి తీసుకోకపోతే యెల్ప్(అమెరికాలో బిజినెస్ వ్యవహారాలకు సంబంధించిన జనాలు రివ్యూలు ఇచ్చే వెబ్సైట్) లో జేపీమోర్గాన్ను వన్‌స్టార్ రేటింగ్ రివ్యూ ఇస్తానని, ఈ వ్యవహారంలో ఇదే తన చివరివార్నింగ్ అంటూ బెదిరింపులకు దిగాడు ఎలన్ మస్క్. అసలు విషయం ఏంటంటే.. జేపీ మోర్గాన్‌తో టెస్లాకు సత్సంబంధాలు లేకపోయినా.. గత ఏడేళ్లుగా చిన్నస్థాయి బిజినెస్‌లు నడుస్తున్నాయి. కానీ, జేపీ మోర్గాన్ చేస్ సీఈవో జేమీ డిమోన్‌కు ఎలన్ మస్క్‌కు అస్సలు పొసగడం లేదు. దీంతో 2016 నుంచి ఆర్థిక సంబంధమైన లావాదేవీలు మాత్రం నడవడం లేదు. ఇక 2014లో జేపీ మోర్గాన్ సహకారంతోనే టెస్లా పటిష్టం అయ్యింది. అయితే 2018లో గంజాయి మోజుతో మస్క్ చేసిన ఓ ట్వీట్.. టెస్లా షేర్ల ధరల్ని ఆకాశానికి చేర్చింది. ఈ వ్యవహారంపై అదే ఏడాది అక్టోబర్‌లో సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (SEC) టెస్లా, ఎలన్ మస్క్‌లకు 20 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది కూడా. అప్పటి నుంచి బ్యాంక్ చెల్లింపుల ఒప్పందం ఉల్లంఘనకు సంబంధించిన వ్యవహారంపై జేపీ మోర్గాన్ -టెస్లా మధ్య జగడం నడుస్తోంది. తాజాగా జేపీ మోర్గాన్ కోర్టును ఆశ్రయించగా.. టెస్లా మాత్రం ఆ విషయాన్ని లైట్ తీస్కుంటూ వస్తోంది. ఈ తరుణంలో విషయం కోర్టుకు చేరినప్పటికీ ఈ వ్యవహారాన్ని మాత్రం కామెడీగా తీసుకుంటున్నాడు ఎలన్ మస్క్. -
5జీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నటి
ముంబై: దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా కోర్టును ఆశ్రయించారు. సాంకేతికతకు తాను వ్యతిరేకం కాదని.. అయితే దాని వల్ల తలెత్తే పర్యావరణానికి హానీ కలిగించే సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ పిటీషన్‌పై తొలి విచారణ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జూహీ చావ్లా మాట్లాడుతూ.. ‘‘సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును మేం వ్యతిరేకించడంలేదు. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నాం. అయితే, తదుపరితరం పరికరాల వినియోగంలోనే సందిగ్ధత ఏర్పడుతోంది. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని నమ్మడానికి ఇదే ప్రధాన కారణం’’ అన్నారు జూహీ చావ్లా. 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న దాని కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ 5జీప్లాన్స్ మానవులపై తీవ్రమైన, కోలుకోలేని ప్రభావం చూపడమే కాక భూమీ మీద ఉన్న అన్ని పర్యావరణ వ్యవస్థలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి అని జూహీ చావ్లా ఆరోపించారు. మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా ఈ కొత్త టెక్నాలజీ హానికరం కాదని సంబంధిత విభాగం ధ్రువీకరించాలని జూహీ చావ్లా తన పిటిషన్లో డిమాండ్ చేశారు. ప్రస్తుత కాలంలోనే కాకుండా, రాబోయే కాలంలో కూడా ఈ టెక్నాలజీ సురక్షితమా కాదా అనే అధ్యయనం చేయాలని కోరారు. ఇందులో ప్రైవేటు వ్యాపార సంస్థల భాగస్వామ్యం ఉండరాదని జూహీ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘నీ ఇంటిని 1 మీటరు జరుపు లేదంటే రూ.1.6కోట్లు కట్టు’
ఆక్లాండ్: మనిషి జీవితంలో ఉండే అతి ముఖ్యమై కల సొంత ఇంటి నిర్మాణం. చనిపోయేలోపు తమకంటూ ఓ ఇంటిని నిర్మించుకోవాలని ఆశపడతారు చాలా మంది. ఇక న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కూడా ఇదే విధంగా అనుకుని సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అయితే అతడి కల నెరవేరుతుందని సంతోషించేలోపల ఓ వింత సమస్య అతడి ముందుకు వచ్చింది. దాంతో అతడు తలపట్టుకున్నాడు. ఇంతకు ఆ సమస్య ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఆక్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దీపక్ లాల్ గతతేడాది పాపాకూర్లో సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మూడు పడక గదులతో అత్యంత సౌకర్యవంతంగా నిర్మాణం చేయబోతున్న ఆ ఇంటిని చూసుకుని తెగ మురిసిపోతున్నాడు దీపక్ లాల్. సీ94 డెవలప్మెంట్ అనే కంపెనీ వేసిన దావాతో అతడి ఆనందం ఆవిరవ్వమడమే కాకా షాక్‌తో చలిజ్వరం పట్టుకున్నట్లు అయ్యింది. దావా ఏంటంటే.. సీ94 డెవలప్మెంట్ ఫిర్యాదు ఏంటంటే మిస్టర్ లాల్ తన ఇంటిని చట్టబద్ధంగా తనకు సంక్రమించిన స్థలంలో కాకుండా ఒక మీటర్ వేరే వారి స్థలంలో నిర్మిస్తున్నాడు. దాంతో సదరు సంస్థ దీపక్ లాల్ మీద దావా వేసింది. అతడు ఇంటిని తనకు చట్టబద్ధంగా సంక్రమించిన స్థలంలోకి జరపాలి.. లేదంటే 3,15,000డాలర్ల(సుమారు 1.6 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. దాంతో దీపక్ లాల్ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఈ సందర్భంగా దీపక్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్య నా పాలిట ఓ పీడకలల తయారయ్యింది. దీని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోవడం మానేశాను. చివరకు ఇది ఎలా పరిష్కారం అవుతుందో అంతుపట్టడం లేదు’’ అని వాపోయాడు. ఇంటిని నిర్మించడానికి అంగీకరించిన డిజైనర్, హెచ్‌క్యూ డిజైన్స్ ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను దాఖలు చేశారని.. వాటిని ఆక్లాండ్ కౌన్సిల్ ఆమోదించింది అని తెలిపాడే లాల్. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత వారిదే అన్నాడు. ఇక ఈ సమస్యకు సంబంధించి ఒకరినొకరు నిందించకుంటున్నారు తప్ప సమస్యను పరిష్కరించే మార్గం చూడటం లేదు అన్నాడు దీపక్ లాల్. ‘‘ఇంటిని జరపడానికి నేను సిద్ధం. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పటికే ఈ కొత్త ఇంటి మీద తనఖా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి అద్దె కోసం వారానికి 1000 డాలర్లు చెల్లిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీన్ని అమ్మలేను.. రోజులు గడుస్తున్న కొద్ది ఇది మరింత జటిలం అవుతుందని’’ వాపోయాడు లాల్. చదవండి: పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి.. -
ఫేస్‌బుక్‌పై గూఢచర్యం కేసు
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై మరో కేసు నమోదయ్యింది. మొబైల్లోని కెమరాను అనధికారికంగా ఉపయోగించడం ద్వారా ఇన్స్టాగ్రామ్ వినియోగదారులపై గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో కేసు నమోదయ్యింది. ఐఫోన్‌లోని ఫోటో షేరింగ్ యాప్ కెమెరాను వినియోగించని సమయంలో కూడా యాక్సెస్ చేస్తున్నట్లు జూలైలో మీడియా నివేదికలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఈ దావా నమోదయ్యింది. అయితే ఫేస్బుక్ ఈ నివేదికలను ఖండించింది.. దాన్ని ఒక బగ్గా వర్ణించింది.. సరి చేస్తున్నామని తెలిపింది. ఇన్స్టాగ్రామ్ ఐఫోన్ కెమెరాలను యాక్సెస్ చేస్తోందనే వార్తలను తప్పుడు నోటిఫికేషన్లుగా అభివర్ణించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో గురువారం దాఖలు చేసిన ఫిర్యాదులో, న్యూజెర్సీ ఇన్స్టాగ్రామ్ యూజర్ బ్రిటనీ కొండిటి కెమెరా యాప్ ఉపయోగం ఉద్దేశపూర్వకంగా ఉందని.. దానితో వినియోగదారుల “లాభదాయకమైన, విలువైన డాటాను సేకరించే ఉద్దేశ్యంతో ఇది పని చేస్తుంది’’ అని వాదించారు. (చదవండి: ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు) ఫిర్యాదు ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవేట్, సన్నిహిత వ్యక్తిగత డాటాను పొందడంతో సహా విలువైన ఇన్సైట్స్, మార్కెట్ పరిశోధనలను సేకరించగలవని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించడానికి ఫేస్బుక్ నిరాకరించింది. గత నెలలో దాఖలు చేసిన ఒక దావాలో, ఫేస్బుక్ తన 100 మిలియన్లకు పైగా ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల బయోమెట్రిక్ డాటాను చట్టవిరుద్ధంగా పొందడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించారని ఆరోపించారు. ఫేస్బుక్ ఈ వాదనను ఖండించింది. ఇన్స్టాగ్రామ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించదని తెలిపింది. -
హెచ్‌డీఎఫ్‌సీకు భారీ షాక్
సాక్షి, ముంబై: ప్రైవేటురంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు భారీ షాక్ తగిలింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కంపెనీ బ్యాంకుపై క్లాస్ యాక్షన్ వ్యాజ్యం దాఖల్ చేసింది..పొటెన్షియల్ సెక్యూరిటీ క్లెయిమ్స్ పై షేర్ హోల్డర్స్ తరపున విచారణ ప్రారంభించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వాస్తవాలు దాచిపెట్టినట్టు ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు సంస్థ తెలిపింది. ఈ బ్యాంక్ సెక్యూరిటీలను కొనుగోలు చేసిన వాటాదారులు కూడా దీనికి మద్దతు పలకాలంటూ కోరింది. తమ ఫిర్యాదును నమోదు చేయాల్సిందిగా ఒక వెబ్ సైట్ సమాచారాన్ని అందించింది. హెచ్డీఎఫ్సీ వాహన-ఫైనాన్సింగ్ విభాగంలో తప్పుడు విధానంపై దర్యాప్తు జరిపినట్లు జూలై 13న బ్యాంకు నివేదించిన కొద్ది రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. వాహన రుణాల టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంబించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు చేసిన బ్యాంక్ ఆరుగురు సీనియర్, మధ్య స్థాయి అధికారులను తొలగించింది. అయితే దీనిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్ పీరియన్ కూడా బ్యాంకుపై గత నెలలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న లక్షల మంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తుందని ఈ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే 2020-21 తొలి త్రైమాసిక ఫలితాలపైన అనుమానాలును వ్యక్తం చేసింది. కాగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు, వాటాదారులకు రక్షణగా నిలిచే సంస్థ రోసన్ లా దావా సంచలనంగా మారింది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదాయాన్ని, లాభాలను పెంచుకునేందుకు ఇన్ఫోసిస్ టాప్ మేనేజ్ మెంట్ తప్పుడు విధానాలను చేపట్టిందంటూ ఈ సంస్థ గత సంవత్సరం ఒక క్లాస్ యాక్షన్ దావా వేసిన సంగతి తెలిసిందే. -
వీసాల నిలిపివేత : ట్రంప్‌నకు భారీ షాక్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి అమెరికన్ వ్యాపార దిగ్గజాల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్1బీ వీసాలతో సహా వర్కింగ్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నియంత్రణలను ఎత్తివేయాలని కోరుతూ పలు అమెరికన్ కంపెనీలు న్యాయస్ధానాన్ని ఆశ్రయించాయి. వీసా నియంత్రణలను సవాల్ చేస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ, విదేశాంగ శాఖలకు వ్యతిరేకంగా శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో మంగళవారం లాసూట్‌ను నమోదు చేశాయి. అమెరికాలో పనిచేసేందుకు వచ్చే వేలాది ప్రొఫెషనల్స్, ఉద్యోగులపై వీసాల నిలిపివేత నిర్ణయం ప్రభావం చూపుతుందని పలు అమెరికన్ కంపెనీలు వాదిస్తున్నాయి. ట్రంప్ తన అధికారాలను అధిగమించి జారీ చేసిన ఉత్తర్వులు పలువురిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడంలో కీలకమైన ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఐటీ నిపుణులు, డాక్టర్లు, నర్సులు,ఇతర కీలక రంగాల్లో పనిచేసే వారికి ఇవి ప్రతిబంధకమని, ఈ చట్టవిరుద్ధ వలస నియంత్రణలను రద్దు చేయాలని యూఎస్ పారిశ్రామికవేత్తలు, కంపెనీ అధిపతులు కోరుతున్నారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ తదితర వాణిజ్య సంఘాలు వీసా నియంత్రణలపై భగ్గుమంటున్నాయి. ట్రంప్ యంత్రాంగం వీసా నియంత్రణలపై తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ దనోహు కోరారు. చదవండి : అమెరికా తర్వాత ఇండియానే: ట్రంప్ ఆర్థిక వ్యవస్థ రికవరీ, పునరుద్ధరణకు ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని, వీసా నియంత్రణలతో అమెరికా నుంచి నైపుణ్యాలతో కూడిన వ్యక్తులను ఇతర దేశాలు ఆకర్షించే అవకాశం ఉందని ఎన్ఏఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ కాన్సుల్ లిండా కెల్లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా అమెరికా వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక సంఘాలు దాఖలు చేసిన దావాపై హోంల్యాండ్ సెక్యూరిటీ, వైట్‌హౌస్, విదేశాంగ శాఖలు ఇప్పటివరకూ స్పందించలేదు. అన్ని రకాల వర్కింగ్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ జూన్ 22న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. ట్రంప్ నిర్ణయంతో అన్ని రంగాల్లో అమెరికా వ్యాపారాలకు హాని చేకూరుతుందని దావాలో ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడి అధికార పరిధికి మించి తీసుకున్నఈ నిర్ణయాన్ని ఫెడరల్ విభాగాలు, అధికారులు అమలు చేయరాదని పేర్కొన్నారు. -
కరోనా విలయం : చైనాపై భారీ పరిహారం కోరుతూ కేసు
వాషింగ్టన్ : కరోనా వైరస్‌ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్ కేసు దాఖలు చేశారు. క్లేమన్‌కు చెందిన ఫ్రీడం వాచ్ అండ్ బజ్ ఫోటోస్ అనే సంస్థ టెక్సాస్‌లోని అమెరికా జిల్లా కోర్టులో ఈ కేసు నమోదు చేసింది. జీవరసాయన ఆయుధంగా కరోనా వైరస్‌ను చైనా డిజైన్ చేసిందని క్లేమన్ ఆరోపించారు. ఈ వైరస్‌ను సృష్టించిన చైనా అమెరికా చట్టంతో పాటు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు. అమెరికన్లతో పాటు తమ ప్రత్యర్ధి దేశాలకు చెందిన ప్రజలను చంపే ఉద్దేశంతోనే తమ లేబొరేటరీలో ఈ వైరస్‌ను చైనా అభివృద్ధి చేసిందని క్లేమన్ ఆరోపించారు. జీవరసాయన ఆయుధంగా ఈ వైరస్‌ను వ్యాప్తి చేసిన చైనా ప్రపంచానికి వాటిల్లిన నష్టానికి గాను 20 లక్షల కోట్ల డాలర్లను పరిహారంగా చెల్లించాలని లా సూట్లో క్లేమన్ ప్రస్తావించారు. కరోనావైరస్ బయటపడిన చైనాలోని వుహాన్ ప్రాంతంలో నెలకొన్న వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ వైరస్‌ను విడుదల చేసిందని ఫిర్యాదిదారు ఆరోపించారు. అమెరికా ప్రజలే కాకుండా చైనా ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ జీవరసాయన ఆయుధంగా ఈ వైరస్‌ను సిద్ధం చేశారని ఫిర్యాదులో క్లేమన్ సంస్థ పేర్కొంది. అమెరికా సేనలు ఈ వైరస్‌ను తమకు అంటగట్టారని చైనా ఆరోపించిన నేపథ్యంలో ఈ మహమ్మారిని సృష్టించిందని చైనానేనని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్‌పై హెచ్చరించిన వారిని సైతం చైనా శిక్షించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారీ ఊరట : త్వరలోనే మహమ్మారి తగ్గుముఖం -
గూగుల్‌కు ఊహించని షాక్
వాషింగ్టన్ : టెక్ దిగ్గజం గూగుల్‌కు అమెరికాలో ఊహించని షాక్ తగిలింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ముందు వరుసలో ఉన్న డెమోక్రాట్ ప్రతినిధి తులసి గబ్బర్డ్ గూగుల్‌పై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. తన ప్రచార ప్రకటనల ప్రసారాలపై గూగుల్ వివక్షా పూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ లాస్ఏంజిల్స్లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. 50 మిలియన్ డాలర్ల (సుమారు 345 కోట్ల రూపాయలు) పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. న్యూయార్క్ కథనం ప్రకారం ఒక రాజకీయ ప్రతినిధి టెక్ దిగ్గజంపై దావా వేయడం ఇదే మొదటిసారి. జూన్ 27-28 తేదీల్లో రాత్రిపూట ఆరు గంటలపాటు ప్రచారం తమ ప్రకటనల ఖాతాను గూగుల్ నిలిపివేసిందని గబ్బర్డ్ ప్రచార కమిటీ తులసి నౌ ఇంక్. ఆరోపించింది. తద్వారా తమకు 50 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. తన ప్రచార అకౌంట్ గంటల తరబడి ఆఫ్‌లైన్‌లోనే ఉందనీ, ఎలాంటి వివరణ లేకుండా నిలిపివేసిందని గబ్బార్డ్ ఆరోపించారు. ఇంటర్నెట్ శోధనలో గూగుల్ గుత్తాధిపత్యం ఎంత ప్రమాదకరమైనదో గూగుల్ వైఖరి ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ధోరణి భావస్వేచ్ఛకు, నిష్పక్షపాత ఎన్నికలకు, అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. అయితే అమెరికా ప్రజల తరపున దీనిపై తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. మరోవైపు గబ్బర్డ్ ఆరోపణలపై స్పందించిన గూగుల్, తులసి గబ్బర్డ్ ఖాతాలో అసాధారణ యాక్టివిటీ మూలంగానే ఆ అకౌంట్ బ్లాక్ అయిందని వివరించింది. తమ సిస్టంలోని ఆటోమేటిక్ ఫ్రాడ్ ప్రివెన్షన్ ఫీచర్ కారణంగా తాత్కాలిక షట్డౌన్కు దారితీసిందని గూగుల్ పేర్కొంది. -
హెచ్-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా
శాన్ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ అమెరికా ప్రభుత్వంపై లా సూట్ ఫైల్ చేసింది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్‌కు హెచ్-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్ సిస్టం ఎనలిస్టు ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్-1బీ వీసాను యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019 ఇమ్మిగ్రేషన్ విభాగం విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది. అనిశెట్టి బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు డాలస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో మాస్ట్ర్స్ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అనిశెట్టి (భార్య ద్వారా) హెచ్-4 డిపెండెంట్ వీసాతో ఉన్నారని తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించేందుకు ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. కాగా మొత్తం 65,000 మందికి హెచ్1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి 20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పరువు పోయింది.. రూ.334 కోట్లు కట్టాల్సిందే!
పారిస్: షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేసిన పాపానికి అది విడాకులకు దారితీసిందని ఫ్రెంచి వ్యాపారవేత్త లబోదిబో మంటున్నాడు. ఇందుకు కారణమైన ఉబర్ క్యాబ్ సంస్థ తనకు నష్టపరిహారంగా 40 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు 335 కోట్ల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని దావా వేశాడు. అసలు ఏం జరిగిందంటే.. దక్షిణ ఫ్రాన్స్ లోని కోట్ డీ అజర్ కు చెందిన ఓ వ్యాపారవేత్త ఓరోజు షికారుకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. భార్య మొబైల్ లో ఉన్న యాప్ తో ఓ ఈవెంట్ కి వెళ్లారు. ఆ తర్వాత భార్య మొబైల్ నెంబర్ నుంచి లాగ్ ఔట్ అయ్యాడు. అప్పటినుంచి ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా.. అతడి భార్య మొబైల్స్ కు అప్ డేట్స్ వెళ్తున్నాయి. కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ బిజినెస్ పని మీద ఉండే భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది. ఉబర్ క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తోందని ఆరోపించాడు. చివరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయి విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పరువు పోయిందని, ఇందుకు కారణమైన ఉబెర్ సంస్థ తనకు 335 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు. తొలిసారి లాగిన్ డాటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్ కు మెస్సేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉబర్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు. -
హెచ్-1 బి వీసా లాటరీ పద్ధతిపై పిటిషన్
వాషింగ్టన్: హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియపై అమెరికాకు చెందిన రెండు టాప్ అమెరికన్ ఇమ్మి గ్రేషన్ సలహా సంస్థలు ఫెడరల్ ప్రభుత్వంపై పోరాటానికి దిగాయి వీసాల జారీ ప్రక్రియలో పారదర్శకతను పాటించాలంటూ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్, అమెరికన్ లాయర్స్ అసోసియేషన్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు వ్యతిరేకంగా ఈ ఒక పిటిషన్ దాఖలు చేశాయి. లాటరీ పద్ధతి ద్వారా వీసాను మంజూరు చేసేపద్ధతిని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈఎంపిక విధానాన్ని పూర్తిగా ప్రజలకు వివరించకుండా అమలు ప్రక్రియను ప్రకటించారని ఇవి ఆరోపించాయి. మొదటినుంచీ, చివరివరకు జరిగే వీసా జారీ ప్రక్రియ, చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేది అమెరికా ప్రజానీకానికి బహిరంగ పర్చాలనేది తమ ఉద్దేశమని లీగల్ డైరెక్టర్ మెలిస్సా క్రో తెలిపారు. కాగా 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బి వర్క్ వీసాలకోసం దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1 నుంచి మొదలుకాగా ఇంతవరకు వీసా జారీ ప్రక్రియ మొదలుకాలేదు. అమెరికా కంపెనీలు సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగామింగ్ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులను తమ కంపెనీలలో తీసుకునేందుకు హెచ్-1బి వీసాలను వినియోగిస్తుంటాయి. వీరిలో ఎక్కువమంది భారతీయులే . ఈ సం.రం నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే 65వేలకు పైగా దరఖాస్తులు అందుతాయని ఆశిస్తున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఒకవేళ యూఎస్సీఐఎస్ అనుకున్నదానికంటే ఎక్కువమొత్తంలో హెచ్-1బి దరఖాస్తులు అందినట్లైతే కంప్యూటర్ అధారిత లాటరీ విధానం ద్వారా దరఖాస్తులను ఎంపిక చేస్తామన్న సంగతి తెలిసిందే.