ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులున్న ఆటగాడిగా రొనాల్డో ఎప్పుడో చరిత్ర సృష్టించాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అత్యధిక ఫాలోవర్లతో రొనాల్డో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మూడు పదుల వయసులోనూ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదంటూ యువ ఆటగాళ్లతో పోటీ పడి మరీ సాకర్ గేమ్ లో దూసుకెళ్తున్నాడు.
ఫుట్‌బాల్ కెరీర్‌లో ఎలాంటి మచ్చ లేకుండా సాగుతున్న రొనాల్డోకు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక అత్యాచారం కేసు చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది. తాజాగా రొనాల్డోపై ఉన్న అత్యాచారం కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పును వెలువరించింది.
విషయంలోకి వెళితే.. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై గత కొన్నేళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపిన లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని 42 పేజీల తీర్పులో పేర్కొంది. అదే క్రమంలో రొనాల్డో అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది.
ఇక రొనాల్డో నాయకత్వంలోనే పోర్చుగల్ జట్టు ఇటీవలే ఈ ఏడాది ఖతర్ వేదికగా జరిగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వయసు రిత్యా చూస్తే రొనాల్డోకు ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్ కావొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నేషన్స్ లీగ్లో పోర్చుగల్ జట్టుకు రొనాల్డో కెప్టెన్‌గాగా వ్యవహరిస్తున్నాడు. తనకు ఆఖరిదని భావిస్తున్న 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ను ఎలాగైనా విజేతగా నిలపాలని రొనాల్డో అనుకుంటున్నాడు. అతని కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
చదవండి: బేస్‌బాల్ మ్యాచ్‌లో యువతి అర్థనగ్న ప్రదర్శన.. గెంటేసిన నిర్వాహకులు
ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment