Portugal Football Star Player
-
70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా?
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కార్లంటే పిచ్చ క్రేజ్. తన గ్యారేజీలో ఉన్న కార్ల లెక్కకు కొదువే లేదు. అయితే తాజాగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన బుగాట్టి కారులో రొనాల్డో చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాట్టి.. సెంటోదియాచీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఖరీదు 80 లక్షల యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.71 కోట్లు. తాజాగా ఖరీదైన బుగాట్టి కారులో తన పార్ట్నర్ జార్జినా రోడ్రిగ్స్ తో కలిసి రొనాల్డో రెస్టారెంట్‌కు వచ్చాడు. డిన్నర్ అనంతరం బయటికి వచ్చిన రొనాల్డో బుగాట్టి కారు ఎక్కడం చూసి స్థానిక అభిమానులు ఫోటోలు క్లిక్ మనిపించారు. ఒక వ్యక్తి ఇదంతా తన కెమెరాలో బంధించి వీడియోను షేర్ చేయగా దానికి రొనాల్డో రీట్వీట్ చేయడం విశేషం. గతేడాది ఇదే రెస్టారెంట్ బయట ఒక రోల్స్ రాయిస్ కారులో రొనాల్డో కనిపించాడు. ఆ కారును జార్జినానే రొనాల్డోకు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. మరి ఖరీదైన బుగాట్టిని రొనాల్డో కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా అని అభిమానులు కామెంట్ చేశారు. 2024 యురోపియన్ ఛాంపియన్షిప్ క్వాలిఫయింగ్ కోసం రొనాల్డో తన సొంతజట్టు పోర్చుగల్ తరపున ఆడుతున్నాడు. ఇక జట్టు తరపున తొలి రెండు మ్యాచ్‌లు కలిపి నాలుగు గోల్స్ చేసిన రొనాల్డో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పోర్చుగల్ తన తర్వాతి రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ లను జూన్ లో ఆడనుంది. ప్రస్తుతం గ్రూప్ జేలో పోర్చుగల్ టాప్ లో ఉంది. ప్రస్తుతం హాలిడే మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న రొనాల్డో ఏప్రిల్ మొదటివారంలో అల్-నసర్ క్లబ్‌తో కలవనున్నాడు. ఏప్రిల్ 5న అల్-నసర్ క్లబ్.. అల్ అదాలాతో జరిగే మ్యాచ్‌లో రొనాల్డో ఆడనున్నాడు. Cristiano in Madrid last night. ❤️ pic.twitter.com/RChrK0ewmz — The CR7 Timeline. (@TimelineCR7) March 29, 2023 చదవండి: 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా? హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ -
కత్తి పట్టిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) క్రిస్టియానో రొనాల్డో కత్తి పట్టాడు. సౌదీ అరేబియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నస్ర్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఆర్7 ఈ సాహసానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఉండే ఓ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రొనాల్డో కత్తి పట్టడంతో పాటు సౌదీ సంప్రదాయ నృత్యంలోనూ భాగమయ్యాడు. Happy founding day to Saudi Arabia 🇸🇦Was a special experience to participate in the celebration at @AlNassrFC ! pic.twitter.com/1SHbmHyuez— Cristiano Ronaldo (@Cristiano) February 22, 2023 ఈ వేడుకలో సౌదీ సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలకు పోజిచ్చిన సీఆర్7.. ఆ దేశ జెండాను భుజాలపై వేసుకుని కత్తిని గాల్లోకి లేపుతూ డ్యాన్స్ చేశాడు. ఈ కార్యక్రమంలో అల్ నస్ర్ యాజమాన్యంతో పాటు క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే ప్లేయింగ్, నాన్ ప్లేయింగ్ సభ్యులంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించినర వీడియోను రొనాల్డో స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా షేర్ చేశాడు. సౌదీ అరేబియాకు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.. ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందంటూ కామెంట్స్ జోడించాడు. కాగా, సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ అల్ నస్ర్.. 2023 నుంచి 2025 జూన్ వరకు రెండేళ్ల పాటు క్రిస్టియానో రొనాల్డోతో 400 మిలియన్ల యూరోలకు భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారత కరెన్సీలో ఈ డీల్ విలువ రూ.3500 కోట్లకు పై మాటే. డీల్‌లో భాగంగా రొనాల్డో 2030 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రమోషన్లో భాగం కావాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌కు సౌదీ.. పక్క దేశాలతో కలిసి ఆతిధ్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, సీఆర్7 ఇటీవలే తన క్లబ్ కెరీర్లో 500 గోల్స్ మైలరాయిని అధిగమించాడు. సౌదీ లీగ్‌లో భాగంగా అల్ వెహదా క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 గోల్స్ చేయడం ద్వారా రొనాల్డో ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ 4-0 తేడాతో గెలుపొందగా.. అన్ని గోల్స్ సీఆర్7 ఖాతాలోకే వెళ్లాయి. 5 సార్లు బాలన్ డి ఓర్ విన్నర్ అయిన రొనాల్డో.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్, ఛాంపియన్స్ లీగ్ గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విషయం విధితమే. -
క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్ బట్టబయలు
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానం గణం ఎక్కువే. ఆరడుగుల అందగాడు ఏం తింటాడు, ఫిట్నెస్ ఎలా మెయింటేన్ చేస్తున్నాడన్న సీక్రెట్స్ తెలుసుకోవాలని అతన్ని ప్రేమించే అభిమానులకు కుతూహులం ఉండడం సహజం. అంతేకాదు మ్యాచ్‌లో కనిపించిన ప్రతీసారి రొనాల్డో చేతులకు రెండు రింగులు కనిపిస్తాయి. అందులో ఒకటి ఫిట్నెస్ రింగ్ అయితే.. మరొకటి బ్రేస్లెట్(Bracelet). బ్రేస్లెట్(Bracelet) అనేది తన పర్సనల్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ రొనాల్డో ఫుట్ సీక్రెట్ ఏంటి.. ఫిట్నెస్ రింగ్ ఎందుకు ధరించాడనే దానిని ఒక వ్యక్తి బట్టబయలు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బ్లీసా. స్పానిష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఫుట్ సీక్రెట్స్‌తో పాటు అతని ఫిట్నెస్ రింగ్ రహస్యాన్ని పంచుకున్నాడు. ''రొనాల్డో తన ఫుడ్‌లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ఎక్కువ చోటిస్తాడు. అతను పాటించే స్ట్రిక్ట్ డైట్ ఫిట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోజు ఎన్ని కేలరీలు కరిగించాలనేది రొనాల్డో ముందుగానే నిర్ణయించుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్‌లోని ఆటగాళ్లంతా రొనాల్డో కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఆటగాళ్లలో 90శాతం మార్పు కనిపిస్తోంది. కొవ్వు తక్కువున్న పదార్థాలను తీసుకుంటూ ఆటగాళ్లు గంటల తరబడి ఎక్సర్సైజులు చేస్తూ తమ ఫిట్నెస్ను రోజురోజుకు మరింత మెరుగుపరుచుకుంటున్నారు. అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బీస్లాతో రొనాల్డో ఇక రొనాల్డో చేతులకు రెండు రింగులు ఉంటాయి. ఒకటి బ్రేస్లెట్.. మరొకటి ఫిట్నెస్ రింగ్. ఈ ఫిట్నెస్ రింగ్ రొనాల్డో ఎంతసేపు నిద్రపోతున్నాడు.. ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉన్నాడనేది లెక్కిస్తుంది. అతను పడుకున్నా, కదలికలు ఉన్నా ఫిట్నెస్ రింగ్ పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు హార్ట్‌బీట్‌తో పాటు శ్వాసరేటను, శరీర ఉష్ణోగ్రతను, కదలికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్రేస్లెట్ అతని పర్సనల్ విషయం.. దాని గురించి ఆరా తీయలేదు(నవ్వుతూ)'' ముగించాడు. ఇక రొనాల్డో గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పోర్చుగల్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టి దారుణ ప్రదర్శన చేశాడు. అటుపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో జరిగిన వివాదం తెగదెంపులకు దారి తీసింది. అయితే రొనాల్డో క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో రొనాల్డో రెండేళ్ల కాలానికి భారీ ఒప్పందం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Jose Blesa Nutrición (@joseblesanutri) Beautiful 💛🎶 https://t.co/uFWlOgLkQv pic.twitter.com/PgdCK697N0 — AlNassr FC (@AlNassrFC_EN) February 17, 2023 చదవండి: 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు Christian Atsu: టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్ ఫుట్‌బాలర్ Viswanathan Anand: చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే? -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువయ్యాడు. అల్ వెహ్దాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చెలరేగిపోయాడు. మునపటి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అల్-నసర్ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అతని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి. పోర్చుగల్‌లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొదట్లో అండోరిన్హా, నసియోనల్ వంటి స్థానిక క్లబ్స్‌కు ఆడాడు. ఆటలో నైపుణ్యం సాధించిన అతను 18 ఏళ్లకే సీనియర్ టీమ్‌కు ఆడాడు. అతను ఇప్పటి వరకు ఐదు క్లబ్స్‌కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 103 గోల్స్ చేశాడు. జువెంటస్ క్లబ్‌కు ఆడిన సమయంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబనాన్ క్లబ్ తరఫున మూడు, తాజాగా అల్ నసర్ క్లబ్ తరపున ఐదు గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని క్లబ్‌లు కలిపి 1100 మ్యాచ్‌లకు పైగా ఆడిన రొనాల్డో 820 గోల్స్ కొట్టాడు. Not bad for a 38yr-old… https://t.co/aFZJFwtlH1 — Piers Morgan (@piersmorgan) February 9, 2023 చదవండి: 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
Cristiano Ronaldo: 'మంచి వంటవాడు కావాలి.. జీతం రూ. 4.5 లక్షలు'
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానులు ఎక్కువ. గతేడాది ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా, వ్యక్తిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. అలాంటి రొనాల్డో ఇప్పుడు ఒక మంచి వంటవాడి కోసం ఎదురుచూస్తున్నాడు. భారీగా జీతం ఇస్తానని చెప్పినా ఎవరూ దొరకడం లేదని రొనాల్డో తెగ బాధపడుతున్నాడు. పోర్చుగల్ లోని క్వింటా డాలో రొనాల్డో రూ.170 కోట్లతో ఓ కళ్లు చెదిరే భవంతిని కట్టిస్తున్నాడు.ఈ ఏడాది జూన్ వరకూ ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత భార్య జార్జినా రోడ్రిగెజ్, పిల్లలతో కలిసి రొనాల్డో ఆ కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. తమ కుటుంబానికి ఓ పర్సనల్ కుక్ కావాలని రొనాల్డో భావించాడు. నోరూరించే పోర్చుగీస్ ఫుడ్ తోపాటు ప్రపంచంలోని రకరకాల వంటలను చేసి పెట్టే మాస్టర్ చెఫ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. వంట పని చేసే వ్యక్తికి నెలకు సుమారు 4500 పౌండ్లు(సుమారు రూ.4.5 లక్షలు) జీతం ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదు. ఈ మధ్యనే రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్‌తో రెండేళ్ల పాటు భారీ డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా గురువారం అర్థరాత్రి సౌదీ అరేబియాలో పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)తో రొనాల్డో జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పీఎస్జీ 5-4 తేడాతో గెలుపొందింది. పీఎస్జీ జట్టులో మెస్సీ సహా బ్రెజిల్ స్టార్ నెయమర్, ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా మ్యాచ్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న రొనాల్డో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్‌బాలర్ -
బాక్సర్‌గా మారిన రొనాల్డో.. ఇదంతా దాని కోసమా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఫుట్‌బాలర్‌గా వెలుగొందుతున్న రొనాల్డో బాక్సర్‌గా దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో బాక్సింగ్ రింగ్‌లో ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రత్యర్థితో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రొనాల్డో లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఫుట్‌బాలర్ కంటే బాక్సర్‌గానే రొనాల్డో బాగున్నాడంటూ అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కానీ వారి ఆనందం కాసేపు మాత్రమే మిగిలింది. ఇదంతా ఒక యాడ్ కోసమని తెలియగానే ఫ్యాన్స్ నాలుక కరుచుకున్నారు. అవునండీ రొనాల్డో.. అండర్వేర్ దుస్తులకు సంబంధించిన ఒక యాడ్‌లో పాల్గొన్నాడు. సీఆర్ 7 బ్రాండ్ కలిగిన అండర్వేర్ యాడ్‌కు రొనాల్డో ప్రమోషన్ చేశాడు. ''బద్దకానికి వ్యతిరేకంగా నా పోరాటం ప్రారంభమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రొనాల్డో ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డొ ఎనర్జీ వెనుక అతని ఫిట్నెస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ కలిగిన ఆటగాడిగా పేరున్న రొనాల్డో ఇటీవలే ఆటకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ తొలిసారి టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదని తాజా వీడియో నిరూపించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫుట్‌బాల్ తర్వాత రొనాల్డోకు అత్యంత ఇష్టమైన క్రీడ ఎంఎంఏ(MMA-మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్). ఫుట్‌బాల్ కెరీర్ నుంచి తప్పుకున్న తర్వాత ఎంఎంఏ క్రీడలో పెట్టుబడులు పెడతానని రొనాల్డొ ఇదివరకే పేర్కొన్నాడు. కాగా తాను ఫుట్‌బాలర్ కాకపోయుంటే కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందేవాడినని రొనాల్డో ఒక సందర్భంలో తెలిపాడు. View this post on Instagram A post shared by CR7 (@cr7cristianoronaldo) చదవండి: సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు! -
రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులున్న ఆటగాడిగా రొనాల్డో ఎప్పుడో చరిత్ర సృష్టించాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అత్యధిక ఫాలోవర్లతో రొనాల్డో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మూడు పదుల వయసులోనూ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదంటూ యువ ఆటగాళ్లతో పోటీ పడి మరీ సాకర్ గేమ్ లో దూసుకెళ్తున్నాడు. ఫుట్‌బాల్ కెరీర్లో ఎలాంటి మచ్చ లేకుండా సాగుతున్న రొనాల్డోకు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక అత్యాచారం కేసు చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది. తాజాగా రొనాల్డోపై ఉన్న అత్యాచారం కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పును వెలువరించింది. విషయంలోకి వెళితే.. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై గత కొన్నేళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపిన లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని 42 పేజీల తీర్పులో పేర్కొంది. అదే క్రమంలో రొనాల్డో అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది. ఇక రొనాల్డో నాయకత్వంలోనే పోర్చుగల్ జట్టు ఇటీవలే ఈ ఏడాది ఖతర్ వేదికగా జరిగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వయసు రిత్యా చూస్తే రొనాల్డోకు ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్ కావొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ జట్టుకు రొనాల్డో కెప్టెన్‌గాగా వ్యవహరిస్తున్నాడు. తనకు ఆఖరిదని భావిస్తున్న 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ను ఎలాగైనా విజేతగా నిలపాలని రొనాల్డో అనుకుంటున్నాడు. అతని కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. చదవండి: బేస్‌బాల్ మ్యాచ్‌లో యువతి అర్థనగ్న ప్రదర్శన.. గెంటేసిన నిర్వాహకులు ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ -
రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చేసింది.. హత్తుకొని జెర్సీ గిఫ్ట్‌గా
Ronaldo Given Jersey As Gift To Irish Girl.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. తాజాగా రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చిన చిన్నారిని హత్తుకొని జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి అభిమానుల మనసు కొల్లగొట్టాడు. విషయంలోకి వెళితే.. ఫిపా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆధ్యంతం పోటాపోటీగా సాగడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. చదవండి: FIFA 2022: ప్రపంచకప్‌కు బ్రెజిల్ అర్హత.. తొలి దక్షిణ అమెరికా జట్టుగా కాగా ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఐర్లాండ్ అమ్మాయి రొనాల్డోకు వీరాభిమాని. అయితే మ్యాచ్‌లో పోర్చుగల్ కెప్టెన్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చిన ఆమె రొనాల్డొను పట్టుకొని ఏడ్చింది. రొనాల్డో ఆమెను హత్తుకొని ఓదార్చి తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి సంతోషపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్‌ను సెర్బియాతో ఆడనుంది. చదవండి: Wrestrler Nisha Dahiya: 'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్' @Cristiano con un niño después del partido. Cristiano le dio su camiseta a la chica fan de Irlanda después de tiempo completo. pic.twitter.com/w8ArtK6AyR — Elia M. V. (@emariahn) November 11, 2021 -
రొనాల్డో ఎఫెక్ట్: ఇకపై బాటిల్స్ ముట్టుకుంటే..
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్ఏ. ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో -
కోక్ బాటిల్ వ్యవహారంతో కోట్లు హాంఫట్, మరి ఈ బీర్ బాటిల్ సంగతేంటి?
మ్యూనిచ్: స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ప్రజలకు హాని కలిగించే పానీయాలపై బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. యూరో 2020లో భాగంగా రెండు రోజుల కిందట జరిగిన ప్రెస్ మీట్లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ముందున్న కోకాకోలా బాటిల్‌ను తీసి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. కోలా వద్దు, నీళ్లే ముద్దు అన్న అతని సందేశం కోకాకోలా కంపెనీకి సుమారు రూ.30 వేల కోట్ల నష్టం తెచ్చిపెట్టిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా కూడా రొనాల్డో రూట్లోనే వెళ్లాడు. నిన్న జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన పోగ్బా.. తన ముందు ఉన్న హైనెకెన్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్‌ను తీసి కింద పెట్టాడు. మరి పోగ్బా చేసిన ఈ పని వల్ల సదరు బీర్ కంపెనీకి ఎంత నష్టం వాటిల్లబోతుందో లెక్కకట్టే పనిలో పడ్డారు మార్కెట్ నిపుణులు. After #POR captain Cristiano Ronaldo and his Coca Cola removal, #FRA’s Paul Pogba makes sure there’s no Heineken on display 🍺 #EURO2020 pic.twitter.com/U9Bf5evJcl — Sacha Pisani (@Sachk0) June 16, 2021 కాగా, ఇస్లాం మతాన్ని ఆచరించే పోగ్బాకు ఆల్కహాల్ సేవించే అలవాటు లేదు. ఈ విషయాన్ని అతను చాలాసార్లు బహిరంగా ప్రస్తావించాడు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆల్కహాల్ ఉత్పత్తి అయిన బీర్ బాటిల్‌ను పక్కకు పెట్టడం ద్వారా మందుపై తనకున్న వ్యతిరేకతను మరోసారి ప్రత్యక్షంగా బహిర్గతం చేశాడు. పోగ్బాలా ఇస్లాంను ఆచరించే మరికొందరు క్రీడాకారులు సైతం మద్యం ఉత్పత్తుల ప్రమోషన్‌కు దూరంగా ఉంటారు. ఇంగ్లీష్ క్రికెటర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, దక్షిణాఫ్రికా మాజీలు హాషిమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్‌లు మద్యం కంపెనీల పేర్లను తమ దుస్తులపై ధరించేందుకు సైతం ఇష్టపడరు. హైనెకెన్ బేవరేజ్ కంపెనీ ప్రస్తుతం జరుగుతున్న యూరో 2020కి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: రొనాల్డో చర్య.. కోకా కోలాకు భారీ డ్యామేజ్.. మరి ఆ యాడ్! -
వేలంలో రొనాల్డో ఆర్మ్బ్యాండ్కు రూ. 55 లక్షలు
బెల్గ్రేడ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రిఫరీ నిర్ణయంపై ఆగ్రహంతో మైదానంలో విసిరేసిన కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్ (చేతికి ధరించేది) 64 వేల యూరోల (రూ. 55 లక్షలు) ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గత ఆదివారం పోర్చుగల్, సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆట అదనపు సమయంలో తాను కొట్టిన గోల్‌ను రిఫరీ నిరాకరించడంతో ఆగ్రహించిన రొనాల్డో... తన చేతికి ఉన్న నీలి రంగు ఆర్మ్‌బ్యాండ్‌ను విసిరేశాడు. అనంతరం ఆ బ్యాండ్‌ను తీసుకున్న ఫైర్ ఫైటర్ ఒక చారిటీ సంస్థకి అందజేశాడు. వాళ్లు దానిని ఆన్లైన్ వేలంలో ఉంచడంతో ఒక అభిమాని పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బును వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి చికిత్స కోసం వినియోగిస్తామని ఆ చారిటీ సంస్థ తెలిపింది. -
రొనాల్డో 'పాజిటివ్'
లిస్బన్: క్రీడా ప్రపంచంలోని మరో మేటి ప్లేయర్ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు స్టార్ ఫార్వర్డ్, యువెంటస్ క్లబ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) నేషన్స్ లీగ్ టోర్నీలో భాగంగా నేడు స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లో 35 ఏళ్ల రొనాల్డో పాల్గొనడం లేదని పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య తెలిపింది. ‘రొనాల్డోకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం అతను స్వీయనిర్బంధంలో ఉన్నాడు. రొనాల్డోతో కలిసి ప్రాక్టీస్ చేసిన జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. వారందరూ స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు’ అని పోర్చుగల్ సమాఖ్య వివరించింది. ఐదుసార్లు ‘వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం పొందిన రొనాల్డో ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 100 గోల్స్ పూర్తి చేసుకొని అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 101 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 109 గోల్స్‌తో ఇరాన్ ప్లేయర్ అలీ దాయి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతవారం నేషన్స్ లీగ్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో 0–0తో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లో... స్పెయిన్‌తో 0–0తో ‘డ్రా’గా ముగిసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రొనాల్డో పాల్గొన్నాడు. గతంలో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్, బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెమార్, బాస్కెట్‌బాల్ స్టార్ కెవిన్ డురాంట్ కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఉన్నారు. -
రొనాల్డోకు కరోనా పాజిటివ్
లిస్బన్ : ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం నేషనల్ లీగ్ గేమ్స్ ఆడుతున్న కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే జట్టును వీడి హోంఐసోలేషన్‌కు వెళ్లినట్లు పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ పేర్కొంది. కాగా రొనాల్డొ కరోనా పాజిటివ్ అని తేలినా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో అతను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. మరోవైపు కరోనా బారిన పడిన రొనాల్డో త్వరగా కోలుకోవాలంటూ అతని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా రొనాల్డొ పోర్చుగల్ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్ సాధించాడు. -
హ్యాట్సాఫ్... రొనాల్డో
నేపాల్ భూకంప బాధితులకు రూ.50 కోట్ల విరాళం పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం 50 లక్షల పౌండ్ల (రూ. 50 కోట్లు) విరాళాన్ని ప్రకటించాడు. నేపాల్‌లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ‘సేవ్ ద చిల్డ్రన్’ అనే చారిటీ సంస్థకు అతను ఈ విరాళాన్ని అందజేసినట్లు ఫ్రాన్స్ నుంచి వెలువడే క్రీడా మేగజైన్ ‘సో ఫుట్’ తెలిపింది. నేపాల్ భూకంప బాధితులకు తమకు తోచినంత విరాళం అందించాలని తన అభిమానులకు 30 ఏళ్ల రొనాల్డో గత నెలలో ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ఈ రియల్ మాడ్రిడ్ క్లబ్ సూపర్‌స్టార్‌కు అలవాటే. గతేడాది ఓ 10 నెలల చిన్నారికి మెదడుకు శస్త్రచికిత్స చేయించేందుకు రొనాల్డో 60 వేల పౌండ్లు (రూ. 59 లక్షలు) అందజేశాడు.