
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కార్లంటే పిచ్చ క్రేజ్. తన గ్యారేజీలో ఉన్న కార్ల లెక్కకు కొదువే లేదు. అయితే తాజాగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన బుగాట్టి కారులో రొనాల్డో చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాట్టి.. సెంటోదియాచీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ఖరీదు 80 లక్షల యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.71 కోట్లు.
తాజాగా ఖరీదైన బుగాట్టి కారులో తన పార్ట్‌నర్ జార్జినా రోడ్రిగ్స్ తో కలిసి రొనాల్డో రెస్టారెంట్‌కు వచ్చాడు. డిన్నర్ అనంతరం బయటికి వచ్చిన రొనాల్డో బుగాట్టి కారు ఎక్కడం చూసి స్థానిక అభిమానులు ఫోటోలు క్లిక్ మనిపించారు. ఒక వ్యక్తి ఇదంతా తన కెమెరాలో బంధించి వీడియోను షేర్ చేయగా దానికి రొనాల్డో రీట్వీట్ చేయడం విశేషం. గతేడాది ఇదే రెస్టారెంట్ బయట ఒక రోల్స్ రాయిస్ కారులో రొనాల్డో కనిపించాడు. ఆ కారును జార్జినానే రొనాల్డోకు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. మరి ఖరీదైన బుగాట్టిని రొనాల్డో కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా అని అభిమానులు కామెంట్ చేశారు.
2024 యురోపియన్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ కోసం రొనాల్డో తన సొంతజట్టు పోర్చుగల్ తరపున ఆడుతున్నాడు. ఇక జట్టు తరపున తొలి రెండు మ్యాచ్‌లు కలిపి నాలుగు గోల్స్ చేసిన రొనాల్డో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పోర్చుగల్ తన తర్వాతి రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ లను జూన్ లో ఆడనుంది. ప్రస్తుతం గ్రూప్ జేలో పోర్చుగల్ టాప్ లో ఉంది. ప్రస్తుతం హాలిడే మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న రొనాల్డో ఏప్రిల్ మొదటివారంలో అల్-నసర్ క్లబ్‌తో కలవనున్నాడు. ఏప్రిల్ 5న అల్-నసర్ క్లబ్.. అల్ అదాలాతో జరిగే మ్యాచ్‌లో రొనాల్డో ఆడనున్నాడు.
Cristiano in Madrid last night. ❤️
— The CR7 Timeline. (@TimelineCR7) March 29, 2023
pic.twitter.com/RChrK0ewmz
చదవండి: 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా?
Comments
Please login to add a commentAdd a comment