Cristiano Ronaldo Breaks Another Record As Al Nassr Thrashes Monastir 4-1 In Arab Club Champions Cup - Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్‌.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో

Published Tue, Aug 1 2023 3:42 PM | Last Updated on Tue, Aug 1 2023 4:15 PM

Cristiano Ronaldo Surpasses Gerd Muller Tally-144 Header Goals - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ రికార్డు రొనాల్డో పేరిటే ఉంది. ఇప్పటివరకు రొనాల్డో 838 గోల్స్‌ సాధించాడు. కొంతకాలంగా గోల్స్‌ కొట్టడంలో విఫలమవుతున్న రొనాల్డో తాజాగా మంగళవారం హెడర్‌ గోల్‌తో మెరిశాడు. అరబ్‌ క్లబ్‌ చాంపియన్స్‌ క్లబ్‌లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అల్‌-నసర్‌, యూఎస్‌ మోనాస్టిర్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్‌-నసర్‌ 4-1 తేడాతో విజయాన్ని అందుకుంది.

 కాగా ఆట 74వ నిమిషంలో రొనాల్డో సూపర్‌ హెడర్‌ గోల్‌తో మెరిశాడు. రొనాల్డో గోల్‌ కొట్టడానికి 8 నిమిషాల ముందు ప్రత్యర్థి జట్టు ఒక గోల్‌ కొట్టి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే రొనాల్డో 74వ నిమిషంలో హెడర్‌ గోల్‌తో తన జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ఫుట్‌బాల్‌లో అత్యధిక హెడర్‌ గోల్స్‌ కొట్టిన జాబితాలో జర్మనీ దిగ్గజం గెర్డ్‌ ముల్లర్‌ను అధిగమించాడు.

ఇప్పటివరకు ముల్లర్‌తో కలిసి 144 హెడర్‌ గోల్స్‌తో సంయుక్తంగా ఉన్న రొనాల్డో తాజా గోల్‌(145 హెడర్‌)తో ముల్లర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు తన కెరీర్‌లో 839వ గోల్‌ సాధించి అత్యధిక గోల్స్‌ విషయంలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 

చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్‌ ఓటమి.. విచారణ చేపట్టండి'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement