Al-Nassr FC
-
ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు రొనాల్డో పేరిటే ఉంది. ఇప్పటివరకు రొనాల్డో 838 గోల్స్ సాధించాడు. కొంతకాలంగా గోల్స్ కొట్టడంలో విఫలమవుతున్న రొనాల్డో తాజాగా మంగళవారం హెడర్ గోల్‌తో మెరిశాడు. అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అల్-నసర్, యూఎస్ మోనాస్టిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్-నసర్ 4-1 తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఆట 74వ నిమిషంలో రొనాల్డో సూపర్ హెడర్ గోల్‌తో మెరిశాడు. రొనాల్డో గోల్ కొట్టడానికి 8 నిమిషాల ముందు ప్రత్యర్థి జట్టు ఒక గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే రొనాల్డో 74వ నిమిషంలో హెడర్ గోల్‌తో తన జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ఫుట్‌బాల్‌లో అత్యధిక హెడర్ గోల్స్ కొట్టిన జాబితాలో జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్‌ను అధిగమించాడు. ఇప్పటివరకు ముల్లర్‌తో కలిసి 144 హెడర్ గోల్స్‌తో సంయుక్తంగా ఉన్న రొనాల్డో తాజా గోల్(145 హెడర్)తో ముల్లర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు తన కెరీర్లో 839వ గోల్ సాధించి అత్యధిక గోల్స్ విషయంలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 22 SEASONS IN A ROW CRISTIANO RONALDO IS ETERNAL 🍷🐐pic.twitter.com/mEPwV62rhn — aurora (@cr7stianos) July 31, 2023 Ronaldooooooo pic.twitter.com/rab2wPkZAQ — AlNassr FC (@AlNassrFC_EN) July 31, 2023 చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' -
'అవతలికి పో'.. కెమెరామన్‌పై రొనాల్డో అసహనం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కెమెరామన్‌పై అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం మొదలైన అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా అల్-నసర్, అల్-సాహబ్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్ చేయడంలో విఫలమయ్యాడు. మ్యాచ్‌లో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో 0-0తో పేలవ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగిసిందిన్న బాధలో ఉన్న రొనాల్డో డగౌట్ వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనకాలే కెమెరామన్ అతన్ని అనుసరించాడు. రొనాల్డో ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుండడం చిరాకు తెప్పించింది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కొన్ని నీళ్లు తాగిన రొనాల్డో ఆ తర్వాత కొన్ని నీళ్లను కెమెరామన్వైపు చల్లుతూ.. ''అవతలికి పో'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కెమెరామన్ సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తన ట్విటర్లో ఒక పోస్టు షేర్ చేశాడు. ''గ్రూప్ స్టేజీలో మొదటి గేమ్ చాలా టఫ్‌గా అనిపించింది.. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. మేం పోరాడుతాం'' అంటూ కామెంట్ జత చేశాడు. 🎥 | مغادرة كريستيانو رونالدو قائد فريق #النصر أرضية الملعب بعد المواجهة "غير راض"، ويطلب من المصور إبعاد الكاميرا عنه. #كأس_الملك_سلمان_للاندية pic.twitter.com/4R2xoB7la7 — الشرق الأوسط - رياضة (@aawsat_spt) July 28, 2023 చదవండి: ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! ఆసియా కప్ తర్వాత జట్టు నుంచి అవుట్ -
పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్ అయిపోతున్నాడు!
క్రిస్టియానో రొనాల్డోకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యన రొనాల్డో ప్రవర్తన శ్రుతి మించిపోతుంది. మ్యాచ్ ఓటములను జీర్ణించుకోలేక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇబ్బందుల్లో పడుతున్నాడు. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించి హీరో అనిపించుకున్న రొనాల్డో విలన్‌గా మారిపోతున్నాడు. తన చర్యతో అభిమానులు షాక్ తింటున్నారు. తాజాగా ఆల్-నసర్ కెప్టెన్ మ్యాచ్ ఓడిపోయామన్న కోపంలో ప్రత్యర్థి ఆటగాడి తలను నేలకేసి కొట్టడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. సౌదీ ప్రో లీగ్‌లో భాగంగా మంగళవారం అర్థరాత్రి అల్-హిలాల్, అల్-నసర్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో రొనాల్డో సేన 0-2తో అల్-హిలాల్ చేతిలో ఓటమి పాలయ్యింది. ఈ విషయం పక్కనబెడితే.. ఆట 56వ నిమిషంలో అల్-హిలాల్ ఆటగాడు గుస్టావోపైకి దూసుకొచ్చిన రొనాల్డో అతని తలను తన చేత్తో అదిమి పట్టుకొని ఒక్కసారిగా కిందకు పడేశాడు. ఈ క్రమంలో గుస్టావో తల గ్రౌండ్‌కు కాస్త బలంగానే తాకింది. ఈ చర్యతో స్టాండ్స్‌లోని ప్రేక్షకులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా షాక్ తిన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని గాయపరిచినందుకు గానూ రిఫరీ రొనాల్డోకు ఎల్గోకార్డు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by نادي الهلال السعودي (@alhilal) చదవండి: 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు' -
ఆడడంలో విఫలం.. తప్పు మీద తప్పు చేస్తూ
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి సహనం కోల్పోయాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గోల్ కొట్టడంలో విఫలమైన రొనాల్డో ఈసారి మరింత కోపం తెచ్చుకున్నాడు. తన కోపం ఎవరిపై చూపించాలో తెలియక ఫుట్‌బాల్‌పై చూపించడం.. అది చూసిన రిఫరీ రొనాల్డోకు ఎల్లో కార్డు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. విషయంలోకి వెళితే.. సౌదీ అరేబియన్ ప్రో-లీగ్‌లో భాగంగా అల్-నసర్, అభాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 3-1 తేడాతో రొనాల్డో సేన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టేలేకపోయాడు. రొనాల్డో చేతిలో బంతి ఉండగా ఫస్ట్ హాఫ్ ముగిసినట్లు రిఫరీ విజిల్ వేశాడు. అప్పటికే గోల్ కొట్టలేదన్న కోపంలో ఉన్న రొనాల్డో తన వద్ద ఉన్న బంతిని కాలితో బలంగా తన్నాడు. అంతే ఒక్క ఉదుటన బంతి 60 మీటర్ల దూరంలో పడింది. రొనాల్డో చర్యకు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇది గమనించిన రిఫరీ రొనాల్డోకు ఎల్లోకార్డు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రొనాల్డో ఇలా చేయడం ఇది తొలిసారి మాత్రం కాదు. ఇంతకముందు అల్ ఇత్తిహాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఓడిపోయామన్న కోపంతో మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో వాటర్ బాటిల్‌ను తన్నడం.. అది ఒక అభిమానికి తగలడం.. ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగాయి. ఇక మార్చి 18(శనివారం) అల్-నసర్.. అభాతో మరో మ్యాచ్ ఆడనుంది. Ronaldo received a yellow card for kicking the ball away in frustration after the referee whistled the end of the first half. pic.twitter.com/xR92h1FmEm — ESPN FC (@ESPNFC) March 14, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు -
Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోపం ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు తన చర్యతో అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం క్రిస్టియానో రొనాల్డో కాస్త కొత్తగా కనిపించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపుల తర్వాత అల్-నసర్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న రొనాల్డో వరుస విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడినప్పటికి ఆ తర్వాత అల్-నసర్ వరుస విజయాలతో దుమ్మురేపింది. అయితే సౌదీ ప్రోలీగ్‌లో భాగంగా శుక్రవారం అల్-ఇత్తిహాద్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో సేన 1-0తో ఓటమిపాలైంది. మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పాత రొనాల్డో బయటికి వచ్చేశాడు. సహనం కోల్పోయిన రొనాల్డో పెవిలియన్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా కనిపించిన వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడు. దెబ్బకు వాటర్ బాటిల్స్ చెల్లాచెదురయ్యాయి. ఒక వాటిర్ బాటిల్ ఎగిరి అభిమానుల మధ్య పడింది. అయితే ఎవరికి ఆ బాటిల్ తగల్లేదు. అయితే రొనాల్డో చర్యను ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయనంత మాత్రానా ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. కోపంలో చేసే పని ఒక్కోసారి చేటు తెస్తుందని.. అందుకే కోపం తగ్గించుకుంటే మంచిదని హితబోధ చేశారు. అయితే రొనాల్డో కోపానికి ఇంకో కారణం కూడా ఉందని తెలిసింది. అదేంటంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు అల్-ఇత్తిహాద్ జట్టు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ నామస్మరణ చేశారు. రొనాల్డో కనిపించిన ప్రతీసారి మెస్సీ పేరు అతనికి వినపడేలా గట్టిగట్టిగా అరిచారు. ఈ చర్య కూడా అతని కోపానికి ఒక కారణం కావొచ్చు అని కొందరు పేర్కొన్నారు. అయితే తన చర్యపట్ల సిగ్గుపడిన రొనాల్డో కాసేపటి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అభిమానులను క్షమాపణ కోరాడు. ఇక మ్యాచ్‌లో ఆట 10వ నిమిషంలో అల్-ఇత్తిహాద్ తరపున బ్రెజిల్‌కు చెందిన రొమారినో గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇరుజట్లు పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు జరిపినప్పటికి మరో గోల్ రాలేదు. pic.twitter.com/26nxt7u4Ak — Out Of Context Football (@nocontextfooty) March 9, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్.. అగ్రస్థానంలోకి! వీడియో వైరల్
Cristiano Ronaldo- Al-Nassr: సౌదీ ప్రొ లీగ్‌లో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అద్భుత ఆట తీరుతో అభిమానులకు కనువిందు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డో దుబాయ్‌కు చెందిన అల్ నజర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆ జట్టు పగ్గాలు చేపట్టి సౌదీ ప్రొ లీగ్‌లో ముందుకు నడిపిస్తున్న రొనాల్డో శనివారం నాటి మ్యాచ్‌లో వరుసగా మూడు గోల్స్ సాధించాడు. దీంతో ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ స్టేడియంలో డమాక్‌తో పోరులో అల్ నజర్ గెలుపొందింది. జట్టును గెలిపించి.. అగ్రస్థానానికి మ్యాచ్ 18వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన ఈ పోర్చుగీస్ స్టార్.. 23వ నిమిషంలో రెండో గోల్ సాధించాడు. ఇక తొలి అర్ధ భాగం ముగస్తుందన్న ఆఖరి నిమిషంలో మరో గోల్ కొట్టి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లకూ గోల్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో రొనాల్డో సారథ్యంలోని అల్ నజర్ 3-0తో విజయఢంకా మోగించింది. కాగా అల్ నజర్ కెప్టెన్‌గా రొనాల్డోను నియమించడం పట్ల సహచర ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వాళ్లు మాత్రం తమకు రొనాల్డోతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాగా అల్ నజర్ సౌదీ ప్రొ లీగ్‌లో 2022-23 సీజన్లో ఇప్పటి వరకు పద్దెమినిదికి గానూ పదమూడింట గెలిచింది. నాలుగు డ్రా చేసుకుని.. ఒక మ్యాచ్‌లో ఓడింది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. చదవండి: వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్ BGT: దానర్థం జట్టు నుంచి తప్పించినట్లు కాదు! రాహుల్‌కు మరిన్ని అవకాశాలు! వైస్ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. కాకపోతే.. 👏 Another milestone day for the 🐐 in Saudi Arabia 2⃣ hat-tricks in 2023 already, as many as his best tally in each of the last 3 calendar years. It's only February!#RoshnSaudiLeague | #CR7𓃵 | @AlNassrFC_EN | @Cristiano pic.twitter.com/AXCE0sPHtx — Roshn Saudi League (@SPL_EN) February 25, 2023 ثلاثيـة #العالمي أمام ضمك 💛 في 90 ثانيـة 🎬 والكواليس الكاملـة تأتيكم الليـلة 🔥🤩 pic.twitter.com/8CjvDQKgDW — نادي النصر السعودي (@AlNassrFC) February 25, 2023 -
క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్ బట్టబయలు
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానం గణం ఎక్కువే. ఆరడుగుల అందగాడు ఏం తింటాడు, ఫిట్నెస్ ఎలా మెయింటేన్ చేస్తున్నాడన్న సీక్రెట్స్ తెలుసుకోవాలని అతన్ని ప్రేమించే అభిమానులకు కుతూహులం ఉండడం సహజం. అంతేకాదు మ్యాచ్‌లో కనిపించిన ప్రతీసారి రొనాల్డో చేతులకు రెండు రింగులు కనిపిస్తాయి. అందులో ఒకటి ఫిట్నెస్ రింగ్ అయితే.. మరొకటి బ్రేస్లెట్(Bracelet). బ్రేస్లెట్(Bracelet) అనేది తన పర్సనల్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ రొనాల్డో ఫుట్ సీక్రెట్ ఏంటి.. ఫిట్నెస్ రింగ్ ఎందుకు ధరించాడనే దానిని ఒక వ్యక్తి బట్టబయలు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బ్లీసా. స్పానిష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఫుట్ సీక్రెట్స్‌తో పాటు అతని ఫిట్నెస్ రింగ్ రహస్యాన్ని పంచుకున్నాడు. ''రొనాల్డో తన ఫుడ్‌లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ఎక్కువ చోటిస్తాడు. అతను పాటించే స్ట్రిక్ట్ డైట్ ఫిట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోజు ఎన్ని కేలరీలు కరిగించాలనేది రొనాల్డో ముందుగానే నిర్ణయించుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్‌లోని ఆటగాళ్లంతా రొనాల్డో కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఆటగాళ్లలో 90శాతం మార్పు కనిపిస్తోంది. కొవ్వు తక్కువున్న పదార్థాలను తీసుకుంటూ ఆటగాళ్లు గంటల తరబడి ఎక్సర్సైజులు చేస్తూ తమ ఫిట్నెస్ను రోజురోజుకు మరింత మెరుగుపరుచుకుంటున్నారు. అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బీస్లాతో రొనాల్డో ఇక రొనాల్డో చేతులకు రెండు రింగులు ఉంటాయి. ఒకటి బ్రేస్లెట్.. మరొకటి ఫిట్నెస్ రింగ్. ఈ ఫిట్నెస్ రింగ్ రొనాల్డో ఎంతసేపు నిద్రపోతున్నాడు.. ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉన్నాడనేది లెక్కిస్తుంది. అతను పడుకున్నా, కదలికలు ఉన్నా ఫిట్నెస్ రింగ్ పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు హార్ట్‌బీట్‌తో పాటు శ్వాసరేటను, శరీర ఉష్ణోగ్రతను, కదలికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్రేస్లెట్ అతని పర్సనల్ విషయం.. దాని గురించి ఆరా తీయలేదు(నవ్వుతూ)'' ముగించాడు. ఇక రొనాల్డో గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పోర్చుగల్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టి దారుణ ప్రదర్శన చేశాడు. అటుపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో జరిగిన వివాదం తెగదెంపులకు దారి తీసింది. అయితే రొనాల్డో క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో రొనాల్డో రెండేళ్ల కాలానికి భారీ ఒప్పందం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Jose Blesa Nutrición (@joseblesanutri) Beautiful 💛🎶 https://t.co/uFWlOgLkQv pic.twitter.com/PgdCK697N0 — AlNassr FC (@AlNassrFC_EN) February 17, 2023 చదవండి: 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు Christian Atsu: టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్ ఫుట్‌బాలర్ Viswanathan Anand: చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే? -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువయ్యాడు. అల్ వెహ్దాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చెలరేగిపోయాడు. మునపటి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అల్-నసర్ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అతని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి. పోర్చుగల్‌లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొదట్లో అండోరిన్హా, నసియోనల్ వంటి స్థానిక క్లబ్స్‌కు ఆడాడు. ఆటలో నైపుణ్యం సాధించిన అతను 18 ఏళ్లకే సీనియర్ టీమ్‌కు ఆడాడు. అతను ఇప్పటి వరకు ఐదు క్లబ్స్‌కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 103 గోల్స్ చేశాడు. జువెంటస్ క్లబ్‌కు ఆడిన సమయంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబనాన్ క్లబ్ తరఫున మూడు, తాజాగా అల్ నసర్ క్లబ్ తరపున ఐదు గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని క్లబ్‌లు కలిపి 1100 మ్యాచ్‌లకు పైగా ఆడిన రొనాల్డో 820 గోల్స్ కొట్టాడు. Not bad for a 38yr-old… https://t.co/aFZJFwtlH1 — Piers Morgan (@piersmorgan) February 9, 2023 చదవండి: 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్.. కనిపించని సెలబ్రేషన్స్
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు అల్-నసర్ తరపున తొలి గోల్ కొట్టాడు. అల్ ఫతేహ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తన గోల్‌తో అల్-నసర్ను ఓటమి నుంచి గట్టెక్కించి మ్యాచ్‌ను డ్రా చేయడంలో సఫలమయ్యాడు. అదనపు సమయంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఎప్పుడు గోల్ కొట్టినా సుయ్(Sui) సెలబ్రేషన్ చేయడం చూస్తుంటాం. కానీ తొలిసారి ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా రొనాల్డో సాదాసీదాగా కనిపించాడు. బహుశా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమే అందుకు కారణమనుకుంటా. కాగా ఫిఫా వరల్డ్‌కప్ జరగుతున్న సమయంలోనే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్‌తో 200 మిలియన్ యూరోలకు రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. అల్ నసర్ క్లబ్‌కు వెళ్లినప్పటి నుంచి రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేదు. తాజాగా క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అల్ ఫతేహ్‌తో మ్యాచ్‌ను అల్ నసర్ 2-2తో డ్రా చేసుకుంది. ఆట 12వ నిమిషంలో మాజీ బార్సిలోనా స్టార్ క్రిస్టియాన్ టెల్లో గోల్ కొట్టడంతో అల్ ఫతేహ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట 42వ నిమిషంలో టలిస్కా అల్ నసర్‌కు తొలి గోల్ అందించి 1-1తో సమం చేశాడు. తొలి హాఫ్‌ను రెండు జట్లు 1-1తో ముగించాయి. రెండో అర్థభాగం మొదలయ్యాకా 58వ నిమిషంలో అల్ ఫతేహ్ ఆటగాడు సోఫియాఏ బెండెబ్కా గోల్ కొట్టి జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నిర్ణీత సమయంలోగా అల్ నసన్ మరో గోల్ కొట్టలేకపోయింది. అయితే అదనపు సమయంలో రొనాల్డోకు లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్‌గా మలచడంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక 15 మ్యాచ్‌ల తర్వాత అల్ నసర్ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. జట్టు ఖాతాలో 34 పాయింట్లతో ఉంది. ఇక అల్ నసర్ గురువారం అల్ వేదాకు బయలుదేరి వెళ్లింది. د90+3' هدف التعادل لـ النصر عن طريق كريستيانو رونالدو الفتح 2 × 2 النصر#الفتح_النصر | #CR7 | #SSC pic.twitter.com/5SYppTQXlU — شركة الرياضة السعودية SSC (@ssc_sports) February 3, 2023 చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
క్రిస్టియానో రొనాల్డోకు అవమానం..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు సొంత అభిమానుల మధ్య అవమానం ఎదురైంది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్‌తో భారీ విలువకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అల్ నసర్ తరపున రొనాల్డో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)తో ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో మెస్సీని డామినేట్ చేసిన రొనాల్డో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం రొనాల్డో అల్ నసర్ ఓడిపోయింది. తాజాగా రొనాల్డో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. సౌదీ సూపర్‌కప్‌లో భాగంగా గురువారం అర్థరాత్రి రియాద్ వేదికగా అల్ ఇత్తిహద్, అల్ నసర్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్ ఇత్తిహద్ 3-1 తేడాతో అల్ నసర్ జట్టును చిత్తు చేసింది. 90 నిమిషాల పాటు ఆడిన రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. కాగా లీగ్‌లో ఇది రెండో ఓటమి కావడంతో సౌదీ సూపర్ కప్ నుంచి అల్ నసర్ జట్టు నిష్క్రమించింది. కాగా రొనాల్డో వచ్చిన తర్వాత అల్ నసర్ కు ఇదే మేజర్ కప్. కానీ కప్ కొట్టకుండానే ఇంటిబాట పట్టింది. ఇక మ్యాచ్‌లో తన ఆటతో నిరాశపరిచిన రొనాల్డోను అభిమానులు అవమానించారు. మ్యాచ్ ముగిశాకా పెవిలియన్‌కు వస్తున్న సమయంలో రొనాల్డోనూ చూస్తూ మెస్సీ.. మెస్సీ అంటూ పెద్ద గొంతుతో అరిచారు. ఇది గమనించిన రొనాల్డో ఏలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రొనాల్డో నేతృత్వంలోని అల్ నసర్ క్లబ్ అల్ ఫెచ్కు ప్రయాణం కానుంది. ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్న సౌదీ ప్రో లీగ్‌లో ఆడనుంది. حسرة النجم العالمي ( كرستيانو رونالدو ) بعد الخسارة من #الاتحاد #الاتحاد_النصر pic.twitter.com/zp0g8Uey7l — علاء سعيد (@alaa_saeed88) January 26, 2023 చదవండి: జడేజా రాణించినా.. జట్టు మాత్రం ఓటమి '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
అక్కడ అన్ని రికార్డులు బద్దలు కొట్టా! నాకెన్నో ఆఫర్లు వచ్చాయి.. కానీ
Cristiano Ronaldo- Al-Nassr Club: ‘‘యూరోప్‌లో నేను చేయాల్సిందంతా చేశాను... అక్కడ నాకెన్నో ఆఫర్లు వచ్చాయి. బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికా సహా పోర్చుగల్‌లోనూ ఎన్నెన్నో అవకాశాలు తలుపుతట్టాయి. చాలా క్లబ్స్ నాతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించాయి. కానీ నేను ఈ క్లబ్‌కు మాట ఇచ్చాను’’ అంటూ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అన్నాడు. తన ఇంకా కెరీర్ ముగిసిపోలేదని, తన గురించి ఎవరు ఎలా మాట్లాడినా పట్టించుకోనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తనను తాను విలక్షణ ఆటగాడిగా అభివర్ణించుకున్న రొనాల్డో.. యూరోప్‌లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టానన్నాడు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా రికార్డుల వేట మొదలుపెట్టానని వ్యాఖ్యానించాడు. భారీ డీల్ కాగా ఫిఫా ప్రపంచకప్-2022కు ముందు యునైటెడ్ మాంచెస్టర్‌తో బంధం తెంచుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ ఈ క్లబ్ తరఫున ఆడేందుకు జరిగిన ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలు. ఈ క్రమంలో సౌదీకి చేరుకున్న 37 ఏళ్ల రొనాల్డోకు ఘన స్వాగతం లభించింది. అల్ నజర్‌కు చెందిన మిర్సూల్ పార్క్ స్టేడియంలో పసుపు, నీలం రంగుల మేళవింపుతో కూడిన జెర్సీలో అతడు రాగానే.. పెద్ద ఎత్తున పటాకాలు కాలుస్తూ వెల్కం చెప్పారు నిర్వాహకులు. అక్కడ అన్ని రికార్డులు బద్దలు కొట్టా ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నేను యూనిక్ ప్లేయర్‌ని. యూరోప్‌లో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టాను. ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదుర్కొంటూ మరిన్ని ఘనతలు సాధించేందుకు ఇక్కడకు వచ్చాను. సౌదీ అభివృద్ధిలో భాగం గెలిచేందుకే ఇక్కడకు వచ్చాను. ఆటను ఆస్వాదిస్తాను. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, అభివృద్ధిలో నేను కూడా భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగెజ్ సైతం సౌదీ మహిళ మాదిరి నలుపు రంగు అభయ ధరించి తమ పిల్లలతో కలిసి రొనాల్డో ఆగమనాన్ని వీక్షించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ నిరాశజనక ప్రదర్శనతో ట్రోఫీ గెలవాలన్న రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. అంతేగాక పలు మ్యాచ్‌లకు కెప్టెన్ రొనాల్డోను పక్కనపెట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో అతడు కొత్త క్లబ్ తరఫున ఆడనుండటం గమనార్హం. చదవండి: Rishabh Pant: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి పంత్.. అంబానీ ఆస్పత్రిలో చికిత్స.. ఖర్చు మొత్తం ఎవరిదంటే! Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. Walks of the greatness 🐐💛 pic.twitter.com/7FzLZSchQ5 — AlNassr FC (@AlNassrFC_EN) January 3, 2023