Cristiano Ronaldo Splashes Water At Cameraman After Match Drawn - Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: 'అవతలికి పో'.. కెమెరామన్‌పై రొనాల్డో అసహనం

Published Sat, Jul 29 2023 8:46 PM

Cristiano Ronaldo Splashes Water-At Cameraman-After Match-Drawn - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కెమెరామన్‌పై అసహనం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం మొదలైన అరబ్‌ క్లబ్‌ చాంపియన్స్‌ క్లబ్‌లో భాగంగా అల్‌-నసర్‌, అల్‌-సాహబ్‌ క్లబ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్‌ చేయడంలో విఫలమయ్యాడు. మ్యాచ్‌లో కూడా గోల్స్‌ నమోదు కాకపోవడంతో 0-0తో పేలవ డ్రాగా ముగిసింది. 

ఈ క్రమంలో మ్యాచ్‌ డ్రాగా ముగిసిందిన్న బాధలో ఉన్న రొనాల్డో డగౌట్‌ వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనకాలే కెమెరామన్‌ అతన్ని అనుసరించాడు. రొనాల్డో ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుండడం చిరాకు తెప్పించింది. చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ మూత తీసి కొన్ని నీళ్లు తాగిన రొనాల్డో ఆ తర్వాత కొన్ని నీళ్లను కెమెరామన్‌వైపు చల్లుతూ.. ''అవతలికి పో'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

దీంతో కెమెరామన్‌ సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు మ్యాచ్‌ ముగిసిన తర్వాత రొనాల్డో తన ట్విటర్‌లో ఒక పోస్టు షేర్‌ చేశాడు. ''గ్రూప్‌ స్టేజీలో మొదటి గేమ్‌ చాలా టఫ్‌గా అనిపించింది.. లీగ్‌ దశలో మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. మేం పోరాడుతాం'' అంటూ కామెంట్‌ జత చేశాడు.

చదవండి: ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్‌ హోస్టెస్‌

కావాలనే రోహిత్‌, కోహ్లి లేకుండా! ఆసియా కప్‌ తర్వాత జట్టు నుంచి అవుట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement