Al-Shabaab
-
'అవతలికి పో'.. కెమెరామన్‌పై రొనాల్డో అసహనం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కెమెరామన్‌పై అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం మొదలైన అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా అల్-నసర్, అల్-సాహబ్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్ చేయడంలో విఫలమయ్యాడు. మ్యాచ్‌లో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో 0-0తో పేలవ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగిసిందిన్న బాధలో ఉన్న రొనాల్డో డగౌట్ వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనకాలే కెమెరామన్ అతన్ని అనుసరించాడు. రొనాల్డో ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుండడం చిరాకు తెప్పించింది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కొన్ని నీళ్లు తాగిన రొనాల్డో ఆ తర్వాత కొన్ని నీళ్లను కెమెరామన్వైపు చల్లుతూ.. ''అవతలికి పో'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కెమెరామన్ సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తన ట్విటర్లో ఒక పోస్టు షేర్ చేశాడు. ''గ్రూప్ స్టేజీలో మొదటి గేమ్ చాలా టఫ్‌గా అనిపించింది.. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. మేం పోరాడుతాం'' అంటూ కామెంట్ జత చేశాడు. 🎥 | مغادرة كريستيانو رونالدو قائد فريق #النصر أرضية الملعب بعد المواجهة "غير راض"، ويطلب من المصور إبعاد الكاميرا عنه. #كأس_الملك_سلمان_للاندية pic.twitter.com/4R2xoB7la7 — الشرق الأوسط - رياضة (@aawsat_spt) July 28, 2023 చదవండి: ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! ఆసియా కప్ తర్వాత జట్టు నుంచి అవుట్ -
ట్రంప్ ఒక 'బ్రెయిన్లెస్ బిలియనీర్’
మొగదిషు: సోమాలియా కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం తీవ్రవాద సంస్థ అల్-షబాబ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడింది. ఆయనను ‘బ్రెయిన్లెస్ బిలియనీర్’ అంటూ తిట్టిపోసింది. అల్-షబాబ్‌పై సైనిక చర్యలను ముమ్మరం చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయటంతో ఇలా అక్కసు వెళ్లగక్కుతూ వీడియో వెలువరించింది. ఇంతటి మూర్ఖపు అధ్యక్షుడిని ఇంతకు మునుపెన్నడూ అమెరికా ప్రజలు ఎన్నుకోలేదని అందులో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆఫ్రికాలో అల్- షబాబ్ సంస్థ సాగిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలతో సోమాలియా, కెన్యా తదితర దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కెన్యాలో మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అల్-షబాబ్ దాడులకు వ్యూహం పన్నింది. దీంతో తీవ్రవాదులతో కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యెట్టా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు దక్షిణ సోమాలియాలో అల్-షబాబ్‌కు పట్టున్న ప్రాంతాలపై వైమానిక దాడులు, సైనిక చర్యలు తీవ్రతరం చేయాలని అమెరికా అధినేత ట్రంప్ కూడా ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వీడియో వెలువరించి ఉంటుందని భావిస్తున్నారు. -
కారు బాంబు పేలుళ్లు: 12 మంది మృతి
మెగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో శుక్రవారం తీవ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని ప్రముఖ పీస్ పార్కుతోపాటు సోమాలియా అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న హోటల్ లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కారు బాంబులు పేల్చారు. ఈ పేలుళ్లలో 12 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. మొదటిగా కారు పార్కు ప్రధాన ద్వారం ద్వారా దూసుకు వచ్చి పేలిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు గుర్తించామని చెప్పారు. ఆ వెంటనే ఎస్‌వైఎల్ హోటల్ వద్ద పేలుడు సంభవించిందని... ఈ ఘటనలో రోడ్డు ఊడ్చే మహిళలు ఐదుగురు మరణించారని తెలిపారు. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ సోమాలియాకు చెందిన తీవ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. ఈ పేలుడు శుక్రవారం చోటు చేసుకుంది. -
కెన్యాలో మరిన్ని దాడులకు తెగబడతాం: అల్ షబాబ్
సోమాలియాలో మోహరించిన బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆ దేశానికి చెందిన తీవ్రవాద సంస్థ అల్ షబాబ్ నాయకుడు అహ్మద్ అబ్ది గాడ్ని కెన్యాను డిమాండ్ చేశారు. లేని పక్షంలో వెస్ట్గేట్ వాణిజ్య సముదాయంపై దాడి తరహా మరిన్ని దాడులకు తెగబడతామని ఆయన కెన్యాను హెచ్చరించారు. ఈ మేరకు అహ్మద్ అబ్ది ప్రసంగించిన ఆడియో క్యాసెట్ సోమాలియా రాజధాని మొగదిషులో గురువారం విడుదల అయింది. తామ చేసే దాడుల వల్ల కెన్యా ఆర్థికంగా పతనం కాక తప్పదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో సోమాలియాలోని కెన్యా వాసులను అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది. ఆ ఘటనపై కెన్యా తీవ్రంగా మండిపడింది. అందుకు ప్రతిగా 2011, ఆక్టోబర్‌లో సోమాలియాలో కెన్యా వేలాది భద్రత దళాలను మోహరించింది. కెన్యా తీసుకున్న నిర్ణయం పట్ల అల్ షబాబ్ మండిపడింది. అందులో బాగంగా వీలు చిక్కిన ప్రతిసారి అల్ షబాబ్ కెన్యాపై దాడికి తెగబడుతోంది. అందులో భాగంగానే శనివారం వెస్ట్గేట్ వాణిజ్య సముదాయంపై ఆ తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఆ ఘటనలో మొత్తం 72 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడి కెన్యా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఘాతుక చర్యకు నిరసనగా నేటి నుంచి మూడు రోజుల పాటు సంతాపదినాలను కెన్యా ప్రకటించింది.