ట్రంప్‌ ఒక 'బ్రెయిన్‌లెస్‌ బిలియనీర్‌’ | Trump 'a brainless billionaire', says Somalia's al-Shabaab | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఒక 'బ్రెయిన్‌లెస్‌ బిలియనీర్‌’

Published Mon, Jul 24 2017 6:10 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

ట్రంప్‌ ఒక 'బ్రెయిన్‌లెస్‌ బిలియనీర్‌’ - Sakshi

ట్రంప్‌ ఒక 'బ్రెయిన్‌లెస్‌ బిలియనీర్‌’

మొగదిషు: సోమాలియా కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం తీవ్రవాద సంస్థ అల్‌-షబాబ్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై విరుచుకుపడింది. ఆయనను ‘బ్రెయిన్‌లెస్‌ బిలియనీర్‌’ అంటూ తిట్టిపోసింది. అల్‌-షబాబ్‌పై సైనిక చర్యలను ముమ్మరం చేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేయటంతో ఇలా అక్కసు వెళ్లగక్కుతూ వీడియో వెలువరించింది. ఇంతటి మూర్ఖపు అధ్యక్షుడిని ఇంతకు మునుపెన్నడూ అమెరికా ప్రజలు ఎన్నుకోలేదని అందులో వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఆఫ్రికాలో అల్‌- షబాబ్‌ సం‍స్థ సాగిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలతో సోమాలియా, కెన్యా తదితర దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కెన్యాలో మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అల్‌-షబాబ్‌ దాడులకు వ్యూహం పన్నింది. దీంతో తీవ్రవాదులతో కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యెట్టా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు దక్షిణ సోమాలియాలో అల్‌-షబాబ్‌కు పట్టున్న ప్రాంతాలపై వైమానిక దాడులు, సైనిక చర్యలు తీవ్రతరం చేయాలని అమెరికా అధినేత ట్రంప్‌ కూడా ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వీడియో వెలువరించి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement