Somalia
-
సొమాలియాలో అమెరికా వైమానిక దాడులు
వాషింగ్టన్: సొమాలియాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా మిలటరీ శనివారం వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక సొమాలియాలో జరిగిన మొట్టమొదటి దాడి ఇది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సొమాలియా ప్రభుత్వ సహకారంతో యూఎస్ ఆఫ్రికా కమాండ్ ఈ దాడులు చేపట్టిందని రక్షణ మంత్రి పీట్ హగ్సెత్ తెలిపారు. వైమానిక దాడిలో పలువురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అయితే, పౌరులెవరికీ ఎలాంటి హాని కలగలేదని తెలిపింది. సీనియర్ ఐసిస్ నేతతోపాటు మరికొందరు లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సీనియర్ నేత కోసం అమెరికా చాలా ఏళ్లుగా గాలిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం మాత్రం ఇతడి అడ్డు తొలగించడంలో ఎంతో ఆలస్యం చేసిందని విమర్శించారు. ఆ పని తాము చేశామని ట్రంప్ ప్రకటించుకున్నారు. తాజా దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వారు దాక్కున్న గుహలు నామరూపాల్లేకుండాపోయాయని తెలిపారు. అయితే, ఈ దాడుల్లో సదరు ఐఎస్ నేత ఎవరు? అతడు హతమయ్యాడా లేదా? అనే విషయాలను ఆయన వెల్లడించలేదు. అమెరికన్లపై దాడులకు పాల్పడే ఐసిస్ తదితర గ్రూపులకు నా హెచ్చరిక ‘మీరెక్కడున్నా కనిపెట్టి, మట్టుబెడతాం’అని ఆయన ప్రకటించారు. సొమాలియా ఉత్తర ప్రాంతంలో దాక్కున్న ఐసిస్ నాయకత్వం విదేశీయులను కిడ్నాప్ చేయడం, డ్రోన్ల దృష్టిలో పడకుండా తప్పించుకోవడం, యుద్ధ తంత్రాలపై తమ శ్రేణులకు తర్పీదు నిస్తున్నాయని అమెరికా సైనికాధికారులు అంటున్నారు. -
Somalia: బీచ్‌లో ఆడుతున్నవారిపై తూటాలు..32 మంది మృతి
సోమాలియాలో ఘోరం చోటుచేసుకుంది. సముద్రతీరంలో ఎగిసిపడుతున్న కెరటాలతో ఉత్సాహంగా ఆడుకుంటున్న వారిపైకి ముష్కరుల తుపాకీ గుళ్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 32మంది మృతి చెందారు.సోమాలియా రాజధాని మొగదిషులోని రద్దీగా ఉన్న బీచ్‌లో అల్-షబాబ్ ఆత్మాహుతి బాంబర్లు అకస్మాత్తుగా దాడికి పాల్పడి, 32 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు అన్నారు. అల్-ఖైదాతో సంబంధం కలిగిన జిహాదీలు గత కొన్నేళ్లుగా ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు తాజాగా లిడో బీచ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. కొద్దిక్షణాల్లోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.బీచ్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందగానే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సోమాలి నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. లిడో బీచ్‌లో గతంలోనూ అల్-షబాబ్‌తో సంబంధం కలిగిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాటి దాడిలో తొమ్మిది మంది మృతిచెందారు. -
సోమాలియాలో బాంబు పేలుడు.. ఐదుగురి మృతి
మొగదీషు: సోమాలియా రాజధాని మొగదీషులోని రద్దీగా ఉండే ఓ కేఫ్ బయట ఆదివారం(జులై 14) బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు. కేఫ్ లోపల కొంత మంది టీవీలో యూరో కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ చూస్తుండగా బయట కారులో పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడుకు కారణం తామే అని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. సోమాలియా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు అల్షబాబ్ మొగదీషులో తరచూ బాంబు పేలుళ్లకు పాల్పడుతుంటుంది. -
Somalia: ఖైదీలు-పోలీసుల మధ్య కాల్పులు..ఐదుగురు మృతి
ఆఫ్రికా తూర్పు తీరంలోని సోమాలియా రాజధాని మొగదిషులో జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఖైదీలకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు ఖైదీలు, ముగ్గురు జవాన్లు మరణించగా, మరో 18 మంది ఖైదీలు గాయపడినట్లు సమాచారం.జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్‌లో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారని కస్టోడియల్ కార్ప్స్ కమాండ్ ప్రతినిధి అబ్దికాని మహ్మద్ ఖలాఫ్ తెలిపారు. సెంట్రల్ జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సాయుధ ఖైదీలు అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వారు గ్రెనేడ్లు ఎలా పొందారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఐదుగురు ఖైదీలను భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. -
భారత నేవీ డేరింగ్ ఆపరేషన్.. వాళ్లంతా సేఫ్
సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన కార్గో(వాణిజ్య) నౌక 'ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వీరందరిని రక్షించినట్లు భారత నావికాదళం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి.. హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది కాగా లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో(అరేబియన్ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. ఇందులో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. తాజాగా హైజాక్‌కు గురైన నౌకలోని 21 మందిని రక్షించింది. The rescue operations of the hijacked vessel MV Lili Norfolk, by the Indian Navy warship INS Chennai, were seen live by the Indian Navy officials at the naval headquarters using the feed sent by the MQ-9B Predator drones of force. Soon after the piracy incident was reported last… pic.twitter.com/rzqP2ZulXm — ANI (@ANI) January 5, 2024 -
15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’
సోమాలియా సముద్ర తీరంలో లైబీరియా షిప్ హైజాక్ చేయబడినట్లు తెలుస్తోంది. ఎంవీ లీలా నార్ఫోక్(MV LILA NORFOLK) అనే లైబీరియన్ షిప్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న భారత నేవి అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. ఇడియన్ నేవి ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో హైజాక్ అయిన షిప్ కదలికలు గమనిస్తున్నామని నేవి అధికారులు పేర్కొన్నారు. హైజాక్ అయిన షిప్, అక్కడి పరిస్థితులకు తెలుసుకోవడానికి కమ్మూనికేషన్ లింక్‌ను సృష్టించామని తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఇండియన్ నేవి పేర్కొంది. లైబీరియాన్ షిప్ హైజాక్ అయినట్లు గురువారం యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్( UKMTO)కు సందేశం వచ్చిందని ఇండియాన్ నేవి తెలిపింది. ఆ షిప్లో ఐదు నుంచి ఆరు మంది గుర్తు తెలియని సాయుధులు ఉన్నట్లు పోర్టల్‌కు వచ్చిన సందేశంలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ నేని.. ఎయిర్ క్రాఫ్ట్తో పర్యవేక్షిస్తూ ఐఎన్ఎస్ చెన్నైను సోమలియా సముద్ర తీరానికి పంపినట్లు తెలిపింది. చదవండి: అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు -
100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్
సాధారణంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో వంద(100) మీటర్ల స్ప్రింట్ రేసుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ వంద మీటర్ల స్ప్రింట్‌లో ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా పరుగుల చిరుతగా పేరు పొందిన ఉసెన్ బోల్ట్ వంద మీటర్ల రేసులో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. వంద మీటర్ల రేసు ప్రపంచ రికార్డు ఇప్పటికి బోల్ట్ పేరిటే పదిలంగా ఉంది. 2009 ఆగస్టు 16న బెర్లిన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ వంద మీటర్ల రేసును కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ విభాగంలో బోల్ట్ మూడు ఒలింపిక్స్‌లో వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ కొట్టి మరెవరికి సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మహిళల విభాగంలోనూ వంద మీటర్ల స్ప్రింట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాంటి వంద మీటర్ల రేసు ప్రాధాన్యతను గంగలో కలిపింది సోమాలియాకు చెందిన అథ్లెట్ నస్రా అబుకర్ అలీ. విషయంలోకి వెళితే.. చైనాలోని చెంగ్డూ వేదికగా 31వ సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా వంద మీటర్ల రేసు నిర్వహించారు. ఈ రేసులో సోమాలియాకు చెందిన అబుకర్ అలీ కూడా పాల్గొంది. అసలు ఆమెను చూస్తే ఏ కోశానా అథ్లెట్‌లా కనిపించలేదు. తన పక్కన ఉన్న సహచర అథ్లెట్లు మంచి ఫిట్‌గా కనిపిస్తుంటే ఆమె మాత్రం ఏ లక్ష్యం లేకుండా నిలబడింది. రేసుకు సిద్ధమైన మిగతా అథ్లెట్లు స్టాన్స్‌కు పొజిషన్ ఇవ్వగా.. అబుకర్ అలీ మాత్రం కనీసం స్టాన్స్ పొజిషన్ తీసుకోవడానికి కూడా బద్దకించింది. ఇక బజర్ రింగ్ మోగగానే తోటి అథ్లెట్లు రేసును తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించగా.. అబుకర్ అలీ మాత్రం మెళ్లిగా పరిగెత్తింది. ఇంకా నయం రేసు మధ్యలోనే వైదొలగకుండా మొత్తాన్ని పూర్తి చేసింది. సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగిన ఆమె వంద మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21 సెకన్లు తీసుకుంది. రేసు పూర్తి అయిన తర్వాత చిన్నపిల్లలా ట్రాక్‌పై జంప్ చేస్తూ వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు దానిని ట్విటర్లో షేర్ చేస్తూ సోమాలియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్‌ను ఏకిపారేశారు. ''ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు కనీస అవగాహన లేని వ్యక్తిని పంపించడం తప్పు.. సరైన ప్రాక్టీస్ లేకుండానే ఆమెను దేశం తరపున బరిలోకి దించడం అవమానం కిందే లెక్క.. మీ దేశం పరువును మీరే తీసుకుంటున్నారు..''అంటూ కామెంట్ చేశారు. The Ministry of Youth and Sports should step down. It's disheartening to witness such an incompetent government. How could they select an untrained girl to represent Somalia in running? It's truly shocking and reflects poorly on our country internationally. pic.twitter.com/vMkBUA5JSL — Elham Garaad ✍︎ (@EGaraad_) August 1, 2023 చదవండి: Ind vs WI 3rd ODI: 18 ఏళ్ల రికార్డు తిరగరాసిన టీమిండియా! ఒక్కొక్కరు ఇలా.. -
లాండింగ్ సమయంలో కుప్పకూలిన విమానం..
సోమాలియా: హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానం సోమాలియా మొగదిషు విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయ్యింది. సిబ్బంది సహా అందులో ప్రయాణిస్తున్న సుమారు 34 మంది సురక్షితంగా బయటపడ్డారు. అడెన్ అడె విమానాశ్రయంలో ఒక విమానం సాంకేతిక లోపం కారణంగా వేగంగా రన్ వే మీదకు దూసుకొచ్చి క్రాష్ లాండింగ్ అయ్యింది. విమాన తాకిడికి ప్రహారీ కంచె తునాతునకలైంది. ఇంతటి ప్రమాదం జరిగినా కూడా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేచిన వేళా విశేషం బాగుంది కాబట్టే బ్రతికి బట్టకట్టామని ప్రయాణికులు షాక్ నుండి బయటపడి ఆశ్చర్యంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేఖరి ఒకరు వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హల్లా ఎయిర్ లైన్స్ కు చెందిన E 120 తరహా విమానం అడెన్ అడె అంతర్జాతీయ విమానాశ్రయంలో 5వ నెంబర్ రన్ వే మీద క్రాష్ లాండింగ్ అయ్యింది. సోమాలియా సివిల్ ఏవియేషన్ అధారిటీ తెలిపిన వివరాల ప్రకారం విమానంలో 34 మంది పాసింజర్లు ఉండగా అందరూ సురక్షితంగా బయట పడ్డారని ఒక్కరికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపారు. వీడియో చూశాక అందులోని వారికెవ్వరికీ ఏమీ కాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. Video of aircraft type E120, operated by HALLA AIRLINE, crash landing on Runway 05 at Aden Ade International Airport (AAIA) today, at 12:23pm local time. All 34 crew and passengers on board have survived according to the Somali Civil Aviation Authority . One person suffered… pic.twitter.com/tMrX7mcxsY — Harun Maruf (@HarunMaruf) July 11, 2023 ఇది కూడా చదవండి: నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య
సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా మొగదిషులోని విద్యాశాఖ కార్యాలయం బయట రద్దీగా ఉండే జోబ్ కూడలి వద్ద శనివారం(ఆక్టోబర్ 29) రెండు కారు బాంబులు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. సోమాలియా అధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్‌ను ఎదుర్కోవడంపై చర్చిస్తుండగానే రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించింది. అంతేగాక గత ఐదేళ్లకాలంలో సోమాలియాలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. విద్యాశాఖ కార్యాలయం గోడ వద్ద తొలి పేలుడు జరగ్గా, రద్దీగా ఉన్న ఒక రెస్టారెంట్ ముందు మరో కారు బాంబు పేలింది. సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. అల్ ఖైదా ప్రోద్భలంతో పనిచేసే అల్‌సబాబ్ ఉగ్ర సంస్థే ఈ పేలుళ్లు జరిపి ఉంటుందని అధ్యక్షుడు ఆరోపించారు. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. గతంలో చాలా సార్లు మొగదిషులో అల్‌సబాబ్ సంస్థే పేలుళ్లకు తెగబడింది. అయితే అల్ షబాబ్ దీనిపై స్పందించలేదు. మరోవైపు సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఉగ్రదాడులను భారత్ ఖండించింది. ఉగ్రదాడి తర్వాత సోమాలియాలో మరణించిన వారి కుటుంబాలకు భారత్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా ఇదే జంక్షన్లో ఐదేళ్ల క్రితం(2017) ట్రక్ బాంబ్ పేలిన ఘటనలో 500 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉగ్ర సంస్థ అల్ షబాబ్ పనేనని తేలింది. చదవండి: హిజాబ్ ఆందోళనల వేళ పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ మృతి.. అంత్యక్రియలకు వేలాది మంది హాజరు -
పేలుళ్లతో దద్దరిల్లిన సొమాలియా రాజధాని
మొగదిషు: సొమాలియా రాజధాని మొగదిషులో కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని జంక్షన్ వద్ద శనివారం రెండు కారు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులంతా పేలుడు సమయంలో అటుగా వాహనాలపై వెళ్తున్న పౌరులేనని మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ తదితర ఉగ్రసంస్థలు రాజధాని లక్ష్యంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. సరిగ్గా ఇదే జోబ్ జంక్షన్లో 2017లో ఉగ్ర సంస్థ అల్ షబాబ్ అమర్చిన ట్రక్ బాంబు పేలి 500 మంది బలయ్యారు. -
ఇదేం విడ్డూరం: మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాల్సిందే
కేప్‌టౌన్: వివాహం అంటే ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. వివాహం అంటే ఓ ప్రమాణం. జీవితాంతం నీ చేతిని విడవను.. అన్ని వేళలా నీకు తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా పెళ్లి అంటే ఇదే భావన కనిపిస్తుంది. విశ్వవ్యాప్తంగా వివాహ బంధానికి ఒక్కటే అర్థం ఉన్నప్పటికి.. పెళ్లి తంతు మాత్రం ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. వివిధ దేశాల్లో.. వేర్వేరు సమూహాల్లో వేర్వేరు ఆచారాలను పాటిస్తారు. వీటిలో కొన్ని చాలా వింతగా ఉంటాయి. పాటించడం కూడా చాలా కష్టం. అలాంటి ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు మీరు చదవబోతున్నారు.ఆ వివరాలు.. మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాలి పెళ్లి అనగానే ఎక్కువ ప్రాధాన్యత అలంకరణకే ఇస్తారు. మరీ ముఖ్యంగా కేశాలంకరణకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక జుట్టు అంటే ఆడవారికి కాస్త ఎక్కువ అభిమానం. ఎంతో జాగ్రత్తగా కేశాలను సంరక్షించుకుంటారు. అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టును పెళ్లి కోసం కత్తిరించడం.. గుండు చేయించడం వంటివి చేయాలంటే.. వినడానికే చాలా బాధగా ఉంది కదా. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన కొన్ని తెగల్లో ఆడవారు పెళ్లి తర్వత జుట్టు పెంచడానికి వీల్లేదు. వివాహానికి ముందే కత్తిరించడం, గుండు చేయించుకోవడం చేయాలి. (చదవండి: అరుదైన వ్యాధి: వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి) బొరానా తెగ వాసుల వింత ఆచారం దక్షిణాఫ్రికాలోని ఇథోపియా, సోమాలియా దేశాల్లో స్థిరపడిన బొరానా తెగ ప్రజల్లో ఈ వింత ఆచారం ఉంది. ఈ తెగ ప్రజలు మొత్తం 500 మంది ఉంటారు. పితృస్వామ్య వ్యవస్థ. గ్రామం, జంతువులు, పరివారం బాధ్యతలన్నింటిని పురుషులే చూసుకుంటారు. ఆడవారు కేవలం ఇంటిని అలంకరించడం.. సంప్రదాయాలను పాటించడం మాత్రమే ఆడవారి బాధ్యత. (చదవండి: రివర్స్ జూ: బోనులో మనం.. స్వేచ్ఛగా సింహాలు) ఎంత ఎక్కువ జుట్టు కత్తిరిస్తే.. అంత మంచి భర్త ఇక ఈ తెగలో ఉన్న వింత ఆచారం ఏంటంటే.. పెళ్లికి ముందు వరకు మాత్రమే ఆడపిల్లలకు జుట్టు పెంచుకునే అవకాశం కల్పిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయంటే.. ఇకఅమ్మాయిలు వారి జుట్టును కత్తిరించుకోవాల్సిందే. ఇదేం విడ్డూరం అంటే.. మంచి భర్త కోసం ఇలా చేయక తప్పదంటారు ఇక్కడి ప్రజలు. ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి వరుడు దొరుకుతాడని.. ఏకంగా గుండు చేయించుకుంటే.. వారికి మంచి భర్త, అత్తింటి వారు లభిస్తారని బొరానా ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడ పెళ్లైన ఆడవారు గుండుతో.. లేదంటే పొట్టి జుట్టుతో దర్శనమిస్తారు. (చదవండి: కొన్ని క్షణాలపాటే నిల్చుంది.. క్లిక్‌మనిపించాడు!) ఎంత పొడవు జుట్టుంటే అంత అదృష్టవంతుడు ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. ఫోటోలు దిగకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారి శరీరం అంతా రక్తంతో తడిసిపోతుందని భావిస్తారు. ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. మంచి భర్త కోసం ఆడవారు గుండు చేయించుకుంటే.. పొడవు జుట్టు ఉన్న వ్యక్తిని ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తారు ఇక్కడి జనాలు. చదవండి: 41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష -
‘సైతాన్ నా తండ్రి’; దెబ్బకు ‘దెయ్యం’ వదిలింది!
మొగాదిషు: హోం వర్క్ చేయనపుడు, పరీక్షలకు సరిగా ప్రిపేర్ కానప్పుడు.. స్కూలు ఎగ్గొట్టేందుకు అల్లరి పిడుగులు చెప్పే కారణాలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. కడుపు నొప్పి, కాలు నొప్పి అంటూ వాళ్లు చేసే అభినయం, హావభావాలు ముచ్చటగొలుపుతాయి. కానీ అల్లరి శ్రుతిమించి, బడికి ఎగనామం పెట్టే ప్లాన్లు బెడిసి కొడితే మాత్రం వీపు విమానం మోత మోగుతుంది. సోమాలియాకు చెందిన ఓ పాఠశాల విద్యార్థినికి ఇలాంటి చేదు అనుభమే ఎదురైంది. పరీక్ష రాయకుండా తప్పించుకుందామని ప్లాన్ చేస్తే, శరీరమంతా వాతలు తేలేలా దెబ్బలు తినాల్సి వచ్చింది. వివరాలు.. ఖతీజా అనే బాలిక రోజూలాగే స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే వెంటనే ఆరోజు నిర్వహించనున్న పరీక్ష, పెండింగ్‌లో ఉన్న హోంవర్క్ విషయం గుర్తుకువచ్చి ఎలాగైనా దాని నుంచి తప్పించుకోవాలనుకుంది. ఇంట్లో తన పాచికలు పారకపోవడంతో స్కూళ్లోనే తన ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్నేహితులు ఇచ్చిన సలహాతో దెయ్యం పట్టినట్లు నటిస్తూ బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టింది. పరీక్ష ప్రారంభం కాగానే డెస్క్‌ను కొడుతూ గిబ్బరిష్ భాషలో మాట్లాడుతూ.. ‘‘దేవుడు అనే వాడు లేనేలేడు. సైతానే నా తండ్రి’’ అంటూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టీచర్లు స్కూలు ప్రార్థనాస్థలం వద్దకు తీసుకువెళ్లి, ‘దెయ్యం’ వదిలించే ప్రక్రియ కోసం ముగ్గురు వ్యక్తులను పిలిపించారు. (అసలు ఇదంతా ఏంటి: కొత్తజంటపై ట్రోలింగ్) ఇక వచ్చీరాగానే రంగంలోకి దిగిన సదరు పురుషులు, ‘‘ఈ అమాయకురాలిని ఎందుకు పట్టిపీడిస్తున్నావు’’అంటూ కర్రలతో ఆమెను కొట్టసాగారు. తొలుత కాస్త గట్టిగానే నిలబడిన ఖతీజా, దెబ్బల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతుండటంతో.. తనకేమీ దెయ్యం పట్టలేదని, తనను వదిలేయాలంటూ బతిమిలాడటం మొదలుపెట్టింది. కానీ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. సైతాన్ ఎప్పుడూ ఇలాగే మాట్లాడిస్తాడని, దెయ్యాన్ని వదిలించేదాకా పట్టువీడమంటూ మరింతగా కొట్టసాగారు. దీంతో ఆ బాలిక అసలు విషయం బయటకు పెట్టక తప్పలేదు. అయినప్పటికీ వాళ్లు ఆమెను నమ్మలేదు. దీంతో ఖురాన్‌లోని పంక్తులు చదువుతూ, పరీక్ష తప్పించుకునేందుకే ఇలా చేశానని నిజం ఒప్పుకొంది. ఈ విషయాన్ని ఓ టిక్‌టాక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. -
ఇండ్‌సోమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: భారత్-సొమాలియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే దిశలో ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థను ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థ ప్రభుత్వేతర, లాభాపేక్షలేని సంస్థ. ఇది భారతదేశం, సోమాలియాకు చెందిన వ్యాపారవేత్తలచే స్థాపించబడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించారు. భారతదేశం, సోమాలియా, ఎగుమతి దిగుమతి కార్యకలాపాలు (బిలియన్ డాలర్లకు దగ్గరగా), సాంకేతిక మార్పిడి, జాయింట్ వెంచర్లకు ఇవి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. సోమాలియా, భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇటీవలి సంవత్సరాలలో సంవత్సరానికి యూఎస్ $ 600 మిలియన్లు, భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాల్లో మొదటి మూడు ఆర్థిక శక్తులలో భారత్ నిలవనుంది. సోమాలియా ప్రస్తుతం ఆర్థిక పునరుద్ధరణ దిశగా వెళుతోంది. పెట్రోలియం, మత్స్య సంపద తదితర సహజ వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. వీటిపైనే ఇప్పుడు ప్రధానంగా ఆయా దేశం దృష్టిసారిస్తుంది. అయితే వ్యవసాయం, పశుసంపద అవసరాలకు అనువైన తయారీకి చాలా అధునాతన ఉత్పత్తి కార్యకలాపాలు, దేశీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశానికి భారీ పెట్టుబడులు అవసరం. ఈ వేదిక ద్వారా రెండు దేశాలలో వ్యాపారాభివృద్ది సాధ్యమవుతుందని ఇండ్సమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ లయన్ వై. కిరోణ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల ముక్య కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిధిగా మాట్లాడుతూ.. ఇండ్‌సోమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు రాష్ట్ర మద్దతు ఉంటుందన్నారు. ఇది ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యాన్ని పెంచడమే కాకుండా దేశాల ఆర్థిక ప్రగతికి, సత్సంబంధాలకు, సాంకేతిక మార్పిడికి దోహదపడుతుందన్నారు. -
సోమాలియాలో మారణహోమం
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం సంభవించిన భారీ కారు బాంబు పేలుడులో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధానికి నైరుతి ప్రాంతంలోని చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ భారీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. పేలుడు ధాటికి ఘటనా ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా కాలిపోయాయి. కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోగా మరికొన్ని నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో కళాశాల బస్సు పేలిపోవడంతో మృతుల్లో అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతానికి మృతులు 78 మంది, క్షతగాత్రులు 125 వరకు ఉన్నప్పటికీ ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత తమదేనంటూ ఏ ఉగ్ర సంస్థా ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. అల్ ఖాయిదా అనుబంధ అల్ షబాబ్ దేశంలో తరచూ కారు బాంబు దాడులకు పాల్పడుతోంది. శనివారం జరిగిన పేలుడు రెండేళ్లలోనే అత్యంత తీవ్రమైంది. 2017లో మొగదిషులో ట్రక్కు బాంబు పేలి 512 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు. నెత్తురోడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు -
భారీ పేలుడు: 76 మంది మృతి
మొగదిషు : సొమాలియాలో ఉగ్రవాదుల రక్తపాతం సృష్టించారు. రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో 76 మంది మృతి చెందారు. నగరానికి చెందిన ఓ చెక్ పాయింట్ సమీపంలో శక్తివంతమైన పేలుడు జరిగింది. దీంతో అక్కడున్న వారంత మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. సొమాలియాలో సాధారణంగా ఆల్‌ఖయిదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ తరుచూ ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 76 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఆమిన్ అంబులెన్స్ డైరక్టర్ అబ్దుల్కాదిర్ అదన్ తెలిపారు. ఇంకా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతిచెందినవారిలో విద్యార్థులు, పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. -
సోమాలియాలో ఉగ్రదాడి
మొగదిషు: దక్షిణ సోమాలియాలోని సరిహద్దు పట్టణం కిస్మాయోలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోగా 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మెదినా హోటల్లోకి సైనిక దుస్తులు ధరించిన కొందరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ ప్రవేశించారు. అదే సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంపై మరో ఉగ్రవాది ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులతో తలపడ్డాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు 12 గంటలపాటు కొనసాగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సహా కెన్యా, టాంజానియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన పౌరులు కలిపి మొత్తం 26 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు కూడా గాయపడ్డారన్నారు. పేలుడు ధాటికి హోటల్ భవనం ధ్వంసమయ్యింది. ఈ దుశ్చర్యకు తామే కారణమని అల్ షబాబ్ ప్రకటించుకుంది. సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అల్ షబాబ్ దశాబ్ద కాలంగా విధ్వంసక చర్యలకు పాల్పడుతోంది. -
రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!
కిస్మాయో : సోమాలియాలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. కారు బాంబుతో ఓ హోటల్‌పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. సోమాలియా పోర్టు సిటీ కిస్మాయోలోని అసాసే హోటల్లో తొలుత కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు అనంతరం కారు బాంబును పేల్చారు. ఈ దుశ్చర్యకు బాధ్యులము తామేనని ఆల్-షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా సోమాలియాలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆ హోటల్లో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో సామాన్య పౌరులు, హోటల్ సిబ్బంది సహా ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిపిన అనంతరం దాదాపు మూడు గంటల పాటు ఉగ్రవాదులు అక్కడే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపనున్నట్లు పేర్కొన్నారు. -
11 మంది భర్తలు.. రాళ్లతో కొట్టి చంపారు..
మొగదిషు, సోమాలియా : సోమాలియాలో ఘోరం జరిగింది. 11 మందిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను అల్ షబాబ్ మిలిటెంట్లు రాళ్లతో కొట్టి చంపారు. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళ విడాకులు ఇవ్వకుండా 11 మందిని వివాహం చేసుకుంది. సోమాలియా రాజధాని మొగదిషుకు చుట్టు పక్కల ప్రాంతాల్లో తరచూ రైడ్స్ నిర్వహించే అల్ షబాబ్ మిలిటెంట్లు ఈమెను పట్టుకున్నారు. విడాకులు ఇవ్వకుండా 11 మందిని పెళ్లి చేసుకున్నందుకు షరియా చట్టం ప్రకారం రాళ్లతో కొట్టిచంపాలని నిర్ణయించారు. దీంతో ఆమెను గొంతు వరకూ భూమిలో పూడ్చి రాళ్లతో కొట్టి చంపారు. షుక్రికి ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. విచారణ సమయంలో మహిళ భర్తలను పిలిపించామని, ఆమె తన భార్య అంటే తన భార్య అని ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చారని అల్ షబాబ్ గవర్నర్ ఒకరు తెలిపారు. -
రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా ఖండం..??
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా రెండుగా చీలిపోనుందా..? ఆఫ్రికా వాసుల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న ఇదే. కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని హైవేపై ఏర్పడిన పగులు ఈ ఆందోళనలకు కేంద్ర బిందువు అయింది. టెక్టోనిక్ ప్లేట్లలో నైరుబీ వద్ద వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్ వ్యాలీ వద్ద భారీ పగులు ఏర్పడింది. కొన్ని మైళ్ల పాటు విస్తరించిన ఈ పగులు కారణంగా నైరోబీ-నరోక్ హైవే కూడా దెబ్బతింది. అంతేకాదు కొన్ని ఇళ్లు సగానికి చీలిపోయాయి కూడా. ఈ పగులు కారణంగా భవిష్యత్‌లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుంతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. నుబియన్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పూర్తవుతుందని వివరించారు. ప్రకృతి బద్దంగా జరిగే ఈ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. విడిపోయే ముక్కలో ఉండే సోమాలియా, కెన్యా, ఇథియోపియాలు హిందూ మహాసముద్రంలో ద్వీపాలుగా మారుతాయని చెప్పారు. దీనివల్ల ఆఫ్రికా ఖండం చిన్నగా మారుతుందన్నారు. -
సోమాలియాలో..పశ్చిమ జిల్లా యువకుడు అదృశ్యం
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన ఒక యువకుడి ఆచూకీ గల్లంతైంది. అప్పటివరకు తాను ఉద్యోగం నిర్వహించిన నౌకలోనే అతడు మాయం కావడం మిస్టరీగా మారింది. ఇది కిడ్నాపా.. లేక ఏదైనా ప్రమాదమా.. అనే విషయంలో స్పష్టతలేక అయోమయం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి, పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడికి చెందిన నక్కా భరత్ నాగేంద్ర మణికంఠ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లాడు. అక్కడ మర్చంట్ నేవీలో కెఫ్టెన్కు సహాయకుడిగా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో భాగంగా అతడు ఈ నెల 8వ తేదీ దుబాయ్ నుంచి సోమాలియా మీదుగా మస్కట్ దేశానికి నౌకలో ప్రయాణం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 16వ తేదీ రాత్రి షిష్టు ఉద్యోగంలో ఉన్న సమయంలో సోమాలియాలో అతడు ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. సదరు విషయాన్ని అతని సహ ఉద్యోగి అయిన గుంటూరు జిల్లాకు చెందిన శివ, నెగ్గిపూడిలోని మణికంఠ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అప్పట్నుంచి తీవ్ర మనో వ్యధకు గురైన కుటుంబీకులు పలు విధాలుగా సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. మణికంఠ తండ్రి నక్కా దుర్గాప్రసాద్ సౌదీలో డ్రైవరుగా పనిచేస్తున్నారు. తల్లి ఝాన్సీలక్ష్మి గృహిణి. మణికంఠ నరసాపురంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అనంతరం మిత్రుల సలహాతో చెన్నై వెళ్లి అక్కడ శిక్షణ పొందాడు. అక్కడ నుంచి దుబాయ్‌కి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడ షిప్‌యార్డులో ఉద్యోగం చేస్తూ షిప్లో కెప్టెన్‌కు సహాయకుడిగా గతేడాది అక్టోబర్ నెలలో ఉద్యోగం ప్రారంభించాడు. మణికంఠ అక్క ప్రమీలాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తమ్ముడు చందు సాయిరాం నెగ్గిపూడిలోనే ఉంటూ చదువుకుంటున్నాడు. రాయబారి అధికారులకు వేడుకోలు మణికంఠ ఆచూకీ కోరుతూ అతని తండ్రి దుర్గాప్రసాద్ దుబాయ్‌లో భారత రాయభార కార్యాలయం వద్ద తన ఆవేదన వినిపించాడు. అలాగే మనదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఉన్నతాధికారులకు కూడా మొరపెట్టుకున్నాడు. తన కుమారుడి ఆచూకీ తెలపాలని కోరుతూ వివరాలు అందజేశాడు. మంత్రి పితానికి మొరపెట్టుకున్న తల్లి కాగా గురువారం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణను మణికంఠ తల్లి ఝాన్సీలక్ష్మి, సోదరి ప్రమీలారాణి కలసి మణికంఠ మిస్సింగ్ విషయాన్ని విన్నవించారు. అలాగే మణికంఠ తమ్ముడు చందు సాయిరాం ఏలూరులో కలెక్టర్ భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మొత్తంగా ఈ సంఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. -
కారు బాంబు దాడిలో ఐదుగురి మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. మాకా అల్ ముకారా ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో పేలుడు పదార్ధాలతో వచ్చిన వాహనం ఒక్కసారిగా పేలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ఘటనతో ఆ ప్రాంతమంతా పొగ వ్యాపించింది. ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకూ మీడియా ప్రకటన చేయలేదు. -
ట్రంప్ ఒక 'బ్రెయిన్లెస్ బిలియనీర్’
మొగదిషు: సోమాలియా కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం తీవ్రవాద సంస్థ అల్-షబాబ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడింది. ఆయనను ‘బ్రెయిన్లెస్ బిలియనీర్’ అంటూ తిట్టిపోసింది. అల్-షబాబ్‌పై సైనిక చర్యలను ముమ్మరం చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయటంతో ఇలా అక్కసు వెళ్లగక్కుతూ వీడియో వెలువరించింది. ఇంతటి మూర్ఖపు అధ్యక్షుడిని ఇంతకు మునుపెన్నడూ అమెరికా ప్రజలు ఎన్నుకోలేదని అందులో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆఫ్రికాలో అల్- షబాబ్ సంస్థ సాగిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలతో సోమాలియా, కెన్యా తదితర దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కెన్యాలో మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అల్-షబాబ్ దాడులకు వ్యూహం పన్నింది. దీంతో తీవ్రవాదులతో కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యెట్టా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు దక్షిణ సోమాలియాలో అల్-షబాబ్‌కు పట్టున్న ప్రాంతాలపై వైమానిక దాడులు, సైనిక చర్యలు తీవ్రతరం చేయాలని అమెరికా అధినేత ట్రంప్ కూడా ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వీడియో వెలువరించి ఉంటుందని భావిస్తున్నారు. -
సోమాలియాలో ఉగ్రవాదుల దాడి
31 మంది మృతి మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌పై అల్–షబాబ్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో మొత్తం 31 మంది మరణించగా, దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో దాడికి పాల్పడ్డ ఐదుగురు ఉగ్రవాదుల్ని పోలీసులు హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. పేలుడు పదార్థాలు, తుపాకులతో రెస్టారెంట్ వద్దకు దూసుకొచ్చిన ఉగ్రవాదులు కారు బాంబుతో భయోత్పాతం సృష్టించారు. అనంతరం రెస్టారెంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు రెస్టారెంట్‌ను ముట్టడించడంతో ఇరు వర్గాల మధ్య రాత్రంగా ఎదురుకాల్పులు కొనసాగాయి. అనంతరం భద్రతా బలగాలు రెస్టారెంట్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి కెప్టెన్ మహమూద్ హుస్సేన్ తెలిపారు. -
ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : భారత్, సోమాలియా దేశాల మధ్య శిక్ష పడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతో పాటూ ధైపాక్షికంగా ఆమోదంపొందడానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం కింద భారత్, సోమాలియాల్లో శిక్షఅనుభవిస్తున్న ఖైదీలు, మిగిలిన శిక్షా కాలాన్ని తమ సొంత దేశాల్లోని జైళ్లలో గడిపే అవకాశం లభించనుంది. ఇప్పటికే యూకే, మారిషస్, బల్గేరియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, కాంబోడియా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఇరాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇజ్రాయిల్, బోస్నియా- హెర్జిగోవినా, యూఏఈ, ఇటలీ, టర్కీ, మాల్దీవులు, థాయిలాండ్, రష్యా, కువైట్, వియత్నం, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్, ఖతార్, మంగోలియా, కజకిస్థాన్, బెహ్రెన్, ఈస్టోనియా దేశాలతో భారత్ ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
అల్–షబాబ్‌కు గట్టి ఎదురుదెబ్బ
నైరోబి: సోమాలియాలో నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్ర సంస్థ అల్–షబాబ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశంలోని ఓ శిబిరంపై దాడిచేసి 52 మంది అల్–షబాబా ఉగ్రవాదులను ముట్టుబెట్టామని కెన్యా సైన్యం శుక్రవారం ప్రకటించింది. దిగువ జుబ్బాలోని బదాదేలో ఉన్న ఈ శిబిరంపై తెల్లవారు జామున సైనికులు తుపాకులతో విరుచుకుపడ్డారని ఆర్మీ ప్రతినిధి కల్నర్ జోసెఫ్ తెలిపారు. అక్కడి నుంచి పలు రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే ఈ పరిణామంపై అల్–షబాబా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోమాలియాలో ఇటీవల ఈ సంస్థ దాడులు తీవ్రతరం కావడంతో అధ్యక్షుడు అబ్దుల్లాహి మహ్మద్ దానిపై యుద్ధం ప్రకటించారు. 2011లో సోమాలియాకు కెన్యా తన సైనికులకు పంపించినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అల్–షబాబ్ ఆనాడే ప్రకటించింది. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పలుమార్లు విజయం సాధించామని కెన్యా ప్రకటించినా, సోమాలియా ప్రజలు కొట్టిపారేశారు. -
సోమాలియాలో కారు బాంబు: 30 మంది మృతి
-
బాంబుదాడిలో 22 మంది మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో తీవ్రవాదులు బాంబుదాడికి పాల్పడ్డారు. సోమాలి యూత్ లీగ్(ఎస్‌వైఎల్) హోటల్ బయట జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 22 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో హోటల్లో భద్రతా సమావేశం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశాన్ని లక్ష్యంగా చేసుకొనే దాడి జరిగిందని భావిస్తున్నారు. బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. పేలుడు జరిగిన సోమాలి యూత్ లీగ్ హోటల్.. ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల సమావేశాలకు ఆతిథ్యమిస్తుంది. గతంలోనూ ఈ హోటల్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బాంబుదాడికి పాల్పడిన ఉగ్రవాది రాకను ముందుగానే గుర్తించిన భద్రతా బలగాలు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ విపలమైనట్లు తెలుస్తోంది. అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. -
జంట బాంబు పేలుళ్లు, 10 మందికిపైగా మృతి
మొగదిషు: సొమాలియాలో ఆదివారం సంభవించిన జంట బాంబుపేలుళ్ల ఘటనలో పదిమందికి పైగా మరణించారు. గాల్కయో పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని రెండు కారు బాంబులను పేల్చారు. దాడి చేసింది తామేనని షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దాడి జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 12 మృతదేహాలను చూసినట్టు స్థానికుడు చెప్పాడు. అక్కడ భయానక వాతావరణం నెలకొంది. సొమాలియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ, పౌరులను లక్ష్యంగా చేసుకుని షబాబ్ ఉగ్రవాద సంస్థ నిత్యం దాడులు చేస్తోంది. -
మాజీ ఎంపీయే ఆత్మాహుతి బాంబర్!
ఆయనో మాజీ ఎంపీ.. అలాంటి ఉన్నత పదవి వెలగబెట్టి కూడా చివరకు ఆత్మాహుతి బాంబర్‌గా మారారు, 13 నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఈ దారుణం ఆఫ్రికా దేశమైన సోమాలియాలో జరిగింది. సోమాలియా రాజధాని మొగదిషు విమానాశ్రయంలో జంట ఆత్మాహుతి దాడులు జరిగి 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడులు చేసిన ఆత్మాహుతి బాంబర్లలో ఒక మాజీ ఎంపీ కూడా ఉన్నట్లు తేలింది. 2004 నుంచి 2010 వరకు సోమాలియా పార్లమెంటులో సభ్యుడిగా పనిచేసిన సలా బాడ్బాడో (53) ఆ తర్వాత వెంటనే అల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థలో చేరారు. సోమాలియాలోని అల్ కాయిదా అనుంధ సంస్థలో చేరేందుకు తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన అప్పట్లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. మంగళవారం నాటి ఇద్దరు బాంబర్లలో ఆయనొకరని అల్ షబాబ్ ఉగ్రవాదులు ప్రకటించారు. తమ ఇద్దరు యోధుల్లో సలా బడ్బాడో ఒకరని, హలేన్ మిలటరీ బేస్ మీద జరిగిన దాడుల్లో ఆయన కూడా పాల్గొన్నారని టెలిగ్రామ్ యాప్ ద్వారాను, అండాలస్ రేడియో స్టేషన్ ద్వారాన విడుదల చేసిన ప్రకటనల్లో చెప్పారు. అల్లా కోసం తాము కొద్ది సేపట్లో ఆత్మాహుతి దాడి చేస్తున్నామంటూ పది నిమిషాల ముందే ప్రకటించారు. కార్లలో బాంబులు పెట్టుకుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఈ ఉగ్రవాదులు.. విమానాశ్రయం ప్రధాన బేస్‌కు 200 మీటర్ల దూరంలో వాటిని పేల్చేశారు. దాంతో ప్రధానంగా చాలామంది సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఉగ్రవాద దాడిని ఆఫ్రికన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. -
సోమాలియాలో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి
మొగదిషు: సోమాలియాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం మొగదిషు విమానాశ్రయానికి సమీపంలో జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 13 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తూర్పు ఆఫ్రికాకు చెందిన అల్ షాబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మొదట ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం ఆత్మాహుతి దాడి జరిగినట్టు పోలీసులు చెప్పారు. చెక్‌పాయింట్ దగ్గర రెండో సూసైడ్ బాంబర్ పేల్చుకున్నట్టు తెలిపారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉందని చెప్పారు. విమానాశ్రయం వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఆఫ్రియా యూనియన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు తమ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. -
మహిళా జర్నలిస్టు కాల్చివేత
మొగదీషు: సొమాలియా రాజధాని మొగదీషులో మహిళా జర్నలిస్టు హత్యకు గురయ్యారు. ప్రభుత్వ రేడియాలో ప్రొడ్యుసర్ గా పనిచేస్తున్న సాగల్ సలాద్ ఒస్మాన్ ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. యూనివర్సిటీ వెలుపల వేచివున్న ఆమె సాయుధ దుండగులు కాల్పులు జరిపారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. మహిళా జర్నలిస్టు హత్యను సొమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహ్మద్, సోమాలి ఇండిపెండెంట్ మీడియా హౌసెస్ అసోసియేషన్(సిమ్హా) ఖండించింది. హంతకులను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని సిమ్హా డిమాండ్ చేసింది. గత ఆరు నెలల్లో మహిళా జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి. -
ఉగ్రదాడి.. ఇద్దరు ఎంపీలు సహా 15 మంది మృతి
మొగాదీషు : సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బుధవారం సాయంత్రం బాంబు దాడులుకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు సాయుధులు బాంబు దాడి చేయడంతో పాటు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మృతులలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారని సోమాలియా అధికారులు గురువారం ప్రకటించారు. కాల్పులు జరిగిన తర్వాత హోటల్ తాత్కాలికంగా మూసివేసిన అధికారులు గురువారం కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్ కొందరు కాల్పులు జరపగా, మరొందరు దుండుగులు హోటల్ ముందు ఉన్న స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హోటల్ ముందు బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. తొమ్మిది మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని, ప్రస్తుతం అక్కడ దుండుగులు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు సాయుధులను మట్టుపెట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. -
మోదీ బేషరతు క్షమాపణ చెప్పాలి
‘సోమాలియా’ వ్యాఖ్యలపై కేరళ సీఎం చాందీ డిమాండ్ కొచ్చి/తిరువనంతపురం: కేరళను సోమాలియాతో పోలుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మోదీ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని కేరళ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం వెల్లడించారు. మోదీపై విరుచుకుపడిన చాందీ.. కేరళీయుల ఆత్మగౌరవాన్ని మోదీ దెబ్బతీశారని, అందుకు వెంటనే బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మోదీ నిశ్శబ్దంగా ఉండటం తగదని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కేరళలో శిశు మరణాల రేటు సోమాలియాకంటే దారుణంగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగింది. అలాగే సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని మీడియా రిపోర్టుల ఆధారంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని, అవి పూర్తిగా తప్పని చాందీ చెప్పారు. ఇలాంటి ప్రకటనలు చేసేముందు అధికారిక నివేదికలను ప్రధానిగా ఉన్న మోదీ సరిచూసుకోవాల్సిందని సూచించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ కంటే శిశు మరణాల రేటు, పోషకాహార లోపం తదితర అంశాల్లో కేరళ చాలా మెరుగ్గా ఉందని, మానవ అభివృద్ధి సూచీలో కేరళ తొలి స్థానంలో ఉంటే.. గుజరాత్ 11వ స్థానంలో ఉందని వివరించారు. -
150 మంది ఉగ్రవాదులు హతం
మొగదిషు: నిన్నమొన్నటివరకు ఐఎస్ఐఎస్ టార్గెట్ గా ఇరాక్, సిరియాల్లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపిన అమెరికా వైమానిక దళం.. చాలా కాలం తర్వాత ఆఫ్రికా గడ్డపై బాంబులు విసిరింది. వరుస దాడులతో సోమాలియాను వణికిస్తోన్న అల్ షబాబ్(అల్ కాయిదా అనుబంధ సంస్థ) సంస్థపై దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ క్యాంప్ ను లక్ష్యంగా చేసుకుని శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో దాదాపు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షక బలగాలపై దాడులకు పాల్పడేలా 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తుందన్న సమాచారం అందటంతో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాడులు నిర్వహించామని, చనిపోయిన వారంతా ఉగ్రవాదులేనని, సాధారణ పౌరులెవ్వరు లేరని పెంటగాన్ అధికారి డేవిడ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆఫ్రికన్ యూనియన్ శాంతి బలగాలతోపాటు విదేశీయులే లక్ష్యంగా దాడులు జరిపేందుకు అల్ షబాబ్ కుట్రపన్నిందని, రెండు నెలల కిందట రాజధాని నగరం మొగదిషులోని ఓ హోటల్ పై దాడి కూడా ఆ సంస్థపనేనని డేవిడ్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్ బలగాల ధాటికి 2011లో మొగదిషును నుంచి తోకముడిచిన ఉగ్రవాదులు ఇటీవల మళ్లీ విజృంభిస్తుండటంతో సోమాలియాలో రక్తపుటేరులు పారుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలోనేకాక కెన్యా, ఉగాండాల్లోనూ అల్ షబాబ్ కు జిహాదీలున్నారు. -
విమానాన్ని పేల్చబోయి కింద పడ్డాడు!
సోమాలియా: అది సోమాలియా నుంచి జిబౌతికి బయలుదేరిన డాలో ఎయిర్ లైన్స్‌కు చెందిన డీ3159 విమానం. సోమాలియా విమానాశ్రయం నుంచి జిబౌతికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. గాల్లోకి విమానం ఎగిరి ఐదు నిమిషాలు గడిచిందో లేదో సరిగ్గా ఇంజిన్ రెక్కభాగం వైపుగా ఉన్న డోర్ వద్ద డామ్మని పేలుడు. విమానంలోని ప్రయాణికులు చూస్తుండగా కాలుతూ ఉన్న ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు దాదాపు 14 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిపోయాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ విమానం నియంత్రణ కోల్పోలేదు. చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్ విమానాన్ని వెనక్కితిప్పి సురక్షితంగా తిరిగి సోమాలియా విమానాశ్రయంలో దించివేశాడు. దీంతో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సోమాలియా సాధారణంగానే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన అల్ షహాబ్ నుంచి ముప్పును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పేలుడు సంభవించిన సందర్భంగా అధికారులు, అందులోని ప్రయాణీకులు పలు రకాల అంశాలు తెలిపారు. విమాన పైలెట్ వ్లాదిమిర్ వోడోపివెక్(64) ఈ సంఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ 'నేను అనుకుంటున్నాను అది ఒక బాంబు. అదృష్టవశాత్తు విమానం నియంత్రణ కోల్పోలేదు. అందుకే, నేను తిరిగి మొగాదిషు విమానాశ్రయంలో ఫ్లైట్ దించివేశాను. నా జీవితం మొత్తంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు' అని అన్నారు. ఇక ఇదే విమానంలో ప్రయాణించిన సోమాలియా అంబాసిడర్ అవాలే కుల్లానే ఫేస్ బుక్ లో ఈ ఘటన వివరిస్తూ 'విమానంలో పెద్ద శబ్దం వచ్చింది. కానీ అక్కడ ఏం కనిపించలేదు.. కొద్ది సెకన్లపాటు దట్టంగా పొగమాత్రం వచ్చింది' అని చెప్పారు. ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని చెబుతూ 'నాకు తెలియదు అది బాంబో లేక విద్యుత్ షాకో.. కానీ విమానంలో పెద్ద శబ్దం మాత్రం వినిపించింది. అయితే, ఓ వ్యక్తి విమానం నుంచి పడిపోయాడా లేదా అని మాత్రం నాకు తెలియదు' అని చెప్పాడు. కాగా మహ్మద్ హుస్సేన్ అనే పోలీసు అధికారి మాట్లాడుతూ బలాద్ పట్టణంలో విమానం పై నుంచి పడిన ఓ పెద్దాయనను గుర్తించారు అని చెప్పాడు. అయితే, విమానం నుంచి పడిపోయిన వ్యక్తి ఉగ్రవాదా, లేక విమానంలో ఏదైన పేలుడు పదార్థం పేలి కారణంగా పడిపోయాడా, లేదా ఆత్మాహుతి దాడికి దిగి ఆ మంటలు అంటుకున్న కారణంగా తట్టుకోలేక కిటికీలో నుంచి దూకేశాడా అనేది దర్యాప్తు అనంతరం తేలాల్సి ఉంది. -
రెస్టారెంట్‌పై దాడి : 19 మంది మృతి
మొగాదీషు : సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని సముద్ర తీర రెస్టారెంట్‌పై తీవ్రవాదులు బాంబు దాడి చేసి.... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహ్మాన్ శుక్రవారం వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటన అత్యంత పాశవికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దాడిలో అమాయక ప్రజలు మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం రెస్టారెంట్లో ప్రజలు భోజనం చేస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుందన్నారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ షిబాబ్ ప్రకటించింది. కాగా ఈ ఘటనలో నలుగురు తీవ్రవాదులు మరణించగా.... మరోకరని పట్టుకున్నామని చెప్పారు. -
సోమాలియాలో 25 మంది తీవ్రవాదులు మృతి
మొగాదీష్ : సోమాలియాలోని హిరాన్ ప్రాంతంలో ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారని సైనిక ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. వీరంతా అల్ షబాబ్ తీవ్రవాద సంస్థకు చెందిన వారని తెలిపారు. ప్రభుత్వ దళాలు, ఇథియోపియన్ దళాలు సంయుక్తంగా గత 48 గంటల పాటు జరిపిన పోరులో ఈ తీవ్రవాదులను మట్టుబెట్టారని చెప్పారు. లక్ జీలో గ్రామంలో అత్యధికంగా తీవ్రవాదులు మరణించారని చెప్పారు. అల్ షబాబ్ తీవ్రవాదుల చెరలో ఉన్న గ్రామాలను వారి నుంచి విడిపించే వరకు ఈ పోరు జరుగుతుందని సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
అల్ షబాబ్ దాడిలో తొమ్మిది మంది మృతి
మొగాదిషు: సోమాలియాలో అల్ షబాబ్ సంస్థకు ఉగ్రవాదులు చేసిన బాంబుల దాడిలో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ముందస్తు వ్యూహం ప్రకారం ప్రభుత్వ పాలనా కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు బాయిడోవా అనే నగరంలో వివిధ చోట్ల బాంబులు పేల్చారు. ముఖ్యంగా బాయిడోవా ప్రెసిడెంట్ షరీఫ్ హసన్ షేక్ అదాన్ను లక్ష్యంగా చేసుకుని ఆయన నివాసానికి సమీపంలో బాంబులు పేల్చారు. ఈ బాంబులు పేలిన ప్రాంతాల్లో ఆఫ్రికన్ యూనియన్, యూనైటెడ్ నేషన్స్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ బాంబుల వల్ల గాయపడినవారిలో సైనికులు కూడా ఉన్నారు. -
సోమాలియాలో తీవ్రవాదుల దాడి: 25 మంది మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో శుక్రవారం తీవ్రవాదులు రెచ్చిపోయారు. హోటల్లపై బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మొగాదీషు డిప్యూటీ మేయర్‌తో ఎంపీ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హోటల్‌పై తీవ్రవాదులు బాంబు దాడి ప్రారంభించగానే కారు బాంబు, ఆత్మాహుతి దాడి చేసుకున్నారని వివరించారు. కాగా సైన్యం ఘటన స్థలానికి చేరుకుని తీవ్రవాదులపైకి కాల్పులు ప్రారంభించిందని చెప్పారు. దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని... అయితే తీవ్రవాదుల దాడిలో హోటల్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని విశదీకరించారు. శుక్రవారం నేపథ్యంలో హోటల్ లో మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా ప్రార్థనలో ఉన్నారని చెప్పారు. దేశాధ్యక్షుడు భవనానికి సమీపంలో ఈ హోటల్ ఉంది. ఈ దాడికి పాల్పడింది ఆల్ ఖైదా అనుబంధ సంస్థ షిబాబ్ ప్రకటించింది. -
చెరలో... నాలుగేళ్లు... లక్ష నరకాలు!
నాలుగు సంవత్సరాల క్రితం సోమాలియాలోని కోస్తా పట్టణం హరార్దెరె సమీపంలో ఓ నౌక కెప్టెన్‌తో సహా ఏడుగురు భారతీయ నావికులను సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. సమీపంలోని అడవుల్లో అష్టకష్టాలు పెట్టారు. సుదీర్ఘ చర్చల తరువాత పక్షం రోజుల క్రితం వారిని విడుదల చేశారు. ‘సముద్రపు దొంగలు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చారా? తక్కువ ఇచ్చారా? అసలు ఎంత ఇచ్చారు?’ అనే విషయాలు వివరంగా తెలియకపోయినా, ఆ నాలుగు సంవత్సరాల్లో బందీలు ఎదుర్కొన్న బాధలు తెలిశాయి. వారి మాటల్లోనే కొన్ని విషయాలు... ‘‘నాలుగు సంవత్సరాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాం. మా ముఖాన నాసి రకమైన బియ్యం పడేసేవారు. కూరగాయలేమీ ఉండేవి కాదు. ఆ బియ్యాన్నే ఉడకబెట్టుకొని తినేవాళ్లం. ఇక నీళ్ల గురించి చెప్పనక్కర్లేదు’’ అని గతాన్ని కన్నీళ్ల మధ్య గుర్తు తెచ్చుకున్నాడు మన్జీత్సింగ్. ఆహారమే కాదు వస్త్రాల గురించి కూడా పట్టించుకునే వారు కాదు సముద్రపు దొంగలు. పాత లుంగీలు, చిరిగిన బనియన్లు, టీషర్ట్లు ఇచ్చేవాళ్లు. అవి ఒక్కసారి ధరిస్తే, పూర్తిగా పాడైన తరువాతగానీ వేరేవి ఇచ్చేవాళ్లు కాదు. ఇక అండర్వేర్ల ఊసే ఉండేది కాదు. తమ పాత బనీయన్నే అండర్‌వేర్‌గా కుట్టుకునేవారు. కారణం తెలియదుగానీ సోమాలియా సముద్రపు దొంగలు సిక్కులు అంటే మండిపడేవారు. ఆ భయంతోనే చండీఘడ్‌కు చెందిన సోహన్‌సింగ్ తన మతం ఏమిటన్నది తెలియకుండా దాచడానికి ప్రయత్నించేవాడు. ‘‘నేను హిందువును’’ అని చెప్పుకున్నా దొంగలు బలవంతంగా అతడి గడ్డాన్ని తీయించారు. ఆ సంఘటన తనను ఎంతో బాధకు గురి చేసిందని చెబుతాడు సోహన్‌సింగ్. ఒకవైపు 55 డిగ్రీల ఉష్ణోగ్రత, మరోవైపు నైలాన్ దుస్తులు...అమ్మో...ఆ బాధ మాటలకు అందదు’’ అంటూ ఆ నరకప్రాయమైన అనుభవాలను ప్రస్తావించాడు జోసెఫ్. బతుకు మీద ఒకే ఒక ఆశ ఏమిటంటే ఆరు నెలలకొకసారో, సంవత్సరానికి ఒకసారో కుటుంబసభ్యులతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం. అయిదు నిమిషాలకు మించని ఆ ఫోన్ సంభాషణ మాట్లాడినట్లు ఉండేది కాదు. మాట్లాడనట్లూ ఉండేది కాదు. తాము ఇంకా సజీవంగా ఉన్నామని లోకానికి తెలియజేయడానికే అలా ఫోన్లో మాట్లాడించేవారు. ‘‘వారి మాటలకు ఎదురు చెప్పినా, అసహనంగా కనిపించినా చేయి చేసుకునేవారు. క్రూరత్వం గురించి కథల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప నిజజీవితంలో చూడడం ఇదే’’ అంటాడు 45 ఏళ్ల భీమ్సేన్. నౌకలో ఈయన ఎలక్ట్రికల్ ఆఫీసర్. ‘‘ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇక రేపో మాపో విడుదల చేస్తాం’’ అన్నప్పుడల్లా బందీల కళ్లలో వేల వసంతాలు వెల్లివిరిసేవి. అలా నాలుగు సంవత్సరాల్లో ఎన్ని ఆశలు పెట్టారో! ‘‘మానసిక, శారీరక హింసల మధ్య నలిగి పోతూ చివరి ఆశను కూడా వదులుకున్నాం’’ అని చేదు గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు జోసెఫ్. బందీలైన నావికులను చేతులు వెనక్కి కట్టి, చావ బాదుతూ ఫోటోలు తీసేవారు. వాటిని నౌక యజమానికి పంపి- ‘‘డబ్బులు పంపించకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని బెదిరించేవారు. భారత ప్రభుత్వ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సోమాలియా ప్రభుత్వం సముద్రపు దొంగలతో అనేక దఫాలుగా జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. మొన్న అక్టోబర్ 30న బందీలు విడుదలయ్యారు. కెన్యా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కెక్యూ-202లో వారు స్వదేశానికి చేరుకున్నారు. తమ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులను సుదీర్ఘకాలం తరువాత కలుసుకున్నారు. కథ సుఖాంతమైంది. ‘‘ఆ నరకపు రోజులను పూర్తిగా మరిచిపోండి’’ అన్నారు ఒక సైకాలజిస్ట్ అప్పటి బందీలలో ఒకరైన భాస్కరన్‌తో. భాస్కరన్ నోటి నుంచి అయితే సమాధానం రాలేదుగాని, అతడి కళ్లు చెబుతున్నాయి...‘అది ఇప్పట్లో సాధ్యపడే విషయమేనా?’ అని. -
కారు బాంబు పేలుడు: ఐదుగురు మృతి
సోమాలియా: సోమాలియా రాజధాని మొగదీషులో కారు బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారి మక్కా అల్ ముక్కారమలోని పనోరమా బార్ సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు. -
సోమాలియా అధ్యక్ష భవనంపై ఉగ్రవాదుల దాడి!
మొగదిషు: సోమాలియా అధ్యక్ష భవనంపై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ సహబ్ దాడి చేసింది. ఈ ఘటన సోమాలియా రాజధానిలో మొగదిషులో చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష భవనం వద్ద ఇంకా పోరాటం చేస్తున్నామని అల్ సహబ్ కు చెందిన ప్రతినిధి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాడి జరిగిన సమయంలో సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహముద్ భవనంలో లేరని తెలిసింది. రంజాన్ మాసంలో దాడులను అల్ సహబ్ ఉధృతం చేస్తోంది. గత శనివారం పార్లమెంట్ వద్ద కారు బాంబు ఘటనలో నలుగురు మృతి చెందారు. -
కెన్యాలో నరమేధం
నైరోబీ/అబూజా: కెన్యాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశ రాజధాని నైరోబీలోని ఓ షాపింగ్‌మాల్‌లో మారణకాండ సృష్టించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు మాల్లోని సిబ్బందిని, ప్రజలను బందీలుగా పట్టుకుని, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణంలో ఇద్దరు భారతీయులు సహా మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు వెయ్యి మందిని మాల్ నుంచి సురక్షితంగా కాపాడినా చాలామంది ఇంకా ముష్కరుల చేతిలో బందీలుగా ఉన్నారు. కచ్చితంగా ఎంత మంది బందీలుగా ఉన్నారన్న విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. ఉగ్రవాదుల సంఖ్యపైనా అయోమయం నెలకొంది. భారీ ఎత్తున ఆయుధాలు ధరించిన 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని కెన్యా అంతర్గత భద్రత మంత్రి జోసెఫ్ ఒలే లెంకూ చెప్పారు. ముష్కరుల దాడిలో మరణించిన విదేశీయుల్లో ఇద్దరు భారతీయులు, ఇద్దరు కెనడా పౌరులు, ఇద్దరు ఫ్రాన్స్ జాతీయులు, ఒక దక్షిణ కొరియా పౌరుడు ఉన్నారు. సోమాలియాలో సైనిక చర్యకు ప్రతీకారంగా.. శనివారం మధ్యాహ్నం నైరోబీలోని వెస్ట్గేట్ షాపింగ్ మాల్‌పై ఈ దాడి జరిగింది. దాడి సమయంలో వేలమంది భవనంలో ఉన్నారు. ఈ మాల్ యజమాని ఇజ్రాయిల్‌కు చెందినవారు. సోమాలియాకు చెందిన అల్‌కాయిదా అనుబంధ ‘అల్ షెబాబ్’ సంస్థ ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. సోమాలియాలో దక్షిణ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాదుల అణచివేతలో కెన్యా సైన్యం పాలుపంచుకుంటోంది. 2011 నుంచి ఆఫ్రికన్ యూనియన్ బలగాలతో కలిసి దాదాపు 4 వేల మంది కెన్యా సైనికులు సోమాలియాలో ముష్కర మూకలతో పోరాటం చేస్తున్నారు. ఇందుకు ప్రతీకారంగానే తాము వెస్ట్గేట్ షాపింగ్ మాల్‌పై దాడి చేశామని ‘అల్ షెబాబ్’ సంస్థ ప్రకటించుకుంది. ముఖాలకు మాస్కులు, పెద్ద ఎత్తున ఆయుధాలతో మాల్‌లోకి ప్రవేశించిన వెంటనే విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. పౌరులు బందీలుగా ఉండటంతో సైనికులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఇప్పటిదాకా ఉగ్రవాదులు 59 మందిని పొట్టనబెట్టుకున్నారని మంత్రి జోసెఫ్ వెల్లడించారు. మృతుల్లో ఘనాకు చెందిన ప్రముఖ కవి, రాజకీయవేత్త కోఫీ అవూనుర్ కూడా ఉన్నారు. ఈయన ఘనా మాజీ అధ్యక్షుడు జాన్ అట్టా మిల్స్‌కు గతంలో సలహాదారుగా వ్యవహరించారు. మృతుల్లో తమిళనాడు వాసి... కాల్పుల్లో మరణించిన ఇద్దరు భారతీయుల్లో ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో స్థానిక హార్లేస్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న తమిళనాడువాసి శ్రీధర్ నటరాజన్(40), కెన్యాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి మేనేజర్ మనోజ్ జైన్ తనయుడు పరామ్‌శు జైన్ (8) ఉన్నట్లు పేర్కొంది. నటరాజన్ భార్య మంజుల, పరామ్‌శు జైన్ తల్లి ముక్తా జైన్, ఆమె కూతురు పూర్వి జైన్లతోపాటు ఫ్లెమింగో డ్యూటీ ఫ్రీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజన్ రామచంద్రన్‌లు గాయాలపాలయ్యారు. కెన్యాలో భారతీయులు/భారత సంతతికి చెందినవారు సుమారు 70 వేల మంది ఉన్నారు. ఈ దాడిని ప్రధాని మన్మోహన్ ఖండించారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టకు లేఖ రాశారు.