సోమాలియాలో ఘోరం చోటుచేసుకుంది. సముద్రతీరంలో ఎగిసిపడుతున్న కెరటాలతో ఉత్సాహంగా ఆడుకుంటున్న వారిపైకి ముష్కరుల తుపాకీ గుళ్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 32మంది మృతి చెందారు.
సోమాలియా రాజధాని మొగదిషులోని రద్దీగా ఉన్న బీచ్‌లో అల్-షబాబ్ ఆత్మాహుతి బాంబర్లు అకస్మాత్తుగా దాడికి పాల్పడి, 32 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు అన్నారు. అల్-ఖైదాతో సంబంధం కలిగిన జిహాదీలు గత కొన్నేళ్లుగా ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు తాజాగా లిడో బీచ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. కొద్దిక్షణాల్లోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి.
బీచ్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందగానే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సోమాలి నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. లిడో బీచ్‌లో గతంలోనూ అల్-షబాబ్‌తో సంబంధం కలిగిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాటి దాడిలో తొమ్మిది మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment