Deadly accident
-
Somalia: బీచ్‌లో ఆడుతున్నవారిపై తూటాలు..32 మంది మృతి
సోమాలియాలో ఘోరం చోటుచేసుకుంది. సముద్రతీరంలో ఎగిసిపడుతున్న కెరటాలతో ఉత్సాహంగా ఆడుకుంటున్న వారిపైకి ముష్కరుల తుపాకీ గుళ్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 32మంది మృతి చెందారు.సోమాలియా రాజధాని మొగదిషులోని రద్దీగా ఉన్న బీచ్‌లో అల్-షబాబ్ ఆత్మాహుతి బాంబర్లు అకస్మాత్తుగా దాడికి పాల్పడి, 32 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇదొకటని పోలీసులు అన్నారు. అల్-ఖైదాతో సంబంధం కలిగిన జిహాదీలు గత కొన్నేళ్లుగా ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు తాజాగా లిడో బీచ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. కొద్దిక్షణాల్లోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.బీచ్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందగానే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సోమాలి నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. లిడో బీచ్‌లో గతంలోనూ అల్-షబాబ్‌తో సంబంధం కలిగిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాటి దాడిలో తొమ్మిది మంది మృతిచెందారు. -
సదాశివనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
బెంగళూరు-పుణే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- నిలిచి ఉన్న మినీ బస్‌ను ఢీకొన్న లగ్జరీ బస్సు - కొల్హాపూర్ జిల్లా వటార్ గ్రామ సమీపంలో ఘటన - ముగ్గురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు సాక్షి, ముంబై: బెంగళూరు-పుణే జాతీయ రహదారిపై కోల్హపూర్ జిల్లా వటార్ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిసింది. వివరాలు.. కర్నాటకలోని ధారవడ్ నుంచి ఓ పెళ్లి బృందం మినీ బస్సులో పుణేకి బయలుదేరింది. తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో టీ తాగడానికి వటార్ గ్రామం వద్ద డ్రైవర్ బస్సును నిలిపాడు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ బస్సు మినీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. భారీ శబ్దంతో నిలిచి ఉన్న మినీ బస్సు దూరంగా రోడ్డు కిందికి పడిపోయింది. స్థానిక ప్రజలు, పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఆశాభి హండగల్ (70), షాహీనా హండగల్ (15), షహీదా హండగల్ (20) మృతి చెందారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వడ్గావ్ పోలీసులు లగ్జరీ బస్సు డ్రైవర్ కోంబి నాయిక్ (38)ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చే స్తున్నారు. -
కాటుకపల్లి-బండిరేవుల నడుమ ఘోర ప్రమాదం
భద్రాచలం రూరల్ / చింతూరు :భద్రాచలం, చట్టి జాతీయ రహదారి-30లో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక, చింతూరు మండలాల సరిహద్దుల్లోని కాటుకపల్లి, బండిరేవు నడుమ కుంట నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు, భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కేర్లాపాల్ వెళుతున్న మహీంద్రా మ్యాక్స్ ఢీకొన్నాయి. మహీంద్రాలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు మహిళ లు సహా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా జగన్ వశీకర్ అనే వ్యక్తి తీవ్రగాయాలతో భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం...ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లాపాల్ గ్రామానికి చెందిన గజానన్ భద్రే కుటుంబం ఆస్పత్రి పని నిమిత్తం మహీంద్రా మ్యాక్స్‌లో భద్రాచలం వచ్చి తిరిగి వెళుతుండగా ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంంది. గజానన్ భద్రే, సంతోష్, మహేష్ భద్రే, ప్రమీలా, కరీనాలతో పాటు డ్రైవర్ లక్ష్మీనాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. అతివేగమే ప్రమాదానికి కారణం మహీంద్రా వాహనాన్ని వేగంగా నడుపుతున్న డ్రైవర్ ఆర్టీసీ బస్సు సమీపానికి రాగానే వాహనాన్ని నియంత్రించలేక బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టాడు. మహీంద్రా వాహనం సగభాగం వరకు బస్సు ముందు భాగంలోకి దూసుకుపోయింది. ముందు సీట్లో కూర్చున్న ముగ్గురు, మధ్య సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు, వెనుక సీట్లోని ఇద్దరు మృతి చెందారు. భద్రాచలం రూరల్, చింతూరు పోలీసులతో పాటు అనేకమంది ప్రయాణికులు గంటపాటు శ్రమించి బస్సులో ఇరుక్కున్న వాహనాన్ని, దాంట్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయగలిగారు. చింతూరు సీఐ అమృతరెడ్డి, ఏడుగురాళ్లపల్లి ఆర్ఎస్ఐలు సోమ్లూనాయక్, శంకరప్రసాద్, భద్రాచలం రూరల్ ఎస్ఐలు రాజు, యాదగిరి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదంతో 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో బస్సు కండక్టర్‌తో పాటు కొందరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. -
ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై : నామక్కల్ జిల్లా కొసవం పట్టి దేవేంద్ర పురానికి చెందిన స్నేహితులు రవి(42), శరవణన్(45) అట్టపెట్టెల సేకరణ ఏజెన్సీని నడుపుతున్నారు. ఈ ఇద్దరు తమ పిల్లలతో పాటుగా మరో ఇద్దరితో కలిసి అయ్యప్ప దర్శనార్థం రెండు రోజుల క్రితం శబరిమలైకు కారులో బయలు దేరారు. కొసవం పట్టికి చెందిన భక్తుడు రామతిలకం కారును నడిపాడు. అయ్యప్పను దర్శించుకుని శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మరి కాసేపట్లో స్వగ్రామానికి చేరుకోవాల్సిన ఈ అయ్యప్ప భక్తుల బృందాన్ని మృత్యువు కబళించింది. ఆదివారం వేకువ జామున రెండున్నర గంటల సమయంలో నామక్కల్ పరమత్తి పట్టి సమీపంలోని ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొంది. రెండు వాహనాలు అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో సంఘటనా స్థలంలోనే రవి, ఆయన కుమారులు విఘ్నేశ్వరన్,(13), కార్తీ(5) డ్రైవర్ రామ తిలకం, శరవణన్ కుమారుడు ప్రవీణ్ కుమార్(13)లు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ శరవణన్, విఘ్నేశ్వరరాజు, విజయకుమార్‌ను అటు వైపుగా వె ళుతున్న వాహన చోదకులు గుర్తించారు. గాయపడ్డ ముగ్గుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పరమిత్తి పట్టి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మృత దేహాలను మార్చురీకి తరలించారు. అయ్యప్ప దర్శనం ముగించుకుని వస్తున్న తమవాళ్లను ప్రమాదం రూపంలో మృత్యువు మింగేయడం కొసవం పట్టి దేవేంద్ర పురంలో విషాదాన్ని నింపింది. బస్సు బోల్తా కాంచీపురానికి చెందిన 48 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం శనివారం రాత్రి శబరిమలైకు బస్సులో బయలుదేరారు. వీరు పయనిస్తున్న బస్సు వేకువజామున కృష్ణగిరి సమీపంలోని పొచ్చంపల్లి చెరువు కట్ట వద్ద బోల్తా పడింది. బస్సులో ముందు వరుసలో కూర్చుని ఉన్న అయ్యప్ప భక్తురాలు అంజల ఆచ్చి(70) సంఘటనా స్థలంలోనే మరణించారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయట పెట్టారు. వీరందరికీ ప్రథమ చికిత్స అనంతరం శబరి మలైకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. -
నిర్లక్ష్యంతోనే ప్రాణాలు బలి
రాకాసి రైలు ముక్కు పచ్చలారని పాలబుగ్గలను చిదిమేసింది. అమాయక పిల్లల నిండు ప్రాణాలను బలిగొంది. ఎంతో మంది తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది. తన చిన్నారులు ఇక లేరని, తిరిగి రార ని ఓ తండ్రి గుండె పోటుతో మృతి చెందడం చూస్తే గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. మాసాయిపేట వద్ద రైలు ప్రమాదం ముమ్మాటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యమేనని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. - సాక్షి నెట్వర్క గార్డును నియమించాలి.. స్కూల్ వ్యాన్ నడిపే డ్రైవర్లు ఓపికతో ఉండాలి. నిష్ణాతుల్ని యాజమాన్యం నియమించుకుంటే మంచిది. అదే విధంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద తప్పకుండా గార్డును నియమించాలి. - తిరుమల, ఉపాధ్యాయురాలు గేట్లను ఏర్పాటు చేయాలి రైల్వే ప్రమాద ఘటనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భారత దేశ వ్యాప్తంగా దాదాపు 30 వేల రైల్వే క్రాసింగ్‌లు ఉండగా అందులో పదిహేను వేల వరకు గార్డులు లేని గేట్లే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే శాఖ రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లను ఏర్పాటు చేయాలి. - నవీన్, కరస్పాండెంట్, కాకతీయ టెక్నో స్కూల్, రాంనగర్ డ్రైవర్‌దే తప్పు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా పెరిగిన రోజుల్లో కూడా రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. రైల్వే క్రాసింగ్ వద్ద రెండు వైపులా చూసుకొని బస్సు నడపకపోవడం డ్రైవర్‌దే తప్పు. రైలు వస్తుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్‌కు, క్లీనర్‌కు ఉండాలి. - రూపాధరణి, విద్యార్థిని ప్రమాదం జరిగినప్పుడే హడావుడి... రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేటు, సిగ్నల్స్, గార్డును నియమిస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదు. సంఘటనలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తారే తప్ప ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోరు. - చప్పిడి సుభాన్‌రెడ్డి, నవీన విద్యా సంస్థల చైర్మన్ ఫిట్నెస్ చూడాలి బస్సు ఫిట్నెస్ను ఎలా చూసుకుంటున్నామో డ్రైవర్ కూడా ఫిట్నెస్ కలిగి ఉన్నాడో లేడో చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలపై ఉన్నది. డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. - రామలింగం, ప్రిన్సిపాల్, క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీనగర్‌కాలనీ పునరావృతం కాకుండా చర్యలు... నిర్లక్ష్యానికి కారకులు ఎవరైనప్పటికీ చనిపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురాలేరు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. - ఇ.సుష్మ, విద్యార్థిని -
కన్నతల్లుల కడుపుకోత
ఆ చిన్నారులు తెల్లవారగానే లేచారు.. వడివడిగా తయారయ్యారు. పాఠశాలకు వెళుతూ అమ్మానాన్నలకు బైబై చెప్పారు. ఎంతో ఉషారుగా పాఠశాల బస్సెక్కారు. అంతలోనే ఆ పాలబుగ్గలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు చిదిమేసింది. వెల్దుర్తి మండలం మాసాయిపేట కాపలాలేని రైల్వేగేట్ వద్ద గురువారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పాఠశాల బస్సును ఢీకొట్టిన ఘటనలో 14 మంది విద్యార్థులతోపాటు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కన్నతల్లులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ►పసిమొగ్గలను చిదిమేసిన మృత్యుశకటం ►ఛిద్రమైన దేహాలు.. చెల్లాచెదురైన ఆశలు ►కన్నీటి సంద్రమైన మెతుకుసీమ ►ఘటనాస్థలికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మెదక్ : ఆ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థుల నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. చదువులమ్మ ఒడిలో ఆడిపాడాల్సిన ఆ విద్యార్థులు.. మృత్యుఒడిలో విగతజీవులుగా మారారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కాపలాలేని రైల్వే గేట్ వద్ద గురువారం ఉదయం రైలు వస్తున్నా చూసుకోకుండా బస్సును అలాగే పట్టాలెక్కించడంతో.. నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొని ఆ బస్సులోని విద్యార్థులతోపాటు, బస్సు డ్రైవర్, క్లీనర్ మృత్యువాతపడ్డారు. అప్పటిదాకా కేరింతలతో వున్న చిన్నారుల దేహాలు ఒక్కసారిగా ఛిద్రమవడాన్ని చూసి భరించలేని ఆ కన్నతల్లులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి మృతదేహాలకు గురువారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఆ చిన్నారులను తలుచుకుంటూ.. వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వారి రోదనలను ఆపడం ఎవరితరం కాలేకపోయింది. ప్రమాదం విషయం తెలుసుకున్న మెదక్ ప్రజలు ఆస్పత్రికి పెద్దఎత్తున చేరుకుని చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలి చేసుకుంటూ.. కష్టనష్టాలు భరిస్తూ...పిల్లలను బడికి పంపితే మా కలలను కల్లలు చేస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా.. బిడ్డా? అంటూ కన్నవారు గుండెలు బాదుకున్నారు. మేమేం పాపం చేశామని దేవుడు మాకే ఎందుకు ఈ శిక్ష విధించాడంటూ రోదించారు. ఇంటి దీపాలను ఆర్పేసిన నిర్లక్ష్యం.. అధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలు, డ్రైవర్, క్లీనర్ల నిర్లక్ష్యం కన్నవారి కనుపాపలను కాటేసింది.ఈ ప్రమాదంలో పలు కుటుంబాల ఇంటిదీపాలే ఆరిపోయాయి. గౌసియా-అబ్దుల్ రషీద్, చరణ్-దివ్య, సుమన్-శ్రీవిద్య, శృతి-విశాల్-భువన అనే అన్నాచెల్లెలంతా దుర్మరణం చెందడంతో వారి కన్నవారి కలలు కల్లలయ్యాయి. తల్లిదండ్రులు ఎన్నో మొక్కులు మొక్కగా పండిన కలల పంట మల్లేష్ యాదవ్ సైతం ఈ ప్రమాదంలో మృత్యువాత పడటంతో వారి బాధ వర్ణానాతీతమైంది. వీరితోపాటు ఈ ప్రమాదంలో రమేష్, ధనుష్కోటి, వంశీ, విష్ణులతోపాటు డ్రైవర్ బిక్షపతిగౌడ్, క్లీనర్ రమేష్గౌడ్ల మృతదేహాలకు మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘోర ప్రమాదం వైద్యులను సైతం కన్నీరు పెట్టించింది. ఏమని ఓదార్చాలమ్మా..! కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న మిమ్మల్ని ఏమని ఓదార్చాలమ్మా..? మేం ఏం సాయం చేసినా.. పోయిన మీ బిడ్డలను తేగలమా? అని కంటతడిపెడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, జి. జగదీశ్వర్‌రెడ్డి తదితరులు బాధితులను ఓదార్చారు. కాగా, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చిలుముల మదన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రజా గాయకుడు గద్దర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, టీఆర్ఎస్ నేతలు దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, నర్సారెడ్డి తదితరులు కూడా బాధితులను ఓదార్చారు. -
నడి రాత్రి.. మృత్యు ఒడిలోకి!
(వైఎస్ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: రక్తం రుచి మరిగిన ఆ మార్గం అర్ధరాత్రి దాహం తీర్చుకుంది. కడప-రాజంపేట జాతీయ రహదారిలోని సిద్దవటం మండలం కనుమలోపల్లె సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ముగ్గురు మృత్యుఒడి చేరారు. కర్నూలు జిల్లా డోన్ మండలం గోసనపల్లెకు చెందిన రైతు రామాంజనేయులు తాను పండించిన చిక్కుడు కాయలను చెన్నై మార్కెట్లో అమ్మాలనుకున్నాడు. స్వగ్రామానికి చెందిన మినీ లారీ డ్రైవర్ శ్రీరాములు(30)తో మాట్లాడుకున్నారు. లోడ్ అయ్యాక శనివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరారు. అదే లారీలో ఓనర్ వెల్దుర్తి మండలం శ్రీరంగాపురానికి చెందిన ముద్దయ్యస్వామి(24) కూడా ఎక్కారు. రైతు, ఓనరు ఇద్దరూ నిద్రపోతుండగా, డ్రైవర్ లారీని నడుపుతున్నాడు. మార్గమధ్యంలో లారీ సిద్దవటం మండలం కనుమలోపల్లె సమీపంలోని శనీశ్వరస్వామి ఆలయ సమీపంలోని ఓ మలుపులోకి రాగానే ఎదురుగా మెరుపు వేగంతో వచ్చిన పది చక్రాల లారీ ఢీకొంది. సంఘటనలో మినీ లారీ నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ క్యాబిన్లో చిక్కుకుపోయి, అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఢీకొట్టిన లారీలోని డ్రైవర్ మురళీ సీట్లోనే చిక్కుకుపోయాడు. ఒంటిమిట్ట సీఐ రెడ్డెప్ప, సిద్దవటం ఎస్ఐ గురునాథ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద లారీలో చిక్కుకున్న డ్రైవర్ మురళీని బయటకు లాగి చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మినీ లారీలో చిక్కుకుపోయిన ముగ్గురి మృతదేహాలను అతికష్టం మీద వెలికితీశారు. పోస్టుమార్టం కోసం వాటిని రిమ్స్ మార్చురీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు. -
గుంటురు జిల్లా నారాకోడూరులో బైక్‌ను ఢీకొట్టిన సిటీ బస్సు
చేబ్రోలు, తెనాలి రూరల్, న్యూస్‌లైన్: ఉదయాన్నే కళాశాలకు బయలుదేరిన ఇంజినీరింగ్ విద్యార్థుల పాలిట సిటీ బస్సు మృత్యుశకటమైంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. గుంటురు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు శివారులోని సీఎంఎస్ హాస్టల్ ఎదురుగా తెనాలి రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన తోటి విద్యార్థులు, మృతుల కుటుంబ సభ్యులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం..రణస్థలానికి చెందిన వి.భార్గవ్‌నాయుడు (18) గుంటూరు కొత్తపేటకు చెందిన ఎన్.గోపీకృష్ణ(18), శీలం శెట్టి శివరామకృష్ణ(18), అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తేజ్బాషా(18) వడ్లమూడి విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో కొద్ది రోజులుగా కళాశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరుకావడానికి గోపీకృష్ణ, శివరామకృష్ణ, భార్గవ్, బాషా కలిసి ఒకే ద్విచక్రవాహనంపై కళాశాలకు బయలుదేరారు. నారాకోడూరు తెనాలి రోడ్డులోని సీఎంఎస్ హాస్టల్ వద్ద ఎదురుగా వస్తున్న సిటీ బస్సు వీరిని ఢీ కొట్టింది. ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరిని తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మరణించారు. మృతదేహాలకు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేపట్టి బంధువులకు అప్పగించారు. ప్రమాద విషయం తెలుసుకున్న విజ్ఞాన్ విద్యార్థులు తెనాలి రోడ్డులో గురువారం మధ్యాహ్నం కొద్ది సేపు రాస్తారోకో నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన జిల్లాకు చెందిన భార్గవ్ తండ్రి రెవెన్యూ శాఖలో తహశీల్దార్ స్థాయిలో విజయనగరంలో పని చేస్తున్నారు.