
మొగదీషు: సోమాలియా రాజధాని మొగదీషులోని రద్దీగా ఉండే ఓ కేఫ్ బయట ఆదివారం(జులై 14) బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు.
కేఫ్ లోపల కొంత మంది టీవీలో యూరో కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ చూస్తుండగా బయట కారులో పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
పేలుడుకు కారణం తామే అని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. సోమాలియా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు అల్‌షబాబ్ మొగదీషులో తరచూ బాంబు పేలుళ్లకు పాల్పడుతుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment