Mogadishu
-
సోమాలియాలో బాంబు పేలుడు.. ఐదుగురి మృతి
మొగదీషు: సోమాలియా రాజధాని మొగదీషులోని రద్దీగా ఉండే ఓ కేఫ్ బయట ఆదివారం(జులై 14) బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు. కేఫ్ లోపల కొంత మంది టీవీలో యూరో కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ చూస్తుండగా బయట కారులో పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడుకు కారణం తామే అని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు. సోమాలియా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు అల్షబాబ్ మొగదీషులో తరచూ బాంబు పేలుళ్లకు పాల్పడుతుంటుంది. -
పేలుళ్లతో దద్దరిల్లిన సొమాలియా రాజధాని
మొగదిషు: సొమాలియా రాజధాని మొగదిషులో కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని జంక్షన్ వద్ద శనివారం రెండు కారు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులంతా పేలుడు సమయంలో అటుగా వాహనాలపై వెళ్తున్న పౌరులేనని మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ తదితర ఉగ్రసంస్థలు రాజధాని లక్ష్యంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. సరిగ్గా ఇదే జోబ్ జంక్షన్లో 2017లో ఉగ్ర సంస్థ అల్ షబాబ్ అమర్చిన ట్రక్ బాంబు పేలి 500 మంది బలయ్యారు. -
సోమాలియాలో మారణహోమం
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం సంభవించిన భారీ కారు బాంబు పేలుడులో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధానికి నైరుతి ప్రాంతంలోని చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ భారీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. పేలుడు ధాటికి ఘటనా ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా కాలిపోయాయి. కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోగా మరికొన్ని నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో కళాశాల బస్సు పేలిపోవడంతో మృతుల్లో అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతానికి మృతులు 78 మంది, క్షతగాత్రులు 125 వరకు ఉన్నప్పటికీ ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత తమదేనంటూ ఏ ఉగ్ర సంస్థా ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. అల్ ఖాయిదా అనుబంధ అల్ షబాబ్ దేశంలో తరచూ కారు బాంబు దాడులకు పాల్పడుతోంది. శనివారం జరిగిన పేలుడు రెండేళ్లలోనే అత్యంత తీవ్రమైంది. 2017లో మొగదిషులో ట్రక్కు బాంబు పేలి 512 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు. నెత్తురోడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు -
భారీ పేలుడు: 76 మంది మృతి
మొగదిషు : సొమాలియాలో ఉగ్రవాదుల రక్తపాతం సృష్టించారు. రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో 76 మంది మృతి చెందారు. నగరానికి చెందిన ఓ చెక్ పాయింట్ సమీపంలో శక్తివంతమైన పేలుడు జరిగింది. దీంతో అక్కడున్న వారంత మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. సొమాలియాలో సాధారణంగా ఆల్‌ఖయిదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ తరుచూ ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 76 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఆమిన్ అంబులెన్స్ డైరక్టర్ అబ్దుల్కాదిర్ అదన్ తెలిపారు. ఇంకా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతిచెందినవారిలో విద్యార్థులు, పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. -
ఆత్మాహుతి దాడి:18 మంది మృతి
-
ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు శుక్రవారం కారుబాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడి 18 మంది ప్రాణాలు తీశారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం మొగదిషులో తిరుగుతోందని సోమాలియా హోం మంత్రి గురువారమే హెచ్చరించారు. అయినా భద్రతా దళాలు పేలుళ్లను అడ్డుకోలేకపోయాయి. సోమాలియా నిఘా విభాగం ప్రధాన కార్యాలయం వద్ద తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు సమీపంలో రెండో దాడి చోటుచేసుకుంది. -
కారు బాంబు దాడిలో ఐదుగురి మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. మాకా అల్ ముకారా ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో పేలుడు పదార్ధాలతో వచ్చిన వాహనం ఒక్కసారిగా పేలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ఘటనతో ఆ ప్రాంతమంతా పొగ వ్యాపించింది. ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకూ మీడియా ప్రకటన చేయలేదు. -
మిలిటెంట్ అనుకుని మంత్రిని కాల్చేశారు
మొగదీషు(సోమాలియా): మిలిటెంట్ అనుకుని పొరబడి ఓ మంత్రిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ సంఘటన సోమాలియా దేశంలో చోటుచేసుకుంది. అబ్బాస్ అబ్దుల్లాహి షేక్ సిరాజి(31) ఈ ఏడాది ఫిబ్రవరి నెల 8న ప్రజా పనులు, పునర్నిర్మాణం శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం దేశ అధ్యక్షుడి కార్యాలయ సమీపంలోకి కారులో వస్తుండగా.. సెక్యురిటీ గార్డులు అనుమానాస్పద కారుగా భావించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబ్బాస్ సిరాజి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో సోమాలియా అధ్యక్షుడు తన ఇథియోపియా పర్యటనను రద్దు చేసుకున్నారు. మంత్రి అంత్యక్రియల్లో పొల్గొనబోతున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తప్పించారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 25 మంత్రుల్లో సిరాజ్ ఒకరు. సోమాలియా కేబినెట్లో అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న షాబాబ్ తీవ్రవాదులు సోమాలియా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మొగదీషులో తరచుగా దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. -
సోమాలియాలో కారు బాంబు: 30 మంది మృతి
-
ఎంపీలే లక్ష్యం.. బాంబుతో దద్దరిల్లిన హోటల్
మోగాదిషు: పార్లమెంటు సభ్యులే లక్ష్యంగా సోమాలిలో ఓ హోటల్ కారు బాంబు దాడితో దద్ధరిల్లింది. భారీ ఆయుధాలతో దయాహ్ అనే హోటల్ వద్దకు వచ్చిన దుండగులు తొలుత కాల్పులు జరిపి అనంతరం కారు నిండా బాంబులు పెట్టి అందరూ చూస్తుండగానే పేల్చేశారు. ఈ దాడిలో 10మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా.. 50మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు సైతం వారు చేస్తున్న చర్యను నివారించలేకపోయారు. అయితే, పార్లమెంటు సభ్యులకు ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై సొమాలి రక్షణశాఖ మంత్రి అబ్దరిజక్ ఒమర్ మహ్మద్ మాట్లాడుతూ నలుగురు దుండగులను పోలీసులు హతమార్చినట్లు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన అల్ షహాబ్ ఈ దాడికి తెగబడినట్లు భావిస్తున్నామన్నారు. తమ దేశ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నిర్వహించే పరోక్ష ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను పార్లమెంటు సభ్యులు అదే ప్రాంతంలో ఉండి చర్చించుకుంటున్నారని తెలిసిన దుండగులు అదే మార్గంలో కారులో వెళుతూ ఓ హోటల్ వద్దకు రాగానే ఆ కారును పేల్చేశారని, దాని తర్వాత మరో కారు పేలుడు చోటు చేసుకుందని చెప్పారు. క్షతగాత్రులకు సత్వర సహాయం అందిస్తున్నామని, కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంత చిద్రమయ్యాయని అన్నారు. -
బాంబుదాడిలో 22 మంది మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో తీవ్రవాదులు బాంబుదాడికి పాల్పడ్డారు. సోమాలి యూత్ లీగ్(ఎస్‌వైఎల్) హోటల్ బయట జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 22 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో హోటల్లో భద్రతా సమావేశం జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశాన్ని లక్ష్యంగా చేసుకొనే దాడి జరిగిందని భావిస్తున్నారు. బాంబు దాడికి పాల్పడింది తామేనంటూ అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. పేలుడు జరిగిన సోమాలి యూత్ లీగ్ హోటల్.. ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల సమావేశాలకు ఆతిథ్యమిస్తుంది. గతంలోనూ ఈ హోటల్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బాంబుదాడికి పాల్పడిన ఉగ్రవాది రాకను ముందుగానే గుర్తించిన భద్రతా బలగాలు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ విపలమైనట్లు తెలుస్తోంది. అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ సోమాలియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. -
బాంబు పేలుడు: 18 మంది మృతి
మెగాదీషు: సోమాలియా రాజధాని మెగాదీషు సమీపంలో గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. ఇదిలా ఉంటే కెమెరూన్‌లో గురువారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. ఈ మేరకు కెమెరూన్ రాజధాని యావొండేలో మీడియా వెల్లడించింది. దీనిపై కూడా సమాచారం అందవలసి ఉంది -
సోమాలియాలో మళ్లీ దారుణం
సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ వద్ద తీవ్రవాదులు శనివారం బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహమద్ అబ్దుల్ ఖాదీర్ వివరాల ప్రకారం.. పెట్రోల్ పంప్, షాపింగ్ మాల్స్ ఉన్న హోటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. సామాన్య పౌరులే ఈ దుర్ఘటనలో ఎక్కువగా మృతిచెందారని తెలిపారు. నాసో హబ్లాడ్ హోటల్ గేటు వద్ద తొలుత కారు బాంబు పేల్చిన తర్వాత సాయుధులు కాల్పులకు తెగబడ్డారని వెల్లడించారు. ఆ హోటల్ లో ఎక్కువగా ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, విదేశాలకు చెందిన ముఖ్య వ్యక్తులు, జర్నలిస్టులు బస చేస్తారని వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడి ఉండొచ్చని ఓ ఉన్నతాధికారి దాహిర్ వివరించారు. మూడు వారాల కిందట రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బాంబు దాడులతో పాటు కాల్పులకు తెగబడ్డ ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. అప్పట్లో ఆ కాల్పులకు పాల్పడ్డ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు హతమార్చారు. మిలిటెంట్లు సోమాలియాను ఇస్లామిక్ స్టేట్ ప్రధాన కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని అధికారులు -
మహిళా జర్నలిస్టు కాల్చివేత
మొగదీషు: సొమాలియా రాజధాని మొగదీషులో మహిళా జర్నలిస్టు హత్యకు గురయ్యారు. ప్రభుత్వ రేడియాలో ప్రొడ్యుసర్ గా పనిచేస్తున్న సాగల్ సలాద్ ఒస్మాన్ ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. యూనివర్సిటీ వెలుపల వేచివున్న ఆమె సాయుధ దుండగులు కాల్పులు జరిపారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. మహిళా జర్నలిస్టు హత్యను సొమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహ్మద్, సోమాలి ఇండిపెండెంట్ మీడియా హౌసెస్ అసోసియేషన్(సిమ్హా) ఖండించింది. హంతకులను పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని సిమ్హా డిమాండ్ చేసింది. గత ఆరు నెలల్లో మహిళా జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి. -
70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు
మొగాదిషు: ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమాలియాలో 70 మంది ఉగ్రవాదులను ప్రభుత్వ బలగాలు మట్టుబెట్టాయి. మరో 30 మందిని బంధించాయి. సైనికాధికారులు సోమవారం ఈ విషయాన్ని ప్రకటించాయి. ఉత్తర సోమాలియాలోని నుగల్ ప్రాంతంలోని సుజ్ వ్యాలీలో ప్రభుత్వ బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకరమైన పోరు గత నాలుగు రోజులుగా జరుగుతుందని పుంట్లాండ్ మంత్రి తెలిపారు. 'మేం అల్ షహబ్ సంస్థకు చెందిన 70 మందిని హతమార్చాం. 30 మందిని అరెస్టు చేశాం. ఉగ్రవాదులపై ఇది సైన్యం సాధించిన విజయం అని ఆయన చెప్పారు. మొత్తం 500 మందిని చుట్టుముట్టామని త్వరలోనే మిగితావారి ఆటకట్టవుతుందని తెలిపారు. -
'పన్నెండుమంది సైనికుల్ని చంపేశాం'
మోగాదిషు: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ షహబ్ దారుణానికి పాల్పడింది. పన్నెండుమంది కెన్యా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. అంతేకాకుండా మరో ఇద్దరిని తమ అదుపులో ఉంచుకున్నట్లు తెలిపింది. కెన్యా డిఫెన్స్ ఫోర్సెస్(కేడీఎఫ్)కు అల్ షహబ్ ఉగ్రవాదులకు మధ్య భారీ ఎత్తున పోరు జరిగిందని, ఇందులో కొంతమంది సైనికులను బందించిన అల్ షహబ్ వారిని చంపేసినట్లు ప్రకటించిందని కెన్యా మీడియా సంస్థ వెల్లడించింది. దక్షిణ సోమాలియాలోని జుబ్బా ప్రాంతంలోగల కోకాని అనే గ్రామం వద్ద ఇది చోటుచేసుకున్నట్లు తెలిపింది. -
కారు బాంబు పేలుళ్లు: 12 మంది మృతి
మెగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో శుక్రవారం తీవ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని ప్రముఖ పీస్ పార్కుతోపాటు సోమాలియా అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న హోటల్ లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కారు బాంబులు పేల్చారు. ఈ పేలుళ్లలో 12 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. మొదటిగా కారు పార్కు ప్రధాన ద్వారం ద్వారా దూసుకు వచ్చి పేలిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు గుర్తించామని చెప్పారు. ఆ వెంటనే ఎస్‌వైఎల్ హోటల్ వద్ద పేలుడు సంభవించిందని... ఈ ఘటనలో రోడ్డు ఊడ్చే మహిళలు ఐదుగురు మరణించారని తెలిపారు. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ సోమాలియాకు చెందిన తీవ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. ఈ పేలుడు శుక్రవారం చోటు చేసుకుంది. -
హోటల్ బయట పేలుడు : 12 మంది మృతి
మొగదీషు : సోమాలియా రాజధాని మొగదీషు నగరంలో ఆదివారం హోటల్ వద్ద దుండగులు శక్తిమంతమైన కారు బాంబును పేల్చారు. ఈ పేలుడులో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. దుండగులు హోటల్లోకి వెళ్లే క్రమంలో ఈ పేలుడుకి పాల్పడ్డారని చెప్పారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై... దుండగులపైకి కాల్పులు జరిపారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
హోటళ్లపై దాడి: నలుగురు మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో అల్ షబాబ్ సంస్థకు చెందిన తీవ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని దేశాధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న రెండు హోటళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. హోటల్ వద్ద కారుతోపాటు వచ్చిన వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడగా... మరో వ్యక్తి తుపాకీతో రెండు హోటళ్లపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని హోటల్స్ అన్ని మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. -
సోమాలియాలో తీవ్రవాదుల దాడి: 25 మంది మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో శుక్రవారం తీవ్రవాదులు రెచ్చిపోయారు. హోటల్లపై బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మొగాదీషు డిప్యూటీ మేయర్‌తో ఎంపీ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హోటల్‌పై తీవ్రవాదులు బాంబు దాడి ప్రారంభించగానే కారు బాంబు, ఆత్మాహుతి దాడి చేసుకున్నారని వివరించారు. కాగా సైన్యం ఘటన స్థలానికి చేరుకుని తీవ్రవాదులపైకి కాల్పులు ప్రారంభించిందని చెప్పారు. దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని... అయితే తీవ్రవాదుల దాడిలో హోటల్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని విశదీకరించారు. శుక్రవారం నేపథ్యంలో హోటల్ లో మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా ప్రార్థనలో ఉన్నారని చెప్పారు. దేశాధ్యక్షుడు భవనానికి సమీపంలో ఈ హోటల్ ఉంది. ఈ దాడికి పాల్పడింది ఆల్ ఖైదా అనుబంధ సంస్థ షిబాబ్ ప్రకటించింది. -
కారు బాంబు పేలుడు: ఐదుగురు మృతి
సోమాలియా: సోమాలియా రాజధాని మొగదీషులో కారు బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారి మక్కా అల్ ముక్కారమలోని పనోరమా బార్ సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు. -
ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి
సోమాలియా దేశ సరిహద్దుల్లోని బలద్వీని పట్టణంలో నిన్న ఓ హోటల్లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 16 మంది మృతి చెందారని స్థానిక నాయకుడు ఆదివారం వెల్లడించారు.ఆ ఘటనలో మరో 33మంది గాయపడ్డారని తెలిపారు. వారంతా పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సైనికులు,స్థానిక పౌరులతో కిటకిటలాడుతున్న హోటల్లోకి బాంబు ధరించిన వ్యక్తి ప్రవేశించి, చూస్తుండగానే తనకు తాను పేల్చేసుకున్నాడని చెప్పారు. ఆ దాడికి పాల్పడింది తామేనని ఆల్ ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థ ఆల్ షబాబ్ అని ప్రకటించింది. ఇథియోపియా సరిహద్దు ప్రాంతాల్లోని స్థానికులు, విదేశీ సైనికులపై అల్ ఖైదా సంస్థకు చెందిన తీవ్రవాదులు తరచుగా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.