కారు బాంబు పేలుళ్లు: 12 మంది మృతి | 12 killed in Mogadishu blasts, Al-Shabaab claims responsibility | Sakshi
Sakshi News home page

కారు బాంబు పేలుళ్లు: 12 మంది మృతి

Published Sat, Feb 27 2016 8:19 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

కారు బాంబు పేలుళ్లు: 12 మంది మృతి - Sakshi

కారు బాంబు పేలుళ్లు: 12 మంది మృతి

మెగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో శుక్రవారం తీవ్రవాదులు రెచ్చిపోయారు.  నగరంలోని ప్రముఖ పీస్ పార్కుతోపాటు సోమాలియా అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న హోటల్ లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కారు బాంబులు పేల్చారు. ఈ పేలుళ్లలో 12 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు.

మొదటిగా కారు పార్కు ప్రధాన ద్వారం ద్వారా దూసుకు వచ్చి పేలిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు గుర్తించామని చెప్పారు. ఆ వెంటనే ఎస్వైఎల్ హోటల్ వద్ద పేలుడు సంభవించిందని... ఈ ఘటనలో రోడ్డు ఊడ్చే మహిళలు ఐదుగురు మరణించారని తెలిపారు. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ సోమాలియాకు చెందిన తీవ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. ఈ పేలుడు శుక్రవారం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement