హోటల్ బయట పేలుడు : 12 మంది మృతి
మొగదీషు : సోమాలియా రాజధాని మొగదీషు నగరంలో ఆదివారం హోటల్ వద్ద దుండగులు శక్తిమంతమైన కారు బాంబును పేల్చారు. ఈ పేలుడులో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. దుండగులు హోటల్లోకి వెళ్లే క్రమంలో ఈ పేలుడుకి పాల్పడ్డారని చెప్పారు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమై... దుండగులపైకి కాల్పులు జరిపారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.